الدُّرُوسُ المُهِمَّةُ لِعَامَّةِ الأُمَّةِ
సాధారణ ముస్లింలందరి కొరకు
ముఖ్య పాఠాలు
لِسَمَاحَةِ الشَّيْخِ العَلَّامَةِ
عَبْدِ العَزِيزِ بْنِ عَبْدِ اللهِ بْنِ بَازٍ
رَحِمَهُ اللهُ
గౌరవనీయులైన షేఖ్ అల్లామా
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
(అల్లాహ్ ఆయన పై దయ చూపుగాక)
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
అనంత కరుణాప్రదాత, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో
తొలి పలుకులు
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వ సల్లల్లాహు వ సల్లమ అలా అబ్దిహి వ రసూలిహి నబియ్యినా ముహమ్మద్, వ అలా ఆలిహి వ అస్హాబిహీ అజ్మయీన్. (స్థుతులన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే, మంచి పర్యవసానం దైవభీతి కలవారి కొరకే, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక).
అమ్మా బాద్ :
ఇస్లాం ధర్మం గురించి ప్రజలు తెలుసుకోవలసిన కొన్ని పదాల ప్రకటనలో ఇవి సంక్షిప్త పదాలు. వాటిని అద్దురూసుల్ ముహిమ్మతు లి ఆమ్మతిల్ ఉమ్మ (సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు) అని నేను నామకరణం చేశాను.
వాటితో ముస్లింలకు ప్రయోజనం కలిగించమని మరియు నా నుండి వాటిని స్వీకరించమని అల్లాహ్ తో వేడుకుంటున్నాను. నిశ్చయంగా ఆయన ఉదారమైనవాడు, దయగలవాడూను.
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు.1
మొదటి పాఠం:
సూరతుల్ ఫాతిహ మరియు చిన్న సూరాలు
సూరతుల్ ఫాతిహ మరియు చిన్న సూరాలు అంటే జిల్ జాల్ సూరా నుండి నాస్ సూరా వరకు అయినంతవరకు చదివించటం,ఖిరాఅత్ ను సరిచేయటం,కంఠస్తం చేయటం మరియు అర్థం చేసుకునే వాటిని వివరించటం.
రెండవ పాఠం: ఇస్లాం మూలస్తంభాలు
ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాల వివరణ: వాటిలో మొదటిది మరియు అత్యంత గొప్పది: లా ఇలాహ ఇల్లల్లాహ్, మరియు ముహమ్మదుర్రసులుల్లాహ్ ను - వాటి అర్థముల వివరణతో మరియు లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క షరతులను తెలుపుతూ సాక్ష్యం పలుకుట. వాటి అర్ధం: (లా ఇలాహ) అల్లాహ్ ను వీడి ఆరాధించబడే దైవాలన్నింటిని తిరస్కరించుట, (ఇల్లల్లాహ్) అల్లాహ్ ఒక్కడి కొరకే ఆరాధన చేయటాన్ని, ఆయనకు ఎవ్వరూ సాటి లేరని నిరూపించుట. అయితే (లా ఇలాహ ఇల్లల్లాహ్) షరతులు ఇవి: అజ్ఞానమునకు విరుద్ధమైన జ్ఞానం, సందేహానికి విరుద్ధమైన నమ్మకం, షిర్కుకు విరుద్ధమైన చిత్తశుద్ధి, అసత్యానికి విరుద్ధమైన సత్యము, ద్వేషానికి విరుద్ధ మైన ప్రేమ, షిర్కునకు విరుద్ధమైన విధేయత, తిరస్కారానికి విరుద్ధమైన స్వీకరణ, అల్లాహ్ ను కాకుండా ఆరాధించబడే వాటి తిరస్కారం, అది ఈ వచనాలలో సమీకరించబడినది: "జ్ఞానం, దృఢవిశ్వాసం, సమర్పణ, చిత్తశుద్ది, నిజాయితీతో కూడిన ప్రేమ, అనుగుణత మరియు అంగీకారం." మరియు ఎనిమిదవ షరతు ఏమిటంటే అల్లాహ్ ను తప్ప మిగతా అన్నిఅసత్య దేవుళ్లను తిరస్కరించాలి.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం పలుకుటతో పాటు దాని లక్ష్యాలను పూర్తి చేయాలి. అవి: ఆయన తెలిపిన విషయాలలో ఆయనను సత్యవంతుడిగా గుర్తించుట, ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనకు విధేయత చూపుట, ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండుట మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ధర్మబద్ధం చేసిన వాటితోనే అల్లాహ్ ఆరాధన చేయుట.
ఆ తర్వాత ప్రజలకు ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలలో నుండి మిగతా వాటి గురించి తెలియపరచాలి. అవి: సలాహ్ (నమాజ్), జకాత్, రమదాన్ మాసపు ఉపవాసాలు మరియు స్తోమత కలిగినవారు అల్లాహ్ గృహపు హజ్ చేయుట.
మూడవ పాఠం: ఈమాన్ (విశ్వాస) మూలస్తంభాలు
అవి ఆరు: ఈమాన్ అంటే నీవు అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంథాలపై, ఆయన ప్రవక్తలపై మరియు అంతిమదినంపై విశ్వాసాన్ని చూపుట మరియు నీవు విధివ్రాత పై దాని మంచి, చెడు అల్లాహ్ తరపు నుండి అని విశ్వసించుట.
నాల్గవ పాఠం:
తౌహీద్ రకాలు మరియు షిర్కు రకాలు
తౌహీద్ రకాలు మూడు, అవి: తౌహీదె రుబూబియత్, తౌహీదె ఉలూహియత్, తౌహీదె అస్మా వస్సిఫాత్.
తౌహీద్
రుబూబియ్యహ్
:
అల్లాహ్
ప్రతీది
సృష్టించినవాడని
,
ప్రతీ
దానిపై
సంపూర్ణ
అధికారము
కలవాడని
మరియు
ఆయనకు
ఎవరు
సాటి
లేరని
విశ్వసించడం
.
తౌహీదె
ఉలూహియత్
:
అల్లాహ్
వాస్తవ
ఆరాధ్య
దైవమని
,
అందులో
ఆయనకు
ఎవరు
సాటి
లేరని
విశ్వసించడం
.
ఇదే
లా
ఇ
లాహ
ఇల్లల్లాహ్
అర్థము
.
అల్లాహ్
తప్ప
వాస్తవ
ఆరాధ్య
ుడు
ఎ
వ్వ
రూ
లేరని
దాని
అర్థము
.
కావున
నమాజు
,
ఉపవాసాలు
మరియు
తదితర
ఆరాధనలన్ని
అల్లాహ్
ఒక్కడి
కొరకు
ప్రత్యేకించటం
తప్పని
సరి
.
వాటిలో
నుంచి
దేనినీ
ఇతరుల
కొరకు
చేయటం
సమ్మతం
కాదు
.
తౌహీద్
అస్మా
వ
సిఫ్ఫాత్
:
ఖుర్ఆన్
లో
లేదా
సహీహ్
హదీసులలో
వచ్చిన
అల్లాహ్
పేర్లను
మరియు
గుణాలను
అన్నింటిని
విశ్వసించ
ుట
మరియు
వాటిని
ఎటువంటి
వక్రీకరణ
,
తిరస్క
ారం
,
వర్ణత
,
పోలిక
లేకుండా
అల్లాహ్
ఒక్కడి
కొరక
ే
ఆయనకు
తగిన
విధంగా
నిరూపించ
ు
ట
;
అల్లాహ్
యొక్క
ఈ
వాక్కుపై
ఆచరిస్తూ
:
﴿قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ١ ٱللَّهُ ٱلصَّمَدُ٢ لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ ٣ وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ٤﴾
ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1) అల్లాహ్! ఎవరి అక్కరా లేనివాడు. (2) ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు. (3) మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు." [అల్ ఇఖ్లాస్:1-4] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ వాక్కు:
﴿...لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ ١١﴾
{ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన సర్వం వినేవాడూ, సర్వం చూసేవాడూను}. [షూరా :11]
కొందరు పండితులు వాటిని రెండు రకాలుగా విభజించారు. వారు తౌహీదె అస్మా వస్సిఫాత్ ను తౌహీదె రుబూబియత్ లో చేర్చారు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే రెండు విభజనలలో ఉద్దేశము స్పష్టమవుతుంది.
షిర్కు రకాలు మూడు: పెద్ద షిర్కు, చిన్న షిర్కు మరియు గోప్యమైన షిర్కు.
పెద్ద షిర్కు: ఆచరణ వృధా అవడాన్ని మరియు దానిపై మరణించే వాడిని నరకంలో శాశ్వతంగా ఉండటాన్ని అనివార్యం చేస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَلَوۡ أَشۡرَكُواْ لَحَبِطَ عَنۡهُم مَّا كَانُواْ يَعۡمَلُونَ ٨٨﴾
ఒకవేళ వారు దైవత్వంలో భాగస్వామ్యానికి ఒడిగట్టి ఉంటే వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోతాయి. [అన్ఆమ్: 88] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿مَا كَانَ لِلۡمُشۡرِكِينَ أَن يَعۡمُرُواْ مَسَٰجِدَ ٱللَّهِ شَٰهِدِينَ عَلَىٰٓ أَنفُسِهِم بِٱلۡكُفۡرِۚ أُوْلَٰٓئِكَ حَبِطَتۡ أَعۡمَٰلُهُمۡ وَفِي ٱلنَّارِ هُمۡ خَٰلِدُونَ١٧﴾
తాము సత్యతిరస్కారులము అని సాక్ష్యం ఇస్తున్న బహుదైవారాధకులు, అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి (సేవ చేయటానికి) అర్హులు కారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమై పోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు. [తౌబా:17] మరియు దానిపైనే మరణించిన వాడి పాపాలు మన్నించబడవు. మరియు స్వర్గం అతనిపై నిషేధము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿إِنَّ ٱللَّهَ لَا يَغۡفِرُ أَن يُشۡرَكَ بِهِۦ وَيَغۡفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ... ٤٨﴾
{నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.} [నిసా: 48] అల్లాహ్ వాక్కు:
﴿...إِنَّهُۥ مَن يُشۡرِكۡ بِٱللَّهِ فَقَدۡ حَرَّمَ ٱللَّهُ عَلَيۡهِ ٱلۡجَنَّةَ وَمَأۡوَىٰهُ ٱلنَّارُۖ وَمَا لِلظَّٰلِمِينَ مِنۡ أَنصَارٖ ٧٢﴾
వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయం చేసే వారు ఎవ్వరూ ఉండరు. [అల్ మాయిదా: 72]
మరియు మృతులను, విగ్రహాలను వేడుకోవటం మరియు వారితో సహాయం కొరకు మొరపెట్టుకోవడం, వారిని మొక్కు కోవటం, వారి కొరకు వధించుట మరియు అటువంటి ఇతర కార్యాలు చేయుట దాని రకాలలోనివే.
ఇక షిర్కె అస్గర్ (చిన్న షిర్కు) అది ఏదైతే ఖుర్ఆన్ లేదా హదీసుల ఆధారాలతో షిర్క్ అనే పేరుతో నిరూపించబడినదో. కాని అది షిర్కె అక్బర్ (పెద్ద షిర్కు) లోంచి కాదు. ఉదాహరణకు కొన్ని ఆచరణలను ప్రదర్శనా బుద్దితో చేయుట, అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయుట, అల్లాహ్ తలచుకుంటే మరియు ఫలానా తలచుకుంటే అని పలుకుట మరియు అలాంటి ఇతర కార్యాలు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«أَخْوَفُ مَا أَخَافُ عَلَيْكُمْ الشِّرْكَ الَأصْغَرَ» فَسُئِلَ عَنْهُ، فَقَالَ: «الرِّيَاءُ».
“మీ విషయం లో నన్ను ఎక్కువగా భయాందోళనలకు గురి చేస్తున్న విషయం ‘షిర్కే అస్గర్ (చిన్న షిర్క్).” దాని గురించి అడుగగా, ‘ప్రవక్త అర్రియ ‘ప్రదర్శనాబుద్ది’ అని తెలియజేశారు.2 దీనిని ఇమామ్ అహ్మద్ మరియు తబ్రానీ మరియు బైహఖీ మంచి సనదుతో మహ్మూద్ బిన్ లబీద్ అల్ అన్సారీ నుండి ఉల్లేఖించారు. మరియు తబ్రానీ మంచి సనదులతో మహ్మూద్ బిన్ లబీద్ నుండి మరియు ఆయన రాఫె బిన్ ఖదీజ్ నుండి మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించారు.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం:
«مَنْ حَلَفَ بِشَيْءٍ دُونَ اللَّهِ فَقَدْ أَشْرَكَ».
{అల్లాహ్ ను వదిలి ఏదైన వస్తువుపై ప్రమాణం చేసినవాడు షిర్క్ చేశాడు}3 దీనిని ఇమామ్ అహ్మద్, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు నుండి ప్రామాణికమైన సనదుతో ఉల్లేఖించారు. మరియు అబూ దావూద్, తిర్మిదీ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమ యొక్క ప్రామాణికమైన సనదుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించారు - ఆయన ఇలా పలికారు:
«مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ كَفَرَ أَوْ أَشْرَكَ».
ఎవరైతే అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేస్తాడో, అతను కుఫ్ర్ (అవిశ్వాసం) లేక షిర్కు (బహుదైవారాధన) ఒడిగట్టినట్లే.4 ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం:
«لا تَقُولُوا: مَا شَاءَ اللَّهُ وَشَاءَ فُلانٌ، وَلَكِنْ قُولُوا: مَا شَاءَ اللَّهُ ثُمَّ شَاءَ فُلانٌ».
“ ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన కోరిన విధంగా’ అని అనకండి; దానికి బదులు ‘అల్లాహ్ కోరిన విధంగా తరువాత ఫలాన కోరిన విధంగా’ అని అనండి.”5 దీనిని అబూ దావూద్, హుజైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు నుండి ప్రామాణికమైన సనదుతో ఉల్లేఖించారు.
మరియు ఈ రకము మతభ్రష్టత్వాన్ని అనివార్యం చేయదు మరియు నరకంలో శాశ్వతంగా ఉండటాన్నీ అనివార్యం చేయదు. కానీ అది అనివార్య ఏకదైవత్వం (తౌహీద్) యొక్క పరిపూర్ణతకు విరుద్ధం.
ఇక మూడో రకము: గోప్యమైన షిర్క్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ పలుకులు దానికి ఆధారం-
«أَلَا أُخْبِرُكُمْ بِمَا هُوَ أَخْوَفُ عَلَيْكُمْ عِنْدِي مِنَ المَسِيحِ الدَّجَّالِ؟» قَالُوا: بَلَى يَا رَسُولَ اللَّهِ، قَالَ: «الشِّرْكُ الخَفِيُّ، يَقُومُ الرَّجُلُ فَيُصَلِّي فَيُزَيِّنُ صَلاتَهُ لِمَا يَرَى مِنْ نَظَرِ الرَّجُلِ إِلَيْهِ».
తస్మాత్ జాగ్రత్త! మసీహ్ దజ్జాల్' ఉపద్రవం కంటే కూడా నాకు మీ పట్ల ఎక్కువ ఆందోళన కలిగించే విషయం ఒకటి తెలుపనా? ఖచ్చితంగా చెప్పండి ప్రవక్తా! అంటూ అనుచరులు అన్నారు. దానికి ప్రవక్త ఇలా పలికినారు, "షిర్కుల్ ఖఫీ"(కనపడని షిర్క్), ఒక వ్యక్తి నిల్చుని నమాజు ప్రారంభించి దానిని కేవలం మరొకరు చూస్తున్నారని అందంగా చక్కటి శ్రద్ధతో చేస్తూ ఉండటం.6 దీనిని ఇమామ్ అహ్మద్, తన ముస్నద్ లో అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించారు.
షిర్కును రెండు రకాలుగా మాత్రమే విభజించుట సమ్మతమగును:
పెద్ద షిర్కు, చిన్న షిర్కు. ఇక గోప్యమైన షిర్కు రెండిటిలోను వస్తుంది. కావున అది పెద్ద షిర్కులో కూడా వస్తుంది. ఉదాహరణకు కపటుల షిర్కు. ఎందుకంటే వారు తమ అసత్య విశ్వాసాలను దాచేవారు. మరియు ప్రదర్శనా బుద్దితో తమ ప్రాణాలపై భయంతో ఇస్లాంను బహిర్గతం చేసేవారు.
మరియు గోప్యమైన షిర్కు చిన్న షిర్కులో వస్తుంది. ఉదాహరణకు ప్రదర్శనా బుద్ది. మహ్మూద్ బిన్ లబీద్ అల్ అన్సారీ యొక్క మునుపటి హదీసులో వచ్చినట్లు మరియు అబూ సయీద్ యొక్క హదీసులో ఉన్నట్లు. అల్లాహ్ మాత్రమే భాగ్యాన్ని ప్రసాదించేవాడు.
ఐదవ పాఠం: ఇహ్సాన్
ఇహ్సాన్ మూలము. ఇహ్సాన్ అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లు భావిస్తూ ఆరాధించుట. ఒకవేళ నీవు అలా ఆరాధించ లేకపోతే, ఆయన ఆయన నిన్ను చూస్తున్నాడని భావిస్తూ ఆరాధించుట.
ఆరవ పాఠం: నమాజు షరతులు
అవి తొమ్మిది:
ఇస్లాం, బుద్ధి, వ్యత్యాసం, వుదూతో ఉండుట, మాలిన్యాలను తొలగించుట, మర్మాంగాన్ని కప్పుట, సమయం అవటం, ఖిబ్లాకి అభిముఖమవటం, సంకల్పం.
ఏడవ పాఠం: నమాజు యొక్క విధులు
అవి పద్నాలుగు:
శక్తి ఉంటే నిలబడుట, తక్బీరె తహ్రీమా పలుకుట, ఫాతిహ సూరహ్ పఠించుట, రుకూ చేయుట, రుకూ తరువాత తిన్నగా నిలబడుట, ఏడు అవయవాలపై సజ్దా చేయుట, సజ్దా నుండి తల పైకి లేపుట, రెండు సజ్దాల మధ్య కూర్చోనుట, నమాజ్ యొక్క అన్ని కార్యాలను ప్రశాంతంగా చేయుట, విధులలో క్రమ పద్దతిని పాటించుట, చివరి తషహ్హుద్ పఠించుట, చివరి తషహ్హుద్ పఠించుట కొరకు కూర్చోనుట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించుట, రెండు వైపులా తిరిగి, సలాం పలుకుట.
ఎనిమిదో పాఠం:
నమాజులో తప్పనిసరి అనివార్య కార్యాలు
అవి ఎనిమిది:
తక్బీరె తహ్రీమా కాకుండా మిగిలిన తక్బీరులన్నీ, ఇమామ్ మరియు ఒంటరిగా చదివేవాడు సమిఅల్లాహు లిమన్ హమిదహ్ పలుకుట, ప్రతి ఒక్కరు రబ్బనా వలకల్ హమ్ద్ అని పలుకుట, రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ పలుకుట, సజ్దాలో సుబహాన రబ్బియల్ ఆలా పలుకుట, రెండు సజ్దాల మధ్య రబ్బిగ్ఫిర్లీ పలుకుట, మొదటి తషహ్హుద్ పఠించుట, మొదటి తషహ్హుద్ పఠించుట కొరకు కూర్చోనుట.
తొమ్మిదవ పాఠం: తషహ్హుద్ యొక్క వివరణ
తషహ్హుద్ లో ఇలా పఠించాలి:
అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లా హిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు.
ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించుట మరియు ఆయనకు శుభాలు కలగాలని దుఆ చేయుట. కావున ఇలా వేడుకోవాలి: ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్ (ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీం ను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్'ను మరియు ఆయన కుటుంబాన్ని కరుణించు 'స్తోత్రానికి అర్హుడవు, ఘనత కలవాడవు నీవే. 'ఓ అల్లాహ్! ఇబ్రాహీం పై ఆయన కుటుంబంపై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్'పై మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురుపించు. 'స్తోత్రానికి అర్హుడవు, ఘనత కలవాడవు నీవే.
ఆ తరువాత చివరి తషహ్హుద్ లో నరకం యొక్క శిక్ష నుండి, సమాధి శిక్ష నుండి, జీవన్మరణాల యొక్క ఉపద్రవాల నుండి మరియు మసీహె దజ్జాల్ ఉపద్రవాల నుండి అల్లాహ్ శరణు కోరాలి. ఆ తరువాత మీకు ఇష్టమైన దుఆ చేయాలి. ముఖ్యంగా మాసూరహ్ దుఆలను చేయాలి. వాటిలో నుంచి కొన్ని:
అల్లాహుమ్మ అయిన్ని అలా జిక్రిక వషుక్రిక వహుస్ని ఇబాదతిక, అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరన్, వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అన్త, ఫగ్ఫిర్లీ మగ్ఫిరతన్ మిన్ ఇందిక వర్హమ్ని ఇన్నక అన్తల్ గఫూరుర్రహీమ్. (ఓ అల్లాహ్! నీ స్మరణ చేయుటకు మరియు నీ కృతజ్ఞతలు తెలుపుటకు మరియు నీ ఆరాధన మంచిగా చేయుటకు నాకు సహాయము చేయి. ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను నా మనస్సుపై బాగా హింసకు పాల్పడ్డాను, నీవు తప్ప పాపాలను మన్నించేవాడు ఎవడూ లేడు, కావున నీవు నీ యందు నుండి నన్ను మన్నించు మరియు నాపై కరుణించు. నిశ్చయంగా నీవే మన్నించేవాడవు, కరుణించేవాడవు.
ఇక మొదటి తషహ్హుద్ లో షహాదతైన్ తరువాత జుహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులలో మూడవ రకాతు కొరకు నిలబడాలి. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠిస్తే అది మంచిది. దీని గురించి చాలా హదీసులు ఉన్నవి. ఆ తరువాత మూడవ రకాతు కొరకు నిలబడాలి.
పదవ పాఠం: నమాజు యొక్క సున్నతులు
అవి:
ఇస్తిఫ్తాహ్
దుఆ
పఠించుట
.
నిలబడినప్పుడు
,
రుకూ
ముందు
మరియు
ర
ు
కూ
తర
్
వాత
కుడి
చెయ్యిని
ఎడమ
చెయ్యిపై
పెట్టి
ఛాతీ
పై
కట్టుకో
ను
ట
.
మొదటి
తక్బీర్
పలికే
టప్పుడు
,
ర
ు
కూ
చేసేటప్పుడు
,
ర
ు
కూ
నుండి
తల
లేపినప్పుడు
మరియు
మొదటి
తషహ్హుద్
నుండి
మూడవ
రకాతు
కొరకు
లేచినప్పుడు
రెండు
చేతుల
వేళ్ళను
జమ
చేసి
రెండు
భుజాలకు
లేదా
చెవులకు
సమాంతరంగా
లేప
ు
ట
.
రుకూ
లో
మరియు
సజ్దాలో
ఒకసారి
కంటే
ఎక్కువగా
తస్బీహ్
పఠించుట
.
రుకూ
నుండి
లేచిన
తరువాత
రబ్బనా
వలకల్
హమ్దుకి
మించి
పఠించుట
.
మరియు
రెండు
సజ్దాల
మధ్య
మన్నింపు
దుఆను
ఒకసారి
క
ంటే ఎక్కువగా
పఠించుట.
రుకూలో
తలను
వీపుకి
సమాంతరంగా
ఉంచ
ు
ట
.
సజ్దాలో
రెండు
మోజేతులను
రెండు
ప్రక్కల
నుండి
,
పొట్టను
రెండు
తొడల
నుండి
మరియు
రెండు
తొడలను
రెండు
పిక్కల
నుండి
ఎడంగా
ఉంచ
ు
ట
.
సజ్దా
చేస
ేట
ప్పుడు
రెండు
మో
జే
తులను
నేల
నుండి
పైకి
ఎత్తి
ఉంచ
ు
ట
.
నమాజ్
చ
ేసే
వ్యక్తి
మొదటి
తషహ్హుద్
లో
మరియు
రెండు
సజ్దాల
మధ్యలో
ఎడమ
కాలును
పరచి
, దానిపై
కూర్చొని
,
కుడి
కాలును
నిలబెట్టి
ఉంచ
ుట
.
నాలుగు
రకాతుల
,
మూడు
రకాతుల
నమాజులో
చివరి
తషహ్హుద్
లో
తవర్రుక్
చేయ
ు
ట
అంటే
కుడి
కాలును
నిలబెట్టి
దాని
క్రింది
నుంచి
ఎడమకాలు
తీసి
పిరుదులను
నేలకు
ఆనించి
కూర్చ
ొనుట
.
మొదటి
,
రెండవ
తషహ్హుద్
లో
కూర్చున్నప్పటి
నుంచి
తషహ్హుద్
ముగింపు
వరకు
కుడిచేతి
చూపుడి
వ్రేలితో
సైగ
చేయ
ు
ట
మరియు
దుఆ
చేసే
టప్పుడు
దానిని
కద
ు
ప
ు
ట
.
మొదటి
తషహ్హుద్
లో
ముహమ్మద్
సల్లల్లాహు
అలైహి
వసల్లంపై
మరియు
ఆయన
కుటుంబముపై
మరియు
ఇబ్రాహీం
అలైహిస్సలాంపై
మరియు
ఆయన
కుటుంబముపై
దరూద్
పఠించుట
,
శుభాల
కొరకు
దుఆ
చేయ
ు
ట
(
దరూదె
ఇబ్రాహీం
పఠించుట
).
చివరి
తషహ్హుద్
లో
దుఆ
చేయ
ు
ట
.
ఫజర్
నమాజులో
,
జుమా
నమాజులో
,
రెండు
పండుగల
నమాజులలో
,
వర్షం
క
ొ
ర
కు
చేసే
నమాజులో
మరియు
మగ్రిబ్
,
ఇషా
నమాజుల
మొదటి
రెండు
రకాతులలో
బిగ్గరగా
ఖిరాఅత్
చ
ేయు
ట
.
జుహర్
,
అసర్
,
ఇషా
నమాజు
యొక్క
చివరి
రెండు
రకాతులలో
మరియు
మగ్రిబ్
నమాజు
యొక్క
మూడవ
రకాతులో
ఖిరాఅత్
ను
నెమ్మదిగా
లోలోపల
చేయ
ు
ట
.
సూర
తుల్
ఫాతిహానే
కాకుండా
ఖుర్ఆన్
నుండి
ఇతర
సూరాలను
పఠించుట
.
మేము
ప్రస్తావించిన
ఈ
సున్నతులే
కాకుండా
మిగిలిన
సున్నతులపై
కూడా
శ్రద్ధ
చూపాలి
.
వాటిలో
,
రుకూ
నుండి
పైకి
లేచిన
తరువాత
ఇమామ్
,
ముఖ్తదీ
మరియు
ఒంటరిగా
నమాజు
చదివేవాడు
రబ్బనా
లకల్
హమ్ద్
పలుకుటతో పాటు, ఇంకా
ఎక్కువగా
దుఆ
చ
ేయు
ట
.
ఎందుకంటే
ఇది
సున్నత్
.
ఇంకా
వాటిలో
నుంచి
:
రుకూ
చేసిన
సమయంలో
చేతి
వేళ్ళను
ఎడంగా
చేసి
,
రెండు
మోకాళ్ళ
ను
గట్టిగా
పట్టుకొనుట
.
పదకొండవ పాఠం: నమాజును భంగం చేసేవి
అవి ఎనిమిది:
జ్ఞానము
,
గ
ు
ర్తుండి
కూడా
ఉద్దేశపూర్వకంగా
నమాజులో
మాట్లాడ
ు
ట
.
అయితే
మరచిపోయి
లేదా
అజ్ఞానంతో
మాట్లాడే
వారి
నమాజు
భంగం
కాదు
.
నవ్వ
ు
ట
.
తిన
ు
ట
.
త్రాగ
ు
ట
.
మర్మాంగము
బహిరంగము
అగుట.
ఖిబ్లా
దిశ
నుండి
అధికంగా
పక్కకు
తిరిగిపోవ
ు
ట
.
నిర్విరామంగా
నమాజు
తో
సంబంధం
లేని
కార్యాలు
ఎక్కువగా
చేయ
ు
ట
.
వు
దూ
భంగమవ
ు
ట
.
పన్నెండవ పాఠం: వుదూ షరతులు
అవి పది:
ఇస్లాం, బుద్ది, వ్యత్యాసం చూపటం, సంకల్పించటం, వుదూ పూర్తయే వరకు సంకల్పంను ఉంచటం, వుదూ యొక్క కారణం ముగియటం, వుదూకి ముందు నీటితో లేదా రాయితో ఇస్తింజా చేయటం, దాని నీరు పరిశుభ్రంగా ఉండటం మరియు దానిని వాడటం సమ్మతమవటం, చర్మం వరకు నీటిని చేరకుండా ఆటంకాన్ని కలిగించే వాటిని తొలగించటం, ఎల్లప్పుడు అశుద్ధత కలిగి ఉండే వ్యక్తికి నమాజు వేళ అవటం.
పదమూడవ పాఠం:
వుదూలో తప్పనిసరిగా చేయవలసిన కార్యాలు
అవి ఆరు:
ముఖము కడగటం, అందులోనే పుక్కిలించటం మరియు ముక్కులో నీటిని తీసుకుని చీదుట, రెండు చేతులను మోచేతులతో సహా కడుగుట, పూర్తి తలపై మసాహ్ చేయుట, అందులోనే చెవులు కూడా వస్తాయి, రెండు కాళ్ళను చీలమండలంతో సహా కడుగుట, క్రమపద్దతి, మరియు వరుసగా నిర్విరామంగా చేయుట. ముఖము, చేతులు మరియు కాళ్ళు మూడుసార్లు కడుగుట మంచిది. అలాగే పుక్కిలించటం, మరియు ముక్కులో నీటిని తీసుకుని ఛీదరించటం కూడా. వాటిని ఒకసారి చేయుట తప్పనిసరి. ఇక తలపై మసాహ్ చేయటాన్ని పునరావృతం చేయటం సమ్మతం కాదు, సహీహ్ హదీసుల ద్వారా అది బోధపడుతుంది.
పద్నాల్గవ పాఠం: వుదూను భంగపరిచే విషయాలు
అవి ఆరు :
మలమూత్ర విసర్జన చోటు నుండి వెలువడేది, శరీరం నుండి బయటకు వచ్చే దృఢమైన మలినం, నిద్ర వలన లేదా మరో విధంగా స్పృహ కోల్పోవుట, ముందు వైపు నుండి లేదా వెనుక వైపు నుండి ఎటువంటి అడ్డు లేకుండా మర్మాంగములను చేతితో ముట్టుకొనుట, ఒంటె మాంసము తినుట, ఇస్లాం నుండి మరలిపోవుట (అల్లాహ్ మమ్మల్ని మరియు ముస్లిములని దాని నుండి రక్షించుగాక).
ముఖ్యగమనిక: ఇక మృతుడిని గుసుల్ చేయించుట: వాస్తవం ఏమిటంటే దాని నుండి వుదూ భంగమవదు, దాని గురించి ఎలాంటి ఆధారం లేకపోవటం వలన. ఇది మెజారిటీ పండితుల మాట. కానీ గుసుల్ చేయించే వ్యక్తి చేయి ఎలాంటి అడ్డు లేకుండా మృతుని మర్మాంగానికి తగిలితే అతనిపై వుదూ అనివార్యమగును.
గుసుల్ చేయించే వ్యక్తి మృతుడి మర్మాంగాన్ని ఎలాంటి అడ్డు లేకుండా ముట్టుకోకూడదు. మరియు ఇలాగే స్త్రీని ముట్టుకోవటం వలన చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం వుదూ భంగమవదు. అది కామంతో అయినా లేదా కామంతో కాకపోయినా అతని నుండి ఏదైన వెలువడనంత వరకు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సతీమణులలో నుంచి ఒకరిని ముద్దు పెట్టుకుని ఆ తరువాత నమాజు చేశారు. ఆయన మరలా వుదూ చేయలేదు.
ఇక సూరహ్ అన్నిసా మరియు మాయిదా యొక్క రెండు ఆయతులలో అల్లాహ్ వాక్కు:
﴿...أَوۡ لَٰمَسۡتُمُ ٱلنِّسَآءَ... ٤٣﴾
లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) [నిసా:43] [మాయిద:6] పండితుల సరైన మాట ప్రకారం దాని అర్థం సంభోగము. మరియు అది ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు మరియు పూర్వీకులలోంచి ఒక జమాఅత్ యొక్క మాట. మరియు అల్లాహ్ యే భాగ్యమును కలిగించేవాడు.
పదిహేనవ పాఠం: ప్రతీ ముస్లిం చట్టబద్ధమైన గుణములతో అలంకరించుకోవటం
వాటిలో నుంచి: నీతి, నిజాయితీ, పవిత్రత, నిరాడంబరత, ధైర్యం, ఔదార్యం, విశ్వసనీయత, అల్లాహ్ నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండుట, ఇరుగు పొరుగు వారిని ఆదరించుట, శక్తి ప్రకారం అవసరమైన వారికి సహాయం చేయుట మరియు చట్టబద్దమైనవని ఖుర్ఆన్, సున్నత్ ద్వారా నిరూపించబడిన ఇతర విషయాలు.
పదహారవ పాఠం:
ఇస్లామీయ పద్దతులను అవలంభించటం
వాటిలో కొన్ని: సలాం చేయుట, చిరునవ్వుతో పలకరించుట, కుడిచేతితో తినుట మరియు త్రాగుట, తినడం - త్రాగటం ఆరంభించేటప్పుడు బిస్మిల్లాహ్ అని, ముగించినప్పుడు అల్హమ్దులిల్లాహ్ అని పలుకుట, తుమ్మిన తరువాత అల్హమ్దులిల్లాహ్ అని పలుకుట, తుమ్మిన వాడు అల్హమ్దులిల్లాహ్ అని పలికినప్పుడు అతనికి జవాబుగా యర్ హముకల్లాహ్ అని పలుకుట, వ్యాధిగ్రస్తుడిని పరామర్శించుట, జనాజా నమాజు చేయటానికి, పూడ్చటానికి జనాజా వెనుక వెళ్ళుట. మస్జిదులో లేదా ఇంటిలో ప్రవేశించేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, తల్లీదండ్రులతో, బంధువులతో, ఇరుగు పొరుగువారితో, పెద్దవారితో, చిన్నవారితో ఉన్పప్పుడు, అప్పుడే పుట్టిన బిడ్డ గురించి శుభవార్తనిచ్చేటప్పుడు, వివాహం గురించి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు, ఆపదకు గురైనవారిని ఓదార్చేటప్పుడు, దుస్తులు ధరించేటప్పుడు, విడిచేటప్పుడు మరియు చెప్పులు తొడిగేటప్పుడు, విడిచేటప్పుడు ఇస్లామీయ పద్దతులను అవలంభించుట.
పదిహేడవ పాఠం: షిర్కు మరియు తదితర పాపముల నుండి హెచ్చరించటం
వాటిలో నుంచి: వినాశకరమైన ఏడు పాపాలు అవి: 1. షిర్కు బిల్లాహ్ (అల్లాహ్'కు ఇతరులను సాటి కల్పించుట) 2. చేతబడి 3. అల్లాహ్ నిషేధించిన ప్రాణిని అకారణంగా హతమార్చుట 4. వడ్డీ తినుట 5. అనాధల సొమ్ము అన్యాయంగా తినుట 6. యుద్దం నుండి వెనుతిరిగి పారిపోవుట 7. అభాగ్యురాలైన, అమాయకులైన మహిళలపై అపనిందలు మోపుట.
ఇంకా వాటిలో కొన్ని: తల్లిదండ్రుల పట్ల అవిధేయత, బంధుత్వాన్ని త్రెంచుట, అబద్దపు సాక్ష్యం పలుకుట, అబద్దపు ప్రమాణాలు చేయుట, పొరుగువారిని బాధించుట, రక్తం విషయంలో, సంపదల విషయంలో, మానం విషయంలో ప్రజలపై దుర్మార్గానికి పాల్పడుట, మత్తు పదార్ధాలు సేవించుట, జూదమాడుట, వీపు వెనుక చెడు మాట్లాడుకొనుట, చాడీలు చెప్పుట మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నివారించిన ఇతర పనులు.
పద్దెనిమిదవ పాఠం: మృతుని జనాజా సిద్ధం చేయుట, అతని జనాజా నమాజు చేయుట, మృతదేహాన్ని పూడ్చుట
దాని వివరణ ఇది:
ఎ
వ
రికైన
ా
మరణఘడియలు
దగ్గరైనప్పుడు
అతనికి
లా
ఇ
లాహ
ఇల్లల్లాహ్
గురించి
ఉపదేశించాలి
.
ఎందుకంటే
ప్రవక్త
సల్లల్లాహు
అలైహి
వసల్లం
ఇలా
పలికినారు
:
«لَقِّنُوا مَوْتَاكُمْ: لَا إِلَهَ إِلَّا اللَّهُ».
మీరు మీ మృతులకు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉపదేశించండి.7 ముస్లిం, సహీహ్ లో ఉల్లేఖించారు. ఈ హదీసులో మృతులంటే మృత్యువుకి దగ్గరైనవారు. మృత్యువు సూచనలు ఎవరి పైనైతే బహిర్గతం అవుతాయో వారు.
మరణ
ాన్ని
దృవీకరించినప్పుడు
,
అతని
క
నురెప్పలను
మూసివేయాలి
మరియు
రెండు
దవడలను
కట్టి
వేయాలి
,
సున్నత్
లో
దీని
ప్రస్తావన
ఉన్న
ద
ి
.
ముస్లిం
మృత
దేహా
నికి
గుసుల్
చేయ
ు
ట
అనివార్య
ం
.
కాని
యుద్
ధం
లో
అమరగతి
పొందినవారైతే
,
అతనికి
గుసుల్
చేయబడదు
,
జనాజా
నమాజు
చ
ేయ
బడదు
.
కాని
అతనిని
అతని
బట్టలలోనే
సమాధి
చేయబడును
.
ఎందుకంటే
ప్రవక్త
సల్లల్లాహు
అలైహి
వసల్లం
ఉహద్
లో
అమరగతి
పొందిన
వారికి
గుసుల్
చేయలేదు
మరియు
వారి
జనాజా
నమాజు
చదివించలేదు
.
మృతునికి
గుసుల్
చేసే
పద్
ధ
తి
:
మృతుని మర్మావయవాలను కప్పివేయాలి. ఆ తర్వాత అతనిని కొద్దిగా పైకి లేపి పొట్టను కొద్దిగా నొక్కాలి. ఆ తర్వాత గుసుల్ చేయించే వ్యక్తి తన చేతిపై గుడ్డను లేదా అలాంటిదే ఏదైనా చుట్టుకుని అతని మర్మాంగం నుండి వెలువడిన మాలిన్యాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత నమాజు యొక్క వుదూ చేయించాలి. ఆ తరువాత తలను మరియు గెడ్డాన్ని నీటితో మరియు రేగుపండ్ల ఆకులతో లేదా అలాంటి వాటితో కడగాలి. ఆ తరువాత కుడివైపు భాగాన్ని తరువాత ఎడమ భాగాన్ని కడగాలి. ఆ తరువాత రెండవసారి, మూడవసారి ఇదే విధంగా గుసుల్ చేయాలి. ప్రతీసారీ చేతిని పొట్ట పైభాగంపై పోనిచ్చి నొక్కాలి. ఒకవేళ ఏమైనా బయటకు వస్తే దానిని కడగాలి. ఆ తర్వాత మర్మాంగ ప్రదేశాన్ని దూదితో లేదా అలాంటి దానితో మూసి వేయాలి. ఒకవేళ ఆగకపోతే మెత్తని మట్టి లేదా ఆధునిక వైద్య సాధనాలైన టేపు వంటి వాటిని అతికించాలి.
మరియు మరల వుదూ చేయించాలి. ఒకవేళ మూడుసార్లు గుసుల్ చేయటం వలన శుభ్రం కాకపోతే ఐదు లేదా ఏడుసార్లు చేయించాలి. ఆ తరువాత పూర్తి శరీరాన్ని గుడ్డతో తుడవాలి. మరియు కీలు భాగాలకు, వుదూ ప్రదేశములకు సుగంధమును పూయాలి. పూర్తి శరీరమునకు సుగంధం పూస్తే ఇంకా మంచిది. మరియు అతని కఫన్ కి సాంబ్రాణి పొగ ఇవ్వాలి. ఒకవేళ మీసాలు గాని గోళ్ళు గాని పెద్దవిగా ఉంటే కత్తిరించాలి. ఒకవేళ అలాగే వదిలేసినా ఎలాంటి దోషం లేదు. కాని దువ్వెన చేయ కూడదు. బొడ్డు క్రింది వెంట్రుకలు గొరకకూడదు మరియు సున్తీ చేయకూడదు. ఎందుకంటే అలా చేయాలనే ఎలాంటి ఆధారం లేదు. స్త్రీ అయితే ఆమె తల వెంట్రుకలను మూడు జడలుగా చేసి వెనుకకు వదిలివేయాలి.
మృతునికి
కఫన్
తొడిగించ
ు
ట
పురుషుడిని తెల్లటి మూడు వస్త్రాలలో కఫన్ ఇవ్వటం ఎంతో ఉత్తమం. అందులో చొక్కా మరియు తలపాగ ఉండకూడదు. ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడినదో అలాగే ఇవ్వాలి. వాటిలో మృతుడిని పూర్తిగా చుట్టివేయాలి. ఒకవేళ చొక్కా, షరాయి మరియు దుప్పటిలో కఫన్ ఇచ్చినా ఏమీ దోషం లేదు.
మరియు స్త్రీని ఐదు వస్త్రాలు చొక్కా, ఓణి, పైజామా మరియు రెండు దుప్పట్లలో కఫన్ ఇవ్వాలి. మరియు చిన్న పిల్లవాడైతే ఒకటి నుంచి మూడు వస్త్రాలలో కఫన్ ఇవ్వాలి. మరియు చిన్నపాప అయితే ఒక చొక్కా రెండు దుప్పట్లలో కఫన్ ఇవ్వాలి.
అందరిని ఒక వస్త్రంలో కఫన్ ఇవ్వటం తప్పనిసరి. అది మృతుడిని పూర్తిగా కప్పేదై ఉండాలి. కాని మృతుడు ఇహ్రామ్ స్థితిలో ఉంటే అతడిని నీటితో, రేగు ఆకులతో గుసుల్ చేయించాలి. మరియు అతని క్రింది వస్త్రం మరియు పై వస్త్రంలో లేదా వేరే దానిలో కఫన్ ఇవ్వాలి. మరియు అతని తల మరియు ముఖము కప్పబడదు. మరియు సుగంధం పూయ బడదు. ఎందుకంటే ప్రళయదినాన అతడు తల్బియ చదువుతూ ఉన్న స్థతిలో లేపబడుతాడు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీ హదీసు వచ్చి ఉన్నది. ఒకవేళ ఇహ్రామ్ స్థితిలో స్త్రీ ఉంటే ఇతర స్త్రీల వలె ఆమెకు కఫన్ ఇవ్వాలి. కానీ ఆమెకు సుగంధం పూయబడదు మరియు ఆమె ముఖం ముసుగుతో కప్పకూడదు మరియు చేతులు గ్లౌజులతో కప్పకూడదు. కాని ఆమె ముఖము మరియు చేతులను కఫన్ ఇచ్చిన వస్త్రంతోనే కప్పాలి. ఇంతకు ముందు స్త్రీకి కఫన్ ఎలా ఇవ్వాలో ప్రస్తావించబడినది.
మృతుడికి
గుసుల్
చేయించటానికి
మరియు
అతని
జనాజా
నమాజ్
చదివించటానికి
మరియు
అతడిని
పూడ్చటానికి
ప్రజల్లో
ఎక్కువ
హక్కుదారుడు
అతడు ఈ విషయంలో ఎవరు చేయాలని మరణశాసనం (వసియ్యత్) చేశాడో అతను. ఆ తరువాత తండ్రి. ఆ తరువాత తాత. ఆ తరువాత మృతుడి సమీప బంధువులు.
అలాగే స్త్రీకి గుసుల్ ఇవ్వటానికి ఎక్కువ హక్కుదారులు: ఆమె మరణశాసనం (వసీయత్) చేసిన స్త్రీ. ఆ తరువాత ఆమె తల్లి. ఆ తరువాత నాయనమ్మ. ఆ తరువాత ఆమెకు సమీప బంధువులైన స్త్రీలు. భార్యభర్తల్లోంచి ఒకరు ఇంకొకరికి గుసుల్ ఇవ్వవచ్చు. ఎందుకంటే అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హును ఆయన సతీమణి గుసుల్ ఇచ్చింది. మరియు అలీ రదియల్లాహు అన్హు తన సతీమణి ఫాతిమా రదియల్లాహు అన్హాకు గుసుల్ ఇచ్చారు.
జనాజా
నమాజు
పద్దతి
జనాజా నమాజులో నాలుగు తక్బీరులు పలకాలి. మొదటి తక్బీర్ తరువాత సూరహ్ ఫాతిహా పఠించాలి. ఒకవేళ దానితో పాటు ఏదైన చిన్న సూరాను గాని ఒక ఆయతును లేదా రెండు ఆయతులను చదవటం మంచిది. ఎందుకంటే ఈ విషయంలో ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ప్రామాణికమైన హదీసు వచ్చినది. ఆ తరువాత రెండవ తక్బీర్ ను పలికి తషహ్హుద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించినట్లు ఆయనపై దరూద్ పఠించాలి. ఆ తరువాత మూడవ తక్బీర్ పలికి ఈ దుఆ చదవాలి: అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వమయ్యితినా, వ షాహిదినా వగాయిబినా, వసగీరినా వకబీరినా, వజకరినా వ ఉన్సానా, అల్లాహుమ్మ మన్ అహ్, యయ్ తహు మిన్నా ఫఅహ్, యిహీ అలల్ ఇస్లామ్, వమన్ తవఫ్ఫయ్ తహు మిన్నా ఫతవఫ్ఫహు అలల్ ఈమాన్, అల్లాహుమ్మగ్ఫిర్లహూ, వర్హమ్హూ, వఆఫిహీ, వఅఫు అన్హు, వఅక్రిమ్ నుజూలహూ, వవస్సిఅ్ ముద్ఖలహు, వగ్సిల్హు బిల్ మాయి వస్సల్జి వల్ బర్ది, వనఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, వ అబ్దిల్హు దారన్ ఖైరన్ మిన్ దారిహీ, వ అహ్లన్ ఖైరన్ మిన్ అహ్లిహి, వ అద్ఖిల్హుల్ జన్నత, వ అయిజ్, హు మిన్ అజాబిల్ ఖబ్రి, వ అజాబిన్నార్, వఫ్సహ్ లహూ ఫీఖబ్రిహీ, వ నవ్విర్ లహూ ఫీహి, అల్లాహుమ్మ లా తహ్రిమ్నా అజ్రహు,వలా తుజిల్లనా బాదహూ. ఆ తరువాత నాల్గవ తక్బీర్ పలికి కుడివైపుకు ఒక సలాం చేసి తిరగాలి.
ప్రతీ తక్బీర్ తరువాత చేతులు పైకి ఎత్తటం (రఫ్ఉల్ యదైన్ చేయటం) మంచిది. మరణించినది స్త్రీ అయితే అల్లాహుమ్మగ్ఫిర్ లహా అని, రెండు జనాజాలు అయితే అల్లాహుమ్మగ్ఫిర్ లహుమా అని, ఒకవేళ రెండు కంటే ఎక్కువ జనాజాలు అయితే అల్లాహుమ్మగ్ఫిర్ లహుమ్ అని పఠించాలి. ఇక మృతుడు చిన్నపిల్లవాడైతే మన్నింపు కొరకు చేసే దుఆకు బదులుగా ఈ దుఆ చదవాలి: (అల్లాహుమ్మజ్అల్హు ఫర్తన్ వ జుఖ్రన్ లివాలిదైహి, వ షఫీ అమ్, ముజాబన్, అల్లాహుమ్మ సఖ్ఖిల్ బిహి మవాజీనహుమా, వఅఅ్ జిమ్ బిహి ఉజూరహుమా, వఅల్హిఖ్హు బిసాలిహి సలఫిల్ ముఅ్, మినీన, వజ్అల్హు ఫీకిఫాలతి ఇబ్రాహీమ అలైహిస్సలాం, వఖిహి బిరహ్మతిక అజాబల్ జహీమ్)
మరియు సున్నత్ ఏమిటంటే ఇమామ్ పురుషుని తల వద్ద నిలబడాలి, స్త్రీ కొరకు మధ్యలో నిలబడాలి. ఒకవేళ ఎక్కువ జనాజాలు ఉంటే పురుషుని జనాజా ఇమామ్ కు ఆనుకుని ఉండాలి. స్త్రీ జనాజా ఖిబ్లా వైపు ఉండాలి. ఒకవేళ వారితో పాటు పిల్లలు ఉంటే బాలుడిని స్త్రీ కంటే ముందు ఉంచాలి. ఆ తరువాత స్త్రీని ఆ తరువాత పాపను ఉంచాలి. బాబు తల పురుషుని తలకు సమానంగా ఉంచాలి. మరియు స్త్రీ మధ్య భాగాన్ని పురుషుని తలకు సమానంగా ఉంచాలి. మరియు అలాగే పాప తలను స్త్రీ తలకు సమానంగా ఉంచాలి. మరియు ఆమె మధ్య భాగాన్ని పురుషుని తలకు సమానంగా ఉంచాలి. నమాజ్ చేసే వారందరు ఇమామ్ వెనుక నిలబడాలి. ఒకవేళ ఒక్కడే నమాజీ ఉండి ఇమామ్ వెనుక నిలబడటానికి చోటు లేకపోతే అతడు ఇమామ్ కి కుడివైపున నిలబడాలి.
మృత
దేహాన్ని
పూడ్చే
విధానం
పురుష మృతదేహం సమాధిని నడుము లోతు తీయటం ఆనవాయితి. మరియు అందులో ఖిబ్లా వైపు లహద్ ను తీయాలి. మృతుడిని కుడి వైపు నుండి లహద్ లో ఉంచాలి. ఆ తర్వాత కఫన్ యొక్క ముడులను విప్పాలి. కఫన్ తొలగించ కుండా అలాగే వదిలివేయాలి. మృతుడు పురుషుడైనగాని స్త్రీ అయినా గాని ముఖంపై నుండి వస్త్రాన్ని తొలగించకూడదు. ఆ తరువాత అతనిపై మట్టి పడకుండా ఉండటానికి పై నుండి ఇటుకలను మట్టితో పేర్చాలి. ఒకవేళ ఇటుకలు లేకపోతే బల్లలను లేదా రాళ్ళను లేదా కట్టెలను మట్టి పడకుండా ఉండటానికి ఉంచాలి. ఆ తరువాత పైనుండి మట్టితో కప్పి వేయాలి. మట్టిని వేసేటప్పుడు "బిస్మిల్లాహి వ అలా మిల్లతి రసూలిల్లాహి" అని పలకడం మంచిది. సమాధిని ఒక జానడు పైకి ఉండేటట్లు చేయాలి. ఒకవేళ కంకర రాళ్ళు అందుబాటులో ఉంటే పైన ఉంచి, దాని పై నీటితో తడపాలి.
మరియు జనాజాతో వెళ్ళినవారు సమాధి వద్ద నిలబడి మృతుని కొరకు దుఆ చేయటం సున్నత్. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మృతుడిని ఖననం చేసిన తరువాత సమాధి వద్ద నిలబడి ఇలా పలికేవారు:
«اسْتَغْفِرُوا لِأَخِيكُمْ، وَاسْأَلُوا لَهُ التَّثْبِيتَ، فَإِنَّهُ الْآنَ يُسْأَلُ».
మీరు మీ సోదరుని మన్నింపు కొరకు వేడుకోండి. మరియు అతని స్థిరత్వం కొరకు వేడుకోండి. ఎందుకంటే అతను ఇప్పుడు ప్రశ్నించబడుతాడు.8
ఎవరికైన
జనాజా
నమాజు
దొరకకపోతే
ఖననం
తరువాత
జనాజా
నమాజు
చ
ేయ
టం
ధర్మబద్ధము
ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేశారు. అది కూడా నెల లోపలే అయి ఉండాలి. ఒకవేళ నెల కంటే ఎక్కువ కాలం అయితే సమాధిపై జనాజా నమాజ్ చేయటం ధర్మబద్ధం కాదు. ఎందుకంటే ఖననం జరిగి ఒక నెల తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్ద జనాజా నమాజు చేసినట్లు ఎటువంటి ఆధారం లేదు.
మృతుని
ఇంటివారు
ప్రజల
కొరకు
భోజన
ఏర్పాట
్లు
చేయటం
సమ్మతం
కాదు
.
ప్రవక్త
అనుచరులు
జరీర్
బిన్
అబ్దిల్లాహ్
అల్
బజలీ
ర
ది
యల్లాహు
అన్హు
ఉల్లేఖన
-
«كُنَّا نَعُدُّ الِاجْتِمَاعَ إِلَى أَهْلِ الْمَيِّتِ وَصَنْعَةَ الطَّعَامِ بَعْدَ الدَّفْنِ مِنَ النِّيَاحَة».
మేము ఖననం తర్వాత మృతుడి ఇంటివారి వద్ద సమావేశం అవుటను, భోజనం సిద్ధం చేయుటను నౌహాలో షుమారు చేసే వారం.9 ఇమామ్ అహ్మద్, హసన్ సనద్ తో ఉల్లేఖించారు.
ఇక మృతుడి ఇంటివారి కొరకు లేదా వారి అతిధుల కొరకు అన్నం వండటంలో ఎలాంటి దోషం లేదు. మృతుడి బంధువులు మరియు ఇరుగుపొరుగువారు మృతుడి ఇంటివారి కొరకు భోజనం ఏర్పాటు చేయటం ధర్మబద్ధం. ఎందుకంటే షామ్ నుండి జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు మరణవార్త వచ్చి నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటి వారిని జాఫర్ ఇంటివారి కొరకు భోజనం సిద్ధం చేయమని ఆదేశించి, ఇలా పలికారు:
«إِنَّهُ أَتَاهُمْ مَا يَشْغَلُهُمْ».
నిశ్చయంగా వారి వద్దకు వారిని తీరిక లేకుండా చేసే విషయం వచ్చినది.10
మృతుని ఇంటివారు తమ వద్దకు కానుకగా వచ్చిన భోజనము తినటానికి తమ పొరుగువారిని గాని ఇతరులను పిలుచుకోవటంలో ఎటువంటి పాపం లేదు. షరీఅ నుండి మనకు తెలిసిన దానిలో దాని కొరకు ఒక పరిమిత సమయం లేదు.
స్త్రీ
కొరకు
మృతునిపై
మూడు
రోజుల
కన్న
ఎక్కువ
దుఃఖించటం
సమ్మతం
కాదు
కానీ
తన
భర్తపై
.
తన భర్తపై నాలుగు నెలల పది దినాల వరకు దుఃఖించటం తప్పనిసరి. ఒకవేళ ఆమె గర్భిణీ అయితే బిడ్డకు జన్మ నిచ్చేంతవరకు దుఃఖించవచ్చు.ఎందుకంటే దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీహ్ హదీసు నిరూపణ ఉన్నది.
ఇక పురుషుడికి తన బంధువుల లేదా ఇతరుల మరణంపై దుఃఖించటం సమ్మతం కాదు.
సమయం
ఉన్నప్పుడు
సమాధుల
సందర్శనం
వారి
కొరకు
దుఆ
చేయటానికి
,
వారి
కొరకు
కారుణ్యమును
కోరటానికి
మరియు
మరణమును
.
దాని
తరువాత
దానిని
గుర్తు
చేసుకోవటానికి
పురుషుల
కొరకు
ధర్మబద్దం
చేయబడినది
.
ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
«زُورُوا الْقُبُورَ، فَإِنَّهَا تُذَكِّرُكُمُ الْآخِرَةَ».
మీరు సమాధులను సందర్శించండి అది మీకు పరలోకమును గుర్తుచేస్తుంది.11 ముస్లిం హదీసు.
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు మీరు సమాధులను సందర్శించినప్పుడు ఈ దుఆను పఠించండి అని బోధించేవారు:
«السَّلَامُ عَلَيْكُمْ أَهْلَ الدِّيَارِ مِنَ الْمُؤْمِنِينَ وَالْمُسْلِمِينَ، وَإِنَّا إِنْ شَاءَ اللَّهُ بِكُمْ لَاحِقُونَ، نَسْأَلُ اللَّهَ لَنَا وَلَكُمُ الْعَافِيَةَ، يَرْحَمُ اللَّهُ الْمُتَقَدِّمِينَ مِنَّا وَالْمُسْتَأْخِرِينَ».
అస్సలాము అలైకుమ్ అహ్లద్దియార్ మినల్ ముమినీన వల్ ముస్లిమీన్, వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ లాహిఖూన్’నస్ అలుల్లాహల్ లనా వలకుముల్ ఆఫీయ. అల్లాహ్ మన కన్న ముందు పోయిన వారిని, మన వెనక వచ్చే వారిని కరుణించుగాక.12
ఇక స్త్రీల కొరకు సమాధుల సందర్శన లేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులను సందర్శించే స్త్రీలను శపించారు. ఎందుకంటే వారి సందర్శనం వలన ఉపద్రవాలు తలెత్తే మరియు అసహనాన్ని ప్రదర్శించే ప్రమాదం ఉన్నది. మరియు ఇలాగే శ్మశానం వరకు జనాజా వెనుక వెళ్ళటం, వారి కొరకు సమ్మతం కాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దాని నుండి వారించారు. ఇక మస్జిద్ లో లేదా నమాజు చేసే చోట జనాజా నమాజు చేయటం పురుషులకు మరియు స్త్రీలకు ధర్మబద్దం చేయబడినది.
ఈ సేకరణలో చివరి విషయం ఇది. అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను,శాంతిని కలిగించుగాక.
***
విషయసూచిక
మొదటి పాఠం: సూరతుల్ ఫాతిహ మరియు చిన్న సూరాలు 3
రెండవ పాఠం: ఇస్లాం మూలస్తంభాలు. 3
మూడవ పాఠం: ఈమాన్ (విశ్వాస) మూలస్తంభాలు. 5
నాల్గవ పాఠం: తౌహీద్ రకాలు మరియు షిర్కు రకాలు. 5
ఐదవ పాఠం: ఇహ్సాన్ 12
ఆరవ పాఠం: నమాజు షరతులు 12
ఏడవ పాఠం: నమాజు యొక్క విధులు 12
ఎనిమిదో పాఠం: నమాజులో తప్పనిసరి అనివార్య కార్యాలు 13
తొమ్మిదవ పాఠం: తషహ్హుద్ యొక్క వివరణ. 13
పదవ పాఠం: నమాజు యొక్క సున్నతులు 15
పదకొండవ పాఠం: నమాజును భంగం చేసేవి. 18
పన్నెండవ పాఠం: వుదూ షరతులు. 19
పదమూడవ పాఠం: వుదూలో తప్పనిసరిగా చేయవలసిన కార్యాలు. 19
పద్నాల్గవ పాఠం: వుదూను భంగపరిచే విషయాలు. 20
పదిహేనవ పాఠం: ప్రతీ ముస్లిం చట్టబద్ధమైన గుణములతో అలంకరించుకోవటం 21
పదహారవ పాఠం: ఇస్లామీయ పద్దతులను అవలంభించటం. 22
పదిహేడవ పాఠం: షిర్కు మరియు తదితర పాపముల నుండి హెచ్చరించటం. 23
పద్దెనిమిదవ పాఠం: మృతుని జనాజా సిద్ధం చేయుట, అతని జనాజా నమాజు చేయుట, మృతదేహాన్ని పూడ్చుట. 24
***
దీనిని ఇమామ్ అహ్మద్ (5/428), తబరానీ అల్-కబీర్ లో (4/338), మరియు బైహఖీ అష్-షుఅబ్ లో (14/355) ఉల్లేఖించారు. మజ్మఉజ్ జవాయిద్ (1/121) లో, దీనిని అహ్మద్ ఉల్లేఖించారని మరియు దీని ఉల్లేఖకులు సహీహ్ గ్రంథాల ఉల్లేఖకులని ప్రస్తావించారు.
దీన్ని ఇమామ్ అహ్మద్ (1/47) ఉల్లేఖించారు.
ఈ హదీథ్ను అబూ దావుద్, హదీథు సంఖ్య 3251గా, మరియు తిర్మిదీ, హదీథు సంఖ్య 1535గా ఉల్లేఖించారు.
దీనిని అబూ దావూద్ (4980), మరియు అహ్మద్ (5/ 384) ఉల్లేఖించారు.
దీన్ని ఇబ్నె మాజహ్ (4204) మరియు ఇమామ్ అహ్మద్ (3/30) ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు నెంబర్లు (916-917).
అబూదావుద్ నమోదు చేసినారు, హదీథు 3221 మరియు హాకిమ్ (3/399)
ఇబ్నె మాజహ్ (హదీథు 1612) మరియు ఇమామ్ అహ్మద్ (2/ 204).
ముస్లిం: అల్ జనాయిజ్ (976),నసాయీ: అల్ జనాయిజ్ (2034),అబూ దావూద్: అల్ జనాయిజ్ (3234),ఇబ్నె మాజ: మా జాఅ ఫిల్ జనాయిజ్ (1569),అహ్మద్ (2/441).
దీనిని ఇబ్నె మాజ, హదీసు నెంబరు (1569) లో ఉల్లేఖించారు. మరియు షేఖ్ అల్బానీ దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు,హదీసు నెంబరు (975).
ఫజీలతు షేఖ్ పుస్తకం (మజ్మమఉ ఫతావా వ మఖ్లలలతిన్ ముతనవివఅతిన్) రెండవ భాగం (288-298) పేజీలలో ప్రచురించబడింది.