كيفية صلاة النبي ﷺ (تلغو)

null

  • earth భాష
    (تلغو)
  • earth రచన:
    الشيخ عبد العزيز بن عبد الله بن باز

ఇతర అనువాదాలు 79

ce شيشاني- нохчийн мотт sq ألباني- Shqip pt برتغالي- português as آسامي- অসমীয়া ms ملايو- Melayu uz أوزبكي- Ўзбек ar عربي- العربية ps بشتو- بشتو ur أردو- اردو en إنجليزي- English bn بنغالي- বাংলা ru روسي- Русский zh صيني- 中文 fa فارسي- فارسي fr فرنسي- Français hi هندي- हिन्दी sw سواحيلي- Kiswahili id إندونيسي- Indonesia ha هوسا- Hausa tl فلبيني تجالوج- Tagalog tr تركي- Türkçe gu غوجاراتية- ગુજરાતી te تلغو- తెలుగు si سنهالي- සිංහල ta تاميلي- தமிழ் mk مقدوني- македонски pl بولندي- polski it إيطالي- italiano hu هنجاري مجري- magyar ka جورجي- ქართული es إسباني- español kn كنادي- ಕನ್ನಡ om أورومو- afaan oromoo sr صربي- Српски az أذري- azərbaycanca lo لاو- ພາສາລາວ ml مليالم- മലയാളം tg طاجيكي- тоҷикӣ hy أرميني- Հայերէն bs بوسني- bosanski vi فيتنامي- Tiếng Việt dv ديفهي- ދިވެހި ky قرغيزي- Кыргызча st سوتي- Sesotho th تايلندي- ไทย ne نيبالي- नेपाली cs تشيكي- čeština fi فنلندي- suomi bg بلغاري- български mos موري- Mõõré mg ملاغاشي- Malagasy kk كازاخي- қазақ тілі ig إيجبو- Igbo yo يوربا- Èdè Yorùbá uk أوكراني- українська ddn دندي- Dendi dje زارما- Zarmaciine mfe كريولي- créole ko كوري- 한국어 da دنماركي- dansk sn الشونا- Shona prs دري- فارسی دری af أفريقاني- Afrikaans dyo جوالا- Jóola so صومالي- Soomaali bem بيمبا- Bemba ja ياباني- 日本語 sl سلوفيني- slovenščina nl هولندي- Nederlands my بورمي- ဗမာ ki كيكويو- Gĩkũyũ lt ليتواني- lietuvių mnk مندنكا- Mandinka lv لاتفي- latviešu rn كيروندي- Ikirundi hr كرواتي- hrvatski ro روماني- română wo ولوف- Wollof zu زولو- isiZulu
PHPWord

 

 

 

 

كَيْفِيَّةُ صَلَاةِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజు విధానము

 

لِفَضِيلَةِ الشَّيْخِ العَلَّامَةِ

عَبْدِ العَزِيزِ بْنِ عَبْدِ اللَّهِ بْنِ بَازٍ

غَفَرَ اللَّهُ لَهُ وَلِوَالِدَيْهِ وَلِلْمُسْلِمِينَ

 

గౌరవనీయులైన షేఖ్

అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్

 

 


بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజు విధానము

గౌరవనీయులైన షేఖ్

అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్

 

అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో

సకల కృతజ్ఞతలు, ప్రశంసలు కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి, ఆయన ఏకైకుడు. ఆయన దాసుడు మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై అల్లాహ్ యొక్క కరుణా, శాంతీ కురియుగాక

ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నమాజు విధానాన్ని సంక్షిప్తంగా వివరించే కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు. ప్రతి ముస్లిం పురుషుడు మరియు స్త్రీ ఈ విధానాన్ని అనుసరించడానికి వీలుగా నేను ఈ వివరాలను సమర్పించాలనుకున్నాను, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

(صَلُّوا كَمَا رَأَيْتُمُونِي أُصَلِّي).

మీరు నన్ను ఏవిధంగా నమాజ్ పాటిస్తుండగ చూశారో ఆవిధంగా నమాజ్ పాటించండి.1 ఓ పాఠకులారా! నమాజు విధానము వివరణ ఇలా ఉన్నది:

పరిపూర్ణంగా వుజూ చేయడం, అంటే అల్లాహ్ ఆదేశించిన విధంగా వుజూ చేయడం, సర్వోన్నతుడైన అల్లాహ్ వాక్యము:

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا قُمۡتُمۡ إِلَى ٱلصَّلَوٰةِ فَٱغۡسِلُواْ وُجُوهَكُمۡ وَأَيۡدِيَكُمۡ إِلَى ٱلۡمَرَافِقِ وَٱمۡسَحُواْ بِرُءُوسِكُمۡ وَأَرۡجُلَكُمۡ إِلَى ٱلۡكَعۡبَيۡنِ...﴾.

ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి... [అల్ మాయిదా: 6] ఆయతు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనము:

(لَا تُقْبَلُ صَلَاةٌ بِغَيْرِ طُهُورٍ) .

(పరిశుద్ధ స్థితిలో (వుజూ స్థితిలో) తప్ప నమాజు స్వీకరించబడదు)2

మరియు తన నమాజును తప్పుగా ఆచరించిన వ్యక్తి కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు:

(‌إِذَا ‌قُمْتَ ‌إِلَى ‌الصَّلَاةِ، ‌فَأَسْبِغِ ‌الْوُضُوءَ).

(మీరు నమాజు చేయడానికి నిలబడినపుడు, మొదట పూర్తిగా వుజూ చేయండి)3

2- నమాజు చేస్తున్న వ్యక్తి, తాను ఎక్కడ ఉన్నా, తన మొత్తం శరీరాన్ని కాబాగృహం దిక్కుకు అంటే ఖిబ్లా వైపుకు తిరిగి ఉండేలా నిలబడాలి. తాను చేయదలుచుకున్న నమాజు కొరకు తన మనస్సులో నియ్యత్ (సంకల్పం) చేసుకోవాలి - ఇది తప్పనిసరి ఫర్జ్ నమాజు అయినా లేదా స్వచ్ఛంద సున్నత్ లేక నఫిల్ నమాజు అయినా. ఎందుకంటే నియ్యత్ ను మౌఖికంగా ఉచ్చరించడం అనుమతించబడలేదు, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే, అది ఒక నూతన ఆవిష్కరణ, కల్పితము (బిదఅత్) అవుతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు నియ్యత్ ను మౌఖికంగా తన నోటితో ఉచ్రించలేదు, అంతేగాక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు (రజియల్లాహు అన్హుమ్) కూడా ఎన్నడూ అలా చేయలేదు. నమాజు చేస్తున్న వ్యక్తి , ప్రజలకు నమాజు చేయిస్తున్న ఇమామ్ అయినా లేక ఒంటరిగా నమాజు చేస్తున్న వ్యక్తి అయినా, ఏకాగ్రత కొరకు తన ముందు ఒక సుత్రా (అడ్డంకి) పెట్టుకోవాలి. ఇస్లామీయ పండితుల గ్రంథాలలో పేర్కొనబడిన కొన్ని ప్రసిద్ధ మినహాయింపు పరిస్థితులలో తప్ప, ఖిబ్లా వైపు తిరిగి నిలబడడం అనేది నమాజు కొరకు ఒక ముఖ్యమైన షరతు.

3- అల్లాహు అక్బర్ "అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు" అనే పదాలతో తక్బీరతుల్-ఇహ్రామ్ పలుకుతూ నమాజు ప్రారంభించాలి మరియు తాను సాష్టాంగం (సజ్దా) చేసే స్థలంపై మాత్రమే తన చూపు నిలపాలి.

4- తక్బీర్ (అల్లాహు అక్బర్) చెప్పేటప్పుడు తన రెండు చేతులను తన భుజాల స్థాయి లేదా తన చెవుల స్థాయి వరకు పైకి లేపాలి.

5- తన చేతులను తన ఛాతీపై ఉంచి అంటే కుడి చేతిని ఎడమ చేయి వెనుక భాగంపై, ఎడమ చేయి మణికట్టు మరియు ముంజేయిపై ఉంచాలి; ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపించబడింది.

6- ఇక ఆ తరువాత ప్రారంభపు దుఆ పఠించటం సున్నతు, అది:

(اللَّهُمَّ بَاعِدْ بَيْنِي وبيْنَ خَطَايَايَ، كما بَاعَدْتَ بيْنَ المَشْرِقِ والمَغْرِبِ، اللَّهُمَّ نَقِّنِي مِنَ الخَطَايَا كما يُنَقَّى الثَّوْبُ الأبْيَضُ مِنَ الدَّنَسِ، اللَّهُمَّ اغْسِلْ خَطَايَايَ بالمَاءِ والثَّلْجِ والبَرَدِ).

అల్లాహుమ్మ బాఇద్ బైనీ వ బైన ఖతాయాయ, కమా బాఅద్'త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబ్. అల్లాహుమ్మ నఖ్ఖినీ మినల్ ఖతాయాయ కమా యునఖ్ఖిథ్' థౌబుల్ అబ్యదు మినద్' దనసి. అల్లాహుమ్మగ్' సిల్ ఖతాయాయ బిల్ మాఇ వథ్'థల్'జి వల్ బరద్."

(ఓ అల్లాహ్! తూర్పుపడమరలను వేరు చేసినట్లుగా, నా పాపాలను నా నుండి వేరు చేయుము. ఓ అల్లాహ్! తెల్లని వస్త్రం మురికి నుండి శుద్ధి చేయబడినట్లుగా నన్ను నా పాపాల నుండి శుద్ధి చేయుము. ఓ అల్లాహ్! నా పాపాలను నీరు, మంచు మరియు వడగళ్ళతో కడిగివేయుము)4

దానికి బదులుగా అతను కోరుకుంటే ఇలా కూడా పలకవచ్చు.

(سُبْحَانَكَ اللَّهُمَّ وبِحَمْدِكَ، وَتَبَارَكَ اسْمُكَ، وَتَعَالَى جَدُّكَ، ولَا إلَهَ غَيْرُكَ).

సుబ్'హానకల్లాహుమ్మ వ బిహమ్'దిక, వ తబారకస్ముక, వ తఆలా జద్దుక, వ లా ఇలాహ గైరుక.

(ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు మరియు సకల స్తుతులు, కృతజ్ఞతలు నీకే శోభిస్తాయి. నీ నామము అన్నింటి కంటే శ్రేష్ఠమైనది, నీ మహిమ అత్యున్నతమైనది. నీవు తప్ప, మరో ఆరాధ్యుడు లేనే లేడు.)5 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నమోదు చేయబడిన ఈ రెండు ప్రారంభ దుఆలే కాకుండా ఇలాంటి ప్రామాణికమైన వేరే ఏ దుఆ చేసినా, అందులో అభ్యంతరం లేదు. అయితే ఒకసారి ఒక దుఆ, మరొకసారి మరో దుఆ చేయడం మంచిది. ఎందుకంటే అది సున్నత్ అనుసరణలో పరిపూర్ణతను చేకూరుస్తుంది. తర్వాత ‘అఊదు బిల్లాహి మినష్' షైతానిర్రజీం’ (శపించబడిన, బహిష్కరించబడిన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను) అని పలకాలి. తర్వాత ‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ (అనంత కరుణాప్రదాత, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) అని పలికి సూరతుల్ ఫాతిహా పఠించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

(لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بفَاتِحَةِ الكِتَابِ).

(సూరతుల్ ఫాతిహా పఠించని వ్యక్తి నమాజు చెల్లదు)6 ఆ తరువాత, బిగ్గరగా తిలావత్ చేసే నమాజులలో "ఆమీన్" అని బిగ్గరగా పలకాలి, మరియు నిశ్శబ్దంగా తిలావత్ చేసే నమాజులలో నిశ్శబ్దంగా పలకాలి. తరువాత ఖుర్ఆన్ నుండి తనకు వీలైన సూరహ్ పఠించాలి. దీని గురించి ప్రస్తావించబడిన హదీసుల ప్రకారం - జుహ్ర్, అస్ర్, ఇషా నమాజులలో సూరతుల్ ఫాతిహా తర్వాత "ఔసాతుల్ ముఫస్సల్" (మరీ సుదీర్ఘమైన లేదా మరీ చిన్నవైన సూరాలు కాకుండా మధ్యస్థంగా ఉండే సూరాలు) పఠించడం, ఫజ్ర్ నమాజులో "తివాలె ముఫస్సల్" (సుదీర్ఘమైన సూరాలు) పఠించడం మరియు మగ్రిబ్ నమాజులో కొన్నిసార్లు సుదీర్ఘమైన సూరాలు, మరికొన్నిసార్లు చిన్న సూరాలు పఠించడం సున్నతు.

7- తన రెండు చేతులను తన రెండు భుజాలు లేదా చెవుల స్థాయి వరకు పైకెత్తి, అల్లాహు అక్బర్ అని తక్బీర్ పలికి, ముందుకు వంగుతూ తన తలను తన వీపుతో సమతలంగా ఉంచి, తన అరచేతులను తన మోకాళ్లపై ఉంచి, తన చేతివేళ్లను వేరు చేసి, మోకాళ్ళను గట్టిగా పట్టుకుంటూ తన ఈ రుకూ స్థితిలో ప్రశాంతంగా, స్థిరంగా ఉండి, ఇలా పలుక వలెను: 'సుబ్'హాన రబ్బియల్ అజీమ్' (పరమ పవిత్రుడైన నా ప్రభువు, అత్యంత గొప్పవాడు). ఇలా కనీసం మూడుసార్లు పలుకవలెను, అంతకంటే ఎక్కువ సార్లు పునరావృతం చేయడం మంచిది, మరియు దానితో పాటు ఇలా కూడా పలకమని సిఫార్సు చేయబడింది:

(‌سُبْحَانَكَ ‌اللهُمَّ ‌وَبِحَمْدِكَ، ‌اللهُمَّ ‌اغْفِرْ ‌لِي).

సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ"

(ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు మరియు సకల స్తుతులు, కృతజ్ఞతలు నీకే శోభిస్తాయి. ఓ అల్లాహ్! నన్ను క్షమించు.)7

8- రుకూ స్థితి నుండి తల పైకెత్తి (లేచి నిటారుగా నిలబడి), రెండు చేతులను రెండు భుజాల స్థాయికి లేదా చెవుల స్థాయికి ఎత్తి ఈ దుఆ పఠించాలి: (అల్లాహ్ తనను స్తుతించేవారిని వింటాడు) ఇమామ్ అయినా లేదా ఒంటరిగా నమాజ్ చేస్తున్న వ్యక్తి అయినా, రుకూ నుండి లేచి నిలబడిన తరువాత ఇలా పలకాలి:

(رَبَّنَا ولَكَ الحَمْدُ حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ مِلْءَ السَّمَواتِ ومِلْءَ الأرضِ، ومِلْءَ ما شِئتَ مِن شيءٍ بَعدُ) .

రబ్బనా వ లకల్ హమ్దు, హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహి, మిల్'అస్ సమావాతి వ మిల్'అల్ అర్ది, వ మిల్'అ మా షి'త మిన్ షయిన్ బఅదు."

(ఓ మా ప్రభువా! నీకే సకల స్తుతులు; అపారమైన, పవిత్రమైన, శుభకరమైన స్తుతులు. ఈ స్తుతులు ఆకాశాల నిండా, భూమి నిండా, మరియు నీవు కోరిన ప్రతి వస్తువు నిండా విస్తరించి ఉన్నాయి.)8.

ఒకవేళ జమాతుతో ఇమామ్ వెనుక నమాజు చేస్తున్నట్లయితే అంటే ముఖ్తదీ అయితే, అతను రుకూ నుండి తల పైకి ఎత్తేటప్పుడు 'రబ్బనా వ లకల్ హమ్ద్' అని పలకాలి. అయితే ఇమామ్, ముఖ్తదీ లేదా ఒంటరిగా నమాజు చేసేవారు ఎవరైనా ఈ దుఆలో మిగిలిన పైభాగాన్ని కూడా పఠించి, ఇంకా ఇలా పఠించవచ్చు.

(أهْلَ الثَّنَاءِ والْمجْدِ، أحَقُّ مَا قَالَ العَبْدُ، وكُلُّنَا لَكَ عَبْدٌ: اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أعْطَيْتَ، ولَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، ولَا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الجَدُّ).

అహ్లథ్ థనాఇ వల్ మజ్'ది, అహక్కు మా ఖాలల్ అబ్దు, వ కుల్లునా లక అబ్దున్: అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅ్'తైత, వ లా ముఅ్'తి లిమా మనఅ్'త, వ లా యన్'ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు.

 

సకల స్తుతులకు మరియు మహిమకు అర్హుడవైన ఓ అల్లాహ్! దాసుడు చెప్పగలిగిన సత్యమైన మాట ఏమిటంటే - మేమంతా నీ దాసులమే. ఓ అల్లాహ్! నీవు ఇచ్చే దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు, నీవు నిరాకరించిన దానిని ఇవ్వగలిగేవారు ఎవ్వరూ లేరు. బలవంతులలోకెల్లా అత్యంత బలవంతుడి శక్తి కూడా నీ (అనుజ్ఞ)కు వ్యతిరేకంగా అతనికి ఎలాంటిప్రయోజనమూ చేకూర్చజాలదు..9 ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నమోదు చేయబడిన ప్రామాణికమైన దుఆ కాబట్టి దీనిని కూడా పఠించుట మంచిది.

ఇమామ్, ముఖ్తదీ (ఇమామ్ వెనుక నమాజు చేసేవాడు) లేదా ఒంటరిగా నమాజు చేసేవాడు, వీరందరూ రుకూ కు ముందు నిలబడిన స్థితిలో చేసినట్లే, రుకూ నుండి తల ఎత్తిన తర్వాత తమ చేతులను (పొట్ట క్రింద కాకుండా) ఛాతి మీద కట్టుకోవడం ముస్తహబ్ (ఉత్తమం). ఎందుకంటే వాయిల్ బిన్ హుజ్ర్ మరియు సహ్ల్ బిన్ సఅద్ (రజియల్లాహు అన్హుమా) ల హదీసుల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా చేసేవారని నమోదు చేయబడింది.

9- సాష్టాంగంలో (సజ్దాలో) వెళ్లేటప్పుడు 'అల్లాహు అక్బర్' అని తక్బీర్ చెప్పాలి. సాధ్యమైతే ముందుగా మోకాళ్లను, తర్వాత అరచేతులను నేలపై ఉంచాలి. ఒకవేళ అలా చేయడం కష్టమైతే, ముందు అరచేతులను, తర్వాత మోకాళ్లను నేలపై ఉంచవచ్చు. కాళ్ల వేళ్లు మరియు చేతుల వేళ్లు ఖిబ్లా వైపు మడిచి ఉంచాలి. చేతుల వేళ్లను కలిపి ఉంచాలి, దూరం దూరంగా, విడి విడిగా ఉంచరాదు. ఈ ఏడు అవయవాలు తప్పనిసరిగా నేలను తాకాలి - అవి నుదుటి భాగం (నుదుటితో పాటు ముక్కు), రెండు అరచేతులు, రెండు మోకాళ్లు, మరియు రెండు కాళ్ల వేళ్ల అడుగు భాగాలు (కొనలు). సజ్దాలో 'సుబ్'హాన రబ్బియల్ అఅ్'లా (పరమ పవిత్రుడైన నా ప్రభువు అత్యున్నతుడు) అని మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పలకడం సున్నత్. దీనితో పాటు ఇలా కూడా పలకడం మంచిది:

(سُبْحانَكَ اللَّهُمَّ رَبَّنا وبِحَمْدِكَ، اللَّهُمَّ اغْفِرْ لِي).

సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ"

(ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు మరియు సకల స్తుతులు, కృతజ్ఞతలు నీకే శోభిస్తాయి. ఓ అల్లాహ్! నన్ను క్షమించు.) ఇంకా వీలయినంత ఎక్కువ దుఆలు చేయాలి, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికారు:

(‌أَمَّا ‌الرُّكُوعُ، ‌فَعَظِّمُوا ‌فِيهِ ‌الرَّبَّ، وَأَمَّا السُّجُودُ، فَاجْتَهِدُوا فِي الدُّعَاءِ، فَقَمِنٌ أَنْ يُسْتَجَابَ لَكُمْ).

రుకూలో ప్రభువు గొప్పదనాన్ని స్తుతించండి, మరియు సజ్దాలో దుఆలు ఎక్కువగా చేయడంలో శ్రద్ధ వహించండి, ఎందుకంటే సజ్దాలో మీ దుఆలు స్వీకరించబడే అవకాశం ఎక్కువగా ఉంది .10

మరియు మన ప్రభువును ఇహపరలోకాలలోని శుభాలను, అనుగ్రహాలను ప్రసాదించమని దుఆ చేయాలి. ఫర్జ్ (తప్పనిసరి) నమాజు అయినా, సున్నత్ లేదా నఫిల్ (స్వచ్ఛంద) నమాజు అయినా రెండింటికీ సజ్దాలో ఉన్నప్పుడు ఈ నియమాలు వర్తిస్తాయి: ముంజేతులను పక్కటెముకల నుండి దూరంగా ఉంచాలి (నేలకు ఆన్చకుండా, పైకి లేపి ఉంచాలి), పొట్టను తొడల నుండి దూరంగా ఉంచాలి, తొడలను కాళ్ల నుండి దూరంగా ఉంచాలి,

ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగానే సజ్దా చేసారు.

(اعْتَدِلُوا في السُّجُودِ، ولَا يَبْسُطْ أحَدُكُمْ ذِرَاعَيْهِ انْبِسَاطَ الكَلْبِ).

సజ్దాలో సమతుల్యంగా ఉండండి, మరియు మీలో ఎవరూ శునకంలా తన ముంజేతులను నేలపై చాచి పరచకూడదు.11

సజ్దా నుండి తల ఎత్తేటప్పుడు 'అల్లాహు అక్బర్' అని తక్బీర్ పలకాలి. ఎడమ కాలును పరచిపెట్టి, దానిపై కూర్చొవాలి. కుడి కాలును నిటారుగా ఉంచి, చేతులను తొడలు మరియు మోకాళ్లపై ఉంచాలి. ఆ తర్వాత ఈ దుఆ పఠించాలి:

(رَبِّ اغْفِرْ لِي وَارْحَمْنِي وَاهْدِنِي وَارْزُقْنِي وَعَافِنِي وَاجْبُرْنِي).

రబ్బిగ్ ఫిర్లీ వర్ హమ్నీ వహ్దినీ వర్ జుఖ్నీ వ ఆఫినీ వజ్బుర్నీ.

(ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు సన్మార్గం చూపు, నాకు జీవనోపాధి ప్రసాదించు, నాకు ఆరోగ్యం ప్రసాదించు, నా అవసరాలను తీర్చు మరియు నాకు శక్తినిచ్చి బలపరచు)12 ఇలా కూర్చోడంలో ఏ మాత్రం తొందరపాటు లేకుండా, నిశ్చింతగా, సాంత్వనతో, స్థిరంగా, ప్రశాంతంగా కూర్చోవాలి.

11- 'అల్లాహు అక్బర్' అని తక్బీర్ చెప్పి, మొదటి సజ్దాలో చేసినట్లే అన్ని విధానాలు పాటిస్తూ రెండవ సజ్దా పూర్తి చేయాలి.

రెండవ సజ్దా నుండి 'అల్లాహు అక్బర్' అని తక్బీర్ చెప్పి తల పైకెత్తాలి. అంతకు ముందు రెండు సజ్దాల మధ్య కూర్చున్నట్లు కొద్దిసేపు విశ్రాంతిగా కూర్చోవాలి (జల్సతుల్ ఇస్తిరాహ). ఇది ముస్తహబ్ (ఉత్తమం), కానీ దీన్ని వదిలేస్తే ఎలాంటి దోషమూ లేదు. ఈ కూర్చునే సమయంలో ఎలాంటి దుఆ లేదా జిక్ర్ పఠించవలసిన అవసరం లేదు. తర్వాత రెండవ రకాతు కొరకు లేచి నిలబడాలి. సాధ్యమైతే మోకాళ్లపై చేతులు ఆన్చుతూ, లేవాలి, కష్టమైతే నేలపై చేతులు ఆన్చి లేవాలి. తర్వాత సూరతుల్ ఫాతిహా మరియు ఖుర్ఆన్ నుండి సులభమైన ఏదైనా సూరహ్ పఠించాలి. మొదటి రకాత్ లో చేసినట్లే అన్ని ఆచరణలు పునరావృతం చేయాలి.

రెండు రకాతుల నమాజులు (ఫజ్ర్, జుమా, ఈద్ లాంటివి) చేసేటప్పుడు, రెండవ సజ్దా నుండి లేచిన తర్వాత కుడి కాలును నిటారుగా ఉంచి, ఎడమ కాలును పరచి కూర్చోవాలి. కుడి చేతిని కుడి తొడపై ఉంచి, చూపుడు వేలు తప్ప మిగతా వేళ్లను ముడుచుకోవాలి. చూపుడు వేలుతో తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం) కు సూచిస్తూ దానిని నిటారుగా పైకి లేపాలి. లేదా చిటికెన వేలు, ఉంగరపు వేళ్ళను ముడిచి, బొటనవేలు మరియు నడుమ వేలుతో వలయం చేసి, చూపుడు వేలుతో సూచించడం కూడా సరియైనదే – ఎందుకంటే ఈ రెండు పద్ధతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమై ఉన్నాయి. ఒకసారి ఈ పద్ధతి, మరొక సారి ఆ పద్ధతి అనుసరించడం ఉత్తమం. ఎడమ చేతిని ఎడమ తొడ మరియు మోకాలిపై ఉంచాలి. తర్వాత ఈ కూర్చునే స్థితిలో తషహ్హుద్ ఇలా చదవాలి:

(التَّحِيَّاتُ لله والصَّلَوَاتُ والطَّيِّبَاتُ، السَّلَامُ عَلَيْكَ أيُّها النبيُّ ورَحْمَةُ الله وبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وعلَى عِبَادِ الله الصَّالِحِينَ، أشْهَدُ أنْ لا إلَهَ إلَّا الله وأَشْهَدُ أنَّ مُحَمَّدًا عَبْدُهُ ورَسولُهُ).

((అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు. అస్సలాము అలైక అయ్యుహ న్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్-సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు)). సకల ప్రశంసలకు, ప్రార్థనలకు మరియు పవిత్రమైన వాటన్నింటికీ అల్లాహ్ కు మాత్రమే అర్హత ఉంది. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కృప మరియు ఆశీర్వాదాలు కలుగు గాక. మాపై మరియు అల్లాహ్ యొక్క సజ్జన దాసులపై కూడా శాంతి కలుగు గాక. నేను సాక్ష్యమిస్తున్నాను – అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని. ఆ తరువాత ఇలా దుఆ చేయాలి

(اللَّهُمَّ صَلِّ علَى مُحَمَّدٍ وعلَى آلِ مُحَمَّدٍ، كما صَلَّيْتَ علَى إبْرَاهِيمَ وعلَى آلِ إبْرَاهِيمَ؛ إنَّكَ حَمِيدٌ مَجِيدٌ، وَبَارِكْ علَى مُحَمَّدٍ وعلَى آلِ مُحَمَّدٍ، كما بَارَكْتَ علَى إبْرَاهِيمَ وعلَى آلِ إبْرَاهِيمَ؛ إنَّكَ حَمِيدٌ مَجِيدٌ).

((అల్లాహుమ్మసల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ్, ఇన్నక హమీదున్ మజీద్. వ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ్, ఇన్నక హమీదున్ మజీద్)).

ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీమ్ పై మరియు ఆయన కుటుంబ సభ్యులపై కరుణ చూపిన విధంగానే ముహమ్మద్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కరుణ, సంరక్షణ చూపుము. నిశ్చయంగా నీవే ప్రశంసనీయుడవు, గొప్పవాడవు. అలాగే, నీవు ఇబ్రాహీమ్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై శుభాలు కురిపించిన విధంగానే ముహమ్మద్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై కూడా శుభాలు కురిపించు. నిశ్చయంగా నీవే ప్రశంసనీయుడవు, గొప్పవాడవు.13

ఆ పిదప ఈ నాలుగు విషయాల నుండి ఇలా అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి:

( اللَّهُمَّ إنِّي أَعُوذُ بِكَ مِن عَذَابِ جَهَنَّمَ، وَمِنْ عَذَابِ القَبْرِ، وَمِنْ فِتْنَةِ المَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرِّ فِتْنَةِ المَسِيحِ الدَّجَّالِ).

((అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబి జహన్నమ్, వ మిన్ అదాబిల్ ఖబ్ర్, వ మిన్ ఫిత్నతిల్-మహ్యా వల్-మమాత్, వ మిన్ షర్రి ఫిత్నతిల్-మసీహిద్-దజ్జాల్)).

ఓ అల్లాహ్! నేను నరకం యొక్క శిక్ష నుండి, ఖబ్ర్ (సమాధి) శిక్ష నుండి, జీవితం మరియు మరణం యొక్క పరీక్షల నుండి, మరియు మసీహ్ దజ్జాల్ (యాంటీ క్రీస్తు) యొక్క దుష్ట పరీక్ష నుండి నీ శరణు వేడుకుంటున్నాను.14

తర్వాత ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ మేలు కోరుతూ, తనకు కావలసిన దాని కొరకు దుఆ చేసుకోవచ్చు. మరియు తన తల్లిదండ్రుల కొరకో లేదా ఇతర ముస్లింల కొరకో దుఆ చేయడంలోనూ ఎలాంటి అభ్యంతరమూ లేదు – అది ఫర్జ్ నమాజు అయినా సరే, లేదా సున్నత్, నఫిల్ నమాజు అయినా సరే – ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు తషహ్హుద్ నేర్పిన తరువాత 'ఇక నీవు నీకు నచ్చిన దుఆ చేయి' అని ఆదేశించారని హదీథులో ఇబ్ను మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించినారు.

(ثُمَّ ‌لِيَتَخَيَّرْ ‌مِنَ ‌الدُّعَاءِ بَعْدُ أَعْجَبَهُ إِلَيْهِ فَيَدْعُو).

ఆ తరువాత తనకు అవసరం ఉన్న, తన మనసుకు నచ్చిన దుఆ చేసుకోవాలి15. మరోచోట ఇలా తెలుపబడింది:

(‌ثُمَّ ‌لِيَخْتَرْ ‌مِنْ ‌الْمَسْأَلَةِ ‌مَا ‌شَاءَ).

ఆ తరువాత, అతడు ఏ కోరిక అయినా కోరుకోవచ్చు..16

మరియు ఇది ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కోరుకునే అన్ని మంచి విషయాలకూ వర్తిస్తుంది. ఆ తర్వాత కుడి మరియు ఎడమ వైపులకు 'అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్' (మీపై అల్లాహ్ యొక్క శాంతి మరియు కృప కురుయు గాక) అని సలాము పలుకుతూ (దీనిని తస్లీమ్ అంటారు), నమాజు ముగించాలి.

14. ఒకవేళ ప్రార్థన (సలాత్) మూడు రకాత్లు (త్రిభుజాత్మక) కలిగినదైతే, ఉదాహరణకు మగ్రిబ్ లాగా, లేదా నాలుగు రకాత్లు (చతుర్భుజాత్మక) కలిగినదైతే, ఉదాహరణకు ఫజ్ర్, జుహర్, అస్ర్, ఇషా లాగా, అప్పుడు ముందు చెప్పిన తషహ్హుద్ (ఆఖరి కూర్చోవడం) మరియు నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ చదివాలి. తర్వాత, "అల్లాహు అక్బర్" అని చెప్పుతూ, మోకాళ్ళపై చేతులు వేసి, భుజాల లేదా చెవుల స్థాయికి చేతులను ఎత్తి, నిలబడాలి. అప్పుడు చేతులను ఛాతీపై (మునుపటి విధంగా) ఉంచుకోవాలి మరియు కేవలం సూరతుల్ ఫాతిహా మాత్రమే చదవాలి. అయితే, జుహర్, అస్ర్, ఇషా యొక్క మూడవ మరియు నాల్గవ రకాతులలో కొన్ని సార్లు సూరతుల్ ఫాతిహా తర్వాత అదనంగా ఏదైనా సూరా/ఆయత్ చదివినా ఎలాంటి అభ్యంతరమూ లేదు, ఎందుకంటే అబూ సయీద్ (రదియల్లాహు అన్హు) యొక్క హదీథు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా చేయడం గురించి నమోదు చేయబడి ఉన్నది. ఒకవేళ మొదటి తషహ్హుద్ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవకపోయినా ఎలాంటి అభ్యంతరమూ లేదు, ఎందుకంటే ఇది మొదటి తషహ్హుద్ లో సున్నత్ (ప్రోత్సహించబడినది) మాత్రమే, అంతేగాని ఫర్జ్ (తప్పనిసరి) కాదు. తర్వాత, మగ్రిబ్ యొక్క మూడవ రకాతు చివరలో లేదా జొహర్, అస్ర్, ఇషా యొక్క నాల్గవ రకాతు చివరలో, రెండు రకాతుల నమాజులో పఠించినట్లుగా తషహ్హుద్ పూర్తిగా పఠించాలి. ఆ తర్వాత, కుడి మరియు ఎడమ వైపులకు సలామ్ పలుకుతూ, నమాజు ముగించాలి. ఆ తర్వాత మూడు సార్లు "అస్తగ్ఫిరుల్లాహ్" (ఓ అల్లాహ్! నన్ను మన్నించు) అని పలికి, ఇలా దుఆ చేయాలి.

(اللَّهُمَّ أَنْتَ السَّلَامُ وَمِنْكَ السَّلَامُ، تَبَارَكْتَ يا ذَا الجَلَالِ وَالإِكْرَامِ).

అల్లాహుమ్మ అంతస్సలాము వ మిన్కస్సలాము, తబారక్త యా జల్-జలాలి వల్-ఇక్రామ్.

ఓ అల్లాహ్! నీవే శాంతివి, మరియు శాంతి నీ నుండియే లభిస్తుంది. ఓ మహిమాన్వితుడా, గౌరవానికి అర్హుడవైనవాడా, నీవే అత్యంత శుభకరుడవు.17 ఇమామ్ అయితే, ప్రజల వైపు తిరిగి వారి వద్ద నుండి వెళ్లిపోయే ముందు ఇలా పఠించాలి:

(لَا إلَهَ إلَّا الله وحْدَهُ لا شَرِيكَ لَه، لَهُ المُلْكُ، ولَهُ الحَمْدُ، وَهوَ عَلَى كُلِّ شيءٍ قَدِيرٌ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إلَّا بالله، اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أعْطَيْتَ، ولَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الجَدُّ، لَا إلَهَ إلَّا الله، وَلَا نَعْبُدُ إلَّا إيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الفَضْلُ، وَلَهُ الثَّنَاءُ الحَسَنُ، لَا إلَهَ إلَّا الله مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَو كَرِهَ الكَافِرُونَ).

((లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్!

లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతయ్'త, వ లా ముఅ్'తియ లిమా మనఅ్'త! వ లా యన్ఫఉ జల్ జద్ది మిన్కల్ జద్దు, లా ఇలాహ ఇల్లల్లాహు, వ లా నఅ'బుదు ఇల్లా ఇయ్యాహు! లహున్ నేమతు వ లహుల్ ఫద్లు, వ లహుథ్ థనాఉల్ హసన్! లా ఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్ దీన్, వ లౌ కరిహల్ కాఫిరూన్!))

అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఒకే ఒక్కడే, ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరు. ఆయనకే సార్వభౌమత్వం, ఆయనకే స్తుతి! ఆయన ప్రతిదానిపై సర్వశక్తిమంతుడు. (మానవునికి) పాపాల నుండి తప్పించుకునే శక్తి లేదు, సత్కార్యాలు చేసే శక్తి లేదు, అల్లాహ్ సహాయం ఉంటే తప్ప! ఓ అల్లాహ్! నీవు ఇచ్చే దానిని ఆపగలవారు ఎవ్వరూ లేరు, నీవు నిరాకరించిన దానిని ఇవ్వగలిగేవారు ఎవ్వరూ లేరు. బలవంతులలోకెల్లా అత్యంత బలవంతుడి శక్తి కూడా నీ (అనుజ్ఞ)కు వ్యతిరేకంగా అతనికి ఎలాంటిప్రయోజనమూ చేకూర్చజాలదు. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, మేము ఆయన్నే ఆరాధిస్తాము!

ఆయనే అనుగ్రహించేవాడు, ఆయనే మహిమాన్వితుడు, ఆయనకే మంచి స్తుతులన్నీను! అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు! మేము ఆయన్నే ఏకాగ్ర హృదయంతో ఆరాధిస్తాము, సత్యతిరస్కారులు ఎంతగా అసహ్యించుకున్నా సరే!،18

33 సార్లు 'సుబ్'హానల్లాహ్' (పరమ పవిత్రమైనవాడు అల్లాహ్) అనీ, 33 సార్లు 'అల్ హమ్దు లిల్లాహ్' (సకల ప్రశంసలు అల్లాహ్‌కే) అనీ, మరియు 33 సార్లు 'అల్లాహు అక్బర్' (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు) అనీ పలకాలి. వందను పూర్తి చేయడానికి ఇలా పలకాలి: 'లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వ హువ అలా కుల్లి షైయిన్ కదీర్!' (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన ఒకే ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేడు. ఆయనకే సార్వభౌమత్వం, ఆయనకే ప్రశంసలు! ఆయన ప్రతిదానిపై సర్వశక్తిమంతుడు.). మరియు ప్రతి నమాజు తరువాత ఆయతుల్ కుర్సీ, ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్, మరియు ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్ పఠించాలి. ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజుల తరువాత ఈ మూడు సూరాలను మూడు సార్లు పునరావృతం చేయడం శ్రేష్ఠమైనది; ఎందుకంటే దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి హదీసులు ఉల్లేఖించబడ్డాయి. ఈ జిక్ర్‌లన్నీ సున్నత్, ఫర్జ్ (విధి) కాదు.

సున్నత్ నమాజులు (అదనపు నమాజులు): ప్రతి ముస్లిం (పురుషుడైనా లేదా స్త్రీ అయినా) కొరకు ఈ క్రింది సున్నత్ నమాజులు చేయడం సిఫారసు చేయబడింది: జొహర్ (మధ్యాహ్నం) నమాజుకు ముందు: 4 రకాతులు (2+2), జొహర్ నమాజు తర్వాత: 2 రకాతులు, మగ్రిబ్ (సూర్యాస్తమయం) నమాజు తర్వాత: 2 రకాతులు, ఇషా (రాత్రి) నమాజు తర్వాత: 2 రకాతులు, ఫజ్ర్ (ఉదయం) నమాజుకు ముందు: 2 రకాతులు, మొత్తం: 12 రకాతులు (వీటిని "సునన్ అర్రవాతిబ్" అని అంటారు). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అదనపు నమాజులను ఎప్పుడూ విడిచిపెట్టేవారు కాదు. ప్రయాణ సమయంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ సున్నత్ మరియు విత్ర్ తప్ప ఇతర సున్నత్ నమాజులను వదిలివేసేవారు. నిశ్చయంగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నివాసంలో ఉన్నప్పుడు మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఈ రెండింటినీ ఎన్నడూ విడిచి పెట్టేవారు కాదు. ఈ సున్నత్ నమాజులను మరియు విత్ర్ నమాజును ఇంటిలో ఆచరించుట ఉత్తమం, ఒకవేళ వాటిని మస్జిద్ లో ఆచరిస్తే, అందులో తప్పు లేదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

(أفْضَلُ صَلَاةِ المَرْءِ في بَيْتِهِ، إلَّا الصَّلَاةَ المَكْتُوبَةَ).

ఒక వ్యక్తి నమాజులలో ఉత్తమమైనది (అదనపు సున్నత్, నఫిల్, విత్ర్ నమాజు) ఇంట్లో చేసేదే, అయితే తప్పనిసరి (ఫర్జ్) నమాజులు మాత్రం మస్జిదులో చేయాలి.19

ఈ నమాజులను (సున్నత్/నఫిల్) నిరంతరం చేయడం అనేది స్వర్గ ప్రవేశాన్ని ప్రసాదించే కారణాలలో ఒకటి అవుతుంది, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికారు:

(مَنْ صَلَّى اثْنَتَيْ عَشْرَةَ رَكْعَةً فِي يَومٍ وَلَيْلَةٍ، بُنِيَ لَه بِهِنَّ بَيْتٌ فِي الجَنَّةِ).

((ఎవరైతే రోజుకు 12 రకాతుల (సున్నతు) నమాజులు చేస్తారో, అతని కొరకు స్వర్గంలో ఒక భవనం నిర్మించబడుతుంది.))20

అస్ర్ (మధ్యాహ్నం) నమాజు కు ముందు 4 రకాతులు, మగ్రిబ్ (సాయంత్రం)నమాజుకు ముందు 2 రకాతులు, ఇషా (రాత్రి) సలాహ్ కు ముందు 2 రకాతులు అదనంగా నమాజు చేస్తే మంచిది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

(مَنْ ‌حَافَظَ ‌عَلَى ‌أَرْبَعِ ‌رَكَعَاتٍ ‌قَبْلَ ‌الظُّهْرِ، وَأَرْبَعٍ بَعْدَهَا حَرَّمَهُ اللَّهُ عَلَى النَّارِ).

ఎవరైతే జొహర్ (మధ్యాహ్నం) నమాజుకు ముందు 4 రకాతులు మరియు తర్వాత 4 రకాతులు నమాజు నిరంతరంగా చేస్తారో, అల్లాహ్ వారిపై నరకాన్ని నిషేధిస్తాడు.21 దీని అర్థం ఏమిటంటే, జొహర్ ఫర్జ్ నమాజు తరువాత మరో రెండు రకాతులు అదనంగా నమాజు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే జొహర్‌కు సంబంధించిన సునన్ అర్రవాతిబ్ సున్నతు నమాజులు ఫర్ద్ సలాహ్ కు ముందు నాలుగు రకాతులు మరియు తర్వాత రెండు రకాతులు. అయితే, జొహర్ ఫర్ద్ నమాజు తర్వాత (సునన్ అర్రవాతిబ్ యొక్క 2 రకాతులతో పాటు) ఇంకా రెండు రకాతులు అదనంగా నెరవేర్చితే — అంటే మొత్తం నాలుగు రకాతులు నమాజు — అప్పుడు ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించిన హదీథులోని ప్రతిఫలం లభించే అవకాశం ఉంది.

మరియు నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే సఫలతకు అధిపతి. అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైనా, ఆయన కుటుంబ సభ్యుల పైనా, సహాబాల పైనా మరియు ప్రళయదినం వరకు చిత్తశుద్ధితో ఆయనను అనుసరించే సజ్జనుల పైనా తన కృపా, కరుణా మరియు శాంతిని నిరంతరం వర్షింపజేయుగాక

 

 

***

 


దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (2)(224)

దీనిని బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (5782)

దీనిని బుఖారీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (744) మరియు ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (598).

దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (5)(399).

దీనిని బుఖారీ ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (6)(756)

దీనిని బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (817), మరియు ముస్లిం హదీథు సంఖ్య (484)

దీనిని బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (711) మరియు ముస్లిం హదీథు సంఖ్య (598)

దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు సంఖ్య (477)

దీనిని ముస్లిం ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (479)

దీనిని బుఖారీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (788) మరియు ముస్లిం హదీథు సంఖ్య (493)

దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (284), అబూ దావూద్ హదీథు సంఖ్య (850), ఇబ్నె మాజహ్ హదీథు సంఖ్య (898).

దీనిని బుఖారీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (797) మరియు ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (402)

దీనిని బుఖారీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (1311) మరియు ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (588).

దీనిని నసాయీ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (1298)

దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (402)

దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (591)

దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (402)

దీనిని బుఖారీ ఉల్లేఖించారు,, హదీథు సంఖ్య (6860)

దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీథు సంఖ్య (728)

దీనిని అహ్మద్ ఉల్లేఖించారు హదీథు సంఖ్య (25547), అత్తిర్మిథీ హదీథు సంఖ్య (393) మరియు అబూ దాఊద్ హదీథు సంఖ్య (1077).

సహీహ్ అల్-బుఖారీ, హదీథు సంఖ్య (605).