సరియైన విశ్వాసం (అఖీదహ్) మరియు దానికి విరుద్ధమైనవి (తెలుగు)

  • earth భాష
    (తెలుగు)
  • earth రచన:
    الشيخ عبد العزيز بن عبد الله بن باز
PHPWord

 

 

 

العَقِيدَةُ الصَّحِيْحَةُ وَمَا يُضَادُّهَا

 

సరియైన విశ్వాసం (అఖీదహ్) మరియు దానికి విరుద్ధమైనవి

 

 

لِسَمَاحَةِ الشَّيْخِ العَلَّامَةِ

عَبْدِ العَزِيزِ بْنِ عَبْدِ اللهِ بْنِ بَازٍ رَحِمَهُ اللهُ

 

 

రచన

అల్లామ షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్

 


بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ

అల్హమ్దులిల్లాహి వహహ్, వస్సలాతు వస్సలాం అలా న్ లా నబియ్య బఅదహ్, వఅలా ఆలిహి వసహాబిహి (అల్లాహ్ ఒక్కడికే సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు శోభిస్తాయి, ప్రవక్తలలో ఆయన తర్వాత మరెవ్వరూ లేని వానిపై (ప్రవక్త ముహమ్మద్ పై) దీవెనలు, శాంతి కురుయు గాక. మరియు ఆయన కుటుంబ సభ్యులు, సహచరులపై కూడా).

అమ్మా బాద్ (ఇక తరువాత): సరైన విశ్వాసము - ఇస్లాం ధర్మము యొక్క మూలాధారము మరియు ధర్మము యొక్క పునాది. అందువలన అంశముపై మాట్లాడటం, దానిని మరింతగా వివరించేందుకు మరియు స్పష్టపరిచేందుకు వ్రాయడం ముఖ్యమని నేను భావించాను.

ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారంగా షరీఅతులో స్పష్టంగా తెలుపబడినది ఏమిటంటే: ఆచరణలు మరియు వాక్కులు అనేవి పరిశుద్ధమైన అఖీదా పైన ఆధారపడి ఉన్నప్పుడే అవి సరైనవి అవుతాయి మరియు అల్లాహ్ దగ్గర అంగీకారమైనవిగా నిలుస్తాయి. కానీ అఖీదహ్ సరిగ్గా లేకపోతే, దాని ఆధారంగా చేసే ఆచరణలన్నీ మరియు మాటలన్నీ నిష్ఫలం (బాతిల్) అవుతాయి. దీని గురించి మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿...وَمَن يَكۡفُرۡ بِٱلۡإِيمَٰنِ فَقَدۡ حَبِطَ عَمَلُهُۥ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ﴾

ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థం అవుతాయి మరియు అతడు పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. [అల్ మాయిద 5:5]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَلَقَدۡ أُوحِيَ إِلَيۡكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبۡلِكَ لَئِنۡ أَشۡرَكۡتَ لَيَحۡبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ ٱلۡخَٰسِرِينَ 65﴾

మరియు వాస్తవానికి! నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుప బడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధనకు పాల్బడినట్లయితే (షిర్కు చేసినట్లయితే) నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు." [అజ్జుమర్ 39:65]

అర్ధంలో ఆయతులు చాలా ఉన్నాయి. అల్లాహ్యొక్క స్పష్టమైన గ్రంథము ఖుర్ఆన్మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సున్నతులు దీనినే సూచిస్తున్నాయి: పరిశుద్ధమైన అఖీదహ్ (విశ్వాసం) ఆరు విషయాల్లో సంక్షిప్తంగా ఉంది. అవి ఏమిటంటే: అల్లాహ్ను విశ్వసించడం, దైవదూతలను విశ్వసించడం, దైవగ్రంథాలను విశ్వసించడం, దైవప్రవక్తలను విశ్వసించడం, అంతిమదినాన్ని (ఖియామత్)ను విశ్వసించడం మరియు అల్లాహ్ నిర్ణయించిన మంచి - చెడుల విధివ్రాత (ఖద్ర్)ను విశ్వసించడం. ఆరు విషయాలే అల్లాహ్తాలా పంపిన పవిత్ర ఖుర్ఆన్లో అవతరించ బడిన మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పునాది పెట్టబడిన శుద్ధమైన అఖీదా (విశ్వాసం) యొక్క మౌలిక సూత్రాలు.

ఆరు మూలవిశ్వాస సూత్రాల పట్ల ఖుర్ఆన్మరియు సహీహ్సున్నతులలో స్పష్టమైన ఆధారాలు ఎక్కువగా వచ్చాయి. వాటిలో కొన్ని ఉదాహరణలు ఇవే:

మొదటిది: ఖుర్ఆన్ గ్రంథం నుండి ఆధారాలు; వాటిలో: అల్లాహ్ యొక్క వాక్యము ఉంది:

﴿لَّيۡسَ ٱلۡبِرَّ أَن تُوَلُّواْ وُجُوهَكُمۡ قِبَلَ ٱلۡمَشۡرِقِ وَٱلۡمَغۡرِبِ وَلَٰكِنَّ ٱلۡبِرَّ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَٱلۡمَلَٰٓئِكَةِ وَٱلۡكِتَٰبِ وَٱلنَّبِيِّـۧنَ...﴾

అల్ బిర్ర్ (వినయ విధేయత, ధర్మనిష్ఠాపరత్వం) అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో త్రిప్పుకోవడం కాదు; కాని అల్ బిర్ర్ (వినయ విధేయత, ధర్మనిష్ఠాపరత్వం) అంటే అల్లాహ్ను, అంతిమ దినాన్ని, దేవదూతలను, దివ్యగ్రంథాల్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం... [అల్ బఖరహ్ 2:177]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّن رُّسُلِهِ...﴾

ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి తనపై అవతరింప జేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. [అల్ బఖరహ్ 2:285]

మరియు పరమ పరిశుద్ధుడైన ఆయన వాక్కు:

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ ءَامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَٱلۡكِتَٰبِ ٱلَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِۦ وَٱلۡكِتَٰبِ ٱلَّذِيٓ أَنزَلَ مِن قَبۡلُۚ وَمَن يَكۡفُرۡ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ فَقَدۡ ضَلَّ ضَلَٰلَۢا بَعِيدًا 136﴾

విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింప జేసిన గ్రంథాన్ని మరియు ఆయనకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ను, ఆయన దూతలను ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమదినాన్ని తిరస్కరించినవాడు - వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వం లో చాలా దూరం పోయినట్లే! [అన్నిసా 4:136]

మరియు పరమ పరిశుద్ధుడైన ఆయన వాక్కు:

﴿أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ذَٰلِكَ فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ 70﴾

ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ బాగా ఎరుగునని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది. [అల్-హజ్ 22:70]

రెండవది: సున్నతు నుండి ఆధారాలు - వాటిలో ప్రసిద్ధ సహీహ్ హదీథును ఇమామ్ ముస్లిం రహిమహుల్లాహ్ యొక్క జామె సహీహ్లో అమీరుల్ మోమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ గురించి అడిగారు. ఆయనకు సమాధానమిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

«الإِيمَانُ أَنْ تُؤْمِنَ بِاللَّهِ، وَمَلَائِكَتِهِ، وَكُتُبِهِ، وَرُسُلِهِ، وَاليَوْمِ الآخِرِ، وَتُؤْمِنَ بِالقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ».

ఈమాన్ (దైవవిశ్వాసము) అంటే నీవు అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంథములపై, ఆయన ప్రవక్తలపై మరియు అంతిమదినంపై విశ్వాసము చూపుట మరియు నీవు విధివ్రాత పై, దాని మంచి - చెడులపై విశ్వాసము చూపుట1. మరియు హదీథును ఇమామ్ బుఖారీ మరియు ఇమామ్ ముస్లిం రహిమహుమల్లాహ్ - స్వల్ప వ్యత్యాసంతో - అబూహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి కూడా నమోదు చేసినారు.

ఆరు మూలవిశ్వాసాల నుండి: మహోన్నతుడైన అల్లాహ్ విషయంలో, పునరుత్థానం విషయంలో మరియు అగోచర విషయలో ఒక ముస్లిం తప్పకుండా విశ్వసించవలసిన ప్రతిదీ ఉద్భవిస్తుంది - వేటి గురించి అయితే మహోన్నతుడైన అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినారో.

ఆరు అసలు మూలాల వివరణ ఇలా ఉంది:

మొదటి మూలవిశ్వాసము: మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసము:

ఇది అనేక విషయాలను కలిగి ఉంది, వాటిలో కొన్ని: అల్లాహ్ యే నిజ ఆరాధ్య దైవమని, ఇతరులు కాకుండా ఆయనే ఆరాధనకు హక్కుదారుడని విశ్వసించటం; ఎందుకంటే ఆయనే దాసులను సృష్టించి వారిపై ఉపకారము చేసినవాడు, వారికి ఆహారోపాధిని కలిగించే వాడు, వారి రహస్యాలు, వారి బాహ్య కార్యాలు తెలిసినవాడు. మరియు వారిలో నుండి విధేయత చూపే వారికి ప్రతిఫలం ప్రసాదించటంపై మరియు వారిలో నుండి అవిధేయత చూపిన వారిని శిక్షించటంపై సామర్ధ్యం గలవాడు.

అల్లాహ్ జిన్నులను మరియు మానవులను తన ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాడు. మరియు ఆయన దాని గురించి వారిని స్పష్టంగా ఆదేశించినాడు. అల్లాహ్ ప్రకటన:

﴿وَمَا خَلَقۡتُ ٱلۡجِنَّ وَٱلۡإِنسَ إِلَّا لِيَعۡبُدُونِ 56 مَآ أُرِيدُ مِنۡهُم مِّن رِّزۡقٖ وَمَآ أُرِيدُ أَن يُطۡعِمُونِ 57 إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلۡقُوَّةِ ٱلۡمَتِينُ 58﴾

మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించుట కొరకే! నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు. నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, ఎంతో స్థైర్యం గలవాడు. [అద్ దారియాత్ 51: 56-58]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعۡبُدُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ 21 ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ فِرَٰشٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزۡقٗا لَّكُمۡۖ فَلَا تَجۡعَلُواْ لِلَّهِ أَندَادٗا وَأَنتُمۡ تَعۡلَمُونَ 22﴾

మానవులారా! మిమ్మల్నీ మరియు మీకు పూర్వం వారినీ సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు! ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పాన్పుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి. [అల్ బఖరహ్ 2: 21-22]

సత్యమును బోధించటానికి మరియు దాని వైపు పిలవటానికి మరియు దానికి వ్యతిరేకంగా ఉన్న వాటి నుండి హెచ్చరించటానికి అల్లాహ్ ప్రవక్తలను పంపించాడు. మరియు గ్రంథములను అవతరింపజేశాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَ...﴾

మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతను ప్రజలతో ఇలా అన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు మిథ్యా దైవాల (తాగూత్) ఆరాధన త్యజించండి [అన్నహల్: 16:36]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِيٓ إِلَيۡهِ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعۡبُدُونِ25﴾

మరియు మేము, నీకు పూర్వం ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." (అనే సందేశం ఇచ్చి పంపినాము) [అల్-అంబియా 21:25]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿الر كِتَابٌ أُحْكِمَتْ آيَاتُهُ ثُمَّ فُصِّلَتْ مِنْ لَدُنْ حَكِيمٍ خَبِيرٍ1 أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ إِنَّنِي لَكُمْ مِنْهُ نَذِيرٌ وَبَشِيرٌ2﴾

అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథము. దీని ఆయతులు (వచనాలు) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరఫు నుండి వివరించబడినాయి; మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని ( ముహమ్మద్) ఇలా అను: "నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే! [హూద్ 11:1-2]

ఆరాధన యొక్క వాస్తవికత ఏమిటంటే దాసులు చేసే ఆరాధనలైన దుఆ (ప్రార్థన), భయము, ఆశ, నమాజు, ఉపవాసము, జిబహ్ (ఖుర్బానీ) చేయటం, మొక్కుబడులు మరియు ఇతర ఆరాధనలు ఏవైతే ఆయనపై వినయంతో, ఆయన నుండి లభించే ప్రతిఫలంపై ఆశతో, ఆయన విధించే శిక్షపై భయంతో, ఆయనంటే పూర్తి ఇష్టంతో, ఆయన ఔన్నత్యం ముందు తలవంచుతూ చేసేవి ఉన్నాయో, అవన్నీ కేవలం అల్లాహ్ ఒక్కనికి మాత్రమే చేయటం.

పవిత్ర ఖుర్ఆన్ ను లోతుగా పరిశీలించినప్పుడు, దాని ఎక్కువ భాగం మహత్తర మూలంపై అవతరింపబడినదని కనుగొంటారు; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ فَٱعۡبُدِ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَهُ الدِّينَ 2 أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ3﴾

( ముహమ్మద్!) నిశ్చయంగా మేము గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో! వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లు గా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్య వాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు. [అజ్ జుమర్ 39:2-3]

మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:

﴿وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعۡبُدُوٓاْ إِلَّآ إِيَّاهُ...﴾

మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించ కూడదనీ...(ప్రకటించినాడు) [అల్ ఇస్రా 17:23]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ వాక్కు:

﴿فَٱدۡعُواْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ وَلَوۡ كَرِهَ ٱلۡكَٰفِرُونَ14﴾

కావున ( విశ్వాసులారా!) మీరు మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయనకే (అల్లాహ్ కే) ప్రత్యేకించుకొని, కేవలం అల్లాహ్ ను మాత్రమే ప్రార్థించండి. సత్యతిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైనా సరే! [గాఫిర్ 40:14]

అదేవిధంగా, ప్రవక్త సున్నతును (బోధనలను) ఎవరైతే లోతుగా పరిశీలిస్తారో, వారు గొప్ప మూలవిశ్వాసానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడినదో కనుగొంటారు. ఉదాహరణ: సహీహైన్లో (బుఖారీ, ముస్లింలో) ముఆద్ (రదియల్లాహు అన్హు) నుండి ఉల్లేఖించబడిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:

«حَقُّ اللهِ عَلَى العِبَادِ أَن يَعْبُدُوهُ وَلَا يُشْرِكُوا بِهِ شَيْئًا».

«దాసులపై అల్లాహ్ హక్కు ఏమిటంటే వారు ఆయననే ఆరాధించాలి మరియు ఆయనకు సాటికల్పించకూడదు.2»

అల్లాహ్ పై విశ్వాసం చూపటంలో ఇది కూడా ఉన్నది: ఆయన తన దాసులపై తప్పనిసరి చేసిన, వారిపై విధిగావించిన ఇస్లాం యొక్క ఐదు ప్రత్యక్షమైన మూల స్థంభాలన్నిటిన విశ్వసించటం.

ఇవి: అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు లేడు అని మరియు నిస్సందేహంగా ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు' అని సాక్ష్యం ఇవ్వడం, నమాజు స్థాపించడం, జకాతు చెల్లించడం, రమదాను ఉపవాసాలు ఉండటం, తగిన స్థోమత ఉంటే' అల్లాహ్ గృహం [కాబతుల్లాహ్] హజ్జ్ చేయడం మరియు పరిశుద్ధమైన షరీఅతు విధానంలో ఆదేశించబడిన ఇతర విధులు.

మూలస్థంభాలలో అతిముఖ్యమైన మరియు గొప్పదైనది: అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవ్వడూ లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం పలకటం. సాక్ష్యం అల్లాహ్ ఒక్కడికే ఆరాధనను ప్రత్యేకించటం మరియు ఆయన కాకుండా ఇతరులను నిరాకరించటం అవసరమని సూచిస్తుంది. ఇది 'లా ఇలాహ ఇల్లల్లాహ్' యొక్క అర్థము. దీని అర్థం - పండితులు (రహిమహుముల్లాహ్) చెప్పినట్లుగా - అల్లాహ్ తప్ప నిజఆరాధ్యులు ఎవ్వరూ లేర. అందువలన అల్లాహ్ కాకుండా ఆరాధించబడే మానవులు లేదా దైవదూతలు లేదా జిన్నులు లేదా వేరేవన్నీ అసత్య దైవాలు. కాబట్టి, వాస్తవ ఆరాధ్యదైవం అల్లాహ్ ఒక్కడే, ఆయనకు ఎవ్వర సాటి లేరు, దీని గురించి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّ مَا يَدۡعُونَ مِن دُونِهِۦ هُوَ ٱلۡبَٰطِلُ...﴾

ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! కేవలం ఆయన మాత్రమే సత్యం! మరియు ఆయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! [హజ్ 22:62]

ఇంతకు ముందు ప్రస్తావించబడినట్లు, పరమ పవిత్రుడైన అల్లాహ్ జిన్నులు మరియు మానవులను ప్రధానమైన మూల సూత్రం కోసమే సృష్టించాడు, దానిని పాటించమని వారికి ఆజ్ఞాపించాడు, దాని కోసమే తన ప్రవక్తలను పంపాడు, తన గ్రంథాలను అవతరింపజేశాడు. అందువలన దాసుడు (మనిషి) దీని గురించి బాగా ఆలోచించాలి, లోతుగా పరిశీలించాలిఅప్పుడే అతనికి ఎక్కువ మంది ప్రాథమిక సూత్రం గురించి ఎంత పెద్ద అజ్ఞానంలో ఉన్నారో స్పష్టమవుతుంది; వారు అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించారు, అల్లాహ్కి మాత్రమే చెందవలసిన హక్కులను ఇతరులకు సమర్పించారు. నిజానికి, కేవలం అల్లాహ్ మాత్రమే సహాయం చేయగలవాడు.

పరమ పవిత్రుడైన అల్లాహ్ మీద విశ్వాసంలో భాగంగాఆయనే సర్వలోక సృష్టికర్త, వాటి వ్యవహారాలను నియంత్రించే వాడు, తన జ్ఞానం మరియు శక్తి ప్రకారం వాటిని పాలించేవాడు అని నమ్మడం ఎంతో అవసరం. ఆయనే లోకిి మరియు పరలోకానిి యజమాని, సమస్త లోకాల ప్రభువు. ఆయన తప్ప వేరే సృష్టికర్త లేడు, ఆయన తప్ప వేరే ప్రభువు లేడు. మరియు ఆయన దాసుల ప్రయోజనం కొరకు మరియు వారిని ఇహపరాలలో వారికి ప్రయోజనం, ముక్తి ఉన్న వాటి వైపు మార్గదర్శక చేసేందుకు తన ప్రవక్తలను పంపించాడు మరియు తన గ్రంథలను అవతరింపజేశాడు. మరియు ఆయన పరమ పరిశుద్ధుడు వీటన్నిటిలో ఆయనకు ఎవ్వరు సాటి లేరు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٞ 62﴾

అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి నిర్వాహణ కర్త. [అజ్ జుమర్ 39:62]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يُغۡشِي ٱلَّيۡلَ ٱلنَّهَارَ يَطۡلُبُهُۥ حَثِيثٗا وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتِۭ بِأَمۡرِهِۦٓۗ أَلَا لَهُ ٱلۡخَلۡقُ وَٱلۡأَمۡرُۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ54﴾

నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. పిదప తన సింహాసనాన్ని (అర్ష్) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టు బడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు! [అల్ ఆరాఫ్ 7:54]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటంలో ఇది కూడా ఉంది: ఆయన దివ్యగ్రంథంలో ప్రస్తావించబడిన మరియు ఆయన ప్రవక్త నుండి నిరూపించబడిన ఆయన మంచి నామములు మరియు ఉన్నత గుణములను, ఎలాంటి వక్రీకరణ (తహ్రీఫ్) లేకుండా, నిరాకరించకుండా (తఆతీల్), స్వరూపం మార్చకుండా (తకీఫ్), వేటితోనూ పోల్చకుండా (తమ్సీల్) ఉన్నది ఉన్నట్లుగా విశ్వసించటం.

﴿...لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ﴾

ఆయనను పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. [అష్'షూరా 42:11]

అందువల, గుణగుణాలను అవి ఎలా వచ్చాయో అలాగే స్వీకరించాలి - వాటి విధానం (ఎలా అన్నది) గురించి ప్రశ్నించకూడదు. అవి సూచించే గౌరవనీయమైన అర్ధాలను - మహోన్నతుడైన అల్లాహ్ యొక్క గుణగుణాలు అని నమ్మాలి మరియు ఆయనకు తగిన విధంగా వాటిని ఆయనకు ఆపాదించాలి. అయితే ఆయన గుణాలలో విషయంలోనూ ఆయన సృష్టితో పోలిక ఉండదని నిశ్చయంగా నమ్మాలి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు:

﴿فَلَا تَضۡرِبُواْ لِلَّهِ ٱلۡأَمۡثَالَۚ إِنَّ ٱللَّهَ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ74﴾

కావున అల్లాహ్ కు పోలికలు కల్పించకండి. నిశ్చయంగా, అల్లాహ్ కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు. [అన్నహల్ 16:74]

ఇదే అల్లాహ్ యొక్క నామములు మరియు గుణగుణముల విషయంలో అహ్లుస్సున్నహ్ వల్ జమఅత [అల్లాహ్ ప్రవక్తయొక్క సహాబీలు మరియు వారిని మంచిగా అనుసరించినవారి (తాబయీనా)] యొక్క విశ్వాసం. విశ్వాసాన్ని ఇమామ్ అబూ హసన్ అల్ - అష్అరీ రహిమహుల్లాహ్ తన "అల్-మఖాలాత్" అనే పుస్తకంలో అహ్లుహదీథ్ మరియు అహ్లుస్సున్నహ్ నుండి పేర్కొన్నారు. అలాగే ఇతర జ్ఞానవంతులు మరియు విశ్వాసులు కూడా విశ్వాసాన్ని ప్రస్తావించారు.

ఇమామ్ అవ్'జాయీ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు: అజ్-జుహరీ మరియు మక్-హూల్ (రహిమహుమల్లాహ్ ) తో అల్లాహ్ యొక్క గుణగుణాల గురించి వచ్చిన ఆయతుల గురించి అడినప్పుడు, వారిద్దరు "అవి ఎలా వచ్చినవో అలాగే అర్ధం చేసుకోండి" అని అన్నారు3.

ఇమామ్ అవ్జాయీ రహిమహుల్లాహ్ ఇలా కూడా పలికారు: మేము మరియు తాబియీనులలో నుండి ఒక పెద్ద వర్గం పరమ పవిత్రుడైన అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడని పలికే వారము మరియు అల్లాహ్ గుణాల గురించి సున్నతులో వచ్చిన దానిని విశ్వసించేవారము.4

మరియు అల్ వలీద్ బిన్ ముస్లిం రహిమహుల్లాహ్ ఇలా పలికారు: ఇమామ్ మాలిక్, ఇమామ్ అవ్-జాయీ, ఇమామ్ లైథ్ ఇబ్నె సఅద్ మరియు ఇమామ్ సుఫ్యాన్ థౌరీ రహిమహుముల్లాహ్ తో అల్లాహ్ గుణగుణాల గురించి వచ్చిన హదీథుల గురించి అడిగితే వారందరు అవి ఎలా వచ్చినవో అలాగే వాటిని విధమైన వర్ణనలు చేయకుండా స్వీకరించండి అని అన్నారు5.

ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ గురువు అయిన రబీఅహ్ బిన్ అబీ అబ్దుర్రహ్మాన్ రహ్మతుల్లాహి అలైహితో 'ఇస్తవా' గురించి అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానము ఇచ్చారు: 'ఇస్తివా' అన్నది తెలియని విషయం కాదు. దాని వర్ణన అర్ధం చేసుకోవడం సాధ్యం కాని విషయం. సందేశాలు అల్లాహ్ వద్ద నుంచి వస్తాయి. సందేశాలను స్పష్టంగా చేర వేయటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాధ్యత మరియు వాటిని నమ్మటం మన బాధ్యత.6 మరియు ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ తో దాని గురించి అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు: 'ఇస్తివా' అన్నది తెలిసిన విషయం. మరియు దాని వర్ణన తెలియని విషయం. దానిని విశ్వసించటం తప్పనిసరి. దాని గురించి ప్రశ్నించటం బిదఅతు అగును. తరువాత ప్రశ్నించిన వ్యక్తిని ఉద్దేశించి నేను నిన్ను చెడ్డ వ్యక్తిగా భావిస్తున్నాను అని అన్నారు. మరియు అతనిని గెంటివేయమఅని ఆదేశించారు.'7 మరియు ఇదే అర్థములో ఉమ్ముల్ మూమినీన్ ఉమ్మె సల్మా రదియల్లాహు అన్హా యొక్క ఉల్లేఖన కూడా గలదు8.

ఇమామ్ అబూ అబ్దుర్-రహ్మాన్ ఇబ్నుల్-ముబారక్ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు: ' పరమ పవిత్రుడైన మన ప్రభువు తన సృష్టి నుండి వేరుగా తన ఆకాశములపై తన సింహాసనముపై ఉన్నాడని మాకు తెలుసు'9.

విభాగంలో ఇమామ మాటలు చాలా ఉన్నాయి. ఇక్కడ వాటిన్నింటినీ తెలియపరచటం అసాధ్యము. ఎవరైన వీటిలో నుండి దేని గురించి అయినా తెలుసుకోదలచితే వారు విభాగంలో హదీథు ఉలమాలు వ్రాసిన పుస్తకముల వైపు మరలాలి. ఉదాహరణకు: అబ్దుల్లాహ్ ఇబ్నె ఇమామ్ అహ్మద్ పుస్తకం 'అస్సున్నహ్', ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె ఖుజైమా పుస్తకం 'అత్తౌహీద్', అబుల్ ఖాసిమ్ అల్ లాల్కాయీ అత్తబరి పుస్తకం 'అస్సున్నహ్', అబూబకర్ ఇబ్నె అబీ ఆసిమ్ యొక్క పుస్తకం 'అస్సున్నహ్' మరియు హమాత్ వాసులకు షేఖుల్ ఇస్లామ్ ఇబ్నె తైమియ జవాబు మరియు అది చాలా ప్రయోజనాలు గల గొప్ప జవాబు. అందులో ఆయన రహిమహుల్లాహ్ అహ్లుస్సున్నహ్ విశ్వాసమును స్పష్టం చేసినారు మరియు ఆయన అందులో వారి చాలా మాటలను మరియు అహ్లుస్సున్నహ్ పలికిన మాటలను సత్యపరచే మరియు విభేదించే వారి మాటలను అసత్యపరచే ధార్మిక, బౌద్ధిక ఆధారాలతో సహా తెలియపరచారు.

మరియు ఇలాగే తద్మూరియ పేరు గల ఆయన పత్రికలో ఆయన అహ్లుస్సున్నహ్ విశ్వాసాన్ని ఖుర్ఆన్, హదీథుల, బౌద్ధిక ఆధారాలతో తెలిపినారు మరియు వాటిని విభేదించే వారిని ఎలా ఖండించారంటే ఒక జ్ఞానవంతుడు మంచి ఉద్దేశతో, సత్యాన్ని తెలుసుకోవాలి అనే కోరికతో అందులో చూస్తే అతనికి సత్య స్పష్టమవుతుంది మరియు అసత్య తొలిగిపోతుంది. ఇక అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వారి అల్లాహ్ నామముల మరియు గుణగణాల విభాగంలో విశ్వాసము; వారు పరమ పవిత్రుడైన అల్లాహ్ తన గ్రంథంలో తన స్వయం కొరకు నిరూపించుకున్న వాటిని మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సున్నతులో ఆయన కొరకు నిరూపించిన వాటిని ఎటువంటి పోలిక లేకుండా అల్లాహ్ కొరకు నిరూపించే వారు మరియు ఆయన సుబ్హానహు వతఆలాను ఆయన సృష్టి పోలిక నుండి పరిశుద్ధపరిచేవారు. వారు వైరుధ్యనుండి భద్రంగా ఉండి సాఫల్యం పొందారు. మరియు వారు ప్రామాణిక ఋజువులన్నింటితో ఆచరించారు; దీనికి కారణం అల్లాహ్ యొక్క తౌఫీఖ్ (మార్గదర్శకత్వం). ఎందుకంటే, తన ప్రవక్తల ద్వారా పంపబడిన సత్యానికి ఎవరు కట్టుబడి ఉంటారో, దాని కోసం తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తారో మరియు దాని అన్వేషణలో అల్లాహ్ పట్ల, చిత్తశుద్ధితో నిష్కల్మషంగా ఉంటారో, అలాంటి వారిని సత్యం వైపు మార్గనిర్దేశం చేయడం మరియు వారి వాదనను స్పష్టంగా నిలబెట్టడం అల్లాహ్ సున్నత్ (నియమం), పరమ పవిత్రుడైన అల్లాహ్ ప్రకటన:

﴿بَلۡ نَقۡذِفُ بِٱلۡحَقِّ عَلَى ٱلۡبَٰطِلِ فَيَدۡمَغُهُۥ فَإِذَا هُوَ زَاهِقٞ...﴾

అలా కాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగుల గొడుతుంది, అప్పుడు అది (అసత్యం) నశించి పోతుంది... [అల్-అంబియా 21:18]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿وَلَا يَأۡتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئۡنَٰكَ بِٱلۡحَقِّ وَأَحۡسَنَ تَفۡسِيرًا33﴾

మరియు వారు నీ వద్దకు (నిన్ను వ్యతిరేకించటానికి) ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా! మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము. [అల్ ఫుర్'ఖాన్ 25:33]

అహ్లె సున్నతు వారు విశ్వసించిన అల్లాహ్ యొక్క నామాలు, గుణగుణాల విషయంలో వారితో విభేదించే వ్యక్తి, నిస్సందేహంగా, వాస్తవిక మరియు తార్కిక ప్రమాణాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అతను ఏమి ధృవీకరిస్తాడో, ఏమి తిరస్కరిస్తాడో అన్నింటిలోనూ స్పష్టమైన పరస్పర విరుద్ధతలు, భిన్నత్వాలు కనిపిస్తాయి. తన సుప్రసిద్ధ తఫ్సీర్ గ్రంథంలో, హాఫిజ్ ఇబ్ను కథీర్ (రహిమహుల్లాహ్) విషయంపై చాలా మంచి వివరణను ఇచ్చారు. మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్కును వివరిస్తూ ఆయన ఇలా పలికారు:

﴿إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِ...﴾

నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు రోజులలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు... [అల్-ఆరాఫ్ 7:54]

ఇక్కడ దీనిని ఉటంకించడం సముచితం, ఎందుకంటే ఇందులో గొప్ప ప్రయోజనం ఉంది. కాబట్టి ఇబ్న్ కథీర్ (రహిమహుల్లాహ్) ఇలా పేర్కొన్నారు:

విషయంలో ప్రజలు వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కానీ వాటన్నింటినీ వివరించడానికి ఇది సమయం కాదు. మేము ఇక్కడ సలఫె సాలిహీన్ (పుణ్యాత్ములైన పూర్వీకులు) అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తాము - అదే ఇమామ్ మాలిక్, ఇమామ్ ఔజాయి, ఇమామ్ థౌరీ, ఇమామ్ లైస్ బిన్ సఅద్, ఇమామ్ షాఫిఈ, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్, ఇమామ్ ఇస్హాక్ బిన్ రాహువైహ్ మరియు ఇతర ముస్లిం పండితులు (ప్రాచీన మరియు ఆధునిక కాలంలో) అనుసరించిన మార్గం. అదేమిటంటే: వాక్యాలను (అల్లాహ్ గుణగణాల గురించిన వాక్యాలను) వాటి వాస్తవ రూపంలో మాత్రమే అంగీకరించడం. అయితే, వాటికి ఏమీ చేర్చకుండా, దేనితోనూ పోల్చకుండా లేదా వాటిని నిరాకరించకుండా ఉండ. ముషబ్బిహా (పోలిక కల్పించేవారి) మనస్సుల్లో అల్లాహ్ కు సంబంధించి కలిగే స్పష్టమైన అర్థాలు నిరాకరించ బడ్డాయి. నిశ్చయంగా, అల్లాహ్ తన సృష్టిలో దేనినీ పోలి లేడు.

﴿...لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ﴾

ఆయనకు పోలింది ఏదీ లేదు మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. [అష్'షూరా 42:11]

విషయం ఇమాములు చెప్పినట్లుగానే ఉంది. వారిలో ఒకరైన బుఖారీ (రహిమహుల్లాహ్) గురువు నుఐమ్ బిన్ హమ్మాద్ అల్-ఖుజాయి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: 'ఎవరైతే అల్లాహ్ ను ఆయన సృష్టితో పోల్చుతాడో అతడు కాఫిర్ (సత్యతిరస్కారి) అయ్యాడు మరియు ఎవరైతే అల్లాహ్ తన గురించి వర్ణించిన దానిని తిరస్కరిస్తాడో అతనూ కాఫిర్ (సత్యతిరస్కారి) అయ్యాడు.'10 అల్లాహ్ స్వయంగా తన గురించి వివరించిన లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి వివరించిన వాటిని దేనితోనూ పోల్చకూడదు (ఉపమానం లేదు). కాబట్టి, ఎవరైతే స్పష్టమైన ఆయతులు మరియు ప్రామాణికమైన హదీథుల ద్వారా వివరించబడిన అల్లాహ్ యొక్క గుణగుణాలను ఆయన మహిమకు తగిన విధంగా ధృవీకరించి, (అజ్ఞానులు) అల్లాహ్ కొరకు ఆపాదిస్తున్న అన్ని లోపాలను తిరస్కరిస్తారో, నిశ్చయంగా అలాంటి వారు సన్మార్గాన్ని అనుసరించారు. ఇబ్న్ కథీర్ రహిమహుల్లాహ్ వివరణ ఇక్కడ ముగిసింది.11

అల్లాహ్ పై ఈమాన్ (విశ్వాసం) అంటే మాటలతో, ఆచరణలతో కూడినదని, అది అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం వలన పెరుగుతుందని, అల్లాహ్ కు అవిధేయత చూపడం వలన తగ్గుతుందని నమ్మడం కూడా శ్రేణికే చెందుతుంది. అలాగే, షిర్క్ (అల్లాహ్ తో భాగస్వామ్యం కల్పించడం) లేదా కుఫ్ర్ (అవిశ్వాసం) కంటే తక్కువ స్థాయి పాపాలైన వ్యభిచారం, దొంగతనం, వడ్డీ లావాదేవీలు, మద్యపానం, తల్లిదండ్రులకు అవిధేయత మొదలైన మహాపాపాలకు పాల్బడటం వలన ఒక ముస్లింను కాఫిర్ (అవిశ్వాసి) అని పిలవడం సరికాదు - అతను పాపాలను హలాల్ (అనుమతించబడినవి) అని భావించ నంత వరకు. దీనికి ప్రమాణం మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:

﴿إِنَّ ٱللَّهَ لَا يَغۡفِرُ أَن يُشۡرَكَ بِهِۦ وَيَغۡفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ...﴾

నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని ( పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు... [అన్'నిసా 4:48]

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనేక హదీథుల ద్వారా కూడా నిరూపితమైనది, అందులో ఒకటి: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

«إِنَّ اللهَ يُخْرِجُ مِنَ النَّارِ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ حَبَّةٍ مِنْ خَرْدَلٍ مِنْ إِيْمَانٍ».

ఎవరి హృదయంలోనైనా ఆవగింజంత విశ్వాసమున్నా అల్లాహ్ అతడిని నరకం నుండి వెలికి తీస్తాడు.12

రెండవ మూలము: దైవదూతలపై ిశ్వాసము.

ఇది రెండు విషయాల కలిగి ఉంది: మొదటిది: దైవదూతల పట్ల సమగ్ర విశ్వాసం కలిగి ఉండటం. అంటే, అల్లాహ్తాను ఆజ్ఞాపించిన పనులు చేసేందుకు దైవదూతలను సృష్టించాడని మనం నమ్మాలి మరియు ఆయన వారిని ఇలా వర్ణించాడు:

﴿وَقَالُواْ ٱتَّخَذَ ٱلرَّحۡمَٰنُ وَلَدٗاۗ سُبۡحَٰنَهُۥۚ بَلۡ عِبَادٞ مُّكۡرَمُونَ 26 لَا يَسۡبِقُونَهُۥ بِٱلۡقَوۡلِ وَهُم بِأَمۡرِهِۦ يَعۡمَلُونَ27 يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡ وَلَا يَشۡفَعُونَ إِلَّا لِمَنِ ٱرۡتَضَىٰ وَهُم مِّنۡ خَشۡيَتِهِۦ مُشۡفِقُونَ28﴾

వారంటున్నారు: "అనంత కరుణామయునికి సంతానము ఉంది!" అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే! వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు. వారి ముందు ఉన్నదంతా ప్రత్యక్షంగా ఆయనకు తెలుసు. వారు, ఆయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు. వారు, ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు. [అల్-అంబియా 21:26-28]

మరియు వారు (దేవదూతలు) అనేక రకాలు: వారిలో కొందరు అర్షును (సింహాసనాన్ని) మోయడానికి నియమించ బడినవారు, మరికొందరు స్వర్గం మరియు నరకం యొక్క కాపలాదారులు, మరికొందరు దాసుల కర్మలను నమోదు చేసే బాధ్యత వహించేవారు ఉన్నారు. రెండవది: వివరణాత్మకంగా దైవదూతలపై విశ్వాసం కలిగి ఉండటం. దీని అర్థం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మనకు తెలిపి దైవదూతల పేర్లను విశ్వసించడం. ఉదాహరణకు: జిబ్రయీల్ (అలైహిస్సలాం) - వహీ (దైవసందేశం) తీసుకురావడానికి నియమించబడిన దైవదూత; మీకాయీల్ - వర్షానికి బాధ్యత వహించే దైవదూత; మాలిక్ - నరకానికి కాపలాదారుడు; ఇస్రాఫీల్ - సూర్ (శంఖం) ఊదడానికి నియమించబడిన దైవదూత. సహీహ్ (ప్రామాణిక) హదీథులలో కూడా వారి ప్రస్తావన వచ్చింది. వాటిలో, ఆయిషా రదియల్లాహు అన్హా నుండి ఉల్లేఖించబడిన ఒక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

«خُلِقَتِ الـمَلَائِكَةُ مِن نُورٍ، وَخُلِقَ الجَانُّ مِنْ مَارِجٍ مِنْ نَارٍ، وَخُلِقَ آدَمُ مِمَّا وُصِفَ لَكُم».

దైవదూతలు నూర్ (కాంతి) నుండి సృష్టించబడినారు, జిన్నులు మండే అగ్ని నుండి సృష్టించబడినారు, మరియు ఆదమ్ (అలైహిస్సలాం) మీకు వివరించిన దానితో (మట్టితో) సృష్టించబడినారు.13 సహీహ్ ముస్లిం.

మూడవ మూలము: దైవగ్రంములను విశ్వసించడము

ఇది కూడా రెండు విషయములను కలిగి ఉన్నది: మొదటిది: దైవగ్రంథాలను విశ్వసించడ; నిశ్చయంగా అల్లాహ్ సత్యాన్ని, ధర్మాన్ని వివరించడానికి, దాని ప్రచారం చేసేందుకు తన ప్రవక్తలపై, సందేశహరులపై దైవగ్రంథాలను అవతరింప చేసినాడు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلۡقِسۡطِ...﴾

వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచలు ఇచ్చి పంపాము. మరియు వారితో బాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగటానికి త్రాసును కూడా పంపాము... [అల్ హదీద్ 57:25] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿كَانَ ٱلنَّاسُ أُمَّةٗ وَٰحِدَةٗ فَبَعَثَ ٱللَّهُ ٱلنَّبِيِّـۧنَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِيَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ فِيمَا ٱخۡتَلَفُواْ فِيهِ...﴾

పూర్వం, మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అప్పుడు అల్లాహ్ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు. మరియు మానవులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి, ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవతరింపజేశాడు... [అల్ బఖరహ్ 2:213]

రెండవది: దివ్యగ్రంథాలపై సంపూర్ణ విశ్వాసం; అంటే అల్లాహ్ పేర్లు తెలిపిన వాటిని విశ్వసించటం, ఉదాహరణకు తౌరాత్, ఇంజీల్, జబూర్ మరియు ఖుర్ఆన్. ఖుర్ఆన్ వాటిలో ఉన్నతమైనది, చిట్టచివరిది, వాటిపై పర్యవేక్షకునిగా ఉన్నది మరియు వాటిని ధృవీకరిస్తుంది. దానిని అనుసరించడం మరియు తీర్పులివ్వడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన సహీహ్ హదీథులకు అనుగుణంగా మొత్తం సమాజం(ఉమ్మత్) పై తప్పనిసరి; ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మానవులు, జిన్నాతులందరి వద్దకు తన ప్రవక్తగా పంపించాడు మరియు దాని ద్వారా ఆయన తీర్పులివ్వటం కొరకు ఆయనపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాడు. దానిని హృదయములలో ఉన్న వాటిని నయం చేసేదిగా, ప్రతీ దానినీ విశదపరచేదిగా, విశ్వాసపరుల కొరకు మార్గదర్శకంగా, కారుణ్యంగా చేశాడు. అల్లాహ్ ప్రకటన:

﴿وَهَٰذَا كِتَٰبٌ أَنزَلۡنَٰهُ مُبَارَكٞ فَٱتَّبِعُوهُ وَٱتَّقُواْ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ155﴾

మరియు ఇదే విధంగా శుభప్రదమైన గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింప జేశాము. కావున దీనిని అనుసరించి, భయభక్తులు కలిగి ఉంటే, మీరు కరుణింపబడ వచ్చు! [అల్-అన్ఆమ్ 6:155] అల్లాహ్ ప్రకటన:

﴿...وَنَزَّلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ تِبۡيَٰنٗا لِّكُلِّ شَيۡءٖ وَهُدٗى وَرَحۡمَةٗ وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ﴾

నీపై దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి. [అన్నహ్ల్ 16:89] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُمۡ جَمِيعًا ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحۡيِۦ وَيُمِيتُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِ ٱلنَّبِيِّ ٱلۡأُمِّيِّ ٱلَّذِي يُؤۡمِنُ بِٱللَّهِ وَكَلِمَٰتِهِۦ وَٱتَّبِعُوهُ لَعَلَّكُمۡ تَهۡتَدُونَ158﴾

( ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు; ఆయనే జీవన్మరణాల ఇచ్చేవాడు. కావున అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుడు, నిరక్షరాస్యుడు అయి ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ ను మరియు ఆయన సందేశాలను విశ్వసించాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు! [అల్-అఅ్-రాఫ్ 7:158]. మరియు ఇంకా ఇలాంటి ఎన్నో ఆయతులు ఉన్నాయి.

నాల్గవ మూలము: దైవ ప్రవక్తలపై విశ్వాసము.

ఇది కూడా రెండు విషయాల కలిగి ఉంది: మొదటిది: దైవప్రవక్తలందరినీ విశ్వసించడం; అనగా అల్లాహ్ తన దాసుల వద్దకు ప్రవక్తలను పంపించాడని, వారిలో శుభవార్తనిచ్చేవారు, హెచ్చరించేవారు, సత్యం వైపు పిలిచేవారు ఉన్నారని మనము విశ్వసించాలి. వారి పిలుపును స్వీకరించేవాడు సుఖసంతోషాల తో సాఫల్యం చెందుతాడు మరియు వారితో విభేదించినవాడు, తిరస్కరించినవాడు దౌర్భాగ్యముతో, అపనిందతో మరలుతాడు. వారందరిలో అంతిమ ప్రవక్త మరియు ఉత్తమ ప్రవక్త - మన ప్రవక్త ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ ప్రకటన:

﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَ...﴾

మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ) ఆరాధనను త్యజించండి. [అన్నహల్ 16:36] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿رُّسُلٗا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى ٱللَّهِ حُجَّةُۢ بَعۡدَ ٱلرُّسُلِ...﴾

(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు సాకూ మిగల కూడదని! [అన్నిసా 4:165] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿مَّا كَانَ مُحَمَّدٌ أَبَآ أَحَدٖ مِّن رِّجَالِكُمۡ وَلَٰكِن رَّسُولَ ٱللَّهِ وَخَاتَمَ ٱلنَّبِيِّـۧنَ...﴾

( మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు... [అల్-అహ్జాబ్ 33:40]

రెండవది: దైవప్రవక్తలను విశ్వసించటం అంటే అల్లాహ్ లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పేర్లు తెలియజేయబడిన ప్రవక్తలను ప్రత్యేకంగా మరియు స్పష్టంగా విశ్వసించటం. ఉదాహరణకు నూహ్, హూద్, సాలిహ్, ఇబ్రాహీం మొదలైన ప్రవక్తలు అలైహిముస్సలాం మరియు వారి కుటుంబ సభ్యులు, వారి సహచరులపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు కురుయు గాక!

ఐదవ మూలము: అంతిమ దిన్ని విశ్వాసించడము

ఇది క్రింది విషయాలు కలిగి ఉంది:

మరణాంతరం సంభవించే వాటి గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన వాటిని విశ్వసించటం. ఉదాహరణకు సమాధి పరీక్ష మరియు దాని యాతన, దాని అనుగ్రహాలు మరియు ప్రళయదినమున సంభవించే భయాందోళనలు, కఠిన పరిస్థితులు మరియు పుల్-సిరాత్ వంతెన, త్రాసు, లెక్క తీసుకోబడటం, ప్రతిఫలం ప్రసాదించబడటం మరియు ప్రజల మధ్య కర్మల పత్రాల పంపిణీ, కొందరు తమ కర్మల పత్రమును కుడిచేతులో తీసుకోవటం, కొందరు తమ కర్మల పత్రమును ఎడమ చేతితో లేదా వీపు వెనుక నుండి తీసుకోవడం మొదలైనవి.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రసాదించబడే హౌజె కౌసర్ను విశ్వసించటం, స్వర్గాన్ని మరియు నరకాన్ని విశ్వసించటం, విశ్వాసలు తమ ప్రభువును దర్శించటం, ఆయనతో సంభాషించటం, దివ్యఖుర్ఆన్ లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీహ్ హదీథులలో వచ్చిన తదితర వాటిని విశ్వసించటం మొదలైనవి ఇందులోనే వస్తాయి. వీటన్నిటిని విశ్వసించటం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్ట పరచిన విధంగా వాటిని నమ్మటం ముస్లింలపై తప్పనిసరి విధి.

ఆరవ మూలము: విధివ్రాత పట్ల విశ్వాసము

ఇందులో క్రింది నాలుగు విషయలు ఇమిడి ఉన్నాయి:

మొదటిది: పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు జరిగినది మరియు జరగబోయేది ఖచ్చితంగా తెలుసు, తన దాసుల స్థితిగతులు, వారి ఆహారోపాధి, వారి వయస్సు, వారి కర్మలు మరియు వారి తదితర విషయములు ఆయన పూర్తిగా ఎరుగును. ఆయన వద్ద ఏదీ గోప్యంగా ఉండదు. దీని గురించి అల్లాహ్ ప్రకట:

﴿...وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ﴾

మరియు నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి. [అల్-బఖరహ్ 2:231] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ప్రకట:

﴿...لِتَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ وَأَنَّ ٱللَّهَ قَدۡ أَحَاطَ بِكُلِّ شَيۡءٍ عِلۡمَۢا﴾

మీరు తెలుసుకోవటానికి, నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు మరియు వాస్తవానికి అల్లాహ్ తన జ్ఞానంతో ప్రతిదానిని పరివేష్టించి న్నాడని. [అత్తలాఖ్ 65:12]

రెండవది: అల్లాహ్ తాను నిర్ణయించిన మరియు తీర్మానించిన ప్రతిదీ వ్రాసి ఉంచాడని విశ్వసించడం; అల్లాహ్ ప్రకటన:

﴿قَدۡ عَلِمۡنَا مَا تَنقُصُ ٱلۡأَرۡضُ مِنۡهُمۡۖ وَعِندَنَا كِتَٰبٌ حَفِيظُۢ 4﴾

వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు. మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. [ఖాఫ్ 50:4] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿...وَكُلَّ شَيۡءٍ أَحۡصَيۡنَٰهُ فِيٓ إِمَامٖ مُّبِينٖ﴾

మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసి ఉంచాము. [యాసీన్ 36:12] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ذَٰلِكَ فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ70﴾

ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది. [అల్-హజ్ 22:70]

మూడవది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క చిత్తం అమలవుతుంది; ఆయన కోరుకున్నదే జరుగుతుంది, ఆయన కోరనిది జరుగదు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿...إِنَّ ٱللَّهَ يَفۡعَلُ مَا يَشَآءُ﴾

నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు. [హజ్ 22:18] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ప్రకటన:

﴿إِنَّمَآ أَمۡرُهُۥٓ إِذَآ أَرَادَ شَيۡـًٔا أَن يَقُولَ لَهُۥ كُن فَيَكُونُ82﴾

నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచు కున్నప్పుడు దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే! అది అయిపోతుంది. [యాసీన్ 36:82] అల్లాహ్ ప్రకటన:

﴿وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ29﴾

మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. [అత్తక్వీర్ 81:29]

నాల్గవది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సృష్టించిన సమస్త ఉనికిలో ఉన్నవాటిని విశ్వసించడం; ఆయన తప్ప వేరే సృష్టికర్త లేడు, ఆయన తప్ప వేరే ప్రభువు లేడు; సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٞ62﴾

అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి నిర్వాహణకర్త. [అజ్-జుమర్ 39:62] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱذۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ عَلَيۡكُمۡۚ هَلۡ مِنۡ خَٰلِقٍ غَيۡرُ ٱللَّهِ يَرۡزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ فَأَنَّىٰ تُؤۡفَكُونَ3﴾

మానవులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి! ఏమీ? భూమ్యాకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకడు ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! అయితే మీరు ఎందుకు మోసగింప (సత్యం నుండి మరలింప) బడుతున్నారు? [ఫాతిర్ 35:3]

ఆరవ మూలం: విధివ్రాతపై విశ్వాసం: అహ్లె సున్నత్ వల్ జమాఅత్ యొక్క నమ్మకంగా నాలుగు విషయములను పూర్తిగా విశ్వసించటం. దీనికి భిన్నంగా అహ్లె బిద్అ వీటిలో కొన్నింటిని తిరస్కరించారు.

సర అఖీదాలోని అహ్లె సున్నతు ప్రజలు నమ్మే ముఖ్యమైన విషయాలలో: అల్లాహ్ కొరకు ప్రేమించటం, అల్లాహ్ కొరకు ద్వేషించటం, అల్లాహ్ కొరకు స్నేహం చేయటం, అల్లాహ్ కొరకు శతృత్వం చేయటం ఉన్నాయి. ఇవి: అల్ వల్ బరా యొక్క అఖీదా (ప్రేమించుట మరియు ద్వేషించుట), మరియు ఇవి మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసంలోని భాగము.

కావున విశ్వాసి, విశ్వాసలన ప్రేమిస్తాడు మరియు వారితో స్నేహం చేస్తాడు మరియు సత్యతిరస్కారులను ద్వేషిస్తాడు మరియు వారితో శతృత్వం వహిస్తాడు. ఉమ్మత్ లో నుండి విశ్వాస మొదటి పంక్తిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఉన్నారు - అహ్లె సున్నత్ వల్ జమాఅతు ప్రకారం - వారు వారిని ప్రేమిస్తారు మరియు వారితో స్నేహం చేస్తారు మరియు వారు ప్రవక్తల తరువాత ప్రజందరిలో కెల్ల ఉత్తములని విశ్వసిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికరు:

«خَيْرُ القُرُونِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُم».

«యుగాలన్నిటి లో ఉత్తమమైనది నా యుగమే. తర్వాత తర్వాత వారు, మళ్లీ వాళ్ల తర్వాత తర్వాత వారు14 హదీథు ప్రామాణికత ధృవీకరించబడింది.

మరియు వారిలో అబూబకర్ సిద్దీఖ్ ఉత్తమమైన వారని, తరువాత ఉమర్ ఫారూఖ్ అని, తరువాత ఉథ్మాన్ జున్నూరైన్ అని, తరువాత అలియ్యుల్ ముర్తదా అని - రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ - వారి తరువాత అషరె ముబష్షిర (స్వర్గ శుభవార్త ఇవ్వబడిన పదిమంది సహచరులు) అని, తరువాత మిగిలిన సహచరులు రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ అని విశ్వసిస్తారు మరియు సహచరుల మధ్య వచ్చిన వ్యతిరేకతల విషయంలో వారు మౌనం వహించారు మరియు వారు విషయంలో శోధన (ఇజ్తిహాద్) చేసేవారు అని విశ్వసిస్తారు. తన శోధనను సరిగా చేసిన వారు రెండింతలు పుణ్యం పొందుతారు. శోధనలో తప్పు చేసిన వారు ఒక పుణ్యం పొందుతారు.

మరియు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబలో ఆయన విశ్వసించినవారిని ప్రేమిస్తారు మరియు వారితో స్నేహం చేస్తారు మరియు విశ్వాస మాతృమూర్తులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులతో ఉత్తమంగా మెలుగుతారు మరియు వారందరితో సంతృప్తిగా ఉంటారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను ద్వేషించే వారైనా మరియు వారిని దూషించేవారైనా, అహ్లె బైత్ విషయం లో అతిక్రమించి అల్లాహ్ అవతరింప జేసిన స్థాన కంటే అధికంగా వారి స్థానలను పెంచేవారైనా రాఫిదీల మార్గం గురించి విసుగు చూపుతారు, ఎలాగైతే వారు అహ్లె బైత్ ను మాటలు లేదా చేతలతో బాధించే నవాసిబుల విధానం నుండి విసుగు చూపుతారో అలా.

మేము ప్రస్తావించిన విషయమంతా అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చి పంపించిన నిజమైన విశ్వాసములో వస్తుంది. మరియు అది ఎలాంటి విశ్వాసం అంటే దానిని విశ్వసించటం, అదిమి పట్టుకోవటం, దానిపై స్థిరంగా ఉండటం మరియు దానిని విభేదించే వాటి నుండి భయపడటం తప్పనిసరి. మరియు అది ఫిర్కె నాజియ అహ్లు - స్ - సున్నత్ వల్ జమాఅత్ యొక్క విశ్వాసము. వారి విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

«لَا تَـزَالُ طَائِفَةٌ مِنْ أُمَّتِي ‌ظَاهِرِينَ ‌عَلَى ‌الحَقِّ، لَا يَضُرُّهُمْ مَنْ خَذَلَهُمْ، حَتَّى يَأْتِيَ أَمْرُ اللهِ وَهُمْ كَذَلِكَ».

నా సమాజంలో నుండి ఒక వర్గ సత్యంపై స్పష్టంగా ఉంటుంది. వారి తోడు వదిలేవారు వారికి నష్టం కలిగించలేరు. చివరికి అల్లాహ్ ఆదేశం వస్తుంది మరియు వారు అలాగే ఉండి పోతారు.15 ఇంకొక హదీథులో ఇలా ఉంది:

«لَا تَزَالُ طَائِفَةٌ مِنْ أُمَّتِي عَلَى الحَقِّ مَنْصُورَةٌ».

నా సమాజంలో నుంచి ఒక వర్గము సత్యంపై ఉంటుంది. అది అల్లాహ్ సహాయం పొందుతుంది.16 ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

«افْتَرَقَتِ اليَهُودُ عَلَى إِحْدَى وَسَبْعِينَ فِرْقَةً، وَافْتَرَقَتِ النَّصَارَى عَلَى اثْنَتَيْنِ وَسَبْعِينَ فِرْقَةً، وَسَتَفْتَرِقُ هَذِهِ الأُمَّةُ عَلَى ثَلَاثِ وَسَبْعِينَ فِرْقَةً كُلُّهَا فِي النَّارِ إِلَّا وَاحِدَةً فَقَالَ الصَّحَابَةُ: مَنْ هِيَ يَا رَسُولَ اللهِ؟ قَالَ: مَنْ كَانَ عَلَى مِثْلِ مَا أَنَا عَلَيْهِ وَأَصْحَابِي».

యూదులు డబ్బై ఒక్క వర్గలుగా విడిపోయారు. మరియు క్రైస్తవులు డబ్బై రెండు వర్గలుగా విడిపోయారు. మరియు సమాజం డబ్బై మూడు వర్గలుగా విడిపోతుంది. ఒక వర్గ తప్ప అన్ని వర్గలు నరకలో ఉంటారు. అప్పుడు సహచరులు, 'యా రసూలల్లాహ్! అది ఏది?' అని ప్రశ్నించారు. ఆయన ఇలా సమాధానమిచ్చినారు, 'ఎవరైతే నేను మరియు నా సహచరులు ఉన్న మార్గం పై ఉంటారో వారు'.17

సరియైన విశ్వాసానికి (సహీహ్ అఖీదహ్ కు) విరుద్ధమైన నమ్మకాలు:

దైవవిశ్వాసం నుండి మరలిపోయి దానికి వ్యతిరేకంగా నడిచేవారు అనేక వర్గాలుగా ఉంటారు; వారిలో విగ్రహాలను, శిల్పాలను, దూతలను, ఔలియాలను, జిన్నులను, వృక్షాలను, రాళ్ళను మరియు తదితర వాటిని ఆరాధించేవారు కూడా ఉన్నారు. ఇక వీరందరు ప్రవక్తల పిలుపును స్వీకరించలేదు. వారితో విభేదించారు మరియు వ్యతిరేకించారు. విధంగానైతే ఖురైష్ జాతి మరియు అరబ్బులోని ఇతర తెగలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వ్యవహరించారో అలా. మరియు వారు తమ ఆరాధ్యదైవాలతో అవసరాలను తీర్చమని, వ్యాధిగ్రస్తులకు నయం చేయమని, శతృవులకు వ్యతిరేకంగా సహాయం చేయమని అర్థించేవారు. మరియు వారి పేరుపై పశువులను వధించేవారు అంటే ఖుర్బానీ చేసేవారు. మరియు మొక్కుకునేవారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దాని నుండి ఆపి, అల్లాహ్ ఒక్కడి కొరకే ఆరాధనను ప్రత్యేకించమని వారిని ఆదేశించారో వారికి ఆయన మాటలు ఆశ్చర్యితులను చేశాయి మరియు వారు ఆయనను తిరస్కరిస్తూ, ఇలా పలికినారు:

﴿أَجَعَلَ ٱلۡأٓلِهَةَ إِلَٰهٗا وَٰحِدًاۖ إِنَّ هَٰذَا لَشَيۡءٌ عُجَابٞ5﴾

ఏమీ? ఇతను ( ప్రవక్త) దైవాలందరినీ, ఒకే ఆరాధ్య దైవంగా చేశాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం! [సాద్ 38:5]

అయినా వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వైపు ఆహ్వానిస్తూనే ఉన్నారు. మరియు వారిని షిర్క్ నుండి వారిస్తూనే ఉన్నారు. మరియు తాను ఆహ్వానిస్తున్న దాని వాస్తవికతను వారికి విస్తరించి చెప్పేవారు. చివరికి అల్లాహ్ వారిలో నుండి సన్మార్గం చూపవలసిన వారికి సన్మార్గం చూపాడు. తరువాత అల్లాహ్ ధర్మంలో తండోపతండాలుగా వారు ప్రవేశించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల, తాబియీన్ నిరంతర ఆహ్వానము మరియు కృషి తరువాత అల్లాహ్ ధర్మం ఇతర ధర్మాలన్నింటిపై ఆధిక్యతను పొందినది. తరవాత పరిస్థితులు మారిపోయినవి. మరియు అజ్ఞాన అల్లాహ్ సృష్టిపై ఆధిక్యతను పొందసాగినది. చివరికి చాలా మంది అజ్ఞానం వైపునకు ఆకర్షితులై పోయారు. వారు దైవ ప్రవక్తల విషయంలో, ఔలియాల విషయంలో, వారిని అర్ధించే విషయంలో, వారితో సహాయం కొరకు మొరపెట్టుకునే విషయంలో మరియు తదితర షిర్క్ రకాలలో అతిక్రమించారు మరియు వారు లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్ధమును అరబ్ కాఫిర్ లు గుర్తించినట్లుగా గుర్తించలేదు. ఫల్లాహుల్ ముస్తఆన్న (అల్లాహ్ మనకు సహాయపడుగాక).

అజ్ఞానం యొక్క ఆధిక్యత మరియు అంతిమ దైవప్రవక్త శతాబ్దానికి దూరం అవుతూ ఉండడం వలన ప్రజలలో నేటి వరకు బహుదైవారాధన వ్యాపిస్తూనే ఉన్నది.

చివరి కాలం సత్యతిరస్కారుల అభిప్రాయమే, మొదటి తరం (ఖురైషీ ముష్రికుల) అభిప్రాయము. వారి మాటలలోనే:

﴿...هَٰٓؤُلَآءِ شُفَعَٰٓؤُنَا عِندَ ٱللَّهِ...﴾

వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు. [యూనుస్ 10:18] మరియు వారు (సత్యతిరస్కారులు) ఇలా అన్నారు:

﴿...مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ...﴾

మేము వారిని ఆరాధిస్తున్నాము! [అజ్-జుమర్ 39:3]

అల్లాహ్ అపోహను నిర్వీర్యం చేశాడు, మరియు ఎవరైనా అల్లాహ్తప్ప మరెవరినైనా ఆరాధిస్తే - అది ఎవరైనా కావొచ్చు - అల్లాహ్కు భాగస్వామిని కల్పించినవాడవుతాడు, కాఫిర్ అవుతాడు అని స్పష్టంగా తెలిపాడు. అల్లాహ్ ప్రకటన:

﴿وَيَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَضُرُّهُمۡ وَلَا يَنفَعُهُمۡ وَيَقُولُونَ هَٰٓؤُلَآءِ شُفَعَٰٓؤُنَا عِندَ ٱللَّهِ...﴾

మరియు వారు అల్లాహ్ ను కాదని తమకు నష్టం గానీ, లాభం గానీ కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు: "వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు. [యూనుస్ 10:18]

అల్లాహ్ తన మాట ద్వారా వారిని ఖండించాడు:

﴿قُلۡ أَتُنَبِّـُٔونَ ٱللَّهَ بِمَا لَا يَعۡلَمُ فِي ٱلسَّمَٰوَٰتِ وَلَا فِي ٱلۡأَرۡضِۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ18﴾

వారినడుగు: "ఏమీ? ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, అల్లాహ్ ఎరుగని విషయాన్ని, మీరు ఆయనకు తెలుపగోరు తున్నారా?" ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే వాటి కంటే ఆయన అత్యున్నతుడు. [యూనుస్ 10:18]

ఆయతులో అల్లాహ్ తనను వదిలి దైవప్రవక్తలను, ఔలియాలను లేదా ఇతరులను ఆరాధించటం పెద్ద షిర్కు అని స్పష్టపరచాడు. ఒకవేళ దానికి పాల్పడేవాడు దానికి వేరే పేరు ఇచ్చినా సరే. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿...وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ...﴾

ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము! [అజ్-జుమర్ 39:3]

తరవాత అల్లాహ్ తన వాక్కు ద్వారా వారిని ఖండించాడు:

﴿...إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ﴾

నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు. [అజ్-జుమర్ 39:3]

అల్లాహ్ విధంగా స్పష్టం చేశాడు దుఆ చేయడం, భయపడడం, ఆశించటం వంటి రూపాల్లో ఎవరైనా ఆయనను వదిలి ఇంకెవ్వరినైనా ఆరాధించటం అంటే అల్లాహ్పై అవిశ్వాసం చూపడం, కుఫ్ర్ చేయడం. అంతేగాక, "తమ దేవతలు తమను అల్లాహ్కు దగ్గర చేస్తాయి" అనే వారి మాటను అల్లాహ్ అబద్ధమని ప్రకటించాడు.

సరైన విశ్వాసమునకు వ్యతిరేకమైన మరియు ప్రవక్తలు అలైహిముస్సలాం తీసుకుని వచ్చిన దానికి వ్యతిరేకమైన కుఫ్రియ విశ్వాసలలోంచి దేనినైతే కాలలో మార్క్స్, లెనీన్ అనుచరులలోంచి మరియు నాస్తికత్వం, అవిశ్వాసం వైపు పిలిచే తదితరులలోంచి నాస్తికులు విశ్వసిస్తున్నారో అది. దానికి సోషలిజం లేదా కమ్యూనిజం లేదా బఅ్ సియా లేదా తదితర పేర్లు పెట్టినా సరే. ఆరాధ్యుడు లేడు మరియు జీవితం భౌతిక మైనది అన్నది నాస్తికుల సిద్ధాంతలలో నుండి వచ్చినది.

ప్రళయదినాన్ని తిరస్కరించటం, స్వర్గాన్ని మరియు నరకాన్ని తిరస్కరించటం, ఇంకా ధర్మాలన్నింటిని తిరస్కరించటం వారి సిద్ధాంతలలోనివే. వారి పుస్తకలలో చూసి, వారు దేనిపై ఉన్నారో దాని గురించి చదివినవాడు వారి నమ్మకాలను ఖచ్చితంగా తెలుసుకుంటాడు. విశ్వాసం పరలోక ధర్మాలన్నిటికి వ్యతిరేకంగా ఉండటం వలన వాటి ప్రజలను ఇహపరాలలో చెడ్డ పరిణామాల వైపుకు తీసుకు పోవటంలో ఎటువంటి సందేహం లేదు.

సత్యమునకు వ్యతిరేకమైన విశ్వాసలలో నుండి దేనినైతే కొంతమంది సూఫీలు, ఔలియాలను కల్పించుకుని వారిని అల్లాహ్ కు కార్యనిర్వహణలో సాటి కల్పించి విశ్వసించేవారు, విశ్వవ్యవహారలలో వారు కార్యనిర్వహణ చేస్తారని విశ్వసించే వారు కూడా ఉన్నారు. మరియు తమ ఆరాధ్యదైవాలకు కల్పించుకున్న పేర్లైన అఖ్తాబ్, అవ్తాద్, అగ్వాస్ తదితర పేర్లను పెట్టుకున్నారు. ఇలా చేయడం అల్లాహ్ రుబూబియత్ (సార్వభౌమత్వము) లో షిర్కు మరియు అది అల్లాహ్ తో షిర్క్ చేసే అతి చెడ్డదైన వాటిలో ఒకటి.

అజ్ఞాన కాలంలోని పూర్వీకుల షిర్కును పరిశీలించి, దానిని తరువాతి కాలంలో వ్యాపించిన షిర్కుతో పోల్చినవారు, తరువాత కాలంలోని షిర్కు మరింత ఘోరంగా మరియు అధ్వాన్నంగా ఉందని కనుగొంటారు. దీని వివరణ ఇలా ఉన్నది: అఙ్ఞాన కాలపు అరబ్ అవిశ్వాసులు రెండు విషయాలలో ప్రత్యేకత కలిగి ఉండేవారు: మొదటి విషయం: వారు రుబూబియత్ (అల్లాహ్ యొక్క సార్వభౌమత్వం) లో షిర్క్ చేయలేదు, కానీ వారి షిర్క్ ఆరాధనలలో (ఉలూహియతులో) మాత్రమే ఉండేది; వారు రుబూబియత్ ను కేవలం అల్లాహ్ ఒక్కడి కొరకు మాత్రమే అంగీకరించేవారు, అల్లాహ్ ప్రకటన:

﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَهُمۡ لَيَقُولُنَّ ٱللَّهُ...﴾

మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు...[జుఖ్రుఫ్ 43:87] మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:

﴿قُلۡ مَن يَرۡزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ أَمَّن يَمۡلِكُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَمَن يُخۡرِجُ ٱلۡحَيَّ مِنَ ٱلۡمَيِّتِ وَيُخۡرِجُ ٱلۡمَيِّتَ مِنَ ٱلۡحَيِّ وَمَن يُدَبِّرُ ٱلۡأَمۡرَۚ فَسَيَقُولُونَ ٱللَّهُۚ فَقُلۡ أَفَلَا تَتَّقُونَ31﴾

వారిని అడుగు: "ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా? [యూనుస్ 10:31] అర్థాన్ని సూచించే ఆయతులు చాలా ఉన్నాయి.

రెండవ విషయం: వారి ఆరాధనలో బహుదైవారాధన ఎన్నడూ ఉండేది కాదు, అది కేవలం సుఖసంతోషాలలో మాత్రమే జరిగేది. కానీ కష్టాలలో ఉన్నప్పుడు వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు. దీని గురించి అల్లాహ్ ఇలా తెలిపినాడు:

﴿فَإِذَا رَكِبُواْ فِي ٱلۡفُلۡكِ دَعَوُاْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمۡ إِلَى ٱلۡبَرِّ إِذَا هُمۡ يُشۡرِكُونَ65﴾

వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకు రాగానే ఆయనకు సాటి కల్పించ సాగుతారు. [అల్-అన్కబూత్ 29:65]

ఇక మునుపటి ముష్రికుల కంటే తదుపరి ముష్రికులు రెండు విషయాల్లో మించిపోయారు: మొదటిది: వారిలో కొందరు రుబూబియ్యా (అల్లాహ్ యొక్క సార్వభౌమత్వం) లో షిర్క్ చేయటం. రెండవది: కలిమిలోనూ లేమిలోనూ వారు షిర్క్ చేయటం. ఏవిధంగానైతే వారితో కలిసి, వారి పరిస్థితులను అన్వేషించి, ఈజిప్టులోని హుస్సేన్, బదవీ మరియు ఇతరుల సమాధి వద్ద మరియు అదన్ లోని అల్ ఈద్రోస్ సమాధి వద్ద, యమన్ లోని అల్ హాదీ, షామ్ (సిరియా) లోని ఇబ్నె అరబీ, ఇరాఖ్ లోని షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు ఇతర ప్రసిద్ధి చెందిన సమాధుల విషయంలో చాలా మంది ప్రజలు ధార్మిక హద్దులు అతిక్రమించి వారికి అల్లాహ్ యొక్క చాలా హక్కులను సమర్పించి ఏమి చేస్తున్నారో చూసిన వాడు దానిని తెలుసు కుంటాడు. వారిని దాని నుండి ఆపేవారు మరియు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన కంటే మునుపటి ప్రవక్తలు అలైహిముస్సలాంకు ఇచ్చి పంపించిన తౌహీద్ ను వారికి స్పష్టపరచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజిఊన్.

అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు గుణగుణాల విషయంలో సరియైన ఈమాన్ (విశ్వాసం) కు విరుద్ధమైన కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. బిదఅతీలు అయిన జహ్మియ్యా (నిరీశ్వరవాదులు), మొతజిలా (తర్కవాదులు) మరియు వారి మార్గాన్ని అనుసరించే వారి నమ్మకాలు ఇందులోకి వస్తాయి. వర్గాలు అల్లాహ్ (అజ్జ జల్) యొక్క దివ్యగుణాలను నిరాకరిస్తారు, పరిపూర్ణతను సూచించే ఆయన గుణాలను తిరస్కరిస్తారు. మరియు అసాధ్యమైన, నిర్జీవమైన, అస్తిత్వంలేని వస్తువుల లక్షణాలను అల్లాహ్ కు ఆరోపిస్తారు. అల్లాహ్ వారి దుష్ట వాదనలన్నింటి నుండి అత్యున్నతుడు.

అల్లాహ్స్వభావ లక్షణాల్లో కొన్నింటిని తిరస్కరించి, కొన్నింటిని స్వీకరించేవారు ఇందులో వస్తారు. ఉదాహరణకు, అష్'ఆరీల నమ్మకం. వీరు కొన్ని లక్షణాలను నిరాకరించి, వాటికి సంబంధించిన ఆధారాలను తార్కికంగా వక్రీకరించి, అవి చూపే స్పష్టమైన, బుద్ధిసమ్మత ఆధారాలను విరోధించారు. అందుచే వారు తామే తిరస్కరించిన వాటిలో ఉండే తార్కిక సమస్యలనే అంగీకరించిన లక్షణాలనే మళ్లీ ఎదుర్కొన్నారు. విషయంలో వారు స్పష్టమైన విరుద్ధతలో పడ్డారు.

అయితే అహ్లుస్-సున్నా వల్-జమాఅ (సున్నీ సమాజం) ప్రజలు పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ తనకు తానే నిర్ధారించుకున్న లేదా ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిర్ధారించిన పూర్ణమైన దివ్యనామాలు మరియు గుణాలను ఎలాంటి సందేహం లేకుండా అంగీకరిస్తారు. అల్లాహ్ తన సృష్టిరాశులతో ఎలాంటి సారూప్యత లేనివాడని పరిశుద్ధంగా విశ్వసిస్తారు. విశ్వాసం ఎటువంటి గుణనిరాకరణ (తాతీల్) మాలిన్యం లేకుండా స్వచ్ఛమైనది. వారు అన్ని ప్రమాణాలను సమగ్రంగా అనుసరిస్తారు. వారు ప్రమాణాన్నీ వక్రీకరించలేదు, నిరాకరించలేదు. ఇంతకు ముందు తెలిపినట్లుగా ఇతరులు పాల్బడిన విరుద్ధాభాసాల నుండి వారు సురక్షితంగా ఉన్నారు.

మరియు ఇదే మోక్షమార్గం, ఇహలోక మరియు పరలోక సుఖసంపదకు మార్గం. ఉమ్మత్ (సమాజం) యొక్క పూర్వీకులు మరియు ఇమాములు అనుసరించిన (సిరాతుల్ ముస్తఖీమ్) మార్గం. వారి తర్వాత వచ్చిన వారికి కూడా శ్రేయస్సు కలిగించేది వారి మొదటి తరం అనుసరించిన మార్గమే. ఇది ఖుర్ఆన్ మరియు సున్నతు (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకం) ను పాటించడం, మరియు వాటికి విరుద్ధమైన వాటిని వదిలేయడం. మేము పరమ పవిత్రుడు, మహోన్నతుడై అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము - ఉమ్మత్ (సమాజం)ను తిరిగి సన్మార్గంలోకి తీసుకు రావాలని, సమాజంలో హిదాయత్ (సన్మార్గం) వైపుకు పిలుచేవారిని అధికం చేయాలని, దాని నాయకులు మరియు విద్వాంసులకు షిర్క్ (భాగస్వామ్యం) ఎదుర్కొని, దానిని నిర్మూలించి, దాని మార్గాల గురించి హెచ్చరించే శక్తిని ప్రసాదించాలని. నిశ్చయంగా ఆయన (అల్లాహ్) సర్వం వినేవాడు, అతి సమీపంలో ఉన్నవాడు. అల్లాహ్ ఎల్లప్పుడూ విజయానికి మార్గదర్శకుడు. ఆయనే మాకు చాలు, ఆయన ఎంతో గొప్ప రక్షకుడు! పుణ్యాలను చేసే భాగ్యము మరియు చెడు నుండి భద్రంగా ఉండే శక్తి ఆయనతో మాత్రమే. అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త అయిన మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కురిపించుగాక.

 

***

 


(దీనిని బుఖారీ (2856), ముస్లిం (30) నమోదు చేసినారు).

దీనిని అల్-లాల్కాయ్ "షర్హె ఉసూలె ఈతిఖాద్" (735) లో మరియు ఇబ్నె అబ్దుల్ బర్ "జామిఉల్-ఇల్మి ఫద్లిహి" (1801) లో నమోదు చేసినారు, కానీ "ఆయాత్ అల్-సిఫాత్" బదులు "అహదీథ్" పదాలతో మరియు ఆయన పదాలు: " హదీథులను వచ్చినట్లుగా చెప్పండి మరియు వాటి పై వాదించవద్దు."

దీన్ని బైహఖీ అస్మా వసిఫాత్ లో (865) ఉల్లేఖించారు మరియు ఇబ్నె తైమీయ్యా హమవీయ్యాలో (పుట: 269) దీని ఇస్నాదును ప్రామాణిక మైనదిగా తెలియపరచారు. మరియు జహబీ అల్ అర్ద్ లో (2/223) దీని ఉల్లేఖకులు విశ్వసనీయమైన ఇమాములు అని చెప్పారు.

దీనిని అల్-లాల్కాయ్షర్హు ఉసూలి 'తీఖాద(930) మరియు అల్-బైహఖీఅల్-అస్మా వస్సిఫాత్(955)లో నమోదు చేసినారు.

దీన్ని అల్-లాల్కాయ్ షర్హె ఉసులె ఈతిఖాద్ లో (665), మరియు బైహఖీ అల్-అస్మా సిఫాత్ లో (868) నమోదు చేసినారు.

దీనిని అల్-లాల్కాయ్ షర్హె ఉసులె ఈతిఖాద్ లో (664), అబూ నుఐమ్ హిల్యత్ అల్-అవ్లియా లో (325/6), మరియు అల్-బైహఖీ అల్-అస్మా స్సిఫాత్ లో (867) నమోదు చేసినారు.

దీన్ని అల్-ముజక్కీ అల్-ముజక్కియాత్ లో (29), ఇబ్నె బత్తా అల్-ఇబానాలో (120), మరియు అల్-లాల్కాయ్ షర్హె ఉసూలె ఈతిఖాద్ లో (663) నమోదు చేసినారు.

దారిమీ 'అర్రద్దు అలల్-జహ్మియా' (67) లో, బైహఖీ 'అల్ అస్మా వస్సిఫాత్' (903) లో నమోదు చేసినారు.

దీనిని దహబీ ఉలులో (464) నమోదు చేసినారు. మరియు అల్బానీ ముక్తసరుల్ ఉలులో (పుట: 184) దీని సనద్ ప్రామాణికమైనదని, దీని ఉల్లేఖకులు విశ్వసనీయమైనవారని తెలిపారు.

తఫ్సీర్ ఇబ్నె కథీర్ (3/426, 427).

దీన్ని బుఖారీ (22) నమోదు చేసినారు, అబూ సయీద్ అల్-ఖుద్రీ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖన నుండి.

దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య 2996, ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన.

దీనిని బుఖారీ (3651), ముస్లిం (2533) నమోదు చేసినారు, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖన నుండి.

సౌబాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ముస్లిం (1920)

సౌబాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ఇబ్నె మాజ (3952) మరియు ఇబ్నె హిబ్బాన్ (6714), హాకిమ్ (8653) దీనిని ప్రామాణికమైనదిగా తెలిపినారు.

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, తిర్మిదీ (2641) మరియు ఫయ్దుల్ ఖదీర్ 5/347లో మనావీ "ఇందులో అబ్దుర్రహ్మాన్ బిన్ జియాద్ అల్ అఫ్రికీ ఉన్నారు, దహబీ గారు: దీన్ని బలహీనమైన హదీథుగా పేర్కొన్నారు" అని అన్నారు. మరియు అల్బానీ సహీహుల్ జామీలో (5343) దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

దీనిని ముస్లిం (8) నమోదు చేసినారు.