حِرَاسَةُ التَّوحِيدِ
తౌహీద్ రక్షణ
لِسَمَاحَةِ الشَّيْخِ العَلَّامَةِ
عَبْدِ العَزِيزِ بْنِ عَبْدِ اللهِ بْنِ بَازٍ
رَحِمَهُ اللهُ
రచన గౌరవనీయులైన షేఖ్
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
మొదటి సందేశము:
సరియైన విశ్వాసం (అఖీదహ్) మరియు దానికి విరుద్ధమైనవి
అల్హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్య బఅదహ్, వఅలా ఆలిహి వసహాబిహి (అల్లాహ్ ఒక్కడికే సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు శోభిస్తాయి, ప్రవక్తలలో ఆయన తర్వాత మరెవ్వరూ లేని వానిపై (ముహమ్మద్ ప్రవక్తపై) దీవెనలు, శాంతి కురుయు గాక. మరియు ఆయన కుటుంబ సభ్యులు, సహచరులపై కూడా).
అమ్మా బాద్ (ఇక ఆ తరువాత): సరైన విశ్వాసము, ఇస్లాం ధర్మము యొక్క మూలాధారము మరియు ధర్మము యొక్క పునాది. అందువలన ఈ అంశంపై మాట్లాడటం, దానిని మరింతగా వివరించేందుకు మరియు స్పష్టపరిచేందుకు వ్రాయడం ముఖ్యమని నేను భావించాను.
ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారంగా షరీఅతులో స్పష్టంగా తెలుపబడినది ఏమిటంటే: ఆచరణలు మరియు వాక్కులు అనేవి పరిశుద్ధమైన అఖీదా పైన ఆధారపడి ఉన్నప్పుడే అవి సరైనవి అవుతాయి మరియు అల్లాహ్ దగ్గర అంగీకారమైనవిగా నిలుస్తాయి. కానీ అఖీదహ్ సరిగ్గా లేకపోతే, దాని ఆధారంగా చేసే ఆచరణలు మరియు మాటలు అన్నీ నిష్ఫలం (బాతిల్) అవుతాయి. దీని గురించి మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿...وَمَن يَكۡفُرۡ بِٱلۡإِيمَٰنِ فَقَدۡ حَبِطَ عَمَلُهُۥ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ﴾
ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్ట పోయేవారిలో చేరతాడు. [అల్ మాయిద: 5]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَقَدۡ أُوحِيَ إِلَيۡكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبۡلِكَ لَئِنۡ أَشۡرَكۡتَ لَيَحۡبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ ٱلۡخَٰسِرِينَ 65﴾
మరియు వాస్తవానికి! నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధనకు పాల్బడినట్లయితే (షిర్కు చేసినట్లైతే) నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు." 65 [అజ్ జుమర్: 65]
ఈ అర్ధంలో ఆయతులు చాలా ఉన్నాయి. అల్లాహ్ యొక్క స్పష్టమైన గ్రంథము ఖుర్‌ఆన్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సున్నతులు దీనినే సూచిస్తున్నాయి: పరిశుద్ధమైన అఖీదహ్ (విశ్వాసం) ఆరు విషయాల్లో సంక్షిప్తంగా ఉంది. అవి ఏమిటంటే: అల్లాహ్ను విశ్వసించడం, దైవదూతలను విశ్వసించడం, దైవ గ్రంథాలను విశ్వసించడం, దైవప్రవక్తలను విశ్వసించడం, అంతిమ దినాన్ని (ఖియామత్)ను విశ్వసించడం మరియు అల్లాహ్ నిర్ణయించిన మంచి - చెడుల విధివ్రాత (ఖద్ర్)ను విశ్వసించడం. ఈ ఆరు విషయాలే అల్లాహ్ తాలా పంపిన పవిత్ర ఖుర్‌ఆన్‌లో అవతరించబడిన, మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పునాది పెట్టబడిన శుద్ధమైన అఖీదా (విశ్వాసం) యొక్క మౌలిక సూత్రాలు.
ఈ ఆరు మూల విశ్వాస సూత్రాల పట్ల ఖుర్‌ఆన్ మరియు సహీహ్ సున్నతులలో స్పష్టమైన ఆధారాలు ఎక్కువగా వచ్చాయి. వాటిలో కొన్ని ఉదాహరణలు ఇవే:
మొదటిది: ఖుర్ఆన్ గ్రంథం నుండి ఆధారాలు; వాటిలో: అల్లాహ్ యొక్క ఈ వాక్యము ఉంది:
﴿لَّيۡسَ ٱلۡبِرَّ أَن تُوَلُّواْ وُجُوهَكُمۡ قِبَلَ ٱلۡمَشۡرِقِ وَٱلۡمَغۡرِبِ وَلَٰكِنَّ ٱلۡبِرَّ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَٱلۡمَلَٰٓئِكَةِ وَٱلۡكِتَٰبِ وَٱلنَّبِيِّـۧنَ...﴾
అల్ బిర్ర్ (వినయ విధేయత, ధర్మనిష్ఠాపరత్వం) అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో త్రిప్పుకోవడం కాదు; కాని అల్ బిర్ర్ (వినయ విధేయత, ధర్మనిష్ఠాపరత్వం) అంటే, అల్లాహ్ ను, అంతిమదినాన్ని, దేవదూతలను, దివ్యగ్రంథాల్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం... [అల్ బఖర: 177]
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّن رُّسُلِهِ...﴾
ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. [అల్ బఖర: 285]
మరియు పరమ పరిశుద్ధుడైన ఆయన వాక్కు:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ ءَامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَٱلۡكِتَٰبِ ٱلَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِۦ وَٱلۡكِتَٰبِ ٱلَّذِيٓ أَنزَلَ مِن قَبۡلُۚ وَمَن يَكۡفُرۡ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ فَقَدۡ ضَلَّ ضَلَٰلَۢا بَعِيدًا 136﴾
ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయనకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు - వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే! [నిసా: 136]
మరియు పరమ పరిశుద్ధుడైన ఆయన వాక్కు:
﴿أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ذَٰلِكَ فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ 70﴾
ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ బాగా ఎరుగునని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది. [అల్-హజ్: 70]
రెండవది: సున్నతు నుండి ఆధారాలు - వాటిలో ప్రసిద్ధ సహీహ్ హదీథు ఇమామ్ ముస్లిం రహిమహుల్లాహ్ తన జామె సహీహ్ లో అమీరుల్ మోమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ గురించి అడిగారు. ఆయనకు సమాధానమిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«الإِيمَانُ أَنْ تُؤْمِنَ بِاللَّهِ، وَمَلَائِكَتِهِ، وَكُتُبِهِ، وَرُسُلِهِ، وَاليَوْمِ الآخِرِ، وَتُؤْمِنَ بِالقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ».
ఈమాన్ అంటే నీవు అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంథములపై, ఆయన ప్రవక్తలపై మరియు అంతిమదినంపై విశ్వాసము చూపుట మరియు నీవు విధివ్రాతపై దాని మంచి - చెడులపై విశ్వాసము చూపుట1. హదీథు, మరియు ఈ హదీథును ఇమామ్ బుఖారీ మరియు ఇమామ్ ముస్లిం రహిమహుమల్లాహ్ - స్వల్ప వ్యత్యాసంతో - అబూహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి నమోదు చేసినారు.
ఈ ఆరు మూలవిశ్వాసాల నుండి: మహోన్నతుడైన అల్లాహ్ విషయంలో, పునరుత్థానం విషయంలో మరియు అగోచర విషయాలలో ఒక ముస్లిం తప్పకుండా విశ్వసించవలసిన ప్రతిదీ ఉద్భవిస్తుంది - వేటి గురించి అయితే మహోన్నతుడైన అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినారో.
ఈ ఆరు అసలు మూలాల వివరణ ఇలా ఉంది:
మొదటి మూలవిశ్వాసము: మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం:
ఇది అనేక విషయాలను కలిగి ఉంది, వాటిలో కొన్ని: అల్లాహ్ యే నిజ ఆరాధ్య దైవమని, ఇతరులు కాకుండా ఆయనే ఆరాధనకు హక్కుదారుడని విశ్వసించటం; ఎందుకంటే ఆయనే దాసులను సృష్టించి వారిపై ఉపకారము చేసినవాడు, వారికి ఆహారోపాధిని కలిగించే వాడు, వారి రహస్యాలు, వారి బాహ్య కార్యాలు తెలిసినవాడు. మరియు వారిలో నుండి విధేయత చూపే వారికి ప్రతిఫలం ప్రసాదించటంపై మరియు వారిలో నుండి అవిధేయత చూపిన వారిని శిక్షించటంపై సామర్ధ్యం గలవాడు.
అల్లాహ్ జిన్నులను మరియు మానవులను తన ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాడు. మరియు వారిని దాని గురించి ఆదేశించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَا خَلَقۡتُ ٱلۡجِنَّ وَٱلۡإِنسَ إِلَّا لِيَعۡبُدُونِ 56 مَآ أُرِيدُ مِنۡهُم مِّن رِّزۡقٖ وَمَآ أُرِيدُ أَن يُطۡعِمُونِ 57 إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلۡقُوَّةِ ٱلۡمَتِينُ 58﴾
మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించుట కొరకే!
నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు 57
నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రదాత, మహా బలవంతుడు, ఎంతో స్థైర్యం గలవాడు. 58
[అద్ దారియాత్: 56-58]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعۡبُدُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ 21 ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ فِرَٰشٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزۡقٗا لَّكُمۡۖ فَلَا تَجۡعَلُواْ لِلَّهِ أَندَادٗا وَأَنتُمۡ تَعۡلَمُونَ 22﴾
ఓ మానవులారా! మిమ్మల్నీ మరియు మీకు పూర్వం వారినీ సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!
ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పాన్పుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి.
[అల్ బఖర: 21-22]
ఈ సత్యమును బోధించటానికి మరియు దాని వైపు పిలవటానికి మరియు దానికి వ్యతిరేకంగా ఉన్న వాటి నుండి హెచ్చరించటానికి అల్లాహ్ ప్రవక్తలను పంపించాడు. మరియు గ్రంథములను అవతరింపజేశాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَ...﴾
మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతను తన ప్రజలతో ఇలా అన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి. [అన్-నహల్: 36]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِيٓ إِلَيۡهِ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعۡبُدُونِ25﴾
మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." (అనే సందేశం ఇచ్చి పంపినాము) 25 [అల్-అంబియా: 25]
మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿الر كِتَابٌ أُحْكِمَتْ آيَاتُهُ ثُمَّ فُصِّلَتْ مِنْ لَدُنْ حَكِيمٍ خَبِيرٍ1 أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ إِنَّنِي لَكُمْ مِنْهُ نَذِيرٌ وَبَشِيرٌ2﴾
అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీని ఆయాతులు (వచనాలు) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరఫు నుండి వివరించబడినాయి;
మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని (ఓ ముహమ్మద్) ఇలా అను: "నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే! [హూద్: 1-2]
ఈ ఆరాధన యొక్క వాస్తవికత ఏమిటంటే దాసులు ఆరాధించే ఆరాధనలైన దుఆ (ప్రార్థన), భయము, ఆశ, నమాజు, ఉపవాసము, జిబహ్ (ఖుర్బానీ) చేయటం, మొక్కుబడులు మరియు ఇతర ఆరాధనలు ఏవైతే ఆయనపై వినయంతో, ఆయన నుండి లభించే ప్రతిఫలంపై ఆశతో, ఆయన విధించే శిక్షపై భయంతో, ఆయనంటే పూర్తి ఇష్టంతో, ఆయన ఔన్నత్యం ముందు తలవంచుతూ చేసేవి ఉన్నాయో, అవన్నీ కేవలం అల్లాహ్ ఒక్కనికి మాత్రమే చేయటం.
పవిత్ర ఖుర్ఆన్ ను లోతుగా పరిశీలించినప్పుడు: దాని ఎక్కువ భాగం ఈ మహత్తర మూలంపై అవతరింపబడినదని కనుగొంటారు; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ فَٱعۡبُدِ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَهُ الدِّينَ 2 أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ3﴾
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో!
వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు. [అజ్ జుమర్: 2-3]
మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعۡبُدُوٓاْ إِلَّآ إِيَّاهُ...﴾
మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ...(ప్రకటించినాడు) [అల్ ఇస్రా: 23]
మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ వాక్కు:
﴿فَٱدۡعُواْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ وَلَوۡ كَرِهَ ٱلۡكَٰفِرُونَ14﴾
కావున (ఓ విశ్వాసులారా!) మీరు మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయనకే (అల్లాహ్ కే) ప్రత్యేకించుకొని, కేవలం అల్లాహ్ ను మాత్రమే ప్రార్థించండి. సత్యతిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైనా సరే! [గాఫిర్: 14]
అదేవిధంగా, ప్రవక్త యొక్క సున్నతును (బోధనలను) ఎవరైతే లోతుగా పరిశీలిస్తారో, వారు ఈ గొప్ప మూలవిశ్వాసానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వబడినదో కనుగొంటారు. ఉదాహరణ: సహీహైన్లో (బుఖారీ, ముస్లింలో) ముఆద్ (రదియల్లాహు అన్హు) నుండి ఉల్లేఖించబడిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
«حَقُّ اللهِ عَلَى العِبَادِ أَن يَعْبُدُوهُ وَلَا يُشْرِكُوا بِهِ شَيْئًا».
«దాసులపై అల్లాహ్ హక్కు ఏమిటంటే వారు ఆయననే ఆరాధించాలి మరియు ఆయనకు దేనినీ సాటికల్పించకూడదు.2»
అల్లాహ్ పై విశ్వాసం చూపటంలో ఇది కూడా ఉన్నది: ఆయన తన దాసులపై తప్పనిసరి చేసిన, వారిపై విధిగావించిన ఇస్లాం యొక్క ఐదు ప్రత్యక్షమైన మూల స్థంభాలన్నిటిని విశ్వసించటం.
ఇవి: అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు లేడు అని, మరియు నిస్సందేహంగా ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు' అని సాక్ష్యం ఇవ్వడం, నమాజు స్థాపించడం, జకాతు చెల్లించడం, రమదాను ఉపవాసాలు ఉండటం, తగిన స్థోమత ఉంటే' అల్లాహ్ గృహం [కాబతుల్లాహ్] హజ్జ్ చేయడం, మరియు పరిశుద్ధమైన షరీఅతు విధానంలో ఆదేశించబడిన ఇతర విధులు.
ఈ మూలస్థంభాలలో అతిముఖ్యమైన మరియు గొప్పదైనది: అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం పలకటం. ఈ సాక్ష్యం అల్లాహ్ ఒక్కడికే ఆరాధనను ప్రత్యేకించటం మరియు ఆయన కాకుండా ఇతరులను నిరాకరించటం అవసరమని సూచిస్తుంది. ఇది 'లా ఇలాహ ఇల్లల్లాహ్' యొక్క అర్థము. దీని అర్థం - పండితులు రహిమహుముల్లాహ్ చెప్పినట్లుగా - అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యులు ఎవ్వరూ లేరని. అందువలన అల్లాహ్ కాకుండా ఆరాధించబడే మానవులు లేదా దైవదూతలు లేదా జిన్నులు లేదా వేరేవి అన్నీ అసత్య ఆరాధ్యదైవాలు. కాబట్టి, వాస్తవ ఆరాధ్యదైవం అల్లాహ్ ఒక్కడే, ఆయనకు ఎవ్వరు సాటి లేరు, దీని గురించి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّ مَا يَدۡعُونَ مِن دُونِهِۦ هُوَ ٱلۡبَٰطِلُ...﴾
ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! కేవలం ఆయన మాత్రమే సత్యం! మరియు ఆయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! [హజ్ 22:62]
ఇంతకు ముందు ప్రస్తావించబడినట్లు, పరమ పవిత్రుడైన అల్లాహ్ జిన్నులు మరియు మానవులను ఈ ప్రధానమైన మూల సూత్రం కోసమే సృష్టించాడు, దానిని పాటించమని వారికి ఆజ్ఞాపించాడు, దానికోసమే తన ప్రవక్తలను పంపాడు, తన గ్రంథాలను అవతరింపజేశాడు. అందువలన దాసుడు (మనిషి) దీనిని గురించి బాగా ఆలోచించాలి, లోతుగా పరిశీలించాలి — అప్పుడే అతనికి ఎక్కువమంది ముస్లింలు ఈ ప్రాథమిక సూత్రం గురించి ఎంత పెద్ద అజ్ఞానంలో ఉన్నారో స్పష్టమవుతుంది; వారు అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించారు, అల్లాహ్కి మాత్రమే చెందవలసిన హక్కులను ఇతరులకు సమర్పించారు. అల్లాహ్ మాత్రమే సహాయం చేయగలవాడు.
పరమ పవిత్రుడైన అల్లాహ్ మీద విశ్వాసంలో భాగంగా — ఆయనే సర్వలోక సృష్టికర్త, వాటి వ్యవహారాలను నియంత్రించేవాడు, తన జ్ఞానం మరియు శక్తి ప్రకారం వాటిని పాలించేవాడు అని నమ్మడం ఎంతో అవసరం. ఆయనే ఈ లోకమునకు మరియు పరలోకమునకు యజమాని, సమస్త లోకాల ప్రభువు. ఆయన తప్ప వేరే సృష్టికర్త లేడు, ఆయన తప్ప వేరే ప్రభువు లేడు. మరియు ఆయన దాసుల ప్రయోజనం కొరకు మరియు వారిని ఇహపరాలలో వారికి ప్రయోజనం, ముక్తి ఉన్న వాటి వైపు మార్గదర్శకతం చేసేందుకు తన ప్రవక్తలను పంపించాడు మరియు తన గ్రంథములను అవతరింపజేశాడు. మరియు ఆయన పరమ పరిశుద్ధుడు వీటన్నిటిలో ఆయనకు ఎవ్వరు సాటి లేరు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٞ 62﴾
అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి నిర్వాహణ కర్త. [అజ్ జుమర్ 39:62]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يُغۡشِي ٱلَّيۡلَ ٱلنَّهَارَ يَطۡلُبُهُۥ حَثِيثٗا وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتِۭ بِأَمۡرِهِۦٓۗ أَلَا لَهُ ٱلۡخَلۡقُ وَٱلۡأَمۡرُۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ54﴾
నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు రోజులలో స్రుష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు! [అల్ ఆరాఫ్ 7:54]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటంలో ఇది కూడా ఉంది: ఆయన దివ్యగ్రంథంలో ప్రస్తావించబడిన మరియు ఆయన ప్రవక్త నుండి నిరూపించబడిన ఆయన మంచి నామములు మరియు ఉన్నత గుణములను, ఎలాంటి వక్రీకరణ (తహ్రీఫ్) లేకుండా, నిరాకరించకుండా (తఆతీల్), స్వరూపం మార్చకుండా (తకీఫ్), వేటితోనూ పోల్చకుండా (తమ్సీల్) విశ్వసించటం.
﴿...لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ﴾
ఆయనను పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. [అష్'షూరా 42:11]
అందువల్ల, ఈ గుణాలను అవి ఎలా వచ్చాయో అలాగే స్వీకరించాలి — వాటి విధానం (ఎలా అన్నది) గురించి ప్రశ్నించకూడదు. అవి సూచించే గౌరవనీయమైన అర్ధాలను — అవి మహోన్నతుడైన అల్లాహ్ యొక్క గుణాలు అని నమ్మాలి, మరియు ఆయనకు తగిన విధంగా వాటిని ఆయనకు ఆపాదించాలి. అయితే ఆయన గుణాలలో ఏ విషయంలోనూ ఆయన సృష్టితో పోలిక ఉండదని నిశ్చయంగా నమ్మాలి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿فَلَا تَضۡرِبُواْ لِلَّهِ ٱلۡأَمۡثَالَۚ إِنَّ ٱللَّهَ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ74﴾
కావున అల్లాహ్ కు పోలికలు కల్పించకండి. నిశ్చయంగా, అల్లాహ్ కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు. [అన్నహల్ 16:74]
ఇదే — అల్లాహ్ యొక్క నామములు మరియు గుణముల విషయంలో అహ్లుస్సున్నహ్ వల్ జమాఅత్ [అల్లాహ్ ప్రవక్త ﷺ యొక్క సహాబీలు మరియు వారిని మంచి విధంగా అనుసరించినవారి (తాబయీనా)] యొక్క విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఇమామ్ అబూ హసన్ అల్-అష్అరీ రహిమహుల్లాహ్ తన "అల్-మఖాలాత్" అనే పుస్తకంలో అహ్లుహదీథ్ మరియు అహ్లుస్సున్నహ్ నుండి పేర్కొన్నారు. అలాగే ఇతర జ్ఞానవంతులు మరియు విశ్వాసులు కూడా ఈ విశ్వాసాన్ని ప్రస్తావించారు.
ఇమామ్ అవ్'జాయీ ఈ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు: అజ్-జుహరీ మరియు మక్-హూల్ (రహిమహుమల్లాహ్ ల) తో అల్లాహ్ యొక్క గుణాల గురించి వచ్చిన ఆయతుల గురించి అడినప్పుడు, వారిద్దరు "అవి ఎలా వచ్చినవో అలాగే అర్ధం చేసుకోండి" అని అన్నారు3.
ఇమామ్ అవ్జాయీ రహిమహుల్లాహ్ ఇలా కూడా పలికారు: మేము మరియు తాబియీనులలో నుండి ఒక పెద్ద వర్గం పరమ పవిత్రుడైన అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడని పలికేవారము. మరియు అల్లాహ్ గుణాల గురించి సున్నతులో వచ్చిన దానిని విశ్వసించేవారము.4
మరియు అల్ వలీద్ బిన్ ముస్లిం రహిమహుల్లాహ్ ఇలా పలికారు: ఇమామ్ మాలిక్, ఇమామ్ అవ్-జాయీ, ఇమామ్ లైథ్ ఇబ్నె సఅద్ మరియు ఇమామ్ సుఫ్యాన్ సౌరీ రహిమహుముల్లాహ్ తో అల్లాహ్ గుణాల గురించి వచ్చిన హదీథుల గురించి అడిగితే వారందరు అవి ఎలా వచ్చినవో అలాగే వాటిని ఏ విధమైన వర్ణనలు చేయకుండా స్వీకరించండి అని అన్నారు5.
ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ గురువు అయిన రబీఅహ్ బిన్ అబీ అబ్దుర్రహ్మాన్ రహ్మతుల్లాహి అలైహితో 'ఇస్తవా' గురించి అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు: 'ఇస్తివా' అన్నది తెలియని విషయం కాదు. దాని వర్ణన అర్ధం చేసుకోవడం సాధ్యం కాని విషయం. సందేశాలు అల్లాహ్ వద్ద నుంచి వస్తాయి. సందేశాలను స్పష్టంగా చేరవేయటం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాధ్యత. మరియు వాటిని నమ్మటం మన బాధ్యత.6 మరియు ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ తో దాని గురించి అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానమిచ్చారు: 'ఇస్తివా' అన్నది తెలిసిన విషయం. మరియు దాని వర్ణన తెలియని విషయం. దానిని విశ్వసించటం తప్పనిసరి. దాని గురించి ప్రశ్నించటం బిదఅతు అగును. ఆ తరువాత ప్రశ్నించిన వ్యక్తిని ఉద్దేశించి నేను నిన్ను చెడ్డ వ్యక్తిగా భావిస్తున్నాను అన్నారు. మరియు అతనిని గెంటివేయమని అని ఆదేశించారు.'7 మరియు ఇదే అర్థములో ఉమ్ముల్ మూమినీన్ ఉమ్మె సల్మా రదియల్లాహు అన్హా యొక్క ఉల్లేఖన కూడా గలదు8.
ఇమామ్ అబూ అబ్దుర్-రహ్మాన్ ఇబ్నుల్-ముబారక్ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు: ' పరమ పవిత్రుడైన మన ప్రభువు తన సృష్టి నుండి వేరుగా తన ఆకాశములపై తన సింహాసనముపై ఉన్నాడని మాకు తెలుసు'9.
ఈ విభాగంలో ఇమామ్ ల మాటలు చాలా ఉన్నవి. ఇక్కడ వాటిన్నింటినీ తెలియపరచటం అసాధ్యము. ఎవరైన వీటిలో నుండి దేని గురించి అయినా తెలుసుకోదలచితే వారు ఈ విభాగంలో హదీథు ఉలమాలు వ్రాసిన పుస్తకముల వైపు మరలాలి. ఉదాహరణకు: అబ్దుల్లాహ్ ఇబ్నె ఇమామ్ అహ్మద్ పుస్తకం 'అస్సున్నహ్', ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె ఖుజైమా పుస్తకం 'అత్తౌహీద్', అబుల్ ఖాసిమ్ అల్ లాల్కాయీ అత్తబరి పుస్తకం 'అస్సున్నహ్', అబూబకర్ ఇబ్నె అబీ ఆసిమ్ యొక్క పుస్తకం 'అస్సున్నహ్', మరియు హమాత్ వాసులకు షేఖుల్ ఇస్లామ్ ఇబ్నె తైమియ జవాబు మరియు అది చాలా ప్రయోజనాలు గల గొప్ప జవాబు. అందులో ఆయన రహిమహుల్లాహ్ అహ్లుస్సున్నహ్ విశ్వాసమును స్పష్టపరచారు మరియు ఆయన అందులో వారి చాలా మాటలను మరియు అహ్లుస్సున్నహ్ పలికిన మాటలను సత్యపరచే మరియు విభేదించే వారి మాటలను అసత్యపరచే ధార్మిక, బౌద్ధిక ఆధారాలతో సహా తెలియపరచారు.
మరియు ఇలాగే తద్మూరియ పేరు గల ఆయన పత్రికలో ఆయన అహ్లు - స్ - సున్నహ్ ల విశ్వాసమును ఖుర్ఆన్, హదీథుల, బౌద్ధిక ఆధారాలతో తెలియపరచారు. మరియు వాటిని విభేదించేవారిని ఎలా ఖండించారంటే ఒక జ్ఞానవంతుడు మంచి ఉద్దేశముతో, సత్యమును తెలుసుకోవాలి అనే కోరికతో అందులో చూస్తే అతనికి సత్యము స్పష్టమవుతుంది మరియు అసత్యము తొలిగిపోతుంది. ఇక అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వారి నామముల మరియు గుణగణాల విభాగంలో విశ్వాసము; వారు పరమ పవిత్రుడైన అల్లాహ్ తన గ్రంథంలో తన స్వయం కొరకు నిరూపించుకున్న వాటిని మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సున్నతులో ఆయన కొరకు నిరూపించిన వాటిని ఎటువంటి పోలిక లేకుండా అల్లాహ్ కొరకు నిరూపించేవారు మరియు ఆయన సుబ్హానహు వతఆలాను ఆయన సృష్టి పోలిక నుండి పరిశుద్ధపరిచేవారు. వారు వైరుధ్యము నుండి భద్రంగా ఉండి సాఫల్యం పొందారు. మరియు వారు ప్రామాణిక ఋజువులన్నించితో ఆచరించారు; దీనికి కారణం అల్లాహ్ యొక్క తౌఫీఖ్ (మార్గదర్శకత్వం). ఎందుకంటే, తన ప్రవక్తల ద్వారా పంపబడిన సత్యానికి ఎవరు కట్టుబడి ఉంటారో, దాని కోసం తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తారో మరియు దాని అన్వేషణలో అల్లాహ్ పట్ల, చిత్తశుద్ధితో నిష్కల్మషంగా ఉంటారో, అలాంటి వారిని సత్యం వైపు మార్గనిర్దేశం చేయడం మరియు వారి వాదనను స్పష్టంగా నిలబెట్టడం అల్లాహ్ సున్నత్ (నియమం), పరమ పవిత్రుడైన అల్లాహ్ ప్రకటన:
﴿بَلۡ نَقۡذِفُ بِٱلۡحَقِّ عَلَى ٱلۡبَٰطِلِ فَيَدۡمَغُهُۥ فَإِذَا هُوَ زَاهِقٞ...﴾
అలా కాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగుల గొడుతుంది, అప్పుడు అది (అసత్యం) నశించి పోతుంది... [అల్-అంబియా 21:18]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَلَا يَأۡتُونَكَ بِمَثَلٍ إِلَّا جِئۡنَٰكَ بِٱلۡحَقِّ وَأَحۡسَنَ تَفۡسِيرًا33﴾
మరియు వారు నీ వద్దకు (నిన్ను వ్యతిరేకించటానికి) ఎలాంటి ఉపమానాన్ని తెచ్చినా! మేము నీకు దానికి సరైన జవాబు మరియు ఉత్తమమైన వ్యాఖ్యానం ఇవ్వకుండా ఉండము. [అల్ ఫుర్'ఖాన్ 25:33]
అహ్లె సున్నతు వారు విశ్వసించిన అల్లాహ్ యొక్క నామాలు, గుణాల విషయంలో వారితో విభేదించే వ్యక్తి, నిస్సందేహంగా, వాస్తవిక మరియు తార్కిక ప్రమాణాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అతను ఏమి ధ్రువీకరిస్తాడో, ఏమి తిరస్కరిస్తాడో అన్నింటిలోనూ స్పష్టమైన పరస్పర విరుద్ధతలు, భిన్నత్వాలు కనిపిస్తాయి. తన సుప్రసిద్ధ తఫ్సీర్ గ్రంథంలో, హాఫిజ్ ఇబ్ను కథీర్ (రహిమహుల్లాహ్) ఈ విషయంపై చాలా మంచి వివరణను ఇచ్చారు. మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కును వివరిస్తూ ఆయన ఇలా పలికారు:
﴿إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِ...﴾
నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు రోజులలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు... [అల్-ఆరాఫ్ 7:54]
ఇక్కడ దీనిని ఉటంకించడం సముచితం, ఎందుకంటే ఇందులో గొప్ప ప్రయోజనం ఉంది. కాబట్టి ఇబ్న్ కథీర్ (రహిమహుల్లాహ్) ఇలా పేర్కొన్నారు:
ఈ విషయంలో ప్రజలు అనేక అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కానీ వాటినన్నింటినీ వివరించడానికి ఇది సమయం కాదు. మేము ఇక్కడ సలఫె సాలిహీన్ (పుణ్యాత్ములైన పూర్వీకులు) అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తాము - అదే ఇమామ్ మాలిక్, ఇమామ్ ఔజాయి, ఇమామ్ సౌరీ, ఇమామ్ లైస్ బిన్ సఅద్, ఇమామ్ షాఫిఈ, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్, ఇమామ్ ఇస్హాక్ బిన్ రాహువైహ్ మరియు ఇతర ముస్లిం పండితులు (ప్రాచీన మరియు ఆధునిక కాలంలో) అనుసరించిన మార్గం. అదేమిటంటే: ఈ వాక్యాలను (అల్లాహ్ గుణగణాల గురించిన వాటిని) వాటి వాస్తవ రూపంలో మాత్రమే అంగీకరించడం. అయితే, వాటికి దేనినీ చేర్చకుండా, దేనితోనూ సాదృశ్యం కల్పించకుండా అంటే పోల్చకుండా, లేదా వాటిని నిరాకరించకుండా ఉండటం. ముషబ్బిహా (పోలిక కల్పించేవారి) మనస్సుల్లో అల్లాహ్ కు సంబంధించి కలిగే స్పష్టమైన అర్థాలు నిరాకరించబడ్డాయి. నిశ్చయంగా, అల్లాహ్ తన సృష్టిలో దేనినీ పోలి లేడు.
﴿...لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ﴾
ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. [అష్'షూరా 42:11] ఈ విషయం ఇమాములు చెప్పినట్లుగానే ఉంది. వారిలో ఒకరైన బుఖారీ (రహిమహుల్లాహ్) గురువు నుఐమ్ బిన్ హమ్మాద్ అల్-ఖుజాయి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: 'ఎవరైతే అల్లాహ్ ను ఆయన సృష్టితో పోల్చుతాడో అతడు కాఫిర్ (సత్యతిరస్కారి) అయ్యాడు. మరియు ఎవరైతే అల్లాహ్ తన గురించి వర్ణించిన దానిని తిరస్కరిస్తాడో అతనూ కాఫిర్ (సత్యతిరస్కారి) అయ్యాడు.'10 అల్లాహ్ స్వయంగా తన గురించి వివరించిన లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి వివరించిన వాటిని దేనితోనూ పోల్చకూడదు (ఉపమానం లేదు). కాబట్టి, ఎవరైతే స్పష్టమైన ఆయతులు మరియు ప్రామాణికమైన హదీథుల ద్వారా వివరించబడిన అల్లాహ్ యొక్క గుణగుణాలను ఆయన మహిమకు తగిన విధంగా ధ్రువీకరించి, (అజ్ఞానులు) అల్లాహ్ కొరకు ఆపాదిస్తున్న అన్ని లోపాలను తిరస్కరిస్తారో, నిశ్చయంగా అలాంటి వారు సన్మార్గాన్ని అనుసరించారు. ఇబ్న్ కథీర్ రహిమహుల్లాహ్ వివరణ ఇక్కడ ముగిసింది.11
అల్లాహ్ పై ఈమాన్ (విశ్వాసం) అంటే మాటలతో, ఆచరణలతో కూడినదని, అది అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం వలన పెరుగుతుందని, అల్లాహ్ కు అవిధేయత చూపడం వలన తగ్గుతుందని నమ్మడం కూడా ఈ శ్రేణికే చెందుతుంది. అలాగే, షిర్క్ (అల్లాహ్ తో భాగస్వామ్యం కల్పించడం) లేదా కుఫ్ర్ (అవిశ్వాసం) కంటే తక్కువ స్థాయి పాపాలైన వ్యభిచారం, దొంగతనం, వడ్డీ లావాదేవీలు, మద్యపానం, తల్లిదండ్రులకు అవిధేయత మొదలైన మహాపాపాలకు పాల్బడటం వలన ఒక ముస్లింను కాఫిర్ (అవిశ్వాసి) అని పిలవడం సరికాదు - అతను ఆ పాపాలను హలాల్ (అనుమతించబడినవి) అని భావించనంత వరకు. దీనికి ప్రమాణం మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿إِنَّ ٱللَّهَ لَا يَغۡفِرُ أَن يُشۡرَكَ بِهِۦ وَيَغۡفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ...﴾
నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు... [అన్'నిసా 4:48] ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనేక హదీథుల ద్వారా కూడా నిరూపితమైనది, అందులో ఒకటి: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«إِنَّ اللهَ يُخْرِجُ مِنَ النَّارِ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ حَبَّةٍ مِنْ خَرْدَلٍ مِنْ إِيْمَانٍ».
ఎవరి హృదయంలోనైనా ఆవగింజంత విశ్వాసమున్నా అల్లాహ్ అతడిని నరకం నుండి వెలికి తీస్తాడు.12
రెండవ మూలం: దైవదూతలపై విశ్వాసం.
ఇది రెండు విషయాలను కలిగి ఉంది: మొదటిది: దైవదూతల పట్ల సమగ్ర విశ్వాసం కలిగి ఉండటం. అంటే, అల్లాహ్ తాను ఆజ్ఞాపించిన పనులు చేసేందుకు దైవదూతలను సృష్టించాడని మనం నమ్మాలి. మరియు ఆయన వారిని ఇలా వర్ణించాడు:
﴿وَقَالُواْ ٱتَّخَذَ ٱلرَّحۡمَٰنُ وَلَدٗاۗ سُبۡحَٰنَهُۥۚ بَلۡ عِبَادٞ مُّكۡرَمُونَ 26 لَا يَسۡبِقُونَهُۥ بِٱلۡقَوۡلِ وَهُم بِأَمۡرِهِۦ يَعۡمَلُونَ27 يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡ وَلَا يَشۡفَعُونَ إِلَّا لِمَنِ ٱرۡتَضَىٰ وَهُم مِّنۡ خَشۡيَتِهِۦ مُشۡفِقُونَ28﴾
వారంటున్నారు: "అనంత కరుణామయునికి సంతానముంది!" అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే!
వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు.
వారి ముందు ఉన్నదంతా ప్రత్యక్షంగా ఆయనకు తెలుసు. వారు, ఆయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు. వారు, ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు.28﴾ [అల్-అంబియా 21:26-28]
మరియు వారు (దేవదూతలు) అనేక రకాలు: వారిలో కొందరు అర్షును (సింహాసనాన్ని) మోయడానికి నియమించబడినవారు, మరికొందరు స్వర్గం మరియు నరకం యొక్క కాపలాదారులు, మరికొందరు దాసుల కర్మలను నమోదు చేసే బాధ్యత వహించేవారు ఉన్నారు. రెండవది: వివరణాత్మకంగా దైవదూతలపై విశ్వాసం కలిగి ఉండటం. దీని అర్థం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మనకు తెలియజేసిన దైవదూతల పేర్లను విశ్వసించడం. ఉదాహరణకు: జిబ్రయీల్ (అలైహిస్సలాం) - వహీ (దైవసందేశం) తీసుకురావడానికి నియమించబడిన దైవదూత; మీకాయీల్ - వర్షానికి బాధ్యత వహించే దైవదూత; మాలిక్ - నరకానికి కాపలాదారుడు; ఇస్రాఫీల్ - సూర్ (శంఖం) ఊదడానికి నియమించబడిన దైవదూత. సహీహ్ (ప్రామాణిక) హదీథులలో కూడా వారి ప్రస్తావన వచ్చింది. వాటిలో, ఆయిషా రదియల్లాహు అన్హా నుండి ఉల్లేఖించబడిన ఒక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«خُلِقَتِ الـمَلَائِكَةُ مِن نُورٍ، وَخُلِقَ الجَانُّ مِنْ مَارِجٍ مِنْ نَارٍ، وَخُلِقَ آدَمُ مِمَّا وُصِفَ لَكُم».
దైవదూతలు నూర్ (కాంతి) నుండి సృష్టించబడ్డారు, జిన్నులు మండే అగ్ని నుండి సృష్టించబడ్డారు, మరియు ఆదమ్ (అలైహిస్సలాం) మీకు వివరించిన దానితో (మట్టితో) సృష్టించబడ్డారు.13 దీనిని ముస్లిం తన సహీహ్ లో నమోదు చేసినారు.
మూడవ మూలం: దైవగ్రంధములను విశ్వసించడం, ఇది కూడా రెండు విషయములను కలిగి ఉన్నది:
మొదటిది: దైవగ్రంథాలను విశ్వసించడం; నిశ్చయంగా అల్లాహ్ సత్యాన్ని, ధర్మాన్ని వివరించడానికి, దాని ప్రచారం చేసేందుకు తన ప్రవక్తలపై, సందేశహరులపై దైవగ్రంథాలను అవతరింపచేసినాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلۡقِسۡطِ...﴾
వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచలనిచ్చి పంపాము. మరియు వారితో బాటు గ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగటానికి త్రాసును కూడా పంపాము... [అల్ హదీద్ 57:25] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿كَانَ ٱلنَّاسُ أُمَّةٗ وَٰحِدَةٗ فَبَعَثَ ٱللَّهُ ٱلنَّبِيِّـۧنَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِيَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ فِيمَا ٱخۡتَلَفُواْ فِيهِ...﴾
పూర్వం, మానవులంతా ఒకే ఒక సమాజంగా ఉండేవారు. అప్పుడు అల్లాహ్ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు. మరియు మానవులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి, ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవతరింపజేశాడు... [అల్ బఖరహ్ 2:213]
రెండవది: దివ్యగ్రంథాలపై సంపూర్ణ విశ్వాసం; అంటే అల్లాహ్ పేర్లు తెలిపిన వాటిని విశ్వసించటం, ఉదాహరణకు తౌరాత్, ఇంజీల్, జబూర్ మరియు ఖుర్ఆన్. ఖుర్ఆన్ వాటిలో ఉన్నతమైనది, చిట్టచివరిది, వాటిపై పర్యవేక్షకునిగా ఉన్నది మరియు వాటిని ధృవీకరిస్తుంది. దానిని అనుసరించడం మరియు తీర్పులివ్వడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన సహీహ్ హదీథులకు అనుగుణంగా మొత్తం సమాజం (ఉమ్మత్) పై తప్పనిసరి; ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మానవులు, జిన్నాతులందరి వద్దకు తన ప్రవక్తగా పంపించాడు మరియు ఖుర్ఆన్ ను దాని ద్వారా ఆయన తీర్పులివ్వటం కొరకు ఆయనపై అవతరింపజేశాడు. దానిని హృదయములలో ఉన్న వాటిని నయం చేసేదిగా, ప్రతీ దానినీ విశదపరచేదిగా, విశ్వాసపరుల కొరకు మార్గదర్శకంగా, కారుణ్యంగా చేశాడు. అల్లాహ్ ప్రకటన:
﴿وَهَٰذَا كِتَٰبٌ أَنزَلۡنَٰهُ مُبَارَكٞ فَٱتَّبِعُوهُ وَٱتَّقُواْ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ155﴾
మరియు ఇదే విధంగా శుభప్రదమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి, భయభక్తులు కలిగి ఉంటే, మీరు కరుణింపబడవచ్చు! [అల్-అన్-ఆమ్ 6:155] అల్లాహ్ ప్రకటన:
﴿...وَنَزَّلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ تِبۡيَٰنٗا لِّكُلِّ شَيۡءٖ وَهُدٗى وَرَحۡمَةٗ وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ﴾
నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి. [అన్-నహ్ల్ 16:89] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُمۡ جَمِيعًا ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحۡيِۦ وَيُمِيتُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِ ٱلنَّبِيِّ ٱلۡأُمِّيِّ ٱلَّذِي يُؤۡمِنُ بِٱللَّهِ وَكَلِمَٰتِهِۦ وَٱتَّبِعُوهُ لَعَلَّكُمۡ تَهۡتَدُونَ158﴾
(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు; ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు! [అల్-అఅ్-రాఫ్ 7:158]. మరియు ఇంకా ఇలాంటి ఎన్నో ఆయతులు ఉన్నాయి.
నాల్గవ మూలం: దైవ ప్రవక్తలపై విశ్వాసం.
ఇది కూడా రెండు విషయాలను కలిగి ఉంది: మొదటిది: దైవప్రవక్తలందరినీ విశ్వసించడం; అనగా అల్లాహ్ తన దాసుల వద్దకు ప్రవక్తలను పంపించాడని, వారిలో శుభవార్తనిచ్చేవారు, హెచ్చరించేవారు, సత్యం వైపు పిలిచేవారు ఉన్నారని మనము విశ్వసించాలి. వారి పిలుపును స్వీకరించేవాడు సుఖసంతోషాలతో సాఫల్యం చెందుతాడు మరియు వారిని విభేదించినవాడు, తిరస్కరించినవాడు దౌర్భాగ్యముతో, అపనిందతో మరలుతాడు. వారందరిలో అంతిమ ప్రవక్త మరియు ఉత్తమ ప్రవక్త - మన ప్రవక్త ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ ప్రకటన:
﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَ...﴾
మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి. [అన్-నహల్ 16:36] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿رُّسُلٗا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى ٱللَّهِ حُجَّةُۢ بَعۡدَ ٱلرُّسُلِ...﴾
(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! [అన్-నిసా 4:165] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿مَّا كَانَ مُحَمَّدٌ أَبَآ أَحَدٖ مِّن رِّجَالِكُمۡ وَلَٰكِن رَّسُولَ ٱللَّهِ وَخَاتَمَ ٱلنَّبِيِّـۧنَ...﴾
(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు... [అల్-అహ్’జాబ్ 33:40]
రెండవది: దైవప్రవక్తలను విశ్వసించటం అంటే అల్లాహ్ లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పేర్లు తెలియజేయబడిన ప్రవక్తలను ప్రత్యేకంగా మరియు స్పష్టంగా విశ్వసించటం. ఉదాహరణకు నూహ్, హూద్, సాలిహ్, ఇబ్రాహీం మొదలైన ప్రవక్తలు అలైహిముస్సలాం మరియు వారి కుటుంబ సభ్యులు, వారి సహచరులపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు కురుయు గాక!
ఐదవ మూలం: అంతిమ దినమును విశ్వాసించడం.
ఇది ఈ క్రింది విషయాలు కలిగి ఉంది:
మరణాంతరం సంభవించే వాటి గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన వాటిని విశ్వసించటం. ఉదాహరణకు సమాధి పరీక్ష మరియు దాని యాతన, దాని అనుగ్రహాలు మరియు ప్రళయదినమున సంభవించే భయాందోళనలు, కఠిన పరిస్థితులు మరియు పుల్-సిరాత్ వంతెన, త్రాసు, లెక్క తీసుకోబడటం, ప్రతిఫలం ప్రసాదించబడటం మరియు ప్రజల మధ్య కర్మల పత్రాల పంపిణీ, కొందరు తమ కర్మల పత్రమును కుడిచేతులో తీసుకోవటం, కొందరు తమ కర్మల పత్రమును ఎడమ చేతితో లేదా వీపు వెనుక నుండి తీసుకోవడం మొదలైనవి.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రసాదించబడే హౌజె కౌసర్ ను విశ్వసించటం, స్వర్గమును మరియు నరకమును విశ్వసించటం, విశ్వాసపరులు తమ ప్రభువును దర్శించుకోవటం, ఆయనతో సంభాషించటం, దివ్యఖుర్ఆన్ లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీహ్ హదీథులలో వచ్చిన తదితర వాటిని విశ్వసించటం మొదలైనవి ఇందులోనే వస్తాయి. వీటన్నిటిని విశ్వసించటం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరచిన విధంగా వాటిని నమ్మటం ముస్లింలపై తప్పనిసరి విధి.
ఆరవ మూలం: విధివ్రాత పట్ల విశ్వాసం.
ఈ విశ్వాసంలో ఈ క్రింది నాలుగు విషయములు ఇమిడి ఉన్నాయి:
మొదటిది: పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు జరిగినది మరియు జరగబోయేది ఖచ్చితంగా తెలుసు, తన దాసుల స్థితిగతులు, వారి ఆహారోపాధి, వారి వయస్సు, వారి కర్మలు మరియు వారి తదితర విషయములు ఆయన పూర్తిగా ఎరుగును. ఆయన వద్ద ఏదీ గోప్యంగా ఉండదు. దీని గురించి అల్లాహ్ ప్రకట:
﴿...وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ﴾
మరియు నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి. [అల్-బఖరహ్ 2:231] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ప్రకట:
﴿...لِتَعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ وَأَنَّ ٱللَّهَ قَدۡ أَحَاطَ بِكُلِّ شَيۡءٍ عِلۡمَۢا﴾
మీరు తెలుసుకోవటానికి, నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు మరియు వాస్తవానికి అల్లాహ్ తన జ్ఞానంతో ప్రతిదానిని పరివేష్టించి వున్నాడని. [అత్-తలాఖ్ 65: 12]
రెండవది: అల్లాహ్ తాను నిర్ణయించిన మరియు తీర్మానించిన ప్రతిదీ వ్రాసి ఉంచాడని విశ్వసించడం; అల్లాహ్ ప్రకటన:
﴿قَدۡ عَلِمۡنَا مَا تَنقُصُ ٱلۡأَرۡضُ مِنۡهُمۡۖ وَعِندَنَا كِتَٰبٌ حَفِيظُۢ 4﴾
వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు. మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. [ఖాఫ్ 50:4] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿...وَكُلَّ شَيۡءٍ أَحۡصَيۡنَٰهُ فِيٓ إِمَامٖ مُّبِينٖ﴾
మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసి ఉంచాము. [యాసీన్ 36:12] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ذَٰلِكَ فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ70﴾
ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది. [అల్-హజ్ 22:70]
మూడవది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క చిత్తం అమలవుతుంది; ఆయన కోరుకున్నదే జరుగుతుంది, ఆయన కోరనిది జరుగదు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿...إِنَّ ٱللَّهَ يَفۡعَلُ مَا يَشَآءُ﴾
నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు. [హజ్ 22:18] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ప్రకటన:
﴿إِنَّمَآ أَمۡرُهُۥٓ إِذَآ أَرَادَ شَيۡـًٔا أَن يَقُولَ لَهُۥ كُن فَيَكُونُ82﴾
నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచు కున్నప్పుడు దానితో: "అయిపో!" అని అంటాడు, అంతే! అది అయిపోతుంది. [యాసీన్ 36:82] అల్లాహ్ ప్రకటన:
﴿وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ29﴾
మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. [అత్తక్వీర్ 81:29]
నాల్గవది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సృష్టించిన సమస్త ఉనికిలో ఉన్నవాటిని విశ్వసించడం; ఆయన తప్ప వేరే సృష్టికర్త లేడు, ఆయన తప్ప వేరే ప్రభువు లేడు; సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٞ62﴾
అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి నిర్వాహణకర్త. [అజ్-జుమర్ 39:62] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱذۡكُرُواْ نِعۡمَتَ ٱللَّهِ عَلَيۡكُمۡۚ هَلۡ مِنۡ خَٰلِقٍ غَيۡرُ ٱللَّهِ يَرۡزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ فَأَنَّىٰ تُؤۡفَكُونَ3﴾
ఓ మానవులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి! ఏమీ? భూమ్యాకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకడు ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! అయితే మీరు ఎందుకు మోసగింప (సత్యం నుండి మరలింప) బడుతున్నారు? [ఫాతిర్ 35:3]
ఆరవ మూలం: విధి వ్రాతపై విశ్వాసం: అహ్లె సున్నత్ వల్ జమాఅత్ యొక్క నమ్మకంగా ఈ నాలుగు విషయములను పూర్తిగా విశ్వసించటం. దీనికి భిన్నంగా అహ్లె బిద్అ వీటిలో కొన్నింటిని తిరస్కరించారు.
సరిఅయిన అఖీదాలోని అహ్లె సున్నతు ప్రజలు నమ్మే ముఖ్యమైన విషయాలలో: అల్లాహ్ కొరకు ప్రేమించటం, అల్లాహ్ కొరకు ద్వేషించటం, అల్లాహ్ కొరకు స్నేహం చేయటం, అల్లాహ్ కొరకు శతృత్వం చేయటం ఉన్నాయి. ఇవి: అల్ వల్ బరా యొక్క అఖీదా (ప్రేమించుట మరియు ద్వేషించుట), మరియు ఇవి అల్లాహ్ తాలా పై విశ్వాసంలోని భాగము.
కావున విశ్వాసపరుడు విశ్వాసపరులని ప్రేమిస్తాడు మరియు వారితో స్నేహం చేస్తాడు మరియు సత్యతిరస్కారులను ద్వేషిస్తాడు మరియు వారితో శతృత్వం వహిస్తాడు. ఈ ఉమ్మత్ లో నుండి విశ్వాసపరుల మొదటి పంక్తిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఉన్నారు - అహ్లె సున్నత్ వల్ జమాఅతు ప్రకారం - వారు వారిని ప్రేమిస్తారు మరియు వారితో స్నేహం చేస్తారు మరియు వారు ప్రవక్తల తరువాత ప్రజందరిలో కెల్ల ఉత్తములని విశ్వసిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«خَيْرُ القُرُونِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُم».
«యుగాలన్నిటి లో ఉత్తమ మైనది నా యుగమే. అ తర్వాత తర్వాత వారు, మళ్లీ వాళ్ల తర్వాత తర్వాత వారు.»14 ఈ హదీథు ప్రామాణికత ధృవీకరించబడింది.
మరియు వారిలో అబూబకర్ సిద్దీఖ్ ఉత్తమమైన వారని, ఆ తరువాత ఉమర్ ఫారూఖ్ అని, ఆ తరువాత ఉథ్మాన్ జున్నూరైన్ అని, ఆ తరువాత అలియ్యుల్ ముర్తదా అని - రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ - వారి తరువాత అషరె ముబష్షిర (స్వర్గ శుభవార్త ఇవ్వబడిన పది మంది సహచరులు) అని, ఆ తరువాత మిగిలిన సహచరులు రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ అని విశ్వసిస్తారు మరియు సహచరుల మధ్య వచ్చిన వ్యతిరేకతల విషయంలో వారు మౌనం వహించారు మరియు వారు ఈ విషయంలో శోధన (ఇజ్తిహాద్) చేసేవారు అని విశ్వసిస్తారు. తన శోధనను సరిగా చేసిన వారు రెండింతలు పుణ్యం పొందుతారు. శోధనలో తప్పు చేసిన వారు ఒక పుణ్యం పొందుతారు.
మరియు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబములో ఆయనని విశ్వసించినవారిని ప్రేమిస్తారు మరియు వారితో స్నేహం చేస్తారు మరియు విశ్వాసపరుల మాతృమూర్తులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులతో ఉత్తమంగా మెలుగుతారు మరియు వారందరితో సంతృప్తిగా ఉంటారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను ద్వేషించేవారైనా మరియు వారిని దూషించేవారైనా, అహ్లె బైత్ విషయంలో అతిక్రమించి అల్లాహ్ అవతరింపజేసిన స్థానముల కంటే అధికంగా వారి స్థానములను పెంచేవారైనా రాఫిదీల మార్గం గురించి విసుగు చూపుతారు, ఎలాగైతే వారు అహ్లె బైత్ ను మాటలు లేదా చేతలతో బాధించే నవాసిబుల విధానం నుండి విసుగు చూపుతారో అలా.
మేము ప్రస్తావించిన ఈ విషయమంతా అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చి పంపించిన నిజమైన విశ్వాసములోకి వస్తుంది. మరియు అది ఎలాంటి విశ్వాసం అంటే దానిని విశ్వసించటం, అదిమి పట్టుకోవటం, దానిపై స్థిరంగా ఉండటం మరియు దానిని విభేదించే వాటి నుండి భయపడటం తప్పనిసరి. మరియు అది ఫిర్కె నాజియ అహ్లు - స్ - సున్నత్ వల్ జమాఅత్ యొక్క విశ్వాసము. వారి విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
«لَا تَـزَالُ طَائِفَةٌ مِنْ أُمَّتِي ظَاهِرِينَ عَلَى الحَقِّ، لَا يَضُرُّهُمْ مَنْ خَذَلَهُمْ، حَتَّى يَأْتِيَ أَمْرُ اللهِ وَهُمْ كَذَلِكَ».
నా సమాజంలో నుంచి ఒక వర్గము సత్యంపై స్పష్టంగా ఉంటుంది. వారి తోడు వదిలేవారు వారికి నష్టం కలిగించలేరు. చివరికి అల్లాహ్ ఆదేశం వస్తుంది మరియు వారు అలాగే ఉండి పోాతారు.15, ఇంకొక హదీథులో ఇలా ఉంది:
«لَا تَزَالُ طَائِفَةٌ مِنْ أُمَّتِي عَلَى الحَقِّ مَنْصُورَةٌ».
నా సమాజంలో నుంచి ఒక వర్గము సత్యంపై ఉంటుంది. అది అల్లాహ్ సహాయం పొందుతుంది.16, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«افْتَرَقَتِ اليَهُودُ عَلَى إِحْدَى وَسَبْعِينَ فِرْقَةً، وَافْتَرَقَتِ النَّصَارَى عَلَى اثْنَتَيْنِ وَسَبْعِينَ فِرْقَةً، وَسَتَفْتَرِقُ هَذِهِ الأُمَّةُ عَلَى ثَلَاثِ وَسَبْعِينَ فِرْقَةً كُلُّهَا فِي النَّارِ إِلَّا وَاحِدَةً فَقَالَ الصَّحَابَةُ: مَنْ هِيَ يَا رَسُولَ اللهِ؟ قَالَ: مَنْ كَانَ عَلَى مِثْلِ مَا أَنَا عَلَيْهِ وَأَصْحَابِي».
యూదులు డబ్బై ఒక్క వర్గములుగా విడిపోయారు. మరియు క్రైస్తవులు డబ్బై రెండు వర్గములుగా విడిపోయారు. మరియు ఈ సమాజం డబ్బై మూడు వర్గములుగా విడిపోతుంది. ఒక వర్గము తప్ప అన్ని వర్గములు నరకములో ఉంటారు. అప్పుడు సహచరులు, 'యా రసూలల్లాహ్! అది ఏది?' అని ప్రశ్నించారు. ఆయన సమాధానమిచ్చినారు, 'ఎవరైతే నేను మరియు నా సహచరులు ఉన్న మార్గం పై ఉంటారో వారు'.17
సరియైన విశ్వాసానికి (సహీహ్ అఖీదహ్ కు) విరుద్ధమైన నమ్మకాలు:
ఈ దైవవిశ్వాసం నుండి మరలిపోయి దానికి వ్యతిరేకంగా నడిచేవారు అనేక వర్గాలుగా ఉంటారు; వారిలో విగ్రహాలను, శిల్పాలను, దూతలను, ఔలియాలను, జిన్నులను, వృక్షాలను, రాళ్ళను మరియు తదితర వాటిని ఆరాధించేవారు కూడా ఉన్నారు. ఇక వీరందరు ప్రవక్తల పిలుపును స్వీకరించలేదు. వారితో విభేదించారు మరియు వ్యతిరేకించారు. ఏ విధంగానైతే ఖురైష్ జాతివారు మరియు అరబ్బులోని ఇతర తెగలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వ్యవహరించారో అలా. మరియు వారు తమ ఆరాధ్యదైవాలతో అవసరాలను తీర్చమని, వ్యాధిగ్రస్తులకు నయం చేయమని, శతృవులకు వ్యతిరేకంగా సహాయం చేయమని అర్ధించేవారు. మరియు వారి పేరుపై పశువులను వధించేవారు అంటే ఖుర్బానీ చేసేవారు. మరియు వారి వద్ద మొక్కుకునేవారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దాని నుండి ఆపి, అల్లాహ్ ఒక్కడి కొరకే ఆరాధనను ప్రత్యేకించమని వారిని ఆదేశించారో వారికి ఆయన మాటలు ఆశ్చర్యకేతులను చేశాయి. మరియు వారు ఆయనను తిరస్కరిస్తూ, ఇలా పలికినారు:
﴿أَجَعَلَ ٱلۡأٓلِهَةَ إِلَٰهٗا وَٰحِدًاۖ إِنَّ هَٰذَا لَشَيۡءٌ عُجَابٞ5﴾
ఏమీ? ఇతను (ఈ ప్రవక్త) దైవాలందరినీ, ఒకే ఆరాధ్యదైవంగా చేశాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం!
[సాద్ 38:5]
అయినా వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వైపు ఆహ్వానిస్తూనే ఉన్నారు. మరియు వారిని షిర్క్ నుండి వారిస్తూనే ఉన్నారు. మరియు తాను ఆహ్వానిస్తున్న దాని వాస్తవికతను వారికి విస్తరించి చెప్పేవారు. చివరికి అల్లాహ్ వారిలో నుండి సన్మార్గం చూపవలసిన వారికి సన్మార్గం చూపాడు. ఆ తరువాత అల్లాహ్ ధర్మంలో తండోపతండాలుగా వారు ప్రవేశించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల, తాబియీన్ ల నిరంతర ఆహ్వానము మరియు కృషి తరువాత అల్లాహ్ ధర్మం ఇతర ధర్మాలన్నింటిపై ఆధిక్యతను పొందినది. ఆ తరువాత పరిస్థితులు మారిపోయినవి. మరియు అజ్ఞానము అల్లాహ్ సృష్టిపై ఆధిక్యతను పొందసాగినది. చివరికి చాలా మంది అజ్ఞానం వైపునకు ఆకర్షితులై పోయారు. వారు దైవ ప్రవక్తల విషయంలో, ఔలియాల విషయంలో, వారిని అర్ధించే విషయంలో, వారితో సహాయం కొరకు మొరపెట్టుకునే విషయంలో మరియు తదితర షిర్క్ రకాలలో అతిక్రమించారు మరియు వారు లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్ధమును అరబ్ కాఫిర్ లు గుర్తించినట్లుగా గుర్తించలేదు. ఫల్లాహుల్ ముస్తఆన్న (అల్లాహ్ మనకు సహాయపడుగాక).
అజ్ఞానం యొక్క ఆధిక్యత మరియు అంతిమ దైవప్రవక్త శతాబ్దానికి దూరం అవుతూ ఉండడం వలన ప్రజలలో నేటి వరకు ఈ బహుదైవారాధన వ్యాపిస్తూనే ఉన్నది.
ఈ చివరి కాలం సత్యతిరస్కారుల అభిప్రాయమే, మొదటి తరం (ఖురైషీ ముష్రికుల) అభిప్రాయము. వారి మాటలలోనే:
﴿...هَٰٓؤُلَآءِ شُفَعَٰٓؤُنَا عِندَ ٱللَّهِ...﴾
వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు. [యూనుస్ 10:18] మరియు వారు (సత్యతిరస్కారులు) ఇలా అన్నారు:
﴿...مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ...﴾
మేము వారిని ఆరాధిస్తున్నాము! [అజ్-జుమర్ 39:3] అల్లాహ్ ఈ అపోహను నిర్వీర్యం చేశాడు, మరియు ఎవరైనా అల్లాహ్ తప్ప మరెవరినైనా ఆరాధిస్తే — అది ఎవరైనా కావొచ్చు — అల్లాహ్కు భాగస్వామిని కల్పించినవాడవుతాడు, కాఫిర్ అవుతాడు అని స్పష్టంగా తెలిపాడు. అల్లాహ్ ప్రకటన:
﴿وَيَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَضُرُّهُمۡ وَلَا يَنفَعُهُمۡ وَيَقُولُونَ هَٰٓؤُلَآءِ شُفَعَٰٓؤُنَا عِندَ ٱللَّهِ...﴾
మరియు వారు అల్లాహ్ ను కాదని తమకు నష్టం గానీ, లాభం గానీ కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు: "వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు. [యూనుస్ 10:18] అల్లాహ్ తన ఈ మాట ద్వారా వారిని ఖండించాడు:
﴿قُلۡ أَتُنَبِّـُٔونَ ٱللَّهَ بِمَا لَا يَعۡلَمُ فِي ٱلسَّمَٰوَٰتِ وَلَا فِي ٱلۡأَرۡضِۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ18﴾
వారినడుగు: "ఏమీ? ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, అల్లాహ్ ఎరుగని విషయాన్ని, మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా?" ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే వాటి కంటే ఆయన అత్యున్నతుడు.
[యూనుస్ 10:18]
ఈ ఆయతులో అల్లాహ్ తనను వదిలి దైవప్రవక్తలను, ఔలియాలను లేదా ఇతరులను ఆరాధించటం పెద్ద షిర్కు అని స్పష్టపరచాడు. ఒకవేళ దానికి పాల్పడేవాడు దానికి వేరే పేరు ఇచ్చినా సరే. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ...﴾
ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము! [అజ్-జుమర్ 39:3] తరువాత అల్లాహ్ తన ఈ వాక్కు ద్వారా వారిని ఖండించాడు:
﴿...إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ﴾
నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు.
[అజ్-జుమర్ 39:3]
అల్లాహ్ ఈ విధంగా స్పష్టం చేశాడు దుఆ చేయడం, భయపడడం, ఆశించటం వంటి రూపాల్లో ఎవరైనా ఆయనను వదిలి ఇంకెవ్వరినైనా ఆరాధించటం అంటే అల్లాహ్ పై అవిశ్వాసం చూపడం, కుఫ్ర్ చేయడం. అంతేగాక, "తమ దేవతలు తమను అల్లాహ్కు దగ్గర చేస్తాయి" అనే వారి మాటను అల్లాహ్ అబద్ధమని ప్రకటించాడు.
సరైన విశ్వాసమునకు వ్యతిరేకమైన మరియు ప్రవక్తలు అలైహిముస్సలాం తీసుకుని వచ్చిన దానికి వ్యతిరేకమైన కుఫ్రియ విశ్వాసములలోంచి దేనినైతే ఈ కాలములో మార్క్స్, లెనీన్ అనుచరులలోంచి మరియు నాస్తికత్వం, అవిశ్వాసం వైపు పిలిచే తదితరులలోంచి నాస్తికులు విశ్వసిస్తున్నారో అది. దానికి సోషలిజం లేదా కమ్యూనిజం లేదా బఅ్ సియా లేదా తదితర పేర్లు పెట్టినా సరే. ఆరాధ్యుడు లేడు మరియు జీవితం భౌతికమైనది అన్నది ఈ నాస్తికుల సిద్ధాంతములలో నుండి వచ్చినది..
ప్రళయదినమును తిరస్కరించటం, స్వర్గమును, నరకమును తిరస్కరించటం మరియు ధర్మాలన్నింటిని తిరస్కరించటం వారి సిద్ధాంతములలోనివే. వారి పుస్తకములలో చూసి వారు దేనిపై ఉన్నారో దాని గురించి చదివినవాడు వారి నమ్మకాలను ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఈ విశ్వాసం పరలోక ధర్మాలన్నిటికి వ్యతిరేకంగా ఉండటం వలన వాటి ప్రజలను ఇహపరాలలో చెడ్డ పరిణామాల వైపుకు తీసుకు పోవటంలో ఎటువంటి సందేహం లేదు.
సత్యమునకు వ్యతిరేకమైన విశ్వాసములలో నుండి దేనినైతే కొంతమంది సూఫీలు, ఔలియాలను కల్పించుకుని వారిని అల్లాహ్ కు కార్యనిర్వహణలో సాటి కల్పించి విశ్వసించేవారు, విశ్వ వ్యవహారములలో వారు కార్యనిర్వహణ చేస్తారని విశ్వసించేవారు కూడా ఉన్నారు. మరియు తమ ఆరాధ్యదైవాలకు కల్పించుకున్న పేర్లైన అఖ్తాబ్, అవ్తాద్, అగ్వాస్ తదితర పేర్లను పెట్టుకున్నారు. ఇలా చేయడం అల్లాహ్ రుబూబియత్ (సార్వభౌమత్వము) లో షిర్కు మరియు అది అల్లాహ్ తో షిర్క్ చేసే అతి చెడ్డదైన వాటిలో ఒకటి.
అజ్ఞాన కాలంలోని పూర్వీకుల షిర్కును పరిశీలించి, దానిని తరువాతి కాలంలో వ్యాపించిన షిర్కుతో పోల్చినవారు, తరువాతి కాలంలోని షిర్కు మరింత ఘోరంగా మరియు అధ్వాన్నంగా ఉందని కనుగొంటారు. దీని వివరణ ఇలా ఉన్నది: అఙ్ఞాన కాలపు అరబ్ అవిశ్వాసులు రెండు విషయాలలో ప్రత్యేకత కలిగి ఉండేవారు: మొదటి విషయం: వారు రుబూబియత్ (అల్లాహ్ యొక్క సార్వభౌమత్వం) లో షిర్క్ చేయలేదు, కానీ వారి షిర్క్ ఆరాధనలలో (ఉలూహియతులో) మాత్రమే ఉండేది; వారు రుబూబియత్ ను కేవలం అల్లాహ్ ఒక్కడి కొరకు మాత్రమే అంగీకరించేవారు, అల్లాహ్ ప్రకటన:
﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَهُمۡ لَيَقُولُنَّ ٱللَّهُ...﴾
మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు... [జుఖ్రుఫ్ 43:87] మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿قُلۡ مَن يَرۡزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ أَمَّن يَمۡلِكُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَمَن يُخۡرِجُ ٱلۡحَيَّ مِنَ ٱلۡمَيِّتِ وَيُخۡرِجُ ٱلۡمَيِّتَ مِنَ ٱلۡحَيِّ وَمَن يُدَبِّرُ ٱلۡأَمۡرَۚ فَسَيَقُولُونَ ٱللَّهُۚ فَقُلۡ أَفَلَا تَتَّقُونَ31﴾
వారిని అడుగు: "ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా? [యూనుస్ 10:31] ఈ అర్థాన్ని సూచించే ఆయతులు చాలా ఉన్నాయి.
రెండవ విషయం: వారి ఆరాధనలో బహుదైవారాధన ఎన్నడూ ఉండేది కాదు, అది కేవలం సుఖసంతోషాలలో మాత్రమే జరిగేది. కానీ కష్టాలలో ఉన్నప్పుడు వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు. దీని గురించి అల్లాహ్ ఇలా తెలిపినాడు:
﴿فَإِذَا رَكِبُواْ فِي ٱلۡفُلۡكِ دَعَوُاْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمۡ إِلَى ٱلۡبَرِّ إِذَا هُمۡ يُشۡرِكُونَ65﴾
వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకు రాగానే ఆయనకు సాటి కల్పించ సాగుతారు. [అల్-అన్కబూత్ 29:65]
ఇక మునుపటి ముష్రికుల కంటే తదుపరి ముష్రికులు రెండు విషయాల్లో మించిపోయారు: మొదటిది: వారిలో కొందరు రుబూబియ్యా (అల్లాహ్ యొక్క సార్వభౌమత్వం) లో షిర్క్ చేయటం. రెండవది: కలిమిలోనూ లేమిలోనూ వారు షిర్క్ చేయటం. ఏవిధంగానైతే వారితో కలిసి, వారి పరిస్థితులను అన్వేషించి, ఈజిప్టులోని హుస్సేన్, బదవీ మరియు ఇతరుల సమాధి వద్ద మరియు అదన్ లోని అల్ ఈద్రోస్ సమాధి వద్ద, యమన్ లోని అల్ హాదీ, షామ్ (సిరియా) లోని ఇబ్నె అరబీ, ఇరాఖ్ లోని షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు ఇతర ప్రసిద్ధి చెందిన సమాధుల విషయంలో చాలా మంది ప్రజలు ధార్మిక హద్దులు అతిక్రమించి వారికి అల్లాహ్ యొక్క చాలా హక్కులను సమర్పించి ఏమి చేస్తున్నారో చూసిన వాడు దానిని తెలుసుకుంటాడు. వారిని దాని నుండి ఆపేవారు మరియు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన కంటే మునుపటి ప్రవక్తలు అలైహిముస్సలాంకు ఇచ్చి పంపించిన తౌహీద్ ను వారికి స్పష్టపరచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్నా లిల్లాహి వఇన్నా ఇలైహి రాజిఊన్.
అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు గుణాల విషయంలో సరియైన ఈమాన్ (విశ్వాసం) కు విరుద్ధమైన కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. బిదఅతీలు అయిన జహ్మియ్యా (నిరీశ్వరవాదులు), మొతజిలా (తర్కవాదులు) మరియు వారి మార్గాన్ని అనుసరించే వారి నమ్మకాలు ఇందులోకి వస్తాయి. ఈ వర్గాలు అల్లాహ్ (అజ్జ వ జల్) యొక్క దివ్యగుణాలను నిరాకరిస్తారు, పరిపూర్ణతను సూచించే ఆయన గుణాలను తిరస్కరిస్తారు. మరియు అసాధ్యమైన, నిర్జీవమైన, అస్తిత్వంలేని వస్తువుల లక్షణాలను అల్లాహ్ కు ఆరోపిస్తారు. అల్లాహ్ వారి ఈ దుష్ట వాదనలన్నింటి నుండి అత్యున్నతుడు.
అల్లాహ్ స్వభావ లక్షణాల్లో కొన్నింటిని తిరస్కరించి, కొన్నింటిని స్వీకరించేవారు ఇందులో వస్తారు — ఉదాహరణకు, అష్'ఆరీల నమ్మకం. వీరు కొన్ని లక్షణాలను నిరాకరించి, వాటికి సంబంధించిన ఆధారాలను తార్కికంగా వక్రీకరించి, అవి చూపే స్పష్టమైన విన్న మరియు బుద్ధిసమ్మత ఆధారాలను విరోధించారు. అందుచేత, వారు తామే తిరస్కరించిన లక్షణాలలో ఉండే తార్కిక సమస్యలనే అంగీకరించిన లక్షణాలనే మళ్లీ ఎదుర్కొన్నారు. ఈ విషయంలో వారు స్పష్టమైన విరుద్ధతలో పడ్డారు.
అయితే అహ్లుస్-సున్నా వల్-జమాఅ (సున్నీ సమాజం) వారు, పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ తనకు తానే నిర్ధారించుకున్న లేదా ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిర్ధారించిన సర్వపూర్ణమైన దివ్యనామాలు మరియు గుణాలను ఎలాంటి సందేహం లేకుండా అంగీకరిస్తారు. అల్లాహ్ తన సృష్టిరాశులతో ఎలాంటి సారూప్యత లేనివాడని పరిశుద్ధంగా విశ్వసిస్తారు. ఈ విశ్వాసం ఎటువంటి గుణనిరాకరణ (తాతీల్) మాలిన్యం లేకుండా స్వచ్ఛమైనది. వారు అన్ని ప్రమాణాలను సమగ్రంగా అనుసరిస్తారు. వారు ఏ ప్రమాణాన్నీ వక్రీకరించలేదు, నిరాకరించలేదు. ఇంతకు ముందు తెలిపినట్లుగా ఇతరులు పాల్బడిన విరుద్ధాభాసాల నుండి వారు సురక్షితంగా ఉన్నారు.
మరియు ఇదే మోక్షమార్గం, ఇహలోక మరియు పరలోక సుఖసంపదకు మార్గం. ఈ ఉమ్మత్ (సమాజం) యొక్క పూర్వీకులు మరియు ఇమాములు అనుసరించిన (సిరాతుల్ ముస్తఖీమ్) మార్గం. వారి తర్వాత వచ్చిన వారికి కూడా శ్రేయస్సు కలిగించేది వారి మొదటి తరం అనుసరించిన ఈ మార్గమే. ఇది ఖుర్ఆన్ మరియు సున్నతు (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకం) ను పాటించడం, మరియు వాటికి విరుద్ధమైన వాటిని వదిలేయడం. మేము పరమ పవిత్రుడు, మహోన్నతుడై అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము - ఈ ఉమ్మత్ (సమాజం)ను తిరిగి సన్మార్గంలోకి తీసుకురావాలని, ఈ సమాజంలో హిదాయత్ (సన్మార్గం) వైపుకు పిలుచేవారిని అధికం చేయాలని, దాని నాయకులు మరియు విద్వాంసులకు షిర్క్ (భాగస్వామ్యం)ని ఎదుర్కొని, దానిని నిర్మూలించి, దాని మార్గాల గురించి హెచ్చరించే శక్తిని ప్రసాదించాలని. నిశ్చయంగా ఆయన (అల్లాహ్) సర్వం వినేవాడు, అతి సమీపంలో ఉన్నవాడు. అల్లాహ్ ఎల్లప్పుడూ విజయానికి మార్గదర్శకుడు. ఆయనే మాకు చాలు, ఆయన ఎంతో గొప్ప రక్షకుడు! పుణ్యాలను చేసే భాగ్యము మరియు చెడు నుండి భద్రంగా ఉండే శక్తి ఆయనతో మాత్రమే. అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త అయిన మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
***
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
రెండవ సందేశం: ప్రవక్త ముహమ్మద్ ﷺ ను సాయంకోరటం (ఇస్తిగాథా చేయడం) విషయంలో ఆదేశం:
స్థుతులన్ని అల్లాహ్ కే శోభిస్తాయి, ప్రవక్త పై, ఆయన కుటుంబము పై, ఆయన అనుచరుల పై, ఆయన మార్గమును అనుసరించిన వారిపై శుభాలు, శాంతి కురియుగాక!
అమ్మా బాద్: కువైట్ సమాజ పత్రిక 15వ సంచికలో, 19/4/1390 హిజ్రీలో ప్రచురించబడిన (మౌలిద్ నబవీ షరీఫ్ జ్ఞాపకార్థం) అనే శీర్షిక కింద కొన్ని కవితలు ఉన్నాయి. ఈ కవితలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆశ్రయించడం మరియు ఆయన ద్వారా ఉమ్మతు యొక్క రక్షణ మరియు సాఫల్యాన్ని కోరడం గురించి ఉన్నాయి. ఈ కవితలను (ఆమినా) అని తనను తాను పిలుచుకున్న వ్యక్తి రాసింది. ఈ కవితలలో పేర్కొన్న కొన్ని పదాలు ఇవి:
ఓ ప్రవక్తా! ఈ ప్రపంచాన్ని రక్షించండి... అది యుద్ధాన్ని ప్రేరేపిస్తుంది మరియు దాని అగ్నిలో కాలిపోతున్నది.
ఓ ప్రవక్తా! ఉమ్మతును రక్షించండి... సందేహం అనే చీకటిలో దీర్ఘకాలంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నది.
ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! ఈ ఉమ్మత్‌ను రక్షించండి... దుఃఖపు గందరగోళంలో వారి దృష్టి కోల్పోయింది.
ఇంకా ఇలా సెలవిచ్చింది:
బదర్ దినమున అల్లాహ్ ను పిలిచినప్పుడు మీరు విజయం త్వరగా పొందినట్లుగా, విజయం త్వరగా ఇవ్వండి.
అందువలన ఆ అవమానం అద్భుతమైన విజయంగా మారింది... అల్లాహ్ వద్ద కనిపించని సైనికులు ఉన్నారు.
ఈ విధంగా ఈ రచయిత తమ పిలుపును మరియు సహాయార్థం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కోరుతూ, ఉమ్మతుకు త్వరిత విజయాన్ని అందించమని కోరుతున్నారు, కానీ విజయము అల్లాహ్ చేతిలో మాత్రమే ఉందని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ఇతర సృష్టిరాశుల చేతిలో లేదని మరచిపోతున్నారు లేదా తెలుసుకోలేక పోతున్నారు, మహోన్నతుడైన అల్లాహ్ తన స్పష్టమైన గ్రంథంలో చెప్పినట్లు:
﴿...وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِنْدِ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ﴾
సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తప్ప, ఇతరుల నుండి సహాయం (విజయం) రాజాలదు కదా! [ఆలె ఇమ్రాన్ 3:126] అల్లాహ్ ప్రకటన:
﴿إِنْ يَنْصُرْكُمُ اللَّهُ فَلَا غَالِبَ لَكُمْ وَإِنْ يَخْذُلْكُمْ فَمَنْ ذَا الَّذِي يَنْصُرُكُمْ مِنْ بَعْدِهِ...﴾
ఒకవేళ మీకు అల్లాహ్ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే, ఆయన తప్ప మీకు సహాయం చేయగల వాడెవడు?
[ఆలె ఇమ్రాన్ 3:160]
ఇది దుఆ మరియు ఆపదలో మద్దతు కోరడం అనే ఆరాధన: ఆరాధన యొక్క ఒక రకాన్ని సర్వోన్నతుడైన అల్లాహ్ కు కాకుండా ఇతరుల కొరకు వెచ్చించటం; మరియు అంతిమ గ్రంథం మరియు పండితుల ఏకాభిప్రాయం ద్వారా తెలిసినది ఏమంటే: అది అనుమతించబడదు, మరియు అల్లాహ్ సృష్టిని తన ఆరాధన కోసం సృష్టించాడు. మరియు ఆ ఆరాధనను వివరించటానికి మరియు దాని వైపు పిలవటానికి ప్రవక్తలను పంపించాడు మరియు గ్రంథములను అవతరింపజేశాడు. అల్లాహ్ ప్రకటన:
﴿وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ56﴾
మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే! [అద్-దారియాత్ 51:56] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ...﴾
మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి. [అన్-నహ్ల్ 16: 36] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ25﴾
మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము. [అల్-అంబియా:25] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿الر كِتَابٌ أُحْكِمَتْ آيَاتُهُ ثُمَّ فُصِّلَتْ مِنْ لَدُنْ حَكِيمٍ خَبِيرٍ1 أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ إِنَّنِي لَكُمْ مِنْهُ نَذِيرٌ وَبَشِيرٌ2﴾
అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరఫు నుండి వివరించబడ్డాయి;
మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని (ఓ ముహమ్మద్) ఇలా అను: "నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే! [హూద్:1-2]
ఈ ధీటైన ఆయతులలో అల్లాహ్ తాను జిన్నులను మరియు మానవులను తన ఒక్కడిని ఆరాధించటం కొరకు మాత్రమే సృష్టించాడని, ఆయనకు భాగస్వామి లేడని స్పష్టంగా తెలియపరచాడు. మరియు ఈ ఆరాధనను ఆదేశించటానికి మరియు దానికి వ్యతిరేకంగా నిషేధించటానికి ప్రవక్తలను (అలైహిస్సలాం) పంపినట్లు వివరించాడు. మరియు మహోన్నతుడైన అల్లాహ్ తన గ్రంథములోని ఆయతులను ధీటుగా చేసి వాటిని వివరించాడని, తద్వారా ఆయన తప్ప ఇతరులు ఆరాధించబడకూడదని తెలియపరచాడు.
మరియు అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ఆరాధన అంటే కేవలం అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని మరియు ఆయనకు విధేయతను మాత్రమే సూచిస్తుంది. ఆయన ఆజ్ఞలను పాటించడం మరియు నిషేధాలను విడిచిపెట్టడం గురించి అల్లాహ్ అనేక ఆయతులలో ఆదేశించాడు మరియు తెలియజేశాడు, వాటిలో ఒకటి: ఆయన సుభానహు ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ...﴾
మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని... [అల్-బయ్యిన: 5] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ...﴾
మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ... [అల్ ఇస్రా: 23] మరియు పరమ పరిశుద్ధుడైన ఆయన వాక్కు:
﴿إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ فَٱعۡبُدِ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ2 أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلۡخَالِصُۚ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ3﴾
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో!
వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు. [అజ్-జుమర్:2-3]
ఈ అర్ధంలో చాలా ఆయతులు ఉన్నాయి, అవన్నీ అల్లాహ్ ఒక్కడికే ఆరాధనను ప్రత్యేకించటం తప్పనిసరి అని, ఇంకా ప్రవక్తలు మరియు ఇతరులను ఆరాధించటాన్ని విడిచిపెట్టటం అవసరమని సూచిస్తున్నాయి.
నిస్సందేహంగా దుఆ అనేది ముఖ్యమైన మరియు సమగ్రమైన ఆరాధనలలో ఒకటి. కాబట్టి దానిని కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించాలి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿فَادْعُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ14﴾
కావున (ఓ విశ్వాసులారా!) మీరు మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయనకే ప్రత్యేకించుకొని, అల్లాహ్ ను మాత్రమే ప్రార్థించండి. సత్యతిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైనా! [గాఫిర్: 14] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا18﴾
మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి. [అల్-జిన్ను :18] దుఆలో అల్లాహ్ ఒక్కడినే ఉద్దేశించమని ఇచ్చిన ఈ మార్గదర్శకత్వం ప్రవక్తలు మరియు ఇతర సృష్టితాలన్నింటిని చేర్చుకుంటుంది; మరియు ఆయన వాక్కు:
﴿وَلَا تَدْعُ مِنْ دُونِ اللَّهِ مَا لَا يَنْفَعُكَ وَلَا يَضُرُّكَ فَإِن فَعَلۡتَ فَإِنَّكَ إِذٗا مِّنَ ٱلظَّٰلِمِينَ106﴾
మరియు అల్లాహ్ ను వదలి నీకు లాభంగానీ మరియు నష్టంగానీ కలిగించలేని దానిని నీవు ప్రార్థించకు. ఒకవేళ నీవు అలా చేస్తే! నిశ్చయంగా, నీవు దుర్మార్గులలో చేరిన వాడవుతాడు. [యూనుస్:106 ] ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్' కు ఉద్దేశించిన సందేశం. పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ ఆయనను షిర్కు నుండి రక్షించాడనేది తెలిసిన విషయమే. కానీ దీని ఉద్దేశ్యం ఇతరులను హెచ్చరించడమే. ఆ తరువాత మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَلَا تَدۡعُ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ فَإِنْ فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِنَ الظَّالِمِينَ106﴾
మరియు అల్లాహ్ ను వదలి నీకు లాభంగానీ మరియు నష్టంగానీ కలిగించలేని దానిని నీవు ప్రార్థించకు. ఒకవేళ నీవు అలా చేస్తే! నిశ్చయంగా, నీవు దుర్మార్గులలో చేరిన వాడవుతాడు. [యూనుస్:106 ] ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఉద్దేశించి చెప్పబడిన ఉపదేశం అయినప్పటికీ, దీని ఉద్దేశ్యం — ఇతరులను హెచ్చరించడమే. ఎందుకంటే, అల్లాహ్ తన ప్రవక్తను షిర్క్ నుండి రక్షించినట్లు సుపరిచితమైన విషయం. ఆ తరువాత అల్లాహ్ నిషేధంలో మరింత గంభీరత చూపించి, తీవ్రమైన హెచ్చరికతో, అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴿...فَإِنْ فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِنَ الظَّالِمِينَ﴾
నిశ్చయంగా, నీవు దుర్మార్గులలో చేరిన వాడవుతాడు. దుర్మార్గము అనగా పెద్ద షిర్కు అని అర్థము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ﴾
మరియు సత్యతిరస్కారులు, వారే! దుర్మార్గులు. [అల్-బఖర:254] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ﴾
నిశ్చయంగా, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం (బహుదైవారాధన) మహా దుర్మార్గము. [లుఖ్మాన్: 13] మరియు ఆదమ్ సంతతికి నాయకుడైన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను కాకుండా వేరే దేనినైనా పిలిస్తే ఆయన కూడా దుర్మార్గులలో ఒకరు అయిపోతారంటే, మరి ఇతరుల సంగతి ఏమిటి?
ఈ ఆయతులు మరియు ఇతర ఆయతుల ద్వారా అర్థమవుతుంది ఏమిటంటే అల్లాహ్ ను కాకుండా ఇతరులను అంటే - మృతులను (సమాధిలోని బాబాలను), చెట్లను, విగ్రహాలను మరియు ఇతరులను - వేడుకోవటం అల్లాహ్ పట్ల షిర్క్ అవుతుంది. ఇది అల్లాహ్ యొక్క ఏకదైవ ఆరాధనకు విరుద్ధం, ఇంకా ఇది అల్లాహ్ సృష్టి యొక్క ఉద్దేశ్యం మరియు ప్రవక్తలను పంపటం, గ్రంథాలను అవతరింపజేయటం యొక్క ఉద్దేశానికి విరుద్ధం. ఇది "లా ఇలాహ ఇల్లల్లాహ్" అనే అర్థానికి వ్యతిరేకం, ఇది అల్లాహ్ యేతరుల ఆరాధనను నిరాకరించి, అల్లాహ్ ఒక్కడికే ఆరాధనను నిర్ధారిస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు:
﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّ مَا يَدۡعُونَ مِن دُونِهِۦ هُوَ ٱلۡبَٰطِلُ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ62﴾
ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం! మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు). [హజ్:62]
ఇది ధర్మం యొక్క మూలం మరియు పునాది. ఈ మూలం సరిగా ఉండక పోతే ఆరాధనలు సరిగా ఉండవు. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ65﴾
మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తలకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు. [అజ్-జుమర్:65] మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ﴾
ఒకవేళ వారు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాన్నీ వృథా అయి పోయేవి! [అల్-అన్ఆమ్:88]
పైన చెప్పిన దాని నుండి స్పష్టమవుతున్నది ఏమిటంటే ఇస్లాం ధర్మానికి చెందిన సాక్ష్య ప్రకటనలో (అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు అనే ప్రకటనలో) రెండు గొప్ప మూలాలు ఉన్నాయి:
మొదటిది: కేవలం అల్లాహ్ ఒక్కడినే ఆరాధించాలి, ఆయనకు ఏ భాగస్వామ్యం కల్పించ కూడదు; ప్రవక్తలు మరియు ఇతర మరణించినవారిని, లేదా విగ్రహాలను, లేదా చెట్లను, లేదా రాళ్లను, లేదా ఇతర సృష్టిరాశులను అర్ధించినా, లేదా వారిని ఆశ్రయించినా, లేదా వారికి జంతుబలి (ఖుర్బానీ) మరియు మొక్కుబడుల ద్వారా దగ్గరయ్యినా, లేదా వారి కొరకు నమాజు చేసినా, లేదా వారికి సాష్టాంగ పడినా; వారు అల్లాహ్ ను వదిలి వారిని ప్రభువులుగా చేసుకున్నారు, మరియు వారిని ఆయనకు సమానులుగా చేసుకున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తాలాను మరియు లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థాన్ని వ్యతిరేకించారు మరియు నష్టం చేసుకున్నారని పరిగణించబడుతుంది.
రెండవది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క షరియతు ప్రకారం మాత్రమే మహోన్నతుడైన అల్లాహ్ మాత్రమే ఆరాధించబడాలి, కాబట్టి అల్లాహ్ అనుమతించని ఏదైనా కొత్త విషయాన్ని ధర్మములో ప్రవేశపెట్టినవారు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని పలికిన సాక్ష్యము యొక్క అర్థాన్ని సరిగా గ్రహించలేదు; అతని ఆచరణ అతనికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు మరియు అది అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యము కాదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَقَدِمْنَا إِلَى مَا عَمِلُوا مِنْ عَمَلٍ فَجَعَلْنَاهُ هَبَاءً مَنْثُورًا23﴾
మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము. [అల్-ఫుర్'ఖాన్: 23] ఈ ఆయతులో పేర్కొన్న ఆచరణల అర్థం: ఎవరైతే అల్లాహ్ తో బహుదైవారాధన చేస్తూ చనిపోతారో వారి ఆచరణలు.
ఇది కూడా జరుగుతుంది: అల్లాహ్ అనుమతించని కొత్త ఆచరణలు, అవి ఖియామత్ రోజున వ్యర్థమై పోతాయి, ఎందుకంటే అవి ఆయన పవిత్రమైన షరియాకు అనుగుణంగా లేవు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ».
“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది” ఈ హదీథు ప్రామాణికత ధృవీకరించబడింది.
మొత్తంగా చెప్పాలంటే: ఈ ఆచరణ తన ఆపదలో మద్దతు మరియు దుఆలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపు మళ్లించి, విశ్వప్రభువైన అల్లాహ్ ను విస్మరించింది, ఎందుకంటే విజయం, నష్టం మరియు లాభం ఆయన చేతిలోనే ఉన్నాయి, మరియు ఇతరుల చేతుల్లో వాటిలో ఏదీ లేదు.
ఇది ఒక గొప్ప మరియు భయంకరమైన పీడన అని ఎలాంటి సందేహం లేదు, మరియు అల్లాహ్ అజ్జ వ జల్ కేవలం తనను మాత్రమే ప్రార్థించమని ఆదేశించాడు, మరియు ఆయనను ప్రార్థించేవారి ప్రార్థన స్వీకరిస్తానని వాగ్దానం చేశాడు, మరియు దానిని అహంకారం కొద్దీ వదిలి వేసిన వారి స్థానం నరకమేనని హెచ్చరించాడు, అల్లాహ్ అజ్జ వ జల్ల ఇలా సెలవిచ్చాడు:
﴿وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ 60﴾
{మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశిస్తారు.} [గాఫిర్:60] అంటే వారు తలవంచినవారు, అవమానితులైనవారు అని అర్థం. ఈ పవిత్రమైన ఆయతు దుఆ (అల్లాహ్ ను వేడుకొనుట) యే అసలు ఇబాదత్ (ఆరాధన) అని తెలియజేస్తుంది, మరియు దాని పట్ల అహంకారం చూపిన వారి నివాసం నరకం అవుతుంది. అల్లాహ్ వద్ద దుఆ చేయడాన్ని అహంకారం కొద్దీ వదిలిన వారి పరిస్థితి ఇలాంటిదైతే, మరి ఆయనను వదిలి వేరే వారిని దుఆ చేసిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో? పరమ పవిత్రుడైన అల్లాహ్ అత్యంత చేరువలో ఉన్నవాడు, ప్రతి విషయానికి అధిపతి, ప్రతి విషయానికి సమర్థుడు, ఆయన ఇలా సెలవిచ్చాడు:
﴿وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ 186﴾
మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: "నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉంటాలి." అని, చెప్పు. [అల్-బఖరహ్:186] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీహ్ హదీథులో “దుఆ (ప్రార్థన) యే ఆరాధన” అని వివరించారు, మరియు తన బంధువు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమాతో ఇలా అన్నారు:
«احْفَظِ اللهَ يَحْفَظْكَ، احْفَظِ اللهَ تَجِدْهُ تُجَاهَكَ، إِذَا سَأَلْتَ فَاسْأَلِ اللهَ، وَإِذَا اسْتَعْنَتَ فَاسْتَعِنْ بِاللهِ».
అల్లాహ్ యొక్క ధర్మశాసనాలను కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడుతాడు, నీవు అల్లాహ్ హక్కులను పూరించు, అల్లాహ్ ను నీ ఎదుట పొందుతావు, ఏదైనా అవసరం కలిగితే కేవలం అల్లాహ్ ను మాత్రం అర్దించు, సహాయం కావాలంటే అల్లాహ్ ను మాత్రమే సహాయం కోసం అర్ధించు. దీనిని తిర్మిజీ మరియు ఇతరులు ఉల్లేఖించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«مَنْ مَاتَ وَهُوَ يَدْعُو لِلَّهِ نِدًّا؛ دَخَلَ النَّارَ».
«అల్లాహ్ కు సాటి ఉన్నారని పిలిచే స్థితిలో మరణించినవాడు నరకంలో ప్రవేశిస్తాడు.» దీనిని ఇమామ్ బుఖారీ నమోదు చేసినారు, సహీహైన్ లోని ఉల్లేఖనలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించడం జరిగింది: “ఏ పాపం పెద్దది?” దానికి ఆయన ఇలా అన్నారు:
«أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ».
«అల్లాహ్ యే నిన్ను సృష్టించినప్పటికీ, నీవు ఆయనకు సాటి కల్పించుట». అల్-నిద్: అంటే సమానమైనది మరియు సాటి, కాబట్టి ఎవరైతే అల్లాహ్ కాకుండా మరొకరిని పిలుస్తారో, లేదా మరొకరి సహాయం కోరుతారో, లేదా ఇతరులకు మొక్కుబడులు చెల్లిస్తారో, లేదా అతనికి బలి ఇస్తారో, లేదా పూర్వం చెప్పిన వాటికి మినహాయించి ఏదైనా ఆరాధన చేస్తారో; వారు దానిని అల్లాహ్'కు సాటి కల్పించారు, అది ప్రవక్త అయినా, వలి అయినా, రాజు అయినా, జిన్న్ అయినా, విగ్రహం అయినా, లేదా ఇతర సృష్టిరాశి అయినా సరే.
ఇక్కడ ఎవరైనా ఇలా అడగవచ్చు: సన్నిదిలో ఉన్న సజీవులను వారికి సామర్ధ్యం గల విషయాలలో అర్ధించడం మరియు వారికి సామర్ధ్యం ఉన్న భైతిక విషయాలలో సహాయం కోరడంలో ఆదేశం ఏమిటి; దానికి జవాబు: ఇది షిర్క్ కాదు, ముస్లింల మధ్య సాధారణముగా అనుమతించబడిన విషయాలలో ఇదొకటి. అల్లాహ్ తఆలా మూసా అలైహిస్సలాం గాథలో ఇలా తెలిపినాడు:
﴿...فَاسْتَغَاثَهُ الَّذِي مِنْ شِيعَتِهِ عَلَى الَّذِي مِنْ عَدُوِّهِ...﴾
అతని జాతికి చెందిన వాడు, విరోధి జాతివానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని అర్థించాడు. [అల్-ఖసస్:15] అల్లాహ్ తఆలా ఇంకా మూసా అలైహిస్సలాం గాధలో మరోచోట ఇలా సెలవిచ్చాడు:
﴿فَخَرَجَ مِنْهَا خَائِفًا يَتَرَقَّبُ...﴾
అప్పుడతను భయపడుతూ, అతి జాగ్రత్తగా అక్కడి నుండి బయలు దేరాడు... [అల్-ఖసస్: 21] ఎలాగైతే ఒక మనిషి యుద్దంలో లేదా ఇతర విషయాల్లో తన సహచరులతో సహాయం కోరుతాడో, అలాగే ఇతర పరిస్థితుల్లో కూడా, మనుషులకు ఎదురయ్యే సమస్యల్లో కూడా వారు ఒకరికొకరు అవసరమవుతారు.
అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన ఉమ్మతుకు "తాను ఎవరికీ లాభనష్టాలు చేకూర్చే శక్తి కలిగి లేనని" తెలియజేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُلْ إِنَّمَا أَدْعُو رَبِّي وَلَا أُشْرِكُ بِهِ أَحَدًا21 قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا22﴾
వారితో ఇలా అను: "నిశ్చయంగా నేను నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను మరియు ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించను.
వారితో ఇలా అను: "నిశ్చయంగా, మీకు కీడు చేయటం గానీ, లేదా సన్మార్గ చూపటం గానీ నా వశంలో లేదు. [అల్-జిన్ను:21-22] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُلْ لَا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ وَلَوْ كُنْتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِقَوْمٍ يُؤْمِنُونَ188﴾
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప నాస్వయానికి నేను లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లయితే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే! [అల్-అఅరాఫ్: 188]
ఈ అర్ధంలో ఆయతులు చాలా ఉన్నాయి.
ఇది తెలిసిన విషయం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువును తప్ప మరెవరినీ వేడుకునేవారు కాదు. బద్ర్ యుద్ధదినాన, ఆయన అల్లాహ్ తో సహాయము కొరకు, తన శత్రువుపై విజయం కోరుతూ దుఆ చేస్తూ, ఆలస్యం లేకుండా ప్రార్థన చేస్తూ, ఇలా అన్నారు: «ఓ ప్రభువా! నీవు నాకు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చు». అప్పుడు సిద్దీకు అక్బర్, అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు: “ఓ ప్రవక్తా! చాలు, నిస్సందేహంగా అల్లాహ్ మీయొక్క వాగ్దానాన్ని నెరవేర్చనున్నాడు.” దీని నేపథ్యంగా పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేశాడు: అల్లాహ్ సెలవిస్తున్నాడు:
﴿إِذۡ تَسۡتَغِيثُونَ رَبَّكُمۡ فَٱسۡتَجَابَ لَكُمۡ أَنِّي مُمِدُّكُم بِأَلۡفٖ مِّنَ ٱلۡمَلَٰٓئِكَةِ مُرۡدِفِينَ9﴾
(జ్ఞాపకం చేసుకోండి!) మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినపుడు ఆయన ఇలా జవాబిచ్చాడు: "నిశ్చయంగా, నేను వేయి దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని పంపి మిమ్మల్ని బలపరుస్తాను. [అల్-అన్'ఫాల్: 9] ఈ ఆయతులలో అల్లాహ్ వారి ప్రార్థనలను గుర్తుచేసి, ఆయన వారికి సహాయం చేసినట్లు మరియు దైవదూతల ద్వారా విజయ శుభవార్తను, శాంతిని అందించినట్లు తెలియజేశాడు. పరిశుద్ధుడైన అల్లాహ్ స్పష్టంగా తెలిపినది ఏమిటంటే విజయం దైవదూతల ద్వారా కాదు, అది ఆయన తరపు నుండే విజయం అని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِنْدِ اللَّهِ...﴾
మరియు వాస్తవానికి సహాయం (విజయం) కేవలం అల్లాహ్ నుంచే వస్తుంది... [ఆలె ఇమ్రాన్: 126] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَقَدْ نَصَرَكُمُ اللَّهُ بِبَدْرٍ وَأَنْتُمْ أَذِلَّةٌ فَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ123﴾
బద్ర్ (యుద్ధం) నందు మీరు బలహీనులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీకు సహాయం (మిమ్మల్ని విజేతలుగా) చేశాడు. కాబట్టి మీరు కృతజ్ఞతాపరులై అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి! [ఆలే ఇమ్రాన్ 3:123] పరిశుద్ధుడైన ఆయన బద్ర్ యుద్ధంలో వారికి సహాయమును చేసానని అల్లాహ్ ఈ ఆయతులో స్పష్టంగా తెలియజేశాడు. అందువల్ల, ఆయన వారికి ఇచ్చిన ఆయుధాలు మరియు శక్తి, మరియు దైవదూతల ద్వారా చేసిన సహాయం, ఇవన్నీ విజయానికి, శుభవార్తకు, మరియు హృదయాలకు శాంతి కలుగజేయటానికి కారణాలు మాత్రమే. కానీ విజయం వీటి వల్ల కాదు, అది కేవలం అల్లాహ్ తరపు నుండే లభిస్తుంది. అజ్ఞానులు లేదా ఇతరులు ఎలా ధైర్యం చేస్తారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఆశ్రయించి విజయం కోరుటకు, మరియు సర్వసృష్టికర్త, సమస్తానికి అధిపతి మరియు సమస్తానికి శక్తివంతుడైన అల్లాహ్ ను విస్మరించుటకు?
ఎటువంటి సందేహం లేదు ఇది అత్యంత ఘోరమైన అజ్ఞానం, అంతేకాకుండా ఇది మహా షిర్క్. కాబట్టి అలాంటి వారు అల్లాహ్ సుబ్హానహు వద్ద స్వచ్ఛమైన తౌబా చేసుకోవడం తప్పనిసరి. స్వచ్ఛమైన తౌబా అనేది అనేక అంశాలను కలిగి ఉంటుంది, వాటిలో కొన్ని: మొదటిది: చేసిన చెడు పనికి, పాపకార్యానికి పశ్చాత్తాపం చెందటం. రెండవది: వాటిలో నుండి చేసిన పాపకార్యాలను పూర్తిగా వదిలివేయడం. మూడవది: అల్లాహ్ యొక్క మహిమను గౌరవించడం, ఆయన వద్ద చిత్తశుద్ధితో, నిష్కపటతతో ఉండటం, ఆయన ఆదేశాలను పాటించడం, ఆయన నిషేధించిన వాటి నుండి జాగ్రత్తగా ఉండటం, మరలా ఆ చెడుపనులు చేయనని దృఢనిశ్చయం చేసుకోవడం, ఇదే నిజమైన పశ్చాత్తాపం. నాల్గవది: ఒకవేళ మానవుల హక్కుల విషయంలో అపరాధం జరిగితే, హక్కును అసలు యజమానికి వాపసు చేయడం లేదా అతనితో సర్దుబాటు చేసుకోవడం.
అల్లాహ్ తన దాసులను తౌబా చేసుకోమని ఆదేశించాడు, మరియు దానిని ఆమోదిస్తానని వాగ్దానం చేశాడు; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَتُوبُوا إِلَى اللَّهِ جَمِيعًا أَيُّهَ الْمُؤْمِنُونَ لَعَلَّكُمْ تُفْلِحُونَ31﴾
మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు! [నూర్:31] మరియు క్రైస్తవుల గురించి ఇలా సెలవిచ్చాడు:
﴿أَفَلَا يَتُوبُونَ إِلَى اللَّهِ وَيَسْتَغْفِرُونَهُ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ74﴾
వారెందుకు అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను క్షమాభిక్ష కొరకు వేడుకోరు? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. [అల్-మాయిదా: 74] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ وَمَنْ يَفْعَلْ ذَلِكَ يَلْقَ أَثَامًا 68 يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا 69 إِلَّا مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا70﴾
మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.
పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు69.
కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. [అల్-ఫుర్'ఖాన్: 68-70] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَهُوَ الَّذِي يَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهِ وَيَعْفُو عَنِ السَّيِّئَاتِ وَيَعْلَمُ مَا تَفْعَلُونَ25﴾
ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. మరియు పాపాలను మన్నించేవాడు. మరియు మీరు చేసేదంతా ఆయనకు బాగా తెలుసు. [షూరా:25]
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు అని విశ్వసనీయంగా నమోదు చేయబడింది:
«الإِسْلَامُ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ، وَالتَّوْبَةُ تَجُبُّ مَا كَانَ قَبْلَهَا».
ఇస్లాం మునుపటి పాపాలను తుడిచివేస్తుంది, మరియు తౌబా వలన వెనుకటి పాపాలను మన్నించబడతాయి.
ఈ సంక్షిప్త పదాలు రాయబడినవి; షిర్క్ యొక్క ప్రమాదం ఎంత గొప్పదో, అది మహాపాపం అని, మరియు అజ్ఞానుల నుండి వచ్చిన వాటి వల్ల మోసపోవడం ఎంత ప్రమాదకరమో, అల్లాహ్ దాసులకు సలహా ఇవ్వడం ఎంత అవసరమో తెలియజేయడానికి. మరియు నేను అల్లాహ్ తో వేడుకుంటున్నాను, ఆయన దీని ద్వారా మనకు ప్రయోజనం కలిగించమని మరియు మా పరిస్థితులను మరియు ముస్లింలందరి పరిస్థితులను సరిచేయమని మరియు ముస్లింలందరికి తన ధర్మమును అర్ధం చేసుకునే, దానిపై స్థిరంగా ఉండే సౌభాగ్యమును కలిగించమని మరియు మమ్మల్ని మరియు ముస్లిములందరిని మన స్వీయ దుష్ప్రేరణల నుండి మరియు చెడు పనుల నుండి రక్షించమని (నేను వేడుకుంటున్నాను). నిశ్చయంగా ఆయన దీని కార్యసాధకుడు మరియు దాని సామర్ధ్యం కలవాడు.
అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త అయిన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని, ఆశీర్వాదాలను కురిపించుగాక!
***
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
మూడవ సందేశము:
జిన్నులు మరియు షైతానులతో సహాయం కోరటం మరియు వారికి మొక్కుబడులు చెల్లించటంపై ధర్మాజ్ఞ.
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ తరుపు నుండి ముస్లింలలో ఎవరు చూస్తున్నారో వారికి, అల్లాహ్ నన్ను మరియు వారిని తన ధర్మాన్ని పట్టుకోవడంలో మరియు దానిపై స్థిరంగా ఉండడంలో సఫలీకృతులను చేయుగాక, ఆమీన్.
మీపై అల్లాహ్ శాంతి, కారుణ్యము, శుభాలు కురియుగాక.
అమ్మాబాద్: కొందరు సోదరులు నన్ను కొంతమంది అజ్ఞానులు చేసే కొన్ని పనుల గురించి అడిగారు: ఉదాహరణకు — అల్లాహ్ కాకుండా ఇతరుల్ని పిలవడం, గంభీరమైన అవసరాల్లో వారిని సహాయానికి పిలుచుకోవడం (ఉదాహరణకు జిన్నులను ప్రార్థించడం), వారిని మొక్కుకోవటం, వారి కొరకు వదించటం వంటివి. మరియు అలాగే కొందరు చెప్పే మాటలు కూడా ఉన్నాయి: "యా సబఅహ్ (ఓ ఏడుగురా)" అని కొందరు అంటారు. అర్థం: "జిన్నులలో ఏడుగురు నాయకులు, అతన్ని పట్టుకోండి, అతని ఎముకలను విరగదీయండి, అతని రక్తాన్ని తాగండి, అతన్ని హింసించండి, ఓ ఏడుగురా! అతనిపై ఇలా చేయండి. లేదా కొంతమంది ఇలా అంటారు: 'అతన్ని పట్టుకోండి, ఓ మధ్యాహ్న జిన్నులారా! ఓ అస్ర్ (సాయంత్రం) జిన్నులారా!' ఇది కొన్ని దక్షిణ ప్రాంతాల్లో చాలా తరచుగా కనిపిస్తుంది. ఈ విషయంతో సంబంధం ఉన్న మరొక అజ్ఞానపు పని ఏమిటంటే, మరణించిన ప్రవక్తలు, సాధువులు లేదా ఇతరులను వేడుకోవడం, మలాయికలను (దేవదూతలను) పిలిచి వారి నుండి సహాయం అడగడం. ఇవన్నీ ఇస్లాంను అనుసరిస్తున్నామని చెప్పుకునే అనేక మంది చేత వారి అజ్ఞానం వల్ల మరియు తమ పూర్వికులను అనుసరించడం వల్ల జరుగుతున్నాయి. కొందరు దీన్ని సులభతరం చేసి, 'ఇది కేవలం నోటితో అనేది మాత్రమే, మేము దీన్ని ఉద్దేశించలేదు లేదా విశ్వసించలేదు' అని వాదించవచ్చు.
మరియు నన్ను ఇంకా ఇలా కూడా అడిగారు: ఈ రకమైన అధర్మ కార్యాలు చేసేవారితో వివాహ సంబంధం ఏర్పరచుకోవడం, వారు జిబహ్ చేసిన జంతువుల మాంసం తినడం, వారి మృతులపై జనాజ నమాజ్ చేయడం లేదా వారిని ఇమామ్ గా నియమించుకోవడం, మంత్రగాళ్లు మరియు జోస్యం చెప్పేవారిని నమ్మడం వంటి వాటిపై ఇస్లామీయ నిర్ణయం ఏమిటి? ఉదాహరణకు, రోగి ధరించిన తలపాగా, ప్యాంటు, రుమాలు లేదా ఇతర వస్తువులను మాత్రమే చూసి రోగాన్ని మరియు దాని కారణాలను తెలుసుకున్నానని దావా చేసేవారిని నమ్మడం.
జవాబు: అల్హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్య బఅదహ్, వఅలా ఆలిహి వసహబిహి వమన్ ఇహ్తదా బిహిం ఇలా యౌమిద్దీన్.
(సకల ప్రశంసలు, కృతజ్ఞతలు ఏకైకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. తన తర్వాత ఎవ్వరూ ప్రవక్తలు లేని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, అలాగే ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన సహాబాలపై మరియు ప్రళయదినం వరకు ఆయన మార్గదర్శకత్వంలో సన్మార్గం పొందిన వారందరిపై కూడా శాంతి, శుభాలు, కరుణా కటాక్షాలు కురుయు గాక!)
అమ్మా బాద్ (తదుపరి విషయం): నిజంగా పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ జిన్నులను మరియు మానవులను కేవలం తనను మాత్రమే ఆరాధించేందుకు సృష్టించాడు. తనను మినహా ఇతర ఎవరినీ ఆరాధించకుండా ఉండాలని, దుఆ (ప్రార్థన), సహాయం అర్థించడం, జంతుబలి (ఖుర్బానీ) ఇవ్వడం, నజర్ చెల్డడం, మరియు ఇతర అన్ని రకాల ఆరాధనలు – ఇవన్నీ కేవలం అల్లాహ్కే నివేదించాలనే సందేశాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఆయన పంపిన ప్రవక్తలు వచ్చారు. అలాగే, ఆ విషయాన్ని వివరించేందుకు, దాని కోసం ప్రజలను పిలవటానికి,
అల్లాహ్ తో షిర్క్ చేయడం (ఇతరులను అల్లాహ్ తో భాగస్వామ్యం చేయడం) మరియు ఆయన తప్ప వేరొకరిని ఆరాధించడం నుండి మానుకోమని హెచ్చరిక ఇవ్వటానికి ఆయన దైవగ్రంథాలను అవతరింపజేశాడు. వాటిలో గొప్పదైన పవిత్ర ఖుర్ఆన్ ఈ సత్యాన్ని వివరిస్తుంది, దాని వైపు ఆహ్వానిస్తుంది. అల్లాహ్ తో ఇతరులను భాగస్వాములుగా చేసుకోకుండా, ఇతరులను ఆరాధించకుండా మానవులను హెచ్చరిస్తుంది. మరియు ఇదే సర్వ సిద్ధాంతాల మూలం, ధర్మం యొక్క పునాది. ఇదే 'లా ఇలాహ ఇల్లల్లాహ్' (అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు) అనే సాక్ష్యం యొక్క అర్థం. ఇదే 'నిజంగా ఆరాధించబడే హక్కు అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ లేదు' అనేది సత్యం. ఈ సాక్ష్యం అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధించడాన్ని మరియు ఇతరులకు దైవత్వాన్ని అంట గట్టడాన్ని తిరస్కరిస్తుంది మరియు ఆరాధనను అల్లాహ్ కు మాత్రమే నిర్ధారిస్తుంది - మొత్తం సృష్టిలో మరెవ్వరికీ కాకుండా. దీనికి అల్లాహ్ గ్రంథము మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులలో చాలా ఆధారాలు ఉన్నాయి, వాటిలో ఒకటి: అల్లాహ్ యొక్క ఈ వాక్కు:
﴿وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ56﴾
మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే! [అద్-దారియాత్: 56] మరియు పరమ పరిశుద్ధుడైన ఆయన వాక్కు:ిాా
﴿وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ...﴾
మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ... [అల్ ఇస్రా: 23] అల్లాహ్ వాక్కు:
﴿وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ...﴾
మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని... [అల్-బయ్యిన: 5] అల్లాహ్ వాక్కు:
﴿وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ60﴾
మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశిస్తారు. [గాఫిర్:60] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ...﴾
మరియు నా దాసులు, నా గురించి నిన్ను అడిగితే: "నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను... [అల్-బఖరహ్:186]
ఈ ఆయతులలో పరమ పవిత్రుడైన అల్లాహ్ తాను జిన్నులను మరియు మానవులను కేవలం తన ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాడని మరియు తన దాసులకు ఖుర్ఆన్ లో స్పష్టంగా ఆదేశించి, తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా వారికి ఉపదేశించి, వారు తమ ప్రభువైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించవలసినదని తెలియపరచాడు.
అల్లాహ్ జల్ల జలాలుహు స్పష్టంగా తెలియజేసినది ఏమిటంటే, దుఆ ఒక గొప్ప ఆరాధన, దాని పట్ల దురహంకారం చూపినవారు నరకంలో ప్రవేశిస్తారు. మరియు ఆయన తన దాసులను కేవలం తనను మాత్రమే వేడుకోవాలని ఆదేశించాడు. మరియు ఆయన సమీపంలో ఉన్నాడని, వారి దుఆలను అంగీకరిస్తాడని తెలియజేశాడు. అందువలన, దాసులందరూ తమ ప్రభువుకు మాత్రమే ప్రత్యేకంగా దుఆ చేయవలసిన అవసరం ఉంది; ఎందుకంటే ఇది ఆరాధన యొక్క ఒక విధానం, దాని కోసం వారు సృష్టించబడ్డారు మరియు దాని గురించి ఆదేశించబడ్డారు. మరియు గౌరవోన్నతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు:
﴿قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ 162 لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ163﴾
(ఇంకా) ఇలా అను: "నిశ్చయంగా నా నమాజ్ నా బలి (ఖుర్బానీ), నా జీవితం మరియు నా మరణం, సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే!
ఆయనకు ఎలాంటి భాగస్వామి (సాటి) లేడు. మరియు నేను ఇదే విధంగా ఆదేశించబడ్డాను మరియు నేను అల్లాహ్ కు విధేయుడను (ముస్లింను) అయిన వారిలో మొట్టమొదటి వాడను! [అల్-అన్ఆమ్:162-163]
కాబట్టి అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన నమాజు మరియు తన నుసుక్ - అంటే జిబహ్ (ఖుర్బానీ) చేయటం - మరియు తన జీవితం మరియు తన మరణం; సకల సృష్టి ప్రభువైన అల్లాహ్ కొరకే అని, ఆయన భాగస్వామి లేనివాడని ప్రజలకు తెలియజేయమని ఆదేశించాడు. దాని ఆధారంగా: ఎవరైతే అల్లాహ్ కొరకు కాకుండా వేరే వారికి జిబహ్ (పశుబలి) చేస్తే అతడు అల్లాహ్ తో భాగస్వామ్యం చేశాడు, ఎందుకంటే పరమ పవిత్రుడైన అల్లాహ్ నమాజు మరియు జుబాహ్ (పశుబలి) ను సమానంగా ఉంచి, అవి అల్లాహ్ ఒక్కడి కొరకే అని, ఆయనకు భాగస్వామి లేనివాడని తెలియజేశాడు. కాబట్టి అల్లాహ్ కొరకు కాకుండా ఎవరైతే జిన్నుల, దైవదూతల, మృతుల మరియు ఇతరుల కొరకు వధిస్తే, అలా చేయటం ద్వారా వారికి సాన్నిహిత్యం పొందుతాడు, అతడు అల్లాహ్కు కాకుండా ఇతరులను ప్రార్ధించినవాడు అవుతాడు మరియు సహీహ్ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ اللهِ».
అల్లాహేతరుల కొరకు బలి ఇచ్చిన వాడిపై అల్లాహ్ శాపం ఉండును. ఇమాం అహ్మద్ నమోదు చేసిన మరియు హసన్ గా వర్గీకరించబడిన తారిక్ బిన్ షిహాబ్ రదియల్లాహు అన్హు ద్వారా ఉల్లేఖించబడిన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«مرَّ رَجُلَانِ عَلَى قَومٍ لَهُم صَنَمٌ لَا يَجُوزُهُ أَحَدٌ حَتَّى يُقرِّبَ لَهُ شَيئًا، فَقَالُوا لِأَحَدِهِمَا: قَرِّبْ. قَالَ: لَيسَ عِندِي شَيءٌ أَقَرِّبُهُ، قَالُوا: قَرِّبْ وَلَوْ ذَبَابًا، فَقَرَّبَ ذُبَابًا، فَخَلُّوا سَبِيلَهُ، فَدَخَلَ النَّارَ، وَقَالُوا لِلآخَرِ: قَرِّبْ. قَالَ: مَا كُنْتُ لِأُقَرِّبَ لِأَحَدٍ شَيْئًا دُونَ اللهِ جَلَّ جَلَالُهُ، فَضَرَبُوا عُنُقَه، فَدَخَلَ الجَنَّةَ».
ఒకసారి ఇద్దరు వ్యక్తులు ఒక జాతి వద్దకు వచ్చారు, ఆ జాతి వద్ద ఒక విగ్రహం ఉంది. ఎవరు ఆ విగ్రహం పక్కగా పోవాలన్నా, వారు ఏదైనా బలి ఇచ్చిన తరువాతే అనుమతించేవారు. వారు ఒక వ్యక్తిని చూసి ‘ఏదైనా సమర్పించు’ అని అన్నారు. అతను ‘నా వద్ద ఏమీ లేదు’ అని చెప్పాడు. వారు ‘ఒక ఈగ అయినా సమర్పించు’ అని అన్నారు. అతను ఒక ఈగను సమర్పించాడు, వారు అతని దారి వదిలేశారు, అతను నరకంలోకి ప్రవేశించాడు. తరువాత వారు మరొకరిని చూసి ‘ఏదైనా సమర్పించు’ అని అన్నారు. అతను మహోన్నతుడైన ‘అల్లాహ్ కు తప్ప మరెవరికీ ఏమీ సమర్పించను’ అని చెప్పాడు. వారు అతని మెడను నరికారు, అతను స్వర్గంలోకి ప్రవేశించాడు.
కాబట్టి ఎవరైతే విగ్రహం మరియు దానికి సమానమైన వాటికి ఈగ మరియు దానికి సమానమైన దానిని సమర్పించి సాన్నిహిత్యం పొందుతారో వారు ముష్రికులు అవుతారు, నరకంలో ప్రవేశించటానికి అర్హులు అవుతారు. మరి జిన్నులను, దైవదూతలను మరియు ఔలియాలను వేడుకునేవారు ఎలా ఉంటారు? మరియు వారిని సహాయం కోసం అర్ధించేవారు, వారికి మొక్కుబడులు చెల్లించేవారు, వారికి బలులు అర్పించి సాన్నిహిత్యం పొందేవారు, దాని ద్వారా తమ ఆస్తిని కాపాడుకోవాలని లేదా తమ రోగిని నయం చేయాలని లేదా తమ జంతువులు మరియు పంటలను కాపాడుకోవాలని ఆశించేవారు ఎలా ఉంటారు? మరియు జిన్నుల కీడు నుండి భయపడి లేదా దానికి సమానమైన వాటి నుండి భయపడి అలా చేసేవారు ఎలా ఉంటారు? ఈ విధంగా చేసేవారు మరియు దానికి సమానమైన వాటిని చేసేవారు ఈగను విగ్రహానికి సమర్పించిన వ్యక్తి కంటే ముష్రికులు అవటానికి మరియు هనరకంలో ప్రవేశించటానికి మరింత అర్హులు అవుతారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.
మరియు దీనికి సంబంధించి మహోన్నతుడైన అల్లాహ్ తన పరమ పవిత్రమైన వాక్కులో ఇలా పేర్కొన్నాడు:
﴿إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ فَٱعۡبُدِ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ2 أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلۡخَالِصُۚ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ3﴾
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో!
వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు. [అజ్-జుమర్:1-3] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَيَعْبُدُونَ مِنْ دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلَاءِ شُفَعَاؤُنَا عِنْدَ اللَّهِ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ سُبْحَانَهُ وَتَعَالَى عَمَّا يُشْرِكُونَ18﴾
మరియు వారు అల్లాహ్ ను కాదని తమకు నష్టం గానీ, లాభం గానీ కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు: "వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు." వారినడుగు: "ఏమీ? ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, అల్లాహ్ ఎరుగని విషయాన్ని, మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా?" ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే వాటి కంటే ఆయన అత్యున్నతుడు. [యూనుస్:18]
అల్లాహ్ తఆలా ఈ రెండు ఆయతులలో, బహుదైవారాధకులు అల్లాహ్ ను వదిలి సృష్టించబడిన జీవులను తమ స్నేహితులుగా తీసుకుని, భయంతో, ఆశతో, బలి, ప్రతిజ్ఞ మరియు ప్రార్థన వంటి వాటితో వారిని ఆరాధించారని తెలిపాడు. ఆ స్నేహితులు వారిని అల్లాహ్ కు దగ్గర చేస్తారని, మరియు వారి కోసం అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారని వారు భావించారు. అప్పుడు మహోన్నతుడైన అల్లాహ్ వారి అబధ్ధాన్ని ఖండించి, వారి తప్పుడు ఆలోచనలను స్పష్టపరచాడు, మరియు వారిని అసత్యపరులు, అవిశ్వాసులు మరియు బహుదైవారాధకులుగా పిలిచాడు. మరియు తనను వారి షిర్క్ నుండి పవిత్రం చేసాడు. అల్లాహ్ ప్రకటన:
﴿...سُبْحَانَهُ وَتَعَالَى عَمَّا يُشْرِكُونَ﴾
ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే అత్యున్నతుడు. [అన్-నహ్ల్:1] దీనితో అర్థమవుతుంది ఏమిటంటే, ఎవరు రాజు, ప్రవక్త, జిన్ను, చెట్టు లేదా రాయి వంటి వాటిని అల్లాహ్ తో పాటు పిలుస్తారో, మరియు వాటిని సహాయం కోసం అర్ధిస్తారో, మరియు వాటికి నజర్ మరియు జిబహ్ అర్పించడం ద్వారా సమీపించటానికి ప్రయత్నిస్తారో, అల్లాహ్ వద్ద వారి మధ్యవర్తిత్వం కోసం ఆశతో, లేదా రోగి నయం కోసం, లేదా ధన సంరక్షణ కోసం, లేదా గైర్హాజరు వ్యక్తి సురక్షితంగా ఉండటానికి లేదా ఇలాంటి ఇతర విషయాల కోసం ఆశతో; వారు ఈ మహా షిర్క్ లో మరియు ఈ ఘోరమైన కష్టంలో పడ్డారు, దీనిని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ وَمَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَى إِثْمًا عَظِيمًا48﴾
నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు! [అన్-నిసా:48] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ72﴾
వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయం చేసే వారు ఎవ్వరూ ఉండరు. [అల్-మాయిదా:72]
మధ్యవర్తిత్వం ప్రళయదినమున ఏకేశ్వరోపాసకులు మరియు చిత్తశుద్ధి గలవారికి మాత్రమే లభిస్తుంది, షిర్క్ (అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించడం) చేసే వారికి కాదు, ఎందుకంటే ఒక ప్రశ్నకు సమాధానిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ సిఫార్సు పొందె భాగ్యవంతుడు ఎవరు?” ఆయన ఇలా సెలవిచ్చారు:
«مَنْ قَالَ: لَا إِلَهَ إِلَّا اللهُ خَالِصًا مِنْ قَلْبِهِ».
ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా పలుకుతాడో. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«لِكُلِّ نَبِيٍّ دَعْوَةٌ مُسْتَجَابَةٌ، فَتَعَجَّلَ كُلُّ نَبِيٍ دَعْوَتَهُ، وَإِنِّي اخْتَـبَأْتُ دَعْوَتِي شَفَاعَةً لِأُمَّتِي يَومَ القِيَامَةِ، فَهِيَ نَائِلَةٌ إِنْ شَاءَ اللهِ مَن مَاتَ مِنْ أُمَّتِي لَا يُشْرِكُ بِاللهِ شَيْئًا».
ప్రతి ప్రవక్తకు తక్షణమే స్వీకరించబడే ఒక ప్రార్థన ఉంది. ప్రతి ప్రవక్త తన ప్రార్థనను త్వరగా ఉపయోగించుకున్నాడు, మరియు నేను నా ప్రార్థనను తీర్పు దినమున నా ఉమ్మత్ సిఫారసు కొరకు దాచి ఉంచాను. అల్లాహ్ చిత్తమైతే, నా ఉమ్మత్ లో అల్లాహ్ తో దేనినీ భాగస్వామ్యం చేయకుండా మరణించిన వారికి ఇది లభిస్తుంది.
మొదటి తరం బహుదైవారాధకులు అల్లాహ్ తమ ప్రభువు, సృష్టికర్త మరియు జీవనోపాధిని అందించేవాడు అని విశ్వసించేవారు. కానీ వారు ప్రవక్తలు, పుణ్యాత్ములు, దైవదూతలు, వృక్షాలు, రాళ్ళు మరియు వాటి వంటి వాటిపై ఆధారపడి, అల్లాహ్ వద్ద వారి శిఫారసును ఆశిస్తూ, ఆయనకు చేరువ చేయాలని కోరుకున్నారు, దీని గురించి గత ఖుర్ఆన్ వచనాల్లో చెప్పబడింది. అల్లాహ్ వారిని ఈ కారణంతో క్షమించలేదు, బదులుగా తన మహత్తర గ్రంథంలో అల్లాహ్ వారిని తప్పుపట్టాడు, వారిని కాఫిర్లు మరియు ముష్రికులు అని పిలిచాడు. మరియు వారి ఆరాధ్యదైవాలు వారికి సిఫారసు చేస్తాయని మరియు వారిని అల్లాహ్కు దగ్గర చేస్తాయనే వారి భావనను అల్లాహ్ అసత్యపరచాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మన్నింపు ఇవ్వలేదు, బదులుగా ఈ షిర్క్ పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో యుద్ధం చేశారు, తద్వారా వారు అల్లాహ్ కు మాత్రమే ఆరాధనను సమర్పించగలిగినారు, అల్లాహ్ యొక్క ఈ వాక్కును అనుసరించి:
﴿وَقَاتِلُوهُمْ حَتَّى لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّهِ...﴾
మరియు ఫిత్నా ముగిసిపోయే వరకు మరియు అల్లాహ్ ధర్మం మాత్రమే స్థాపించబడే వరకు... [అల్-బఖరహ్: 193] రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«أُمِرْتُ أَنْ أُقَاتِلَ النَّاسَ حَتَّى يَشْهَدُوا أَنْ لَا إِلهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، وَيُقِيمُوا الصَّلَاةَ، وَيُؤتُوا الزَّكَاةَ، فَإِذَا فَعَلُوا ذَلِكَ عَصَمُوا مِنِّي دِمَاءَهُم وَأَمْوَالَهُمْ إِلَّا بِحَقِّ الإِسْلَامِ، وَحِسَابُهُم عَلَى اللهِ».
జనులు ‘అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యుడు లేడు, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ తరుపు నుండి పంపబడిన ప్రవక్త’ అని సాక్ష్యమిచ్చి నమాజులు పాటిస్తూ జకాతులు చెల్లించనంత వరకు” వారితో పోరాడమని, యుద్ధం చేయమని నాకు ఆదేశమివ్వబడింది, ఒకవేళ వారు అలా చేసినట్లయితే నా నుండి వారి ప్రాణాలను, సంపదను ఇస్లాం వలన రక్షించుకుంటారు మరియు వారు అల్లాహ్ వద్ద జవాబుదారులుగా ఉంటారు’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచన భావార్థము:
«حَتَّى يَشْهَدُوا أَن لَا إِلهَ إِلَّا اللهُ».
“హత్తా యష్’హదూ అన్’లా ఇలాహ ఇల్లల్లాహ్” (వారు 'అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు' అని సాక్ష్యం ఇచ్చే వరకు.) అంటే: అల్లాహ్ను మాత్రమే ఆరాధనకు అర్హుడిగా చేసి, ఆయనను మినహా ఇతరులెవ్వరినీ ఆరాధించనంత వరకు.
ముష్రికులు జిన్నులకు భయపడి, వారి శరణు వేడుకునేవారు. అల్లాహ్ ఈ విషయమై తన వాక్కును అవతరింపజేసాడు:
﴿وَأَنَّهُ كَانَ رِجَالٌ مِنَ الْإِنْسِ يَعُوذُونَ بِرِجَالٍ مِنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا6﴾
మరియు వాస్తవానికి, మానవులలో నుండి కొందరు పురుషులు, జిన్నాతులలో నుండి కొందరు పురుషుల శరణు వేడుతూ ఉండేవారు. ఈ విధంగా వారు, వారి (జిన్నాతుల) తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు. [అల్-జిన్:6] ఖుర్ఆన్ వ్యాఖ్యాతులు ఈ పవిత్ర ఆయతు విషయంలో ఇలా పలికినారు: దాని భావార్ధం:
﴿...فَزَادُوهُمْ رَهَقًا﴾
వారి (జిన్నాతుల) తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు. అంటే: భయం మరియు ఆందోళన; ఎందుకంటే జిన్నులు తమను తాము గొప్పగా భావించి, గర్వపడతారు, మానవులు వారితో శరణు వేడుకున్నప్పుడు, వారు మానవులకు మరింత భయాన్ని, ఆందోళనను కలిగిస్తారు తద్వారా వారు తమ ఆరాధనను మరియు వారిని ఆశ్రయించడాన్ని పెంచుతారు.
మహోన్నతుడైన అల్లాహ్ ముస్లింలకు దీనికి బదులుగా తనను శరణు వేడుకోవడం మరియు తన పరిపూర్ణ పదాలతో శరణు కోరటం చేయమని ఆదేశించాడు. మరియు దీనికి సంబంధించి అల్లాహ్ వాక్కు:
﴿وَإِمَّا يَنْزَغَنَّكَ مِنَ الشَّيْطَانِ نَزْغٌ فَاسْتَعِذْ بِاللَّهِ إِنَّهُ سَمِيعٌ عَلِيمٌ200﴾
మరియు ఒకవేళ షైతాన్ నుండి నీకు ప్రేరేపణ కలిగితే! నీవు అల్లాహ్ శరణు వేడుకో! నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. [అల్-అరాఫ్: 200] అల్లాహ్ వాక్కు:
﴿قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ1﴾
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా సెలవిచ్చారు:
«مَنْ نَزَلَ مَنْزِلًا فَقَالَ: (أَعُوذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ)؛ لَم يَضُرَّهُ شَيءٌ حَتَّى يَرْتَحِلَ مِنْ مَنْزِلِهِ ذَلِكَ».
“ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత వరకు అతనికి ఏదీ (ఏ విషయమూ) హాని కలిగించజాలదు”.
మరియు పైన పేర్కొన్న ఆయతులు మరియు హదీథుల ఆధారంగా తన ధర్మాన్ని రక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కరు, షిర్క్ నుండి — చిన్నదైనా, పెద్దదైనా — రక్షించబడాలనుకునే వారు, తౌహీద్పై నిలబడి విముక్తి కోరే వారు, వారు ఈ విషయం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి: మృతుల, దైవదూతల, జిన్నులపై లేదా ఇతర సృష్టులపై ఆధారపడటం, వారిని పిలవడం, వారిని ఆశ్రయించడం, వారిని సంరక్షణ కోసం కోరడం, వారి ద్వారా రక్షణ, సహాయం కోరడం ఇవన్నీ అజ్ఞాన కాలపు ముష్రికుల పనులు, ఇవి అల్లాహ్తో చేసే అతి హేయమైన రూపాలు. కావున దానిని వదిలివేయటం అనివార్యం, దాని నుండి హెచ్చరించాలి, ఒకరి నొకరు దానిని వదిలేయమని సూచించాలి, ఎవరైన దీనిని చేసినట్లయితే ఖండించాలి.
మరియు జనులలో నుంచి ఎవరు ఈ బహుదైవారాధన కార్యాలు చేసినట్లు గుర్తించబడుతారో : అతనితో వివాహ సంబంధం కల్పించటం అనుమతించబడదు, అతడు వధించిన ఖుర్బానీ మాంసం తినటం అనుమతించబడదు, అతని జనాజా నమాజు చేయటం అనుమతించబడదు, మరియు అతని వెనుక నమాజు చేయటం అనుమతించబడదు, ఇది అతను పరమ పవిత్రుడైన అల్లాహ్ వద్ద దాని నుండి పశ్చాత్తాపం ప్రకటించేవరకు, ప్రార్ధన మరియు ఆరాధనలను కేవలం అల్లాహ్ ఒక్కడికే చేసేవరకు, మరియు దుఆ అనేది కూడా ఒక ఆరాధన. అంతే కాదు అది దాని సారాంశం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«الدُّعَاءُ هُوَ العِبَادَةُ».
నిశ్చయంగా దుఆ యే ఆరాధన. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వేరే హదీథులలో ఇలా చెప్పినట్లు నివేదించబడింది:
«الدُّعَاءُ مُخُّ العِبَادَةِ».
దుఆ ఆరాధన యొక్క అసలైన పౌష్టికం, మూలం. ముష్రికులతో వివాహం: అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَا تَنْكِحُوا الْمُشْرِكَاتِ حَتَّى يُؤْمِنَّ وَلَأَمَةٌ مُؤْمِنَةٌ خَيْرٌ مِنْ مُشْرِكَةٍ وَلَوْ أَعْجَبَتْكُمْ وَلَا تُنْكِحُوا الْمُشْرِكِينَ حَتَّى يُؤْمِنُوا وَلَعَبْدٌ مُؤْمِنٌ خَيْرٌ مِنْ مُشْرِكٍ وَلَوْ أَعْجَبَكُمْ أُولَئِكَ يَدْعُونَ إِلَى النَّارِ وَاللَّهُ يَدْعُو إِلَى الْجَنَّةِ وَالْمَغْفِرَةِ بِإِذْنِهِ وَيُبَيِّنُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ221﴾
మరియు ముష్రిక్ స్త్రీలు, విశ్వసించనంత వరకు, మీరు వారిని వివాహమాడకండి, ముష్రిక్ స్త్రీ మీకు ఎంత నచ్చినా, ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ మీ కొరకు ఎంతో మేలైనది. మరియు ముష్రిక్ పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలతో వారి వివాహం చేయించకండి. మరియు ముష్రిక్ పురుషుడు మీకు ఎంత నచ్చినా, అతడి కంటే విశ్వాసి అయిన ఒక బానిస మీ కొరకు ఎంతో మేలైనవాడు. ఇలాంటి వారు (ముష్రికీన్) మిమ్మల్ని అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నారు. కాని అల్లాహ్! తన అనుమతితో, మిమ్మల్ని స్వర్గం వైపునకు మరియు క్షమాభిక్ష పొందటానికి పిలుస్తున్నాడు. మరియు ఈ విధంగా ఆయన తన సూచనలను ప్రజలకు - బహుశా వారు గుణపాఠం నేర్చుకుంటారని - స్పష్టంగా తెలుపుతున్నాడు. [అల్-బఖరహ్:221] కాబట్టి పరమ పవిత్రుడైన అల్లాహ్ ముస్లిములను విగ్రహాలను, జిన్నులను, దైవదూతలను మరియు ఇతరులను పూజించే ముష్రిక్ మహిళలతో వివాహం చేసుకోవడం నుండి వారించాడు — వారు అల్లాహ్కు మాత్రమే ఆరాధనను శుద్ధంగా అంకితం చేసి, ప్రవక్త ముహమ్మద్ ﷺ తీసుకువచ్చిన దానిని సత్యంగా నమ్మి, ఆయన మార్గాన్ని అనుసరించే వరకు. ఇలా అల్లాహ్ ముస్లిం మహిళలను ముష్రిక పురుషులతో వివాహం చేయించడాన్ని కూడా నిషేధించాడు — వారు అల్లాహ్కు మాత్రమే పూజను శుద్ధంగా అంకితం చేసి, ప్రవక్త ముహమ్మద్ ﷺను నమ్మి, ఆయనను అనుసరించే వరకు.
పరమ పవిత్రుడైన అల్లాహ్ ప్రకటన: ఒక విశ్వాసి బానిస ఒక ముష్రిక్ మహిళ కంటే ఉత్తమమైనది, ఆమె అందం మరియు మాటల చమత్కారంతో చూసే వారిని ఆకర్షించినా కూడా. అలాగే, ఒక విశ్వాసి బానిస ఒక ముష్రిక్ పురుషుని కంటే ఉత్తముడు, అతని అందం, వాగ్మిత, ధైర్యం మరియు ఇతర లక్షణాలతో చూసేవారిని ఆకర్షించినా కూడా. తరువాత ఈ విశిష్టతకు కారణాలను పరమ పవిత్రుడైన అల్లాహ్ తన ఈ వాక్కులో పేర్కొన్నాడు:
﴿...أُولَئِكَ يَدْعُونَ إِلَى النَّارِ...﴾
ఇలాంటి వారు (ముష్రికీన్) మిమ్మల్ని అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నారు. [అల్-బఖరహ్:221] దీని అర్థం: బహుదైవారాధక పురుషులు మరియు బహుదైవారాధక స్త్రీలు; ఎందుకంటే వారు తమ మాటలతో, కార్యాలతో, ప్రవర్తనతో మరియు నడవడికతో నరకానికి పిలిచేవారు, అయితే విశ్వాసపర పురుషులు మరియు విశ్వాసపర స్త్రీలు తమ నడవడికతో, కార్యాలతో మరియు ప్రవర్తనతో స్వర్గానికి పిలిచేవారు. మరి వీరు మరియు వారు ఎలా సరిసమానులు అవుతారు!
ఇక బహుదైవారాధకులైన ముష్రికులపై నమాజు గురించి: మహోన్నతుడైన అల్లాహ్ కపటుల విషయములో ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَا تُصَلِّ عَلَى أَحَدٍ مِنْهُمْ مَاتَ أَبَدًا وَلَا تَقُمْ عَلَى قَبْرِهِ إِنَّهُمْ كَفَرُوا بِاللَّهِ وَرَسُولِهِ وَمَاتُوا وَهُمْ فَاسِقُونَ84﴾
మరియు వారిలో (కపట విశ్వాసులలో) ఎవరైనా మరణిస్తే, అతడి నమాజే జనాజహ్ కూడా నీవు ఏ మాత్రం చేయకు మరియు అతని గోరీ వద్ద కూడా నిలబడకు, నిశ్చయంగా వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను తిరస్కరించారు. మరియు వారు అవిధేయులు (ఫాసిఖూన్)గా ఉన్న స్థితిలోనే మరణించారు. [తౌబా: 84] ఈ పవిత్రమైన ఆయతులో మహోన్నతుడైన అల్లాహ్ స్పష్టంగా తెలియజేశాడు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల కపటుడి మరియు అవిశ్వాసపరుడి అవిశ్వాసం కారణంగా వారి జనాజా నమాజు చదివించకూడదు; వారి వెనుక నమాజు చేయకూడదు, మరియు వారు ముస్లింలకు ఇమామ్ లుగా నియమించకూడదు; ఎందుకంటే వారు అవిశ్వాసపరులు మరియు నమ్మకస్తులు కాదు, మరియు ముస్లింలతో వారి మధ్య గొప్ప శత్రుత్వం ఉంది, మరియు వారు నమాజు మరియు ఆరాధనకు అర్హులు కాదు; ఎందుకంటే అవిశ్వాసం మరియు షిర్క్ తో ఏ పనీ నిలబడదు, అల్లాహ్ రక్షించు గాక మరియు ముష్రికులు జిబహ్ చేసిన వాటిని తినడము: నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ మృత జంతువులను మరియు ముష్రికులు జిబహ్ చేసిన వాటి నిషేధించడాన్ని స్పష్టపరిచినాడు:
﴿وَلَا تَأْكُلُوا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللَّهِ عَلَيْهِ وَإِنَّهُ لَفِسْقٌ وَإِنَّ الشَّيَاطِينَ لَيُوحُونَ إِلَى أَوْلِيَائِهِمْ لِيُجَادِلُوكُمْ وَإِنْ أَطَعْتُمُوهُمْ إِنَّكُمْ لَمُشْرِكُونَ121﴾
మరియు అల్లాహ్ పేరు స్మరించబడని దానిని తినకండి. మరియు అది (తినటం) నిశ్చయంగా పాపం. మరియు నిశ్చయంగా, మీతో వాదులాడటానికి షైతానులు తమ స్నేహితులను (ఔలియాలను) ప్రేరేపింపజేస్తారు. ఒకవేళ మీరు వారిని అనుసరిస్తే! నిశ్చయంగా, మీరు కూడా అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించిన వారవుతారు. [అల్-అన్ఆమ్: 121] మృత జంతువులను మరియు ముష్రికుల జిబహ్ చేయబడిన దానిని తినకుండా మహోన్నతుడైన అల్లాహ్ ముస్లిములను నిషేధించాడు; ఎందుకంటే అది అపవిత్రం, కాబట్టి వారి జిబహ్ మృత జంతువు యొక్క హోదాలో ఉంటుంది, వారు అల్లాహ్ నామం స్మరించినా కూడా; ఎందుకంటే వారి నుండి అల్లాహ్ నామస్మరణం వ్యర్థం, దానికి ప్రభావం లేదు; ఎందుకంటే అది షిర్క్, మరియు షిర్క్ ఆరాధనను నాశనం చేస్తుంది మరియు దానిని రద్దు చేస్తుంది, ముష్రికులు పరమ పవిత్రుడైన అల్లాహ్ వద్ద పశ్చాత్తాప పడకపోతే. నిశ్చయంగా, పరమ పవిత్రుడైన అల్లాహ్ అహ్లె కితాబ్ యొక్క ఆహారాన్ని సమ్మతం చేశాడు. అల్లాహ్ తన గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:
﴿...وَطَعَامُ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حِلٌّ لَكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَهُمْ...﴾
గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. [అల్-మాయిదా: 5] ఎందుకంటే వారు దైవవాణి మార్గమును అనుసరించేవారమని స్వయంగా చెప్పుకుంటారు, ఇంకా మూసా మరియు ఈసా అనుచరులమని చెప్పుకుంటారు, అయినప్పటికీ వారు అబద్ధాలు చెబుతున్నారు. మరియు అల్లాహ్ వారి మతాన్ని రద్దు చేసి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ను సమస్త ప్రజలకూ ప్రవక్తగా పంపినాడు. అయితే మహోన్నతుడైన అల్లాహ్ గ్రంథ ప్రజల ఆహారాన్ని మరియు వారి స్త్రీలను మాకు హలాలుగా చేశాడు; ఎందుకంటే ఇందులో ఉన్న లోతైన జ్ఞానం మరియు రహస్యాలను పండితులు వివరించారు. విగ్రహారాధకులు మరియు మరణించిన ప్రవక్తలు, సత్పురుషులు మరియు ఇతరులను ఆశ్రయించే ముష్రికుల విషయంలో ఇది భిన్నంగా ఉంది; ఎందుకంటే వారి మతానికి ఎలాంటి ఆధారం లేదు, మరియు అది పూర్తిగా అసత్యం. అందువల్ల వారు జిబహ్ చేసిన జంతువు మృతదేహం, మరియు దాన్ని తినటం అనుమతించబడదు.
ఒక వ్యక్తి తనతో మాట్లాడుతున్న వ్యక్తితో ఇలా అనటం: (జిన్ను నిన్ను ప్రభావితం చేసింది), (జిన్ను నిన్ను తీసుకుపోయింది), (షైతాను నిన్ను ఎత్తుకుపోయింది), మరియు ఇలాంటి మాటలు, ఇవి దూషణల మరియు తిట్ల కోవకు చెందినవి, మరియు ఇవి ముస్లింల మధ్య అనుమతించబడవు. ఇతర తిట్ల మాదిరిగానే. ఇవి షిర్క్ లోనికి రావు, కానీ ఆ మాటలు పలికిన వ్యక్తి జిన్నులు అల్లాహ్ అనుమతి మరియు ఇష్టానికి విరుద్ధంగా మనుషులపై ప్రభావం చూపుతారని నమ్మితే తప్ప. కాబట్టి ఎవడైనా జిన్నులలో లేదా ఇతర సృష్టిరాశులలో అలాంటి శక్తి ఉందని విశ్వసిస్తే, ఆ విశ్వాసం వలన అతడు కాఫిర్ అవుతాడు. ఎందుకంటే – పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ నే ప్రతీదానికి యజమాని, ప్రతీదానికి సమర్థుడు, అయనే లాభనష్టాలను కట్టబెట్టేవాడు, అయన అనుమతి, ఇష్టత, మరియు ముందస్తు నిర్ణయం లేకుండా ఏదీ జరగదు. మహోన్నతుడైన అల్లాహ్ ఈ మహా తత్వసూత్రాన్ని ప్రజలకు తెలియజేయమని తన ప్రవక్త ముహమ్మద్ ﷺ కు ఆదేశిస్తూ తన పవిత్ర వాక్యాలలో ఇలా అన్నాడు:
﴿قُلْ لَا أَمْلِكُ لِنَفْسِي نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَاءَ اللَّهُ وَلَوْ كُنْتُ أَعْلَمُ الْغَيْبَ لَاسْتَكْثَرْتُ مِنَ الْخَيْرِ وَمَا مَسَّنِيَ السُّوءُ إِنْ أَنَا إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِقَوْمٍ يُؤْمِنُونَ188﴾
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లయితే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే! [అల్-అరాఫ్: 188] కాబట్టి సృష్టిలో శ్రేష్ఠుడైన మరియు ఉత్తముడైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు ఏ విధమైన లాభనష్టాలను కలిగించుకోలేరు - అల్లాహ్ అనుమతించిన దానిని తప్ప, మరి ఇతర సృష్టిరాశులు ఎలా కలిగించుకోగలరు?! ఇలాంటి అనేక ఆయతులు ఉన్నాయి.
అర్రాఫ్, మాంత్రికులు, జ్యోతిష్కులు మరియు అగోచర విషయాల గురించి వార్తలు అందించే వారిని అడగటం ఇది ఖండనీయమైన పని, మరియు ఇస్లాములో అనుమతించబడలేదు. వారిని నమ్మడం ఇంకా ఘోరమైన విషయమే, ఇంకా గణనీయమైన తప్పు, ఇది కుఫ్ర్కు చెందిన అంశాలలో ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيءٍ؛ لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ يَومًا».
“ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళతారో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తారో – నలభై దినముల పాటు అతని నమాజులు స్వీకరించబడవు.” ముస్లిం తన సహీహ్ లో దీనిని నమోదు చేసినారు. సహీహ్ ముస్లింలో నమోదు చేయబడిన ముఆవియా బిన్ అల్ హకమ్ అస్సుల్లమి రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
«أَنَّ النَّبيَّ ﷺ نَهَى عَنْ إِتْيَانِ الكُهَّانِ وَسُؤَالِهِم».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జ్యోతిష్కుల వద్దకు వెళ్ళటం మరియు వారిని జోస్యం అడగటం నుండి వారించారు.
సునన్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«مَنْ أَتَى كَاهِنًا، فَصَدَّقَهُ بِمَا يَقُولُ؛ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ».
ఒక జ్యోతిష్యుని వద్దకు వచ్చి అతను చెప్పినదంతా నిజమని విశ్వసించినవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించాడు. ఇలాంటి హదీథులు చాలా ఉన్నాయి. కాబట్టి ముస్లిములు జ్యోతిష్కులను, పూజారులను మరియు ఇతర మంత్రతంత్రాలు చేసేవారిని, అగోచర విషయాల గురించి తెలియపరచే వారిని, ముస్లిములను మోసానికి గురిచేసే వారిని, వైద్యం కొరకో లేదా ఇతర అవసరాల కొరకో సహాయం అడగటం నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని నుండి వారించారు మరియు దీని పట్ల హెచ్చరించారు. దీనిలో ఇంకొక విషయం కూడా ఉంది - కొంతమంది ప్రజలు వైద్యం పేరుతో చేసే అగోచర విషయాల (అదృశ్య విషయాలు) దావాలు. వారు రోగి తలపాగా (లేదా) హిజాబు (లేదా) అలాంటి వాటి వాసన చూసి, 'ఈ రోగి ఇలా చేశాడు, ఈమె ఇలా చేసింది' అని అగోచర విషయాల గురించి చెప్పడం. ఇవి రోగి తలపాగా లేదా ఇతర వస్తువుల ద్వారా తెలియదగిన విషయాలు కావు. వారి ఉద్దేశ్యం సామాన్య ప్రజలను మోసం చేయడమే, తద్వారా ప్రజలు 'ఇతను వైద్యం బాగా తెలిసినవాడు, రోగాల రకాలు, కారణాలు తెలిసినవాడు' అనుకుంటారు. కొన్నిసార్లు వారు కొన్ని మందులు ఇస్తారు. అల్లాహ్ ఇచ్చిన తక్షణ ఫలితంగా కొన్నిసార్లు రోగం నయం అయ్యే సంభవం ఉంటుంది. అప్పుడు ప్రజలు ఇది వారి మందుల వల్లనే అయిందని భావిస్తారు. మరియు కొన్ని సందర్భాల్లో, జిన్నులు మరియు షైతానులు (దయ్యాలు) కారణంగా రోగాలు వస్తాయి. ఈ నకిలీ వైద్యుడిని సేవించే జిన్నులు అతనికి కొన్ని అదృశ్య విషయాల గురించి తెలియజేస్తారు. అతడు ఆ సమాచారంపై ఆధారపడి, జిన్నులు మరియు షైతానులకు అవి కోరిన ఆరాధనలు చేస్తాడు. అప్పుడు అవి ఆ రోగిని వదిలేసి, అతనికి కలిగించిన హాని నుండి విడిపోతారు, వారి పీడను ఆపేస్తారు. జిన్నులు, షైతానులు మరియు వారిని ఉపయోగించుకునే వారి విషయం అందరికీ తెలిసిన సత్యమే.
ముస్లింలపై కర్తవ్యము ఏమిటంటే: ముస్లింలు కూడా వీటి నుండి దూరంగా ఉండటం, దానిని విడిచిపెట్టడం మరియు పరమ పవిత్రుడైన అల్లాహ్ పై ఆధారపడటం, అన్ని విషయాలలో ఆయనపై నమ్మకం ఉంచడం ఎంతో అవసరం. ధార్మిక దుఆలు మరియు చట్టబద్ధమైన ఔషధాలను తీసుకోవటంలో ఎటువంటి దోషం లేదు. రోగిని పరిశీలించి, రోగాన్ని నిర్ధారించటంలో సహజ మరియు తార్కిక కారణాలను ఉపయోగించే వైద్యుల వద్ద చికిత్స చేయించుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు:
«مَا أَنْزَلَ اللهُ دَاءً إِلَّا أَنْزَلَ لَهُ شِفَاءً، عَلِمَهُ مَنْ علِمه، وَجَهِلَهُ مَنْ جَهِلَهُ».
అల్లాహ్ ఏ రోగమును దించినా దానితో పాటు దాని వైద్యమును దించుతాడు. దాన్ని కొందరు తెలుసుకుంటారు మరియు కొందరు తెలుసుకోరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«لِكُلِّ دَاءٍ دَوَاءٌ، فإِذَا أُصِيبَ دَوَاءٌ الدَّاءَ بََرَأَ بِإِذْنِ اللهِ».
ప్రతీ రోగానికి ఒక చికిత్స ఉంటుంది. రోగానికి సరైన చికిత్స అందినప్పుడు, అది అల్లాహ్ అనుమతితో నయం అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«عِبَادَ اللهِ، تَدَاوَوا وَلَا تَدَاوَوا بِحَرَامٍ».
అల్లాహ్ దాసులారా! వైద్యం చేసుకోండి, అయితే నిషిద్ధమైన వాటితో వైద్యం చేసుకోకండి. ఇలాంటి హదీథులు చాలా ఉన్నాయి.
కాబట్టి మేము మహోన్నతుడైన అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము - ముస్లింలందరి పరిస్థితులను సరిచేయాలని, వారి హృదయాలు మరియు శరీరాలను ప్రతి చెడు నుండి రక్షించాలని, వారిని సన్మార్గంపై ఏకం చేయాలని. మమ్మల్ని మరియు వారిని ఫిత్నాల (పరీక్షల) యొక్క తప్పుదారుల నుండి, షైతాన్ మరియు అతని అనుచరుల ఆజ్ఞల నుండి కాపాడాలని. నిశ్చయంగా ఆయన ప్రతి దానిపై సర్వశక్తిమంతుడు. అల్లాహు అలీయ్యుల్ అజీమ్ (అత్యున్నతుడు, గొప్పవాడు) యొక్క సహాయం లేకుండా ఎటువంటి శక్తి లేదు.
అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త అయిన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని, ఆశీర్వాదాలను కురిపించుగాక!
***
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
నాలుగవ సందేశము:
నూతన ఆవిష్కరణ, కొత్తపోకడ మరియు షిర్కు (అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించటం) లతో కూడిన ఆరాధనల గురించి షరియహ్ ఆదేశము:
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ తరుపు నుండి గౌరవనీయులైన సోదరునికి (.........), అల్లాహ్ మిమ్మల్ని ప్రతి శుభం వైపునకు మార్గదర్శనం చేయుగాక, ఆమీన్.
సలామున్ అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు (మీపై అల్లాహ్ శాంతి,కారుణ్యము,శుభాలు కురియుగాక).
అమ్మా బాద్: మీ ఉత్తరం నాకు అందినది. అల్లాహ్ మీకు ఋజుమార్గం చూపుగాక. మీ ఉత్తరంలో మీ దేశంలో కొందరు వ్యక్తులు అల్లాహ్ అవతరింపజేయని, వాటిలో కొన్ని బిద్అతీ మరియు కొన్ని షిర్కీ అయిన ఔరాదు ఆరాధనలు పాటిస్తున్నారని మరియు వాటిని అమీరుల్ ముమినీన్ అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు మరియు ఇతరులకు ఆపాదిస్తున్నారని తెలియజేసినది. మరియు వారు ఆ ఔరాదులను జిక్ర్ సభలలో లేదా మస్జిద్ లలో మగ్రిబ్ నమాజు తరువాత చదువుతారు, అవి అల్లాహ్ కు సమీపం కావటానికి ఉపయోగపడుతుందని వారు భావిస్తారు, వారి మాటలలో: బిహక్కిల్లాహ్, రిజాలల్లాహ్, అయీనూనా బిఅవునిల్లాహ్, వ కూనూ ఔనునా బిల్లాహ్. వారి ఇలాంటి మాటలు: ఓ అఖ్'తాబ్ మరియు ఓ అస'యాద్, మాకు సహాయం చేయండి, మాకు మద్దతు ఇవ్వండి, అల్లాహ్ వద్ద మా కోసం సిఫారసు చేయండి, ఈ మీ దాసుడు మీ ముందు నిలబడి ఉన్నాడు, మీ ద్వారం వద్ద తలవంచి ఉన్నాడు, తన లోపాల గురించి భయపడుతున్నాడు, మాకు సహాయం చేయండి ఓ దైవ ప్రవక్తా! మీరు తప్ప నాకు మరెవ్వరూ లేరు, మీ నుండి మాత్రమే నా కోరిక నెరవేరుతుంది, మీరు అల్లాహ్ యొక్క కుటుంబీకులు, హమ్జా సయ్యదుష్షుహదా ద్వారా, మీలో ఎవరో ఒకరు మాకు మద్దతు ఇవ్వండి, మాకు సహాయం చేయండి ఓ దైవ ప్రవక్తా! మరియు వారు ఇలా అంటారు: అల్లాహుమ్మ సల్లి అలా మన్ జఅల్తహు సబబన్ లిఇన్షిఖాఖి అస్రారికల్ జబ్రూతియతియతి వ ఇన్ఫిలాకన్ లిఅన్వారికర్రహ్మానియతి, ఫ సార నాయిబన్ అనిల్ హద్రతిర్రబ్బానియతి, వ ఖలీఫత అస్రారిక అల్ ధాతియా. ('ఓ అల్లాహ్! నీ జబరూత్ (సార్వభౌమ) రహస్యాలు విడదీయడానికి కారణమైనవారిపై, నీ రహమానీ (దయామయ) జ్యోతులను ప్రకాశింపజేయడానికి మార్గం కల్పించినవారిపై దయచూడు. అతను నీ రబ్బానీ (సార్వభౌమ) సన్నిధికి ప్రతినిధిగా, నీ జాతి (స్వయం) రహస్యాలకు ఖలీఫాగా (ఉత్తరాధికారిగా) అయ్యాడు.)
మీరు బిదఆత్ అంటే ఏమిటో, షిర్క్ అంటే ఏమిటో, మరియు ఇలా ప్రార్థన చేసే ఇమామ్ వెనుక నమాజు సరిగ్గా అవుతుందా లేదా అనే విషయాలపై వివరణ కోరుతున్నారు, ఈ విషయాలన్నీ ధర్మంలో ఉన్నవేనా?
జవాబు: అల్హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్య బఅదహ్, వఅలా ఆలిహి వసహబిహి, వమన్ ఇహ్తదా బిహుదాహు ఇలా యౌమిద్దీన్. (సకల ప్రశంసలు కేవలం అల్లాహ్ కే శోభిస్తాయి. తన తర్వాత ఎవ్వరూ ప్రవక్తలు లేని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై శాంతి, శుభాలు, కరుణా కురుయుగాక. అలాగే ఆయన కుటుంబ సభ్యులపై, సహాబాలపై మరియు ప్రళయదినం వరకు వారి మార్గదర్శకత్వంలో సన్మార్గం పొందిన వారందరిపై కూడా అనేక సలాములు.)
ఆ తరువాత: తెలుసుకోండి - అల్లాహ్ మీకు సహాయం చేయుగాక - పరమ పవిత్రుడైన అల్లాహ్ ఈ సృష్టిని సృష్టించడానికి మరియు ప్రవక్తలను (వారిపై సలాత్ మరియు సలామ్ కురుయుగాక) పంపడానికి కారణం - కేవలం ఆయన ఒక్కడే ఆరాధించబడాలని, ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరని, ఆయన తప్ప ఇతరులెవరినీ ఆరాధించకూడదని. (ఖుర్ఆన్ లో) అల్లాహ్ ప్రకటన:
﴿وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ56﴾
మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే! [అద్-దారియాత్: 56]
ఇబాదత్ - ఇంతకు ముందు చెప్పినట్లుగా - అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుట; అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశించిన వాటిని చేయడం, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వాటిని విడిచిపెట్టడం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసంతో పాటు అల్లాహ్ పట్ల ఆచరణలలో నిష్కపటతతో, అల్లాహ్ పట్ల పరమ ప్రేమతో, మరియు ఆయనకు మాత్రమే పరిపూర్ణ విధేయతతో; మహోన్నతుడైన అల్లాహ్ చెప్పినట్లుగా చేయుట:
﴿وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ...﴾
మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ... [అల్-ఇస్రా: 23] అంటే: ఆయన ఒక్కడినే ఆరాధించమని ఆదేశించాడు మరియు తాకీదు చేశాడు, మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ2 الرَّحْمَنِ الرَّحِيمِ3 مَالِكِ يَوْمِ الدِّينِ4 إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ5﴾
సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.
అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత3
తీర్పుదినానికి స్వామి.
మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. [అల్-ఫాతిహా: 2-5] ఈ వాక్యాలతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేశాడు: ఆరాధనకు అర్హుడు కేవలం ఆయన ఒక్కడే అని మరియు సహాయం కోరదగినవాడు కూడా ఆయన ఒక్కడే అని. అల్లాహ్ జల్ల జలాలుహు ఇలా సెలవిచ్చాడు:
﴿إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ فَٱعۡبُدِ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ2 أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلۡخَالِصُ...﴾
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో!
వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! [అజ్-జుమర్: 2-3] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿فَادْعُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ14﴾
కావున (ఓ విశ్వాసులారా!) మీరు మీ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయనకే ప్రత్యేకించుకొని, అల్లాహ్ ను మాత్రమే ప్రార్థించండి. సత్యతిరస్కారులకు ఇది ఎంత అసహ్యకరమైనా! [గాఫిర్: 14] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا18﴾
మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి. [అల్-జిన్ను :18] ఈ అర్ధంలో ఆయతులు ఇంకా చాలా ఉన్నాయి, అవి అన్నీ అల్లాహ్ ఒక్కడినే ఆరాధించాల్సిన అవసరం ఉందని ధృవీకరిస్తున్నాయి.
దుఆ అనేక రకాలుగా ఆరాధనలో భాగమని తెలిసిన విషయమే. అందువలన, ఎవరైనా తమ ప్రభువైన అల్లాహ్ను తప్ప మరెవరినీ ఆరాధించరాదు, ప్రార్థించరాదు మరియు ఆయనను తప్ప మరెవరినీ సహాయం కోసం లేదా ఆపదలో మద్దతు కోసం పిలవరాదు. ఈ పవిత్రమైన ఆయతుల ప్రకారం మరియు వాటి అర్ధం ప్రకారమే ఆచరించాలి. ఇది సాధారణ విషయాలు మరియు భౌతిక కారణాలకు సంబంధించినది, ఇవి జీవించి అందుబాటులో ఉన్న సృష్టితాల సామర్ధ్యంలో ఉంటాయి. ఇవి పూజకు అర్హులు కావు, కానీ వాస్తవం మరియు ఏకాభిప్రాయం ప్రకారం, జీవించి ఉన్న సామర్థ్యవంతుడైన మనిషితో సహాయం కోరటం ధర్మసమ్మతం. అతను చేయగల సాధారణ విషయాలలో సహాయం కోరవచ్చు; ఉదాహరణకు: తన కుమారుడు లేదా సేవకుడు లేదా కుక్క వంటి వాటి నుండి కీడు తొలగించమని అతనితో సహాయం కోరటం. మరియు జీవించి అందుబాటులో ఉన్న మరియు సామర్ధ్యం కలిగిన మనిషితో తిన్నగా సహాయం కోరటం లేదా దూరంగా ఉన్నవారితో సహాయం కోరటం, లేఖల ద్వారా మరియు వేరే భౌతిక మాధ్యమాల ద్వారా, ఇల్లు నిర్మించడం లేదా తన కారును మరమ్మతు చేయడం మొదలైన వాటిలో. వాటిలో నుంచి: సన్మార్గంపై నడిచే కృషిలో మరియు యుద్ధంలో వ్యక్తి తన సహచరుల నుండి మద్దతు కోరటం ఇత్యాది. మరియు దీని గురించి అల్లాహ్ తఆలా మూసా అలైహిస్సలాం గాథలో ఇలా సెలవిచ్చాడు:
﴿...فَاسْتَغَاثَهُ الَّذِي مِنْ شِيعَتِهِ عَلَى الَّذِي مِنْ عَدُوِّهِ...﴾
అతని జాతికి చెందిన వాడు, విరోధి జాతివానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని అర్థించాడు. [అల్-ఖసస్: 15]
ఇక మృతులను, జిన్నులను, దైవదూతలను, చెట్లను మరియు రాళ్లను సహాయం కోసం అర్థించటం: ఇది పెద్ద షిర్కులో వస్తుంది, మరియు ఇది ముష్రికుల పూర్వీకులు తమ దైవాలతో చేసిన కార్యాల వంటిది; ఉదాహరణకు: ఉజ్జా, లాత్ మరియు మొదలగునవి. అలాగే, కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల పనులకై బ్రతికి ఉన్న వారిని, వారికి విలాయత్ ఉన్నదని నమ్మే వారిని సహాయం కోసం అర్థించటం; ఉదాహరణకు: రోగులకు ఆరోగ్యాన్ని ప్రసాదించటం, హృదయాలను మార్గదర్శనం చేయటం, స్వర్గంలో ప్రవేశం, నరకం నుండి రక్షణ మరియు అటువంటి ఇతర విషయాలు.
మరియు పూర్వ ఆయతులు మరియు వాటి అర్ధంలో వచ్చిన ఆయతులు మరియు హదీథులు: ఇవన్నీ అన్ని విషయాలలో అల్లాహ్ వైపు హృదయాలను మళ్ళించటం మరియు ఆరాధనను అల్లాహ్ ఒక్కడి కొరకు మాత్రమే ప్రత్యేకించటం తప్పనిసరి అని సూచిస్తున్నాయి; ఎందుకంటే ఆరాధకులు దాని కొరకు సృష్టించబడ్డారు, మరియు దాని కొరకు ఆదేశించబడ్డారు - మునుపటి ఆయతులలో చెప్పినట్లుగా - మరియు సర్వశక్తిమంతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు:
﴿وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا...﴾
మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి... [అన్-నిసా: 36] మరియు పరమ పరిశుద్ధుడైన ఆయన వాక్కు:
﴿وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ...﴾
మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని... [అల్-బయ్యిన: 5] ము’ఆద్ రదియల్లాహు అన్హు హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం:
«حَقُّ اللهِ عَلَى العِبَادِ أَنْ يَعْبُدُوهُ وَلَا يُشْرِكُوا بِهِ شَيْئًا».
«దాసులపై అల్లాహ్ హక్కు ఏమిటంటే వారు ఆయననే ఆరాధించాలి మరియు ఆయనతో పాటు దేనికీ సాటి కల్పించకూడదు.» దాని ప్రామాణికత ధృవీకరించబడింది. మరియు ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు యొక్క హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం:
«مَنْ مَاتَ وَهُوَ يَدْعُو لِلَّهِ نِدًّا؛ دَخَلَ النَّارَ».
«అల్లాహ్ కొరకు సాటి ఉన్నారని పిలిచే స్థితిలో మరణించినవాడు నరకంలో ప్రవేశిస్తాడు.» దీనిని ఇమామ్ బుఖారీ నమోదు చేసినారు. సహీహైన్ లో ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆజ్'ను యమన్ వైపుకు పంపించినప్పుడు ఇలా ఉపదేశించినారు:
«إِنَّكَ تَأْتِي قَومًا أَهْلَ كِتَابٍ، فَلْيَكُنْ أَوَّلَ مَا تَدْعُوهُم إِلَيهِ شَهَادَةِ أَنْ لَا إِلهَ إِلَّا اللهُ».
«నిశ్చయంగా నీవు గ్రంథప్రజల జాతి వద్దకు వెళ్తున్నావు కాబట్టి మొట్టమొదట వారిని ‘లా ఇలాహ ఇల్లల్లాహ్' సాక్ష్యం వైపునకు ఆహ్వానించు.» పదాలలో ఇలా ఉంది:
«اُدْعُهُمْ إِلَى شَهَادَةِ أَنْ لَا إِلهَ إِلَّا اللهُ وَأَنِّي رَسُولُ اللهِ».
«వారిని అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు నేను అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటానికి పిలవండి.» బుఖారీ రివాయతులో ఇలా వచ్చింది:
«فَلْيَكُنْ أَوَّلَ مَا تَدْعُوهُم إِلَى أَنْ يُوَحِّدُوا اللهَ».
« కాబట్టి నీవు ముందుగా అల్లాహ్ ఒక్కడే అని విశ్వసించమని వారిని ఆహ్వానించు.» సహీహ్ ముస్లింలో తారిఖ్ ఇబ్న్ అషీం అల్ అష్జఈ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«مَنْ قَالَ: لَا إِلهَ إِلَّا اللهُ، وَكَفَرَ بِمَا يُعْبَدُ مِن دُونِ اللهِ؛ حَرُمَ مَالُهُ وَدَمُهُ، وَحِسَابُهُ عَلَى اللهِ جَلَّ جَلَالُهُ».
«లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలికి, అల్లాహ్ తప్ప ఆరాధించబడే ఇతర దైవాలను తిరస్కరించినవాడి ధనం మరియు ప్రాణము నిషేధము, అతని లెక్క మహోన్నతుడైన అల్లాహ్ వద్ద ఉంటుంది». ఇలాంటి హదీథులు చాలా ఉన్నాయి.
ఇదే తౌహీద్ - ఇస్లాం ధర్మానికి మూలం, పునాది, ఇది ప్రధాన అంశం, మరియు ఇది అత్యంత ముఖ్యమైన ఫర్జ్ అంటే విధి మరియు ఇది జిన్నులు మరియు మానవుల సృష్టి వెనుక ఉన్న వివేకానికి మరియు సమస్త ప్రవక్తలను అలైహిస్సలాములను పంపడంలో ఉన్న వివేకానికి సంబంధించిన ఆయతులు ఇంతకు ముందు ప్రస్తావించబడ్డాయి, వాటిలో ఒకటి: పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కు:
﴿وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ56﴾
మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే! [అద్-దారియాత్: 56] దీనికి ఆధారంగా మహోన్నతుడైన అల్లాహ్ యొక్క మరొక వాక్కు:
﴿وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ...﴾
మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి." [అన్-నహ్ల్: 36] మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ25﴾
మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము. [అల్-అంబియా: 25] మహోన్నతుడైన అల్లాహ్ నూహ్, హూద్, సాలిహ్, షుఐబ్ అలైహిముస్సలాం గురించి తెలియజేస్తూ, వారు తమ జాతి ప్రజలకు ఇలా బోధించారని పలికినాడు:
﴿...اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَهٍ غَيْرُهُ...﴾
అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. [అల్-ఆరాఫ్: 59] ఇది ప్రవక్తలందరి పిలుపు, గత రెండు వచనాలు దీనిని సూచించాయి, మరియు ప్రవక్తలు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని మరియు ఆయనను వదిలి ఇతర దైవాలను త్యజించమని ఆదేశించారని ఆయా ప్రవక్తల శత్రువులు కూడా అంగీకరించారు. మహిమాన్వితుడైన అల్లాహ్ ఆద్ జాతి గాథలో హుద్ అలైహిస్సలాంతో వారు ఇలా అన్నారని తెలిపినాడు:
﴿...أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا...﴾
మేము అల్లాహ్ ను ఒక్కణ్ణి మాత్రమే ఆరాధించి, మా తండ్రితాతలు ఆరాధించే వాటిని వదలిపెట్టమని (చెప్పటానికి) నీవు మా వద్దకు వచ్చావా? [అల్-అరాఫ్: 70] మరియు పరమ పవిత్రుడైన అల్లాహ్ ఖురైష్ గురించి ఇలా సెలవిచ్చాడు: మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకైకుడైన అల్లాహ్ ఆరాధన చేయమని మరియు అల్లాహ్ ను వదిలి వారు ఆరాధిస్తున్న దైవాలు, పుణ్యాత్ములు, విగ్రహాలు, చెట్లు మరియు ఇతర వాటిని విడిచిపెట్టమని వారిని పిలిచినప్పుడు:
﴿أَجَعَلَ الْآلِهَةَ إِلَهًا وَاحِدًا إِنَّ هَذَا لَشَيْءٌ عُجَابٌ5﴾
ఏమీ? ఇతను (ఈ ప్రవక్త) దైవాలందరినీ, ఒకే ఆరాధ్యదైవంగా చేశాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం! [సాద్: 5] మహోన్నతుడైన అల్లాహ్ వారి గురించి ఇలా సెలవిచ్చాడు:
﴿إِنَّهُمْ كَانُوا إِذَا قِيلَ لَهُمْ لَا إِلَهَ إِلَّا اللَّهُ يَسْتَكْبِرُونَ35 وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓاْ ءَالِهَتِنَا لِشَاعِرٖ مَّجۡنُونِۭ36﴾
వాస్తవానికి, వారితో: "అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు." అని అన్నప్పుడు, వారు దురహంకారం చూపేవారు.
మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా? [అస్సాఫ్ఫాత్: 35-36] ఈ అర్థాన్ని సూచించే ఆయాతులు చాలానే ఉన్నాయి.
మరియు మేము పేర్కొన్న ఆయతులు మరియు హదీథులలో: అల్లాహ్ నాకు మరియు నీకు ధార్మిక జ్ఞానం మరియు సృష్టికర్త యొక్క హక్కు పట్ల అవగాహన కలిగించుగాక, ఈ దుఆలు మరియు సహాయం కోసం వేడుకోవటం - మీ ప్రశ్నలో మీరు వివరించినవి - ఇవన్నీ పెద్ద షిర్క్ రకాలలోనివి; ఎందుకంటే ఇవి అల్లాహ్ యేతరుల ఆరాధన మరియు ఆయన తప్ప మరెవ్వరు చేయలేని విషయాలను మృతులు మరియు గైర్హాజరు వ్యక్తుల నుండి కోరటం, ఇది పూర్వీకుల షిర్క్ కంటే అధికంగా చెడు; ఎందుకంటే పూర్వీకులు కేవలం సుఖసమయంలో మాత్రమే షిర్క్ చేసేవారు, కష్టకాలంలో వారు అల్లాహ్ కొరకు ఆరాధనను హృదయపూర్వకంగా అంకితం చేసేవారు; ఎందుకంటే వారు తెలుసుకున్నారు, సర్వోన్నతుడైన ఆయన మాత్రమే వారిని కష్టాల నుండి విముక్తి చేయగలడని, ఇతరులు చేయలేరని. ఈ విషయాన్ని అల్లాహ్ తన స్పష్టమైన గ్రంథంలో ఆ బహుదైవారాధకుల గురించి ఇలా సెలవిచ్చాడు:
﴿فَإِذَا رَكِبُواْ فِي ٱلۡفُلۡكِ دَعَوُاْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمۡ إِلَى ٱلۡبَرِّ إِذَا هُمۡ يُشۡرِكُونَ65﴾
వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకు రాగానే ఆయనకు సాటి కల్పించ సాగుతారు. [అల్-అన్'కబూత్: 65] మహోన్నతుడైన అల్లాహ్ మరో ఆయతులో వారిని ఉద్దేశించి ఇలా సెలవిచ్చాడు:
﴿وَإِذَا مَسَّكُمُ ٱلضُّرُّ فِي ٱلۡبَحۡرِ ضَلَّ مَن تَدۡعُونَ إِلَّآ إِيَّاهُۖ فَلَمَّا نَجَّىٰكُمۡ إِلَى ٱلۡبَرِّ أَعۡرَضۡتُمۡۚ وَكَانَ ٱلۡإِنسَٰنُ كَفُورًا67﴾
మరియు ఒకవేళ సముద్రంలో మీకు ఆపద వస్తే ఆయన (అల్లాహ్) తప్ప, మీరు పిలిచేవారందరూ మిమ్మల్ని త్యజిస్తారు. కాని, ఆయన మిమ్మల్ని రక్షించి, ఒడ్డుకు చేర్చినపుడు, మీరు ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటారు. వాస్తవానికి మానవుడు ఎంతో కృతఘ్నుడు. [అల్-ఇస్రా: 67]
అయితే ఈ కాలం ముష్రికులు ఎవరో ఒకరు ఇలా అంటారు: మేము ఆ వ్యక్తులు తమ స్వంత శక్తితో మాకు లాభం చేకూర్చుతారని, లేదా మా రోగాలను స్వయంగా నయం చేస్తారని, లేదా మాకు స్వయంగా నష్టం కలిగిస్తారని ఉద్దేశించము. కానీ మేము అల్లాహ్ సమక్షంలో వారి సిఫారసును కోరుతున్నాము.
దీనికి సమాధానం: అతనితో ఇలా చెప్పాలి: ఇది ప్రాచీన బహుదైవారాధకుల ఉద్దేశ్యం మరియు వారి ఆశయం. వారి ఉద్దేశ్యం ప్రకారం వారి ఆరాధ్యదైవాలు సృష్టించగలవు లేదా జీవనోపాధిని అందించగలవు, లేదా స్వయంగా లాభం లేదా హాని చేయగలవు అని కానే కాదు, ఎందుకంటే అల్లాహ్ ఖుర్ఆనులో వారి గురించి చెప్పిన దాన్ని ఇది ఖండిస్తుంది, వారు వారి సిఫారసు మరియు గౌరవాన్ని, మరియు అల్లాహ్ కు దగ్గర చేయడాన్ని మాత్రమే వారి నుండి కోరుకున్నారు, పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَيَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَضُرُّهُمۡ وَلَا يَنفَعُهُمۡ وَيَقُولُونَ هَٰٓؤُلَآءِ شُفَعَٰٓؤُنَا عِندَ ٱللَّهِ...﴾
మరియు వారు అల్లాహ్ ను కాదని తమకు నష్టం గానీ, లాభం గానీ కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు: "వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు. [యూనుస్: 18] అల్లాహ్ తన ఈ వాక్కు ద్వారా వారిని ఖండించాడు:
﴿...قُلۡ أَتُنَبِّـُٔونَ ٱللَّهَ بِمَا لَا يَعۡلَمُ فِي ٱلسَّمَٰوَٰتِ وَلَا فِي ٱلۡأَرۡضِۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ﴾
వారినడుగు: "ఏమీ? ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, అల్లాహ్ ఎరుగని విషయాన్ని, మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా?" ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే వాటి కంటే ఆయన అత్యున్నతుడు. [యూనుస్: 18] పరమ పవిత్రుడైన అల్లాహ్ ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, ముష్రికులు ఉద్దేశించిన విధంగా ఆయన వద్ద సిఫారసుదారుడు లేడని స్పష్టంగా తెలియజేశాడు. అల్లాహ్ కు తెలియని దాని ఉనికి లేదు; ఎందుకంటే పరమ పవిత్రుడైన అల్లాహ్ కు ఏదీ గోప్యంగా లేదు. మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿تَنزِيلُ ٱلۡكِتَٰبِ مِنَ ٱللَّهِ ٱلۡعَزِيزِ ٱلۡحَكِيمِ 1 إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ فَٱعۡبُدِ ٱللَّهَ مُخۡلِصٗا لَّهُ ٱلدِّينَ2 أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلۡخَالِصُۚ وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ3﴾
ఈ గ్రంథ (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది.
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో!
వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు. [అజ్-జుమర్: 1-3]
ఇక్కడ ధర్మం యొక్క అర్ధం: ఇబాదత్ (ఆరాధన), అది: అల్లాహ్ కు విధేయత మరియు ఆయన ప్రవక్తకు సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత - ఇంతకు ముందు చెప్పినట్లుగా - ఇందులో: దుఆ మరియు సహాయం కోరడం, భయం మరియు ఆశ, పశుబలి (ఖుర్బానీ) మరియు ఒట్టు, అలాగే ఇందులో: నమాజ్ మరియు ఉపవాసం, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశించిన ఇతర విషయాలు కూడా ఉన్నాయి. అందువలన ఆరాధన కేవలం ఆయనకే చెందాలని పరమ పవిత్రుడైన అల్లాహ్ చాలా స్పష్టంగా తెలియజేశాడు. మరియు దాసులు తమ ఆరాధనలను ఆయనకు మాత్రమే అంకితం చేయాలని, ఆయన మహిమను గౌరవించాలనే ఆదేశం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చిన ఆదేశం ఈ ఉమ్మతు అంటే సమాజంలోని సమస్త ప్రజలకు కూడా వర్తిస్తుంది.
తరువాత అల్లాహ్ అవిశ్వాసుల గురించి వివరించాడు, ఆయన ఇలా సెలవిచ్చాడు:
﴿...وَٱلَّذِينَ ٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَ مَا نَعۡبُدُهُمۡ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلۡفَىٰٓ...﴾
ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము! [అజ్-జుమర్: 3] అల్లాహ్ తన ఈ మాట ద్వారా వారిని ఖండించాడు:
﴿...إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ﴾
నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు. [అజ్-జుమర్: 3] ఈ పవిత్రమైన వాక్యంలో పరమ పవిత్రుడైన అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు: సత్యతిరస్కారులు, అవిశ్వాసులు అల్లాహ్ ను వదలి సంరక్షకులను ఆరాధించటానికి కారణం వారు అల్లాహ్ సాన్నిధ్యానికి చేరుతారని భావించడం మాత్రమే; ఇది పూర్వపు అవిశ్వాసుల మరియు నేటి అవిశ్వాసుల ఉద్దేశం కూడానూ, దీనిని అల్లాహ్ తన వాక్యంతో ఖండించాడు:
﴿...إِنَّ ٱللَّهَ يَحۡكُمُ بَيۡنَهُمۡ فِي مَا هُمۡ فِيهِ يَخۡتَلِفُونَۗ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي مَنۡ هُوَ كَٰذِبٞ كَفَّارٞ﴾
నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు. [అజ్-జుమర్: 3] పరమ పవిత్రుడైన అల్లాహ్ ఇలా స్పష్టపరచాడు: వారి ఆరాధ్యదైవాలు వారిని అల్లాహ్ కు దగ్గర చేరుస్తాయనే వారి భావనను ఆయన అసత్యపరచాడు, మరియు వారు ఆరాధనను వాటి వైపుకు మళ్లించటం ద్వారా కుఫ్ర్ చేసారు. దీనిని కొంచెమైనా వివేచన కలిగిన ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు, తొలికాలం సత్యతిరస్కారులు తమ ప్రవక్తలు, వలీలు, చెట్లు, రాళ్ళు మరియు ఇతర సృష్టించబడిన వాటిని అల్లాహ్ మరియు వారి మధ్య మధ్యవర్తులుగా తీసుకోవటం ద్వారా మాత్రమే అవిశ్వాసానికి పాల్బడినారు. పరమ పరిశుద్ధుడైన మరియు మహిమాన్వితుడైన అల్లాహ్' యొక్క అనుమతి మరియు సంతృప్తి లేకుండా వారు తమ అవసరాలను తీర్చుతారని వారి నమ్మకం, రాజుల వద్ద మంత్రులు సిఫారసు చేసే విధంగా, సర్వశక్తిమంతుడైన ఆయనను రాజులు మరియు నాయకులతో పోల్చారు. వారు ఇలా అన్నారు: రాజు లేదా నాయకుని వద్ద అవసరం ఉన్నవారు అతని సన్నిహితుల మరియు మంత్రుల ద్వారా సిఫారసు పొందినట్లే, మేము కూడా అల్లాహ్ కు ఆయన ప్రవక్తలు మరియు సత్పురుషుల ఆరాధన ద్వారా సమీపిస్తాము. ఇది అత్యంత అసత్యమైనది; ఎందుకంటే ఆయనకు సమానుడు లేడు, ఆయనను, ఆయన సృష్టితో పోల్చలేము, ఆయన అనుమతి లేకుండా ఎవరూ ఆయన వద్ద సిఫారసు చేయలేరు, మరియు ఆయన ఏకదైవారాధకులకు మాత్రమే అనుమతిస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు, అన్నింటిని తెలిసినవాడు, అత్యంత కరుణాప్రదాత, ఎవరికీ భయపడడు, ఎవరినీ భయపెట్టడు; ఎందుకంటే ఆయన తన దాసులపై అధికారం కలిగి ఉన్నాడు, తన ఇష్టానుసారం దానిని నిర్వహిస్తాడు. రాజులు మరియు నాయకులు అన్నీ చేయలేరు, అందువల్ల వారు తమకు సాధ్యం కాని వాటిలో సహాయం చేయడానికి మంత్రులు, సన్నిహితులు మరియు సైనికుల అవసరం ఉంటుంది; అలాగే వారికి తెలియని అవసరాలను వారికి తెలియజేయడానికి అవసరం ఉంటుంది, అందువల్ల వారు తమ మంత్రులు మరియు సన్నిహితుల ద్వారా వారిని ఆకర్షించడానికి మరియు సంతృప్తి పరచడానికి అవసరం ఉంటుంది. ప్రభువు, మహిమాన్వితుడు, తన సృష్టిరాశుల యొక్క అక్కర లేనివాడు, మరియు ఆయన వారి స్వంత తల్లుల కంటే ఎక్కువగా వారిపై దయ గలవాడు. ఆయన మహా గొప్ప పరిపాలకుడు, మాహా గొప్ప న్యాయమూర్తి, తన వివేకం, కార్యం మరియు సమర్ధత ప్రకారం వస్తువులను వాటి స్థానాలలో ఉంచువాడు. కనుక ఆయనను ఏ విధంగానూ తన సృష్టితో పోల్చడం సముచితం కాదు. అందుకే అల్లాహ్ తన గ్రంథంలో స్పష్టంగా తెలిపాడు: బహుదైవారాధకులు అల్లాహ్' యే సృష్టికర్త, జీవనోపాధిని ఇచ్చేవాడు, విశ్వవ్యవహారాలు నిర్వహించేవాడు అని అంగీకరించారు, మరియు ఆయనే అత్యవసర పరిస్థితుల్లో స్పందించేవాడు, కష్టాలను తొలగించేవాడు, ప్రాణం పోసేవాడు మరియు ప్రాణాలు తీసేవాడు, మరియు ఆయన ఇతర కార్యాలు కూడా చేసేవాడు. మరియు ముష్రికుల మధ్య మరియు ప్రవక్తల మధ్య ఏకైకుడైన అల్లాహ్ ఆరాధనలో చిత్తశుద్ధి విషయంలో తగువులు జరిగాయి. అల్లాహ్ జల్ల జలాలుహు ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَهُمۡ لَيَقُولُنَّ ٱللَّهُ...﴾
మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు... [జుఖ్'రుఫ్: 87] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُلۡ مَن يَرۡزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ أَمَّن يَمۡلِكُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَمَن يُخۡرِجُ ٱلۡحَيَّ مِنَ ٱلۡمَيِّتِ وَيُخۡرِجُ ٱلۡمَيِّتَ مِنَ ٱلۡحَيِّ وَمَن يُدَبِّرُ ٱلۡأَمۡرَۚ فَسَيَقُولُونَ ٱللَّهُۚ فَقُلۡ أَفَلَا تَتَّقُونَ31﴾
వారిని అడుగు: "ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా? [యూనుస్: 31] ఈ అర్ధంలో ఆయతులు చాలా ఉన్నాయి.
మరియు ప్రవక్తల మరియు జాతుల మధ్య వివాదం ఏకైక అల్లాహ్ కొరకు ఆరాధనను ప్రత్యేకించటంలోనే ఉందని సూచించే ఆయతులు ముందుగా ప్రస్తావించబడ్డాయి, అల్లాహ్ వాక్కు:
﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَ...﴾
మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి. [అన్-నహ్ల్: 36] ఇలాంటి ఆయతలు అనేకం ఉన్నాయి. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో చాలా చోట్ల సిఫారసు యొక్క ప్రాముఖ్యతను వివరించాడు, మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿...مَن ذَا ٱلَّذِي يَشۡفَعُ عِندَهُۥٓ إِلَّا بِإِذۡنِهِ...﴾
ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? [అల్-బఖర: 255] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَكَم مِّن مَّلَكٖ فِي ٱلسَّمَٰوَٰتِ لَا تُغۡنِي شَفَٰعَتُهُمۡ شَيۡـًٔا إِلَّا مِنۢ بَعۡدِ أَن يَأۡذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرۡضَىٰٓ26﴾
మరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్ ఎవరి పట్లనైతే ప్రసన్నుడై, తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప! [నజ్మ్: 26]
దైవదూతల (మలాఇక) వివరణలో అల్లాహ్ సెలవిచ్చాడు:
﴿...وَلَا يَشۡفَعُونَ إِلَّا لِمَنِ ٱرۡتَضَىٰ وَهُم مِّنۡ خَشۡيَتِهِۦ مُشۡفِقُونَ﴾
వారు, ఆయన సమ్మతించిన వారి కొరకు తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు. వారు, ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు. [అల్-అంబియా: 28]
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలియజేశాడు - ఆయన తన దాసుల నుండి అవిశ్వాసమును అంగీకరించడు, ఆయనకు ఇష్టమై ఉన్నది కృతజ్ఞత మాత్రమే. కృతజ్ఞత అంటే ఆయన ఏకత్వమును నమ్మడం మరియు ఆయన ఆజ్ఞలను అనుసరించడమే. అల్లాహ్ ప్రకటన:
﴿إِن تَكۡفُرُواْ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنكُمۡۖ وَلَا يَرۡضَىٰ لِعِبَادِهِ ٱلۡكُفۡرَۖ وَإِن تَشۡكُرُواْ يَرۡضَهُ لَكُمۡ...﴾
ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, నిశ్చయంగా, అల్లాహ్ మీ అక్కరలేని వాడు. మరియు ఆయన తన దాసులు సత్యతిరస్కార వైఖరిని అవలంబించడాన్ని ఇష్ట పడడు. మరియు మీరు కృతజ్ఞులైనట్లయితే ఆయన మీ పట్ల ఎంతో సంతోషపడతాడు... [అజ్-జుమర్: 7]
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, బుఖారి తన సహీహ్ లో నమోదు చేసినారు: ‘‘ఓ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లము) జనుల్లో మీ సిఫారసు పొందు అదృష్టవంతుడు ఎవరు? అని ప్రశ్నించడం జరిగింది, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ జవాబిస్తూ ఇలా పలికినారు:
«مَنْ قَالَ: لَا إِلهَ إِلَّا اللهُ خَالِصًا مِنْ قَلْبِهِ».
ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా పలుకుతాడో. లేదా ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికినారు:
«مِنْ نَفْسِهِ».
స్వయంగా, మనస్పూర్తిగా
సహీహ్ హదీథులో అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«لِكُلِّ نَبِيٍّ دَعْوَةٌ مُسْتَجَابَةٌ، فَتَعَجَّلَ كُلُّ نَبِيٍّ دَعْوَتَهُ، وَإِنِّي اخْتَبَأْتُ دَعْوَتِي شَفَاعَةً لِأُمَّتِي يَوْمَ الْقِيَامَةِ، فَهِيَ نَائِلَةٌ إِنْ شَاءَ اللَّهُ مَنْ مَاتَ مِنْ أُمَّتِي لَا يُشْرِكُ بِاللَّهِ شَيْئًا».
ప్రతి ప్రవక్తకు తక్షణమే స్వీకరించబడే ఒక ప్రార్థన ఉంది. ప్రతి ప్రవక్త తన ప్రార్థనను త్వరగా సమర్పించుకున్నాడు, మరియు నేను నా ప్రార్థనను తీర్పు దినమున నా ఉమ్మత్ సిఫారసు కొరకు దాచి ఉంచాను. అల్లాహ్ చిత్తం ప్రకారం, నా ఉమ్మత్ లో ఎవరైతే అల్లాహ్ తో ఏదీ భాగస్వామ్యం చేయకుండా మరణిస్తే వారికిది లభిస్తుంది. ఇలాంటి హదీథులు చాలా ఉన్నాయి.
మేము పేర్కొన్న ఆయతులు మరియు హదీథులన్నీ ఆరాధన కేవలం అల్లాహ్ ఒక్కడికే చెందిన హక్కు అని సూచిస్తున్నాయి. మరియు అది అల్లాహ్ తప్ప మరెవరికి, ప్రవక్తలకు కూడా, ఇవ్వడం తగదు. మరియు షఫాఅతు అల్లాహ్ జల్ల జలాలుహు యొక్క ఆధీనంలో మాత్రమే ఉంది, ఆయన సుబ్హానహు చెప్పినట్లుగా:
﴿قُل لِّلَّهِ ٱلشَّفَٰعَةُ جَمِيعٗا...﴾
ఇలా అను: "సిఫారసు కేవలం అల్లాహ్ అధీనంలోనే ఉంది... [అజ్-జుమర్: 44] అల్లాహ్ అనుమతించిన తరువాత మాత్రమే సిఫారసుదారునికి అనుమతి లభిస్తుంది, మరియు ఆయన సిఫారసు పొందిన వ్యక్తిపై సంతృప్తి చెందుతాడు. పరమ పరిశుద్దుడైన అల్లాహ్ కేవలం తౌహీదును మాత్రమే ఇష్టపడతాడు - ఇంతకు ముందు చెప్పినట్లుగా - దీనిని ఆధారంగా చేసుకుని: ముష్రికులకు సిఫారసులో భాగం లేదు, మరియు అల్లాహ్ ఈ విషయాన్ని తన వాక్కులో స్పష్టపరచాడు:
﴿فَمَا تَنفَعُهُمۡ شَفَٰعَةُ ٱلشَّٰفِعِينَ 48﴾
అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు. [అల్-ముద్దస్సిర్: 48] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...مَا لِلظَّٰلِمِينَ مِنۡ حَمِيمٖ وَلَا شَفِيعٖ يُطَاعُ﴾
దుర్మార్గులకు, ఆప్తమిత్రుడు గానీ, మాట చెల్లునట్టి సిఫారసు చేసేవాడు గానీ, ఎవ్వడూ ఉండడు. [గాఫిర్: 18]
మరియు దౌర్జన్యం అనగా షిర్కు అని మనకు తెలుసు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَٱلۡكَٰفِرُونَ هُمُ ٱلظَّٰلِمُونَ﴾
మరియు సత్యతిరస్కారులు, వారే! దుర్మార్గులు. [అల్-బఖరహ్: 254] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...إِنَّ ٱلشِّرۡكَ لَظُلۡمٌ عَظِيمٞ﴾
నిశ్చయంగా, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం (బహుదైవారాధన) మహా దుర్మార్గము. [లుఖ్మాన్: 13]
మీరు మీ ప్రశ్నలో పేర్కొన్నట్లుగా: కొన్ని సూఫీ మస్జిదులలో మరియు ఇతర ప్రదేశాలలో చెప్పే మాటలు: 'అల్లాహ్! నీ జబ్రూత్ రహస్యాలను విప్పడానికి కారణమైనవారిపై దురుద్దేశం లేని దయను ప్రసాదించు, నీ రహ్మానీయ నూరులను విప్పడానికి కారణమైనవారిపై దయను ప్రసాదించు, అల్లాహ్ యొక్క సన్నిధిలో ప్రతినిధిగా మారినవారిపై దయను ప్రసాదించు, మరియు నీ స్వరూప రహస్యాలకు ప్రతినిధిగా మారినవారిపై దయను ప్రసాదించు..ఇత్యాది.'
జవాబు: ఈ మాట మరియు దానిని పోలినవన్నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించిన అతిశయోక్తి మరియు కఠినత్వం లోనివి; అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రదియల్లాహు అన్హు నుండి ముస్లిం హదీథు గ్రంథంలో ప్రామాణికంగా నమోదు చేయబడిన ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
«هَلَكَ المُتَنَطِّعُونَ» قَالَهَا ثَلَاثًا.
“(ధర్మం విషయంలో) ‘హద్దు మీరే వారు నాశనమయ్యారు’”. అలా మూడు సార్లు అన్నారు.
ఇమామ్ ఖత్తాబీ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: ముతనత్తిఉ: విషయములో లోతుగా వెళ్ళేవాడు, దాని గురించి అనవసరంగా పరిశోధన చేయువాడు; తమకు సంబంధం లేని విషయాలలో ప్రవేశించే అహ్లుల్ కలామ్ పద్ధతులపై, తమ బుద్ధి అందుకోలేని విషయాలలో తలదూర్చేవాడు.
అబూ సయదాత్ ఇబ్నె అసీర్ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: తమ మాటలలో లోతుగా వెళ్ళే వారు, హద్దులు దాటి అతిశయంగా మాట్లాడే వారు; వారు తమ గొంతుల లోతైన భాగం వరకు మాటలు పలుకుతారు. 'నత్ఉ' (النطع) అన్నది నోటి పైభాగాన్ని సూచించే పదం, దానినుంచి ఈ పదం తీసుకోబడింది. ఆ తరువాత ఈ పదాన్ని ప్రతి విషయంలో మాటలతో గాని, కార్యాల్లో గాని లోతుగా వెళ్లే వ్యక్తులపై వాడసాగారు.
భాషా పండితులైన ఈ ఇద్దరు ఇమామ్లు పేర్కొన్న దానితో, మీకు మరియు కనీస అవగాహన ఉన్న కొంతమందికి స్పష్టమవుతుంది, మన ప్రవక్త మరియు మన నాయకుడు సల్లల్లాహు అలైహి వసల్లంపై సలాత్ మరియు సలామ్ పంపే ఈ విధానం అనవసరమైన కఠినత మరియు అతిశయోక్తి నుండి నిషేధించబడినదని. ఈ అధ్యాయంలో ముస్లిం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దురూద్, సలాం పంపే స్థిరమైన విధానాన్ని అనుసరించాలి, మరియు అందులో ఇతరుల అవసరం లేకుండా సంపూర్ణత ఉందని గ్రహించాలి.
ఇది బుఖారీ మరియు ముస్లింల సహీహ్ లలో కాబ్ బిన్ ఉజ్రా రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడింది, సహాబాలు రదియల్లాహు అన్హుమా ఇలా అన్నారు: 'ఓ దైవప్రవక్తా! అల్లాహ్ మమ్మల్ని మీపై దరూద్ పంపమని ఆదేశించాడు; అయితే మేము ఏమని మీపై దరూద్ పంపాలి?' అని అడిగారు. దానికి ఆయన ఇలా చెప్పారు:
«قُولُوا: اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبرَاهِيمَ وَعَلَى آلِ إِبرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، وَبَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبرَاهِيمَ وَعَلَى آلِ إِبرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ».
మీరు ఇలా పలకండి: ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలీ ముహమ్మద్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ్, ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ్, ఇన్నక హమీదుమ్మజీద్ (ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీంను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్' ను మరియు ఆయన కుటుంబాన్ని కరుణించు' స్తోత్రానికి అర్హుడవు, ఘనత గలవాడవు నీవే. 'ఓ అల్లాహ్! ఇబ్రాహీంపై మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్' పై మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురుపించు. స్తోత్రానికి అర్హుడవు, ఘనత గలవాడవు నీవే'.)
సహీహైన్ రెండు గ్రంథాలలో అబూ హుమైద్ అస్సాయిదీ రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ: వారు అడిగారు: దైవప్రవక్తా! మేము మీ పై దరూద్ ఎలా పఠించాలి?
«قُولُوا: اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى أَزْوَاجِهِ وَذُرِّيَّتِهِ كَمَا صَلَّيْتَ عَلَى آلِ إِبرَاهِيمَ، وَبَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى أَزْوَاجِهِ وَذُرِّيَّتِهِ كَمَا بَارَكْتَ عَلَى آلِ إِبرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ».
మీరు ఇలా పలకండి: ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అజ్ వాజిహీ వజుర్రియ్యతిహీ కమా సల్లైత అలా ఆలి ఇబ్రాహీమ్, వ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా అజ్ వాజిహీ వజుర్రియ్యతిహీ కమా బారక్త అలా ఆలి ఇబ్రాహీమ్, ఇన్నక హమీదుమ్మజీద్’.(ఓ అల్లాహ్! నీవు ముహమ్మద్ వారిపై వారి భార్యలపై మరియు ఆయన సంతానంపై శాంతిని కురిపించు, ఎలాగైతే నీవు ఇబ్రాహీము కుటుంబీకులపై శాంతిని కురిపించావో, అలాగే నీవు ముహమ్మద్ వారిపై, వారి భార్యలపై మరియు ఆయన సంతానముపై శుభాలు కురిపించు ఎలాగైతే నీవు ఇబ్రాహీము కుటుంబీకులపై శుభాలు కురిపించావో, నిస్సందేహంగా నీవే సకల స్తోత్రాలకు అర్హుడవు, గొప్ప ఘనత గలవాడవు)
సహీహ్ ముస్లింలో హజ్రత్ అబూ మసూద్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: బషీర్ బిన్ సాద్ రదియల్లాహు అన్హు అడిగారు: 'ఓ దైవప్రవక్తా! అల్లాహ్ మమ్మల్ని మీ పై దరూద్ పంపమని ఆదేశించాడు. అయితే మేము ఏమని మీపై దరూద్ పంపాలి?' దానికి ఆయన మౌనం వహించారు, తరువాత ఆయన ఇలా అన్నారు:
«قُولُوا: اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ؛ كَمَا صَلَّيْتَ عَلَى آلِ إِبرَاهِيمَ، وَبَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ؛ كَمَا بَارَكْتَ عَلَى آلِ إِبرَاهِيمَ فِي العَالَمِينَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، وَالسَّلَامُ كَمَا عَلِمتُم».
‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ్, అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ ఫిల్ ఆలమీన్, ఇన్నక హమీదుమ్మజీద్, వస్సలాము కమా అలిం తుమ్’. (ఓ అల్లాహ్! నీవు ముహమ్మద్పై మరియు ముహమ్మద్ కుటుంబంపై ఆశీర్వాదము కురిపించు; నీవు ఇబ్రాహీం కుటుంబంపై ఆశీర్వాదము కురిపించినట్లే. మరియు ముహమ్మద్పై మరియు ముహమ్మద్ కుటుంబంపై కరుణతో నిండి ఆశీర్వాదము కురిపించు; నీవు ప్రపంచాలలో ఇబ్రాహీం కుటుంబంపై కురిపించినట్లే. నిశ్చయంగా నీవు మహిమాన్వితుడివి, గౌరవనీయుడవు. శాంతి (సలాం)విషయంలో మీకు ఎలా బోధించబడిందో అలాగే [చెప్పండి].
కాబట్టి ఈ పదాలు మరియు అటు వంటి ఇతర పదాలు - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ నుండి ధృవీకరించబడిన పదాలు - ముస్లింలు తన దుఆ మరియు దరూద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ పై ఉపయోగించవలెను; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ తనకు అనుకూలంగా ఉపయోగించవలసిన వాటిని బాగా ఎరిగినవారు, అలాగే తన ప్రభువు కోసం ఉపయోగించవలసిన పదాలను బాగా ఎరిగినవారు.
అయితే, కృత్రిమమైన మరియు కొత్తగా వచ్చిన పదాలు, మరియు తప్పు అర్థాన్ని ఇచ్చే పదాలు; ప్రశ్నలో పేర్కొన్న పదాల వలె, వాటిని ఉపయోగించడం తగదు; ఎందుకంటే అవి కృత్రిమత కలిగినవి మరియు అవి తప్పు అర్థాలు ఇస్తాయి, మరియు అవి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఎంచుకున్న మరియు తన ఉమ్మతుకు సూచించిన పదాలకు విరుద్ధంగా ఉంటాయి. ఆయన సృష్టిలో అత్యంత జ్ఞానవంతులు, అత్యంత గొప్ప సలహాదారులు మరియు కృత్రిమతకు దూరంగా ఉన్నవారు, ఆయనపై తన ప్రభువు నుండి ఉత్తమ దరూదులు మరియు ఆయనపై శాంతి కురుయుగాక.
మరియు ప్రస్తావిత ఆధారాలలో తౌహీదు యొక్క సత్యం, షిర్క్ యొక్క సత్యం, ఈ విషయంలో ప్రాచీన బహుదైవారాధకులు మరియు ఆధునిక బహుదైవారాధకుల మధ్య తేడా, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై షరీఅతుబద్దమైన నమాజు విధానం వివరణ ఒక సత్యాన్వేషికి సరిపోతాయని, తృప్తిపరుస్తాయని నేను ఆశిస్తున్నాను. ఎవడికైతే వాస్తవాన్ని (హఖ్) తెలుసుకోవాలనే ఆసక్తి ఉండదో, అతడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తాడు. అల్లాహ్ జల్ల జలాలుహు ఇలా సెలవిచ్చాడు:
﴿فَإِن لَّمۡ يَسۡتَجِيبُواْ لَكَ فَٱعۡلَمۡ أَنَّمَا يَتَّبِعُونَ أَهۡوَآءَهُمۡۚ وَمَنۡ أَضَلُّ مِمَّنِ ٱتَّبَعَ هَوَىٰهُ بِغَيۡرِ هُدٗى مِّنَ ٱللَّهِۚ إِنَّ ٱللَّهَ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ50﴾
వారు నీకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే, వారు కేవలం తమ కోరికలను అనుసరిస్తున్నారని తెలుసుకో! మరియు అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని విడిచి కేవలం తన కోరికలను అనుసరించే వాని కంటే ఎక్కువ మార్గభ్రష్టుడు ఎవడు? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు. [అల్-ఖసస్: 50]
ఈ పవిత్ర ఆయతులో అల్లాహ్ స్పష్టపరిచినాడు: అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపిన మార్గదర్శకత్వం మరియు సత్యమయిన ధర్మం పట్ల ప్రజలు రెండు వర్గాలుగా ఉన్నారు:
వారిలో ఒక వర్గం: అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి స్పందించేవారు.
మరియు రెండవ వర్గం: తన మనోవాంఛలను అనుసరించేవారు; పరమ పవిత్రుడైన అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు, అల్లాహ్ నుండి మార్గదర్శకం లేకుండా తన మనోవాంఛలను అనుసరించే వాడి కంటే అపమార్గమునకు లోను అయినవాడు మరెవడూ లేడు.
కాబట్టి మనం మహోన్నతుడైన అల్లాహ్ తో మన స్వంత కోరికలకు మనం బానిసలుగా మారకుండా రక్షణ కోరుతున్నాము మరియు మమ్మల్ని మరియు మన మిగతా సోదరులను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిలుపుకు స్పందించేవారిగా, ఆయన షరియత్ ను గౌరవించేవారిగా, ఆయన షరియత్ కు విరుద్ధమైన బిద్అత్ మరియు కోరికల నుండి జాగ్రత్త పడేవారిగా చేయమని వేడుకుంటున్నాము. నిశ్చయంగా ఆయన అమితంగా దాతృత్వం గలవాడు మరియు ఔదార్యుడు.
అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త అయిన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై మరియు ప్రళయదినం వరకు ధర్మంలో ఆయనను అనుసరించే వారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
***
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
ఐదవ సందేశము:
మహాప్రవక్త జన్మదినోత్సవం మరియు ఇతర జన్మదినముల ఉత్సవాలకు సంబంధించిన ఆదేశము
స్థుతులన్ని అల్లాహ్ కే శోభిస్తాయి, దైవ ప్రవక్తపై, ఆయన కుటుంబముపై, ఆయన అనుచరులపై, ఆయన మార్గమును అనుసరించిన వారిపై శుభాలు, శాంతి కురియుగాక.
దీని తరువాత: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజు (మీలాదున్నబీ) జరుపుకోవడం, ఆ సందర్భంలో ఆయనకు నిలబడి సలాం చెప్పడం మరియు జన్మదిన వేడుకలలో చేయబడే ఇతర కార్యాల గురించి అనేకమంది నుండి ప్రశ్నలు పునరావృతమయ్యాయి.
దీనికి సమాధానం ఏమిటంటే: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజు (మీలాదున్నబీ) పండుగను జరుపుకోవడం లేదా ఇతరుల పుట్టిన రోజులను జరుపుకోవడం అనేది అనుమతించబడలేదు; ఎందుకంటే ఇది ధర్మంలో కొత్తగా ప్రవేశించిన బిద్అతులలో ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దీన్ని చేయలేదు, ఆయన తరువాత వచ్చిన ఖలీఫాలు కూడా చేయలేదు, ఇతర సహాబాలు రదియల్లాహు అన్హుమ్ కూడా చేయలేదు, మరియు ఉత్తమ శతాబ్దాలలోని వారిని అనుసరించిన తాబియీనులు కూడా చేయలేదు. వారు సున్నతులలో అత్యంత పరిజ్ఞానం కలిగినవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలిగినవారు, మరియు ఆయన షరీఅతును అనుసరించడంలో వారికంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నవారు. మహోన్నతుడైన అల్లాహ్ తన స్పష్టమైన గ్రంథములో ఇలా సెలవిచ్చాడు:
﴿...وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْ...﴾
ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి.
[అల్-హష్ర్: 7] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...فَلۡيَحۡذَرِ ٱلَّذِينَ يُخَالِفُونَ عَنۡ أَمۡرِهِۦٓ أَن تُصِيبَهُمۡ فِتۡنَةٌ أَوۡ يُصِيبَهُمۡ عَذَابٌ أَلِيمٌ﴾
...ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి. [అన్నూర్:63] అల్లాహ్ సెలవిచ్చాడు:
﴿لَّقَدۡ كَانَ لَكُمۡ فِي رَسُولِ ٱللَّهِ أُسۡوَةٌ حَسَنَةٞ لِّمَن كَانَ يَرۡجُواْ ٱللَّهَ وَٱلۡيَوۡمَ ٱلۡأٓخِرَ وَذَكَرَ ٱللَّهَ كَثِيرٗا21﴾
వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో! [అల్-అహ్'జాబ్: 21] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَٱلسَّٰبِقُونَ ٱلۡأَوَّلُونَ مِنَ ٱلۡمُهَٰجِرِينَ وَٱلۡأَنصَارِ وَٱلَّذِينَ ٱتَّبَعُوهُم بِإِحۡسَٰنٖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُ وَأَعَدَّ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي تَحۡتَهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ100﴾
మరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ వేసిన (ఇస్లాం ను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధ పరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం). [తౌబా: 100] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا...﴾
ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. [అల్ మాయిదా: 3] ఈ అర్ధంలో ఆయతులు చాలా ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించబడిన హదీథులో ఆయన ఇలా సెలవిచ్చారు:
«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنهُ فَهُوَ رَدٌّ».
“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”. అనగా తిరస్కరించబడుతుంది అని అర్ధం ఇంకొక హదీథులో ఇలా ఉంది:
«عَلَيْكُم بِسُنَّتِي وَسُنَّةِ الخُلَفَاءِ الرَّاشِدِينَ المَهْدِيَّينَ مِنْ بَعدِي، تَمَسَّكُوا بِهَا، وَعَضُّوا عَلَيهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُمْ وَمُحْدَثَاتِ الأُمُورِ، فَإِنَّ كُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالةٌ».
మీరు నా విధానాన్ని (సున్నతులను), నా తర్వాత సన్మార్గగాములైన మార్గదర్శక ఖలీఫాల విధానాన్ని ఖచ్చితంగా అనుసరించండి. దానిని గట్టిగా పట్టుకుని ఉండండి, దానిని మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త పోకడ ఒక బిద్అత్. ప్రతి బిద్అత్ మార్గవిహీనతకు నిదర్శనం. ఈ రెండు హదీథులలో బిద్అత్ ప్రవేశపెట్టడం మరియు వాటిని ఆచరించడం పట్ల తీవ్రమైన హెచ్చరిక ఉన్నది,
ఇలాంటి జన్మదినములను ప్రవేశపెట్టడం ద్వారా పరమ పవిత్రుడైన అల్లాహ్ ఈ ఉమ్మతుకు ధర్మాన్ని పూర్తి చేయలేదని, మరియు ప్రవక్త అలైహిస్సలాం ఈ ఉమ్మతు చేయవలసిన పనులను పూర్తిగా తెలియజేయలేదని అర్థము చేసుకోవలసి వస్తుంది. చివరికి ఈ తరువాతి వారు వచ్చి అల్లాహ్ ధర్మంలో ఆయన అనుమతించని విషయాలను ప్రవేశపెట్టారు - ఇది వారిని అల్లాహ్ సాన్నిధ్యానికి చేరుస్తుందని భావిస్తూ. ఇది నిస్సందేహంగా ఒక ఘోర ప్రమాదం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై తీవ్రమైన అభ్యంతరం. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తన దాసుల కొరకు ధర్మాన్ని సంపూర్ణం చేశాడు మరియు వారికి అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టమైన సందేశాన్ని అందించారు, మరియు స్వర్గానికి చేరుకునే మార్గాన్ని మరియు నరకం నుండి దూరంగా ఉండే మార్గాన్ని ఉమ్మతుకు వివరించకుండా విడిచి పెట్టలేదు, అబ్దుల్లాహ్ ఇబ్ను అమ్ర్ రదియల్లాహు అన్హు నుండి వచ్చిన సహీహ్ హదీథులో స్థాపించబడినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
«مَا بَعَثَ اللهُ مِن نَبِيٍ إِلَّا كَانَ حَقًّا عَلَيهِ أَن يَدُلَّ أُمَّتَهُ عَلَى خَيرِ مَا يَعْلَمُهُ لَهُم، وَيُنْذِرَهُمْ شَرَّ مَا يَعْلَمُهُ لَهُمْ».
అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఏ ప్రవక్తా తన జాతికి అతనికి తెలిసిన ఉత్తమమైన దానిని చూపించకుండా మరియు అతనికి తెలిసిన చెడు నుండి వారిని హెచ్చరించకుండా ఉండలేదు. ముస్లిం తన సహీహ్ లో ఇలా నమోదు చేసినారు.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలలో శ్రేష్ఠులు మరియు వారి పరిసమాప్తకులు. అల్లాహ్ సందేశాన్ని మరియు ఆదేశాలను సంపూర్ణంగా అందించిన వారు. మౌలిద్ ఉత్సవాలు పరమ పవిత్రుడైన అల్లాహ్ ఆమోదించిన ధర్మంలో భాగమైతే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఉమ్మతుకు వివరించి ఉండేవారు లేదా తన జీవితంలో ఆచరించి ఉండేవారు లేదా ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ దానిని ఆచరించి ఉండేవారు. కానీ అలాంటిదేమీ జరగనందున, అది ఇస్లాం లో భాగం కాదని తెలిసింది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మతును హెచ్చరించిన కొత్తగా ప్రవేశించిన వాటిలో ఒకటి, దీని గురించి ఇంతకు ముందు హదీథులలో ప్రస్తావించబడింది. ఈ అధ్యాయమునకు సంబంధించి చాలా ఆయతులు మరియు హదీథులు ఉన్నాయి.
అనేక ఉలమాలు (ఇస్లామీయ పండితులు) మీలాదున్నబీ (ప్రవక్త జయంతి) వంటి వాటిని తిరస్కరించారు మరియు వాటి నుండి హెచ్చరించారు - పైన పేర్కొన్న ప్రమాణాలు మరియు ఇతర ఇస్లామీయ సాక్ష్యాల ఆధారంగా. కానీ కొంతమంది ఆధునిక పండితులు విభేదించినారు: ఈ క్రింది నిషిద్ధ విషయాలు లేకుంటే వీటిని అనుమతించారు - వేడుకలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అతిశయోక్తి, స్త్రీ-పురుషుల కలయిక, సంగీత వాయిద్యాల వాడకం, ఇతర ఇస్లామీయ నియమాలకు విరుద్ధమైన పనులు. వారు వాటిని 'బిద్అత్ హసన' (మంచి నూతనాచారాలు) అని భావించారు.
షరీఅత్ నియమం ఏమిటంటే: ప్రజలు ఏ విషయంలోనైనా భేదాభిప్రాయాలు ఏర్పడితే, దాన్ని అల్లాహ్ గ్రంథము మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతు వైపుకు మరలించాలి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ وَأُوْلِي ٱلۡأَمۡرِ مِنكُمۡۖ فَإِن تَنَٰزَعۡتُمۡ فِي شَيۡءٖ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ إِن كُنتُمۡ تُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ ذَٰلِكَ خَيۡرٞ وَأَحۡسَنُ تَأۡوِيلًا59﴾
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది. [నిసా: 59] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَا ٱخۡتَلَفۡتُمۡ فِيهِ مِن شَيۡءٖ فَحُكۡمُهُۥٓ إِلَى ٱللَّهِ ...﴾
మరియు మీరు ఏ విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగి వున్నారో, దాని తీర్పు అల్లాహ్ వద్దనే ఉంది... [అష్-షూరా: 10]
పుట్టినరోజుల ఉత్సవాలు జరపడాన్ని మేము తిరస్కరించాము. దీని గురించిన ఆదేశాల కోసం మేము అల్లాహ్ యొక్క గ్రంథమైన ఖుర్ఆన్ లో అన్వేషించాము. అప్పుడు మేము తెలుసుకున్నది ఏమిటంటే, పరమ పవిత్రుడైన అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తీసుకువచ్చిన విషయాలను అనుసరించమని ఆదేశిస్తున్నాడు. మరియు ఆయన మనలను ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ ఈ ఉమ్మత్‌కు తమ దీన్ను సంపూర్ణం చేశాడని ఖుర్ఆన్ తెలియజేస్తుంది. కానీ ఈ పుట్టినరోజు ఉత్సవం (మీలాదున్నబీ) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన దానిలో లేదు. కాబట్టి ఇది అల్లాహ్ మన కొరకు పూర్తి చేసిన ధర్మంలోని భాగం కాదు. కాబట్టి ప్రవక్తను అనుసరించమని మనల్ని అల్లాహ్ ఆజ్ఞాపించిన ఆ ధర్మంలో ఇది లేదు. ఇలా పుట్టినరోజు ఉత్సవం (మీలాదున్నబీ) అనేది ధర్మానికి సంబంధించినది కాదు అని నిర్ధారితమైనది.
మేము ఈ విషయం గురించి అంటే పుట్టినరోజు మీలాదున్నబీ ఉత్సవాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులలో అన్వేషించాము. అప్పుడు మేము అక్కడ ఏమి కనుగొన్నామంటే: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కార్యాన్ని తన జీవితంలో ఎన్నడూ చేయలేదు, దానిని చేయమని ఆదేశించనూ లేదు, అలాగే ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ కూడా దీనిని ఎన్నడూ చేయలేదు. దీనిని బట్టి మేము ఈ విషయం ధర్మానికి చెందినది కాదని తెలుసుకున్నాము. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన బిద్'ఆతు (నవోద్భవిత ఆచారం), మరియు యూదులు, క్రైస్తవులు తమ పండుగలలో చేసే అనుకరణలో భాగమై ఉంది.
ఈ వివరణల ద్వారా, సత్యాన్ని తెలుసుకోవాలనే స్వల్పమైన అవగాహన మరియు నిష్పక్షపాత ఆకాంక్ష కలిగిన ప్రతి ఒక్కరి కొరకు స్పష్టమవుతున్నది ఏమిటంటే మీలాదున్నబీ (ప్రవక్త జయంతి) వంటి వేడుకలు ఇస్లాం ధర్మంలో భాగం కావు. ఇవి నూతనంగా సృష్టించబడిన బిద్అత్ (నిషిద్ధ ఆచారాలు) మాత్రమే, వీటిని వదిలేయమని అల్లాహ్ సుబ్హానహు వ తాఆలా మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చాలామంది చేస్తుండటం చూసి వివేకవంతులు మోసపోకూడదు. ఎందుకంటే సత్యం అనేది చేసేవారి సంఖ్య ద్వారా గుర్తించకూడదు, దానిని షరియతు ప్రమాణాల ద్వారా గుర్తించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాఆలా యూదులు మరియు క్రైస్తవుల గురించి ఇలా అన్నాడు:
﴿وَقَالُواْ لَن يَدۡخُلَ ٱلۡجَنَّةَ إِلَّا مَن كَانَ هُودًا أَوۡ نَصَٰرَىٰۗ تِلۡكَ أَمَانِيُّهُمۡۗ قُلۡ هَاتُواْ بُرۡهَٰنَكُمۡ إِن كُنتُمۡ صَٰدِقِينَ111﴾
మరియు వారు: "యూదుడు లేదా క్రైస్తవుడు తప్ప, మరెవ్వడూ స్వర్గంలో ప్రవేశించలేడు!" అని అంటారు. ఇవి వారి అభిలాషలు మాత్రమే. వారిని ఇలా అడుగు: "మీరు సత్యవంతులే అయితే దానికి మీ నిదర్శనాలు చూపండి! [అల్-బఖరహ్: 111] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَإِنْ تُطِعْ أَكْثَرَ مَنْ فِي الْأَرْضِ يُضِلُّوكَ عَنْ سَبِيلِ اللَّهِ...﴾
మరియు భూమిలోని అధిక సంఖ్యాకులను నీవు అనుసరిస్తే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తారు...
[అల్-అన్'ఆమ్: 116]
అలాగే ఈ పుట్టిన రోజు ఉత్సవాలు బిద్అత్ (కొత్త పోకడ) మాత్రమే కాకుండా, ఇతర చెడులను కూడా కలిగి ఉంటాయి; ఉదాహరణకు: స్త్రీ, పురుషుల మిశ్రమ సమావేశాలు, పాటలు మరియు వాయిద్యాలు వినిపించడం, మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలు సేవించడం వంటి ఇతర చెడులు, దీనిలో మరింత ఘోరమైనది కూడా చోటు చేసుకోవచ్చు, అది పెద్ద షిర్క్, అంటే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ లేదా ఇతర వలీల వంటి వారి పట్ల అతిశయోక్తి చేయడం, వారిని వేడుకోవడం, వారిని ఆశ్రయించడం, వారిని సాయం కోరడం, వారు గూఢార్థాలను తెలుసుకుంటారని నమ్మడం, మరియు ఇలాంటి ఇతర కుఫ్ర్ పనులు, ఇవి చాలా మంది తమ ప్రవక్త మౌలిద్ వేడుకలలో మరియు ఇతర వలీలను పూజించే సందర్భాలలో చేస్తారు. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఇలా పలికారని ధృవీకరించబడింది:
«إِيَّاكُم وَالغُلُوُّ فِي الدِّينِ، فَإِنَّمَا أَهْلَكَ مَن كَانَ قَبْلَكُم الغُلُوَّ فِي الدِّينِ».
మీరు ధర్మము విషయములో మితిమీరీ (అతిశయిల్లి ) ప్రవర్తించడం మానుకోండి. ఇంతకు మునుపు జాతుల వారు ధర్మము విషయములో హద్దు మీరి ప్రవర్తించడం వలన సర్వనాశనం చేయబడ్డారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«لَا تُطْرُونِي كَمَا أَطْرَتِ النَّصَارَى ابْنَ مَرْيَمَ، إِنَّمَا أَنَا عَبْدٌ، فَقُولُوا: عَبْدُ اللهِ وَرَسُولُه».
క్రైస్తవులు మర్యమ్ కుమారుడైన ఈసా అలైహిస్సలాంను ప్రశంసించడంలో మితిమీరినట్లుగా, మీరు నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఒక దాసుణ్ణి మాత్రమే. కనుక నన్ను ‘అల్లాహ్ దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని అనండి. దీనిని బుఖారీ రహిమహుల్లాహ్ తన సహీహ్ లో ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖన ఆధారంగా నమోదు చేసినారు.
విచిత్రమైన విషయం ఏమిటంటే చాలామంది జనులు ఈ బిద్అతుల ఉత్సవాలలో చురుకుగా పాల్గొంటారు, వాటిని సమర్థిస్తారు, కానీ అల్లాహ్ విధించిన జుమా మరియు ఐదు పూటల సామూహిక జమఆతు నమాజులకు హాజరు కావడంలో విఫలమవుతారు. దీనిని పెద్ద తప్పుగా భావించరు. ఇది నిస్సందేహంగా ఈమాన్ బలహీనత, అవగాహన కొరవడటం, పాపాలు మరియు దోషాల వల్ల హృదయాలపై ఏర్పడిన మాలిన్యం కారణంగా జరుగుతుంది. అల్లాహ్ మాకు మరియు మిగతా ముస్లింలకు క్షేమం, శుభం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము.
కొంతమంది తమ మీలాదున్నబీ ఉత్సవాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హాజరవుతారని భావిస్తారు. అందుకే వారు ఆయనకు నిలబడి స్వాగతం పలుకుతారు. ఇది అత్యంత తప్పుడు ఆచరణ మరియు అజ్ఞానానికి పరాకాష్ట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాధి నుండి ప్రళయదినం వరకు బయటకు రారు. ఆయన ఎవరితోనూ సంబంధం కలిగి ఉండరు, వారి సమావేశాలకు హాజరుకారు. ఆయన తన సమాధిలోనే ఉంటారు. ఆయన ఆత్మ పరమపదంలో తన ప్రభువు వద్ద సత్కార గృహంలో ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿ثُمَّ إِنَّكُمْ بَعْدَ ذَلِكَ لَمَيِّتُونَ15 ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ16﴾
ఆ తరువాత మీరు నిశ్చయంగా, మరణిస్తారు.
అటు పిమ్మట నిశ్చయంగా, మీరు పునరుత్థాన దినమున మరల లేపబడతారు. [అల్-మోమినూన్: 15-16]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
«أَنَا أَوَّلُ مَنْ يَنْشَقُّ عَنْهُ القَبْرُ يَومَ القِيَامَةِ، وَأَنَا أَوَّلُ شَافِعٍ، وَأَوًّلُ مُشَفَّعٍ».
ప్రళయదినమున మొదట నా కొరకు సమాధి బ్రద్దలవుతుంది, నేను మొట్ట మొదట సిఫారసు చేస్తాను, మొట్టమొదట నా సిఫారసు స్వీకరించబడుతుంది. ఆయనపై ఆయన ప్రభువు నుండి మహోన్నత శుభాలు, శాంతి కలుగు గాక.
ఈ రెండు పవిత్రమైన ఆయతులు, మరియు హదీథు, మరియు వాటి భావంలో ఉన్న ఇతర ఆయతులు మరియు హదీథులు: ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇతర మృతులు, నిజానికి, ప్రళయం రోజున వారి సమాధుల నుండి బయటకు వస్తారని సూచిస్తున్నాయి. ఇది ముస్లిం పండితుల మధ్య ఏకాభిప్రాయం కలిగిన విషయం; ఇందులో వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ప్రతి ముస్లిం ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు అజ్ఞానులు మరియు వారి వంటి వారు ప్రవేశపెట్టిన బిదఆతు మరియు మూఢనమ్మకాల నుండి జాగ్రత్తగా ఉండాలి; వీటికి అల్లాహ్ నుండి ఎలాంటి ఆధారం లేదు. అల్లాహ్ సహాయం చేసేవాడు, ఆయనపైనే ఆధారపడాలి మరియు ఆయన సహాయం లేకుండా మనకు ఏ శక్తీ లేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ మరియు శాంతి పంపడం: ఇది సర్వోత్తమ ఆరాధనలలో ఒకటి మరియు సత్కార్యాలలో ఒకటి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِيِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ صَلُّواْ عَلَيۡهِ وَسَلِّمُواْ تَسۡلِيمًا56﴾
నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి. [అల్-అహ్'జాబ్: 56] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
«مَنْ صَلَّى عَلَيَّ وَاحِدَةً؛ صَلَّى اللهُ عَلَيهِ بِهَا عَشْرًا».
ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పంపిస్తారో అల్లాహ్ అతనిపై దాని ద్వారా పదిసార్లు శుభాలు పంపిస్తాడు. ఈ దరూద్ (ప్రార్థన) పఠనం అన్ని సమయాల్లోనూ అనుమతించబడింది, మరియు ప్రతి నమాజ్ తర్వాత పఠించడం సున్నతు (ప్రవక్త ఆచారం). మరికొంతమంది ఇస్లామీయ పండితుల అభిప్రాయం ప్రకారం, ప్రతి నమాజ్ లోని చివరి తషహ్హుద్ సమయంలో ఇది వాజిబ్ (తప్పనిసరి కర్తవ్యం)గా పరిగణించబడింది. దరూద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చదవడం అనేది అనేక ప్రత్యేక సందర్భాల్లో బలంగా సిఫార్సు చేయబడింది. ఇందులో ప్రధానమైనవి: అజాన్ తర్వాత, ప్రవక్త (స.) పేరు విన్నప్పుడు, జుమా (శుక్రవారం) రోజు మరియు రాత్రి, దీన్ని అనేక సహీహ్ హదీథులు స్పష్టంగా వివరిస్తున్నాయి.
అల్లాహ్ మాకు మరియు మిగతా ముస్లింలకు ఆయన ధర్మం గురించిన అవగాహన కలిగించమని, దానిపై నిలకడను ప్రసాదించమని మరియు అందరికి సున్నతును పాటించడంలో దయ చూపమని, బిద్అత్ నుండి జాగ్రత్తగా ఉండమని ప్రార్థిస్తున్నాము. నిశ్చయంగా ఆయన అమితంగా దాతృత్వం గలవాడు మరియు ఔదార్యుడు.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
ఆరవ సందేశము:
ఇస్రా - మేరాజ్ రాత్రిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుపుకోవటం గురించిన ఆదేశము
స్థుతులన్ని అల్లాహ్ కే శోభిస్తాయి, అంతిమ దైవ ప్రవక్తపై, ఆయన కుటుంబముపై, ఆయన అనుచరులపై శుభాలు, శాంతి, కరుణ కురియుగాక.
అమ్మా బఅదు: ఖచ్చితంగా, ఇస్రా (రాత్రి ప్రయాణం) మరియు మిరాజ్ (ఆకాశయానం) అనేవి అల్లాహ్ యొక్క గొప్ప నిదర్శనాలలోని నిదర్శనాలు మరియు ఇవి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సత్యతను మరియు అల్లాహ్ సన్నిధిలో ఆయన గొప్ప స్థానాన్ని తెలియజేస్తున్నాయి, అలాగే ఇవి అల్లాహ్ యొక్క అద్భుతమైన శక్తికి మరియు సర్వ సృష్టిపై ఆయన ఆధిపత్యానికి సాక్ష్యాలుగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿سُبۡحَٰنَ ٱلَّذِيٓ أَسۡرَىٰ بِعَبۡدِهِۦ لَيۡلٗا مِّنَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ إِلَى ٱلۡمَسۡجِدِ ٱلۡأَقۡصَا ٱلَّذِي بَٰرَكۡنَا حَوۡلَهُۥ لِنُرِيَهُۥ مِنۡ ءَايَٰتِنَآۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ1﴾
తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము. నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
[అల్ ఇస్రా:1]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనేక ముతవాతిర్ హదీథులలో ఇలా తెలుపబడింది - ఆయన ఆకాశములకు ఎత్తుకెళ్లబడ్డారు, మరియు ఆయన కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి, ఆయన ఏడవ ఆకాశాన్ని దాటి వెళ్లారు, అప్పుడు పరమ పవిత్రుడైన ఆయన ప్రభువు ఆయనతో తాను కోరిన దానిని మాట్లాడినారు, మరియు ఆయనపై ఐదు పూటల నమాజులు విధిగా చేశారు, మొదట పరమ పవిత్రుడు, మహోన్నతుడై అల్లాహ్ యాభై పూటల నమాజులు విధిగా చేశారు, కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను మరలా మరలా వాటిని తగ్గించమని కోరారు, చివరికి ఆయన వాటిని ఐదుకు తగ్గించారు. కానీ విధిగావించబడింది ఐదు నమాజులే అయినా ప్రతిఫలంలో అవి యాభైగా లెక్కించబడతాయి, ఎందుకంటే ఒక మంచి పని పది రెట్లు ప్రతిఫలిస్తుంది, అల్లాహ్ యొక్క అన్ని అనుగ్రహాలకు బదులుగా ఆయనకు ఎన్నో స్తుతులు మరియు కృతజ్ఞతలు.
ఇస్రా మరియు మేరాజ్ అద్భుతం జరిగిన ఆ రాత్రి రజబ్ లేదా ఫలానా నెలలో జరిగినది అనే నిర్ధారణకు సంబంధించి సహీహ్ హదీథుల్లో ఏ ఆధారమూ లేదు. దాని నిర్ధారణకు సంబంధించి వచ్చిన ప్రతిదీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపించబడలేదు అని హదీథు పండితులు పేర్కొన్నారు. అల్లాహ్ తన పరిపూర్ణ జ్ఞానంతో దానిని ప్రజలు మరచిపోయేలా చేశాడు. అయితే అది వాస్తవంగా జరిగిందనే నిర్ధారణ ఉన్నప్పటికీ, ముస్లింలు ఆ రాత్రిని ప్రత్యేక ఆరాధనలతో జరుపుకోవడం అనుమతించబడలేదు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ ఎన్నడూ దానిని అలా ప్రత్యేకంగా జరుపుకోలేదు. షబె మేరాజ్ అనే ఈ రాత్రి ఉత్సవం జరుపుకోవటం గురించి షరియతు ఆదేశం ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని గురించి తమ ఉమ్మతుకు తెలిపి ఉండే వారు - మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ. ఆనాడు ఒకవేళ అలాంటిదేదైనా జరిగి ఉంటే అది ప్రసిద్ధి చెందేది, మరియు సహాబాలు రదియల్లాహు అన్హుమ్ దానిని మనకు అందించేవారు. ఎందుకంటే వారు తమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉమ్మతుకు అవసరమైన ప్రతిదీ అందించారు, మరియు ధర్మంలో ఏ విషయంలోనూ అలసత్వం ప్రదర్శించలేదు. వారు ప్రతి మంచి విషయంలో ముందడుగు వేసేవారు. ఈ రాత్రి ఉత్సవం షరియతు ఆదేశించి ఉంటే, ముందుగా వారే దానికి చేసేవారు కదా! మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవుల కొరకు అత్యుత్తమమైన హితోపదేశకుడు. అల్లాహ్ సందేశాన్ని ఆయన అత్యంత చిత్తశుద్ధితో, పూర్తిగా మరియు నిజాయితీగా ప్రజలకు అందజేశారు. ఒకవేళ ఈ రాత్రిని గౌరవించడం మరియు ఘనంగా జరుపుకోవడం దైవధర్మంలో భాగమై ఉంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఖచ్చితంగా నిర్వహించేవారు మరియు దాచిపెట్టేవారు కాదు, దాని పట్ల నిర్లక్ష్యం చూపేవారు కాదు, దానిని విస్మరించేవారూ కాదు. కానీ వారి కాలంలో అలాంటిదేమీ జరగక పోవడం వలన, దీనిని ఘనంగా జరుపుకోవడం లేదా గౌరవించడం ఇస్లాం ధర్మంలో భాగం కాదని స్పష్టమవుతుంది. అల్లాహ్ ఈ ఉమ్మతు కొరకు తన ధర్మాన్ని సంపూర్ణం చేశాడు, తన అనుగ్రహాన్ని పూర్తి చేశాడు. అల్లాహ్ అనుమతించని విషయాలను ధర్మంలో ప్రవేశపెట్టేవారిని తీవ్రంగా ఖండించాడు. సుబ్హానహు వ తాలా తన సుస్పష్టమైన గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:
﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا...﴾
ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. [అల్ మాయిదా: 3] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿أَمۡ لَهُمۡ شُرَكَٰٓؤُاْ شَرَعُواْ لَهُم مِّنَ ٱلدِّينِ مَا لَمۡ يَأۡذَنۢ بِهِ ٱللَّهُۚ وَلَوۡلَا كَلِمَةُ ٱلۡفَصۡلِ لَقُضِيَ بَيۡنَهُمۡۗ وَإِنَّ ٱلظَّٰلِمِينَ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ21﴾
ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? ఒకవేళ తీర్పుదినపు వాగ్దానం ముందే చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి వుండేదే. మరియు నిశ్చయంగా, ఈ దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష పడుతుంది. [అష్'షూరా: 21]
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి సహీహ్ హదీథులలో బిద్అతుల గురించి తీవ్రమైన హెచ్చరిక, అవి మార్గభ్రష్టత్వమే అనే స్పష్టీకరణ నిరూపితమై ఉన్నది; దీని ద్వారా ఉమ్మతుకు వాటి ప్రమాదం ఎంత పెద్దదో తెలియజేయబడింది, వాటిని ఆచరించకుండా వారించడం జరిగింది. దీనిలో భాగంగా సహీహైన్ లో హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని నమోదు చేయబడింది:
«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ؛ فَهُوَ رَدٌّ».
“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనలో ఉన్నది.
«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيهِ أَمْرَنَا؛ فَهُوَ رَدٌّ».
«ఎవరైనా నా ఆదేశం లేని ఏదైన ఆచరణ (ధర్మం అనుకుని) చేస్తే అది తిరస్కరించబడుతుంది». సహీహ్ ముస్లింలో జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా ప్రసంగంలో ఇలా సెలవిచ్చారు:
«أَمَا بَعْدَ، فَإِنَّ خَيرَ الحَدِيثِ كِتَابُ اللهِ، وَخَيرَ الهَدْيِ هَدْيُ مُحَمَّدٍ ﷺ، وَشَرَّ الأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ».
అమ్మా బాద్, నిశ్చయంగా అన్నింటి కంటే మంచి మాట అల్లాహ్ గ్రంథము, మంచి మార్గదర్శకత్వము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వము, వ్యవహారాలన్నింటిలో అతి చెడ్డవి కొత్తపోకడలు, ప్రతి కొత్తపోకడ మార్గభ్రష్టత అవుతుంది. నసాయి జయ్యిద్ సనదుతో అధికం చేశారు:
«وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ».
ప్రతి మార్గభ్రష్టత నరకానికి దారి తీస్తుంది. సునన్ గ్రంథాలలో ఇరబాద్ బిన్ సారియా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనస్సులను కదిలించే ఎంతో ప్రభావశీలమైన ఒక ఉపదేశం మాకు చేశారు. దానితో మా హృదయాలు భయంతో కంపించాయి, మా కళ్ళ వెంట కన్నీటి ధారలు ప్రవహించాయి. అప్పుడు మేము "ఓ రసూలుల్లాహ్! ఇది మీ వీడ్కోలు ఉపదేశం వలే ఉన్నది. కనుక మీరు మాకు ఏమైనా వసీయతు (ఉపదేశం) చేయండి" అని కోరాము. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఇలా ఉపదేశించినారు:
«أُوصِيكُم بِتَقْوَى اللهِ وَالسَّمعِ وَالطَّاعَةِ وَإِنْ تَأَمَّرَ عَلَيْكُم عَبْدٌ، فَإِنَّهُ مَنْ يَعِشْ مِنْكُم فَسَيَرَى اخْتِلَافًا كَثِيرًا، فَعَلَيكُم بِسُنَّتِي وَسُنَّةِ الخلُفَاءِ الرَّاشِدِينَ المَهْدِيِّينَ مِنْ بَعْدِي، تَمَسَّكُوا بِهَا وَعَضُّوا عَلَيْهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُم وَمُحْدَثَاتِ الأُمُورِ، فَإِنَّ كُلَّ مُحْدَثَةٍ بِدْعَةٍ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ».
అల్లాహ్ పట్ల భయభక్తులు (తఖ్వా) కలిగి ఉండమని, ఒకవేళ మీపై ఒక బానిస అధికారిగా నియమించబడినా కూడా అతని ఆజ్ఞలు విని, అతడికి వినయవిధేయతలు చూపమని నేను మీకు హితబోధ చేస్తున్నాను. నిజానికి, మీలో ఎవరైతే (నా తర్వాత) జీవించి ఉంటారో, వారు చాలా విభేదాలు చూస్తారు. కనుక మీరు నా విధానాన్ని (సున్నతులను) మరియు నా తర్వాత సన్మార్గగాములైన మార్గదర్శక ఖలీఫాల విధానాన్ని ఖచ్చితంగా అనుసరించండి. దానిని గట్టిగా పట్టుకుని ఉండండి, దానిని మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి కొత్త పోకడ ఒక బిద్అత్, మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత. ఇలాంటి హదీథులు చాలా ఉన్నాయి.
ఇంకా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు మరియు వారి తరువాత తరాలకు చెందిన సలఫ్ సాలిహీన్ (ధర్మనిష్ఠాపరులు) బిద్‘అహ్ (ఆవిష్కృత ఆచారాల) గురించి హెచ్చరించేవారు మరియు వాటి గురించి (ప్రజలను) తీవ్రంగా భయపెట్టేవారు; ఎందుకంటే బిద్‘అహ్ అనేది ఇస్లాం ధర్మంలో అనధికారితంగా చేర్చబడే ఒక కొత్త వ్యవస్థ, అల్లాహ్ అనుమతించని విధానం, ఇది (మార్గభ్రష్టులైన) యూదులు మరియు క్రైస్తవుల వంటి అల్లాహ్ శత్రువులు వారి ధర్మంలో అదనపు విషయాలు మరియు అల్లాహ్ అనుమతించని విధానాలను ప్రవేశపెట్టడాన్ని పోలి ఉంటుంది, ఇంకా ఇది ఇస్లామీయ ధర్మం అసంపూర్ణమైనది అనే భావాన్ని మరియు దాని పరిపూర్ణతపై సందేహాన్ని కలిగిస్తుంది. ఇందులో ఉన్న ఘోరమైన అవినీతి మరియు అనర్థం, భయంకరమైన దోషము, మరియు మహోన్నతుడైన అల్లాహ్ వాక్కుకు విరుద్ధంగా ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసినదే.
﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ...﴾
ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసాను... [అల్ మాయిదా: 3] మరియు ఇది చాలా స్పష్టంగా బిద్అతుల నుండి దూరంగా ఉండమని హెచ్చరించే మరియు వాటిని తిరస్కరించమని ఆదేశించే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథులకు విరుద్ధంగా ఉంటుంది.
ఇంతటితో, మేము పేర్కొన్నఆదారాలలో హక్కును కోరుకునే వారికి సరిపడినంత స్పష్టత మరియు నమ్మకం ఉంటుందని ఆశిస్తున్నాము — నా ఉద్దేశం: ఇస్రా మరియు మీరాజ్ రాత్రి ఉత్సవాన్ని జరపడం అనే కొత్తచోదనాపూర్వక ఆచారాన్ని ఖండిచాలి, మరియు దానిని నిషేధించాలి. ఇది ఇస్లాం ధర్మానికి చెందిందే కాదు.
ముస్లింలు పరస్పరం హితోపదేశం చేయమనే, అల్లాహ్ విధించిన ధార్మిక విధులను వివరించమనే మరియు జ్ఞానాన్ని దాచిపెట్టకూడదనే అల్లాహ్ ఆదేశం కారణంగా, నేను నా ముస్లిం సోదరులను ఈ బిద్అత్ (కొత్త ఆచారం) గురించి హెచ్చరించాలని భావించాను. ఈ ఆచారం అనేక ప్రాంతాలలో విస్తరించింది, కొంతమంది ప్రజలు (అజ్ఞానం కారణంగా) దీనిని ఇస్లాం ధర్మంలో ఒక భాగమని భ్రమిస్తున్నారు.
ముస్లిములందరి పరిస్థితులను సంస్కరించమని, వారికి సరైన ధర్మావగాహన ప్రసాదించమని మరియు సత్యమును మాత్రమే గట్టిగా పట్టుకుని దానిపైనే స్థిరంగా ఉండటంలో మరియు దానికి విరుద్ధమైన వాటిని విడిచి పెట్టడంలో మాకూ, వారికీ తోడ్పడాలని మేము అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము. నిశ్చయంగా, ఆయనే దానికి యజమాని మరియు సామర్థ్యం కలవాడు.
అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త అయిన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని, ఆశీర్వాదాలను కురిపించుగాక!
***
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
ఏడవ సందేశము:
షాబాన్ నెల 15వ రాత్రిని ఉత్సవంగా జరుపుకోవడంపై ధార్మిక ఆదేశము
స్తుతులన్ని ఎవరు మన కొరకు ధర్మాన్ని సంపూర్ణం చేసారో, మనపై కృపను పూర్తిచేసారో ఆ అల్లాహ్ కొరకే శోభిస్తాయి. మరియు తపస్సు మరియు కరుణ యొక్క ప్రవక్త అయిన ఆయన ప్రవక్త మరియు దూత ముహమ్మద్ పై శుభాలు, శాంతి కురియుగాక.
సకల ప్రశంసలు ఎవరు మన కొరకు (ఇస్లాం) ధర్మాన్ని పూర్తి చేశారో మరియు మనపై తన అనుగ్రహాన్ని పూర్తి చేశారో ఆ అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఆయన ప్రవక్త మరియు సందేశహరుడు అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎవరు మన తప్పుల్ని మన్నిస్తారో మరియు ఎవరు మనపై దయ చూపుతారో ఆ అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి కురుయుగాక!
అమ్మా బాద్ : మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا...﴾
ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. [అల్ మాయిదా: 3] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿أَمۡ لَهُمۡ شُرَكَٰٓؤُاْ شَرَعُواْ لَهُم مِّنَ ٱلدِّينِ مَا لَمۡ يَأۡذَنۢ بِهِ ٱللَّهُ...﴾
ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? [అష్'షూరా: 21] సహీహైనులలో ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ؛ فَهُوَ رَدٌّ».
“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”. సహీహ్ ముస్లింలో జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: జుమఅహ్ ఖుత్బాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చేవారు:
«أَمَّا بَعْدُ: فَإِنَّ خَيرَ الحَدِيثِ كِتَابُ اللهِ، وَخَيرَ الهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمَ، وَشَرَّ الأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ».
అమ్మా బాద్, నిశ్చయంగా అన్నింటి కంటే మంచి మాట అల్లాహ్ గ్రంధము, మంచి మార్గదర్శకత్వము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వము, అన్ని వ్యవహారాలలో చెడ్డవి కొత్త ఆచారాలు, ప్రతి కొత్త ఆచారం మార్గభ్రష్టత అవుతుంది. ఇటువంటి అనేక ఆయతులు మరియు హదీథులు ఉన్నాయి - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ సమాజం కొరకు వారి ధర్మాన్ని (ఇస్లాం ధర్మాన్ని) పరిపూర్ణం చేశాడని మరియు వారిపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం చేశాడని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన స్పష్టమైన సందేశాన్ని పూర్తిగా అందజేసిన తరువాతనే ఆయన జీవితాన్ని ముగింపజేశాడని, అల్లాహ్ ఈ సమాజం కొరకు నియమించిన మొత్తం బోధనలు మరియు ఆచరణలను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వివరించారని అవి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా తెలియజేశారు - "తన తరువాత ప్రజలు ఇస్లాం ధర్మానికి చెందినదిగా పేర్కొంటూ ప్రవేశపెట్టే ప్రతీ కొత్త మాట లేదా ఆచరణ బిద్’అత్ గా పరిగణించబడుతుంది మరియు దానిని ప్రవేశపెట్టిన వారి వైపు త్రిప్పి కొట్టబడుతుంది, వారి ఉద్దేశ్యం మంచిదైనా సరే." ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు బాగా అర్థం చేసుకున్నారు, అలాగే వారి తరువాత ఇస్లాం పండితులు కూడా. వారు బిద్’అతులను తిరస్కరించి, వాటి నుండి హెచ్చరించారు. సున్నత్ యొక్క గొప్పతనాన్ని మరియు బిద్’అతుల నిరాకరణను వివరించిన ఇబ్నె వదాహ్, తర్తూషీ, అబూ షామా మొదలైన వారి ప్రతీ రచనలో ఈ విషయం స్పష్టంగా ప్రస్తావించబడింది.
అలా కొంతమంది ప్రజలు ప్రవేశపెట్టిన బిద్అతులలో ఒకటి: షాబాన్ నెల 15వ రాత్రి ఉత్సవం జరుపుకోవటం మరియు ఆ రోజు ఉపవాసం పాటించటం. దీని గురించి ధృవీకరించే ఎలాంటి ప్రామాణిక ఆధారమూ లేదు. దీని ప్రాధాన్యత గురించి కొన్ని బలహీనమైన హదీథులు ఉన్నాయి, కానీ అవి ప్రామాణికమైనవి కాకపోవడం వలన వాటిపై ఆధారపడటం అనుమతించబడలేదు.
వాటిలో ఆ రోజు చేయమనే ప్రత్యేక నమాజు యొక్క విశిష్టత గురించి పేర్కొనబడింది; అయితే అదంతా కల్పితం మాత్రమే, దీని గురించి చాలా మంది పండితులు హెచ్చరించారు. ఇన్ షా అల్లాహ్, వారి కొన్ని మాటలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాము.
వాటిలో షామ్ ప్రాంతానికి చెందిన కొంతమంది తొలి కాలపు సజ్జనులు (రహ్మతుల్లా అలైహిమ్) మరియు ఇతరుల నుండి వచ్చిన కొన్ని ప్రామాణిక ఆధారాలు ఉన్నాయి.
అధిక శాతం పండితుల ఏకగ్రీవంగా అంగీకరించిన విషయం ఏమిటంటే — ఈ రాత్రిని ఉత్సవంగా జరుపుకోవడం ఒక బిదత్ (కొత్తగా ప్రవేశపెట్టిన ఆచారం) అని, దాని ఘనత గురించి వచ్చిన హదీథులన్నీ బలహీనమైనవే అని, వాటిలో కొన్ని ఖచ్చితంగా కల్పితమైనవే అని. ఈ విషయంలో హాఫిజ్ ఇబ్ను రజబ్ తన లతాయిఫుల్ మఆరిఫ్ అనే పుస్తకంలో స్పష్టంగా ప్రస్తావించారు. బలహీనమైన హదీసులు వాటి మూలము సరైన ఆధారాలతో నిరూపించబడి ఉన్న ఆరాధనలలో మాత్రమే ఆచరించబడతాయని తెలుసు. షాబాన్ నెల 15వ రాత్రి ఉత్సవం జరుపుకోవటం గురించి చెప్పాలంటే, దీనికి సరైన ఆధారం ఏదీ లేదు. కేవలం బలహీనమైన హదీథులను ఆధారంగా తీసుకోవటం సరైనది కాదు. ఈ గొప్ప నియమాన్ని ఇమామ్ అబూ అబ్బాస్ షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ రహిమహుల్లాహ్ ప్రస్తావించారు.
ఓ పాఠకుడా! ఈ విషయంపై కొందరు జ్ఞానవంతులు చెప్పిన మాటలను నేను నీకు అందజేస్తున్నాను, తద్వారా నీవు ఈ విషయంలో స్పష్టత పొందగలవు.
పండితులందరి (రహిమహుల్లాహ్) ఏకగ్రీవ అభిప్రాయం - ప్రజల మధ్య వచ్చే వివాదాస్పదమైన విషయాలను అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్) మరియు రసూలుల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నతుల వెలుగులో పరిష్కరించుకోవాలి. దానికి సంబంధించిన ఆదేశము ఆ రెండింటిలో వచ్చినా, లేదా వాటిలో ఏదో ఒక్క దానిలో వచ్చినా, అదే అనుసరించదగిన షరియత్ (ఇస్లామీయ చట్టం) ఆదేశము. వాటికి విరుద్ధమైనది ఏది ఉన్నా దానిని వదిలేయ వలసినదే. వాటిలో (ఖుర్ఆన్ & సున్నతులో) లేని ఏదైనా ఇబాదత్ (ఆరాధనా విధానం) అయితే అది బిద్అత్ (నిషిద్ధమైన కొత్త ఆచారం) అవుతుంది - దాన్ని చేయడం మాత్రమే కాకుండా దాన్ని ప్రోత్సహించడం కూడా అనుమతించబడలేదు. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాఆలా ఇలా సెలవిచ్చాడు:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَ وَأُوْلِي ٱلۡأَمۡرِ مِنكُمۡۖ فَإِن تَنَٰزَعۡتُمۡ فِي شَيۡءٖ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ إِن كُنتُمۡ تُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ ذَٰلِكَ خَيۡرٞ وَأَحۡسَنُ تَأۡوِيلًا59﴾
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది. [నిసా: 59] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَا ٱخۡتَلَفۡتُمۡ فِيهِ مِن شَيۡءٖ فَحُكۡمُهُۥٓ إِلَى ٱللَّهِ...﴾
మరియు మీరు ఏ విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగి వున్నారో, దాని తీర్పు అల్లాహ్ వద్దనే ఉంది... [అష్'షూరా: 10] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُلۡ إِن كُنتُمۡ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِي يُحۡبِبۡكُمُ ٱللَّهُ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡ...﴾
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు... [ఆలి ఇమ్రాన్: 31] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿فَلَا وَرَبِّكَ لَا يُؤۡمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيۡنَهُمۡ ثُمَّ لَا يَجِدُواْ فِيٓ أَنفُسِهِمۡ حَرَجٗا مِّمَّا قَضَيۡتَ وَيُسَلِّمُواْ تَسۡلِيمٗا65﴾
అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు! [అన్'నిసా: 65] ఈ అర్ధంలో అనేక ఆయతులు ఉన్నాయి, మరియు అవి విభేదాల విషయాలను ఖుర్ఆన్ మరియు సున్నతుల వైపునకు మరలించడం తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొంటున్నాయి. వాటి తీర్పును మనసారా శిరసావహించడం తప్పనిసరి, మరియు అది విశ్వాసం యొక్క మౌలికాంశము, మరియు భవిష్యత్తులో మరియు ప్రస్తుతంలో ఉన్న బంధాల కొరకు మంచి విషయం, మరియు ఉత్తమమైన ఫలితాన్నే అంటే మంచి పరిణామాన్నే ఇస్తుంది:
హాఫిజ్ ఇబ్నె రజబ్ రహిమహుల్లాహ్ తన పుస్తకంలో (లతాఇఫుల్ మఆరిఫ్) ఈ విషయము గురించి - ముందుగా చెప్పిన మాటలతో పాటు - ఇలా పేర్కొన్నారు:
షాబాన్ నెల 15వ రాత్రి గురించి షామ్ ప్రాంతానికి చెందిన తాబియీన్; ఖాలిద్ బిన్ మఅదాన్, మఖూల్, లుక్మాన్ బిన్ ఆమిర్ మరియు ఇతరులు, దీనిని గొప్పగా భావించేవారు, ఆ రాత్రిలో ఆరాధనలో శ్రమించేవారు. వారి నుండి ప్రజలు దీని ఘనత మరియు ప్రాముఖ్యతను గ్రహించారు. మరియు ఇది కూడా చెప్పబడింది: వారి వద్దకు ఈ విషయం గురించి కొన్ని ఇస్రాయీలీ (యూదుల) కథనాలు చేరాయి. ఈ విషయం పలుదేశాలలో వ్యాపిస్తున్నప్పుడు, ప్రజలు దీనిపై స్పందించ సాగినారు. వారిలో కొందరు దాన్ని అంగీకరించారు మరియు ఆ రాత్రిని గౌరవించడంపై వారికి అనుకూలంగా ఉన్నారు - అలాంటి వారిలో బస్రా నగరానికి చెందిన కొంతమంది భక్తుల సమూహం మరియు ఇతరులు ఉన్నారు. మరియు హిజాజ్ ప్రాంతంలోని ఎక్కువ మంది పండితులు దీనిని తిరస్కరించారు. వీరిలో అతా, ఇబ్నె అబీ ములైకా కూడా ఉన్నారు. మరియు "ఇదంతా బిద్అత్" అనే అభిప్రాయాన్ని, అబ్దుర్రహ్మాన్ బిన్ జైద్ బిన్ అస్లమ్ మదీనా పండితుల నుండి పొందారు. ఇది ఇమామ్ మాలిక్ మరియు ఇతరుల శిష్యుల అభిప్రాయం కూడా.
షామ్ ప్రాంతంలోని పండితులు దాని పునరుద్ధరణ లక్షణాలపై రెండు అభిప్రాయాలు వ్యక్తం చేశారు:
మొదటిది: మస్జిదుల్లో సామూహికంగా ఈ రాత్రిని జరుపుకోవడం ముస్తహబ్. ఖాలిద్ బిన్ మదాన్, లుక్మాన్ బిన్ ఆమిర్ మరియు ఇతరులు ఈ రాత్రిలో తమ ఉత్తమ వస్త్రాలు ధరించి, సాంబ్రాణి ధూపం వేసుకుని, కజ్జలాన్ని పెట్టుకుని, ఆ రాత్రి మస్జిదులో గడిపేవారు. ఇస్హాఖ్ బిన్ రహ్వే కూడా దీనికి సమ్మతించారు. మస్జిదులలో జమాతుతో తరావీహ్ నమాజ్ ఆచరించడం బిద్అత్ కాదు అని హరబ్ అల్ కర్మాని తన ప్రశ్నలలో పేర్కొన్నారు.
రెండవది: మస్జిదులలో నమాజులు, గాథలు మరియు దుఆల కొరకు ప్రజలు జమ అవ్వడం మక్రూహ్ (అనుచితం) అని, అయితే ఒక వ్యక్తి తాను ఒంటరిగా చేసే సున్నతు నమాజులు కూడా మస్జిదులోనే చేయడం అనుచితం కాదు అని, ఇది అల్’అవ్జాఈ (రహిమహుల్లాహ్) షామ్ ప్రజల ఇమామ్ మరియు ధర్మ పండితుడు మరియు జ్ఞాని యొక్క అభిప్రాయం, మరియు ఈ అభిప్రాయాన్ని అల్లాహ్ తాలా ఇష్టపడితే, అది సత్యానికి దగ్గరగా ఉంటుంది. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ మాటలలో: 'షాబాన్ నెల 15వ రాత్రి గురించి ఇమాం అహ్మద్ నుండి ఏమీ పేర్కొనబడలేదు. అయితే, ఈ రాత్రి జాగారం చేయడం గురించి ఆయన నుండి రెండు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి - ఆ రెండు అభిప్రాయాలు - ఇవి పండుగ రాత్రుల జాగారం గురించి ఉన్న రెండు అభిప్రాయాల నుండి ఉద్భవించాయి. (ఒక అభిప్రాయంలో) ఆయన దీనిని సమూహంగా జాగారం చేయడం సిఫార్సు చేయలేదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల నుండి ఇది ధృవీకరించబడలేదు.' ఇది (ఒక రివాయత్ లో) అభిలాషణీయంగా పరిగణించబడింది, ఎందుకంటే అబ్దుర్ రహ్మాన్ బిన్ యజీద్ బిన్ అస్వద్ ఈ విధంగా చేశారు, మరియు ఆయన తాబయీన్ లో ఒకరు. అలాగే షాబాన్ నెల 15వ రాత్రి జాగారం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి లేదా ఆయన సహచరుల నుండి ఏ ఆధారం లేదు. కానీ షామ్ ప్రాంతంలోని ప్రముఖ ఫుఖహా తాబయీన్ నుండి ఇది నమోదు చేయబడింది.
హాఫిజ్ ఇబ్న్ రజబ్ రహిమహుల్లాహ్ మాటల ప్రస్తావన ఇక్కడ ముగిసింది, మరియు ఇందులో ఆయన స్పష్టంగా ఇలా పేర్కొన్నారు: షాబాన్ నెల 15వ రాత్రి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి లేదా ఆయన సహచరులు రదియల్లాహు అన్హుమ్ ల నుండి ఏ ప్రామాణిక ఆధారమూ లేదు.
ఇమాం ఔజాయీ రహిమహుల్లాహ్ ఎంచుకున్నది ఏమిటంటే వ్యక్తిగతంగా దానిలో ఖియామ్ చేయటం ముస్తహబ్ (అభిలాషణీయం) అన్న దాని నుంచి . హాఫిజ్ ఇబ్న్ రజబ్ ఈ అభిప్రాయమును ఎంచుకున్న విషయం విచిత్రమైనది మరియు బలహీనమైనది. ఎందుకంటే ఏదైనా విషయం శాసనసంబంధమైన ప్రామాణిక ఆధారాలతో నిర్ధారించబడకపోతే, దానిని అల్లాహ్ యొక్క ధర్మంలో ప్రవేశపెట్టడం ముస్లింలకు అనుమతించబడలేదు, అది వ్యక్తిగతంగా చేసినా లేదా సమూహంగా చేసినా, దానిని రహస్యంగా చేసినా లేదా బహిరంగంగా చేసినా; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాధారణ ఉపదేశం ప్రకారం:
«مَنْ عَمِلَ عَمَلًا لَيْسَ عَلَيهِ أَمْرُنَا؛ فَهُوَ رَدٌّ».
ఎవరైనా నా ఆదేశం లేని ఏదైన ఆచరణ (ధర్మం అనుకుని) చేస్తే అది తిరస్కరించబడును. ఇంకా బిద్అత్ ను తిరస్కరించవలసిందిగా సూచించే మరియు వాటి గురించి హెచ్చరించే అనేక ఆధారాలు ఉన్నాయి.
ఇమామ్ అబూ బకర్ తర్తూషీ రహిమహుల్లాహ్ తన పుస్తకం ‘అల్ హవాదిస్ వల్ బిద్అ’లో ఇలా ఉల్లేఖించినారు:
ఇబ్న్ వజాహ్ జైద్ బిన్ అస్లమ్ నుండి ఉల్లేఖిస్తూ చెప్పారు: మా పండితులలో మరియు ధర్మవేత్తలలో ఎవరినీ షాబాన్ నెల 15వ తేదీకి ప్రాధాన్యత ఇవ్వడం గాని, మకహూల్ హదీథుకు ప్రాముఖ్యత ఇవ్వడం గాని చూడలేదు, మరియు దానికి ఇతర తేదీలపై ప్రత్యేకతను కూడా ఇవ్వలేదు.
ఇబ్ను అబీ ములైకా తో ఇలా చెప్పబడింది: జియాద్ అన్ నమీరీ ఇలా అంటున్నారు: షాబాన్ నెల అర్థ రాత్రి యొక్క పుణ్యం, లైలతుల్ ఖదర్ యొక్క పుణ్యంతో సమానమైనది. అప్పుడు ఆయన ఇలా పలికారు: నేను దానిని విని ఉంటే (అంటే నా ఎదురుగా ఇది చెప్పబడితే), అపుడు ఒకవేళ నా చేతిలో ఒక కర్ర ఉంటే, నేను దానితో అతడిని కొట్టేవాడిని. జియాద్ ఒక ప్రబోధకుడు (కథకుడు)గా ఉన్నాడు, అవసరమైన విషయం ఇక్కడ ముగిసింది.
ప్రముఖ పండితుడు శౌకానీ రహిమహుల్లాహ్ తన పుస్తకం **"అల్-ఫవాయిదుల్ మజ్మూఅహ్"**లో ఇలా పేర్కొన్నారు:
హదీథు: «ఓ అలీ, ఎవరైతే షాబాన్ నెల అర్థ రాత్రి వంద రకాతులు నమాజు చేస్తారో, ప్రతి రకాతులో ఫాతిహతుల్ కితాబ్ మరియు కుల్ హువల్లాహు అహద్ పదిసార్లు పఠిస్తారో, అల్లాహ్ అతని ప్రతి అవసరాన్ని తీర్చుతాడు» తదితరులు. ఇది కల్పించబడిన హదీథు, దానిని ఆచరించే వారికి లభించే పుణ్యం గురించి స్పష్టంగా చెప్పబడిన పదాలు కల్పించబడినవని గుర్తించడంలో వివేకం ఉన్నవారు ఎవరైనా సందేహించరు, మరియు దాని ఉల్లేఖకులు అపరిచితులు, ఇది రెండవ మరియు మూడవ మార్గాల ద్వారా కూడా ఉల్లేఖించబడింది, ఇవన్నీ కల్పించబడినవి మరియు వాటి ఉల్లేఖకులు అపరిచితులు. ముఖ్తసర్ లో ఆయన ఇలా పేర్కొన్నారు : షాబాన్ నెల 15వ రాత్రి ప్రార్థన గురించి పేర్కొనబడిన హదీథు బాతిల్ (ప్రామాణికమైనది కాదు). హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ఇబ్న్ హిబ్బాన్ ఇలా పేర్కొన్నారు : షాబాన్ నెల 15వ రాత్రి జాగారం చేయండి, పగలును ఉపవాసం పాటించండి. జయీఫ్ (బలహీనమైన) హదీథు. ఆయన అల్'లాలీ లో ఇలా తెలిపారు: «షాబాన్ నెలలో వంద రకాతులు, (అందులో ప్రతి రకాతులో) ఇఖ్లాస్ తో పది సార్లు» దీని ఘనత చాలా ఎక్కువ, దైలమీ మరియు ఇతరులచే ఇది మౌదూ, మరియు మూడు మార్గాలలోని ఉల్లేఖకులు ఎక్కువగా తెలియని అపరిచితులు అని పేర్కొనబడింది. ఆయన తెలిపారు: «ముప్పది సార్లు ఇఖ్లాస్ తో పన్నెండు రకాతులు». ఇది కల్పితం, «పద్నాలుగు రకాతులు» కూడా కల్పితం.
ఈ హదీథు ద్వారా కొందరు ధర్మవేత్తలు మోసపోయారు; అల్ ఇహ్యా రచయిత వంటి వారు మరియు మరికొందరు తఫ్సీర్ రచయితలు కూడా. ఈ రాత్రి నమాజు - అంటే: షాబాన్ నెల మధ్య రాత్రి - వివిధ విధానాల్లో రివాయత్ చేయబడింది, ఇవన్నీ అసత్యమైనవి మరియు కల్పితమైనవి. ఇది హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా కథనం నుండి తిర్మిథీ ఉల్లేఖించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 'బఖీ' శ్మశానానికి వెళ్ళడం మరియు రాత్రి యొక్క మధ్యభాగంలో ప్రభువు భూలోక ఆకాశానికి దిగి వస్తాడు మరియు గొర్రెల (కాపలా) కుక్క జుట్టు కంటే ఎక్కువ మందిని క్షమిస్తాడు అనే విషయాన్ని వ్యతిరేకించదు, ఎందుకంటే ఈ ప్రత్యేక రాత్రిలోని ఈ నమాజు గురించి మాత్రమే మాట జరుగుతున్నది, ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ఈ హదీథులో బలహీనత మరియు విరామం ఉంది, అలాగే అలీ రదియల్లాహు అన్హు యొక్క రాత్రి నమాజు గురించి ఇంతకు ముందు చెప్పిన హదీథు కూడా ప్రామాణికంగా బలహీనమైనదే, అయినప్పటికీ ఈ నమాజు కల్పితమైనదని నిరూపించదు, మేము చెప్పినట్లుగా.
ఇరాఖీ హాఫిజ్ గారు ఈ విధంగా పేర్కొన్నారు: "రాత్రి మధ్యలో నమాజు గురించి ఉన్న హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై కల్పించబడినదే మరియు అది ఆయనపై అబద్ధం పలకడం వంటిది. ఇమామ్ నవవీ తన పుస్తకంలో: (అల్ మజ్మూఅ్) ఇలా అన్నారు: ‘సలాతుర్’రఘాయిబ్ అని పిలవబడే నమాజు, ఇది రజబ్ నెల మొదటి జుమా రాత్రి, మగ్రిబ్ మరియు ఇషా మధ్య పన్నెండు రకాతులు, మరియు షాబాన్ నెల మధ్య రాత్రి వంద రకాతులు, ఈ రెండు నమాజులు బిద్’అత్ మరియు ముంకర్. వాటిని (కూత్ అల్ కులూబ్) మరియు (ఇహ్యా ఉలూమ్ అల్ దీన్) పుస్తకాల్లో పేర్కొనబడటం చూసి మోసపోవద్దు, మరియు వాటిలో పేర్కొన్న హదీథుకు కూడా మోసపోవద్దు, ఎందుకంటే అది అంతా అసత్యం, మరియు కొందరు ఇమాములు వాటి ఆదేశం తెలుపుతూ తప్పుడు పత్రాలతో వాటి ప్రాముఖ్యత గురించి పుస్తకాలు రాశారు, అయితే వారు ఆ విషయంలో పొరబడినవారు.’
షేఖ్ ఇమామ్: అబూ ముహమ్మద్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఇస్మాయీల్ అల్-మక్దసీ ఈ విషయంపై ఒక విలువైన పుస్తకాన్ని రచించారు, అందులో ఆయన అద్భుతంగా మరియు సమర్థవంతంగా వ్రాశారు. ఈ విషయంపై హదీథు ఉలమాల మాటలు చాలా ఉన్నాయి. ఈ విషయంపై మేము తెలుసుకున్న ప్రతీ మాటను ఇక్కడ తెలియపరచాలంటే, మాటలు చాలా పొడవుగా సాగుతాయి. మేము చెప్పిన వాటిలో సత్యాన్ని కోరుకునే వారికి తగినంత మరియు సంతృప్తికరమైనది ఉండవచ్చు.
పై పేర్కొన్న ఆయతులు, హదీథులు మరియు ఉలమాల మాటల ద్వారా: సత్యాన్ని కోరుకునే వారి కొరకు షాబాన్ నెల 15వ రాత్రిని నమాజ్ లేదా ఇతర ఆరాధనలతో జరుపుకోవటం, దాని పగలును ఉపవాసం కొరకు ప్రత్యేకించుకోవటం అనేది ఎక్కువ మంది ఉలమాల దృష్టిలో ఓ నిందనీయమైన బిద్అత్. ఇది ఎలాంటి పవిత్ర షరీఅతు ఆధారము లేని విషయం, నిజానికి ఇది సహాబాల కాలం తరువాత ఇస్లాంలో ప్రవేశించిన కొత్త పోకడ. ఈ విషయంలో మరియు ఇతర విషయాలలో సత్యాన్ని కోరుకునే వారికి అల్లాహ్ జల జలాలుహు యొక్క ఈ ఒక్క మాట సరిపోతుంది:
﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ...﴾
ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసినాను... [అల్ మాయిదా: 3] ఈ అర్థంలో వచ్చిన అనేక ఆయతులు ఉన్నాయి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీథు:
«مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ».
“ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”. వాటి అర్ధంలో వచ్చిన మరికొన్ని హదీథులు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
«لَا تَخُصُّوا لَيْلَةَ الْجُمُعَةِ بِقِيَامٍ مِنْ بَيْنِ اللَّيَالِي، وَلَا تَخُصُّوا يَوْمَهَا بِالصِّيَامِ مِنْ بَيْنِ الْأَيَّامِ، إِلَّا أَنْ يَكُونَ فِي صَوْمٍ يَصُومُهُ أَحَدُكُمْ».
మీరు ఇతర రాత్రులకు భిన్నంగా జుమా నాటి రాత్రిని (నఫిల్) నమాజుల కోసం ప్రత్యేకించుకోకండి. అలాగే ఇతర పగళ్ళకు భిన్నంగా జుమానాటి పగలును ఉపవాసం కోసం ప్రత్యేకించుకోకండి. ఒకవేళ మీలో ఎవరికయినా తన ఆనవాయితీ ప్రకారం ఆ రోజు ఉపవాసం ఉండవలసి వస్తే అది వేరే విషయం. ఏదైనా రాత్రిని ప్రత్యేక ఆరాధనల కొరకు ప్రత్యేకించుట అనుమతించబడినట్లయితే, శుక్రవారం రాత్రి ఇతర రాత్రుల కంటే ప్రథమ స్థానములో ఉండేది; ఎందుకంటే దాని దినము సూర్యుడు ఉదయించే దినములలో ఉత్తమమైన దినము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీహ్ హదీథులలో స్పష్టముగా పేర్కొన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రులలో ఏదైనా ఒక రాత్రిని ప్రత్యేకించి జాగారం చేయవద్దని హెచ్చరించినప్పుడు, అది ఇతర రాత్రులకు కూడా వర్తిస్తుంది. ఏ రాత్రినైనా ఏదైనా ఆరాధన కొరకు ప్రత్యేకించుకోవటం అనేది సరైన ఆధారం లేకుండా అనుమతించబడదు.
ఘనమైన లైలతుల్ ఖద్ర్ రాత్రి మరియు రమదాను రాత్రులు నమాజు మరియు ఆరాధనలతో గడపడం శ్రేయస్కరం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై దృష్టి పెట్టారు మరియు ఉమ్మతును ఆ రాత్రులను గడపమని ప్రోత్సహించారు. ఆయన స్వయంగా కూడా అలా చేశారు. బుఖారీ మరియు ముస్లింలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు ఇలా నమోదు చేయబడింది:
«مَنْ قَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ، وَمَنْ قَامَ لَيْلَةَ الْقَدْرِ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ».
«ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ రమదాన్ నెలలో నమాజు ఆచరిస్తూ గడుపుతారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి. మరియు ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ రాత్రి నమాజులలో నిలబడతారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.» షాబాన్ నెల 15వ రాత్రి, లేదా రజబ్ నెల మొదటి శుక్రవారం రాత్రి, లేదా ఇస్రా - మేరాజ్ రాత్రి, ప్రత్యేకంగా ఉత్సవం లేదా ఏదైనా ఆరాధన కొరకు ప్రత్యేకించబడినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతుకు దానిని సూచించేవారు, లేదా తానే స్వయంగా చేసేవారు. అలాంటిదేదైనా జరిగి ఉంటే, సహాబాలు రదియల్లాహు అన్హుమ్ దానిని ఉమ్మతుకు తెలియజేసేవారు, దానిని దాచిపెట్టేవారు కాదు. వారు ప్రవక్తల తరువాత ఉత్తములు, మరియు అత్యంత నిష్కపటులు. అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాల రదియల్లాహు అన్హుమ్ పట్ల సంతృప్తి చెందినాడు.
మీరు ఇంతకు ముందు ఉలమాల మాటల నుండి తెలుసుకున్నట్లుగా, రజబ్ నెల మొదటి జుమా రాత్రి మరియు షాబాన్ నెల 15వ రాత్రి విశిష్టత గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి గానీ, ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ నుండి గానీ ఏ ఆధారమూ లేదు. కాబట్టి, ఈ రెండు రాత్రులను పురస్కరించుకుని ఉత్సవం జరుపుకోవటం ఇస్లాంలో ఓ కొత్త పోకడ. అలాగే, ఈ రాత్రులను ఏదైనా ప్రత్యేక ఆరాధన కొరకు ప్రత్యేకించుకోవటం కూడా ఓ అసహ్యకరమైన బిద్అతు. ఇదే విధంగా, రజబ్ మాసంలో 27వ రాత్రిని కొంతమంది ఇస్రా మరియు మీరాజ్ రాత్రిగా నమ్ముతూ ఉంటారు. అయితే, ఆ రాత్రిని ప్రత్యేక ఆరాధనలతో కేటాయించడం అనుమతించబడదు, అలాగే దానిని ఉత్సవంగా జరుపుకోవడం కూడానీ కాదు — మునుపు వచ్చిన దృఢమైన ఆధారాల ప్రకారం. ఇది ఆ రాత్రి ఖచ్చితంగా తెలుసు అనుకుంటే కూడా అనుమతించబడదు, మరి అది ఖచ్చితంగా తెలియదని ధార్మిక పండితులు స్పష్టంగా చెప్పిన దృష్టిలో చూస్తే పరిస్థితి ఎంత స్పష్టమైందో అర్థం చేసుకోవచ్చు. రజబ్ నెల 27వ రాత్రే లైలతుల్ ఖద్ర్ రాత్రి అని చెప్పేవారి మాట అసత్యం, దీనికి సహీహ్ హదీథుల నుండి ఎలాంటి ఆధారం లేదు. ఎవరు ఇలా క్రింద పేర్కొన్నట్లుగా చెప్పారో, వారు చాలా బాగా చెప్పారు:
మంచి విషయాలు మార్గదర్శకత్వంలో ముందుకు సాగేవి ... చెడ్డ విషయాలు ధర్మంలో కొత్తపోకడల బిద్అత్.
అల్లాహ్ మమ్మల్ని మరియు మిగతా ముస్లింలను సున్నతులను పట్టుకోవడంలో మరియు దానిపై స్థిరంగా ఉండడంలో సాఫల్యం చేకూర్చమని మరియు దానికి విరుద్ధమైన వాటి నుండి జాగ్రత్త పడే భాగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. నిశ్చయంగా ఆయన అమితంగా దాతృత్వం గలవాడు మరియు ఔదార్యుడు.
అల్లాహ్ తన దాసుడు మరియు తన ప్రవక్త అయిన మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక!
***
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
ఎనిమిదవ సందేశము:
తప్పుడు వీలునామా (వసీయత్) గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక
షేక్ అహ్మద్, ఖాదిమ్ అల్ హరమ్ అల్ నబవీ అష్ షరీఫ్
అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ సందేశం:
దీనిని చదివే ముస్లింలందరినీ, అల్లాహ్ ఇస్లాం ద్వారా రక్షించుగాక. అజ్ఞానుల మరియు హద్దు మీరిన వారి అబద్ధాల నుండి మమ్మల్ని మరియు మిమ్మల్ని కాపాడుగాక. ఆమీన్.
సలామున్ అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు (మీపై అల్లాహ్ శాంతి,కారుణ్యము,శుభాలు కురియుగాక).
అమ్మా బఅదు: నేను మదీనా మునవ్వరా నుండి షేఖ్ అహ్మద్ ఖాదిమ్ అల్-హరమ్ అన్-నబవీ అల్-షరీఫ్ వ్రాసిన ఈ సందేశాన్ని పరిశీలించాను, దాని శీర్షిక: «మదీనా మునవ్వరా షేఖ్ అహ్మద్, ఖాదిమ్ అల్-హరమ్ అన్-నబవీ అల్-షరీఫ్ నుండి ఒక సిఫార్సు», అందులో ఆయన ఇలా అన్నారు:
ఒక శుక్రవారం రాత్రి నేను మేల్కొని ఉండి పవిత్ర ఖుర్ఆన్ పఠించాను, ఆపై అల్లాహ్ యొక్క సుందర నామాలను పఠించాను. ఆ పఠనం ముగిసిన తర్వాత నిద్రకు సిద్ధమయ్యాను. అప్పుడు నేను విశ్వానికి కరుణామూర్తి, అల్లాహ్ యొక్క సృష్టిలో అత్యంత గౌరవనీయులైన మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలలో చూశాను. ఆయన నన్ను 'ఓ షేఖ్ అహ్మద్' అని పిలిచినారు: నేను సమాధానమిస్తూ: 'లబ్బైక్, యా రసూలుల్లాహ్! యా అక్రమ ఖలఖల్లాహ్ (అల్లాహ్ సృష్టిలో అత్యంత గౌరవనీయులారా!)' అని అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఇలా అన్నారు: ప్రజల చెడు పనుల వల్ల నేను సిగ్గుపడుతున్నాను, మరియు నా ప్రభువును లేదా దైవదూతలను ఎదుర్కోలేకపోతున్నాను; ఎందుకంటే ఒక శుక్రవారం నుండి మరొక శుక్రవారం వరకు నూట అరవై వేల మంది ఇస్లాం ధర్మం స్వీకరించకుండానే మరణించారు - ఆ పై ప్రజలు చేసిన పాపాలను కొంత వివరించారు, తరువాత ఆయన ఇలా అన్నారు: ఈ వసియతు ఉపదేశం, సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి అయిన అల్లాహ్ వైపు నుండి వారి కొరకు ఒక కారుణ్యము. తరువాత కొన్ని ప్రళయ సూచనలను ప్రస్తావించి, ఇంకా ఇలా అన్నారు: "ఓ షేఖ్ అహ్మద్, ఈ వీలునామాను వారికి తెలియజేయండి; ఇది లౌహే మహ్ఫూద్ నుండి విధి కలంతో రాయబడింది. దీన్ని వ్రాసి ఒక ఊరు నుండి మరొక ఊరికి, ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపిన వారికి స్వర్గంలో ఒక కోట నిర్మించబడుతుంది. దీన్ని వ్రాయని మరియు పంపని వారికి రేపు పరలోకదినాన నా సిఫారసు నిషిద్ధం. దాన్ని వ్రాసిన వాడు ఒకవేళ పేదవాడైతే, అల్లాహ్ అతనికి సంపదను ప్రసాదిస్తాడు, లేదా అతడు అప్పులలో ఉన్నవాడైతే, అల్లాహ్ అతని అప్పులను తీర్చుతాడు, లేదా అతను పాపం చేసి ఉంటే, ఈ సిఫారసు యొక్క పవిత్రతతో అల్లాహ్ అతనిని మరియు అతని తల్లిదండ్రులను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ యొక్క ఆరాధకులలో ఎవరు దానిని వ్రాయకపోతే, వారి ముఖం ఈ లోకంలో మరియు పరలోకంలో నలుపుగా మారుతుంది, ఇంకా ఇలా పలికెను: "వల్లాహిల్ అజీమ్ (మహోన్నతుడైన అల్లాహ్ సాక్షిగా మూడు సార్లు – ఇది నిజం. నేను అబద్ధం చెప్పుంటే, ఇస్లాం మతం లేకుండానే ఈ లోకాన్ని విడిచి పోవాలని అల్లాహ్తో ప్రమాణం. ఎవడు దీనిని నమ్మితే, నరకం శిక్ష నుండి రక్షించబడతాడు. ఎవడు దీనిని అంగీకరించకపోతే, అతను కాఫిర్ అవుతాడు."
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై కల్పించిన వీలునామా యొక్క సారాంశం. ఈ కల్పిత వీలునామాను మేము అనేక సంవత్సరాలుగా అనేక సార్లు విన్నాము. ఇది ప్రజల మధ్య కాలానుగుణంగా ప్రచారం చేయబడుతుంది, మరియు అనేక మంది సాధారణ ప్రజలలో బాగా వ్యాపించింది, దీనిలో ఉపయోగించిన పదాలు ఒక్కోసారి మారుతూ ఉంటాయి. ఈ అబద్ధపు వీలునామ (వసీయత్)ను కల్పించినవాడు ఇలా చెప్పాడు: అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను స్వప్నంలో చూశాడు, మరియు ఈ చివరి ప్రకటనలో, పాఠకుడా! అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నిద్రకు సిద్ధమవుతున్నప్పుడు చూశానని చెప్పాడు, దీని అర్థం: అతను ప్రవక్తను ప్రత్యేక్షంగా చూశాడు
ఈ అబద్ధాలను కల్పించిన వ్యక్తి ఈ వసియత్తులో (వీలునామాలో) అనేక విషయాలు చెప్పాడు - అవి స్పష్టమైన అబద్ధాలు మరియు తేటతెల్లని అసత్యాలు. అల్లాహ్ అనుమతిస్తే, నేను ఈ వ్యాసంలో వాటి గురించి త్వరలోనే మీకు హెచ్చరికలు చేస్తాను. గత కొన్ని సంవత్సరాలలోనే ఈ వసీయత్‌లోని అబద్ధాలపై నేను ప్రజలను అప్రమత్తం చేశాను మరియు ఇది పూర్తిగా అబద్ధమైనదని, అసత్యమైనదని వారికి వివరిస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ వసీయత్ యొక్క తాజా సంచిక నా దృష్టికి వచ్చినప్పుడు, దాని అబద్ధం ఎంత స్పష్టమో, దానిని తయారుచేసినవాడు ఎంత ధైర్యంగా అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడో చూసి, దానిపై మళ్లీ రాయాలా వద్దా అనే విషయంలో తడబడ్డాను. ఎందుకంటే దాని అబద్ధత స్పష్టంగా ఉండటంతోపాటు, ఎంతైనా కూడా కొంత సరళమైన బుద్ధి గలవారికి కూడా ఇది నమ్మదగినదిగా అనిపించదనుకున్నాను. అయితే, అది చాలా మంది ప్రజలలో వ్యాపించిందని, వారు దానిని తమలో తాము పంచుకుంటున్నారని, మరియు కొందరు దానిని విశ్వసించారని అనేక మిత్రులు నాకు తెలియజేశారు; ఈ కారణంగా, దాని అసత్యతను స్పష్టం చేయడానికి, మరియు అది ప్రవక్త ﷺ పై కల్పించబడిన అబద్ధమని తెలియజేయడానికి, తద్వారా ఎవరూ దాని ద్వారా మోసపోకుండా ఉండటానికి, నాలాంటి వారు దాని గురించి వ్రాయడం తప్పనిసరి అని నేను భావించాను. దానిని సరైన జ్ఞానం మరియు విశ్వాసం కలిగినవారు, లేదా సహజసిద్ధమైన స్వభావం మరియు సరిగ్గా ఆలోచించే బుద్ధి కలిగినవారు జాగ్రత్తగా పరిశీలిస్తే, అనేక కోణాల నుండి అది అబద్ధం మరియు కల్పితమని గ్రహిస్తారు.
మరియు నేను షేఖ్ అహ్మద్ సన్నిహితులలో కొందరిని ఈ వీలునామ గురించి అడిగాను, దానికి వారు నాకు ఇలా సమాధానమిచ్చారు: ఇది షేఖ్ అహ్మద్ పై అబద్దంగా రుద్దబడినది, నిజానికి ఆయన అసలు అలా చెప్పనే లేదు, మరియు పైన పేర్కొన్న షేఖ్ అహ్మద్ కొంతకాలం క్రితమే మరణించారు. ఒకవేళ పైన పేర్కొన్న షేఖ్ అహ్మద్ లేదా అతని కంటే పెద్దవాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను స్వప్నంలో లేదా ప్రత్యేక్షంగా చూశానని, మరియు ఈ సిఫారసును ఇచ్చారని నిజంగా చెప్పి ఉంటే, దానిని మేము ఖచ్చితంగా ఇలా అర్థం చేసుకుంటాము "అతను అబద్ధం చెబుతున్నాడు, లేదా అతనికి చెప్పినది షైతాను, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాదు అనడానికి అనేక కారణాలు ఉన్నాయి." వాటిలో కొన్ని:
మొదటిది: అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాంతరం ఆయనను యధార్థంగా జాగృతంలో చూడలేరు. ఎవడయితే జ్ఞానరహితమైన కొంతమంది తత్వశాస్త్రులు (సూఫీలు) తమకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జాగృతంలో కనిపించారని, లేదా మౌలిద్ (పుట్టిన రోజు సభ) కు హాజరై ఉంటారని చెబుతారో, వారు బహు పెద్ద పొరపాటు చేశారు. వారు సత్యాన్ని అస్పష్టంగా చేసి, తీవ్రమైన తప్పులో పడ్డారు. ఇది ఖుర్ఆన్, సున్నత్, అలాగే అహ్లె ఇల్మ్ ఏకాభిప్రాయానికి విరుద్ధమైన విషయమూ కావున, ఇది అంగీకారయోగ్యం కాదు. ఎందుకంటే మృతులు తమ సమాదుల నుండి ప్రళయ దినం వచ్చినపుడే బయటికొస్తారు, ఈ లోకంలో కాదు. దీనికి విరుద్ధంగా చెప్పేవాడు స్పష్టమైన అబద్ధం చెబుతున్నాడు, లేదా తప్పుడు మార్గంలో ఉన్నాడు. అంతేగాక అతడు సలఫ్ సాలిహ్ తెలుసుకున్న సత్యం గురించి ఎరుగని వాడు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు మరియు వారి అనుచరులు అనుసరించిన మార్గం గురించి తెలియని వాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿ثُمَّ إِنَّكُم بَعۡدَ ذَٰلِكَ لَمَيِّتُونَ15 ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ16﴾
ఆ తరువాత మీరు నిశ్చయంగా, మరణిస్తారు.
అటు పిమ్మట నిశ్చయంగా, మీరు పునరుత్థాన దినమున మరల లేపబడతారు. [అల్ ముమినూన్: 15-16] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
«أَنَا أَوَّلُ مَنْ تَنْشَقُّ عَنْهُ الْأَرْضُ يَوْمَ الْقِيَامَةِ، وَأَنَا أَوَّلُ شَافِعٍ وَأَوَّلُ مُشَفَّعٍ».
నేనే పునరుత్థాన దినమున భూమి నుండి మొదట బయటకు వచ్చే వ్యక్తిని, నేనే మొట్ట మొదటి సిఫారసుదారుడిని, మొట్టమొదట నా సిఫారసు స్వీకరించబడుతుంది. ఈ అర్ధంలో ఆయతులు మరియు హదీథులు చాలా ఉన్నాయి.
రెండవది: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను జీవించి ఉన్నప్పుడే కాక మరణించిన తరువాత కూడా సత్యానికి విరుద్ధమైనదేమీ చెప్పరు. అయితే ఈ వాసీయతు (ఉపదేశం) ఆయన షరీఅతుకు స్పష్టంగా వ్యతిరేకంగా ఉంది — అనేక కోణాల్లో ఇది స్పష్టమవుతుంది (ఇవి తరువాత వివరించబడతాయి). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రలో కనిపించవచ్చు. స్వప్నంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్ర రూపాన్ని చూసినవాడు నిజంగానే ఆయనను చూశాడు; ఎందుకంటే షైతాను ఆయన రూపాన్ని ధరించలేడు, ఇది సహీహ్ హదీథులో స్పష్టంగా ఉంది. కానీ అసలు విషయం - ఆ వ్యక్తి యొక్క విశ్వాసం, నిజాయితీ, న్యాయం, నియంత్రణ, ధార్మికత మరియు విశ్వసనీయత. అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నిజమైన రూపంలో ఆయనను చూశాడా లేదా వేరే రూపంలో చూశాడా.
ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితకాలంలో పలికిన హదీథు నమ్మకస్తులైన మరియు న్యాయమైన వ్యక్తుల ద్వారా ఉల్లేఖించబడకపోతే, దానిపై ఆధారపడకూడదు మరియు దానిని ఆధారంగా తీసుకోకూడదు. లేదా అది నమ్మకస్తులైన మరియు న్యాయమైన వ్యక్తుల ద్వారా వచ్చినా కానీ అది మరింత జ్ఞాపకశక్తి గల మరియు విశ్వసనీయమైన వ్యక్తుల రివాయత్కు విరుద్ధంగా ఉంటే, మరియు ఆ రెండు రివాయతులను కలపడం సాధ్యం కాకపోతే, అందులో ఒకటి రద్దు చేయబడినదిగా పరిగణించబడుతుంది మరియు దానిని అనుసరించకూడదు. రెండవది: రద్దు చేయబడని దానినే అనుసరించాలి, సాధ్యమైతే దాని షరతులతో సహా. ఒకవేళ కలపడం లేదా రద్దు చేయడం సాధ్యం కాకపోతే, తక్కువ జ్ఞాపకశక్తి గల మరియు తక్కువ న్యాయమైన వ్యక్తుల రివాయత్ను విస్మరించాలి మరియు దానిని అనుసరించకూడదు, మరియు దానిని షాజ్ గా (విచిత్రమైనదిగా) పరిగణించాలి.
మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ నుండి వచ్చిన వసీయత్ (వీలునామా) అని చెప్పబడినదాని యజమాని ఎవరో తెలియకపోతే, అతని న్యాయబద్ధత మరియు విశ్వసనీయత తెలియకపోతే, అలాంటి పరిస్థితిలో దానిని విస్మరించాలి మరియు దానిని పట్టించుకోకూడదు, అది షరియత్ కు వ్యతిరేకంగా లేకపోయినా సరే. మరి అది చాలా అసత్య విషయాలను కలిగి ఉంటే, దాని అసత్యతను సూచించే మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ పై అబద్ధంగా మోపబడిన మరియు అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని ప్రవేశపెట్టే విషయాలను కలిగి ఉంటే, మరి ఎలా?
మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«مَنْ قَالَ عَلَيَّ مَا لَمْ أَقُلْ؛ فَلْيَتَـبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ».
ఎవరైతే నేను చెప్పని విషయాన్ని నాపై ఆపాదిస్తాడో, అతడు తన నివాసాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి. మరియు ఈ వాగ్దానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అబద్ధంగా ఆపాదించినవాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలకని మాటలను తన మాటలుగా చెప్పి, ఆయనపై స్పష్టమైన మరియు ప్రమాదకరమైన అబద్ధం పలికాడు. అటువంటి వాడికి ఈ ఘోరమైన హెచ్చరిక సరిగ్గా సరిపోతున్నది, మరియు అతని కొరకు ఈ హెచ్చరిక ఎంతో న్యాయమైనది - అతను పశ్చాత్తాపం చెందనంత వరకు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై తన ఈ అబద్ధమైన వాగ్దానాన్ని ప్రజలకు తెలియజేయనంత వరకు; ఎందుకంటే ఎవడైనా ప్రజల మధ్య అసత్యాన్ని వ్యాప్తి చేసి, దానిని ధర్మానికి ఆపాదిస్తే అది అతని పశ్చాత్తాపం సరైనది కాదు అని తెలియజేస్తున్నది - అది బహిరంగంగా ప్రకటించబడనంత వరకు మరియు ప్రజలకు అతని అబద్ధం నుండి తిరిగి వచ్చినట్లు తెలియజేయనంత వరకు; మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్కు ప్రకారం:
﴿إِنَّ ٱلَّذِينَ يَكۡتُمُونَ مَآ أَنزَلۡنَا مِنَ ٱلۡبَيِّنَٰتِ وَٱلۡهُدَىٰ مِنۢ بَعۡدِ مَا بَيَّنَّٰهُ لِلنَّاسِ فِي ٱلۡكِتَٰبِ أُوْلَٰٓئِكَ يَلۡعَنُهُمُ ٱللَّهُ وَيَلۡعَنُهُمُ ٱللَّٰعِنُونَ159 إِلَّا ٱلَّذِينَ تَابُواْ وَأَصۡلَحُواْ وَبَيَّنُواْ فَأُوْلَٰٓئِكَ أَتُوبُ عَلَيۡهِمۡ وَأَنَا ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ160﴾
నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింపజేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వాలను - ప్రజల కొరకు దివ్యగ్రంథాలలో స్పష్టపరచిన పిదప కూడా - దాచుతారో! వారిని అల్లాహ్ తప్పక శపిస్తాడు (బహిష్కరిస్తాడు). మరియు శపించగలవారు కూడా వారిని శపిస్తారు.
కాని ఎవరైతే పశ్చాత్తాప పడతారో మరియు తమ నడవడికను సంస్కరించుకుంటారో మరియు సత్యాన్ని వెల్లడిస్తారో, అలాంటి వారి పశ్చాత్తాపాన్ని నేను అంగీకరిస్తాను. మరియు నేను మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడను, అపార కరుణా ప్రదాతను. [అల్ బఖర: 159-160] పరమ పవిత్రుడైన అల్లాహ్ ఈ పవిత్రమైన ఆయతులో స్పష్టంగా తెలియజేస్తున్నాడు: సత్యం నుండి ఏదైనా దాచినవారు, దానిని సరిదిద్దడం మరియు స్పష్టీకరించడం చేసిన తరువాత మాత్రమే వారి పశ్చాత్తాపం సరైనది అవుతుంది. మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ తన దాసుల కొరకు ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించి, ఆయనకు సంపూర్ణ శాసనాన్ని ప్రసాదించి, దానిని పరిపూర్ణం చేసి, స్పష్టీకరించి ఆ తరువాతనే ఆయనను తన వద్దకు తీసుకున్నాడు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا...﴾
ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. [అల్ మాయిదా: 3]
ఈ వసీయతు ఆదేశాన్ని కల్పించిన వ్యక్తి పద్నాలుగవ శతాబ్దంలో వచ్చి, ప్రజలపై కొత్త ధర్మాన్ని రుద్దాలని ప్రయత్నించాడు, దాని ప్రకారం అతడి ఆదేశాలను అనుసరించినవారు స్వర్గంలో ప్రవేశిస్తారు, మరియు ఆతడి ఆదేశాలను అనుసరించని వారు స్వర్గానికి నోచుకోకుండా నరకంలో ప్రవేశిస్తారు, ఈ వసీయతును ఖుర్ఆన్ కంటే గొప్పదిగా మరియు ఉత్తమంగా చేయాలని అతను కోరుకుంటున్నాడు, ఇందులో అతను ఈ కల్పితాలు చేర్చినాడు: దీన్ని వ్రాసి ఒక ఊరి నుండి మరొక ఊరికి లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపిన వారికి స్వర్గంలో కోట నిర్మించబడుతుంది, దీన్ని వ్రాయని మరియు పంపని వారికి ప్రళయదినము నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క షఫాఅత్ నిషేధించబడుతుంది, ఇది అత్యంత హేయమైన మరియు అసహ్యకరమైన పచ్చి అబద్ధం. ఈ వసీయత్ యొక్క అబద్ధాన్ని స్పష్టంగా ఎత్తి చూపించే నిదర్శనాలలో ఒకటి, మరియు ఆ అబద్ధాన్ని కల్పించిన వ్యక్తి యొక్క సిగ్గులేనితనాన్ని, నిర్లజ్జతను, అబద్ధం చెప్పడంలో అతని ధైర్యాహంకారాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతున్నది. ఎందుకంటే పవిత్రమైన ఖుర్ఆన్ కరీమ్ ను వ్రాసి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపినవారు, లేదా ఒక స్థలం నుండి మరొక స్థలానికి పంపినవారైనా సరే, ఒకవేళ ఖుర్ఆన్ ప్రకారం నడుచుకోకపోతే ఎటువంటి ప్రతిఫలమూ పొందనప్పుడు, ఈ అబద్ధాలను రచించి వాటిని ప్రచారం చేసే వ్యక్తి అలాంటి ప్రతిఫలం ఎలా పొందగలడు? ఎవరైనా ఖుర్ఆన్ ను వ్రాయకపోయినా, దానిని ఒక దేశం నుండి మరొక దేశానికి పంపక పోయినా, అతను ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క షరీఅతును అనుసరించే విశ్వాసి అయితే, ఆయన షఫాఅతు నుండి వంచించబడడు. ఈ ఒకే అబద్దపు వాగ్దానమే, దాని అసత్యతను మరియు దానిని ప్రచారం చేసే వ్యక్తి యొక్క అబద్దాన్ని, దుర్భాషితనాన్ని, మూర్ఖత్వాన్ని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన హితబోధన నుండి అతని మార్గభ్రష్టతను సూచించడానికి సరిపోతుంది.
ఈ వసీయతులో - పైన పేర్కొన్నవే కాకుండా - ఇంకా ఇతర విషయాలు కూడా ఉన్నాయి, అవన్నీ దాని అసత్యతను, అమాన్యతనే నిరూపిస్తున్నాయి. దానిని కల్పించిన వ్యక్తి తాను చెబుతున్నది నిజమేనని దాని సత్యతపై వెయ్యి సార్లు ప్రమాణం చేసినా, లేదా ఒకవేళ తన మాట అబద్ధమైనదైతే తనకు అత్యంత తీవ్రమైన శిక్షను విధించమని శపించుకున్నా – అతని మాట నిజం కాజాలదు, అతడు సత్యవంతుడు కాలేడు. అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాం – ఇది అత్యంత మూర్ఖమైన మరియు అతి చెడ్డదైన తప్పుడు ప్రకటనలలో ఒకటి. మేము అల్లాహ్ సాక్షిగా, మాతో ఉన్న దేవదూతల సాక్షిగా ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఈ వ్రాతను చూసిన ముస్లింలు మన ప్రభువు సాక్ష్యంగా ఇలా పలుకవలెను - ఈ వసీయతులు ప్రవక్త ముహమ్మద్ ﷺ పైన కల్పించబడిన అబద్ధాలు, కల్పనలు మాత్రమే. ఈ అబద్ధాలను ప్రచారం చేసినవారిని అల్లాహ్ అవమానించుగాక! వారికి తగిన శిక్ష విధించుగాక!
ఇంతకు ముందు చెప్పిన వాటితో పాటు, ఈ వసీయత్ అబద్ధమని, అసత్యమని నిరూపించగలిగే మరో ఎన్నో విషయాలు ఈ వసీయత్‌లోని వచనాల నుండే స్పష్టమవుతున్నాయి. అవి ఈ క్రింద ఉన్నాయి:
మొదటి విషయం: ఇందులో ఇలా చెప్పబడింది: (ఎందుకంటే శుక్రవారం నుండి శుక్రవారం వరకు ఇస్లాం ధర్మం లో లేని స్థితిలో లక్షా అరవై వేల మంది మరణించారు); ఎందుకంటే ఇది అగోచర జ్ఞానం, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తరువాత వహీ నిలిచిపోయింది, మరియు ఆయన జీవితంలో ఆయనకు అగోచర జ్ఞానం తెలియదు, మరి మరణం తరువాత ఎలా తెలుస్తుంది; దీనికి సంబంధించిన పరమ పవిత్రుడైన అల్లాహ్ వాక్కు:
﴿قُل لَّآ أَقُولُ لَكُمۡ عِندِي خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعۡلَمُ ٱلۡغَيۡبَ...﴾
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గానీ లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ, నేను మీతో అనడం లేదు." [అల్ అన్'ఆమ్: 50] అల్లాహ్ వాక్కు:
﴿قُل لَّا يَعۡلَمُ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ ٱلۡغَيۡبَ إِلَّا ٱللَّهُ...﴾
వారితో అను: "ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయజ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు... [అన్-నమ్ల్: 65] ప్రామాణికమైన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఆయన ఇలా సెలవిచ్చారు:
«يُذَادُ رِجَالٌ عَنْ حَوْضِي يَوْمَ القِيَامَةِ، فَأَقُولُ: يَا رَبِّ! أَصْحَابِي أَصْحَابِي، فَيُقَالُ لِي: إِنَّكَ لَا تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ، فَأَقُولُ كَمَا قَالَ العَبْدُ الصَّالِحُ: ﴿وَكُنتُ عَلَيۡهِمۡ شَهِيدٗا مَّا دُمۡتُ فِيهِمۡۖ فَلَمَّا تَوَفَّيۡتَنِي كُنتَ أَنتَ ٱلرَّقِيبَ عَلَيۡهِمۡۚ وَأَنتَ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ﴾ [المائدة: 117]».
{ప్రళయదినాన నా నీటి కొలనుపై కొంతమంది వ్యక్తులు నిలిపివేయబడతారు. అప్పుడు నేను: 'ఓ ప్రభూ! నా సహచరులు, నా సహచరులు' అని వేడుకుంటాను. దానికి సమాధానంగా: 'నీకు తెలియదు, నీ తరువాత వారు ఏమేం చేసినారో' అని చెప్పబడుతుంది. అప్పుడు నేను ధర్మాత్ముడైన దాసుడు చెప్పినట్లే చెప్తాను: 'నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. మరియు నీవే ప్రతి దానికి సాక్షివి!' }[మాయిదా 5:117]
రెండవది: ఈ వసీయతు అసత్యమని మరియు అది అబద్ధమని సూచించే అంశాలలో ఒకటి: దానిలో చెప్పబడిన విషయం: (దీనిని వ్రాసినవాడు పేదవాడైతే అల్లాహ్ అతనిని ధనవంతుడిని చేస్తాడు, లేదా అప్పులపాలైతే అల్లాహ్ అతని అప్పును తీర్చుతాడు, లేదా అతని పై పాపం ఉంటే అల్లాహ్ అతనికి మరియు అతని తల్లిదండ్రులకు ఈ వసీయతు యొక్క బరకతుతో క్షమిస్తాడు) ... చివరి వరకు. ఇది అబద్ధాలలో అతి పెద్దది మరియు దాని కల్పితతను స్పష్టంగా చూపించే సాక్ష్యాలలో ఒకటి, అల్లాహ్ మరియు ఆయన ఆరాధకుల పట్ల సిగ్గు లేకపోవడం; ఎందుకంటే ఈ మూడు విషయాలు ఖుర్ఆన్ను కేవలం వ్రాసినంత మాత్రాన లభించనపుడు, ఈ అబద్ధపు వసీయతు వ్రాసిన వారికి ఎలా లభిస్తాయి? ఈ దుష్టుడు ప్రజలను మోసం చేయాలని, వారు ఈ సిఫారసును నమ్మాలని, వారు దానిని వ్రాసి ఈ తప్పుడు ప్రతిష్టను కొనసాగించాలని కోరుతున్నాడు. అల్లాహ్ తన ఆరాధకులకు సంపదను పొందటానికి, అప్పు తీర్చుకోవటానికి, పాపములను క్షమించబడటానికి నిర్దేశించిన మార్గాలను వదిలివేయాలని కోరుతున్నాడు. అపజయం కారణాల నుండి, తప్పుడు కోరికలు మరియు షైతాన్ కు విధేయత నుండి మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.
మూడవ విషయం: ఈ వసీయతు చెల్లుబాటు కాదు అనడాన్ని నిరూపించే అంశాలలో ఒకటి, ఇందులో చెప్పబడిన ఈ విషయం: (అల్లాహ్ యొక్క ఆరాధకులలో ఎవడైతే దీనిని వ్రాయనివాడు; అతని ముఖం ఈ లోకంలో మరియు పరలోకంలో నల్లగా మారుతుంది). ఇది కూడా అతి హేయమైన అబద్ధాలలో ఒకటి, మరియు ఈ వసీయతు అసత్యమని మరియు దాని కల్పితకర్త అబద్ధం చెబుతున్నాడని స్పష్టమైన సాక్ష్యాలలో ఒకటి. ఒక తెలివైన మనిషి ఎలా ఈ వీలునామాను వ్రాయగలడు, ఇది ఒక అపరిచిత వ్యక్తి పదహారవ శతాబ్దంలో తీసుకువచ్చాడు, దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అపవాదిస్తూ, దాన్ని వ్రాయనివారి ముఖం ఈ లోకంలో మరియు పరలోకంలో నల్లబడుతుందని, దాన్ని వ్రాసినవారు పేదరికం నుండి ధనవంతులవుతారని, అప్పుల నుండి విముక్తులవుతారని, మరియు చేసిన పాపాలు క్షమించబడతాయని చెప్పడం ఎలా సాధ్యం?
పవిత్రుడైన అల్లాహ్! ఇది ఒక గొప్ప అపనింద!! మరియు సాక్ష్యాలు మరియు వాస్తవం ఈ అపవాదకుని అబద్ధాన్ని మరియు అల్లాహ్ పై అతని ధైర్యాన్ని, అల్లాహ్ మరియు ప్రజల నుండి అతని నిర్లజ్జతను, సిగ్గులేని తనానికి సాక్ష్యమిస్తున్నాయి. ఎందుకంటే ఈ అనేక జాతులు ఈ వసీయతులో ఆజ్ఞాపించినట్లు దీన్ని రాయలేదు, పంపిణీ చేయలేదు అయినా వారి ముఖాలు నల్లబడలేదు, మరియు ఇక్కడ అల్లాహ్ తప్ప మరెవ్వరూ లెక్కించలేని అనేక మంది దీన్ని అనేక సార్లు రాశారు, కానీ వారి ఋణం తీర్చబడలేదు, వారి పేదరికం తొలగించబడలేదు. కాబట్టి మనం అల్లాహ్ ను మన హృదయాలను వక్రమార్గంలో మళ్ళించకుండా మరియు పాపాల మురికి నుండి కాపాడమని కోరుకుందాము. ఇవి అతి ఉత్తమమైన మరియు అతి గొప్ప గ్రంథమైన ఖుర్ఆన్ ను వ్రాసిన వారికి షరీఅతు ద్వారా లభించే లక్షణాలు మరియు ప్రతిఫలాలు కాదు, మరి అబద్ధపు వాక్యములు, అనేక మిథ్యలు, అనేక రకాల అవిశ్వాసాలు కలిగి ఉన్న వక్రతను వ్రాసిన వారికి ఎలా లభిస్తాయి? పరమ పవిత్రుడైన అల్లాహ్!! అబద్ధం పలికిన వారిపై ఆయన ఎంత దయగలవాడు!
4: ఈ వసీయతు పూర్తిగా అబద్ధమని తెలియజేసే మరో స్పష్టమైన ఋజువు వసీయతులోని ఈ వాక్యం: "దీనిని నమ్మినవాడు నరకాగ్ని శిక్ష నుండి తప్పించుకుంటాడు, మరియు దీనిని తిరస్కరించినవాడు అవిశ్వాసి అవుతాడు", ఇది కూడా అతి ఘోరమైన అబద్ధపు ధైర్యానికి ఒక ఉదాహరణ. ఈ అబద్ధపు ఆవ్యంతనాన్ని చేసినవాడు, సమస్త ప్రజలను తన అబద్ధాన్ని నమ్మమని పిలుస్తున్నాడు. ఇంకా, ఎవరు దీన్ని నమ్ముతారో వారు నరకదండన నుండి తప్పించుకుంటారని, మరియు ఎవరు దీన్ని అంగీకరించకపోతారో వారు కాఫిరులు అవుతారని దురుద్దేశంతో ప్రకటిస్తున్నాడు. అల్లాహ్ పై అబద్దమును అపాదించిన ఈ అబద్ధాలకోరు, అల్లాహ్ పేరుతో అసత్యమును పలికినాడు. ఈ వసీయతును నమ్మినవాడు సత్యతిరస్కారి (కాఫిర్) అవ్వడానికి అర్హుడు, ఈ వసీయతును తిరస్కరించినవాడు కాదు; ఎందుకంటే ఇది అబద్ధం, అసత్యం మరియు ఎటువంటి నిజఆధారం లేని ఒక పచ్చి అబద్ధం. మేము అల్లాహ్ ను సాక్షిగా పెట్టి ఇది అబద్ధమని, దీన్ని కల్పించినవాడు అబద్ధాలకోరని, అల్లాహ్ అనుమతించని విషయాలను ప్రజలకు చట్టంగా చేయాలని, వారి ధర్మంలో లేని విషయాలను చేర్చాలని ప్రయత్నిస్తున్నాడని ప్రకటిస్తున్నాము. అల్లాహ్ ఈ ధర్మాన్ని ఈ సమాజంలో ఈ అబద్ధపు వసీయతు కల్పించబడక ముందే అంటే పద్నాలుగు శతాబ్దాల క్రితమే సంపూర్ణం చేశాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి: ఓ పాఠకులారా మరియు ఓ సోదరులారా! మరియు ఇలాంటి అబద్ధాలను నమ్మటానికి మరియు అవి మీ మధ్య ప్రాచుర్యం పొందటానికి దూరంగా ఉండండి. ఎందుకంటే సత్యం దాని మీద తళుకు, వెలుగును కలిగి ఉంటుంది, అది దాని అన్వేషకుడికి గందరగోళం కలిగించదు. కాబట్టి సత్యాన్ని దాని ఋజువుల ఆధారంతో అన్వేషించండి, మరియు మీకు క్లిష్టంగా ఉన్న విషయాల గురించి జ్ఞానులని అడగండి, మరియు అబద్ధం చెప్పే వారి ప్రమాణాలపై మోసపోవద్దు. ఎందుకంటే శపించబడిన ఇబ్లీస్ మీ తల్లిదండ్రులు ఆదం మరియు హవ్వకు, అతను వారికి సలహాదారుడని ప్రమాణం చేశాడు, మరియు అతను అత్యంత ద్రోహి మరియు అబద్ధం చెప్పేవారిలో అగ్రగణ్యుడని, అల్లాహ్ అతని గురించి ఇలా చెప్పినాడు.
﴿وَقَاسَمَهُمَآ إِنِّي لَكُمَا لَمِنَ ٱلنَّٰصِحِينَ21﴾
మరియు (షైతాన్) వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు: "నిశ్చయంగా, నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని! [అల్ అ'రాఫ్: 21] కాబట్టి మీరు అతని గురించి జాగ్రత్తగా ఉండండి, మరియు అతని అనుచరుల గురించి, అబద్ధపు వాగ్దానాలు చేసే వారి గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అతని కొరకు మరియు వారి కొరకు ఎన్నో అబద్ధపు ప్రమాణాలు, ద్రోహపు ఒప్పందాలు, మరియు మోసానికి, భ్రష్టు పట్టించడానికి అలంకరించబడిన మాటలు ఉన్నాయి! ఈ అబద్ధాలను కల్పించిన వ్యక్తి ఇక్కడ ప్రస్తావించిన అనైతిక కార్యాలు (ముంకరాత్) నిజంగా జరుగుతున్నాయి. కానీ ఖుర్ఆన్ కరీం మరియు పవిత్ర సున్నతులు వాటిని గురించి ముందుగానే తీవ్రంగా హెచ్చరించాయి. ఈ రెండింటిలోనే సరైన మార్గదర్శకం మరియు సంపూర్ణ పరిష్కారం ఉంది.
ప్రళయ సూచనల గురించి ప్రస్తావించిన విషయానికి వస్తే, ప్రవక్త హదీథులు ప్రళయ సూచనలను స్పష్టంగా వివరించాయి, మరికొన్నింటిని పవిత్ర ఖురాన్ సూచించింది. దానిని తెలుసుకోవాలనుకునే వారు, సున్నతు పుస్తకాల్లో, ఇంకా జ్ఞానం మరియు విశ్వాసం కలిగిన పండితుల రచనల్లో వాటిని కనుగొంటారు. ప్రజలకు ఈ విధమైన అబద్ధం మరియు దాని మోసం గురించిన వివరణ, సత్యాన్ని అసత్యంతో కలపడం గురించి వివరణ అవసరం లేదు. నన్ను, మిమ్మల్ని మరియు ముస్లింలందరిని షైతానుల కీడు నుండి, అపమార్గపు ప్రలోభాల నుండి, తారుమారు చేసే వారి వక్రీకరణల నుండి, అల్లాహ్ శత్రువులైన తప్పుడు వ్యక్తుల మోసాల నుండి రక్షించమని అల్లాహ్ తో వేడుకుంటున్నాను. వారు తమ నోళ్లతో అల్లాహ్ యొక్క జ్యోతిని ఆర్పివేయాలని, ఆయన ధర్మాన్ని కలవరపెట్టాలని కోరుకుంటున్నారు. అయినప్పటికీ అల్లాహ్ తన వెలుగును పూర్తి చేస్తాడు, తన ధర్మానికి తోడ్పడతాడు, షైతానులు మరియు వారి అనుచరులైన అవిశ్వాసులు మరియు నాస్తికులు ఇష్టపడకపోయినా సరే. మేము అల్లాహ్ ను వేడుకుంటున్నాము! ఆయన ముస్లింల పరిస్థితులను సంస్కరించుగాక మరియు వారికి సత్యాన్ని అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, దానిపై నిలబడే ధైర్యాన్ని ప్రసాదించుగాక మరియు అన్ని పాపాల నుండి పరమ పవిత్రుడైన అల్లాహ్ వైపు తిరిగి పశ్చాత్తాపం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణామయుడు మరియు అన్నిటికీ సమర్ధుడు. అల్లాహ్ యే మనకు చాలు మరియు గొప్ప కార్యనిర్వాహకుడైన, ఎంతో శక్తి,సామర్థ్యాల గల మహోన్నతుడైన, గొప్పవాడైన అల్లాహ్ తోనే మన ఆశలు.
స్థుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. సత్యవంతులైన, నమ్మకస్తులైన ఆయన దాసుడు మరియు సందేశహరుడు అయిన మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై, ప్రళయదినం వరకు దాతృత్వంతో అనుసరించిన వారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
***
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
తొమ్మిదవ సందేశము: మంత్రజాలం, జ్యోతిష్కం మరియు వాటికి సంబంధించిన వాటి ఆదేశము18
అల్హమ్దులిల్లాహ్, వహదహ్, వస్సలాతు వస్సలాం అలా మన్లా నబియ్య బఅదహ్. (సర్వ స్తోత్రములు, కృతజ్ఞతలు ఒకే ఒక్కడైన అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు అంతిమ ప్రవక్త పై శుభాలు శాంతి కురియుగాక). అమ్మా బాద్:
ప్రస్తుత కాలంలో మంత్రజాలం చేసేవారు చాలా మంది కనబడుతున్నారు. వారు వైద్యము వచ్చినట్లు వాదించి మంత్రజాలము, జోతిష్కము పద్ధతి ద్వారా వైద్యం చేస్తున్నారు. వీరు పలు ప్రాంతములలో వ్యాపించి ఉన్నారు. వీరు అజ్ఞాన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉండటం వలన అల్లాహ్ మరియు ఆయన దాసుల ప్రయోజనం కొరకు నేను ఇస్లాం మరియు ముస్లిములకు పెద్ద ప్రమాదమున్న ఈ పద్ధతిని స్పష్టపరచదలచాను. అందులో అల్లాహేతరులతో సంబంధము మరియు ఆయన ఆదేశమునకు,ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశమునకు వ్యతిరేకత ఉన్నదని తెలియపరచదలచాను.
కావున నేను అల్లాహ్ సహాయముతో చెబుతున్నాను వైద్యం చేయించుకోవటం సమ్మతమే. ఒక ముస్లిం అంతర్గత రోగాల, సర్జరీ, నరాల లేదా అటువంటి వాటి డాక్టర్ వద్దకు వెళ్ళాలి. అతనితో తమ రోగమును పరిశోధించుకుని వైద్యశాస్త్రంలో తెలిపిన విధంగా చట్టబద్ధంగా అనుమతించబడిన ఔషధాలతో చికిత్స చేయించుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణ కారకాలను తీసుకోవడం అనేది అల్లాహ్ పై ఉన్న నమ్మకమునకు వ్యతిరేకము కాదు. నిశ్చయంగా అల్లాహ్ రోగమును పుట్టించాడు దానికి తోడుగా దాని చికిత్సనూ పుట్టించాడు. దానిని తెలుసుకునేవారు తెలుసుకుంటారు. తెలుసుకోలేనివారు తెలుసుకోరు. అల్లాహ్ తన దాసులపై నిషేధించిన వాటిలో వారి కొరకు చికిత్సను ఉంచలేదు.
ఒక రోగి తన రోగము గురించి తెలుసుకోవటం కొరకు అగోచర విషయాల జ్ఞానం తెలుసని వాదించే జ్యోతిష్కుల వద్దకు వెళ్ళటం ధర్మసమ్మతం కాదు. అలాగే వారు తెలియపరచే విషయాలలో వారు సత్యవంతులని విశ్వసించటం కూడా సమ్మతం కాదు. ఎందుకంటే వారు ఊహాగానాలు చేస్తున్నారు లేదా తాము తలచుకున్న వాటిపై సహాయం కొరకు జిన్నులను ప్రత్యక్షపరుస్తున్నారు. ఈ వ్యక్తులు అగోచర విషయాలు తెలుసని దావా చేస్తే, వారు అవిశ్వాసులు మరియు మార్గభ్రష్టులుగా పరిగణించబడతారు.
ఇమామ్ ముస్లిం రహిమహుల్లాహ్ తన సహీహ్ హదీథు గ్రంథంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని నమోదు చేసినారు:
«مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ، لَمْ تُقْبَلْ لَهُ صَلَاةٌ أَرْبَعِينَ يَوْمًا».
“ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళతారో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తారో – నలభై దినముల పాటు అతని నమాజులు స్వీకరించబడవు.”
అబూ హురైర రదియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ నుండి ఉల్లేఖిస్తున్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :
«مَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ».
ఒక జ్యోతిష్యుని వద్దకు వచ్చి అతను చెప్పినదంతా విశ్వసించినవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని తిరస్కరించాడు. అబూ దావూద్ మరియు అహలుస్సుననుల్ అర్బఅ దీనిని నమోదు చేసినారు, మరియు హాకిమ్ దీనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ పదాలతో ప్రామాణికమైనదిగా తెలియపరచారు:
«مَنْ أَتَى عَرَّافًا أَوْ كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ».
ఎవరైన జ్యోతిష్కుని వద్దకు లేదా యాజకుని వద్దకు వెళ్ళి అతను చెబుతున్నది నిజమని విశ్వసిస్తాడో అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించాడు.
ఇమ్రాన్ ఇబ్నె హుసైన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:
«لَيْسَ مِنَّا مَنْ تَطَيَّرَ أَوْ تُطُيِّرَ لَهُ، أَوْ تَكَهَّنَ أَوْ تُكُهِّنَ لَهُ، أَوْ سَحَرَ أَوْ سُحِرَ لَهُ، وَمَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ، فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ».
“ఎవరైతే శకునం తీస్తాడో లేదా తన కొరకు తీయించుకుంటాడో; లేదా జ్యోతిష్యం చెప్తాడో లేదా తన కొరకు చెప్పించుకుంటాడో; లేదా చేతబడి చేస్తాడో లేదా తన కొరకు చేయించుకుంటాడో; అటువంటి వాడు మాలోని వాడు కాడు. మరియు ఎవరైతే జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళి, అతడు చెప్పిన దానిని విశ్వసిస్తాడో, అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించాడు.” దీనిని బజ్జార్ జయ్యిద్ సనద్'తో ఉల్లేఖించారు.
ఈ హదీథులో జోతిష్యుల వద్దకు, బాబాల వద్దకు, పూజారుల వద్దకు, చేతబడి చేసేవారి వద్దకు వెళ్ళటం నుండి, ఇంకా వారిని అడగటం మరియు వారు చెప్పిన వాటిని నమ్మటం నుండి వారింపు మరియు దానిపై హెచ్చరిక ఉన్నది;
వారు కొన్ని విషయాలలో నిజం చెప్పినట్టు కనిపించినా, లేదా వారి వద్దకు వచ్చే జనాల సంఖ్య ఎక్కువగా ఉన్నా, వాళ్లపై మోసపోవడమూ, ప్రభావితమవడమూ అనుచితం. ఎందుకంటే వారు అజ్ఞానులు, మూర్ఖులు; ప్రజలు వాళ్లపై మోహపడకూడదు. ప్రవక్త ముహమ్మద్ ﷺ వారిని కలవడం, వారిని ప్రశ్నించడం, వారిని నమ్మడాన్ని నిషిద్ధం చేశాడు. ఎందుకంటే ఈ పని లోపభూయిష్టమైనది, తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే దాని వలె ఉంది, దాని పరిణామాలు విషమంగా ఉంటాయి. వారు అబద్ధకారులు, అవినీతిపరులు.
అలాగే ఈ హదీథులలో జ్యోతిష్కుల, మంత్రజాలము చేసేవారి అవిశ్వాసంపై ఆధారం ఉన్నది. ఎందుకంటే వారు అగోచర విషయాల జ్ఞానం ఉన్నదని వాదిస్తున్నారు. ఇది అవిశ్వాసము మరియు వీరు తమ ఉద్దేశమును చేరుకోవటానికి జిన్నుల సహకారం తీసుకుంటున్నారు. మరియు అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధిస్తున్నారు. ఇది అల్లాహ్ పట్ల అవిశ్వాసము మరియు ఆయనతో పాటు సాటి కల్పించటం అవుతుంది. అగోచర విషయాల జ్ఞానం ఉన్నదని వాదించేవారిని నమ్మేవారు వారిలాంటి వారే అవుతారు. ఈ విషయములను వారితో నేర్చుకునే ప్రతీ ఒక్కడి నుండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తరవాద రహితుడు.
ఒక ముస్లింకి వారు తెలిపిన విధంగా వైద్యం చేయటం సమ్మతం కాదు అంటే చేతబడితో గీతలు గీయటం, తూటాలను పేల్చటం మరియు అటువంటివే వారికి తెలిసినటువంటి తావీజులు, పరియాచకములు. ఎందుకంటే ఇవన్ని జ్యోతిష్కములో నుంచివి మరియు ప్రజలను సందేహములో పడవేసేవి. వీటిపై ఎవరైతే సంతుష్టపడతాడో అతడు వారి అసత్య, అవిశ్వాస కార్యాల్లో ³వారికి దోహదపడినవాడు అవుతాడు.
అలాగే ఏ ముస్లిం కొరకు కూడా వారి వద్దకు వెళ్ళి వారితో ఆ వ్యక్తి గురించి దర్యాప్తు చేయటం, అతని యొక్క కుమారునితో లేదా అతని దగ్గరి బంధువుతో వివాహం చేయవలసి ఉన్నదో లేదా, ఆ భార్యాభర్తల మధ్య, వారి కుటుంబము మధ్య ఉన్న ప్రేమ, విశ్వసనీయత లేదా శతృత్వం, విభేదాల గురించి మరియు అటువంటి వాటి గురించి దర్యాప్తు చేయటం సమ్మతం కాదు: ఎందుకంటే ఇది అగోచర జ్ఞానములోనిది. అది అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదు.
కావున కార్యనిర్వాహకుల, ధార్మిక వ్యవహారములను పరిశోధించేవారి, ఇంకా అధికారము, సామర్ధ్యము కలవారి బాధ్యత ఏమిటంటే వారు జ్యోతిష్కుల, బాబాల, పురోహితుల వద్దకు వెళ్ళటం నుండి నివారించాలి, మరియు బజారులలో ఇతర ప్రదేశములలో వారు దానిని ఉపయోగించటం నుండి నిరోధించాలి. వారిని కఠినంగా వారించాలి, వారి వద్దకు వెళ్ళే వారిని వారించాలి.
ఇలా చేతబడి నిషేధిత అవిశ్వాసాల్లోనిది; ఎలాగైతే అల్లాహ్ ఇద్దరు దైవదూతల విషయంలో ఇలా సెలవిచ్చాడు:
﴿...وَمَا يُعَلِّمَانِ مِنۡ أَحَدٍ حَتَّىٰ يَقُولَآ إِنَّمَا نَحۡنُ فِتۡنَةٞ فَلَا تَكۡفُرۡۖ فَيَتَعَلَّمُونَ مِنۡهُمَا مَا يُفَرِّقُونَ بِهِۦ بَيۡنَ ٱلۡمَرۡءِ وَزَوۡجِهِۦۚ وَمَا هُم بِضَآرِّينَ بِهِۦ مِنۡ أَحَدٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمۡ وَلَا يَنفَعُهُمۡۚ وَلَقَدۡ عَلِمُواْ لَمَنِ ٱشۡتَرَىٰهُ مَا لَهُۥ فِي ٱلۡأٓخِرَةِ مِنۡ خَلَٰقٖۚ وَلَبِئۡسَ مَا شَرَوۡاْ بِهِۦٓ أَنفُسَهُمۡۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ﴾
ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు, వారిద్దరు (దేవదూతలు) ఇలా చెప్పే వారు: "నిశ్చయంగా మేము (మానవులకు) ఒక పరీక్ష! కాబట్టి మీరు (ఈ జాలవిద్యను నేర్చుకొని) సత్యతిరస్కారులు కాకండి." అయినప్పటికీ వారు (ప్రజలు), భార్యా-భర్తలకు ఎడబాటు కలిగించేది (జాలవిద్య) వారిద్దరి దగ్గర నేర్చుకునేవారు. మరియు అల్లాహ్ అనుమతి లేనిదే, దాని ద్వారా ఎవరికీ ఏ మాత్రం హాని కలిగించలేరు. మరియు వారు నేర్చుకునేది, వారికి నష్టం కలిగించేదే, కాని లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. మరియు వాస్తవానికి దానిని (జాలవిద్యను) స్వీకరించే వానికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రమూ భాగం లేదని వారికి బాగా తెలుసు. మరియు వారు ఎంత తుచ్ఛమైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ముకున్నారు! ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది! [అల్-బఖరహ్ 2:102]
గౌరవోన్నతమైన ఈ వచనాలు చేతబడి చేయటం అవిశ్వాసమని మరియు చేతబడి చేసేవారు భార్యాభర్తల మధ్య దూరమును కలుగచేస్తారని సూచిస్తున్నాయి. అలాగే చేతబడి చేయటం అన్నది స్వయంగా ఎటువంటి ప్రయోజనం గాని, నష్టం గాని కలుగచేయదని సూచిస్తున్నవి. అది విశ్వవిధాత అల్లాహ్ యొక్క అనుమతితో ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పరమ పవిత్రుడైన అల్లాహ్ యే మంచి చెడులను సృష్టించాడు.
అలాగే గౌరవోన్నతమైన ఆయతులు చేతబడి నేర్చుకునే వారు తమకు లాభం కలిగించకుండా నష్టం కలిగించే వాటిని నేర్చుకుంటున్నారని మరియు వారికి అల్లాహ్ వద్ద ఎటువంటి భాగం లేదని సూచిస్తున్నాయి. ఇది వారికి ఇహపరాలలో కలిగే నష్ట తీవ్రత గురించి సూచించే పెద్ద హెచ్చరిక మరియు వారు తుచ్ఛమైన ధరలకు తమ ప్రాణములను అమ్మివేశారు. అందుకనే అల్లాహ్ దానిపై తన వాక్కులో వారిని ఇలా దూషించాడు:
﴿...وَلَبِئۡسَ مَا شَرَوۡاْ بِهِۦٓ أَنفُسَهُمۡۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ﴾
మరియు వారు ఎంత తుచ్ఛమైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ముకున్నారు! ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది! [అల్-బఖర 2:102] షిరాఉ అంటే ఇక్కడ వర్తకం అర్ధము.
ఈ అబద్దాలు ఆపాదించేవారు, ముష్రికుల నుండి ఈ జ్ఞానాన్ని వారసత్వంగా పొందిన వారు, బలహీనమైన మనస్సులపై మోసగించటం వలన నష్టం మరింత పెరిగింది, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, అల్లాహ్ మాకు చాలు మరియు ఆయనే ఉత్తమ సంరక్షకుడు.
మంత్రజాలము చేసేవారి, జ్యోతిష్యుల కీడు నుండి మరియు చేతబడి చేసేవారందరి కీడు నుండి మనం అల్లాహ్ వద్ద రక్షణను, భద్రతను కోరుతున్నాము. మరియు ముస్లిములను వారి కీడు నుండి రక్షించమని మరియు ముస్లిం పాలకులకు ప్రజలను వారి నుండి రక్షించే, అధికారులు వారి కీడు నుండి మరియు వారి దుష్చర్యల నుండి విముక్తి పొందే వరకు వారిలో అల్లాహ్ ఆదేశమును జారీ చేసే భాగ్యమును కలిగించమని అల్లాహ్ తో వేడుకుంటున్నాము. నిశ్చయంగా ఆయన అత్యంత ఔదార్యము గలవాడు, దాతృత్వము గలవాడు.
కావున పరమ పవిత్రుడైన అల్లాహ్ తన దాసుల కొరకు వారిపై చేతబడి వాటిల్లక ముందే దాని నుండి జాగ్రత్తపడే విషయాలను ధర్మబద్ధం చేశాడు మరియు అది వాటిల్లిన తరువాత దాని వైద్యం చేసుకునే వాటిని తన వైపు నుండి వారి కొరకు కారుణ్యముగా, వారి వైపు తన తరుపు నుండి ఉపకారముగా మరియు వారిపై తన అనుగ్రహమును పరిపూర్ణం చేసే విధంగా వారికి స్పష్టపరచాడు.
చేతబడి వాటిల్లక ముందు దాని ప్రమాదముల నుండి జాగ్రత్తపడే విషయాలు మరియు చేతబడి వాటిల్లిన తరువాత ధర్మబద్ధమైన సమ్మతమైన వాటి నుండి వైద్యం చేసుకునే విషయాలు ఈ క్రింద స్పష్టపరచబడ్డాయి, మరియు దాని వివరణ ఈ విధంగా ఉంది:
మొదట: చేతబడి వాటిల్లక ముందే దాని ప్రమాదముల నుండి జాగ్రత్త వహించవలసిన విషయాలు. వాటిలో ముఖ్యమైనవి, ప్రయోజనకరమైనవి: షరఈ అజ్కారులు, దుఆలు, శరణు వేడుకునే సున్నత్ పరమైన విధానాలతో భద్రతను కల్పించుకోవటం. వాటిలో నుంచి ప్రతీ ఫర్జ్ నమాజు చివరిలో సలాం పలికిన తరువాత ఆయతుల్ కుర్సీ చదవటం, అది దివ్య ఖుర్ఆన్ లోని గొప్ప వచనము. పరమ పవిత్రుడైన అల్లాహ్ వాక్కు:
﴿ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡحَيُّ ٱلۡقَيُّومُۚ لَا تَأۡخُذُهُۥ سِنَةٞ وَلَا نَوۡمٞۚ لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ مَن ذَا ٱلَّذِي يَشۡفَعُ عِندَهُۥٓ إِلَّا بِإِذۡنِهِۦۚ يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡۖ وَلَا يُحِيطُونَ بِشَيۡءٖ مِّنۡ عِلۡمِهِۦٓ إِلَّا بِمَا شَآءَۚ وَسِعَ كُرۡسِيُّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۖ وَلَا يَـُٔودُهُۥ حِفۡظُهُمَاۚ وَهُوَ ٱلۡعَلِيُّ ٱلۡعَظِيمُ255﴾
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు. [అల్-బఖర: 255] ఇది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నిద్రకు ఉపక్రమించే వేళ ఈ సూరాలు పఠించాలి:
«مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ فِي لَيْلَةٍ، لَمْ يَزَلْ عَلَيْهِ مِنَ اللَّهِ حَافِظٌ، وَلَا يَقْرَبُهُ شَيْطَانٌ حَتَّى يُصْبِحَ».
“రాత్రి పూట ఆయతుల్ కుర్సీ పఠించిన వాడిపై అల్లాహ్ తరుపు నుండి ఒక రక్షకుడు నియమితుడవుతాడు. అతడు ఉదయం నిదుర మేల్కొనే వరకు షైతాను అతని దరిదాపులలోనికి రాడు.”
అందులో దీని పఠనం కూడా ఉంది:
﴿قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ1﴾
ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.
﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ1﴾
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.
﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ1﴾
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను! [అన్నాస్ 114:1] ప్రతీ ఫర్జ్ నమాజు తరువాత పఠించటం మరియు ఈ మూడు సూరాలను ఫజర్ నమాజు తరువాత, దినపు మొదటి వేళ ఉదయపు అద్కారులలో, మగ్రిబ్ నమాజు తరువాత, రాత్రి మొదటి వేళ సాయత్రపు అద్కారులలో మూడుసార్లు పఠించటం.
వాటిలో నుంచి రాత్రి మొదటి వేళలో సూరతుల్ బఖరా చివరి రెండు ఆయతులను పఠించుట అవి:
﴿ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّن رُّسُلِهِۦۚ وَقَالُواْ سَمِعۡنَا وَأَطَعۡنَاۖ غُفۡرَانَكَ رَبَّنَا وَإِلَيۡكَ ٱلۡمَصِيرُ285﴾
ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది. సూరహ్ చివరి వరకు.
ప్రామాణికమైన హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఆయన ఇలా సెలవిచ్చారు:
«مَنْ قَرَأَ الآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ البَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ».
ఎవరైతే రాత్రి సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు వాక్యాలను పఠిస్తాడో అవి అతనికి సరిపోతాయి. మరియు దీని అర్ధం అల్లాహ్ కు బాగా తెలుసు: అవి రెండు అతని కొరకు ప్రతీ చెడు నుండి (రక్షణ కొరకు) సరిపోతాయి. ఇంకా అందులో నుంచి రాత్రింబవళ్ళలో ఎప్పుడైనా, ఏదైనా నివాసము వద్ద లేదా ఎడారిలో లేదా ఆకాశములో లేదా సముద్రంలో అల్లాహ్ వాక్యములతో ఆయన సృష్టించిన ప్రతీ కీడు నుండి ఎక్కువగా శరణు వేడుకోవటం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«مَن نَزَلَ مَنْزِلًا فَقالَ: أَعُوذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ مِن شَرِّ ما خَلَقَ، لَمْ يَضُرَّهُ شَيءٌ حتَّى يَرْتَحِلَ مِن مَنْزِلِهِ ذَلِكَ».
“ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత వరకు అతనికి ఏదీ (ఏ విషయమూ) హాని కలిగించజాలదు”.
అందులో నుంచి ఉదయపు మొదటి వేళలో, రాత్రి మొదటి వేళలో ప్రతీ ముస్లిం ఈ దుఆను మూడు సార్లు పఠించటం:
«بِسْمِ اللهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيءٌ فِي الأَرْضِ وَلَا فِي السَّمَاءِ، وَهُوَ السَّمِيعُ العَلِيمُ».
అల్లాహ్ నామముతో ఆరంభిస్తున్నాను. ఆయన నామముతో భూమ్యాకాశములలో ఏదీ నష్టం కలిగించదు. మరియు ఆయన సర్వం వినేవాడు, తెలుసుకునేవాడు.
ఈ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ప్రోత్సహం నిరూపించబడటం వలన మరియు ఇది ప్రతీ చెడు నుండి భద్రతకు కారణం అవటం వలన.
రెండవది: చేతబడి వాటిల్లిన తరువాత దాని వైద్యం చేయబడే విధానాలు, ఇవి కూడా అనేక విషయాల ద్వారా జరుగుతాయి:
మొదటిది: అల్లాహ్ ఎదుట తరచుగా లొంగిపోవడం, మరియు ఆయనను, సుబ్హానహు వ తఆలాను, వాటి ప్రభావం ద్వారా కలిగే నష్టాన్ని తొలగించమని, కష్టాన్ని తొలగించమని అర్ధించడం.
రెండవది: చేతబడి చేసిన వస్తువు నేలలో లేదా ఏదైన కొండలో లేదా ఇతర చోట ఎక్కడ ఉందో గుర్తించటం కోసం ప్రయత్నించాలి. దాన్ని తీసి నాశనం చేస్తే చేతబడి ప్రభావం నిర్వీర్యమైపోతుంది. ఇది చేతబడిని నయం చేసే అత్యంత ప్రయోజనకరమైన వైద్యం.
మూడవది: షరఈ రుఖయ్య, ఇందులో చాలా అజ్కార్లు మరియు దుఆలు ఉన్నాయి. వాటిలో కొన్ని:
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు రూఢీ చేయబడినది:
«اللَّهُمَّ رَبَّ النَّاسِ، أَذْهِبِ الْبَأْسَ، وَاشْفِ أَنْتَ الشَّافِي، لَا شِفَاءَ إِلَّا شِفَاؤُكَ، شِفَاءً لَا يُغَادِرُ سَقَمًا».
«అల్లాహుమ్మ రబ్బన్నాస్’అజ్హిబిల్ బాస్’వష్ఫీ అంతష్శాఫీ ‘లా షిఫాఅ ఇల్లా షిఫాఉక షిఫా అన్ లా యుగాదిరు సఖమా’»
«ఓ అల్లాహ్! మనుషుల ప్రభువా! నీవే బాధను తొలగించువాడివి. నీవే చికిత్సిచేయువాడివి. నీ వైద్యం తప్ప మరొక వైద్యం లేదు. నీ చికిత్సతో అన్ని రోగాలు అంతమవుగాక». ఆయన దీనిని మూడు సార్లు పఠించేవారు.
జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై రుఖయా చేసిన దుఆలలో నుంచి ఇది కూడా ఉన్నది ఆయన ఇలా పలికారు:
«بِسْمِ اللَّهِ أَرْقِيكَ، مِنْ كُلِّ شَيْءٍ يُؤْذِيكَ، وَمِنْ شَرِّ كُلِّ نَفْسٍ أَوْ عَيْنِ حَاسِدٍ، اللَّهُ يَشْفِيكَ، بِسْمِ اللَّهِ أَرْقِيكَ».
«బిస్మిల్లాహి అర్ఖీక, మిన్ కుళ్లి షైఇన్ యుజీక, వ మిన్ షర్రి కుళ్లి నఫ్సిన్ ఔ ఐనిన్ హాసిదిన్, అల్లాహు యష్ఫీక, బిస్మిల్లాహి అర్ఖీక». అల్లాహ్ పేరుతో నేను నీకు రుఖ్యా చేస్తున్నాను, నిన్ను బాధించే ప్రతి దాని నుండి మరియు ప్రతి ఆత్మ యొక్క లేదా అసూయపడే కంటి యొక్క చెడు నుండి, అల్లాహ్ నిన్ను స్వస్థపరచుగాక, అల్లాహ్ పేరుతో నేను నీకు రుఖ్యా చేస్తున్నాను. ఈ విధంగా మూడు సార్లు పునరావృతం చేయాలి.
మరియు ఇది - ఆ మనిషి ఎవరైతే భార్యతో సంభోగము చేయటం నుండి ఆపబడ్డాడో అతని కొరకు ప్రయోజనకరమైన వైద్యము: ఏడు పచ్చని రేగు ఆకులను తీసుకుని వాటిని రాయితో లేదా వేరేవాటితో నూరాలి. వాటిని ఒక పాత్రలో వేసి అందులో స్నానానికి అవసరమైన నీటిని వేయాలి. మరియు అందులో
ఆయతుల్ కుర్సీ (2:255) మరియు
﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ1﴾
ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా! [కాఫిరూన్ 109:1], మరియు
﴿قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ1﴾
ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. [అల్-ఇఖ్లాస్ 112:1] మరియు
﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ1﴾
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను. [అల్-ఫలఖ్ 113:1] మరియు
﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ1﴾
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను! [అన్నాస్ 114:1]
మరియు సూరతుల్ ఆరాఫ్ లో చేతబడి గురించి వచ్చిన ఆయతులు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنۡ أَلۡقِ عَصَاكَۖ فَإِذَا هِيَ تَلۡقَفُ مَا يَأۡفِكُونَ117 فَوَقَعَ ٱلۡحَقُّ وَبَطَلَ مَا كَانُواْ يَعۡمَلُونَ118 فَغُلِبُواْ هُنَالِكَ وَٱنقَلَبُواْ صَٰغِرِينَ119﴾
మేము మూసాకు: "నీ చేతికర్రను విసురు." అని ఆదేశమిచ్చాము. అప్పుడది వారి (మాంత్రికుల) బూటక (మాయాజాలాన్ని) మ్రింగి వేసింది.
ఈ విధంగా సత్యం స్థాపితమయ్యింది మరియు వారు (మాంత్రికులు) చేసిందంతా విఫలమయ్యింది.
ఈ విధంగా వారు అక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు. [అల్-అఅ్-రాఫ్ 7:117-119]
మరియు సూరహ్ యూనుస్ యొక్క ఆయతులు అవి: మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَقَالَ فِرۡعَوۡنُ ٱئۡتُونِي بِكُلِّ سَٰحِرٍ عَلِيمٖ79 فَلَمَّا جَآءَ ٱلسَّحَرَةُ قَالَ لَهُم مُّوسَىٰٓ أَلۡقُواْ مَآ أَنتُم مُّلۡقُونَ80 فَلَمَّآ أَلۡقَوۡاْ قَالَ مُوسَىٰ مَا جِئۡتُم بِهِ ٱلسِّحۡرُۖ إِنَّ ٱللَّهَ سَيُبۡطِلُهُۥٓ إِنَّ ٱللَّهَ لَا يُصۡلِحُ عَمَلَ ٱلۡمُفۡسِدِينَ81 وَيُحِقُّ ٱللَّهُ ٱلۡحَقَّ بِكَلِمَٰتِهِۦ وَلَوۡ كَرِهَ ٱلۡمُجۡرِمُونَ82﴾
మరియు ఫిర్ఔన్ (తన వారితో) అన్నాడు: "నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి నా వద్దకు తీసుకురండి!
మాంత్రికులు వచ్చిన తరువాత మూసా వారితో: "మీరు విసర దలచుకున్న వాటిని విసరండి!" అని అన్నాడు.
వారు విసరగానే మూసా: "మీరు విసిరింది మంత్రజాలం. నిశ్చయంగా, అల్లాహ్ దానిని భంగ పరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ దౌర్జన్యపరుల కార్యాలను చక్కబడనివ్వడు.
మరియు అల్లాహ్ తన ఆజ్ఞతో సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు, అది అపరాధులకు ఎంత అసహ్యకరమైనా సరే! [٣٨ 10:79-82]
మరియు సూరతు తాహాలోని ఆయతులు:
﴿قَالُواْ يَٰمُوسَىٰٓ إِمَّآ أَن تُلۡقِيَ وَإِمَّآ أَن نَّكُونَ أَوَّلَ مَنۡ أَلۡقَىٰ65 قَالَ بَلۡ أَلۡقُواْۖ فَإِذَا حِبَالُهُمۡ وَعِصِيُّهُمۡ يُخَيَّلُ إِلَيۡهِ مِن سِحۡرِهِمۡ أَنَّهَا تَسۡعَىٰ66 فَأَوۡجَسَ فِي نَفۡسِهِۦ خِيفَةٗ مُّوسَىٰ67 قُلۡنَا لَا تَخَفۡ إِنَّكَ أَنتَ ٱلۡأَعۡلَىٰ68 وَأَلۡقِ مَا فِي يَمِينِكَ تَلۡقَفۡ مَا صَنَعُوٓاْۖ إِنَّمَا صَنَعُواْ كَيۡدُ سَٰحِرٖۖ وَلَا يُفۡلِحُ ٱلسَّاحِرُ حَيۡثُ أَتَىٰ69﴾
వారు (మాంత్రికులు) ఇలా అన్నారు: "ఓ మూసా! నీవు విసురుతావా, లేదా మేము మొదట విసరాలా?
(మూసా) అన్నాడు: "లేదు! మీరే (ముందు) విసరండి!" అప్పుడు ఆకస్మాత్తుగా వారి త్రాళ్ళు మరియు వారి కర్రలూ - వారి మంత్రజాలం వల్ల - అతనికి (మూసాకు) చలిస్తూ ఉన్నట్లు కనిపించాయి.
దానితో మూసాకు, తన మసనస్సులో కొంత భయం కలిగింది67.
మేము (అల్లాహ్) అన్నాము: "భయపడకు! నిశ్చయంగా నీవే ప్రాబల్యం పొందుతావు.68
నీ కుడిచేతిలో ఉన్నదానిని విసురు! అది వారు కల్పించిన వాటిని మ్రింగి వేస్తుంది. వారు కల్పించినది నిశ్చయంగా, మాంత్రికుని తంత్రమే! మరియు మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కానేరడు. వాడు ఎటు నుంచి, ఎలా వచ్చినా సరే!
[తాహా 20:65-69]
ఈ తెలియపరచబడిన ఆయతులను పఠించి నీళ్లలో ఊదిన తరువాత దాని నుండి మూడు గుటుకల నీటిని త్రాగి మిగిలిన వాటితో స్నానం చేయాలి. దీని ద్వారా అల్లాహ్ తలచుకుంటే రోగము నయం అవుతుంది. ఒక వేళ రెండూ లేదా ఎక్కువ సార్లు దాన్ని ఉపయోగించే అవసరమే ఉంటే రోగం నయం అయ్యే వరకు చేయటంలో ఎటువంటి దోషం లేదు.
ఈ అజ్'కారులు మరియు శరణు వేడుకునే దుఆలు మరియు మార్గాలు చేతబడి మరియు ఇతరత్రా కీడు నుండి జాగ్రత్త పడటానికి గొప్ప కారకాలు. మరియు అవి చేతబడి సంభవించిన తరువాత దానిని తొలగించటానికి గొప్ప ఆయుధాలు కూడాను. వాటిపై నిజహృదయంతో విశ్వాసమును కలిగి ఉండి, అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండి, ఆయనపై ఆధారపడుతూ, అవి దేనిపైనైతే సూచిస్తున్నాయో వాటిని అర్ధం చేసుకుని వాటి పట్ల శ్రద్ధ వహించే వారి కొరకు.
ఈ విషయాలను తెలియచేయటం అవసరము - వేటితోనైతే చేతబడి నుండి జాగ్రత్తగా ఉండవచ్చు మరియు వాటితో చేతబడి యొక్క వైద్యం చేయవచ్చు. వల్లాహు వలియ్యుత్తౌఫీఖ్.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం వస్తుంది, అది చేతబడి చేసేవారి చర్యలతో సజర్ వైద్యం చేయటం, జిన్నులకు దగ్గరవటం ద్వారా జంతువును కోయటం లేదా ఇతరవాటిని బలి ఇవ్వటం వంటిది. ఇది సమ్మతం కాదు. ఎందుకంటే అది షైతాను చర్యల్లోంచిది. అంతేకాదు అది పెద్ద షిర్కులోంచిది. అలాగే జ్యోతిష్కులతో, బాబాలతో, పూజారులతో మరియు చేతబడి చేసేవారితో అడిగి వైద్యం చేయటం మరియు వారు చెప్పిన వాటిని ఉపయోగించటం సరి కాదు. ఎందుకంటే వారు విశ్వాసపరులు కారు మరియు వారు అబద్దపరులు, పాపాత్ములు. అగోచర విషయాల జ్ఞానం తమకు తెలుసని వాదించేవారు మరియు ప్రజలను మోసానికి గురిచేసేవారు. వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళటం నుండి, వారి వద్దకు వచ్చి అడగటం నుండి, వారు చెప్పిన వాటిని నిజమని నమ్మటం నుండి హెచ్చరించారు. దీని ప్రస్తావన ఈ పుస్తకం యొక్క ఆరంభంలోనే చేయబడింది. కాబట్టి, దాని నుండి జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రామాణికమైన హదీథులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిరూపితమైనది. ఆయనను నష్రహ్ గురించి అడిగితే ఇలా సమాధానమిచ్చారు:
«هِيَ مِنْ عَمَلِ الشَّيْطَانِ».
అది షైతాను చర్యల్లోనిది, దీనిని ఇమామ్ అహ్మద్ మరియు అబూదావుద్ ప్రామాణిక సనద్ తో ఉల్లేఖించారు.
నష్ర అంటే చేతబడి చేయబడిన వాడి నుండి చేతబడిని నయం చేయటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశం ఆయన ఈ పలకులు : నష్ర ఏమిటంటే దానిని అజ్ఞానులు నిర్వహించేవారు. అది ఎలాగంటే చేతబడిని నయం చేయటానికి చేతబడి చేసేవాడిని అడగటం లేదా ఇంకొక చేతబడి చేసే వాడితో చేతబడిని దాని లాంటిదానితోనే నయం చేయటం.
ఇక చేతబడిని మంత్రించటం ద్వారా, ధార్మిక దుఆల ద్వారా నయం చేయటంలో ఎటువంటి దోషం లేదు. ఇంతకు ముందు దాని ప్రస్తావన వచ్చింది. మరియు దాని గురించి అల్లామా ఇబ్నె ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ మరియు ఫత్హుల్ మజీద్ లో అబ్దుర్రహ్మాన్ బిన్ హసన్ రహ్మతుల్లహి అలైహి ఖుర్ఆన్, హదీథులలోని ఆధారాలను తెలిపారు. ఇతర ధార్మిక విధ్వాంసులు కూడా దీని గురించి ఖర్ఆన్, హదీథులలోని ఆధారాలు తెలిపారు.
ముస్లిములకు ప్రతీ కీడు నుండి రక్షణ భాగ్యమును కలిగించమని, వారి ధర్మమును పరిరక్షించమని మరియు వారికి అందులో పరిజ్ఞానమును ప్రసాదించమని మరియు అల్లాహ్ ధర్మమునకు విరుద్ధమైన వాటి నుండి వారిని పరిరక్షించమని అల్లాహ్ ను అర్థిస్తున్నాము.
అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కలిగించుగాక.
***
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
పదవ సందేశము: సమాధులపై మస్జిదులు నిర్మించకూడదని హెచ్చరించడం.
అల్లాహ్ పేరుతో, సకల స్తోత్రాలు మరియు ప్రశంసలు అల్లాహ్'కే శోభిస్తాయి మరియు దైవప్రవక్త పై శాంతి, శుభాలు కురియుగాక!
అమ్మా బఅదు: మేము ఇస్లామిక్ సైన్స్ అసోసియేషన్ పత్రిక యొక్క మూడవ సంచికలో ప్రచురించబడిన (ముస్లింల వార్తలు నెలలో) అనే విభాగంలో చూసాను: "జోర్డాన్ హషిమీ రాజ్యంలో ఇస్లామిక్ సైన్స్ అసోసియేషన్ ఇటీవల కనుగొనబడిన రహీబ్ గ్రామంలోని గుహపై ఒక మస్జిదును నిర్మించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు, ఇది ఖుర్ఆన్ కరీమ్'లో ప్రస్తావించబడిన గుహవాసులు నిద్రించిన గుహ అని చెప్పబడుతుంది".
అల్లాహ్ మరియు ఆయన దాసుల పట్ల సలహా ఇవ్వడం అనేది ఒక బాధ్యతగా ఉండటంతో, నేను జోర్డాన్ హషిమీ రాజ్యంలో ఉన్న ఇస్లామిక్ సైన్స్ అసోసియేషన్కు అదే పత్రికలో ఒక సందేశాన్ని పంపించాను; దాని సారాంశం: గుహపై మస్జిదును నిర్మించాలనే వారి ఉద్దేశ్యాన్ని అమలు చేయకుండా ఉండటానికి అసోసియేషన్కు సలహా ఇవ్వడం; ఎందుకంటే ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సమాధులపై మరియు వారి అవశేషాలపై మస్జిదులను నిర్మించడం అనేది ఇస్లామీయ ధర్మశాస్త్రం నిషేధించిన మరియు హెచ్చరించిన వాటిలో ఒకటి, మరియు దాన్ని చేసిన వారిని శపించడం జరిగింది; ఎందుకంటే ఇది షిర్క్ కు మార్గం మరియు ప్రవక్తల మరియు పుణ్యాత్ముల పట్ల అతిక్రమించటానికి దారి తీస్తుంది, షరీఅతు తీసుకువచ్చినది సత్యమని ప్రపంచం సాక్ష్యమిస్తోంది, మరియు అది మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి వచ్చినదని రుజువు చేస్తుంది, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ నుండి తీసుకువచ్చినది మరియు ఉమ్మతుకు అందించినది సత్యమని ప్రకాశవంతమైన ఆధారం మరియు ప్రామాణికమైన సాక్ష్యం తెలుపుతున్నది. ప్రపంచంలోని ఇస్లామిక్ పరిస్థితులను పరిశీలించిన ప్రతివారు, సమాధులపై మస్జిదులను నిర్మించడం, వాటిని కీర్తించడం, అలంకరించడం, వాటికి సంరక్షకులను నియమించడం వలన షిర్క్ మరియు అతిక్రమణం ఎలా జరుగు తున్నదో గమనిస్తారు. అవి షిర్క్ కు దారితీసే మార్గాలలో ఒకటని, మరియు ఇస్లామిక్ షరియా వాటిని నిషేధించడం, వాటి నిర్మాణం నుండి హెచ్చరించడం వంటి మంచి లక్షణాలను కలిగి ఉందని నిశ్చయంగా తెలుసుకుంటారు.
బుఖారి మరియు ముస్లింలలో నమోదు చేయబడిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
«لَعَنَ اللَّهُ الْيَهُودَ وَالنَّصَارَى، اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ، قالَتْ عَائِشَةُ: يُحَذِّرُ مَا صَنَعُوا، قالَتْ: وَلَوْلَا ذَلِكَ لَأُبْرِزَ قَبْرُهُ، غَيْرَ أَنَّهُ خُشِيَ أَنْ يُتَّخَذَ مَسْجِدًا».
యూదులపై క్రైస్తవులపై అల్లాహ్ యొక్క శాపం కురియుగాక వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా చేసుకున్నారు" అని ఆయెషా రదియల్లాహు అన్హా చెప్పారు: వారిలా మీరు చేయకండి అని వారించేవారు, ఆమె చెప్పారు: ఒకవేళ ప్రజలు ప్రవక్త సమాధిని మస్జిద్ గా మార్చుకుంటారన్న భయమే లేకుంటే దానిని బహిరంగంగా ఉంచేవారము. అలాగే బుఖారి ముస్లింలో సయ్యిదా ఉమ్మె సలమహ్ మరియు ఉమ్మె హబీబ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద హబషాలో తాము చూసిన చర్చి గురించి, అందులోని చిత్రాలు గురించి ప్రస్తావించినారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
«أُولَئِكَ إِذَا مَاتَ فِيهِمُ الرَّجُلُ الصَّالِحُ؛ بَنَوْا عَلَى قَبْرِهِ مَسْجِدًا، وَصَوَّرُوا فِيهِ تِلْكَ الصُّوَرَ، أُولَئِكَ شِرَارُ الْخَلْقِ عِنْدَ اللَّهِ».
వారిలోని పుణ్యాత్ములు చనిపోయినప్పుడు వారి సమాధుల పైన ఆలయాలు నిర్మించి వారి చిత్రాలు చేసేవారు అవే ఈ చిత్రాలు; అల్లాహ్ వద్ద సృష్టి రాశుల్లో కెల్లా అత్యంత నీచమైన జీవులు (చిత్రపటాలు గీసిన వారు, సమాధులపై ఆలయాలు నిర్మించినవారు) వీరు.
సహీహ్ ముస్లింలో జుందుబ్ ఇబ్నె అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణానికి ఐదు రోజుల ముందు ఇలా చెప్పడం నేను విన్నాను:
«إِنِّي أَبْرَأُ إِلَى اللَّهِ أَنْ يَكُونَ لِي مِنْكُمْ خَلِيلٌ، فَإِنَّ اللَّهَ قَدِ اتَّخَذَنِي خَلِيلًا، كَمَا اتَّخَذَ إِبْرَاهِيمَ خَلِيلًا، وَلَوْ كُنْتُ مُتَّخِذًا مِنْ أُمَّتِي خَلِيلًا، لَاتَّخَذْتُ أَبَا بَكْرٍ خَلِيلًا، أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ، أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ، فَإِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ».
అల్లాహ్ మహోన్నత వల్ల మీలో ఎవరినీ నా మిత్రునిగా చేసుకోలేకపోతున్నాను, మహోన్నతుడైన అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలామ్ ను చేసుకున్న మాదిరిగా నన్ను తన మిత్రునిగా చేసుకున్నాడు, ఒకవేళ మిత్రునిగా చేసుకునే అవకాశం నాకు ఉంటే నేను అబుబకర్ ని మిత్రునిగా చేసుకునేవాడను. జాగ్రత్త! మీకు పూర్వం గడిచిన తరాల వారు తమ ప్రవక్తల సమాధులను, మరియు సత్పురుషుల సమాధులను మస్జిదులుగా చేసుకునేవారు. ఖబడ్దార్! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. నేను మిమ్ములను అలా చేయడం నుండి నిషేధిస్తున్నాను. ఈ అధ్యాయంలో అనేక హదీథులు ఉన్నాయి.
నలుగురు ఇమాములతో సహా ముస్లిం పండితులందరూ మరియు ఇతరులు సమాధులపై మస్జిదుల నిర్మాణము నిషేధించుటను స్పష్టంగా పేర్కొన్నారు, మరియు దాని నుండి హెచ్చరించారు; ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతును అనుసరించుట మరియు ఈ సమాజానికి సలహా ఇచ్చుట, మరియు గతించిన యూదులు మరియు క్రైస్తవులలోని మితవాదుల వంటి ఈ సమాజాలలోని దుర్మార్గులలో పడకుండా హెచ్చరించుట తప్పనిసరి.
జోర్డాన్ లోని ఇస్లామిక్ సైన్సెస్ అసోసియేషన్ మరియు ఇతర ముస్లిములపై కర్తవ్యం ఏమిటంటే: సున్నతును అనుసరించడం, ఇమాముల మార్గాన్ని అనుసరించడం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త హెచ్చరించిన వాటి నుండి జాగ్రత్తగా ఉండటం; అందులోనే దాసుల సదుపాయం, వారి సంతోషం మరియు ఇహపరలోకాలలో వారి రక్షణ ఉంది. ఈ విషయంలో కొంతమంది అల్లాహ్ తాలా గుహవాసుల కథలో చెప్పిన మాటలను ఆధారంగా తీసుకున్నారు:
﴿...قَالَ ٱلَّذِينَ غَلَبُواْ عَلَىٰٓ أَمۡرِهِمۡ لَنَتَّخِذَنَّ عَلَيۡهِم مَّسۡجِدٗا﴾
ఆ వ్యవహారంలో పైచేయి (ప్రాబల్యం) ఉన్నవారు: "వారి స్మారకంగా ఒక మస్జిద్ ను నిర్మించాలి." అని అన్నారు.
[అల్ కహఫ్: 21]
దానికి సమాధానం: పరమ పవిత్రుడైన అల్లాహ్ ఆ కాలంలోని నాయకులు మరియు అధికారం కలిగినవారు ఈ మాటలు పలికారని తెలియజేశారు, ఇది వారి కొరకు సమ్మతం మరియు ఆమోదయోగ్యం కాదు, కానీ వారి చర్యలను నిందిస్తూ మరియు తప్పు చూపిస్తూ, వారి ఆచరణ నుండి దూరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉంది. ఈ విషయాన్ని సూచించేది ఏమిటంటే: ఈ ఆయతు ఆయనపై అవతరింపబడిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దీనికి అర్థం చెప్పడంలో అత్యంత పరిజ్ఞానులైన వారు; తమ ఉమ్మతును సమాధులపై మస్జిదులను నిర్మించడాన్ని నిషేధించారు మరియు వారించారు, మరియు అలా చేసిన వారిని శాపించారు మరియు నిందించారు.
అది అనుమతించబడినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆ ఘోరమైన కఠినతను ప్రదర్శించేవారు కాదు, మరియు ఆ విషయంలో అతిశయించేవారు కాదు, ఇలాంటి పనిని చేసినవారిని శపించేవారు కాదు. అల్లాహ్ అజ్జ వజల్ దృష్టిలో ఇలాంటి వారు చెడ్డవారిలో లెక్కించబడతారని తెలియజేశారు. ఇది సత్యాన్ని కోరుకునే వారికి సరిపోతుంది మరియు నమ్మకాన్ని కలిగిస్తుంది. సమాధులపై మస్జిదులను ఏర్పాటు చేయటం మునుపటి వారికి సమ్మతమైనా కూడా, మనకు వాటిని అనుసరించడం సమ్మతం కాదు; ఎందుకంటే మన షరీఅతు మునుపటి షరీఅతులను రద్దు చేసింది, మరియు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త, ఆయన షరీఅతు సంపూర్ణమైనది మరియు సమస్త లోకాల కోసం పంపబడింది. ఆయన సమాధులపై మస్జిదులను ఏర్పాటు చేయటం నిషేధించారు; కాబట్టి ఆయన ఆదేశానికి విరుద్ధంగా చేయటం మనకు సమ్మతం కాదు, మరియు ఆయనను అనుసరించడం మన విధి, ఆయన తెచ్చిన దానిని పాటించడం, మరియు పాత షరీఅతులను, వాటిని ఆచరించిన వారి అభిరుచులకు విరుద్ధంగా ఉండటం అవసరం; ఎందుకంటే అల్లాహ్ యొక్క షరీఅతు కంటే సంపూర్ణమైనది లేదు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శనం కంటే ఉత్తమమైనది లేదు.
మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చట్టానికి కట్టుబడి ఉండటం విధి; అల్లాహ్ ఆయనను ఆశీర్వదించి ఆయనకు శాంతిని ప్రసాదించుగాక; మాటలలో మరియు చేతలలో, బహిరంగంగా మరియు అంతరంగంగా, మరియు అన్ని ఇతర వ్యవహారాలలో మనం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను కలిసే వరకు, ఎందుకంటే ఆయన అన్నీ వినేవాడు, అన్నీ దగ్గరగా ఉంటాడు.
అల్లాహ్ తన దాసుడు, తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై మరియు ప్రళయం వరకు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారిపై శుభాలను, శాంతిని కలిగించుగాక.
***
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
పదకొండవ సందేశము: మస్జిదులలో మృతులను సమాధి చేయడం
అల్లాహ్ పేరుతో, సకల స్తోత్రాలు మరియు ప్రశంసలు అల్లాహ్'కే శోభిస్తాయి మరియు దైవప్రవక్తపై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన మార్గమును అనుసరించిన వారిపై శాంతి, శుభాలు కురియుగాక! )అమ్మా బాద్:)ఆ తరువాత
హిజ్రీ 1415, 4వ నెల 17వ తేదీన విడుదలైన 'ఖర్తూమ్' పత్రికను నేను పరిశీలించాను; అందులో సయ్యద్ ముహ్మద్ హసన్ ఇద్రీసి సమాధి, ఆయన తండ్రి సమీపంలో, వారి మస్జిద్ లో, ఉమ్ దుర్మాన్ నగరంలో, నిర్మించబడినట్లు ఒక ప్రకటన ప్రచురించబడింది... మొదలైనవి.
అల్లాహ్ ముస్లింలకు సలహా ఇవ్వడం మరియు చెడు పనుల నుండి నివారించడం గురించి ఆదేశించినందున, మస్జిదుల్లో సమాధి చేయడం అనుమతించబడలేదని, ఇది షిర్క్ కు దారితీసే మార్గాలలో ఒకటని, మరియు అల్లాహ్ యూదులు మరియు క్రైస్తవులను దూషించిన పనులలో ఒకటని, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శపించినట్లు, సహీహైన్ లో ఆయెషా రదియల్లాహు అన్హా ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, నేను హెచ్చరించవలసిన అవసరం ఉందని అనిపించింది.
«لَعَنَ اللَّهُ الْيَهُودَ وَالنَّصَارَى، اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ».
యూదులపై మరియు క్రైస్తవులపై అల్లాహ్ యొక్క శాపం కురియుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా చేసుకున్నారు. సహీహ్ ముస్లింలో జుందబ్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«أَلَا وَإِنَّ مَنْ كَانَ قَبْلَكُمْ كَانُوا يَتَّخِذُونَ قُبُورَ أَنْبِيَائِهِمْ وَصَالِحِيهِمْ مَسَاجِدَ، أَلَا فَلَا تَتَّخِذُوا الْقُبُورَ مَسَاجِدَ؛ فَإِنِّي أَنْهَاكُمْ عَنْ ذَلِكَ».
“వినండి. మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల మరియు సజ్జనుల సమాధులను ఆరాధనా (సజ్దా) స్థలాలుగా చేసుకునేవారు. జాగ్రత్త! మీరు మాత్రం సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకోకండి. నేను దీని నుండి మిమ్మల్ని వారిస్తున్నాను”. ఇలాంటి హదీథులు చాలా ఉన్నాయి.
ప్రతి ప్రదేశంలో ఉన్న ముస్లిములు - ప్రభుత్వాలు మరియు ప్రజలు - అల్లాహ్ కు భయపడటం, ఆయన నిషేధించిన వాటి నుండి జాగ్రత్తపడటం మరియు తమ మృతులను మస్జిదుల వెలుపల ఖననం చేయటం తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు రదియల్లాహు అన్హుమ్ మస్జిదుల వెలుపల మృతులను ఖననం చేసేవారు. అలాగే వారి సత్ప్రవర్తనను అనుసరించే వారూను.
మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులైన అబూబకర్ మరియు ఉమర్ రదియల్లాహు అన్హుమా సమాధులు ఆయన మస్జిద్ లో ఉండటం, మస్జిద్ లలో మరణించినవారిని సమాధి చేయడానికి ఆధారం కాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో, ఆయెషా రదియల్లాహు అన్హా ఇంటిలో సమాధి చేయబడ్డారు. ఆ తరువాత ఆయన సహచరులు కూడా అక్కడే సమాధి చేయబడ్డారు. వలీద్ బిన్ అబ్దుల్ మలిక్ మస్జిద్ ను విస్తరించినప్పుడు, హిజ్రీ మొదటి శతాబ్దం చివరలో ఆ గదిని మస్జిద్ లో చేర్చారు. దీనిని అహ్లుల్ ఇల్మ్ (జ్ఞానులు) వ్యతిరేకించారు, కానీ ఆయన దానిని విస్తరణకు అడ్డంకి కాదని, మరియు విషయం స్పష్టంగా ఉందని భావించారు.
అందువల్ల ప్రతి ముస్లిముకు స్పష్టమవుతున్నది ఏమిటంటే: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన ఇద్దరు సహచరులు రదియల్లాహు అన్హుమా మస్జిద్ లో సమాధి చేయబడలేదు, విస్తారణ కారణంగా వారిని మస్జిద్ లో చేర్చబడటం మస్జిద్ లలో సమాధి చేయడానికి అనుమతిగా పరిగణించ బడదు; ఎందుకంటే ఖననం చేయబడినపుడు వారు మస్జిద్ లో లేరు, వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం స్వగృహంలో ఉన్నారు, మరియు ఖలీఫా వలీద్ చేసిన పని ఈ విషయంలో ఎవరికీ ప్రమాణంగా లెక్కించబడదు, ప్రమాణం కేవలం ఖుర్ఆన్ మరియు సున్నతులలో, మరియు సలఫ్ ఉల్ ఉమ్మా యొక్క ఏకాభిప్రాయంలో ఉంది, రదియల్లాహు అన్హుమ్, మరియు మేము వారిని అనుసరించేవారిలో ఉండాలని అల్లాహ్ మమ్మల్ని అనుగ్రహించుగాక.
దీనిని సలహా ఇచ్చి, బాధ్యత నుండి విముక్తి చెందడానికి 1415 హిజరీ 5వ నెల 14వ తేదీన లిఖించారు.
మరియు అల్లాహ్ మాత్రమే సౌభాగ్యమును కలిగించేవాడు. మరియు అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై, మరియు సన్మార్గంలో ఉన్నవారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
***
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
పన్నెండవ సందేశము: ఎవరికైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క షరీఅత్ నుండి తప్పుకోవడం అనేది అనుమతించబడుతుందని భావించే వారి అవిశ్వాసం, సత్యతిరస్కరము (కుఫ్ర్) మరియు అపమార్గం గురించిన ఆదేశము
స్థుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి, అల్లాహ్ మనందరికీ ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని వర్షింపజేయుగాక!
అమ్మాబాద్ : 1415 హిజ్రీ సంవత్సరం 5/6 తేదీతో, 5824 నంబర్ గల అష్ షర్ఖుల్ అవ్సత్ పత్రికలో ప్రచురించబడిన వ్యాసాన్ని నేను చూశాను, తనను అబ్దుల్ ఫతాహ్ అల్ హాయిక్ అని పిలుచుకున్న వ్యక్తి (తప్పు అర్థం) అనే శీర్షికతో దానిని రాశాడు.
ముఖ్యాంశం: ఇస్లాం ధర్మం నుండి స్పష్టంగా తెలిసిన విషయాన్ని, మరియు గ్రంథం మరియు ఏకాభిప్రాయం ద్వారా నిర్ధారించబడిన విషయాన్ని అతడు తిరస్కరించాడు - అదేమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వం ప్రజలందరి కొరకు అని. మరియు అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడు మరియు ఆయనకు విధేయత చూపడు, కానీ యూదుడిగానో లేదా క్రైస్తవుడిగానో ఉండి, అతడు సత్య ధర్మంలో ఉన్నాడని వాదించాడు. తరువాత విశ్వ ప్రభువైన పరమ పవిత్రుడు అల్లాహ్ యొక్క జ్ఞానంలో కుఫ్ర్ మరియు అవిధేయత చూపినవారిని శిక్షించడంలో ఆయనను అవమానించాడు, మరియు దానిని వ్యర్థంగా చూశాడు.
అతను షరీఅహ్ గ్రంథాలను వక్రీకరించాడు, వాటిని తగిన స్థానాల్లో ఉంచలేదు, తన ఇష్టానుసారం వాటిని వివరించాడు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సార్వత్రిక దౌత్యం గురించి మరియు ఆయన గురించి విని ఆయనను అనుసరించని వ్యక్తి సత్యతిరస్కారి (కాఫీర్) అని, మరియు ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అల్లాహ్ అంగీకరించడని స్పష్టంగా తెలియజేసే షరీఅహ్ ఆధారాలను, స్పష్టమైన గ్రంథాలను నిర్లక్ష్యం చేశాడు - అతడి మాటలతో అజ్ఞానులు మోసపోవడానికి. ఇలా చేయడం అనేది స్పష్టమైన అవిశ్వాసము (కుఫ్ర్), ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, ఇంకా పరమ పవిత్రుడైన అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తిరస్కారం అని ఇది చదివిన జ్ఞానవంతులు మరియు విశ్వాసపరులు తెలుసుకుంటారు.
పాలకుడిపై ఉన్న విధి, బాధ్యత: అతనిని కోర్టుకు పంపించటం; అతనికి పశ్చాత్తాపం చేయించటం, మరియు పవిత్ర ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు ఇవ్వటం.
పరమ పవిత్రుడు, మహోన్నతుడైన అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాధారణ సందేశాన్ని మరియు మానవులందరూ ఆయనను అనుసరించడం తప్పనిసరని స్పష్టంగా తెలియజేశాడు. మరియు ఇది ముస్లింలలో కొంచెం కూడా జ్ఞానం కలిగినవారికి తెలియని విషయమేమీ కాదు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُمۡ جَمِيعًا ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحۡيِۦ وَيُمِيتُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِ ٱلنَّبِيِّ ٱلۡأُمِّيِّ ٱلَّذِي يُؤۡمِنُ بِٱللَّهِ وَكَلِمَٰتِهِۦ وَٱتَّبِعُوهُ لَعَلَّكُمۡ تَهۡتَدُونَ158﴾
(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు; ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ ను మరియు ఆయన సందశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను అల్లాహ్ ను మరియు ఆయన సందేశాలను విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు! [అల్ అఅ్ రాఫ్:158] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَأُوحِيَ إِلَيَّ هَٰذَا ٱلۡقُرۡءَانُ لِأُنذِرَكُم بِهِۦ وَمَنۢ بَلَغَ...﴾
...మరియు మిమ్మల్ని మరియు ఇది (ఈ సందేశం) అందిన వారిని అందరినీ హెచ్చరించటానికి, ఈ ఖుర్ఆన్ నాపై అవతరింపజ జేయబడింది... [అల్ అన్'ఆమ్: 19] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُلۡ إِن كُنتُمۡ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِي يُحۡبِبۡكُمُ ٱللَّهُ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ31﴾
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. [ఆలి ఇమ్రాన్: 31] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَن يَبۡتَغِ غَيۡرَ ٱلۡإِسۡلَٰمِ دِينٗا فَلَن يُقۡبَلَ مِنۡهُ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ85﴾
మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు. [ఆలి ఇమ్రాన్: 85] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا كَآفَّةٗ لِّلنَّاسِ بَشِيرٗا وَنَذِيرٗا...﴾
మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము... [సబా: 28] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا رَحۡمَةٗ لِّلۡعَٰلَمِينَ107﴾
మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము. [అల్ అంబియా: 107] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَقُل لِّلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡأُمِّيِّـۧنَ ءَأَسۡلَمۡتُمۡۚ فَإِنۡ أَسۡلَمُواْ فَقَدِ ٱهۡتَدَواْۖ وَّإِن تَوَلَّوۡاْ فَإِنَّمَا عَلَيۡكَ ٱلۡبَلَٰغُۗ وَٱللَّهُ بَصِيرُۢ بِٱلۡعِبَادِ﴾
మరియు గ్రంథ ప్రజలతో మరియు నిరక్ష్యరాస్యులతో (చదువురాని అరబ్బులతో): "ఏమీ? మీరు కూడా విధేయులయ్యారా?" అని అడుగు. వారు విధేయులైతే సన్మార్గం పొందిన వారవుతారు. కాని ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే! మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు. [ఆలె ఇమ్రాన్: 20] అల్లాహ్ సెలవిచ్చాడు:
﴿تَبَارَكَ ٱلَّذِي نَزَّلَ ٱلۡفُرۡقَانَ عَلَىٰ عَبۡدِهِۦ لِيَكُونَ لِلۡعَٰلَمِينَ نَذِيرًا1﴾
సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు! [ఫుర్ఖాన్:1]
బుఖారి మరియు ముస్లిం: జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«أُعْطِيتُ خَمْسًا لَمْ يُعْطَهُنَّ أَحَدٌ قَبْلِي: نُصِرْتُ بِالرُّعْبِ مَسِيرَةَ شَهْرٍ، وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُورًا، فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلَاةُ، فَلْيُصَلّ، وَأُحِلَّتْ لِيَ الْمَغَانِمُ، وَلَمْ تُحَلَّ لِأَحَدٍ قَبْلِي، وَأُعْطِيتُ الشَّفَاعَةَ، وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً، وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً».
‘నాకు ఐదు విషయాలు ప్రత్యేకించి ప్రసాదించబడినాయి. అవి ఇంతకు ముందు గడిచిన ఏ ప్రవక్తకూ ఇవ్వబడలేదు: 1. ఒక నెల ప్రయాణ దూరమంత దూరం నుండే శత్రువులను భయాందోళనలకు గురిచేసి నాకు సహాయం చేయబడింది. 2. నా కోసం మొత్తం భూభాగం పరిశుభ్రమైనదిగా, నమాజుకు అనువుగా చేయబడింది, కాబట్టి నా సమాజానికి చెందిన వ్యక్తికి నమాజు సమయం అయినపుడు, అతడు నమాజు ఆచరించాలి. 3. యుద్ధ ప్రాప్తి సొమ్ము (గనీమత్) నాకు పూర్వం ఎవరికీ అది ధర్మసమ్మతం కానప్పటికీ, నా కోసం హలాల్ చేయబడింది. 4. నాకు సిఫారసు హక్కు ఇవ్వబడింది. 5. ప్రవక్తలు ఒక జాతి కోసం ప్రత్యేకించి పంపబడేవారు, కానీ నేను ప్రజలందరి కొరకు పంపబడ్డాను.’
మరియు ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం సమస్త మానవజాతికి వర్తించునని, మరియు ఇది మునుపటి అన్ని షరియత్ లను రద్దు చేసిందని స్పష్టంగా తెలియజేయబడింది. మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడో మరియు ఆయనకు విధేయత చూపడో, వాడు సత్యతిరస్కారి (కాఫిర్) మరియు అవిధేయుడు, శిక్షార్హుడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَمَن يَكۡفُرۡ بِهِۦ مِنَ ٱلۡأَحۡزَابِ فَٱلنَّارُ مَوۡعِدُهُۥ...﴾
మరియు దీనిని (ఖుర్ఆన్ ను) తిరస్కరించే తెగల వారి వాగ్దాన స్థలం నరకాగ్నియే! [హూద్: 17] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...فَلۡيَحۡذَرِ ٱلَّذِينَ يُخَالِفُونَ عَنۡ أَمۡرِهِۦٓ أَن تُصِيبَهُمۡ فِتۡنَةٌ أَوۡ يُصِيبَهُمۡ عَذَابٌ أَلِيمٌ﴾
...ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి. [నూర్: 63] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَن يَعۡصِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَتَعَدَّ حُدُودَهُۥ يُدۡخِلۡهُ نَارًا خَٰلِدٗا فِيهَا وَلَهُۥ عَذَابٞ مُّهِينٞ14﴾
మరియు ఎవడైతే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన నియమాలను ఉల్లంఘిస్తాడో! అలాంటి వాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది. [నిసా: 14] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَمَن يَتَبَدَّلِ ٱلۡكُفۡرَ بِٱلۡإِيمَٰنِ فَقَدۡ ضَلَّ سَوَآءَ ٱلسَّبِيلِ﴾
మరియు ఎవడైతే, సత్యతిరస్కారాన్ని, విశ్వాసానికి బదులుగా స్వీకరిస్తాడో! నిశ్చయంగా, వాడే సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడు. [అల్ బఖర: 108] ఈ అర్ధంలో ఆయతులు చాలా ఉన్నాయి.
పరమ పవిత్రుడైన అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు చూపవలసిన విధేయతను తన విధేయతతో అనుసంధానించి, ఇస్లాం తప్ప వేరే ధర్మాన్ని విశ్వసించినవాడు నష్టపోయినవాడని, అతని నుండి ఏ ఆచరణా మరియు ఏ పరిహారమూ ఆమోదించబడదని స్పష్టపరచాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ85﴾
{మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప మరే ఇతర ధర్మాన్నైనా అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపోయేవారిలో చేరుతాడు.} [ఆలి ఇమ్రాన్: 85] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿مَنْ يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّهَ...﴾
{ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే.} [నిసా: 80] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُلْ أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ فَإِنْ تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْهِ مَا حُمِّلَ وَعَلَيْكُمْ مَا حُمِّلْتُمْ وَإِنْ تُطِيعُوهُ تَهْتَدُوا...﴾
{వారితో అను: "అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. కాని ఒకవేళ మీరు మరలిపోతే, అతనిపై (ప్రవక్తపై) విధించబడిన దాని బాధ్యత అతనిది; మరియు మీపై విధించబడిన దాని బాధ్యత మీది. మీరు అతనిని (ప్రవక్తను) అనుసరిస్తే మార్గదర్శకత్వం (తప్పక) పొందుతారు.} [నూర్: 54] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا أُولَئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ 6﴾
{నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి విసిరి వేయబడతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు.} [అల్ బయ్యిన: 6]
ఇమామ్ ముస్లిం రహిమహుల్లాహ్ తన సహీహ్ గ్రంథములో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని నమోదు చేసినారు:
«وَالَّذِي نَفْسِي بِيَدِهِ؛ لَا يَسْمَعُ بِي أَحَدٌ مِنْ هَذِهِ الْأُمَّةِ، يَهُودِيٌّ وَلَا نَصْرَانِيٌّ، ثُمَّ يَمُوتُ وَلَمْ يُؤْمِنْ بِالَّذِي أُرْسِلْتُ بِهِ؛ إِلَّا كَانَ مِنْ أَهْلِ النَّارِ».
ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా, ఈ సమాజంలోని యూదుడైనా లేదా క్రైస్తవుడైనా, నా గురించి విని కూడా, నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే మరణిస్తే, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఆచరణల ద్వారా మరియు మాటల ద్వారా ఇస్లాం ధర్మంలో ప్రవేశించని వారి ధర్మం నిరర్ధకమైనదని స్పష్టంగా తెలియజేశారు. ఆయన యూదులు మరియు క్రైస్తవులతో పాటు ఇతర అవిశ్వాసులతో కూడా యుద్ధం చేశారు మరియు వారిలో కొందరు జిజియా చెల్లించినప్పుడు స్వీకరించారు; తద్వారా మిగతా వారికి (ముస్లిమేతరులకు) ఇస్లాం పిలుపు చేరకుండా అడ్డుకోవడం లేదా వారిని ఇస్లాంలో ప్రవేశించకుండా భయపెట్టడం లేదా ఆపడం లేదా చంపడం వంటి భయాలు లేకుండా ఇస్లాంలో ప్రవేశించడానికి సులభతరం చేయడం జరిగింది.
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖన, అబీ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మేము మస్జిద్ లో ఉన్నప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చి ఇలా పలికినారు:
«انْطَلِقُوا إِلَى يَهُودَ، فَخَرَجْنَا مَعَهُ حَتَّى جِئْنَا بَيْتَ الْمِدْرَاسِ، فَقَامَ النَّبِيُّ ﷺ، فَنَادَاهُمْ فَقَالَ :يَا مَعْشَرَ يَهُودَ، أَسْلِمُوا تَسْلَمُوا، فَقَالُوا: قَدْ بَلَّغْتَ يَا أَبَا الْقَاسِمِ، فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ ﷺ: ذَلِكَ أُرِيدُ، أَسْلِمُوا تَسْلَمُوا، فَقَالُوا: قَدْ بَلَّغْتَ يَا أَبَا الْقَاسِمِ، فَقَالَ لَهُمْ رَسُولُ اللَّهِ ﷺ: ذَلِكَ أُرِيدُ، ثُمَّ قَالَهَا الثَّالِثَةَ...».
«యూదుల వద్దకు వెళ్ళండి». అప్పుడు మేము ఆయనతో బయలుదేరి బైతుల్ మిద్-రాస్ వద్దకు చేరుకున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి వారిని పిలిచారు: «ఓ యూదుల సమూహమా! ఇస్లాం స్వీకరించండి, మీరు సురక్షితంగా ఉంటారు». వారు: "ఓ అబూ అల్ - ఖాసిం, మీరు సందేశాన్ని అందించారు" అని అన్నారు. దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం: «అదే నేను కోరుకుంటున్నాను, ఇస్లాం స్వీకరించండి, మీరు సురక్షితంగా ఉంటారు» అని అన్నారు. వారు మళ్ళీ: "ఓ అబూ అల్ - ఖాసిం, మీరు సందేశాన్ని అందించారు" అని అన్నారు. దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం: «అదే నేను కోరుకుంటున్నాను» అని మూడోసారి అన్నారు. హదీథు
ముఖ్యమైనది: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యూదుల మిద్-రాస్ లోని ధార్మికుల ఇళ్ళ వద్దకు వెళ్లి, వారిని ఇస్లాం స్వీకరించమని ఆహ్వానించారు మరియు వారితో ఇలా అన్నారు: ‘ఇస్లాం స్వీకరించండి, మీరు రక్షించబడతారు’ అని పలుమార్లు పునరావృతం చేశారు.
అలాగే: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన లేఖను హిర్కల్ కు పంపి, అతనిని ఇస్లాం వైపుకు ఆహ్వానించారు, మరియు అతను నిరాకరిస్తే, అతని నిరాకరణ కారణంగా ఇస్లాం స్వీకరించని అతడి ప్రజల పాపం అతనిపై ఉంటుందని తెలియజేశారు. బుఖారీ మరియు ముస్లిం తమ సహీహ్ లలో నమోదు చేశారు, హిర్కల్ ప్రవక్త వ్రాసిన లేఖను తెప్పించి, దానిని చదివాడు, ఆ లేఖలో ఈ సందేశం ఉంది:
«بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ، مِنْ مُحَمَّدٍ رَسُولِ اللَّهِ إِلَى هِرَقْلَ عَظِيمِ الرُّومِ، سَلَامٌ عَلَى مَنِ اتَّبَعَ الْهُدَى، أَمَّا بَعْدُ: فَإِنِّي أَدْعُوكَ بِدِعَايَةِ الْإِسْلَامِ، أَسْلِمْ تَسْلَمْ، وَأَسْلِمْ يُؤْتِكَ اللَّهُ أَجْرَكَ مَرَّتَيْنِ، فَإِنْ تَوَلَّيْتَ، فَإِنَّ عَلَيْكَ إِثْمَ الْأَرِيسِيِّينَ وَ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం! దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తరుపు నుంచి ‘రోమ్ చక్రవర్తి హిర్కల్’ కు! అస్సాలాము అలా మనిత్తబఅల్ హుదా (సన్మార్గంపై ఉన్నవారిపై శాంతి కురుయుగాక)! వ్రాయునది ఏమనగా-నిశ్చయంగా నేను మిమ్మల్ని ఇస్లాం వైపుకు ఆహ్వానిస్తున్నాను, ఇస్లాం స్వీకరించండి శాంతిని పొందుతారు, అల్లాహ్ మీకు రెండింతల పుణ్యాలను ప్రసాదిస్తాడు, ఒకవేళ మీరు నిరాకరిస్తే మీ ప్రజల పాపం కూడా మీపై ఉంటుంది,
﴿يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ تَعَالَوۡاْ إِلَىٰ كَلِمَةٖ سَوَآءِۭ بَيۡنَنَا وَبَيۡنَكُمۡ أَلَّا نَعۡبُدَ إِلَّا ٱللَّهَ وَلَا نُشۡرِكَ بِهِۦ شَيۡـٔٗا وَلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا أَرۡبَابٗا مِّن دُونِ ٱللَّهِۚ فَإِن تَوَلَّوۡاْ فَقُولُواْ ٱشۡهَدُواْ بِأَنَّا مُسۡلِمُونَ64﴾
ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు." వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు. [ఆలి ఇమ్రాన్: 64]
తరువాత వారు తిరస్కరించి ఇస్లాంలో ప్రవేశించడానికి నిరాకరించినప్పుడు; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహాబాలు రదియల్లాహు అన్హుమ్ వారితో ధర్మపోరాటం జరిపారు, మరియు వారిపై జిజియా విధించారు.
అల్లాహ్ ముస్లిములను ప్రతి రోజు, ప్రతి నమాజులో, ప్రతి రకాతులో సంపూర్ణంగా అంగీకరించబడిన సన్మార్గమును, అంటే ఇస్లాం వైపు మార్గదర్శకం కొరకు వేడుకోమని అల్లాహ్ ఆదేశించాడు. ఇది వారి మార్గభ్రష్టతను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మముతో రద్దు చేయబడిన అసత్య ధర్మముపై ఉన్నారని నిర్ధారించడానికి. ఇంకా, ముస్లింలు, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురైన యూదులు మరియు వారి వంటి వారు, వారు తాము తప్పుడు మార్గంలో ఉన్నారని తెలిసినా దానిపై పట్టుబడి కొనసాగుతున్న మార్గానికి దూరంగా ఉంచమని వేడుకుంటారు, మార్గభ్రష్టులైన వారి మార్గం నుండి అతనిని దూరంగా ఉంచు, వారు సరియైన ఙ్ఞానము లేకుండానే ఆచరిస్తూ, తాము సత్యమార్గంలో ఉన్నామని భావిస్తారు, కానీ వారు మార్గభ్రష్టులైన మార్గంలో ఉన్నారు. వారు క్రైస్తవులు మరియు ఇతర జాతుల వారు, వారు మార్గభ్రష్టత మరియు అజ్ఞానంతో ఆచరిస్తున్నారు. ముస్లిం ఈ విషయాలన్నింటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి: ఇస్లాం తప్ప మిగతా అన్ని ధర్మాలు సత్యమైనవి కావు, ఇస్లాం తప్ప మరే విధంగా అల్లాహ్ను ఆరాధించేవారైనా, వారు మార్గభ్రష్టులు, తప్పుదారి పట్టినవారు, మరియు దీనిని నమ్మని వారు ముస్లింలలో ఉండరు. ఈ విషయానికి సంబంధించి ఖుర్ఆన్ మరియు సున్నతులలో అనేక ఆధారాలు ఉన్నాయి.
కాబట్టి, అబ్దుల్ ఫతాహ్ అనే ఈ వ్యాసకర్త తన తప్పును గుర్తించి, పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ, పశ్చాత్తాప పడి, నిజమైన తౌబా చేయాలి. మరియు ఎవరైతే అల్లాహ్ యందు నిజమైన పశ్చాత్తాపంతో మరలుతాడో, అల్లాహ్ అతనిపై కరుణ చూపుతాడు; అల్లాహ్ సుభానహు వ తాలా యొక్క వాక్కు:
﴿...وَتُوبُوٓاْ إِلَى ٱللَّهِ جَمِيعًا أَيُّهَ ٱلۡمُؤۡمِنُونَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ﴾
మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు! [నూర్:31] మరియు పరమ పరిశుద్ధుడైన ఆయన వాక్కు:
﴿وَٱلَّذِينَ لَا يَدۡعُونَ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ وَلَا يَقۡتُلُونَ ٱلنَّفۡسَ ٱلَّتِي حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلۡحَقِّ وَلَا يَزۡنُونَۚ وَمَن يَفۡعَلۡ ذَٰلِكَ يَلۡقَ أَثَامٗا68 يُضَٰعَفۡ لَهُ ٱلۡعَذَابُ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَيَخۡلُدۡ فِيهِۦ مُهَانًا69 إِلَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ عَمَلٗا صَٰلِحٗا فَأُوْلَٰٓئِكَ يُبَدِّلُ ٱللَّهُ سَيِّـَٔاتِهِمۡ حَسَنَٰتٖۗ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمٗا70﴾
మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.
పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు69.
కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. [ఫుర్ఖాన్: 68-70] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«الإِسْلَامُ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ، وَالتَّوبَةُ تَهْدِمُ مَا كَانَ قَبْلَهَا».
ఇస్లాం మునుపటి పాపాలను తుడిచివేస్తుంది, మరియు తౌబా వెనుకటి పాపాలను తుడిచివేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«التَّائِبُ مِنَ الذَّنْبَ كَمَنْ لَا ذَنْبَ لَهُ».
పాపం నుండి పశ్చాత్తాపం పడినవాడు, పాపం చేయనివాడితో సమానం.
ఈ అర్ధంలో ఆయతులు మరియు హదీథులు చాలా ఉన్నాయి.
మరియు నేను అల్లాహ్ తో ఆయన మాకు సత్యమును సత్యముగా చూపించి, దాన్ని అనుసరించే భాగ్యమును కలిగించమని మరియు మాకు అసత్యమును అసత్యముగా చూపించి, దాని నుండి దూరంగా ఉండే భాగ్యమును కలిగించమని మరియు మాతో, వసీయతు వ్యాసం రచయిత అబ్దుల్ ఫతాహ్ తో మరియు ఇతర ముస్లింలందరితో నిజమైన తౌబా చేయించమని మరియు మమ్మల్ని, ముస్లింలందరిని విపత్తుల నుండి, కామక్రోధాల నుండి, షైతాన్ యొక్క ప్రలోభాల నుండి రక్షించమని అర్ధిస్తున్నాను. నిశ్చయంగా ఆయన మాత్రమే దీని కొరకు కార్యసాధకుడు మరియు దాని సామర్ధ్యం కలవాడు.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై, ప్రళయదినం వరకు చిత్తశుద్ధితో ఆయనను అనుసరించేవారిపై శుభాలను, శాంతిని కురిపించుగాక. (ఆమీన్)
***
విషయసూచిక
సరియైన విశ్వాసం (అఖీదహ్) మరియు దానికి విరుద్ధమైనవి. 2
మొదటి మూలవిశ్వాసము: మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం: 7
రెండవ మూలం: దైవదూతలపై విశ్వాసం. 25
మూడవ మూలం: దైవగ్రంధములను విశ్వసించడం, ఇది కూడా రెండు విషయములను కలిగి ఉన్నది: 27
నాల్గవ మూలం: దైవ ప్రవక్తలపై విశ్వాసం. 30
ఐదవ మూలం: అంతిమ దినమును విశ్వాసించడం. 32
ఆరవ మూలం: విధివ్రాత పట్ల విశ్వాసం. 33
సరియైన విశ్వాసానికి (సహీహ్ అఖీదహ్ కు) విరుద్ధమైన నమ్మకాలు: 40
రెండవ సందేశం: ప్రవక్త ముహమ్మద్ ﷺ ను సాయంకోరటం (ఇస్తిగాథా చేయడం) విషయంలో ఆదేశం: 51
మూడవ సందేశము: 73
జిన్నులు మరియు షైతానులతో సహాయం కోరటం మరియు వారికి మొక్కుబడులు చెల్లించటంపై ధర్మాజ్ఞ. 73
నాలుగవ సందేశము: 100
నూతన ఆవిష్కరణ, కొత్తపోకడ మరియు షిర్కు (అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించటం) లతో కూడిన ఆరాధనల గురించి షరియహ్ ఆదేశము: 100
ఐదవ సందేశము: 132
మహాప్రవక్త జన్మదినోత్సవం మరియు ఇతర జన్మదినముల ఉత్సవాలకు సంబంధించిన ఆదేశము 132
ఆరవ సందేశము: 146
ఇస్రా - మేరాజ్ రాత్రిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుపుకోవటం గురించిన ఆదేశము 146
ఏడవ సందేశము: 155
షాబాన్ నెల 15వ రాత్రిని ఉత్సవంగా జరుపుకోవడంపై ధార్మిక ఆదేశము 155
ఎనిమిదవ సందేశము: 173
తప్పుడు వీలునామా (వసీయత్) గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక 173
షేక్ అహ్మద్, ఖాదిమ్ అల్ హరమ్ అల్ నబవీ అష్ షరీఫ్ 173
తొమ్మిదవ సందేశము: మంత్రజాలం, జ్యోతిష్కం మరియు వాటికి సంబంధించిన వాటి ఆదేశము 193
పదవ సందేశము: సమాధులపై మస్జిదులు నిర్మించకూడదని హెచ్చరించడం. 214
పదకొండవ సందేశము: మస్జిదులలో మృతులను సమాధి చేయడం 221
పన్నెండవ సందేశము: ఎవరికైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క షరీఅత్ నుండి తప్పుకోవడం అనేది అనుమతించబడుతుందని భావించే వారి అవిశ్వాసం, సత్యతిరస్కరము (కుఫ్ర్) మరియు అపమార్గం గురించిన ఆదేశము 225
***
(దీనిని బుఖారీ (2856), ముస్లిం (30) నమోదు చేసినారు).
దీనిని అల్-లాల్కాయ్ "షర్హె ఉసూలె ఈతిఖాద్" (735) లో, మరియు ఇబ్నె అబ్దుల్ బర్ "జామిఉల్-ఇల్మి వ ఫద్లిహి" (1801) లో నమోదు చేసినారు, కానీ "ఆయాత్ అల్-సిఫాత్" బదులు "అహదీథ్" పదాలతో, మరియు ఆయన పదాలు: "ఈ హదీథులను వచ్చినట్లుగా చెప్పండి మరియు వాటిపై వాదించవద్దు."
దీన్ని బైహఖీ అస్మా వ సిఫాత్ లో (865) ఉల్లేఖించారు. మరియు ఇబ్నె తైమీయ్యా హమవీయ్యాలో (పుట: 269) దీని ఇస్నాదును ప్రామాణికమైనదిగా తెలియపరచారు. మరియు జహబీ అల్ అర్ద్ లో (2/223) దీని ఉల్లేఖకులు విశ్వసనీయమైన ఇమాములు అని చెప్పారు.
దీనిని అల్-లాల్కాయ్ “షర్హు ఉసూలి ఈ'తీఖాద” (930) మరియు అల్-బైహఖీ “అల్-అస్మా వ స్సిఫాత్” (955)లో నమోదు చేసినారు.
దీన్ని అల్-లాల్కాయ్ షర్హె ఉసులె ఈతిఖాద్ లో (665), మరియు బైహఖీ అల్-అస్మా వ సిఫాత్ లో (868) నమోదు చేసినారు.
దీనిని అల్-లాల్కాయ్ షర్హె ఉసులె ఈతిఖాద్ లో (664), అబూ నుఐమ్ హిల్యత్ అల్-అవ్లియా లో (325/6), మరియు అల్-బైహఖీ అల్-అస్మా వ స్సిఫాత్ లో (867) నమోదు చేసినారు.
దీన్ని అల్-ముజక్కీ అల్-ముజక్కియాత్ లో (29), ఇబ్నె బత్తా అల్-ఇబానాలో (120), మరియు అల్-లాల్కాయ్ షర్హె ఉసూలె ఈతిఖాద్ లో (663) నమోదు చేసినారు.
దారిమీ 'అర్రద్దు అలల్-జహ్మియా' (67) లో, బైహఖీ 'అల్ అస్మా వస్సిఫాత్' (903) లో నమోదు చేసినారు.
దీనిని దహబీ ఉలులో (464) నమోదు చేసినారు. మరియు అల్బానీ ముక్తసరుల్ ఉలులో (పుట: 184) ఇది సనద్ ప్రామాణికమైనదని, దీని ఉల్లేఖకులు విశ్వసనీయమైనవారని తెలిపారు.
తఫ్సీర్ ఇబ్నె కథీర్ (3/426, 427).
దీన్ని బుఖారీ (22) నమోదు చేసినారు, అబూ సయీద్ అల్-ఖుద్రీ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖన నుండి.
దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య 2996, ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన.
దీనిని బుఖారీ (3651), ముస్లిం (2533) నమోదు చేసినారు, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖన నుండి.
దీనిని ముస్లిం (1920), సౌబాన్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖన నుండి నమోదు చేసినారు.
దీన్ని ఇబ్నె మాజ (3952), సౌబాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన నుండి నమోదు చేసినారు మరియు ఇబ్నె హిబ్బాన్ (6714), హాకిమ్ (8653) దీనిని ప్రామాణికమైనదిగా తెలిపినారు.
దీనిని తిర్మిథీ (2641) హదీథు సంఖ్యలో అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు యొక్క హదీథు నుండి ఉల్లేఖించారు. మరియు ఫయ్దుల్ ఖదీర్ 5/347 లో మనావీ గారు "ఇందులో అబ్దుర్రహ్మాన్ బిన్ జియాద్ అల్ అఫ్రికీ ఉన్నారు, దహబీ గారు: దీన్ని బలహీనమైన హదీథుగా పేర్కొన్నారు" అని అన్నారు. మరియు అల్బానీ సహీహుల్ జామీలో (5343) దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
ఈ వసీయత్ రిసాలా నంబరు 17 తో 1402వ హిజ్రీ సంవత్సరంలో రియాసతుల్ ఆమ్మ లి ఇదారాతిల్ బుహూసిల్ ఇల్మీయ్య వల్ ఇఫ్తా వద్ దావా వల్ ఇర్షాద్ ద్వారా ప్రచురించబడినది.
దీనిని ముస్లిం (8) నమోదు చేసినారు.