نُبذَةٌ فِي العَقِيدَةِ الإِسْلَامِيَّة (شَرْحُ أُصُولِ الإِيمَانِ)
ఇస్లామీయ విశ్వాసం యొక్క సారాంశము
بِقَلَم فَضِيلَة الشَّيخ العَلَّامَة
مُحَمَّدِ بْنِ صَالِحٍ العُثَيمِين
غَفَرَ اللَّهُ لَهُ وَلِوَالِدَيْهِ وَلِلْمُسْلِمِين
రచన: ఫజీలతుష్షేక్ అల్లామహ్
ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉథైమీన్
అల్లాహ్ ఆయనను, ఆయన తల్లిదండ్రులను, ముస్లింలను మన్నించుగాక!
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
ఇస్లామీయ విశ్వాసం యొక్క సారాంశము
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
ముందుమాట
నిశ్చయంగా సర్వ ప్రశంసలు, కృతజ్ఞతలు అల్లాహ్ కే శోభిస్తాయి, మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనతోనే సహాయం అర్ధిస్తున్నాము, ఆయనతోనే మేము మన్నింపు వేడుకుంటున్నాము మరియు ఆయన వైపే మేము పశ్చాత్తాపముతో మరలుతున్నాము. మేము మా హృదయాల చెడు నుండి, మా చెడు కర్మల నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము. అల్లాహ్ మార్గదర్శకం ప్రసాదించినవాడిని మార్గభ్రష్టుడిగా మార్చేవాడు ఎవడూ లేడు, మరియు ఆయన మార్గభ్రష్టుడిగా మార్చినవాడికి సన్మార్గం చూపేవాడు ఎవడూ లేడు. అల్లాహ్ తప్ప మరే నిజ ఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరని నేను సాక్ష్యమిస్తునాను. మరియు ముహమ్మద్ ఆయన దాసుడని, ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం పలుకుతున్నాను. అల్లాహ్ ఆయనపై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై మరియు ఆయనను అనుసరించే సజ్జనులపై శుభాలను, శాంతిని కురిపించుగాక!
అమ్మా బాద్ : నిశ్చయంగా తౌహీద్ యొక్క జ్ఞానం అన్ని శాస్త్రాలలో అత్యంత మహిమాన్వితమైన మరియు అత్యంత ఉన్నత స్థానము గల, అత్యంత ఆవశ్యకమైన జ్ఞానము. ఎందుకంటే దానితో అల్లాహ్ యొక్క, ఆయన గుణగణాల యొక్క, ఆయన దాసులపై ఉన్న ఆయన హక్కుల యొక్క జ్ఞానోదయం అవుతుంది. మరియు ఎందుకంటే అది అల్లాహ్ కు చేరుకునే మార్గం యొక్క మరియు ఆయన ధర్మశాసనాల మూలాల యొక్క తాళం చెవి.
అందుకనే దైవప్రవక్తలందరు దాని వైపు ఆహ్వానించటంలో ఏకమయ్యారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِيٓ إِلَيۡهِ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعۡبُدُونِ25﴾
మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, ఈ వహీతో పంపాము: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." [అల్ అంబియా :25]
అల్లాహ్ స్వయంగా తన ఏకదైవత్వము గురించి సాక్ష్యం పలికాడు. మరియు ఆయన దూతలు, జ్ఞానవంతులు దానిని ఆయనకు ప్రత్యేకిస్తూ సాక్ష్యం పలికారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.
﴿شَهِدَ ٱللَّهُ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا هُوَ وَٱلۡمَلَٰٓئِكَةُ وَأُوْلُواْ ٱلۡعِلۡمِ قَآئِمَۢا بِٱلۡقِسۡطِۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ 18﴾
నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, స్వయంగా అల్లాహ్, ఆయన దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. [ఆలె ఇమ్రాన్ :18]
మరియు తౌహీదు యొక్క ఈ ఉన్నత స్థానము వలన ప్రతీ ముస్లింపై దీనిని నేర్చుకోవటం, ఇతరులకు నేర్పించటం, దీనిపై దీర్ఘాలోచన చేయటం, విశ్వసించటం అనేది తన ధర్మమును సురక్షణాత్మక, సంత్రుప్తికర, స్వీకృతమైన మూలాలపై నిర్మించటానికి తప్పనిసరి అవుతుంది. దీని ద్వారా అతడు దాని ఫలాలను, ఫలితాలను ఆస్వాదిస్తాడు.
మరియు అల్లాహ్ యే భాగ్యమును కలిగించేవాడు.
రచయిత
ఇస్లామీయ ధర్మము
ఇస్లామీయ ధర్మము: అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చి పంపించిన ధర్మం ఇది. మరియు అల్లాహ్ దాని ద్వారా పూర్వ ధర్మాలను సమాప్తము చేశాడు. మరియు దానిని తన దాసుల కొరకు పరిపూర్ణం చేశాడు. మరియు దాని ద్వారా వారిపై తన అనుగ్రహమును పరిపూర్ణం చేశాడు. మరియు దానిని వారి కొరకు ధర్మంగా ఇష్టపడ్డాడు. కావున ఆయన ఎవరి నుండి కూడా దానిని తప్ప వేరే ధర్మమును ఆమోదించడు. అల్లాహ్ ప్రకటన:
﴿مَّا كَانَ مُحَمَّدٌ أَبَآ أَحَدٖ مِّن رِّجَالِكُمۡ وَلَٰكِن رَّسُولَ ٱللَّهِ وَخَاتَمَ ٱلنَّبِيِّـۧنَۗ وَكَانَ ٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمٗا 40﴾
(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషులలో ఎవ్వరికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చిట్టచివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి దానిని ఎరిగిన వాడు. {అల్-అహ్’జాబ్ 33:40 }
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗاۚ...﴾
ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. {అల్ మాయిదా:3}
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿إِنَّ ٱلدِّينَ عِندَ ٱللَّهِ ٱلۡإِسۡلَٰمُ...﴾
నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మము కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే. [ఆలె ఇమ్రాన్ :19]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَمَن يَبۡتَغِ غَيۡرَ ٱلۡإِسۡلَٰمِ دِينٗا فَلَن يُقۡبَلَ مِنۡهُ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ85﴾
మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఏ ఇతర ధర్మాన్ని అయినా అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరతాడు. [ఆలి ఇమ్రాన్ :85]
మహోన్నతుడైన అల్లాహ్ ప్రజలందరిపై దీనినే అల్లాహ్ కొరకు ధర్మంగా ఎంచుకోవటాన్ని అనివార్యం చేశాడు. కావున ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశిస్తూ ఇలా పలికాడు:
﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُمۡ جَمِيعًا ٱلَّذِي لَهُۥ مُلۡكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحۡيِۦ وَيُمِيتُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِ ٱلنَّبِيِّ ٱلۡأُمِّيِّ ٱلَّذِي يُؤۡمِنُ بِٱللَّهِ وَكَلِمَٰتِهِۦ وَٱتَّبِعُوهُ لَعَلَّكُمۡ تَهۡتَدُونَ 158﴾
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "ఓ మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను. భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు; ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు. కావున అల్లాహ్ ను మరియు ఆయన సందశహరుడు నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను విశ్వసించండి. అతను (ప్రవక్త) అల్లాహ్ ను మరియు అల్లాహ్ వాక్కును విశ్వసిస్తాడు. అతనినే అనుసరించండి, అప్పుడే మీరు మార్గదర్శకత్వం పొందుతారు! {అల్ ఆరాఫ్ : 158}
సహీహ్ ముస్లింలో అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
«وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَا يَسْمَعُ بِي أَحَدٌ مِنْ هَذِهِ الْأُمَّةِ يَهُودِيٌّ وَلَا نَصْرَانِيٌّ، ثُمَّ يَمُوتُ وَلَمْ يُؤْمِنْ بِالَّذِي أُرْسِلْتُ بِهِ إِلَّا كَانَ مِنْ أَصْحَابِ النَّارِ».
“ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”1
దాని (ఇస్లాం ధర్మం) పట్ల విశ్వాసం : అంటే ఆయన తీసుకుని వచ్చిన ధర్మమును దృవీకరించటంతో పాటు దానిని అంగీకరించడం మరియు దానికి కట్టుబడి ఉండటం. కేవలం దృవీకరిస్తే సరిపోదు. అందుకనే అబూతాలిబ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దానిని దృవీకరించి, అది ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం అని సాక్ష్యం కూడా పలికినా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించినవారు కాలేకపోయారు.
ఇస్లాం ధర్మం పూర్వ ధర్మాలు పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రయోజనములన్నింటిని పరిగణలోకి తీసుకున్నది. అది ప్రతీ కాలము, ప్రదేశము మరియు జాతి కొరకు ప్రయోజనకరమవటం వలన ప్రత్యేకత కలిగి ఉన్నది. మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్తను ఉద్దేశించి ఇలా సెలవిచ్చాడు :
﴿وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِ...﴾
మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది... [అల్ మాయిదా : 48]
ఇస్లాం ధర్మము ప్రతి యుగానికి, ప్రతిచోటా మరియు ప్రతి ఉమ్మత్ కు చెల్లుబాటు అవుతుంది అంటే ఈ ధర్మముతో బలమైన సంబంధం ఏ కాలానికి, ప్రదేశానికి మరియు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా లేదు, కానీ ఇందులో వారి అభివృద్ధి మరియు ప్రయోజనం ఉంది. దీని అర్థం, కొందరు కోరుకున్నట్లుగా, అది ప్రతి కాలానికి, స్థలానికి మరియు ప్రజలకు లోబడి ఉంటుందని కాదు.
ఇస్లామీయ ధర్మము: ఇది సత్యమైన ధర్మము, దీనిని గట్టిగా పట్టుకున్నవారికి విజయం మరియు ఇతరులపైన ఆధిపత్యం లభిస్తుందని అల్లాహ్ వాగ్దానం చేశాడు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿هُوَ ٱلَّذِيٓ أَرۡسَلَ رَسُولَهُۥ بِٱلۡهُدَىٰ وَدِينِ ٱلۡحَقِّ لِيُظۡهِرَهُۥ عَلَى ٱلدِّينِ كُلِّهِۦ وَلَوۡ كَرِهَ ٱلۡمُشۡرِكُونَ 9﴾
ఆయనే, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్ని ఇచ్చి పంపి, దానిని సకల ధర్మాలపై ఆధిక్యత వహించే ధర్మంగా చేశాడు - అది బహుదైవారాధకులకు ఎంత అసహ్యకరమైనా! [సఫ్ 61:9]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَعَدَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَيَسۡتَخۡلِفَنَّهُمۡ فِي ٱلۡأَرۡضِ كَمَا ٱسۡتَخۡلَفَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ وَلَيُمَكِّنَنَّ لَهُمۡ دِينَهُمُ ٱلَّذِي ٱرۡتَضَىٰ لَهُمۡ وَلَيُبَدِّلَنَّهُم مِّنۢ بَعۡدِ خَوۡفِهِمۡ أَمۡنٗاۚ يَعۡبُدُونَنِي لَا يُشۡرِكُونَ بِي شَيۡـٔٗاۚ وَمَن كَفَرَ بَعۡدَ ذَٰلِكَ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ 55﴾
మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో: వారికి పూర్వం వారిని భూమికి ఉత్తరాధికారులుగా చేసినట్లు, వారిని కూడా ఉత్తరాధికారులుగా చేస్తానని; మరియు వారి కొరకు తాను సమ్మతించిన ధర్మాన్ని (ఇస్లాంను) స్థిరపరుస్తానని; మరియు వారి పూర్వపు భయస్థితిని వారి కొరకు శాంతిస్థితిగా మార్చుతానని, అల్లాహ్ వాగ్దానం చేశాడు. (ఇదంతా) వారు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించాలని మరియు నాకు ఎవరినీ సాటిగా (భాగస్వాములగా) కల్పించరాదని, మరియు దీని తరువాత కూడా ఎవరైనా సత్యతిరస్కారానికి పాల్పబడితే అలాంటి వారు, వారే అవిధేయులు. [అన్-నూర్ 24:55]
ఇస్లాం ధర్మం అనేది అఖీదా (విశ్వాసం) మరియు షరీఅహ్ యొక్క పేరు. ఇది అఖీదా మరియు షరీఅహ్ రెండింటిలోనూ సంపూర్ణమైనది:
1 - అది మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఏకదైవత్వము గురించి ఆదేశిస్తుంది మరియు షిర్క్ (బహుదైవారాధనల) నుండి వారిస్తుంది.
2 - సత్యం పలుకుట గురించి ఆదేశిస్తుంది మరియు అసత్యం పలుకుట నుండి నివారిస్తుంది.
3 - ఇది న్యాయం చేయమని ఆదేశిస్తుంది మరియు అన్యాయం చేయవద్దని నిరోధిస్తుంది. న్యాయం అంటే ఒకే రకమైన వాటి మధ్య సమానత్వాన్ని చూపడం మరియు విభిన్నమైన వాటి మధ్య వ్యత్యాసం చూపడం. కొందరు చెప్పే విధంగా, 'ఇస్లాం ధర్మం సమానత్వ ధర్మం' అని చెప్పి, సంపూర్ణ సమానత్వాన్ని కోరడం న్యాయం కాదు. ఎందుకంటే, విభిన్నమైన వాటి మధ్య సమానత్వం చూపడం అన్యాయం, ఇది ఇస్లాంలో లేదు మరియు అలా చేసేవారు మెచ్చుకోబడరు.
4 - ఇది నిజాయితీగా ఉండమని ఆదేశిస్తుంది మరియు ద్రోహం, వంచన, మోసం చేయవద్దని నిరోధిస్తుంది.
5 - ఇది వాగ్దానాలను నెరవేర్చమని ఆదేశిస్తుంది మరియు వాగ్దానభంగం, మాట తప్పడం వంటి వాటిని నిరోధిస్తుంది.
6 - ఇది తల్లిదండ్రులను గౌరవించమని ఆదేశిస్తుంది మరియు వారికి అవిధేయత చూపడాన్ని, అవమానించడాన్ని నిరోధిస్తుంది.
7 - ఇది బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించమని ఆదేశిస్తుంది మరియు బంధాలు తెంచుకోవడాన్ని నిరోధిస్తుంది.
8 - ఇరుగుపొరుగు వారితో మంచిగా మెలగమని ఆదేశిస్తుంది మరియు వారితో చెడు ప్రవర్తన నుండి వారిస్తుంది.
సాధారణంగా చెప్పాలంటే: ఇస్లాం ప్రతి మంచి గుణాన్ని అలవర్చుకోమని ఆదేశిస్తుంది మరియు ప్రతి చెడ్డ గుణాన్ని దూరంగా ఉంచమని నిరోధిస్తుంది. అలాగే, ఇది ప్రతి మంచి పని చేయమని ఆదేశిస్తుంది మరియు ప్రతి చెడ్డ పని నుండి దూరంగా ఉండమని ఆదేశిస్తుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన
﴿إِنَّ ٱللَّهَ يَأۡمُرُ بِٱلۡعَدۡلِ وَٱلۡإِحۡسَٰنِ وَإِيتَآيِٕ ذِي ٱلۡقُرۡبَىٰ وَيَنۡهَىٰ عَنِ ٱلۡفَحۡشَآءِ وَٱلۡمُنكَرِ وَٱلۡبَغۡيِۚ يَعِظُكُمۡ لَعَلَّكُمۡ تَذَكَّرُونَ 90﴾
నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని. [అన్-నహ్ల్ 16:90]
ఇస్లాం మూలస్థంభాలు
ఇస్లాం మూలస్థంభాలు : వేటిపై ఇస్లాం నిర్మించబడి ఉన్నదో, అవి ఐదు: అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:”
«بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسَةٍ: عَلَى أَنْ يُوَحِّدَ اللَّه - وَفِي رِوَايَةٍ عَلَى خَمْسٍ -: شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَصِيَامِ رَمَضَانَ، وَالْحَجِّ».
ఇస్లాం ఐదింటిపై నిర్మితమై ఉన్నది: అల్లాహ్‌ను ఏకైక ఆరాధ్యునిగా ఒప్పుకొనుటపై — మరియు మరొక వర్ణనలో: ‘ఐదు విషయాలపై’ —: అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు లేడని, మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు సందేశహరుడని సాక్ష్యమివ్వటం, నమాజు స్థాపించటం, జకాత్ ఇవ్వటం, రమదాన్ ఉపవాసములు ఉండటం, మరియు హజ్. ఒక వ్యక్తి “హజ్జ్, అలాగే రమదాన్ మాసపు ఉపవాసాలా?” అని ప్రశ్నించాడు. దానికి ఆయన ఇలా అన్నాడు:
«لَا، صِيَامُ رَمَضَانَ، وَالْحَجُّ».
«లేదు, రమదాను మాసపు ఉపవాసాలు ఉండటం, హజ్ యాత్ర చేయటం» ఇలాగే నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా విన్నాను2.
(1) అల్లాహ్ తప్ప నిజమైన దైవం లేడని, ముహమ్మద్ ఆయన దాసులు మరియు ఆయన ప్రవక్త అని సాక్ష్యం చెప్పడం అంటే: ఈ సాక్ష్యంపై సంపూర్ణమైన మరియు ఖచ్చితమైన విశ్వాసం కలిగి ఉండటం మరియు ఈ సాక్ష్యాన్ని నాలుకతో పలకటం, అంటే, సాక్షి యొక్క సాక్ష్యం ప్రత్యక్షంగా తాను చూసినట్లుగా విశ్వాసం మరియు నమ్మకం కలిగి ఉండాలి. మరియు ఈ సాక్ష్యం ఒకటి కంటే ఎక్కువ వచనాలలో ఉన్నప్పటికీ, ఇది ఒకే మూలస్థంభము.
ఇంకా: ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తరపున సందేశాన్ని అందించేవాడు. కాబట్టి, ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం 'అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు' అనే సాక్ష్యాన్ని పూర్తి చేస్తుంది.
ఇలా ఎందుకంటే ఈ రెండు సాక్ష్యాలు కర్మలు సరిఅవటానికి, కర్మల ఆమోదానికి ఆధారము, ఎందుకంటే అల్లాహ్ పట్ల చిత్తశుద్ధి లేకుండా, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణ లేకుండా ఏ కార్యమూ సరైనది కాదు మరియు ఆమోదించబడదు.
కావున అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో మాత్రమే 'లా యిలాహ ఇల్లల్లాహ్' సాక్ష్యము పలకటం నిజమవుతుంది మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణ ద్వారా ముహమ్మద్ అల్లాహ్ దాసుడు అని, ఆయన ప్రవక్త అని సాక్ష్యం పలకటం నిజమవుతుంది.
ఈ గొప్ప సాక్ష్యం యొక్క ఫలాలు: మనస్సును, స్వయాన్ని సృష్టిరాసుల దాస్యం నుండి మరియు ప్రవక్తేతరుల అనుసరణ నుండి స్వేచ్చనొసగటం.
2 - నమాజు నెలకొల్పటం: నమాజును దాని సమయాలలో, దాని సంపూర్ణ పద్ధతిలో నిలకడగా ఆచరించటం ద్వారా మహోన్నతుడైన అల్లాహ్ ను ఆరాధించటం.
దాని ఫలాలు: హృదయం విశాలమవటం, కంటిచలవ ప్రాప్తించటం, అశ్లీలత మరియు చెడుల నుండి కాపాడుకోవటం.
3 - జకాత్ చెల్లించటం : జకాత్ యోగ్యత గల నిర్ణీత సంపదలలో నుంచి నిర్ణీత పరిమాణమును ఖర్చు చేయటం ద్వారా అల్లాహ్ ఆరాధన చేయటం.
దాని ఫలాలు: దుష్ట గుణాల (పిసినారితనం) నుండి మనస్సు శుద్ధి అవటం మరియు ఇస్లాం ధర్మము, ముస్లిముల అవసరాలను తీర్చటం.
4 - రమదాను మాసపు ఉపవాసములు పాటించడం: రమదాను దినాలలో అన్నపానీయాల నుండి దూరంగా ఉండి అల్లాహ్ ఆరాధన చేయటం.
దాని ఫలాలలో నుంచి: అల్లాహ్ మన్నతను ఆశిస్తూ తనకు ఇష్టకరమైన వస్తువులను వదలటంపై తన మనస్సును అదుపులో ఉంచటం.
5 - బైతుల్లాహ్ హజ్ చేయటం: హజ్ కార్యాలను నెలకొల్పటం కొరకు కాబతుల్లాహ్ వైపు ప్రయాణమును పూనుకుని అల్లాహ్ ఆరాధన చేయటం.
దాని ఫలాలలో ఒకటి: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు విధేయతతో ఆర్థికంగా మరియు శారీరకంగా శ్రమించడానికి ఆత్మను మచ్చిక చేసుకోవడం, మరియు ఈ కారణంగా హజ్ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మార్గంలో ఒక రకమైన పవిత్ర యుద్దం.
ఈ మూలస్తంభాల కొరకు మేము ప్రస్తావించిన ఫలాలు, మేము ప్రస్తావించని ఫలాలు ఉమ్మత్ ను పరిశుభ్రమైన, స్వచ్ఛమైన ఇస్లామీయ ఉమ్మత్ గా తీర్చిదిద్దుతాయి. అది అల్లాహ్ కొరకు సత్యధర్మముతో ఆరాధన చేయిస్తుంది మరియు సృష్టి పట్ల న్యాయపరంగా, నీతి పరంగా వ్యవహారం చేయిస్తుంది. ఎందుకంటే ఈ మూలస్థంభాలు సరిగ్గా ఉన్నప్పుడే ఇస్లాంలోని ఇతర ధార్మిక చట్టాలు కూడా సరిగా ఉంటాయి. ప్రజల ధార్మిక వ్యవహారాలు సరిగా ఉన్నప్పుడే వారి పరిస్థితులు మెరుగుపడతాయి. వారి ధార్మిక వ్యవహారాలు ఎంత మేరకు దెబ్బతింటాయో, వారి పరిస్థితులు కూడా అంతే మేరకు దెబ్బతింటాయి.
ఎవరైతే దీనిని స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటారో, వారు అల్లాహ్ యొక్క ఈ వాక్కును చదువగలరు:
﴿وَلَوۡ أَنَّ أَهۡلَ ٱلۡقُرَىٰٓ ءَامَنُواْ وَٱتَّقَوۡاْ لَفَتَحۡنَا عَلَيۡهِم بَرَكَٰتٖ مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ وَلَٰكِن كَذَّبُواْ فَأَخَذۡنَٰهُم بِمَا كَانُواْ يَكۡسِبُونَ 96 أَفَأَمِنَ أَهۡلُ ٱلۡقُرَىٰٓ أَن يَأۡتِيَهُم بَأۡسُنَا بَيَٰتٗا وَهُمۡ نَآئِمُونَ 97 أَوَأَمِنَ أَهۡلُ ٱلۡقُرَىٰٓ أَن يَأۡتِيَهُم بَأۡسُنَا ضُحٗى وَهُمۡ يَلۡعَبُونَ98 أَفَأَمِنُواْ مَكۡرَ ٱللَّهِۚ فَلَا يَأۡمَنُ مَكۡرَ ٱللَّهِ إِلَّا ٱلۡقَوۡمُ ٱلۡخَٰسِرُونَ 99﴾
మరియు ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి, దైవభీతి కలిగి ఉంటే - మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి - సర్వశుభాల నొసంగి ఉండేవారం. కాని వారు (ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు, కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము.
ఏమీ? ఈ నగరాలవాసులు, తాము నిద్రపోయేటప్పుడు రాత్రి సమయమన వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా?
లేదా ఈ నగరాల వాసులు, పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా?
ఏమీ? వారు అల్లాహ్ యుక్తి (శిక్ష) నుండి నిర్భయంగా ఉన్నారా? నాశనం కాబోయే వారు తప్ప ఇతర జాతి వారెవ్వరూ అల్లాహ్ యుక్తి గురించి నిర్భయంగా ఉండజాలరు. [అల్ ఆరాఫ్ 7:96-99]
చిరకాలంగా గతించిపోయినవారి చరిత్రను పరిశీలించండి; ఎందుకంటే చరిత్ర వివేకం కలవారికి ఒక పాఠం, మరియు హృదయంపై పరదా పడని వారికి ఒక దృక్కోణం. అల్లాహ్ మాత్రమే సహాయం కోరదగినవాడు.
ఇస్లామీయ అఖీద (ఈమాన్) మూలస్థంభాలు:
ఇస్లామీయ ధర్మము - మేము ఇంతకు ముందు వివరించినట్లుగా - విశ్వాసం మరియు షరియా (ధార్మిక చట్టం) రెండింటిని కలిగి ఉంది. మేము దాని షరియాలోని కొన్నింటిని ప్రస్తావించాము మరియు దానికి మూలస్థంభాలుగా పరిగణించబడే దాని మూలాధారాలను కూడా పేర్కొన్నాము.
ఇస్లామీయ విశ్వాసం (ఈమాన్) యొక్క మూలస్థంభాలు: అల్లాహ్ పై విశ్వాసం, ఆయన దూతల పై విశ్వాసం, ఆయన గ్రంథాల పై విశ్వాసం, ఆయన ప్రవక్తల పై విశ్వాసం, అంతిమ దినం పై విశ్వాసం మరియు విధివ్రాత (ఖదర్) పై విశ్వాసం - దాని మంచి మరియు చెడు రెండింటినీ విశ్వసించడం.
ఈ మూలస్థంభాలకు ఆధారము – అల్లాహ్ యొక్క గ్రంథం ఖుర్ఆన్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులు.
మహోన్నతుడైన అల్లాహ్ తన గ్రంథములో ఇలా సెలవిస్తున్నాడు :
﴿لَّيۡسَ ٱلۡبِرَّ أَن تُوَلُّواْ وُجُوهَكُمۡ قِبَلَ ٱلۡمَشۡرِقِ وَٱلۡمَغۡرِبِ وَلَٰكِنَّ ٱلۡبِرَّ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَٱلۡمَلَٰٓئِكَةِ وَٱلۡكِتَٰبِ وَٱلنَّبِيِّـۧنَ...﴾
వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో చేయటం కాదు; కాని వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే, అల్లాహ్ ను, అంతిమదినాన్ని, దేవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం... [అల్ బఖర 2:177] మరియు విధివ్రాత గురించి ఆయన ఇలా సెలవిస్తున్నాడు:
﴿إِنَّا كُلَّ شَيۡءٍ خَلَقۡنَٰهُ بِقَدَرٖ 49 وَمَآ أَمۡرُنَآ إِلَّا وَٰحِدَةٞ كَلَمۡحِۭ بِٱلۡبَصَرِ 50﴾
నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము.
మరియు మా ఆజ్ఞ కేవలం ఒక్కటే చాలు, కనురెప్పపాటుది, (అది అయిపోతుంది). 50 [అల్ ఖమర్ 54:49-50]
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులో, జిబ్రయీల్ అలైహిస్సలాం విశ్వాసం గురించి అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు:
«الْإِيمَانُ: أَنْ تُؤْمِنَ بِاللَّهِ، وَمَلَائِكَتِهِ، وَكُتُبِهِ، وَرُسُلِهِ، وَالْيَوْمِ الْآخِرِ، وَتُؤْمِنَ بِالْقَدَرِ: خَيْرِهِ وَشَرِّهِ».
విశ్వాసం అంటే నీవు అల్లాహ్ పై, ఆయన దేవదూతలపై, ఆయన గ్రంథములపై, ఆయన ప్రవక్తలపై మరియు అంతిమ దినంపై విశ్వాసమును చూపటం మరియు నీవు విధివ్రాతపై, దాని మంచి - చెడుపై విశ్వాసము చూపటం."3
మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం:
ఇక, అల్లాహ్ పై విశ్వాసం అన్నది నాలుగు విషయాలను కలిగి ఉంటుంది:
మొదటి విషయం: మహోన్నతుడైన అల్లాహ్ ఉనికిపై విశ్వాసం:
స్వభావం (ఫిత్రత్), బుద్ధి (అఖ్ల్), షరీఅత్ (ధార్మిక చట్టం), అనుభూతి (హిస్స్) మొదలైనవన్నీ స్పష్టంగా మహోన్నతుడైన అల్లాహ్ ఉనికిని సూచిస్తున్నాయి.
పరమ పవిత్రుడైన, మహోన్నతుడైన అల్లాహ్ ఉనికిపై స్వాభావిక సూచన: నిశ్చయంగా ప్రతీ జీవి తన సృష్టికర్త గురించి ముందస్తూ ఎటువంటి పరిశీలన, జ్ఞానం లేకుండానే తన సృష్టికర్తపై స్వాభావిక విశ్వాసంతో జన్మిస్తుంది. దాని హృదయంపై ఆ స్వభావము నుండి మరల్చే మరో దానితో దానిపై ఎవరైనా ప్రేరేపిస్తే తప్ప అది ఆ స్వభావము నుండి మరలదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«مَا مِنْ مَوْلُودٍ إِلَّا يُولَدُ عَلَى الْفِطْرَةِ، فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ أَوْ يُنَصِّرَانِهِ أَوْ يُمَجِّسَانِهِ».
ప్రతీ శిశువు సహజగుణం పై పుట్టించబడతాడు, అయితే అతని తల్లిదండ్రులు అతడిని యూదునిగా, లేక క్రైస్తవునిగా లేక మజూసీ (అగ్నిపూజారి) గా మార్చేస్తారు.4
2- సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఉనికిపై హేతుబద్ధత (బుద్ధి) యొక్క సూచన విషయానికొస్తే, ఈ జీవులు, ముందు మరియు తరువాత, తమను సృష్టించిన ఒక సృష్టికర్తను కలిగి ఉండాలి, ఎందుకంటే అవి తమంతట తాముగా ఉనికిలోకి రావు, లేదా అనుకోకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి రావు.
తనంతట తానుగా ఉనికిలోకి రావటం అసాధ్యం, ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోలేదు, ఎందుకంటే దాని ఉనికికి ముందు అది ఉనికిలో లేదు, అలాంటప్పుడు అది స్వయంగా తనను తానే సృష్టించుకున్న సృష్టికర్త ఎలా అవుతుంది?!
మరియు అది అకస్మాత్తుగా ఉనికిలోకి రావటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతీ ఉనికిలోకి వచ్చే దాని కొరకు తప్పనిసరిగా దానిని ఉనికిలోకి తెచ్చేవాడు ఉండాలి. ఎందుకంటే ఈ విశ్వం యొక్క అద్భుతమైన వ్యవస్థ, సున్నితమైన సమన్వయం మరియు దానిలోని కారణాలు, ఫలితాలు, మరియు జీవుల మధ్య ఉన్న బలమైన అనుసంధానం చూస్తే, ఇది కేవలం యాదృచ్ఛికంగా ఏర్పడిందనే వాదనను ఖచ్చితంగా నిరోధిస్తుంది. ఎందుకంటే యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చినది మౌలిక అస్తిత్వంలోనే నియమబద్ధంగా ఉండదు; అటువంటి దానికీ తన నిలకడలో, అభివృద్ధిలో నియమబద్ధత ఎలా ఏర్పడుతుంది?"
ఈ జీవులు తమను తాము సృష్టించుకోలేకపోతే, లేదా యాదృచ్ఛికంగా ఉనికిలోకి రాలేకపోతే, వాటికి ఒక సృష్టికర్త ఉండాలి - ఆయనే సమస్త లోకాల ప్రభువైన అల్లాహ్ అని ఖచ్చితంగా నిర్ధారించబడుతుంది.
మహోన్నతుడైన అల్లాహ్ సూరహ్ అత్-తూర్ లో ఈ హేతుబద్దమైన ఆధారము మరియు నిశ్చయాత్మక రుజువును పేర్కొన్నాడు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿أَمۡ خُلِقُواْ مِنۡ غَيۡرِ شَيۡءٍ أَمۡ هُمُ ٱلۡخَٰلِقُونَ 35﴾
వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా? [అత్-తూర్ 52:35] దీని అర్థం: వారు సృష్టికర్త లేకుండా సృష్టించబడలేదు, మరియు వారు తమను తాము సృష్టించుకోలేదు. కాబట్టి, వారి సృష్టికర్త కేవలం అల్లాహ్ మాత్రమే అని నిర్ధారించబడింది. అందుకనే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అత్-తూర్ పఠిస్తూ ఈ ఆయతులకు చేరుకున్నప్పుడు జుబైర్ ఇబ్నె ముత్ఇమ్ రదియల్లాహు అన్హు దానిని విన్నారు:
﴿أَمۡ خُلِقُواْ مِنۡ غَيۡرِ شَيۡءٍ أَمۡ هُمُ ٱلۡخَٰلِقُونَ 35 أَمۡ خَلَقُواْ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۚ بَل لَّا يُوقِنُونَ 36 أَمۡ عِندَهُمۡ خَزَآئِنُ رَبِّكَ أَمۡ هُمُ ٱلۡمُصَۜيۡطِرُونَ 37﴾
వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?
లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.
వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా? [అత్-అత్తూర్ 52:35-37]
ఆ సమయాన జుబైర్ ముష్రికుగా ఉన్నారు. వాటిని విని అతను ఇలా పలికారు : అప్పుడు నా హృదయం దాదాపు ఎగురే దట్టుగా ఉంది మరియు అది నా హృదయంలో విశ్వాసం స్థిరపడిన మొదటి సమయం."5
మరియు దీనిని స్పష్టంగా వివరించే ఒక ఉదాహరణను తీసుకుందాము: ఒక వ్యక్తి మీకు ఒక పెద్ద భవనం గురించి చెప్పాడనుకోండి. ఆ భవనము ఎత్తైన కోటలా ఉంది, దాని చుట్టూ తోటలు, వాటి మధ్య నదులు ప్రవహిస్తున్నాయి. మరియు అది అత్యంత విలాసవంతంగా అలంకరించబడిన పరుపులు, మంచాలు మరియు అన్ని రకాల అలంకారాలతో నిండి ఉంది. ఈ భవనం దాని అన్ని లక్షణాలతో తనంతట తానుగా ఉనికిలోకి వచ్చిందని, లేదా దానిని నిర్మించిన బిల్డరు లేకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చిందని మీతో ఎవరైన చెబితే, అప్పుడు మీరు వెంటనే దానిని తిరస్కరించి, అది పచ్చి అబద్ధం అని చెబుతారు మరియు దానిని మూర్ఖమైన మాటగా భావిస్తారు. ఈ సువిశాల ప్రపంచం తన భూమి, ఆకాశాలు మరియు పరిస్థితులతో, దాని ప్రత్యేకమైన మరియు అద్భుతమైన అమరికతో తనను తాను ఎలా సృష్టించుకోగలదు లేదా దానిని నిర్మించే వారు లేకుండా ఉనికిలోకి ఎలా వస్తుంది?!
3- మరియు అల్లాహ్ (స్వతః) ఉనికిపై షరఅహ్ (ఇస్లామీయ ధార్మిక చట్టం) యొక్క ఋజువు ఏమిటంటే: అన్ని ఆకాశ గ్రంథాలు (దైవికంగా అవతరింపజేయబడిన గ్రంథాలు) దీనితో (అల్లాహ్ ఉనికితో) ప్రతిధ్వనిస్తాయి. మరియు అవి తెచ్చిన న్యాయమైన నియమాలు, సృష్టి (మానవ జాతి) యొక్క శ్రేయస్సును కలిగి ఉండటం, అవి ఒక జ్ఞానవంతుడైన, తన సృష్టి యొక్క శ్రేయస్సును తెలిసిన ప్రభువు (రబ్బు) నుండి వచ్చినవి అనడానికి ఒక స్పష్టమైన నిదర్శనం. ఆ పుస్తకాల్లోని విశ్వం గురించి సమాచారం, దాని సత్యాన్ని ప్రపంచం అంగీకరించడం, తన సమాచారాన్ని ఉనికిలోకి తీసుకురావడానికి సామర్ధ్యం ఉన్న ప్రభువు నుండి మాత్రమే అది వచ్చినదని రుజువు చేస్తుంది.
4- అల్లాహ్ ఉనికికి ఇంద్రియాల ద్వారా రుజువులు రెండు విధాలుగా ఉన్నాయి:
వాటిలో ఒకటి : దుఆ చేసేవారి దుఆలు అంగీకరించబడతాయని మరియు బాధలో ఉన్న ప్రజలకు సహాయం అందుతుందని మనము వింటున్నాము మరియు చూస్తున్నాము. అవి అల్లాహ్ ఉనికిని సూచించే ఖచ్చితమైన ఆధారాలు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴿وَنُوحًا إِذۡ نَادَىٰ مِن قَبۡلُ فَٱسۡتَجَبۡنَا لَهُۥ...﴾
మరియు (జ్ఞాపకం చేసుకోండి) నూహ్ అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) ఆమోదించాము... [అల్-అంబియా 21:76] మరియు మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿إِذۡ تَسۡتَغِيثُونَ رَبَّكُمۡ فَٱسۡتَجَابَ لَكُمۡ...﴾
(జ్ఞాపకం చేసుకోండి!) మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినపుడు ఆయన ఇలా జవాబిచ్చాడు... [అల్-అన్'ఫాల్ 8:9]
సహీహ్ బుఖారీలో అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
«إنَّ أعرابيًّا دَخَلَ يَوْمَ الجُمُعَةِ -والنَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيهِ وَسَلَّمَ يَخْطُبُ- فقالَ: يا رسُولَ اللَّهِ، هَلَكَ المَالُ، وجَاعَ العِيَالُ، فَادْعُ اللَّهَ لنَا؛ فَرَفَعَ يَدَيْهِ ودَعَا، فَثَارَ السَّحَابُ أمثَالَ الجِبَالِ، فَلَمْ يَنْزِلْ عَنْ مِنْبَرِهِ حتَّى رَأَيْتُ المَطَرَ يَتَحَادَرُ عَنْ لِحْيَتِهِ».
ఒక పల్లెటూరి వ్యక్తి జుమా రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇస్తుండగా వచ్చి ఇలా పలికాడు : 'ఓ అల్లాహ్ ప్రవక్తా! డబ్బులు అయిపోయాయి, పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, మా కోసం అల్లాహ్ ను ప్రార్థించండి'; అప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి ప్రార్థించారు, అప్పుడు మేఘాలు పర్వతాల వలె పెరిగాయి, మరియు ఆయన మింబర్ నుండి కూడా ఇంకా కిందకు రాలేదు, ఆయన గడ్డం మీద వర్షపు నీరు పడటం నేను చూశాను."6
రెండవ జుమా నాడు అదే పల్లెటూరి వ్యక్తి లేదా మరో వ్యక్తి లేచి నిలబడి ఇలా పలికాడు : ఓ అల్లాహ్ ప్రవక్త! మా ఇళ్ళు నాశనమైపోయాయి, సంపదంతా (నీళ్ళలో) మునిగి పోయింది. కావున మీరు మా కొరకు అల్లాహ్ తో ప్రార్ధించండి. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులు పైకెత్తి ఇలా ప్రార్ధించారు :
«اللَّهُمَّ حَوَالَيْنَا وَلَا عَلَيْنَا».
ఓ అల్లాహ్! మాపై కాకుండా మా చుట్టు ప్రక్కల వర్షాన్ని కురిపించు. ఆయన ఎటు వైపు సూచిస్తే, అది అటువైపు వెంటనే విప్పుకొని తొలగిపోతుండేది7.
నిజ హృదయంతో అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించి, ప్రార్థనను అంగీకరించే షరతులను నెరవేర్చే వారి ప్రార్థనలు అంగీకరించబడతాయనేది నేటికీ కనిపిస్తుంది మరియు స్వీయ స్పష్టమవుతుంది.
వాటిలో రెండవ విధం: మోజిజాత్ (మహిమలు, అద్భుతాలు) అని పిలువబడే ప్రవక్తల సంకేతాలు మరియు ప్రజలు చూసినవి లేదా విన్నవి కూడా ఆ ప్రవక్తలను పంపించిన మహోన్నతుడైన అల్లాహ్ ఉనికికి ఖచ్చితమైన మరియు తిరుగులేని సాక్ష్యాలు, ఎందుకంటే ఈ మోజిజాత్ లు మానవాళి శక్తి యొక్క పరిమితులకు అతీతమైనవి, వాటిని అల్లాహ్ తన ప్రవక్తలను ధృవీకరించడానికి మరియు వారికి సహాయం చేయడానికి మరియు సహకరించడానికి వెల్లడిస్తాడు.
దీనికి ఉదాహరణ మూసా అలైహిస్సలాం చూపిన మహిమ, తన కర్రను సముద్రం మీద కొట్టమని అల్లాహ్ ఆయనను ఆజ్ఞాపించినప్పుడు, అతను తన కర్రతో అలా కొట్టినప్పుడు, సముద్రంలో పన్నెండు పొడి మార్గాలు ఏర్పడ్డాయి మరియు నీరు వాటి మధ్య పర్వతంలా (రెండు ప్రక్కలా) నిలబడింది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
﴿فَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنِ ٱضۡرِب بِّعَصَاكَ ٱلۡبَحۡرَۖ فَٱنفَلَقَ فَكَانَ كُلُّ فِرۡقٖ كَٱلطَّوۡدِ ٱلۡعَظِيمِ 63﴾
అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది. [అష్షుఅరా 26:63]
రెండవ ఉదాహరణ: ఈసా అలైహిస్సలాం చూపిన మహిమ. అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఆయన మృతులను జీవింపజేసేవారు మరియు వారిని వారి సమాధుల నుండి లేపేవారు, అల్లాహ్ గురించి ఆయన ఇలా సెలవిచ్చాడు:
﴿...وَأُحۡيِ ٱلۡمَوۡتَىٰ بِإِذۡنِ ٱللَّهِۖ...﴾
...మరియు మృతుణ్ణి బ్రతికిస్తాను అల్లాహ్ ఆజ్ఞతో... [ఆలే ఇమ్రాన్ 3:49] మరియు అల్లాహ్ వాక్కును ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు:
﴿...وَإِذۡ تُخۡرِجُ ٱلۡمَوۡتَىٰ بِإِذۡنِيۖ...﴾
...మరియు నీవు నా ఆజ్ఞతో మృతులను లేపేవాడివి... [అల్-మాయిద 5:110]
మూడవ ఉదాహరణ: మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మహిమ ఏమిటంటే, ఖురేషీయులు ఆయనను ఒక సంకేతం (అద్భుతం) కోసం అడిగినప్పుడు, ఆయన చంద్రుడి వైపు సైగ చేశారు. అప్పుడు అది రెండు ముక్కలుగా వేరైపోయింది. దాన్ని ప్రజలు చూశారు. దాని గురించి వర్ణిస్తూ మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿ٱقۡتَرَبَتِ ٱلسَّاعَةُ وَٱنشَقَّ ٱلۡقَمَرُ 1 وَإِن يَرَوۡاْ ءَايَةٗ يُعۡرِضُواْ وَيَقُولُواْ سِحۡرٞ مُّسۡتَمِرّٞ2﴾
ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు. మరియు వారు ఏదైనా సూచనను చూస్తే, దానిని నిరాకరిస్తారు మరియు 'ఇది కొనసాగుతున్న మాయ' అని అంటారు. [అల్ ఖమర్ 54:1-2]
అల్లాహ్ తన ప్రవక్తల కొరకు సహాయంగా, మద్దతుగా వెల్లడించే ఈ ఇంద్రియ సూచనలన్నీ అల్లాహ్ ఉనికిని ఖచ్చితంగా సూచించే ఋజువులు.
అల్లాహ్ పై విశ్వాసం విషయంలో ఇమిడి ఉన్న రెండవ విషయం: ఆయన రుబూబియత్ పై నిశ్వాసం అంటే ఆయన ఒక్కడే ప్రభువు. ఆయనకు భాగస్వామి గానీ లేదా సహాయకుడు గానీ ఎవ్వరూ లేరు.
మరియు ప్రభువు (రబ్) ఎవరంటే ఎవరి కొరకైతే సృష్టించడం, సామ్రాజ్యాధికారం, సార్వభౌమత్వము, ఆదేశం ప్రత్యేకమో ఆయనే. కావున అల్లాహ్ తప్ప ఇంకెవరు సృష్టికర్త లేడు, ఆయన తప్ప వేరే యజమాని లేడు,ఆదేశించే అధికారము ఆయనకు తప్ప ఇంకెవ్వరికి లేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
﴿...أَلَا لَهُ ٱلۡخَلۡقُ وَٱلۡأَمۡرُۗ...﴾
నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. [అల్ ఆరాఫ్ 7:54] మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చారు:
﴿...ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ لَهُ ٱلۡمُلۡكُۚ وَٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِهِۦ مَا يَمۡلِكُونَ مِن قِطۡمِيرٍ﴾
అయనే అల్లాహ్! మీ ప్రభువు, విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే! మరియు ఆయనను వదలి మీరు వేడుకునే వారు, ఖర్జూర బీజంపై నున్న పొరకు కూడా యజమానులు కారు. [ఫాతిర్ 35:13]
సృష్టిలోంచి ఎవరు కూడా పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క రుబూబియత్ ను తిరస్కరించలేదు. కానీ ఎవరికైతే అహంకారం ఉన్నదో వారు తప్ప. వారికి తాము పలికే వాటిపైనే నమ్మకం ఉండేది కాదు. ఎలాగైతే ఫిర్ఔన్ యొక్క ఈ మాటలతో వెల్లడౌతుందో, అతడు తన జాతి వారిని ఉద్దేశించి ఇలా పలికాడు :
﴿فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلۡأَعۡلَىٰ 24﴾
ఇలా అన్నాడు: "నేనే మీ యొక్క మహోన్నత ప్రభువును! [అన్-నాజిఆత్ 79:24]. ఇంకా అతడు ఇలా అన్నాడు:
﴿...يَٰٓأَيُّهَا ٱلۡمَلَأُ مَا عَلِمۡتُ لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرِي...﴾
ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు. [అల్ ఖసస్ 28:38], కాని ఈ మాట అన్నది విశ్వాసముతో కాదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَجَحَدُواْ بِهَا وَٱسۡتَيۡقَنَتۡهَآ أَنفُسُهُمۡ ظُلۡمٗا وَعُلُوّٗاۚ...﴾
మరియు వారి హృదయాలు వాటిని అంగీకరించినా వారు అన్యాయంగా, అహంకారంతో తిరస్కరించారు... [అన్-నమ్ల్ 27:14] మరియు మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ తో ఇలా పలికారని అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా పేర్కొన్నాడు:
﴿...لَقَدۡ عَلِمۡتَ مَآ أَنزَلَ هَٰٓؤُلَآءِ إِلَّا رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ بَصَآئِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَٰفِرۡعَوۡنُ مَثۡبُورٗا﴾
నీకు బాగా తెలుసు, జ్ఞానవృద్ధి కలుగజేసే వాటిని (సూచనలను) భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వరూ అవతరింపజేయలేరని! ఓ ఫిర్ఔన్, నీవు నిశ్చయంగా నశింపనున్నావని నేను భావిస్తున్నాను! [అల్ ఇస్రా 17:102] దీని కారణంగానే ముష్రికులు అల్లాహ్ యొక్క ఉలూహియత్ లో సాటి కల్పిస్తూనే, అల్లాహ్ రుబూబియత్ ను అంగీకరించే వారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُل لِّمَنِ ٱلۡأَرۡضُ وَمَن فِيهَآ إِن كُنتُمۡ تَعۡلَمُونَ 84 سَيَقُولُونَ لِلَّهِۚ قُلۡ أَفَلَا تَذَكَّرُونَ85 قُلۡ مَن رَّبُّ ٱلسَّمَٰوَٰتِ ٱلسَّبۡعِ وَرَبُّ ٱلۡعَرۡشِ ٱلۡعَظِيمِ 86 سَيَقُولُونَ لِلَّهِۚ قُلۡ أَفَلَا تَتَّقُونَ 87 قُلۡ مَنۢ بِيَدِهِۦمَلَكُوتُ كُلِّ شَيۡءٖ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيۡهِ إِن كُنتُمۡ تَعۡلَمُونَ 88 سَيَقُولُونَ لِلَّهِۚ قُلۡ فَأَنَّىٰ تُسۡحَرُونَ 89﴾
వారిని ఇలా అడుగు: "ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి?" వారు చెబుతారు: "అది అల్లాహ్‌కి చెందినది." వారిని ఇలా అడుగు: "అయితే మీరు గుర్తు పెట్టుకోరా?" వారిని ఇలా అడుగు: "ఏడు ఆకాశాల ప్రభువు మరియు మహా సింహాసనాధీశుడు ఎవరు?" వారు చెబుతారు: "అది అల్లాహ్‌కి చెందినది." వారిని ఇలా అడుగు: "అయితే మీరు భయపడరా?" వారిని ఇలా అడుగు: "ఎవరికి అన్ని వస్తువుల రాజ్యాధికారం ఉంది మరియు ఆయన రక్షిస్తాడు, ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ రక్షించబడరు, మీకు తెలిస్తే చెప్పండి?" వారు చెబుతారు: "అది అల్లాహ్‌కి చెందినది." వారిని ఇలా అడుగు: "అయితే మీరు ఎలా మోసపోతున్నారు? [అల్ మూమినూన్ 23:84-89].
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ ٱلۡعَزِيزُ ٱلۡعَلِيمُ 9﴾
ఒకవేళ, నీవు వారితో: "భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?" అని అడిగితే! వారు తప్పక: "వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు." అని అంటారు. [జుఖ్రుఫ్ 43:9]
పరమ పవిత్రుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَهُمۡ لَيَقُولُنَّ ٱللَّهُۖ فَأَنَّىٰ يُؤۡفَكُونَ 87﴾
మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)? [జుఖ్రుఫ్ 43:87]
అల్లాహ్ యొక్క ఆజ్ఞలు ప్రాపంచిక మరియు దైవిక చట్టాలను రెండింటినీ కలిగి ఉంటాయి. తన జ్ఞానం ప్రకారం విశ్వాన్ని నిర్వహించేవాడు మరియు అందులో తన ఇష్టాన్ని తీర్పుగా ఇచ్చేవాడు ఎలాగైతే ఉన్నాడో, అదేవిధంగా తన జ్ఞానం ప్రకారం ఆరాధనల చట్టాలతో మరియు వ్యవహారాల నిబంధనలతో ఈ విశ్వంలో తీర్పునిచ్చేవాడు కూడా ఆయనే. ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఆరాధనలలో చట్టాన్ని నిర్ధారించడంలో ఇతరులను చేర్చుతారో లేదా వ్యవహారాలలో తీర్పునివ్వడంలో ఇతరులను చేర్చుతారో, వారు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినట్లే, మరియు వారు విశ్వాసాన్ని నిజంగా పాటించనట్లే.
అల్లాహ్ పై విశ్వాసం విషయంలో ఇమిడి ఉన్న మూడవ విషయం: ఆయన ఉలూహియత్ ను విశ్వసించటం అంటే ఆయన ఒక్కడే నిజఆరాధ్యుడని, ఆయన తో పాటు ఎవ్వరూ ఆరాధింపబడే అర్హత, యోగ్యత కలిగి లేరని విశ్వసించటం. ఇలాహ్ అన్న పదము మాలూహ్ అంటే ఇష్టతతో, గౌరవంతో ఆరాధింపబడేవాడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَإِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞۖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلرَّحۡمَٰنُ ٱلرَّحِيمُ 163﴾
మరియు మీ ఆరాధ్యుడు కేవలం ఆ అద్వితీయుడు (అల్లాహ్) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యుడు లేడు, అనంత కరుణా మయుడు, అపార కరుణా ప్రదాత. [అల్-బఖర 2:163] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿شَهِدَ ٱللَّهُ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا هُوَ وَٱلۡمَلَٰٓئِكَةُ وَأُوْلُواْ ٱلۡعِلۡمِ قَآئِمَۢا بِٱلۡقِسۡطِۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ 18﴾
నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, అల్లాహ్, దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. [ఆలి ఇమ్రాన్ 3:18] అల్లాహ్ తో పాటు ఆరాధ్యదైవంగా చేసుకునే ప్రతిదాని లేదా ఆయనను వదిలి పూజింబడే ప్రతీ దాని ఉలూహియత్ అవాస్తవము. మహోన్నతుడై అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّ مَا يَدۡعُونَ مِن دُونِهِۦ هُوَ ٱلۡبَٰطِلُ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ 62﴾
ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం! మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు). [హజ్22:62] మరియు వాటికి ఆరాధ్య దైవాలని, దేవీదేవతలని నామకరణం చేయటం వలన వాటికి ఉలూహియత్ హక్కు ప్రాప్తించదు. మహోన్నతుడైన అల్లాహ్ లాత్, ఉజ్జా మరియు మనాత్ మొదలైన అసత్యదైవాల విషయంలో ఇలా సెలవిచ్చాడు :
﴿إِنۡ هِيَ إِلَّآ أَسۡمَآءٞ سَمَّيۡتُمُوهَآ أَنتُمۡ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلۡطَٰنٍۚ...﴾
ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. [అన్-నజ్మ్ 53:23]
అల్లాహ్, హూద్ అలైహిస్సలాం గురించి ఇలా తెలిపాడు. 'ఆయన తన జాతిప్రజలకు ఇలా బోధించాడు :
﴿...أَتُجَٰدِلُونَنِي فِيٓ أَسۡمَآءٖ سَمَّيۡتُمُوهَآ أَنتُمۡ وَءَابَآؤُكُم مَّا نَزَّلَ ٱللَّهُ بِهَا مِن سُلۡطَٰنٖۚ...﴾
...మీరు మరియు మీ తండ్రితాతలు పెట్టుకున్న (కల్పిత) పేర్ల విషయంలో - అల్లాహ్ ఏ ప్రమాణం ఇవ్వకున్నా - నాతో వాదులాడుతున్నారా?... [అల్ ఆరాఫ్ 7:71]
అల్లాహ్, యూసుఫ్ అలైహిస్సలాం గురించి ఇలా తెలిపాడు.'ఆయన చెరసాలలో తనతోపాటు ఉన్న ఇద్దరు ఖైదీలకు ఇలా బోధించాడు:
﴿يَٰصَٰحِبَيِ ٱلسِّجۡنِ ءَأَرۡبَابٞ مُّتَفَرِّقُونَ خَيۡرٌ أَمِ ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ 39 مَا تَعۡبُدُونَ مِن دُونِهِۦٓ إِلَّآ أَسۡمَآءٗ سَمَّيۡتُمُوهَآ أَنتُمۡ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلۡطَٰنٍۚ...﴾
ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! ఏమీ? చాలా మంది విభిన్న ప్రభువులు మేలా? లేక, తన సృష్టిపై సంపూర్ణాధికారం గల అద్వితీయుడైన అల్లాహ్ మేలా? మీరు ఆయనను వదిలి పూజిస్తున్నవి మీరు మీ తాత ముత్తాతలు పెట్టుకున్న పేర్లు మాత్రమే. అల్లాహ్ వాటి గురించి ఏ ఆధారమూ పంపలేదు... [యూసుఫ్ 12:39-40]
అందుకనే దైవప్రవక్తలు అలైహిముస్సలాం తమ జాతి వారిని ఇలా బోధించేవారు:
﴿...ٱعۡبُدُواْ ٱللَّهَ مَا لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرُهُ...﴾
అల్లాహ్ నే ఆరాధించండి, మీ కొరకు ఆయన తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. [అల్-ఆరాఫ్ 7:59] కాని ముష్రికులు దాన్ని నిరాకరించారు. మరియు వారు అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు. అల్లాహ్ తోపాటు వారిని కూడా ఆరాధించేవారు, వారి నుండి సహాయము అర్ధించేవారు మరియు వారికి మొరపెట్టుకునేవారు.
మహోన్నతుడై అల్లాహ్ రెండు హేతుబద్ధమైన, బుద్ధిపరమైన ప్రమాణాలతో ముష్రికులు ఈ ఆరాధ్యదైవాలు చేసుకోవటాన్ని అసత్యపరచాడు:
మొదటి ప్రమాణం: వారు తయారు చేసుకున్న ఈ దేవుళ్ళలో ఉలూహియ్యత్ లక్షణాలలో నుంచి ఏదీ లేదు. వారు సృష్టించబడిన వారే కానీ స్వయంగా ఏదీ సృష్టించలేరు. తమ దాస్యం చేసే వారికి ఎటువంటి లాభము చేకూర్చలేరు మరియు ఎటువంటి నష్టమును దూరం చేయలేరు. వారికి జీవన్మరణాలను అదేశించే అధికారం లేదు. ఆకాశములలో వారికి ఎటువంటి అధికారము లేదు. వాటిలో వారికి భాగస్వామ్యము లేదు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ ءَالِهَةٗ لَّا يَخۡلُقُونَ شَيۡـٔٗا وَهُمۡ يُخۡلَقُونَ وَلَا يَمۡلِكُونَ لِأَنفُسِهِمۡ ضَرّٗا وَلَا نَفۡعٗا وَلَا يَمۡلِكُونَ مَوۡتٗا وَلَا حَيَوٰةٗ وَلَا نُشُورٗا 3﴾
అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు. [ఫుర్ఖాన్ 25:3]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُلِ ٱدۡعُواْ ٱلَّذِينَ زَعَمۡتُم مِّن دُونِ ٱللَّهِ لَا يَمۡلِكُونَ مِثۡقَالَ ذَرَّةٖ فِي ٱلسَّمَٰوَٰتِ وَلَا فِي ٱلۡأَرۡضِ وَمَا لَهُمۡ فِيهِمَا مِن شِرۡكٖ وَمَا لَهُۥ مِنۡهُم مِّن ظَهِيرٖ 22 وَلَا تَنفَعُ ٱلشَّفَٰعَةُ عِندَهُۥٓ إِلَّا لِمَنۡ أَذِنَ لَهُۥ...﴾
వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వంత (పరమాణువు అంత) వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు. మరియు ఆయన సమీపంలో శిఫారసు ప్రయోజనకరంగా ఉండదు, ఆయన అనుమతించిన వారికి తప్ప... [సబా 34:22-23]
وقال تعالى: ﴿أَيُشۡرِكُونَ مَا لَا يَخۡلُقُ شَيۡـٔٗا وَهُمۡ يُخۡلَقُونَ 191 وَلَا يَسۡتَطِيعُونَ لَهُمۡ نَصۡرٗا وَلَآ أَنفُسَهُمۡ يَنصُرُونَ 192﴾
అయితే, వారు ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, ఆయనకు సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తారా? మరియు వారు వారికి సహాయం చేయలేరు, మరియు తమకు తాము సహాయం చేయలేరు. [అల్-అఅరాఫ్ 7:191-192]
ఈ ఆరాధ్యదైవాల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, వారిని ఆరాధించడం పరమ మూర్ఖత్వం మరియు అస్సలు పనికిరాని పని.
రెండవ ప్రమాణము: ఈ ముష్రికులందరు అల్లాహ్ అధికారాలన్నింటిని తన చేతిలో కలిగి ఉన్న ఏకైక ప్రభువు, సృష్టికర్త అని,ఆయనే ఆశ్రయం ఇచ్చేవాడని, ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ఆశ్రయం ఇవ్వలేరని అంగీకరించేవారు. ఇది ఆయన ఒక్కడి కొరకు రుబూబియత్ ను తప్పనిసరి చేసినట్లుగానే ఆయన ఒక్కడి కొరకు ఉలూహియత్ ను కూడా తప్పనిసరి చేస్తుంది. మహోన్నతుడై అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعۡبُدُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ 21 ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ فِرَٰشٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزۡقٗا لَّكُمۡۖ فَلَا تَجۡعَلُواْ لِلَّهِ أَندَادٗا وَأَنتُمۡ تَعۡلَمُونَ 22﴾
ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు! మీకు భూమిని పరుపుగా మరియు ఆకాశాన్ని నిర్మాణంగా చేసినవాడు, మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దానితో మీకు ఆహారంగా పండ్లను ఉత్పత్తి చేసినవాడు. కాబట్టి మీరు తెలుసుకుంటూ అల్లాహ్‌కు సమానులను ఉంచవద్దు. [అల్-బఖరహ్ 2:21-22]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَهُمۡ لَيَقُولُنَّ ٱللَّهُۖ فَأَنَّىٰ يُؤۡفَكُونَ 87﴾
మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)? [జుఖ్రుఫ్ 43:87]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُلۡ مَن يَرۡزُقُكُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ أَمَّن يَمۡلِكُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَمَن يُخۡرِجُ ٱلۡحَيَّ مِنَ ٱلۡمَيِّتِ وَيُخۡرِجُ ٱلۡمَيِّتَ مِنَ ٱلۡحَيِّ وَمَن يُدَبِّرُ ٱلۡأَمۡرَۚ فَسَيَقُولُونَ ٱللَّهُۚ فَقُلۡ أَفَلَا تَتَّقُونَ 31 فَذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمُ ٱلۡحَقُّۖ فَمَاذَا بَعۡدَ ٱلۡحَقِّ إِلَّا ٱلضَّلَٰلُۖ فَأَنَّىٰ تُصۡرَفُونَ32﴾
వారిని అడుగు: "ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా?" 31 కాబట్టి, ఆ అల్లాహ్ మీ సత్యమైన ప్రభువు. సత్యం తరువాత తప్పుదారి తప్పడం తప్ప మరేమీ లేదు. మరి మీరు ఎలా మోసపోతున్నారు? 32 [యూనుస్ 10:31-32].
అల్లాహ్ పై విశ్వాసం విషయంలో ఇమిడి ఉన్న నాల్గవ విషయం : ఆయన దివ్య నామములపై, ఆయన గుణగణాలపై విశ్వాసం కనబరచటం:
అంటే: అల్లాహ్ తన గ్రంథము లేదా తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క సున్నతులో తన కోసం పేర్కొన్న దివ్యనామములు మరియు గుణగణాలను అల్లాహ్ గౌరవానికి తగినవిధంగా ఉన్నత పరచడం; తద్వారా వాటి అర్థాన్ని మార్చకూడదు, వాటిని అర్థరహితంగా చేయకూడదు, వాటి స్థితిని నిర్ణయించకూడదు, వాటికి ఏ ప్రాణితోనూ సమానమైన పోలిక ఇవ్వకూడదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلِلَّهِ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰ فَٱدۡعُوهُ بِهَاۖ وَذَرُواْ ٱلَّذِينَ يُلۡحِدُونَ فِيٓ أَسۡمَٰٓئِهِۦۚ سَيُجۡزَوۡنَ مَا كَانُواْ يَعۡمَلُونَ 180﴾
మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందుతారు. [అల్-ఆరాఫ్ 7:180] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَلَهُ ٱلۡمَثَلُ ٱلۡأَعۡلَىٰ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ﴾
భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది. ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు. [అర్-రూమ్ 30:27] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ﴾
ఆయనను పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. [అష్-షూరా 42:11]
ఈ విషయంలో రెండు వర్గాలు మార్గ భ్రష్టతకు గురిఅయ్యాయి:
మొదటి వర్గం (ముఅత్తిల) అల్లాహ్ యొక్క పేర్లు మరియు లక్షణాలన్నింటినీ లేదా వాటిలో కొన్నింటిని విశ్వసించనివారు. అల్లాహ్ కు ఈ పేర్లు మరియు లక్షణాలను ధృవీకరించడం వాస్తవానికి అల్లాహ్ ను ఆయన సృష్టితో సమానంగా చేస్తుందని వారు నమ్ముతారు. కానీ ఈ వాదన క్రింది కారణాల వల్ల పూర్తిగా తప్పు మరియు అబద్ధం:
మొదటిది: అది అసత్యమైన పరిణామాలను కలిగి ఉంటుంది; అల్లాహ్ యొక్క మాటలలో పరస్పర విరుద్ధత లాంటివి. ఎందుకంటే అల్లాహ్ తన కొరకు పేర్లు మరియు గుణాలను నిర్ధారించుకున్నాడు, కానీ ఆయనతో సమానమైనది ఏదీ లేదని ఖండించాడు. అల్లాహ్ గుణాలను ధ్రువీకరించడం సారూప్యతను (తష్బీహ్) కలిగిస్తుందని భావిస్తే, అప్పుడు అల్లాహ్ మాటలలో వైరుధ్యం ఏర్పడుతుంది మరియు ఒక భాగం మరొక భాగాన్ని అబద్ధం చేస్తుంది.
రెండవది: రెండు విషయాలు పేరులో లేదా గుణంలో ఒకేలా ఉన్నంత మాత్రాన అవి సమానంగా ఉండవు. ఉదాహరణకు, మీరు ఇద్దరు వ్యక్తులను చూస్తారు; వారిద్దరూ మానవులే, వినగలవారు, చూడగలవారు మరియు మాట్లాడగలవారు. దాని నుండి ఇది అర్థం కాదు, అల్లాహ్ మరియు సృష్టి మానవ అర్థాలలో, వినడం, చూడడం మరియు మాట్లాడడంలో సమానంగా ఉంటారు.
మరియు మీరు జంతువులకు చేతులు, కాళ్ళు, కళ్ళు ఉండటం చూస్తారు. అయినప్పటికీ, వాటి చేతులు, కాళ్ళు మరియు కళ్ళు ఒకేలా ఉండవు.
సృష్టిలో ఉన్నవి పేరు లేదా గుణంలో ఒకేలా ఉన్నా వాటి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, సృష్టికర్తకు మరియు సృష్టికి మధ్య ఉన్న వ్యత్యాసం మరింత స్పష్టంగా మరియు గొప్పగా ఉంటుంది.
రెండవ వర్గము : (ముషబ్బిహ) వీరు పేర్లను,గుణాలను అల్లాహ్ తోపాటు ఆయన సృష్టిని పోల్చుతూ దృవీకరిస్తారు. ఇది నుసూస్ (ఖుర్ఆన్,హదీస్) సూచనకు తగినవిధంగా భావిస్తారు. ఎందుకంటే అల్లాహ్ తన దాసులతో వారు అర్ధం చేసుకునే విధంగా సంబోధిస్తాడు. కొన్ని కారణాల వలన ఈ భావన అసత్యము. అవి:
మొదటి కారణం: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను ఆయన సృష్టితో పోల్చడం అవాస్తవం. దీనిని బుద్ధి మరియు షరీఅహ్ ఖండిస్తాయి. అయితే గ్రంథము మరియు సున్నతు యొక్క సాక్ష్యం మరియు ఆవశ్యకత, తప్పు మరియు అబద్ధం అవటం పూర్తిగా అసాధ్యం.
రెండవది: అల్లాహ్ ప్రజలతో వారు అర్థం చేసుకోగలిగే విధంగానే మాట్లాడతాడు, కానీ దాని యొక్క వాస్తవికత మరియు అంతిమ స్వభావం అల్లాహ్ తన కొరకు మాత్రమే ఉంచుకుంటాడు. ఇది ఆయన వ్యక్తిగత గుణాలు మరియు లక్షణాలకు సంబంధించినది.
అల్లాహ్ తనను తాను 'వినేవాడు' అని నిర్ధారించుకున్నప్పుడు, ఆ వినికిడి (సౌండ్స్ ను గ్రహించడం) యొక్క మూల అర్థం మనకు తెలుసు. కానీ అల్లాహ్ యొక్క వినికిడికి సంబంధించిన వాస్తవ స్వభావం మనకు తెలియదు. ఎందుకంటే వినికిడి యొక్క వాస్తవ స్వభావం సృష్టిలో ఉన్నవాటిలో కూడా వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, సృష్టికర్త మరియు సృష్టికి మధ్య వ్యత్యాసం మరింత స్పష్టంగా మరియు గొప్పగా ఉంటుంది.
అల్లాహ్ తనను తాను తన సింహాసనం (అర్ష్) పై 'స్థిరపడ్డాడు, అధిరోహించాడు' అని చెప్పినప్పుడు, ఆ 'స్థిరపడటం, అధిరోహించడం' యొక్క మూల అర్థం మనకు తెలుసు. కానీ అల్లాహ్ యొక్క సింహాసనంపై స్థిరపడటం యొక్క వాస్తవ స్వభావం మనకు తెలియదు. ఎందుకంటే, ఒక సృష్టికి సంబంధించిన విషయంలో కూడా 'స్థిరపడటం' యొక్క వాస్తవ స్వభావం వేర్వేరుగా ఉంటుంది. స్థిరంగా నేలపై ఉన్న కుర్చీపై స్థిరంగా కూర్చోవడం, మూర్ఖంగా మరియు ఉద్రేకంగా ఉండే పొగరుబోతు ఒంటె పై స్థిరంగా కూర్చోవడం ఒకేలా ఉండదు. సృష్టిలో ఉన్నవాటి మధ్యనే ఈ విధంగా వ్యత్యాసం ఉన్నప్పుడు, సృష్టికర్తకు మరియు సృష్టికి మధ్య ఉన్న వ్యత్యాసం మరింత స్పష్టంగా మరియు గొప్పగా ఉంటుంది.
మరియు మనం వివరించిన విధంగా అల్లాహ్ పై విశ్వాసం ఉంచడం అనేది విశ్వాసులకు గొప్ప ఫలితాలను ఇస్తుంది, వాటిలో కొన్ని:
ఒకటి : అల్లాహ్ యొక్క ఏకదైవత్వం (తౌహీద్) ను నిరూపించటం,అదెలాగంటే కేవలం ఆయన ఒక్కరిపై తప్ప ఇతరులపై ఆశలు పెట్టుకోకూడదు, ఆయనకే భయపడాలి, ఆయనను తప్ప ఇతరులను ఆరాధించకూడదు.
రెండు : అల్లాహ్ మంచి నామములు, ఆయన గొప్ప గుణాలకు తగినట్లుగా మహోన్నతుడైన ఆయన పట్ల పరిపూర్ణంగా ప్రేమను, గౌరవమును కలిగి ఉండటం.
మూడు : ఆయన ఆదేశించిన వాటిని ఆచరించి, ఆయన వారించిన వాటిని విడనాడటం ద్వారా ఆయన ఆరాధనను నిరూపించటం.
దైవదూతలపై విశ్వాసం.
దైవదూతలు: వారు అగోచరమైన సృష్టి, అల్లాహ్ చే సృష్టించబడినవారు, ఆయనను ఆరాధించేవారు. వారికి సార్వభౌమత్వము లేదా దైవత్వం యొక్క లక్షణాలు ఏవీ లేవు. అల్లాహ్ వారిని కాంతి నుండి సృష్టించాడు మరియు తన ఆజ్ఞలను పూర్తిగా పాటించే శక్తిని మరియు వాటిని అమలు చేసే సామర్థ్యాన్ని వారికి ఇచ్చాడు. అల్లాహ్ ప్రకటన:
﴿...وَمَنۡ عِندَهُۥ لَا يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِهِۦ وَلَا يَسۡتَحۡسِرُونَ 19 يُسَبِّحُونَ ٱلَّيۡلَ وَٱلنَّهَارَ لَا يَفۡتُرُونَ 20﴾
మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు. వారు రాత్రింబవళ్ళు ఆయనను స్తుతిస్తూ ఉంటారు, అలసిపోరు. [అల్-అంబియా 21:19-20]
దైవదూతలు చాలా మంది ఉన్నారు, వారి సంఖ్యను అల్లాహ్ తప్ప మరెవరూ లెక్కించలేరు. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలోని అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీథులో ఉన్నట్లుగా, మి'రాజ్ (స్వర్గారోహణ) సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 'బైతుల్ మామూర్' (ఆకాశాలలోని కాబాగృహం వంటి ఆరాధనాలయము) చూపబడింది. ప్రతి రోజు 70 వేల మంది దేవదూతలు అక్కడ తవాఫ్ (పదక్షిణ) చేస్తారు, వారు ఒక్కసారి తవాఫ్ చేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిన తరువాత, మరలా వారికి ఎన్నటికీ (తవాఫ్ చేసే) అవకాశం రాదు.
దైవదూతలపై విశ్వాసం అన్నది నాలుగు విషయములను కలిగి ఉంది:
ఒకటి: వారి ఉనికి పట్ల విశ్వాసం కలిగి ఉండటం.
రెండు: ఏ దైవదూతల పేర్లు మనకు తెలియజేయబడినాయో, వారి పట్ల విశ్వాసమును కలిగి ఉండటం. ఉదాహరణకు జిబ్రయీల్ అలైహిస్సలాం. ఎవరి పేర్లైతే మనకు తెలియజేయబడలేదో వారి పట్ల కూడా విశ్వాసమును కలిగి ఉండటం.
మూడు: దైవదూతల గుణముల గురించి మనకు ఏమి తెలియజేయబడినదో దాన్ని విశ్వసించటం. ఉదాహరణకు జిబ్రయీల్ అలైహిస్సలాం సృష్టించబడిన లక్షణాల గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరచారు. ఆయనకు ఆరు వందల రెక్కలు కలవు. అవి ఆకాశమండలమును పూర్తిగా కప్పివేసేటంత పెద్దవిగా ఉంటాయి.
అప్పుడప్పుడు దైవదూతలు అల్లాహ్ ఆదేశము మెరకు మానవ రూపంలో కూడా ప్రత్యక్షమవుతారు. జిబ్రయీల్ అలైహిస్సలాం విషయంలో కూడా అలాగే జరిగింది; అల్లాహ్ ఆయనను మర్యమ్ అలైహిస్సలాం వద్దకు పంపించినప్పుడు ఆయన ఆమె వద్దకు సామాన్య మానవుని రూపంలో ప్రత్యక్షమయ్యారు. అలాగే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులతో కూర్చున్నప్పుడు, ఆయన స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలు ధరించి, నల్లటి జుట్టును కలిగిన ఒక మానవుని రూపంలో వచ్చారు; ఆయనపై ఎటువంటి ప్రయాణ చిహ్నములు కనిపించలేదు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోంచి ఎవరికీ ఆయన ఎవరో తెలియదు. ఆయన వచ్చి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మోకాళ్లకు తన మోకాళ్లను ఆనించి, తన అరచేతులను ఆయన తొడలపై పెట్టారు. ఆ తరువాత ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇస్లాం గురించి, ఈమాన్ గురించి, ఇహ్సాన్ గురించి, ప్రళయము మరియు దాని సూచనల గురించి ప్రశ్నించారు; దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. ఆయన వెళ్ళిపోయిన తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు:
«هَذَا جِبْرِيلُ؛ أَتَاكُمْ يُعَلِّمُكُمْ دِينَكُمْ».
ఇతనే జిబ్రయీల్ అలైహిస్సలాం; మీకు మీ ధర్మం గురించి నేర్పటానికి మీ వద్దకు వచ్చారు.8
మరియు అలాగే అల్లాహ్ ఇబ్రాహీం, లూత్ అలైహిమస్సలాం వద్దకు పంపించిన దేవదూతలు కూడా మానవ రూపంలోనే వచ్చారు.
దైవదూతలపై విశ్వాసంలో నాలుగవ అంశం: అల్లాహ్ ఆదేశాన్ని అనుసరించి వారు చేసే పనులను విశ్వసించడం - అలుపు లేకుండా, నిస్సత్తువ లేకుండా రాత్రింబవళ్ళు అల్లాహ్ ను కీర్తించడం మరియు ఆయనను ఆరాధించడం.
వారిలోని కొందరు దేవదూతలు కొన్ని ప్రత్యేక కార్యాల కొరకు ప్రత్యేకించబడి ఉన్నారు.
ఉదాహరణకు జిబ్రయీల్ అల్ అమీన్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క వహీ అందజేయడం కొరకు ప్రత్యేకించబడి ఉన్నారు. అల్లాహ్ తన దైవవాణిని ఇచ్చి ఆయనను తన సందేశహరుల వద్దకు, తన ప్రవక్తల వద్దకు పంపించాడు.
ఉదాహరణకు మీకాయీల్ అలైహిస్సలాంకు వర్షం, మొక్కల బాధ్యత ఇవ్వబడినది.
ఉదాహరణకు ఇస్రాఫీల్ అలైహిస్సలాంకు ప్రళయం సంభవించేటప్పుడు, మానవులు మరలా ప్రాణాలతో లేపబడేటప్పుడు బాకా ఊదే బాధ్యత ఇవ్వబడి ఉన్నారు.
అలాగే మలకుల్ మౌత్ ఎవరికైనా మరణం ఆసన్నమైనప్పుడు, వారి ఆత్మలను సేకరించే బాధ్యత ఇవ్వబడి ఉన్నారు.
అలాగే మాలిక్ కి నరకము యొక్క బాధ్యత ఇవ్వబడి ఉంది. అంతేగాక అతడు నరకం యొక్క రక్షక భటుడు కూడా.
మరియు అలాగే మాతృగర్భములలో ఉండే శిశువులపై బాధ్యులుగా ఉండే దైదూతలు, తల్లి గర్భంలో పిండం నాలుగు నెలలు పూర్తి చేసుకోగానే అల్లాహ్ ఒక దైవదూతను పంపి, ఆ శిశువు ఆహారము గురించి, ఆయుషు గురించి, ఆచరణల గురించి, పుణ్యాత్ముడవుతాడో మరియు పాపాత్ముడవుతాడో వ్రాయమని ఆదేశించి పంపుతాడు.
మరియు అలాగే ఆదము సంతతి యొక్క ఆచరణల పరిరక్షణ, వాటిని వ్రాసే బాధ్యత ఇవ్వబడిన దైవదూతలు. ప్రతీ మానవుని కొరకు ఇద్దరు దైవదూతలు ఉంటారు. ఒకరు కుడి వైపున, మరొకరు ఎడమ వైపున ఉంటారు.
మరియు అలాగే శవమును సమాధిలో ఉంచినప్పుడు అతడిని ప్రశ్నించే బాధ్యత ఇవ్వబడిన దైవదూతలు. అతని వద్దకు ఇద్దరు దైవదూతలు వచ్చి అతని ప్రభువు గురించి, అతని ధర్మం గురించి మరియు అతని ప్రవక్త గురించి అతడిని ప్రశ్నిస్తారు.
దైవదూతలపై విశ్వాసం చూపటం పెద్ద పెద్ద ప్రయోజనాలను ప్రసాదిస్తుంది, వాటిలో నుండి కొన్ని:
1 - అల్లాహ్ యొక్క గొప్పతనం, శక్తి మరియు సామర్ధ్యం యొక్క జ్ఞానం లభిస్తుంది, ఎందుకంటే సృష్టి యొక్క గొప్పతనం, సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంది.
2 - రెండవది: అల్లాహ్ ఆదము సంతతి పట్ల చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞత చూపాలి. ఎందుకంటే ఆయన ఈ దేవదూతలను వారిని సంరక్షించడానికి, వారి పనులను వ్రాయడానికి మరియు వారి ఇతర ప్రయోజనాలను నెరవేర్చడానికి నియమించాడు.
3 - మూడవది: అల్లాహ్ ను ఆరాధించడంలో వారు చూపే అంకితభావానికి గాను దేవదూతలను ప్రేమించడం.
కొందరు అవినీతిపరులు మరియు తప్పుదారి పట్టిన వ్యక్తులు దైవదూతల భౌతిక ఉనికిని తిరస్కరించారు, దైవదూతలు అంటే మానవులలోని మంచితనం యొక్క రహస్య శక్తి అని వారు అంటున్నారు, కాని ఇది అల్లాహ్ గ్రంథము, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు మరియు ముస్లింల ఇజ్మాల (ఏకాభిప్రాయం) యొక్క తిరస్కరణ.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿ٱلۡحَمۡدُ لِلَّهِ فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ جَاعِلِ ٱلۡمَلَٰٓئِكَةِ رُسُلًا أُوْلِيٓ أَجۡنِحَةٖ مَّثۡنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَۚ...﴾
సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! భూమ్యా కాశాల సృష్టికి మూలాధారి. ఆయనే దేవదూతలను సందేశాలు అందజేసేవారిగా నియమించాడు. వారు రెండేసి, మూడేసి లేదా నాలుగేసి రెక్కలు గలవారు... [ఫాతిర్ 35:1]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَوۡ تَرَىٰٓ إِذۡ يَتَوَفَّى ٱلَّذِينَ كَفَرُواْ ٱلۡمَلَٰٓئِكَةُ يَضۡرِبُونَ وُجُوهَهُمۡ وَأَدۡبَٰرَهُم...﴾
మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ... [అల్-అన్'ఫాల్ 8:50]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَلَوۡ تَرَىٰٓ إِذِ ٱلظَّٰلِمُونَ فِي غَمَرَٰتِ ٱلۡمَوۡتِ وَٱلۡمَلَٰٓئِكَةُ بَاسِطُوٓاْ أَيۡدِيهِمۡ أَخۡرِجُوٓاْ أَنفُسَكُمُۖ...﴾
...దుర్మార్గులు మరణ వేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: "మీ ప్రాణాలను వదలండి!... [అల్-అన్'ఆమ్ 6:93]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...حَتَّىٰٓ إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمۡ قَالُواْ مَاذَا قَالَ رَبُّكُمۡۖ قَالُواْ ٱلۡحَقَّۖ وَهُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ﴾
...చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు వారు (దేవదూతలు): "మీ ప్రభువు మీతో చెప్పిందేమిటీ?" అని అడుగుతారు. దానికి వారంటారు: "సత్యం మాత్రమే!" మరియు ఆయన మహోన్నతుడు, మహనీయుడు. [సబా 34:23]
అల్లాహ్ స్వర్గవాసుల గురించి ఇలా సెలవిచ్చాడు:
﴿...وَٱلۡمَلَٰٓئِكَةُ يَدۡخُلُونَ عَلَيۡهِم مِّن كُلِّ بَابٖ 23 سَلَٰمٌ عَلَيۡكُم بِمَا صَبَرۡتُمۡۚ فَنِعۡمَ عُقۡبَى ٱلدَّارِ 24﴾
... మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు. (దేవదూతలు అంటారు): "మీ సహనానికి, ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగు గాక(సలాం)! ఇక ఈ అంతిమ (పరలోక) గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది!" [అర్రఅద్ 13:23-24].
సహీహ్ బుఖారీలోని అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«إِذَا أَحَبَّ اللَّهُ الْعَبْدَ نَادَى جِبْرِيلَ: إِنَّ اللَّهَ يُحِبُّ فُلَانًا فَأَحْبِبْهُ، فَيُحِبُّهُ جِبْرِيلُ، فَيُنَادِي جِبْرِيلُ فِي أَهْلِ السَّمَاءِ: إِنَّ اللَّهَ يُحِبُّ فُلَانًا فَأَحِبُّوهُ، فَيُحِبُّهُ أَهْلُ السَّمَاءِ، ثُمَّ يُوضَعُ لَهُ الْقَبُولُ فِي الْأَرْضِ».
అల్లాహ్ తన దాసుడిని ఇష్టపడినప్పుడు జిబ్రయీలుతో ప్రకటింపజేస్తాడు; ‘నిశ్చయంగా అల్లాహ్ ఫలానా దాసుడిని ప్రేమిస్తున్నాడు, నీవు కూడా అతన్ని ప్రేమించు.’ ఆపై జిబ్రయీల్ కూడా అతడిని ప్రేమిస్తాడు; ఆపై జిబ్రయీల్ ఆకాశవాసులలో ప్రకటిస్తాడు: ‘నిశ్చయంగా అల్లాహ్ ఫలానా అతడిని ప్రేమిస్తున్నాడు, మీరు కూడా అతడిని ప్రేమించండి.’ ఆపై ఆకాశవాసులు కూడా అతడిని ప్రేమిస్తారు; ఆ పిదప భూలోకవాసులలో అతను గౌరవనీయుడిగా మారిపోతాడు".9
సహీహైన్ లోనే అబూహురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«إِذَا كَانَ يَوْمُ الْجُمُعَةِ كَانَ عَلَى كُلِّ بَابٍ مِنْ أَبْوَابِ الْمَسْجِدِ الْمَلَائِكَةُ يَكْتُبُونَ الْأَوَّلَ فَالْأَوَّلَ، فَإِذَا جَلَسَ الْإِمَامُ طَوَوْا الصُّحُفَ وَجَاءُوا يَسْتَمِعُونَ الذِّكْرَ».
జుమా రోజున మస్జిదులోని ప్రతి ద్వారం వద్ద దైవదూతలు కూర్చుని మొదట ప్రవేశించిన వారి పేర్లు రాస్తారు, తరువాత ఇమామ్ మింబర్ మీద కూర్చోగానే, వారు తమ రిజిస్టర్ మూసివేసి ఖుత్బా (ప్రసంగం) వినడంలో లీనమైపోతారు.10
ఈ ఆయతులు (ఖుర్ఆన్ వచనాలు మరియు హదీథులు) దైవదూతలకు భౌతిక ఉనికి ఉందని మరియు కొంతమంది మార్గవిహీనులు పలికినట్లు రూపం లేని సృష్టిరాశులు కాదని స్పష్టమైన సాక్ష్యాలు, మరియు స్పష్టమైన నియమాల ఆధారంగా, ముస్లింలందరూ ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు.
దైవగ్రంధాలపై విశ్వాసము
అల్ కుతుబ్ అనేది కితాబున్ యొక్క బహువచనం దాని అర్ధము మక్తూబున్ (వ్రాయబడినది) నుండి వస్తుంది.
ఇక్కడ వాటి అర్థం: తాను సృష్టించిన మానవజాతి పట్ల దయగా, వారికి మార్గదర్శకత్వంగా అల్లాహ్ తన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంథాలు. వాటి ద్వారా వారు ఇహపరలోకాలలో సుఖాన్ని పొందగలుగుతారు.
దైవ గ్రంధముల పై విశ్వాసం అన్నది నాలుగు విషయములను కలిగి ఉన్నది:
మొదటిది: అవి నిజంగా అల్లాహ్ నుండే అవతరించాయని విశ్వసించడం.
రెండు: వాటిలో నుండి వేటి పేరు మనకు తెలియజేయబడినదో దానిని విశ్వసించటం. ఉదాహరణకు ఖుర్ఆన్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడినదని, తౌరాత్ మూసా అలైహిస్సలాం పై అవతరింపబడినదని విశ్వసించడం. మరియు ఈసా అలైహిస్సలాంపై ఇంజీలు అవతరింపజేయబడినదని విశ్వసించడం. మరియు జబూర్ దావూద్ అలైహిస్సలాంకు ఇవ్వబడినదని. ఇక వేటి పేర్లు మనకు తెలియజేయబడలేదో వాటిపై కూడా సంక్షిప్తముగా విశ్వాసమును కలిగి ఉండటం.
మూడు: వాటిలోని సమాచారములు సరియైనవని దృవీకరించటం. ఉదాహరణకు ఖుర్ఆన్ సమాచారములు మరియి మార్పు చేర్పులు జరగని పూర్వ గ్రంథముల సమాచారములు.
నాలుగు: రద్దుపరచబడని వాటి ఆదేశములను ఆచరించటం, వాటి పట్ల సంతృప్తి చెందటం, వాటిని అంగీకరించటం. దాని విజ్ఞత మాకు అర్దం అయినా లేదా అర్ధం కాకపోయిన సరే. అయితే, పూర్వ గ్రంథాలన్నీ దివ్యఖుర్ఆన్ ద్వారా రద్దు పరచబడినాయి. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِۖ...﴾
మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది... [అల్-మాయిదా 5:48] అనగా: అతనిపై నిర్ణయాత్మకంగా ఉంటుంది.
కావున పూర్వగ్రంథాల ఆదేశాలలో నుంచి ఖుర్ఆన్ దృవీకరించిన, సరియైనవని తెలిపిన వాటిని తప్ప వేటినీ ఆచరించటం ధర్మసమ్మతం కాదు.
దైవగ్రంథాలపై విశ్వాసం చూపటం పెద్ద పెద్ద ఫలాలను ప్రసాదిస్తుంది, వాటిలో నుండి కొన్ని:
మొదటిది: అల్లాహ్ తన దాసుల పట్ల చూపిన శ్రద్ధ గురించి తెలుసుకోవడం. ఎందుకంటే ఆయన ప్రతి జాతికి మార్గదర్శకత్వం కోసం ఒక గ్రంథాన్ని అవతరింపజేశాడు.
రెండవది: అల్లాహ్ తన షరిఅహ్ చట్టంలో చూపించిన వివేకం గురించి తెలుసుకోవడం. ఎందుకంటే ఆయన ప్రతి జాతి కొరకు వారి పరిస్థితులకు అనుగుణంగా తగిన షరిఅహ్ చట్టాన్ని నిర్ధారించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
﴿...لِكُلّٖ جَعَلۡنَا مِنكُمۡ شِرۡعَةٗ وَمِنۡهَاجٗاۚ...﴾
మీలో ప్రతి ఒక్క సమాజానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. [అల్-మాయిదా 5:48]
మూడవది: ఈ విషయములో అల్లాహ్ అనుగ్రహానికి కృతజ్ఞతగా ఉండటం.
దైవసందేశహరులపై విశ్వాసము.
అర్రుసులు: రసూల్ పదము యొక్క బహువచనం; దాని అర్ధం ముర్సల్. అంటే ఏదైన వస్తువును అందజేయటానికి, చేరవేయడానికి పంపించబడినవాడు.
ఇక్కడ రుసుల్ అంటే: మానవులలో ఎవరికైతే తమ దైవానిని ఇచ్చి , దానిని ప్రజలకు అందజేయమని ఆదేశించాడో, ఆ పుణ్యపురుషులు.
దైవసందేశహరులలో మొదటి వారు నూహ్ అలైహిస్సలాం, మరియు వారిలో చిట్టచివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿ إِنَّآ أَوۡحَيۡنَآ إِلَيۡكَ كَمَآ أَوۡحَيۡنَآ إِلَىٰ نُوحٖ وَٱلنَّبِيِّـۧنَ مِنۢ بَعۡدِهِ...﴾
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము... (అన్-నిసా 4:163)
సహీహ్ బుఖారీలోని అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనలో షఫాఅత్ గురించి హదీథు నమోదు చేయబడి ఉన్నది. అందులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«ذُكِرَ أَنَّ النَّاسَ يَأْتُونَ إِلَى آدَمَ؛ لِيَشْفَعَ لَهُمْ، فَيَعْتَذِرُ إِلَيْهِمْ وَيَقُولُ: ائْتُوا نُوحًا أَوَّلَ رَسُولٍ بَعَثَهُ اللَّهُ» وذكر تمام الحديث.
ప్రజలు తమ కొరకు సిఫారసు చేయించుకోవటానికి ఆదము అలైహిస్సలాం వద్దకు వస్తారు. ఆయన వారిని నిరాకరిస్తారు. మరియు ఇలా తెలుపుతారు మీరు మొట్టమొదట సందేశహరుడిగా అల్లాహ్ పంపించిన నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళండి. మరియు ఆయన పూర్తి హదీథును ప్రస్తావించారు.11
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అల్లాహ్ ప్రకటన:
﴿مَّا كَانَ مُحَمَّدٌ أَبَآ أَحَدٖ مِّن رِّجَالِكُمۡ وَلَٰكِن رَّسُولَ ٱللَّهِ وَخَاتَمَ ٱلنَّبِيِّـۧنَۗ...﴾
(ఓ మానవులారా!) ముహమ్మద్, మీ పురుషులలో ఎవ్వరికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చిట్టచివరివాడు... [అల్-అహ్'జాబ్ 33:40].
స్వతంత్ర షరిఅహ్ చట్టాన్ని అందజేయడానికి అల్లాహ్ పంపిన ప్రవక్త లేదా, తనకు పూర్వం వచ్చిన ప్రవక్తల, సందేశహరుల షరిఅహ్ చట్టాన్ని పునరుద్ధరించే దైవ ప్రకటన అందుకునేందుకు అల్లాహ్ పంపిన ప్రవక్త లేకుండా ఏ జాతి కూడా గతించలేదు. అల్లాహ్ ప్రకటన:
﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَۖ...﴾
మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి. [అన్-నహల్ 16:36]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿...وَإِن مِّنۡ أُمَّةٍ إِلَّا خَلَا فِيهَا نَذِيرٞ﴾
మరియు హెచ్చరిక చేసేవాడు వారి మధ్య లేకుండా, ఏ సమాజం కూడా గతించి పోలేదు! [ఫాతిర్ 35:24]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿إِنَّآ أَنزَلۡنَا ٱلتَّوۡرَىٰةَ فِيهَا هُدٗى وَنُورٞۚ يَحۡكُمُ بِهَا ٱلنَّبِيُّونَ ٱلَّذِينَ أَسۡلَمُواْ لِلَّذِينَ هَادُواْ...﴾
నిశ్చయంగా, మేము తౌరాత్ ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్ కు విధేయులైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదుల మధ్య తీర్పు చేస్తూ ఉండేవారు... [అల్-మాయిదా 5:44]
ప్రవక్తలందరు మానవులే మరియు సృష్టించబడినవారే. వారికి తౌహీదే రుబూబియతు, ఉలూహియతులలో నుండి ఎటువంటి ప్రత్యేకతలు లేవు. మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇలా సెలవిచ్చాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల అధినాయకుడు మరియు అల్లాహ్ వద్ద వారందరి కంటే గొప్ప స్థానం గలవారు :
﴿قُل لَّآ أَمۡلِكُ لِنَفۡسِي نَفۡعٗا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ وَلَوۡ كُنتُ أَعۡلَمُ ٱلۡغَيۡبَ لَٱسۡتَكۡثَرۡتُ مِنَ ٱلۡخَيۡرِ وَمَا مَسَّنِيَ ٱلسُّوٓءُۚ إِنۡ أَنَا۠ إِلَّا نَذِيرٞ وَبَشِيرٞ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ 188﴾
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే! [అల్-ఆరాఫ్ 7:188].
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿قُلۡ إِنِّي لَآ أَمۡلِكُ لَكُمۡ ضَرّٗا وَلَا رَشَدٗا 21 قُلۡ إِنِّي لَن يُجِيرَنِي مِنَ ٱللَّهِ أَحَدٞ وَلَنۡ أَجِدَ مِن دُونِهِۦ مُلۡتَحَدًا 22﴾
వారితో ఇలా అను: "నిశ్చయంగా, మీకు కీడు చేయటం గానీ, లేదా సరైన మార్గం చూపటం గానీ నా వశంలో లేదు." వారితో ఇలా అను: "నిశ్చయంగా, నన్ను అల్లాహ్ నుండి ఎవరూ రక్షించలేరు మరియు ఆయన తప్ప నాకు ఎక్కడా ఆశ్రయం లభించదు." [అల్-జిన్న్ 72: 21-22].
అయినప్పటికీ, వారికి మానవ లక్షణాలు ఉంటాయి: అనారోగ్యం, మరణం, ఆహారం, పానీయం వంటి వాటి అవసరం. ఇబ్రాహీం (అలైహిస్సలాం) తన ప్రభువును గురించి వివరిస్తూ ఇలా అన్నారు:
﴿وَٱلَّذِي هُوَ يُطۡعِمُنِي وَيَسۡقِينِ 79 وَإِذَا مَرِضۡتُ فَهُوَ يَشۡفِينِ 80 وَٱلَّذِي يُمِيتُنِي ثُمَّ يُحۡيِينِ 81﴾
ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు. మరియు నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయనే నన్ను స్వస్థపరచేవాడు. మరియు ఆయనే నన్ను ప్రాణం తీసి, తిరిగి జీవింపజేయువాడు. [అష్-షు'అరా 26:79-81]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«إِنَّمَا أَنَا بَشَرٌ مِثْلُكُمْ، أَنْسَى كَمَا تَنْسَوْنَ، فَإِذَا نَسِيتُ فَذَكِّرُونِي».
నేను కేవలం మీ లాంటి మానవుడ్ని మాత్రమే. మీరు మరచిపోయినట్లే నేనూ మరచిపోతాను. అయితే నేను మరచిపోయినప్పుడు మీరు నన్ను గుర్తు చేయండి."12.
మరియు అల్లాహ్ ప్రవక్త, సందేశహరుల ఉన్నత స్థానాన్ని మరియు వారి గొప్పతనాన్ని వివరిస్తూ వారు తననే ఆరాధిస్తారని వారి గురించి ఇలా వర్ణించాడు; నూహ్ అలైహిస్సలాం విషయంలో అల్లాహ్ ప్రకటన:
﴿...إِنَّهُۥ كَانَ عَبۡدٗا شَكُورٗا﴾
నిశ్చయంగా అతను కృతజ్ఞుడైన దాసుడు. [అల్-ఇస్రా 17:3] మరియు అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో అల్లాహ్ ప్రకటన:
﴿تَبَارَكَ ٱلَّذِي نَزَّلَ ٱلۡفُرۡقَانَ عَلَىٰ عَبۡدِهِۦ لِيَكُونَ لِلۡعَٰلَمِينَ نَذِيرًا 1﴾
సర్వలోకాలకు హెచ్చరిక చేసేదిగా, ఈ గీటురాయిని (ఫుర్ఖాన్ ను) తన దాసునిపై క్రమక్రమంగా అవతరింపజేసిన ఆయన (అల్లాహ్) ఎంతో శుభదాయకుడు! [ఫుర్ఖాన్ 25:1]
మరియు ఇబ్రాహీం,ఇస్హాఖ్,యాఖూబ్ అలైహిముస్సలాం గురించి అల్లాహ్ ప్రకటన:
﴿وَٱذۡكُرۡ عِبَٰدَنَآ إِبۡرَٰهِيمَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ أُوْلِي ٱلۡأَيۡدِي وَٱلۡأَبۡصَٰرِ 45 إِنَّآ أَخۡلَصۡنَٰهُم بِخَالِصَةٖ ذِكۡرَى ٱلدَّارِ 46 وَإِنَّهُمۡ عِندَنَا لَمِنَ ٱلۡمُصۡطَفَيۡنَ ٱلۡأَخۡيَارِ 47﴾
మరియు మా దాసులైన ఇబ్రాహీమ్, ఇస్'హాఖ్ మరియు యఅఖూబ్ లను జ్ఞాపకం చేసుకో! వారు గొప్ప కార్యశీలురు మరియు దూరదృష్టి గలవారు. నిజముగా మేము వారిని స్వచ్ఛమైన వారి జ్ఞాపకంతో ప్రత్యేకించాము. మరియు వారు మా వద్ద ఎంపిక చేయబడిన మంచి వారిలో ఉన్నారు. [సాద్ 38:45-47]
మరియు ఈసా ఇబ్న్ మర్యం అలైహిస్సలాం విషయంలో అల్లాహ్ ప్రకటన:
﴿إِنۡ هُوَ إِلَّا عَبۡدٌ أَنۡعَمۡنَا عَلَيۡهِ وَجَعَلۡنَٰهُ مَثَلٗا لِّبَنِيٓ إِسۡرَٰٓءِيلَ 59﴾
అతను (ఈసా) కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహిచాము. మరియు మేము అతనిని ఇస్రాయీల్ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము. [జుఖ్రుఫ్ 43:59].
దైవప్రవక్తలపై విశ్వాసం అన్నది నాలుగు విషయములను కలిగి ఉన్నది:
ఒకటి: వారి దైవదౌత్యము (నబూవ్వత్) అల్లాహ్ వద్ద నుంచి వచ్చిన సత్యమని విశ్వసించాలి. ఎవరైతే వారిలో నుంచి ఏ ఒక్కరి దైవదౌత్యమును నిరాకరిస్తాడో వారందరిని నిరాకరించినవాడు అవుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿كَذَّبَتۡ قَوۡمُ نُوحٍ ٱلۡمُرۡسَلِينَ 105﴾
నూహ్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది. [అష్షూరా 26:105] అల్లాహ్ నూహ్ జాతివారిని ప్రవక్తలందరిని తిరస్కరించిన వారిలో చేర్చాడు. ఇంకా వారు నూహ్ ను తిరస్కరించినప్పుడు అక్కడ ఆయన తప్ప ఇంకెవరు ప్రవక్తలు లేరు. దీని ప్రకారం, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అబద్ధమని చెప్పి, ఆయనను అనుసరించని క్రైస్తవులు, నిజానికి మర్యం కుమారుడైన మసీహ్ అలైహిస్సలాంను కూడా అబద్ధమని చెప్పినట్టే మరియు ఆయనను కూడా అనుసరించనట్టే. ప్రత్యేకించి, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి మసీహ్ అలైహిస్సలాం వారికి శుభవార్త చెప్పాడు. ఆ శుభవార్తకు అర్థం ఏమిటంటే, ఆయన వారి వద్దకు పంపబడిన ఒక ప్రవక్త, సందేశహరుడు. ఆయన ద్వారా అల్లాహ్ వారిని మార్గభ్రష్టత్వం నుండి రక్షిస్తాడు మరియు సరైన మార్గానికి నడిపిస్తాడు."
రెండవది: మనకు పేర్లు తెలుపబడిన ప్రవక్తలను వారి పేర్లతో సహా విశ్వసించడం. ఉదాహరణకు: ముహమ్మద్, ఇబ్రహీం, మూసా, ఈసా మరియు నూహ్ (అలైహిస్సలాము). ఈ ఐదుగురు ప్రవక్తలు ప్రవక్తలలో నుంచి ఉలుల్ అజ్మ్ ప్రవక్తలు (దృఢ సంకల్పము గల ప్రవక్తలు). అల్లాహ్ ఖుర్ఆన్ లో రెండు చోట్ల ఇలా పేర్కొన్నాడు:
﴿وَإِذۡ أَخَذۡنَا مِنَ ٱلنَّبِيِّـۧنَ مِيثَٰقَهُمۡ وَمِنكَ وَمِن نُّوحٖ وَإِبۡرَٰهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ٱبۡنِ مَرۡيَمَۖ وَأَخَذۡنَا مِنۡهُم مِّيثَٰقًا غَلِيظٗا 7﴾
మరియు (జ్ఞాపకముంచుకో) వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము మరియు నీతో (ఓ ముహమ్మద్), నూహ్ తో, ఇబ్రాహీమ్ తో, మూసాతో మరియు మర్యమ్ కుమారుడైన ఈసాతో కూడా! మరియు మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము. [అల్-అహ్'జాబ్ 33:7] మరియు అల్లాహ్ ప్రకటన:
﴿شَرَعَ لَكُم مِّنَ ٱلدِّينِ مَا وَصَّىٰ بِهِۦ نُوحٗا وَٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ وَمَا وَصَّيۡنَا بِهِۦٓ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰٓۖ أَنۡ أَقِيمُواْ ٱلدِّينَ وَلَا تَتَفَرَّقُواْ فِيهِۚ كَبُرَ عَلَى ٱلۡمُشۡرِكِينَ مَا تَدۡعُوهُمۡ إِلَيۡهِۚ ٱللَّهُ يَجۡتَبِيٓ إِلَيۡهِ مَن يَشَآءُ وَيَهۡدِيٓ إِلَيۡهِ مَن يُنِيبُ 13﴾
ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు. [అష్-షూరా 42:13]
ఇక ఏ ప్రవక్తల పేరు మనకు తెలుపబడలేదో వారిపై మనం సంక్షిప్తంగా విశ్వాసం కనబరచాలి. అల్లాహ్ ప్రకటన:
﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا رُسُلٗا مِّن قَبۡلِكَ مِنۡهُم مَّن قَصَصۡنَا عَلَيۡكَ وَمِنۡهُم مَّن لَّمۡ نَقۡصُصۡ عَلَيۡكَۗ...﴾
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము; వారిలో కొందరి వృత్తాంతం మేము నీకు తెలిపాము; మరికొందరిని గురించి నీకు తెలుపలేదు. [గాఫిర్ 40:78]
మూడవది: వారి గురించి ఏ సమాచారాలైతే నిజమైనవో, వాటిని నమ్మటం.
నాలుగవది: మన వైపు పంపబడిన ప్రవక్తలలో చిట్టచివరివారైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క షరిఅతు (ఇస్లామీయ ధార్మిక చట్టం) ప్రకారం ఆచరించడం,ఎందుకంటే ఆయన (ప్రళయం వరకు వచ్చే) సమస్త మానవాళి కొరకు పంపబడినవారు.
﴿فَلَا وَرَبِّكَ لَا يُؤۡمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيۡنَهُمۡ ثُمَّ لَا يَجِدُواْ فِيٓ أَنفُسِهِمۡ حَرَجٗا مِّمَّا قَضَيۡتَ وَيُسَلِّمُواْ تَسۡلِيمٗا 65﴾
అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు! [అన్-నిసా 4:65]
ప్రవక్తలను విశ్వసించటం వలన లభించే గొప్ప ప్రతిఫలాలు:
ఒకటి: తన దాసులపై అల్లాహ్ యొక్క కారుణ్యము, అనుగ్రహము గురించి జ్ఞానము ప్రాప్తిస్తుంది; ఏవిధంగానైతే వారిని అల్లాహ్ మార్గము వైపునకు సన్మార్గము చూపించటం కొరకు, వారు అల్లాహ్ ఆరాధన ఎలా చేయాలో వారికి తెలియపరచటం కొరకు వారి వైపునకు సందేశహరులను పంపించాడో అలా. ఎందుకంటే మానవుని బుద్ది స్వయంగా దానిని గ్రహించదు.
రెండు : ఈ గొప్ప అనుగ్రహంపై అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవటం.
మూడు: దైవసందేశహరులు అలైహిముస్సలాం పట్ల ప్రేమ, ఆదరాభిమానాలు చూపటం మరియు వారికి తగినవిధంగా వారి గొప్పతనాన్ని కొనియాడటం. ఎందుకంటే వారు అల్లాహ్ యొక్క ప్రవక్తలు, అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే చేసేవారు, ఆయన సందేశాలను తమ ప్రజలకు అందజేసేవారు మరియు అల్లాహ్ దాసులకు హితబోధ చేసేవారు.
సత్య తిరస్కారులు అల్లాహ్ యొక్క ప్రవక్తలు మానవులలో నుండి కాజాలరని భావించి తమ వైపు పంపించబడిన ప్రవక్తలను తిరస్కరించారు. అల్లాహ్ దీని గురించి ఖుర్ఆన్ లో ప్రస్తావించి, పరిశుభ్రమైన వాడు తమ వాక్కుతో దానిని తీవ్రంగా ఖండించాడు :
﴿وَمَا مَنَعَ ٱلنَّاسَ أَن يُؤۡمِنُوٓاْ إِذۡ جَآءَهُمُ ٱلۡهُدَىٰٓ إِلَّآ أَن قَالُوٓاْ أَبَعَثَ ٱللَّهُ بَشَرٗا رَّسُولٗا 94 قُل لَّوۡ كَانَ فِي ٱلۡأَرۡضِ مَلَٰٓئِكَةٞ يَمۡشُونَ مُطۡمَئِنِّينَ لَنَزَّلۡنَا عَلَيۡهِم مِّنَ ٱلسَّمَآءِ مَلَكٗا رَّسُولٗا 95﴾
మరియు ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా వారిని ఆపిందేమిటి? వారు (మూఢ విశ్వాసంలో మునిగి): "ఏమీ? అల్లాహ్ మానవుణ్ణి తన సందేశహరునిగా పంపాడా?" అని పలకడం తప్ప! (94) చెప్పు: "భూమిపై మలయకులు(దైవ దూతలు) నడుస్తూ ఉంటే, మేము వారి మీద ఆకాశం నుండి ఒక మలయకుని సందేశహరునిగా పంపేవాళ్లం." (95) [అల్-ఇస్రా 17:94-95]
అల్లాహ్ ఈ వాదనను తప్పు అని నిరూపించాడు; ఎందుకంటే ప్రవక్త తప్పనిసరిగా మానవుడై ఉండాలి. ఆయన భూమిపై ఉన్న మానవుల వద్దకు పంపబడినవాడై ఉండాలి . ఒకవేళ భూమిపై ఉన్నవారు దైవదూతలైతే, అప్పుడు అల్లాహ్ వారి వద్దకు ఒక దైవదూతను ప్రవక్తగా పంపేవాడు; ఎందుకంటే ఆ ప్రవక్త కూడా వారిలాగానే ఉండాలి. మరియు ఇదే విధంగా ప్రవక్తలను తిరస్కరించి వారితో ఇలా పలికిన వారి గురించి అల్లాహ్ ఇలా ప్రకటించినాడు:
﴿...إِنۡ أَنتُمۡ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا تُرِيدُونَ أَن تَصُدُّونَا عَمَّا كَانَ يَعۡبُدُ ءَابَآؤُنَا فَأۡتُونَا بِسُلۡطَٰنٖ مُّبِينٖ 10 قَالَتۡ لَهُمۡ رُسُلُهُمۡ إِن نَّحۡنُ إِلَّا بَشَرٞ مِّثۡلُكُمۡ وَلَٰكِنَّ ٱللَّهَ يَمُنُّ عَلَىٰ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦۖ وَمَا كَانَ لَنَآ أَن نَّأۡتِيَكُم بِسُلۡطَٰنٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ...﴾
మీరు కూడా మా వంటి మానవులే, మీరు మా తండ్రితాతలు ఆరాధిస్తూ వచ్చిన (దైవాల) ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా? అయితే స్పష్టమైన ప్రమాణం ఏదైనా తీసుకురండి." వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు: "మేము కూడా మీలాంటి మానవులమే, కానీ అల్లాహ్ తన దాసులలో ఎవరికైనా అనుగ్రహిస్తాడు. మరియు అల్లాహ్ అనుమతి లేకుండా మేము మీకు స్పష్టమైన ప్రమాణం తీసుకురాలేము. [ఇబ్రాహీం 14:10-11]
అంతిమదినంపై విశ్వాసము
అంతిమ దినం: ఇది తీర్పు మరియు ప్రతిఫలం కోసం ప్రజలు తిరిగి లేపబడే పునరుత్థాన దినం.
దీనికి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, దాని తర్వాత వేరే దినము ఏదీ ఉండదు. అప్పుడు స్వర్గవాసులు తమ స్వర్గనివాసాలలో,నరకవాసులు తమ స్థానాలలో స్థిరపడతారు.
అంతిమదినంపై విశ్వాసం మూడు విషయాలను కలిగి ఉంది:
మొదటిది: పునరుత్థానంపై విశ్వాసం. అంటే, రెండవసారి బాకా ఊదినప్పుడు చనిపోయినవారిని తిరిగి సజీవంగా చేయడం. అప్పుడు ప్రజలు తమ ప్రభువు ముందు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా, సున్నతి జరగని స్థితిలో నిలబడతారు. అల్లాహ్ ప్రకటన:
﴿...كَمَا بَدَأۡنَآ أَوَّلَ خَلۡقٖ نُّعِيدُهُۥۚ وَعۡدًا عَلَيۡنَآۚ إِنَّا كُنَّا فَٰعِلِينَ﴾
మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము. [అల్-అంబియా 21:104 ]
మరణాంతరం మరల లేపబడటం వాస్తవము, స్పష్టంగా నిరూపితమైనది. దీనిపై ఖుర్ఆన్, హదీథులు మరియు ముస్లింల ఇజ్మా నుండి ఆధారములు కలవు.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿ثُمَّ إِنَّكُم بَعۡدَ ذَٰلِكَ لَمَيِّتُونَ 15 ثُمَّ إِنَّكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ تُبۡعَثُونَ 16﴾
ఆ తరువాత మీరు నిశ్చయంగా మరణిస్తారు. ఆ తరువాత మీరు తీర్పుదినాన తిరిగి లేపబడతారు. [అల్-ముమినూన్ 23:15-16]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«يُحْشَرُ النَّاسُ يَوْمَ الْقِيَامَةِ حُفَاةً عُرَاةً غُرْلًا».
తీర్పు దినాన ప్రజలు చెప్పులు లేకుండా, నగ్నంగా మరియు ఖత్నా జరగని స్థితిలో సమీకరించబడతారు."13 (బుఖారీ, ముస్లిం)
ముస్లింలు దీనిపై ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. ఇది దైవిక వివేకానికి అవసరం కూడా. ఎందుకంటే అల్లాహ్ ఈ సృష్టికి ఒక పునరుత్థానాన్ని ఏర్పాటు చేయాలి, అక్కడ ఆయన తన ప్రవక్తల ద్వారా పంపిన షరిఅతు చట్టాల ప్రకారం జీవించిన వారికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అల్లాహ్ ప్రకటన:
﴿أَفَحَسِبۡتُمۡ أَنَّمَا خَلَقۡنَٰكُمۡ عَبَثٗا وَأَنَّكُمۡ إِلَيۡنَا لَا تُرۡجَعُونَ 115﴾
ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా? [అల్-ముమినూన్ 23:115] మరియు ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా సెలవిచ్చాడు:
﴿إِنَّ ٱلَّذِي فَرَضَ عَلَيۡكَ ٱلۡقُرۡءَانَ لَرَآدُّكَ إِلَىٰ مَعَادٖۚ...﴾
(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ను నీకు విధిగా చేసినవాడు (అల్లాహ్) తప్పక నిన్ను నీ నిర్ణీత స్థానానికి తిరిగి తెస్తాడు. [అల్-ఖసస్ 28:85]
రెండవది: తీర్పు మరియు ప్రతిఫలంపై విశ్వాసం. ఒక దాసుడి పనులు లెక్కించబడతాయి, మరియు వాటికి ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. దీనికి ఖుర్ఆన్, సున్నతు మరియు ముస్లింల ఏకాభిప్రాయం రుజువుగా ఉన్నది.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿إِنَّ إِلَيۡنَآ إِيَابَهُمۡ 25 ثُمَّ إِنَّ عَلَيۡنَا حِسَابَهُم 26﴾
నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది; తరువాత, వారి లెక్కచూపడం మా బాధ్యత. {అల్-గాషియా 88:25-26} మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿مَن جَآءَ بِٱلۡحَسَنَةِ فَلَهُۥ عَشۡرُ أَمۡثَالِهَاۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجۡزَىٰٓ إِلَّا مِثۡلَهَا وَهُمۡ لَا يُظۡلَمُونَ 160﴾
ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో, అతనికి దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది. మరియు ఎవడు ఒక పాపకార్యం చేస్తాడో, అతనికి దానంతటి శిక్షయే ఉంటుంది. మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు. [అల్-అన్ఆమ్ 6:160] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَنَضَعُ ٱلۡمَوَٰزِينَ ٱلۡقِسۡطَ لِيَوۡمِ ٱلۡقِيَٰمَةِ فَلَا تُظۡلَمُ نَفۡسٞ شَيۡـٔٗاۖ وَإِن كَانَ مِثۡقَالَ حَبَّةٖ مِّنۡ خَرۡدَلٍ أَتَيۡنَا بِهَاۗ وَكَفَىٰ بِنَا حَٰسِبِينَ 47﴾
మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు! {అల్-అంబియా 21:47}
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«إِنَّ اللَّهَ يُدْنِي الْمُؤْمِنَ، فَيَضَعُ عَلَيْهِ كَنَفَهُ - أَيْ سَتْرَهُ - وَيَسْتُرُهُ: فَيَقُولُ: أَتَعْرِفُ ذَنْبَ كَذَا؟ أَتَعْرِفُ ذَنْبَ كَذَا؟ فَيَقُولُ: نَعَمْ أَيْ رَبِّ، حَتَّى إِذَا قَرَّرَهُ بِذُنُوبِهِ، وَرَأَى فِي نَفْسِهِ أَنَّهُ هَلَكَ قَالَ: سَتَرْتُهَا عَلَيْكَ فِي الدُّنْيَا وَأَنَا أَغْفِرُهَا لَكَ الْيَوْمَ، فَيُعْطَى كِتَابَ حَسَنَاتِهِ، وَأَمَّا الْكُفَّارُ وَالْمُنَافِقُونَ فَيُنَادَى بِهِمْ عَلَى رُؤُوسِ الْخَلَائِقِ: هَؤُلَاءِ الَّذِينَ كَذَبُوا عَلَى رَبِّهِمْ، أَلَا لَعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ».
“నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసపరుడిని దగ్గరకు తీసుకుని, అతని పై తన కనఫహ్ — అంటే పరదా — కప్పి అతడిని మరుగు పరుస్తాడు. తరువాత అతని పాపాలను ఒప్పుకునేలా చేస్తాడు; ‘నీవు ఫలానా పాపం చేశావు కదా? నీవు ఫలానా పాపం చేశావు కదా?’ అని అడుగుతాడు. అతను: ‘అవును, ఓ నా ప్రభూ’ అని సమాధానమిస్తాడు. చివరికి అతను తన పాపాలను అంగీకరించిన తరువాత, తాను వినాశనానికి గురి అవుతాడని తన మనసులో భావించినప్పుడు, అల్లాహ్ ఇలా అంటాడు: ‘ఇహలోకములో వాటిని నీపై నేను దాచి ఉంచాను; ఈ రోజు వాటిని నీ కొరకు క్షమిస్తున్నాను.’ ఆపై అతనికి అతని సత్కర్మల పత్రం ఇవ్వబడుతుంది. ఇక అవిశ్వాసులు మరియు కపటుల విషయానికొస్తే, వారిని సమస్త సృష్టి ముందు పిలిచి ఇలా ప్రకటించబడుతుంది: ‘వీరే తమ ప్రభువుపై అబద్ధం చెప్పినవారు. వినండి, దుర్మార్గులపై అల్లాహ్ యొక్క శాపము కురియుగాక.’14” (బుఖారీ, ముస్లిం)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి విశ్వసనీయంగా నమోదు చేయబడింది:
«أَنَّ مَنْ هَمَّ بِحَسَنَةٍ فَعَمِلَهَا؛ كَتَبَهَا اللَّهُ عِنْدَهُ عَشْرَ حَسَنَاتٍ إِلَى سَبْعِ مِئَةِ ضِعْفٍ إِلَى أَضْعَافٍ كَثِيرَةٍ، وَأَنَّ مَنْ هَمَّ بِسَيِّئَةٍ فَعَمِلَهَا؛ كَتَبَهَا اللَّهُ سَيِّئَةً وَاحِدَةً».
“ఎవరైతే ఒక పుణ్యకార్యమును సంకల్పించుకుని దానిని ఆచరిస్తాడో; అల్లాహ్ దానికి బదులుగా తన వద్ద పది రెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు లేదా అంత కంటే అధికంగా పుణ్యాలుగా వ్రాస్తాడు. మరియు ఎవరైతే ఒక పాపమును సంకల్పించుకుని దానిని ఆచరిస్తాడో; దానిని అల్లాహ్ ఒక పాపకార్యముగానే వ్రాస్తాడు.”15
ముస్లింలు తమ పనులకు లభించే తీర్పు మరియు ప్రతిఫలంపై ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు, మరియు ఇది దైవిక వివేకానికి అవసరం. ఎందుకంటే అల్లాహ్ గ్రంథాలను అవతరింపజేశాడు, ప్రవక్తలను పంపాడు, మరియు వారు తీసుకొచ్చిన వాటిని అంగీకరించమని, మరియు వాటిలో తప్పనిసరిగా పాటించవలసిన వాటిని ఆచరించమని దాసులకు ఆదేశించాడు. మరియు ఆ ఆదేశాలను వ్యతిరేకించేవారితో ధర్మపోరాటం చేయడాన్ని, వారి రక్తాన్ని, వారి సంతానాన్ని, వారి స్త్రీలను మరియు వారి సంపదను చట్టబద్ధం చేశాడు."
ఒకవేళ తీర్పు మరియు ప్రతిఫలం లేకపోతే, ఇది నిష్ప్రయోజనమైన పని అవుతుంది. జ్ఞానవంతుడైన ప్రభువుకు అలాంటి నిష్ప్రయోజనమైన పనులు తగవు. అల్లాహ్ దీని గురించి తన వాక్కులో ఇలా ప్రకటించాడు:
﴿فَلَنَسۡـَٔلَنَّ ٱلَّذِينَ أُرۡسِلَ إِلَيۡهِمۡ وَلَنَسۡـَٔلَنَّ ٱلۡمُرۡسَلِينَ 6 فَلَنَقُصَّنَّ عَلَيۡهِم بِعِلۡمٖۖ وَمَا كُنَّا غَآئِبِينَ 7﴾
కావున మేము ఎవరి వద్దకు మా సందేశాన్ని (ప్రవక్తను) పంపామో, వారిని తప్పక ప్రశ్నిస్తాము. మరియు నిశ్చయంగా, ప్రవక్తలను కూడా ప్రశ్నిస్తాము. కావున మేము వారికి మా జ్ఞానంతో వివరించెదము. మరియు మేము గైర్హాజరు కాదు. [అల్-అఅ్'రాఫ్ 7:6-7]
మూడవది: స్వర్గం మరియు నరకంపై విశ్వాసం. అవి సృష్టిరాశుల కొరకు శాశ్వత నివాసాలని నమ్మడం.
స్వర్గం ఒక ఆనంద నిలయం. దానిని అల్లాహ్ ముస్లింల (తనకు విధేయులైన వారి) కోసం మరియు భక్తుల (తన పట్ల భయభక్తులు చూపే మత్తఖీల) కోసం సిద్ధం చేశాడు. వారు దేనినైతే విశ్వసించమని అల్లాహ్ ఆదేశించాడో, దానిని విశ్వసించారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉన్నారు. అల్లాహ్ కు విధేయత చూపడంలో నిజాయితీగా, ఆయన ప్రవక్తను అనుసరించడంలో నిష్ఠగా ఉన్నారు. అందు వలన వారి కొరకు అక్కడ వివిధ రకాల ఆనందాలు ఉన్నాయి.
«مَا لَا عَيْنٌ رَأَتْ، وَلَا أُذُنٌ سَمِعَتْ، وَلَا خَطَرَ عَلَى قَلْبِ بَشَرٍ».
«ఏ కన్ను చూడని, ఏ చెవి వినని మరియు ఏ మానవ హృదయములో తట్టనివి»16، మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ أُوْلَٰٓئِكَ هُمۡ خَيۡرُ ٱلۡبَرِيَّةِ 7 جَزَآؤُهُمۡ عِندَ رَبِّهِمۡ جَنَّٰتُ عَدۡنٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ ذَٰلِكَ لِمَنۡ خَشِيَ رَبَّهُۥ 8﴾
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, వారే సృష్టిలో అత్యంత ఉత్కృష్ట జీవులు. వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద నిత్య స్వర్గాలు, వాటి క్రింద నదులు ప్రవహిస్తాయి, అందులో శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారితో సంతృప్తి చెందాడు మరియు వారు ఆయనతో సంతృప్తి చెందారు. ఇది తమ ప్రభువును భయపడే వారికి. [అల్-బయ్యినహ్ 98:7-8] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿فَلَا تَعۡلَمُ نَفۡسٞ مَّآ أُخۡفِيَ لَهُم مِّن قُرَّةِ أَعۡيُنٖ جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ 17﴾
కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు. [అస్-సజదహ్ 32:17]
మరియు నరకం: అది శిక్ష యొక్క నివాసం, దీనిని సర్వోన్నతుడైన అల్లాహ్ అవిశ్వాసులు మరియు దుష్టుల కొరకు సిద్ధం చేసాడు, వారు ఆయనను తిరస్కరించారు మరియు ఆయన ప్రవక్తలను నిరాకరించారు. దానిలో అనేక రకాల శిక్షలు మరియు బాధలు ఉన్నాయి, అవి ఊహలకు అందవు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَٱتَّقُواْ ٱلنَّارَ ٱلَّتِيٓ أُعِدَّتۡ لِلۡكَٰفِرِينَ 131﴾
మరియు సత్యతిరస్కారుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భీతిపరులై ఉండండి. [ఆలి ఇమ్రాన్ 3:131] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَقُلِ ٱلۡحَقُّ مِن رَّبِّكُمۡۖ فَمَن شَآءَ فَلۡيُؤۡمِن وَمَن شَآءَ فَلۡيَكۡفُرۡۚ إِنَّآ أَعۡتَدۡنَا لِلظَّٰلِمِينَ نَارًا أَحَاطَ بِهِمۡ سُرَادِقُهَاۚ وَإِن يَسۡتَغِيثُواْ يُغَاثُواْ بِمَآءٖ كَٱلۡمُهۡلِ يَشۡوِي ٱلۡوُجُوهَۚ بِئۡسَ ٱلشَّرَابُ وَسَآءَتۡ مُرۡتَفَقًا 29﴾
మరియు వారితో అను: "ఇది మీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించ వచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు!" నిశ్చయంగా, మేము దుర్మార్గుల కొరకు నరకాగ్నిని సిద్ధపరచి ఉంటాము, దాని జ్వాలలు వారిని చుట్టుకుంటాయి. అక్కడ వారు నీటి కొరకు మొర పెట్టుకున్నప్పుడు, వారికి ముఖాలను మాడ్చే (మరిగే) నూనె వంటి నీరు (అల్ ముహ్లు) ఇవ్వబడుతుంది. అది ఎంత చెడ్డ పానీయం మరియు ఎంత చెడ్డ (దుర్భరమైన) విరామ స్థలం! [అల్-కహఫ్ 18:29] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿إِنَّ ٱللَّهَ لَعَنَ ٱلۡكَٰفِرِينَ وَأَعَدَّ لَهُمۡ سَعِيرًا 64 خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۖ لَّا يَجِدُونَ وَلِيّٗا وَلَا نَصِيرٗا 65 يَوۡمَ تُقَلَّبُ وُجُوهُهُمۡ فِي ٱلنَّارِ يَقُولُونَ يَٰلَيۡتَنَآ أَطَعۡنَا ٱللَّهَ وَأَطَعۡنَا ٱلرَّسُولَا۠66﴾
నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులను శపించాడు (బహిష్కరించాడు) మరియు ఆయన వారి కొరకు మండే (నరక) అగ్నిని సిద్ధపరచి ఉంచాడు. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారికి ఏ సహాయకుడు లేదా రక్షకుడు లభించదు. వారి ముఖాలు నిప్పులో తిప్పబడే రోజున, వారు అంటారు: 'హాయ్, మేము అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను అనుసరించి ఉంటే బాగుండేది.' [అల్-అహ్'జాబ్ 33:64-66]
అంతిమ దినాన్ని విశ్వసించటం వలన ప్రసాదించబడే గొప్ప ప్రతిఫలాలు:
మొదటిది: ఆ రోజు (అంతిమ దినం) ప్రతిఫలం కోసం ఆశిస్తూ విధేయత చూపడంలో మరియు దానిని ఆచరించడంలో ఆసక్తి కలిగి ఉండటం.
రెండవది: ఆ రోజు (అంతిమ దినం) శిక్షకు భయపడి పాపం చేయకుండా ఉండటం మరియు పాపకార్యాల పట్ల అసంతృప్తిగా ఉండటం.
మూడవది: ఇహలోకంలో తాను కోల్పోయిన వాటికి బదులుగా, పరలోకంలో ఆశించే ఆనందాన్ని మరియు ప్రతిఫలాన్ని పొందుతానని నమ్మడం ద్వారా విశ్వాసికి ఓదార్పు లభిస్తుంది.
మరణం తర్వాత పునరుత్థానం అసాధ్యమనే అబద్ధపు వాదనలతో అవిశ్వాసులు దానిని నిరాకరించారు.
ఈ వాదన తప్పు. దీని అబద్ధం గురించి షరీఅతు (ఇస్లామీయ ధార్మిక చట్టం), జ్ఞానంద్రియాలు మరియు తర్కం రుజువు చేశాయి.
షరీఅతు (ఇస్లామీయ ధార్మిక చట్టం) గురించి అల్లాహ్ ప్రకటన:
﴿زَعَمَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَن لَّن يُبۡعَثُواْۚ قُلۡ بَلَىٰ وَرَبِّي لَتُبۡعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلۡتُمۡۚ وَذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ 7﴾
సత్యాన్ని తిరస్కరించిన వారు (చనిపోయిన తరువాత) మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను: "అది కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత మీరు (ప్రపంచంలో) చేసిందంతా మీకు తెలుపబడుతుంది. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం. [అత్తగాబున్ 64:7] దివ్యగ్రంథాలన్నీ దీనిపై ఏకీభవించాయి.
ఇక జ్ఞానంద్రియాలకు సంబంధించినది: అల్లాహ్ తన దాసులకు ఈ లోకంలో మరణించినవారిని ఎలా తిరిగి బ్రతికించగలడో చూపించాడు. సూరహ్ అల్-బఖరహ్ లో దానికి సంబంధించిన ఐదు ఉదాహరణలు ఉన్నాయి.
మొదటి ఉదాహరణ : మూసా అలైహిస్సలాం జాతివారు ఆయనతో ఇలా పలికినప్పటి ఉదాహరణ:
﴿...لَن نُّؤۡمِنَ لَكَ حَتَّىٰ نَرَى ٱللَّهَ جَهۡرَةٗ ...﴾
మేము అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూడనంత వరకు నిన్ను ఏ మాత్రం విశ్వసించము! [అల్-బఖరహ్ 2:55] దానితో మహోన్నతుడైన అల్లాహ్ వారిని మరణింపజేశాడు, ఆపై వారిని మరలా జీవింపజేశాడు, ఈ విషయంలో అల్లాహ్ బనీ ఇస్రాయీలును ఉద్దేశించి ఇలా సంబోధించాడు :
﴿وَإِذۡ قُلۡتُمۡ يَٰمُوسَىٰ لَن نُّؤۡمِنَ لَكَ حَتَّىٰ نَرَى ٱللَّهَ جَهۡرَةٗ فَأَخَذَتۡكُمُ ٱلصَّٰعِقَةُ وَأَنتُمۡ تَنظُرُونَ 55 ثُمَّ بَعَثۡنَٰكُم مِّنۢ بَعۡدِ مَوۡتِكُمۡ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ 56﴾
మరియు అప్పుడు మీరు అతనితో (మూసాతో) అన్న మాటలు (జ్ఞప్తికి తెచ్చుకోండి): "ఓ మూసా! మేము అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూడనంత వరకు నిన్ను ఏ మాత్రం విశ్వసించము!" అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై విరుచుకు పడింది (మీరు చనిపోయారు). ఆ తరువాత మేము మీ మరణం తరువాత మిమ్మల్ని పునరుద్ధరించాము, మీరు కృతజ్ఞతలు తెలుపుతారని. [అల్-బఖరహా 2:55-56]
రెండవ ఉదాహరణ: ఇస్రాయీల్ సంతతివారు వివాదానికి దిగిన హత్య కేసు గురించి. అప్పుడు అల్లాహ్ వారికి ఒక ఆవును వధించి, దానిలో కొంత భాగంతో ఆ మరణించిన వ్యక్తిని కొట్టమని ఆదేశించాడు. తద్వారా అతడు తనను ఎవరు చంపారో వారికి చెబుతాడు. దీని గురించి అల్లాహ్ ప్రకటన:
﴿وَإِذۡ قَتَلۡتُمۡ نَفۡسٗا فَٱدَّٰرَٰءۡتُمۡ فِيهَاۖ وَٱللَّهُ مُخۡرِجٞ مَّا كُنتُمۡ تَكۡتُمُونَ 72 فَقُلۡنَا ٱضۡرِبُوهُ بِبَعۡضِهَاۚ كَذَٰلِكَ يُحۡيِ ٱللَّهُ ٱلۡمَوۡتَىٰ وَيُرِيكُمۡ ءَايَٰتِهِۦ لَعَلَّكُمۡ تَعۡقِلُونَ 73﴾
మరియు (జ్ఞాపకం చేసుకోండి), మీరు ఒక వ్యక్తిని చంపి ఆ నిందను ఒకరిపై నొకరు మోపుకోసాగారు. కాని మీరు దాస్తున్న దానిని అల్లాహ్ బయట పెట్టాడు. అప్పుడు మేము చెప్పాము, 'దానిలోని కొంత భాగంతో దానిని కొట్టండి.' అల్లాహ్ ఇలాగే మృతులను పునరుజ్జీవింపజేస్తాడు మరియు తన సూచనలను మీకు చూపిస్తాడు, మీరు బుద్ధి చేసుకోవడానికి. [అల్-బఖరహ్ 2:72-73]
మూడవ ఉదాహరణ: వేల సంఖ్యలో ఉన్న ప్రజలు మృత్యువుకు భయపడి తమ ఇళ్ల నుండి పారిపోయినప్పుడు, అల్లాహ్ వారిని చంపి, తర్వాత తిరిగి బ్రతికించాడు. దాని గురించి అల్లాహ్ ప్రకటన:
﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ خَرَجُواْ مِن دِيَٰرِهِمۡ وَهُمۡ أُلُوفٌ حَذَرَ ٱلۡمَوۡتِ فَقَالَ لَهُمُ ٱللَّهُ مُوتُواْ ثُمَّ أَحۡيَٰهُمۡۚ إِنَّ ٱللَّهَ لَذُو فَضۡلٍ عَلَى ٱلنَّاسِ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَشۡكُرُونَ243﴾
ఏమీ? మృత్యుభయంతో, వేల సంఖ్యలో ప్రజలు తమ ఇండ్లను వదలి పోయింది నీకు తెలియదా? అప్పుడు అల్లాహ్ వారితో: "మరణించండి!" అని అన్నాడు కాని తరువాత వారిని బ్రతికించాడు. నిశ్చయంగా, అల్లాహ్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం గలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు. [అల్-బఖరహ్ 2:243]
నాల్గవ ఉదాహరణ: ఒక పూర్తిగా నాశమైపోయిన గ్రామాన్ని దాటి వెళ్ళిన వ్యక్తి కథ. అల్లాహ్ దానిని ఎలా తిరిగి బ్రతికించగలడని అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు అల్లాహ్ అతడిని నూరు సంవత్సరాలు చంపేసి, తిరిగి బ్రతికించాడు. దాని గురించి అల్లాహ్ ప్రకటన:
﴿أَوۡ كَٱلَّذِي مَرَّ عَلَىٰ قَرۡيَةٖ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحۡيِۦ هَٰذِهِ ٱللَّهُ بَعۡدَ مَوۡتِهَاۖ فَأَمَاتَهُ ٱللَّهُ مِاْئَةَ عَامٖ ثُمَّ بَعَثَهُۥۖ قَالَ كَمۡ لَبِثۡتَۖ قَالَ لَبِثۡتُ يَوۡمًا أَوۡ بَعۡضَ يَوۡمٖۖ قَالَ بَل لَّبِثۡتَ مِاْئَةَ عَامٖ فَٱنظُرۡ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمۡ يَتَسَنَّهۡۖ وَٱنظُرۡ إِلَىٰ حِمَارِكَ وَلِنَجۡعَلَكَ ءَايَةٗ لِّلنَّاسِۖ وَٱنظُرۡ إِلَى ٱلۡعِظَامِ كَيۡفَ نُنشِزُهَا ثُمَّ نَكۡسُوهَا لَحۡمٗاۚ فَلَمَّا تَبَيَّنَ لَهُۥ قَالَ أَعۡلَمُ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ 259﴾
లేక! ఒక వ్యక్తి ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి, పాడుపడిన (తలక్రిందులై బోర్లా పడిన) నగరం మీదుగా పోతూ: "వాస్తవానికి! నశించిపోయిన ఈ నగరానికి అల్లాహ్ తిరిగి ఏ విధంగా జీవం పోయగలడు?" అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతనిని మరణింపజేసి నూరు సంవత్సరాల తరువాత తిరిగి బ్రతికింపజేసి: "ఈ స్థితిలో నీవు ఎంతకాలముంటివి?" అని అడిగాడు. అతడు: "ఒక దినమో, లేక ఒక దినములో కొంత భాగమో!" అని అన్నాడు. దానికి ఆయన: "కాదు, నీవు ఇక్కడ ఈ (మరణించిన) స్థితిలో, నూరు సంవత్సరాలు ఉంటివి. ఇక నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏ మార్పూ లేదు. ఇంకా నీవు నా గాడిదను కూడా చూడు! మేము ప్రజల కొరకు నిన్ను దృష్టాంతంగా చేయదలిచాము. ఇక ఆ (గాడిద) ఎముకలను చూడు, ఏ విధంగా వాటిని ఉద్ధరించి తిరిగి వాటిపై మాంసం కప్పుతామో!" అని అన్నాడు. ఇవి అతనికి స్పష్టంగా తెలిసిన తరువాత అతడు: "నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నాకు (ఇప్పుడు) తెలిసింది!" అని అన్నాడు. [అల్-బఖరహ్ 2:259]
ఐదవ ఉదాహరణ: ఇబ్రాహీం ఖలీల్ గాథ. అతను అల్లాహ్ ను మరణించినవారిని ఎలా తిరిగి బ్రతికిస్తాడో చూపించమని అడిగాడు. అప్పుడు అల్లాహ్ అతనికి నాలుగు పక్షులను వధించి, వాటి భాగాలను చుట్టూ ఉన్న కొండలపై ఉంచమని ఆదేశించాడు. తరువాత వాటిని పిలవమని చెప్పాడు. అప్పుడు ఆ భాగాలు తిరిగి కలిసిపోయి, ఇబ్రాహీం వద్దకు వేగంగా వచ్చాయి. దాని గురించి అల్లాహ్ ప్రకటన:
﴿وَإِذۡ قَالَ إِبۡرَٰهِـۧمُ رَبِّ أَرِنِي كَيۡفَ تُحۡيِ ٱلۡمَوۡتَىٰۖ قَالَ أَوَلَمۡ تُؤۡمِنۖ قَالَ بَلَىٰ وَلَٰكِن لِّيَطۡمَئِنَّ قَلۡبِيۖ قَالَ فَخُذۡ أَرۡبَعَةٗ مِّنَ ٱلطَّيۡرِ فَصُرۡهُنَّ إِلَيۡكَ ثُمَّ ٱجۡعَلۡ عَلَىٰ كُلِّ جَبَلٖ مِّنۡهُنَّ جُزۡءٗا ثُمَّ ٱدۡعُهُنَّ يَأۡتِينَكَ سَعۡيٗاۚ وَٱعۡلَمۡ أَنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٞ 260﴾
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: "ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!" అని అన్నప్పుడు, (అల్లాహ్) అన్నాడు: "ఏమీ? నీకు విశ్వాసం లేదా?" దానికి (ఇబ్రాహీమ్): "ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగు తున్నాను!" అని అన్నాడు. అపుడు (అల్లాహ్): "నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్కదాని ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టి రా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!"అని అన్నాడు. [అల్-బఖరహ్ 2:260].
ఇవి మరణించిన వారిని తిరిగి బ్రతికించడం సాధ్యమని నిరూపించే వాస్తవిక, జ్ఞానాత్మక ఉదాహరణలు. మరణించినవారిని తిరిగి బ్రతికించడం మరియు వారి సమాధుల నుండి బయటకు తీసుకురావడం (అల్లాహ్ అనుమతితో) మర్యం కుమారుడైన ఈసా అలైహిస్సలాం యొక్క అద్భుతాలలో ఎలా ఉన్నాయో ఇంతకు ముందే సూచించబడింది.
హేతుబద్దమైన సూచనలు రెండు విధాలు:
వాటిలో ఒకటి : నిశ్చయంగా అల్లాహ్ భూమ్యాకాశములను మరియు వాటిలో ఉన్నవాటిని మొదటిసారి సృష్టించాడు. సృష్టిని మొదటిసారి సృష్టించే సామర్ధ్యము కలవాడు దానిని మరల సృష్టించటం నుండి అశక్తుడు కాడు. అల్లాహ్ ప్రకటన:
﴿وَهُوَ ٱلَّذِي يَبۡدَؤُاْ ٱلۡخَلۡقَ ثُمَّ يُعِيدُهُۥ وَهُوَ أَهۡوَنُ عَلَيۡهِۚ...﴾
మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు. ఇది ఆయనకు ఎంతో సులభమైనది. [అర్రూమ్ 30:27] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿...كَمَا بَدَأۡنَآ أَوَّلَ خَلۡقٖ نُّعِيدُهُۥۚ وَعۡدًا عَلَيۡنَآۚ إِنَّا كُنَّا فَٰعِلِينَ﴾
...మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము. [అల్-అంబియా 21:104] కృశించిపోయిన ఎముకలను మరలా జీవింపజేయటమును నిరాకరించిన వారిని ఖండిస్తూ ఆదేశిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
﴿قُلۡ يُحۡيِيهَا ٱلَّذِيٓ أَنشَأَهَآ أَوَّلَ مَرَّةٖۖ وَهُوَ بِكُلِّ خَلۡقٍ عَلِيمٌ 79﴾
ఇలా అను: "మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు, ప్రతి దానిని సృష్టించే జ్ఞానముంది. [యాసీన్ 36:79]
రెండవది: బంజరు భూమి చచ్చిపోయినట్లు, నిర్జీవంగా ఉంటుంది. దానిపై ఏ పచ్చని చెట్టూ ఉండదు. అప్పుడు దానిపై వర్షం కురుస్తుంది. దానితో అది కదలి, పచ్చగా, సజీవంగా మారుతుంది. అందులో ప్రతి జత పచ్చని మొక్కలు ఉంటాయి. భూమిని దాని మరణం తర్వాత తిరిగి బ్రతికించగలవాడు, చనిపోయినవారిని కూడా బ్రతికించగలడు. అల్లాహ్ ప్రకటన:
﴿وَمِنۡ ءَايَٰتِهِۦٓ أَنَّكَ تَرَى ٱلۡأَرۡضَ خَٰشِعَةٗ فَإِذَآ أَنزَلۡنَا عَلَيۡهَا ٱلۡمَآءَ ٱهۡتَزَّتۡ وَرَبَتۡۚ إِنَّ ٱلَّذِيٓ أَحۡيَاهَا لَمُحۡيِ ٱلۡمَوۡتَىٰٓۚ إِنَّهُۥ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ 39﴾
మరియు ఆయన సూచన (ఆయాత్) లలో ఒకటి: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా (ఎండిపోయిన బంజరు నేలగా) చూస్తున్నావు; కాని మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపించగానే, అది పులకించి, ఉబ్బి పోతుంది. నిశ్చయంగా దీనిని (ఈ భూమిని) బ్రతికించి లేపే ఆయన (అల్లాహ్ యే) మృతులను కూడా బ్రతికించి లేపుతాడు. నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు. [ఫుస్సీలత్ 41:39] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَنَزَّلۡنَا مِنَ ٱلسَّمَآءِ مَآءٗ مُّبَٰرَكٗا فَأَنۢبَتۡنَا بِهِۦ جَنَّٰتٖ وَحَبَّ ٱلۡحَصِيدِ 9 وَٱلنَّخۡلَ بَاسِقَٰتٖ لَّهَا طَلۡعٞ نَّضِيدٞ 10 رِّزۡقٗا لِّلۡعِبَادِۖ وَأَحۡيَيۡنَا بِهِۦ بَلۡدَةٗ مَّيۡتٗاۚ كَذَٰلِكَ ٱلۡخُرُوجُ 11﴾
మరియు మేము ఆకాశం నుండి శుభదాయకమైన నీటిని కురిపించి దాని ద్వారా తోటలను ఉత్పత్తి చేశాము మరియు ధాన్యాలను పండించాము మరియు పొడవైన ఖర్జూర వృక్షాలను పండించాము, వాటికి సజీవమైన పండ్లు ఉన్నాయి. ఇది బానిసలకు ఆహారంగా ఉంది. మరియు మేము దాని ద్వారా ఒక మృత పట్టణాన్ని జీవితం ఇచ్చాము. ఇలాగే పునరుత్థానం జరుగుతుంది. [ఖాఫ్ 50:9 - 11].
మరణం తరువాత సంభవించే వాటిపై విశ్వాసం అంతిమదినంపై విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు :
(1) సమాధి పరీక్ష : అది మృతుడిని ఖననం చేసిన తరువాత అతని ప్రభువు గురించి, అతని ధర్మం గురించి, అతని ప్రవక్త గురించి ప్రశ్నించబడటం. అప్పుడు అల్లాహ్ విశ్వాసులకు స్థిరమైన మాటపై నిలకడను ప్రసాదిస్తాడు. అప్పుడు అతను నా ప్రభువు అల్లాహ్ అని, నా ధర్మం ఇస్లాం అని, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానమిస్తాడు. అల్లాహ్ దుర్మార్గులను మార్గభ్రష్టతకు గురి చేస్తాడు. అప్పుడు అవిశ్వాసపరుడు ఇలా పలుకుతాడు అయ్యో అయ్యో నాకేమి తెలియదు. మరియు కపటుడు, సందేహానికి గురి అయినవాడు ఇలా పలుకుతాడు నాకేమి తెలియదు. ప్రజలు ఏదో చెబుతుంటే విన్నాను అదే నేను పలికాను.
(2) సమాధి శిక్ష మరియు దాని అనుగ్రహాలు : దుర్మార్గుల కొరకు అంటే కపటుల, అవిశ్వాసపరుల కొరకు సమాధి శిక్ష ఉంటుంది. అల్లాహ్ ప్రకటన:
﴿...وَلَوۡ تَرَىٰٓ إِذِ ٱلظَّٰلِمُونَ فِي غَمَرَٰتِ ٱلۡمَوۡتِ وَٱلۡمَلَٰٓئِكَةُ بَاسِطُوٓاْ أَيۡدِيهِمۡ أَخۡرِجُوٓاْ أَنفُسَكُمُۖ ٱلۡيَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ ٱلۡهُونِ بِمَا كُنتُمۡ تَقُولُونَ عَلَى ٱللَّهِ غَيۡرَ ٱلۡحَقِّ وَكُنتُمۡ عَنۡ ءَايَٰتِهِۦ تَسۡتَكۡبِرُونَ﴾
...దుర్మార్గులు మరణ వేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: "మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్ పై అసత్యాలు పలుకుతూ ఉన్నందు వలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది!" అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది! [అల్-అన్'ఆమ్ 6:93]
ఫిరౌన్ వర్గం గురించి మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿ٱلنَّارُ يُعۡرَضُونَ عَلَيۡهَا غُدُوّٗا وَعَشِيّٗاۚ وَيَوۡمَ تَقُومُ ٱلسَّاعَةُ أَدۡخِلُوٓاْ ءَالَ فِرۡعَوۡنَ أَشَدَّ ٱلۡعَذَابِ 46﴾
ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: "ఫిర్ఔన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది. [గాఫిర్ 40:46]
సహీహ్ ముస్లింలో జైద్ ఇబ్న్ థాబిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«فَلَوْلَا أَنْ لَا تَدَافَنُوا لَدَعَوْتُ اللَّهَ أَنْ يُسْمِعَكُمْ مِنْ عَذَابِ الْقَبْرِ الَّذِي أَسْمَعُ مِنْهُ».
ఒకవేళ మీరు మృతులను సమాధి చేయరన్న భయం లేకుంటే నేను మీకొరకు నేను వినే సమాధి శిక్షలనే మీకు వినిపించమని దుఆ చేసేవాడిని. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని వారి వైపు తిప్పుకుని ఇలా పలికినారు:
«تَعَوَّذُوا بِاللَّهِ مِنْ عَذَابِ النَّارِ».
నరకాగ్ని శిక్ష నుండి అల్లాహ్ శరణు కోరండి. వారు ఇలా పలుకుతారు : "మేము నరకాగ్ని శిక్ష నుండి అల్లాహ్ శరణు కోరుచున్నాము." అపుడు ఆయన ఇలా పలికినారు:
«تَعَوَّذُوا بِاللَّهِ مِنْ عَذَابِ الْقَبْرِ».
అల్లాహ్ వద్ద సమాధి శిక్ష నుండి శరణు వేడుకోండి. వారు పలికారు: “మేము అల్లాహ్ వద్ద సమాధి శిక్ష నుండి శరణు కోరుచున్నాము,” అపుడు ఆయన ఇలా పలికినారు:
«تَعَوَّذُوا بِاللَّهِ مِنَ الْفِتَنِ، مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ».
ప్రకటమైనవియు, గుప్తమైనవియు అయిన పరీక్షల నుండి అల్లాహ్ శరణు వేడుకోండి. దానికి వారు ఇలా అన్నారు : “మేము అల్లాహ్ వద్ద ఫితన్ (పరీక్షలు)లో బయల్పడినవైనా, దాగి ఉన్నవైనా వాటి నుండి శరణు కోరుచున్నాము.” అపుడు ఆయన ఇలా అన్నారు:
«تَعَوَّذُوا بِاللَّهِ مِنْ فِتْنَةِ الدَّجَّالِ».
దజ్జాల్ ఉపద్రవపు కీడు నుండి అల్లాహ్ శరణు వేడుకోండి. దానికి వారు “మేము దజ్జాల్ ఉపద్రవం నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము” అని బదులిచ్చారు17.
ఇక సమాధి అనుగ్రహాలు: ఇవి సత్యమైన విశ్వాసుల కొరకు ఉంటాయి. అల్లాహ్ ప్రకటన:
﴿إِنَّ ٱلَّذِينَ قَالُواْ رَبُّنَا ٱللَّهُ ثُمَّ ٱسۡتَقَٰمُواْ تَتَنَزَّلُ عَلَيۡهِمُ ٱلۡمَلَٰٓئِكَةُ أَلَّا تَخَافُواْ وَلَا تَحۡزَنُواْ وَأَبۡشِرُواْ بِٱلۡجَنَّةِ ٱلَّتِي كُنتُمۡ تُوعَدُونَ 30﴾
నిశ్చయంగా, ఎవరైతే: "అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా ఉంటారో! వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): "మీరు భయ పడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి! [ఫుస్సిలత్ 41:30]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿فَلَوۡلَآ إِذَا بَلَغَتِ ٱلۡحُلۡقُومَ 83 وَأَنتُمۡ حِينَئِذٖ تَنظُرُونَ 84 وَنَحۡنُ أَقۡرَبُ إِلَيۡهِ مِنكُمۡ وَلَٰكِن لَّا تُبۡصِرُونَ 85 فَلَوۡلَآ إِن كُنتُمۡ غَيۡرَ مَدِينِينَ 86 تَرۡجِعُونَهَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ 87 فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلۡمُقَرَّبِينَ 88 فَرَوۡحٞ وَرَيۡحَانٞ وَجَنَّتُ نَعِيمٖ 89﴾
అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)? మరియు మీరు ఆ సమయంలో చూస్తున్నారు. మేము అతనికి మీకంటే దగ్గరగా ఉన్నాము, కానీ మీరు చూడలేరు. అయితే మీరు (మీరు) తిరిగి తీసుకురాగలరా? మీరు నిజాయితీగా ఉన్నట్లయితే. అయితే అతను సమీపంలో ఉన్నవారిలో ఒకడైతే, అతనికి విశ్రాంతి మరియు పరిమళం మరియు సుఖసమృద్ధి గల స్వర్గం. [అల్-వాఖిఅ 56:83-89]
బరా ఇబ్ను ఆజిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ఎవరైతే తన సమాధిలో దైవదూతల ప్రశ్నలకు సమాధానమిచ్చి ఉంటాడో ఆ విశ్వాసుని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :
«يُنَادِي مُنَادٍ مِنَ السَّمَاءِ: أَنْ صَدَقَ عَبْدِي، فَافْرِشُوهُ مِنَ الْجَنَّةِ، وَأَلْبِسُوهُ مِنَ الْجَنَّةِ، وَافْتَحُوا لَهُ بَابًا إِلَى الْجَنَّةِ، قَالَ: فَيَأْتِيهِ مِنْ رَوْحِهَا وَطِيبِهَا، وَيُفْسَحُ لَهُ فِي قَبْرِهِ مَدَّ بَصَرِهِ».
ఆకాశము నుండి ఒక ప్రకటించేవాడు ఇలా ప్రకటిస్తాడు : నా దాసుడు సత్యం పలికాడు కావున అతని కొరకు స్వర్గ తివాచీని పరచండి. మరియు అతనికి స్వర్గ వస్త్రములను తొడిగించండి. అతని కొరకు స్వర్గము వైపు ఒక ద్వారమును తెరవండి. ఇంకా ఆయన ఇలా సెలవిచ్చారు : కావున అతని వద్దకు స్వర్గపు గాలి,సువాసన వస్తూ ఉంటుంది. మరియు అతని సమాధిలో ఎక్కడి వరకు దృష్టి వెళుతుందో అక్కడి వరకు విశాలపరచబడుతుంది. దీనిని అహ్మద్ మరియు అబూదావూద్ ఒక సుదీర్ఘ హదీథులో నమోదు చేసినారు18.
విచక్షణా రహితులైన వారిలోంచి ఒక సమూహం మార్గభ్రష్టతకు గురి అయి, అది అసాధ్యమని వాదించి, సమాధిలోని శిక్షను మరియు సుఖాన్ని నిరాకరించారు. వారు ఇలా అన్నారు: "సమాధిలోని శవాన్ని చూస్తే, అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. సమాధి దాని విశాలతలో లేదా సంకుచితంలో ఎలాంటి మార్పును చూపదు.
షరీఅత్ పరంగా,ఇంద్రియ జ్ఞానం పరంగా మరియు బుద్ధి పరంగా ఈ వాదన తప్పు.
ఇక షరీఅత్ పరంగా చూస్తే సమాధి శిక్ష, దాని అనుగ్రహాల నిరూపణను సూచించే అన్నుసూస్ (ఖుర్ఆన్ ఆయతులు, హదీథులు) వచ్చి ఉన్నాయి.
సహీహ్ బుఖారీలోని ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలోని కొన్ని తోటల వద్ద నుండి వెళ్ళారు; అప్పుడు సమాధుల్లో శిక్షింపబడుతున్న ఇద్దరు వ్యక్తుల స్వరమును విన్నారు.” ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా పూర్తి హదీథును ఉల్లేఖించారు. అందులో:
«أَنَّ أَحَدَهُمَا كَانَ لَا يَسْتَتِرُ مِنَ الْبَوْلِ».
«వారిలో ఒకడు మూత్రపు చుక్కలు చింది తన శరీరముపై, బట్టలపై పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు.» మరొక ఉల్లేఖనలో ఇలా ఉన్నది:
«مِنْ بَوْلِهِ».
తన మూత్రం నుండి,
«وَأَنَّ الْآخَرَ كَانَ يَمْشِي بِالنَّمِيمَةِ».
మరియు రెండవ వాడు వ్యక్తుల మధ్య విభేదాలు మరియు చీలికలను కలిగించే, ఉద్దేశ్యంతో ప్రజల మధ్య ఇతరుల మాటలను ప్రసారం చేస్తూ ఉండేవాడు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనలో ఇలా ఉన్నది.
«لَا يَسْتَنْزِهُ مِنَ الْبَوْلِ».
«మూత్రం చినుకుల నుండి తాను కాపాడుకోడు»19.
ఇంద్రియ జ్ఞానము విషయానికొస్తే: నిదురించే వ్యక్తి తన కలలో తాను విశాలమైన మరియు ఆనందకరమైన ప్రదేశంలో ఉన్నానని, అందులో అనుగ్రహాలతో లబ్దిపొందుతున్నాడని లేదా తాను ఇరుకైన మరియు భయంకర ప్రదేశంలో ఉన్నానని, అందులో బాధపడుతున్నానని మరియు కొన్నిసార్లు తాను చూసిన దాని నుండి మేల్కొన్నానని అంటాడు. ఏదేమైనా, అతను తన గదిలో తన మంచంపై తాను ఉన్న స్థితిలోనే ఉన్నాడు, మరియు నిద్ర మరణానికి సహోదరుడు, అందుకే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దాన్ని మరణం పేరుతో పిలిచినాడు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿ٱللَّهُ يَتَوَفَّى ٱلۡأَنفُسَ حِينَ مَوۡتِهَا وَٱلَّتِي لَمۡ تَمُتۡ فِي مَنَامِهَاۖ فَيُمۡسِكُ ٱلَّتِي قَضَىٰ عَلَيۡهَا ٱلۡمَوۡتَ وَيُرۡسِلُ ٱلۡأُخۡرَىٰٓ إِلَىٰٓ أَجَلٖ مُّسَمًّى...﴾
అల్లాహ్ యే ఆత్మలను (ప్రాణాలను) మరణ కాలమున వశపరచుకునేవాడు మరియు మరణించని వాడి (ఆత్మలను) నిద్రావస్థలో (వశపరచుకునే వాడునూ). తరువాత దేనికైతే మరణం నిర్ణయింప బడుతుందో దానిని ఆపుకొని, మిగతా వారి (ఆత్మలను) ఒక నియమిత కాలం వరకు తిరిగి పంపుతాడు... [అజ్-జుమర్ 39:42]
ఇక బుద్ధి లేదా తర్కం విషయానికొస్తే: ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు, అతడు వాస్తవానికి సరిపోయే నిజమైన కలలు చూస్తాడు. కొన్నిసార్లు అతను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూడవచ్చు. ఎవరైతే ఆయనను ఆయన వర్ణన ప్రకారం చూస్తారో, వారు నిజంగానే ఆయనను చూసినట్లు. అలా ఉన్నప్పటికీ, ఆ నిద్రిస్తున్న వ్యక్తి తన గదిలో, తన పడకపై, తాను కలలో చూసినదానికి చాలా దూరంగా ఉంటాడు. ఇహలోకంలోనే ఇది సాధ్యమైనప్పుడు, పరలోకంలో ఇది సాధ్యం కాదా?
ఇక మృతుని సమాధి తెరిచి చూస్తే అది ఎలా ఉన్నదో అలాగే ఉంటుందని, సమాధి విశాలమవటంలో, ఇరుకుగా ఉండటంలో ఎటువంటి మార్పు జరగదనే వారి వాదనలో వారి నమ్మకం ఏదైతే ఉన్నదో దానికి సమాధానం ఈ క్రింది విధంగా ఇవ్వవచ్చు:
మొదటిది: దైవిక చట్టం (షరీఅహ్) తెచ్చిన వాటిని ఇలాంటి నిస్సారమైన అనుమానాలతో వ్యతిరేకించడం సరికాదు. ఎందుకంటే, ఒకవేళ వ్యతిరేకించే వ్యక్తి దైవిక చట్టాన్ని సరిగ్గా పరిశీలిస్తే, ఈ అనుమానాలు తప్పని తెలుసుకుంటాడు. దీని గురించి ఇలా చెప్పబడింది:
సరియైన మాటను తప్పు అని విమర్శించేవారు చాలామంది ఉన్నారు.
అయినప్పటికీ వారి విమర్శ వారి పొరపాటు (బలహీనమైన అవగాహన) ఫలితంగా మాత్రమే అయి ఉంటుంది.
రెండవది: బర్జఖ్ (మరణానంతరం, పునరుత్థానానికి ముందు) స్థితులు అదృశ్యమైన, అగోచర విషయాలలో భాగం, వాటిని ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకోలేము. ఒకవేళ వాటిని ఇంద్రియాల ద్వారా అర్థం చేసుకోగలిగితే, అగోచరాలపై విశ్వాసం అనే మాటకు ఏమీ ప్రయోజనం ఉండేది కాదు మరియు అగోచరాలపై విశ్వాసం ఉన్నవారు మరియు దానిని నిరాకరించేవారు దానిని విశ్వసించడంలో సరిసమానం అయిపోయేవారు.
మూడవది: సమాధిలో కలిగే శిక్ష, సుఖము, దాని విశాలత మరియు సంకుచితత్వం కేవలం మరణించిన వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి, ఇతరులకు కాదు. ఇది ఎలాగంటే, ఒక నిద్రిస్తున్న వ్యక్తి తాను ఒక ఇరుకైన, భయంకరమైన ప్రదేశంలో ఉన్నట్లు లేదా విశాలమైన, ఆనందదాయకమైన ప్రదేశంలో ఉన్నట్లు కలలో చూస్తాడు. కానీ అతని చుట్టూ ఉన్నవారు దాన్ని చూడలేరు లేదా దాని అనుభూతి చెందలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరుల మధ్య ఉన్నప్పుడు కూడా ఆయనకు దివ్యావతరణ (వహీ) వచ్చేది. ఆయన ఆ వహీను వినేవారు, కానీ ఆయనకు సమీపంలోనే ఉన్న సహచరులు దానిని వినలేక పోయవారు. కొన్నిసార్లు దైవదూత ఒక మనిషి రూపంలో ఆయన వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడేవారు. అయితే ఆయన చుట్టూ ఉన్న సహచరులు ఆ దైవదూతను చూడలేకపోయేవారు మరియు అతనిని వినలేకపోయేవారు.
నాలుగవది: మానవుల గ్రహణశక్తి పరిమితమైనది. అల్లాహ్ వారికి ఏది గ్రహించే శక్తి ఇచ్చాడో, దానిని మాత్రమే వారు గ్రహించగలరు. వారు ప్రతిదీ గ్రహించలేరు. ఏడు ఆకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న ప్రతిదీ నిజమైన కీర్తనలతో అల్లాహ్ ను కీర్తిస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు అల్లాహ్ తన దాసులలో నుండి ఆయన ఎవరిని కోరితే, వారికి ఆ కీర్తనలను వినిపిస్తాడు. దీనితో పాటు ఇవన్ని మన దృష్టికి కానరావు. దీని గురించి మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿تُسَبِّحُ لَهُ ٱلسَّمَٰوَٰتُ ٱلسَّبۡعُ وَٱلۡأَرۡضُ وَمَن فِيهِنَّۚ وَإِن مِّن شَيۡءٍ إِلَّا يُسَبِّحُ بِحَمۡدِهِۦ وَلَٰكِن لَّا تَفۡقَهُونَ تَسۡبِيحَهُمۡۚ...﴾
సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తమూ ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీ లేదు, కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు... [అల్-ఇస్రా 17:44] అదే విధంగా, షైతాన్ మరియు జిన్నులు భూమిపై తిరుగుతూ ఉంటారు. జిన్నులు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఆయన పఠనం విన్నారు, శ్రద్ధగా ఆలకించారు మరియు తమ ప్రజల వద్దకు హెచ్చరికదారులుగా తిరిగి వెళ్ళారు. అయినప్పటికీ, వారు సహాబాలకు కనబడలేదు. దీని గురించి అల్లాహ్ ప్రకటన:
﴿يَٰبَنِيٓ ءَادَمَ لَا يَفۡتِنَنَّكُمُ ٱلشَّيۡطَٰنُ كَمَآ أَخۡرَجَ أَبَوَيۡكُم مِّنَ ٱلۡجَنَّةِ يَنزِعُ عَنۡهُمَا لِبَاسَهُمَا لِيُرِيَهُمَا سَوۡءَٰتِهِمَآۚ إِنَّهُۥ يَرَىٰكُمۡ هُوَ وَقَبِيلُهُۥ مِنۡ حَيۡثُ لَا تَرَوۡنَهُمۡۗ إِنَّا جَعَلۡنَا ٱلشَّيَٰطِينَ أَوۡلِيَآءَ لِلَّذِينَ لَا يُؤۡمِنُونَ 27﴾
ఓ ఆదమ్ సంతానమా! షైతాన్ మీ తల్లిదండ్రుల నుండి (స్వర్గ) వస్త్రాలను తొలగించి, వారి మర్మాంగాలను వారికి కనబడేటట్లు చేసి వారిని స్వర్గం నుండి వెడలగొట్టినట్లు మిమ్మల్ని కూడా ఆపదకు (ఫిత్నాకు) గురి చేయకూడదు. నిశ్చయంగా, వాడు మరియు వాని సంతతివారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు. కాని, మీరు వారిని చూడలేరు. నిశ్చయంగా, మేము షైతానులను, విశ్వసించని వారికి స్నేహితులుగా చేశాము. [అల్-ఆరాఫ్ 7:27] సృష్టి ఉనికిలో ఉన్న వాటి వాస్తవికతనే గ్రహించలేక పోయినప్పుడు నిర్ధారిత అగోచరవిషయాలను తాము గ్రహించలేక పోవడం వలన తిరస్కరించడం అనేది సమ్మతం కాదు.
విధివ్రాత పై విశ్వాసము:
ఖదర్ అనే అరబీ అక్షరం(పై ఫతహ్ ఉచ్చారణతో): అల్లాహ్ యొక్క జ్ఞానం ప్రకారం మరియు ఆయన వివేకం ప్రకారం సృష్టిలోని ప్రతిదాన్నీ అల్లాహ్ నిర్ధారించడం.
విధివ్రాతపై విశ్వాసం అన్నది నాలుగు విషయములను కలిగి ఉంటుంది:
మొదటిది: అల్లాహ్ అన్ని విషయాలను, సమగ్రంగా మరియు వివరంగా, ఆది నుండి అంతం వరకు, ఆయన పనులకు సంబంధించినవైనా లేదా ఆయన సేవకుల పనులకు సంబంధించినవైనా, వాటన్నింటినీ ఎరిగిన వాడని విశ్వసించడం.
రెండవది: అల్లాహ్ ఈ విషయాలన్నింటినీ లౌహె-మహ్ఫూజ్ లో వ్రాసి ఉంచాడని విశ్వసించడం. ఈ రెండు విషయాల గురించి అల్లాహ్ ప్రకటన:
﴿أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ذَٰلِكَ فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ 70﴾
ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది. [అల్-హజ్జ్ 22:70]
సహీహ్ ముస్లింలో అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:”
«كَتَبَ اللَّهُ مَقَادِيرَ الْخَلَائِقِ قَبْلَ أَنْ يَخْلُقَ السَّمَوَاتِ وَالْأَرْضَ بِخَمْسِينَ أَلْفَ سَنَةٍ».
“ఆకాశాలనూ మరియు భూమినీ సృష్ఠించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే అల్లాహ్ సృష్టిరాశులన్నింటి భవిష్యత్తును వ్రాసి ఉంచాడు”20.
మూడవది: సృష్టితాలన్నీ అల్లాహ్ యొక్క చిత్తం ప్రకారం మాత్రమే ఉంటాయని విశ్వసించడం. అది ఆయన స్వంత చర్యలకు సంబంధించినదైనా లేదా సృష్టితాల చర్యలకు సంబంధించినదైనా సరే. అల్లాహ్ తన చర్యల గురించి ఇలా ప్రకటించాడు:
﴿وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُۗ...﴾
మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు. [అల్-ఖసస్ 28:68] మరియు అల్లాహ్ ప్రకటన:
﴿...وَيَفۡعَلُ ٱللَّهُ مَا يَشَآءُ﴾
మరియు అల్లాహ్ తాను కోరినది చేస్తాడు. [ఇబ్రాహీం 14:27] మరియు అల్లాహ్ ప్రకటన:
﴿هُوَ ٱلَّذِي يُصَوِّرُكُمۡ فِي ٱلۡأَرۡحَامِ كَيۡفَ يَشَآءُۚ...﴾
ఆయన తన ఇష్టానుసారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చి దిద్దుతాడు... [ఆలి ఇమ్రాన్ 3:6]. మరియు అల్లాహ్ సృష్టిరాసుల చర్యలకు సంబంధించి ఇలా సెలవిచ్చాడు:
﴿...وَلَوۡ شَآءَ ٱللَّهُ لَسَلَّطَهُمۡ عَلَيۡكُمۡ فَلَقَٰتَلُوكُمۡۚ...﴾
...మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు... [అన్-నిసా 4:90] మరియు అల్లాహ్ ప్రకటన:
﴿...وَلَوۡ شَآءَ رَبُّكَ مَا فَعَلُوهُۖ فَذَرۡهُمۡ وَمَا يَفۡتَرُون﴾
మరియు నీ ప్రభువు తలచుకుంటే వారిలా చేసేవారు కాదు. కావును వారిని వారి కల్పనలలో వదిలి పెట్టు. [అల్-అన్ఆ'మ్ 6:112]
నాలుగవది: సృష్టితాల్నీ వాటి స్వభావాలతో, లక్షణాలతో మరియు కదలికలతో అల్లాహ్ చేత సృష్టించబడ్డాయని విశ్వసించడం. అల్లాహ్ ప్రకటన:
﴿ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٞ 62﴾
అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి కార్యకర్త. [అజ్-జుమర్ 39:62] అల్లాహ్ ప్రకటన:
﴿...وَخَلَقَ كُلَّ شَيۡءٖ فَقَدَّرَهُۥ تَقۡدِيرٗا﴾
మరియు ఆయన ప్రతి దానిని సృష్టించి, దానికొక విధిని నిర్ణయించాడు. [ఫుర్ఖాన్ 25:2] మరియు ఆయన తన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రజలతో ఇలా అన్నారని చెప్పాడు:
﴿وَٱللَّهُ خَلَقَكُمۡ وَمَا تَعۡمَلُونَ 96﴾
వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా! [అస్సాఫ్ఫాత్ 37:96]
మేము వివరించిన విధంగా, ఖదర్ (విధి) పై విశ్వసించడం అనేది ఒక దాసుడికి తన ఐచ్ఛిక పనులలో స్వేచ్ఛా సంకల్పం మరియు సామర్థ్యం కలిగి ఉండటాన్ని ఖండించదు. ఎందుకంటే, ఇస్లామీయ ధార్మిక శాస్త్రం (షరిఅహ్) మరియు వాస్తవాలు కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
ఇక షరిఅహ్ విషయానికి వస్తే అల్లాహ్ ఇచ్చ విషయంలో ఇలా సెలవిస్తున్నాడు:
﴿...فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا﴾
కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి! [అన్నబ 78:39] మరియు అల్లాహ్ ప్రకటన:
﴿...فَأۡتُواْ حَرۡثَكُمۡ أَنَّىٰ شِئۡتُمۡۖ...﴾
...మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు... [అల్-బఖరహ్ 2:223] మరియు సామర్ధ్యం గురించి ఆయన ఇలా సెలవిచ్చాడు:
﴿فَٱتَّقُواْ ٱللَّهَ مَا ٱسۡتَطَعۡتُمۡ وَٱسۡمَعُواْ وَأَطِيعُواْ...﴾
కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, (ఆయన సూచనలను) విని, ఆయనకు విధేయులై ఉండండి... [అత్తగాబున్ 64:16] మరియు అల్లాహ్ ప్రకటన:
﴿لَا يُكَلِّفُ ٱللَّهُ نَفۡسًا إِلَّا وُسۡعَهَاۚ لَهَا مَا كَسَبَتۡ وَعَلَيۡهَا مَا ٱكۡتَسَبَتۡۗ...﴾
అల్లాహ్, ఏ ప్రాణి పైననూ దాని శక్తికి మించిన భారం వేయడు. తాను సంపాదించిన దానికి (పుణ్య) ఫలితం దానికి లభిస్తుంది మరియు తాను చేసిన దుష్కర్మల శిక్ష అది అనుభవిస్తుంది. [అల్-బఖరహ్ 2:286]
వాస్తవం గురించి: ప్రతి మనిషికి సంకల్పం మరియు సామర్థ్యం ఉన్నాయని తెలుసు. వాటి ద్వారానే అతడు పనులు చేస్తాడు లేదా వదిలిపెడతాడు. నడవడం వంటి తన సంకల్పంతో చేసే పనులకు, మరియు వణకడం వంటి తన సంకల్పం లేకుండా జరిగే పనులకు తేడా తెలుసు. కానీ దాసుని సంకల్పం మరియు సామర్థ్యం, అల్లాహ్ యొక్క సంకల్పం మరియు సామర్థ్యంతోనే జరుగుతాయి. ఎందుకంటే అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది:
﴿لِمَن شَآءَ مِنكُمۡ أَن يَسۡتَقِيمَ 28 وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ29﴾
మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు. మీరు ఏమీ దలచుకోలేరు, అల్లాహ్, సర్వలోకాల ప్రభువు, దలచినంతవరకు. [అత్తక్వీర్ 81:28-29] మరియు ఈ విశ్వం మొత్తం అల్లాహ్ యొక్క రాజ్యంలో ఉంది. కాబట్టి ఆయన రాజ్యంలో ఆయన జ్ఞానం మరియు ఆయన సంకల్పం లేకుండా ఏదీ జరగదు.
మేము వివరించిన విధంగా, విధి (ఖదర్)పై విశ్వసించడం అనేది ఒక వ్యక్తి విధిగా చేయవలసిన పనులను వదిలివేయడానికి లేదా పాపాలు చేయడానికి సాకుగా ఉపయోగపడదు. ఈ విధంగా, అతను విధిని సాకుగా చూపడం అనేక కోణాల నుండి తప్పు.
మొదటిది : అల్లాహ్ ప్రకటన:
﴿سَيَقُولُ ٱلَّذِينَ أَشۡرَكُواْ لَوۡ شَآءَ ٱللَّهُ مَآ أَشۡرَكۡنَا وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمۡنَا مِن شَيۡءٖۚ كَذَٰلِكَ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ حَتَّىٰ ذَاقُواْ بَأۡسَنَاۗ قُلۡ هَلۡ عِندَكُم مِّنۡ عِلۡمٖ فَتُخۡرِجُوهُ لَنَآۖ إِن تَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنۡ أَنتُمۡ إِلَّا تَخۡرُصُونَ 148﴾
అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించేవారు అంటారు: "ఒకవేళ అల్లాహ్ కోరితే మేము గానీ, మా తండ్రితాతలు గానీ ఆయనకు సాటి కప్పించే వారమూ కాము మరియు దేనినీ నిషేధించి ఉండేవారమూ కాము." వారికి పూర్వం వారు కూడా మా శిక్షను రుచి చూడనంత వరకు ఇదే విధంగా తిరస్కరించారు. వారిని అడుగు: "మీ వద్ద ఏదైనా (రూఢి అయిన) జ్ఞానం ఉందా! ఉంటే మా ముందు పెట్టండి. మీరు కేవలం కల్పనలను అనుసరిస్తున్నారు మరియు మీరు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు. [అల్-అన్'ఆమ్ 6:148] ఒకవేళ వారికి విధి సాకుగా ఉంటే, అల్లాహ్ వారిని తన శిక్షకు గురిచేసేవాడు కాదు.
రెండవది: అల్లాహ్ వాక్కు:
﴿رُّسُلٗا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى ٱللَّهِ حُجَّةُۢ بَعۡدَ ٱلرُّسُلِۚ وَكَانَ ٱللَّهُ عَزِيزًا حَكِيمٗا 165﴾
(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు. [అన్-నిసా 4:165] ఒకవేళ విధి (ఖదర్) వ్యతిరేకించేవారికి సాకుగా ఉంటే, ప్రవక్తలను పంపడం వల్ల అది తొలగిపోయేది కాదు. ఎందుకంటే ప్రవక్తలను పంపిన తర్వాత కూడా వ్యతిరేకత అల్లాహ్ యొక్క విధి ప్రకారమే జరుగుతుంది.
మూడవది: బుఖారీ మరియు ముస్లింలు నమోదు చేసిన హదీథు (ఇక్కడ బుఖారీ భాష ఉపయోగించబడింది). అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (రదియల్లాహ్ అన్హు) నుండి ఉదహరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
«مَا مِنْكُمْ مِنْ أَحَدٍ إِلَّا قَدْ كُتِبَ مَقْعَدُهُ مِنَ النَّارِ أَوْ مِنَ الْجَنَّةِ».
మీలో ఎవరూ లేరు, కానీ అగ్నిలో (నరకం) లేదా స్వర్గంలో వారి స్థానం వ్రాయబడింది. అప్పుడు ప్రజలలో ఒక వ్యక్తి, 'ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మేము (మన విధిపై) ఆధారపడవచ్చా?' అని అడిగాడు. అపుడు ఆయన ఇలా అన్నారు:
«لَا، اعْمَلُوا فَكُلٌّ مُيَسَّرٌ».
లేదు, మీరు మీ పనులు చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ (వారు దేనికోసం సృష్టించబడ్డారో) అది సులభతరం చేయబడింది. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పఠించినారు:
﴿فَأَمَّا مَنۡ أَعۡطَىٰ وَٱتَّقَىٰ 5﴾
కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో! [అల్-లైల్ 92:5] ముస్లిం హదీథు పదాలలో ఇలా ఉన్నది:
«فَكُلٌّ مُيَسَّرٌ لِمَا خُلِقَ لَهُ».
«ప్రతి ఒక్కరికి ఆ పని శులభతరం చేయబడినది దేని కొరకైతే వారు సృష్టించబడ్డారో»21 దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పని చేయమని ఆజ్ఞ ఇచ్చారు మరియు విధిపై ఆధారపడి కూర్చోవడాన్ని నిషేధించారు.
నాలుగవది: అల్లాహ్ తన దాసుడిని ఆజ్ఞాపించాడు మరియు నిషేధించాడు. కానీ అతను చేయగలిగిన దానిని మాత్రమే అతనికి అప్పగించాడు. అల్లాహ్ వాక్కు:
﴿فَٱتَّقُواْ ٱللَّهَ مَا ٱسۡتَطَعۡتُمۡ وَٱسۡمَعُواْ وَأَطِيعُواْ...﴾
కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, (ఆయన సూచనలను విని), ఆయనకు విధేయులై ఉండండి... [అత్తగాబున్ 64:16] మరియు అల్లాహ్ వాక్కు:
﴿لَا يُكَلِّفُ ٱللَّهُ نَفۡسًا إِلَّا وُسۡعَهَاۚ...﴾
అల్లాహ్, ఏ ప్రాణి పైననూ దాని శక్తికి మించిన భారం వేయడు... [అల్-బఖరహ్ 2:286] ఒకవేళ దాసుడు ఒక పని చేయడానికి బలవంతం చేయబడినట్లయితే, అతడు దాని నుండి తప్పించుకోలేని దానికి బాధ్యత వహించబడినవాడు అవుతాడు. ఇది తప్పు. అందువలన, ఒకవేళ అతడు అజ్ఞానం వల్ల, మరచిపోవడం వల్ల లేదా బలవంతం వల్ల పాపం చేస్తే, దానిపై అతనికి ఎలాంటి పాపం లేదు. ఎందుకంటే అతడు క్షమించబడతాడు.
ఐదవది: అల్లాహ్ యొక్క విధి (ఖదర్) ఒక రహస్యం, అది విధిగా జరగబోయేది జరిగిన తర్వాత తప్ప తెలియదు. అయితే, ఒక వ్యక్తిలో ఏదైనా పని చేయాలనే సంకల్పం ఆ పనిని చేయడానికి ముందుగానే ఉంటుంది. కాబట్టి అతని సంకల్పం అల్లాహ్ యొక్క విధి గురించి అతనికి ఉన్న జ్ఞానంపై ఆధారపడదు. ఈ సందర్భంలో, విధిని సాకుగా చూపడం తప్పు అవుతుంది, ఎందుకంటే తెలియని దానిపై ఒక వ్యక్తికి ఎలాంటి సాకు ఉండదు.
ఆరవది: మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి తన ప్రాపంచిక విషయాలలో తనకు అనుకూలమైన దానిని పొందడానికి కృషి చేస్తాడు. దాని నుండి వైదొలగి, తనకు అనుకూలం కాని దానిని ఎంచుకుని, దానికి విధిని సాకు చూపడు. మరి అతను తన మతపరమైన విషయాలలో తనకు ప్రయోజనం కలిగించే దాని నుండి వైదొలగి, తనకు హాని కలిగించే దానిని ఎంచుకుని, విధిని ఎందుకు సాకుగా చూపించగలడు? ఈ రెండు విషయాలు ఒకేలాంటివి కాదా?
దీనిని స్పష్టపరచటానికి మీకు కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాము:
ఒక వ్యక్తి ముందు రెండు మార్గాలు ఉన్నాయని అనుకుందాం. ఒక మార్గం అతన్ని గందరగోళమైన దేశానికి తీసుకెళ్తుంది. అక్కడ హత్యలు, దోపిడీలు, మాన ప్రాణాలకు, ఆస్తులకు అగౌరవం, భయం మరియు ఆకలి మాత్రమే ఉంటాయి. మరొక మార్గం అతన్ని పూర్తిగా క్రమబద్ధంగా, స్థిరమైన శాంతి, సుసంపన్నమైన జీవితం, మరియు మానవులకు, వారి గౌరవానికి, మరియు ఆస్తులకు రక్షణ ఉన్న దేశానికి తీసుకెళ్తుంది. ఆ వ్యక్తి ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు?"
అతను ఖచ్చితంగా క్రమం మరియు భద్రత ఉన్న దేశానికి దారితీసే రెండవ మార్గాన్నే ఎంచుకుంటాడు. ఏ తెలివిగల వ్యక్తి అయినా గందరగోళం మరియు భయం ఉన్న దేశానికి దారి తీసే మార్గాన్ని ఎంచుకుని, దానికి విధిని సాకుగా చూపించడు. మరి అయితే, పరలోక విషయాలలో, అతను స్వర్గం మార్గాన్ని విడిచిపెట్టి, నరకం మార్గాన్ని ఎంచుకుని, దానికి విధిని ఎందుకు సాకుగా చూపిస్తున్నాడు?
మరొక ఉదాహరణ: ఒక రోగికి డాక్టరు ఇచ్చిన మందు తాగమని చెబితే, అతని మనసు ఇష్టపడకపోయినా తాగుతాడు. మరియు అతనికి హాని కలిగించే ఆహారాన్ని తినవద్దని చెబితే, అతని మనసు కోరుకున్నా దాన్ని వదిలిపెడతాడు. ఇదంతా ఆరోగ్యం మరియు సురక్షితత్వం కోసమే. అతను మందు తాగడం మానేసి లేదా హాని కలిగించే ఆహారం తిని దానికి విధిని సాకుగా చూపించడు. మరి అయితే, మనిషి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞాపించిన వాటిని ఎందుకు వదిలిపెడతాడు లేదా వారు నిషేధించిన వాటిని ఎందుకు చేస్తాడు, ఆ తర్వాత విధిని సాకుగా ఎందుకు చూపిస్తాడు?
ఏడవది: విధి (ఖదర్)ని సాకుగా చూపి విధిగా చేయవలసిన పనులను విడిచిపెట్టిన లేదా పాపాలు చేసిన ఒక వ్యక్తిపై మరొక వ్యక్తి దాడి చేసి అతని ఆస్తిని లాక్కున్నా లేదా అతని గౌరవానికి భంగం కలిగించినా, ఆ తర్వాత అతను విధిని సాకుగా చూపి 'నన్ను నిందించవద్దు, నా దాడి అల్లాహ్ విధి ప్రకారం జరిగింది' అని అన్నప్పుడు, అతను అతని సాకును అంగీకరించడు. మరొక వ్యక్తి తనపై దాడి చేసినప్పుడు విధిని సాకుగా చూపడాన్ని ఎలా అంగీకరించలేడు, మరి తన పాపాల విషయంలో, అల్లాహ్ హక్కుపై తను దాడి చేసినప్పుడు, విధిని సాకుగా ఎలా చూపిస్తాడు?
ముస్లింల నాయకుడు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) వద్దకు ఒక దొంగను తీసుకువచ్చినప్పుడు, అతని చెయ్యి నరికివేయడం తప్పనిసరి అయింది. ఉమర్ అతని చెయ్యి నరకమని ఆదేశించారు. అప్పుడు ఆ దొంగ, 'ఓ అమీరుల్ మోమినీన్! ఆగండి. నేను అల్లాహ్ విధి (ఖదర్) ప్రకారమే దొంగతనం చేశాను' అన్నాడు. అందుకు ఉమర్, 'మేము కూడా అల్లాహ్ విధి ప్రకారమే నీ చెయ్యి నరుకుతున్నాము' అని బదులిచ్చారు.
విధి (ఖదర్) పై విశ్వసించడం వలన ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
మొదటిది: కారణాలను అనుసరించేటప్పుడు అల్లాహ్ పై ఆధారపడటం, కేవలం కారణం మీదే ఆధారపడకపోవడం, ఎందుకంటే ప్రతిదీ అల్లాహ్ యొక్క విధి ప్రకారమే జరుగుతుంది.
రెండవది: ఒక వ్యక్తి తన కోరిక నెరవేరినప్పుడు తన గురించి తాను గొప్పగా భావించుకోకూడదు. ఎందుకంటే అది అల్లాహ్ యొక్క విధి ప్రకారం సంభవించిన ఒక ఆశీర్వాదం. తన గురించి గొప్పగా భావించుకోవడం వలన ఈ ఆశీర్వాదానికి కృతజ్ఞత చూపడం మర్చిపోతాడు.
మూడవది: అల్లాహ్ యొక్క విధి ప్రకారం ఏది జరిగినా ప్రశాంతంగా, మనశ్శాంతితో ఉండటం. అందువల్ల, ఇష్టమైనది ఏదైనా కోల్పోయినా లేదా ఇష్టం లేనిది ఏదైనా సంభవించినా ఆందోళన చెందడు. ఎందుకంటే ఇదంతా ఆకాశాలకు మరియు భూమికి అధిపతి అయిన అల్లాహ్ యొక్క విధి ప్రకారమే జరుగుతుంది మరియు ఇది తప్పక జరగాల్సిందే. దీని గురించి అల్లాహ్ వాక్కు:
﴿مَآ أَصَابَ مِن مُّصِيبَةٖ فِي ٱلۡأَرۡضِ وَلَا فِيٓ أَنفُسِكُمۡ إِلَّا فِي كِتَٰبٖ مِّن قَبۡلِ أَن نَّبۡرَأَهَآۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ 22 لِّكَيۡلَا تَأۡسَوۡاْ عَلَىٰ مَا فَاتَكُمۡ وَلَا تَفۡرَحُواْ بِمَآ ءَاتَىٰكُمۡۗ وَٱللَّهُ لَا يُحِبُّ كُلَّ مُخۡتَالٖ فَخُورٍ 23﴾
భూమి మీద గానీ లేదా స్వయంగా మీ మీద గానీ విరుచుకు పడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింప జేయక ముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం. ఇది మీకు కోల్పోయిన దానిపై విచారించకుండా ఉండటానికి మరియు మీకు ఇచ్చిన దానిపై ఆనందించకుండా ఉండటానికి. అల్లాహ్ ప్రతి గర్విష్టి, అతిశయగాండ్రను ఇష్టపడడు. [అల్-హదీద్ 57:22-23] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«عَجَبًا لِأَمْرِ الْمُؤْمِنِ إِنَّ أَمْرَهُ كُلَّهُ خَيْرٌ، وَلَيْسَ ذَاكَ لِأَحَدٍ إِلَّا لِلْمُؤْمِنِ، إِنْ أَصَابَتْهُ سَرَّاءُ شَكَرَ فَكَانَ خَيْرًا لَهُ، وَإِنْ أَصَابَتْهُ ضَرَّاءُ صَبَرَ فَكَانَ خَيْرًا لَهُ».
“విశ్వాసి సంగతి బహు ఆశ్చర్యమైనది. అతనికి సంబంధించిన ప్రతీ విషయంలో మేలు ఉంటుంది. ఇది కేవలం విశ్వాసికి మాత్రమే లభ్యం అవుతుంది. అతనికి ఆనందం కలిగినప్పుడు అల్లాహ్'కు కృతజ్ఞత తెలుపుకుంటాడు, అది అతనికి మేలును ప్రసాదిస్తుంది. ఒకవేళ అతనికి కష్టం వస్తే సహనం వహిస్తాడు, అది కూడా అతనికి మేలు చేస్తుంది.”22
విధివ్రాత విషయంలో రెండు వర్గాలు మార్గ భ్రష్టతకు గురిఅయ్యాయి:
అందులో ఒకటి జబరియ్యా వర్గము: వారి విశ్వాసము - దాసుడు తన చర్యపై బలవంతం చేయబడ్డాడు. అతనికి అందులో ఎలాంటి నిర్ణయం కాని విధివ్రాత కాని లేదు.
రెండవది: ఖదరియ్యహ్ వర్గము: వారి విశ్వాసము - దాసుడు సంకల్పం మరియు శక్తితో తన పని నుండి స్వతంత్రుడు, మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సంకల్పం మరియు అతని శక్తి అతనిపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు.
మొదటి వర్గం (జబ్రియ్యా) వారికి షరిఅహ్ (ఇస్లామీయ ధర్మశాస్త్రం) మరియు వాస్తవం ఆధారంగా జవాబు:
షరిఅహ్ (ఇస్లామీయ ధర్మశాస్త్రం) జవాబు: అల్లాహ్ మానవునికి సంకల్పం మరియు స్వేచ్ఛాశక్తి ఉన్నట్లు నిర్ధారించాడు, మరియు అతని పనుల బాధ్యతను అతనికే అప్పగించాడు. అల్లాహ్ వాక్కు:
﴿...مِنكُم مَّن يُرِيدُ ٱلدُّنۡيَا وَمِنكُم مَّن يُرِيدُ ٱلۡأٓخِرَةَۚ...﴾
...మీలో కొందరు ఇహలోకాన్ని కోరేవారున్నారు మరియు మీలో కొందరు పరలోకాన్ని కోరేవారున్నారు... [ఆలి ఇమ్రాన్ 3:152], మరియు మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَقُلِ ٱلۡحَقُّ مِن رَّبِّكُمۡۖ فَمَن شَآءَ فَلۡيُؤۡمِن وَمَن شَآءَ فَلۡيَكۡفُرۡۚ إِنَّآ أَعۡتَدۡنَا لِلظَّٰلِمِينَ نَارًا أَحَاطَ بِهِمۡ سُرَادِقُهَاۚ...﴾
మరియు వారితో అను: "ఇది మీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించ వచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు!" నిశ్చయంగా, మేము దుర్మార్గుల కొరకు నరకాగ్నిని సిద్ధపరచి ఉంటాము, దాని జ్వాలలు వారిని చుట్టుకుంటాయి... [అల్-కహఫ్ 18:29] మరియు మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿مَّنۡ عَمِلَ صَٰلِحٗا فَلِنَفۡسِهِۦۖ وَمَنۡ أَسَآءَ فَعَلَيۡهَاۗ وَمَا رَبُّكَ بِظَلَّٰمٖ لِّلۡعَبِيدِ 46﴾
ఎవడైతే సత్కార్యం చేస్తాడో అతడు తన (మేలు) కొరకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. మరియు నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. [ఫుస్సీలత్ 41:46]
వాస్తవం పరిస్థితుల జవాబు: ప్రతి మానవునికి తన ఐచ్ఛిక పనుల మధ్య ఉన్న తేడా తెలుసు. ఉదాహరణకు, తినడం, త్రాగడం, అమ్మడం మరియు కొనడం వంటివి అతను తన సంకల్పంతో చేస్తాడు. దీనికి భిన్నంగా, జ్వరం వల్ల వణకడం లేదా పైకప్పు నుండి పడిపోవడం వంటివి అతని సంకల్పం లేకుండా జరుగుతాయి. మొదటి సందర్భంలో, అతను ఎటువంటి బలవంతం లేకుండా, తన సంకల్పంతో పని చేసేవాడు. రెండవ సందర్భంలో, అతనిపై జరిగిన దానికి అతడు తన సంకల్పంతో పనిచేయనివాడు."
షరిఅహ్ మరియు బుద్ధితో రెండవ వర్గము (ఖద్రియ) కు ప్రతిస్పందన:
ఇస్లామీయ ధర్మశాస్త్రం (షరిఅహ్) గురించి: అల్లాహ్ ప్రతి దానిని సృష్టించాడు మరియు ప్రతిదీ ఆయన సంకల్పంతోనే జరుగుతుంది. అల్లాహ్ తన పుస్తకంలో సేవకుల పనులు ఆయన సంకల్పంతోనే జరుగుతాయని స్పష్టంగా వివరించాడు. అల్లాహ్ వాక్కు:
﴿...وَلَوۡ شَآءَ ٱللَّهُ مَا ٱقۡتَتَلَ ٱلَّذِينَ مِنۢ بَعۡدِهِم مِّنۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ ٱلۡبَيِّنَٰتُ وَلَٰكِنِ ٱخۡتَلَفُواْ فَمِنۡهُم مَّنۡ ءَامَنَ وَمِنۡهُم مَّن كَفَرَۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ مَا ٱقۡتَتَلُواْ وَلَٰكِنَّ ٱللَّهَ يَفۡعَلُ مَا يُرِيدُ﴾
మరియు - అల్లాహ్ తలుచుకుంటే - ఈ ప్రవక్తల తరువాత వచ్చిన ప్రజలు, వారికి స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ, వారు పరస్పర విభేదాలకు లోనయ్యారు. కావున వారిలో కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు సత్యతిరస్కారులు అయ్యారు. మరియు అల్లాహ్ తలుచుకుంటే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు, కాని అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు. [అల్-బఖరహ్ 2:253] మరియు మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَلَوۡ شِئۡنَا لَأٓتَيۡنَا كُلَّ نَفۡسٍ هُدَىٰهَا وَلَٰكِنۡ حَقَّ ٱلۡقَوۡلُ مِنِّي لَأَمۡلَأَنَّ جَهَنَّمَ مِنَ ٱلۡجِنَّةِ وَٱلنَّاسِ أَجۡمَعِينَ 13﴾
మరియు మేము కోరినట్లయితే, ప్రతి వ్యక్తికి (ఆత్మకు) దాని మార్గదర్శకత్వం చేసి ఉండేవారము. కాని, నేను: "నిశ్చయంగా జిన్నాతులు మరియు మానవులందరితో నరకాన్ని నింపివేస్తాను." అని పలికిన, నా మాట సత్యమయ్యింది. [అస్-సజదహ్ 32:13]
తర్కం(బుద్ధి) గురించి: ఈ విశ్వం మొత్తం అల్లాహ్ యొక్క రాజ్యానికి చెందినది, మరియు మానవుడు ఈ విశ్వంలో ఒక భాగం. కాబట్టి అతడు అల్లాహ్ యొక్క ఆధీనంలో ఉన్నాడు. యజమాని అనుమతి మరియు సంకల్పం లేకుండా ఒక బానిస యజమాని రాజ్యంలో ఏదీ చేయలేడు.
ఇస్లామీయ అఖీద లక్ష్యాలు
హదఫ్ (భాషాపరంగా): దీనికి అనేక అర్థాలు ఉన్నాయి, వాటిలో: (గురి పెట్టడానికి ఉంచబడిన లక్ష్యం, మరియు ఉద్దేశించబడిన ప్రతిదీ).
ఇస్లామీయ విశ్వాసం యొక్క లక్ష్యాలు: దాని ఉద్దేశాలు మరియు ఉదాత్త లక్ష్యాలు, దానికి కట్టుబడి ఉండటం వల్ల కలిగేవి, మరియు అవి అనేక మరియు వైవిధ్యమైనవి, వాటిలో నుంచి:
మొదటిది: సంకల్పాన్ని మరియు ఆరాధనను అల్లాహ్ కోసం మాత్రమే నిర్మలంగా ఉంచాలి. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయనకు భాగస్వాములు లేరు. కాబట్టి సంకల్పం మరియు ఆరాధన కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించబడాలి.
రెండవది: ఈ సిద్ధాంతం లేకపోవడం వలన ఉత్పన్నమయ్యే గందరగోళం నుండి మనస్సు మరియు ఆలోచనను విముక్తం చేయడం. ఎందుకంటే ఎవరి హృదయంలో ఈ సిద్ధాంతం లేదో, వారు లేదా వారి హృదయం అన్ని సిద్ధాంతాల నుండి ఖాళీగా ఉండి, కేవలం భౌతికవాదాన్ని మాత్రమే ఆరాధిస్తారు, లేదా వారు తప్పుడు సిద్ధాంతాలు మరియు మూఢనమ్మకాలలో తికమకపడి ఉంటారు.
మూడవది: మనస్సు మరియు ఆలోచనలో ప్రశాంతత, ఎందుకంటే ఈ సిద్ధాంతం విశ్వాసిని అతని సృష్టికర్తతో కలుపుతుంది. అప్పుడు అతను అల్లాహ్ ను తన ప్రభువుగా, పాలకుడిగా మరియు చట్టాన్ని చేసేవాడిగా అంగీకరిస్తాడు. దీనివల్ల అతని హృదయం అల్లాహ్ విధి (ఖదర్)తో ప్రశాంతమవుతుంది, ఇస్లాం పట్ల అతని మనసు వికసిస్తుంది మరియు దానిని తప్ప వేరే దానికి ప్రత్యామ్నాయంగా కోరుకోడు.
నాలుగవది: అల్లాహ్ ను ఆరాధించడంలో లేదా సృష్టితాలతో వ్యవహరించడంలో సంకల్పం మరియు పనులను వక్రమార్గంలో పడకుండా కాపాడుకోవడం. ఎందుకంటే ఈ సిద్ధాంతం యొక్క పునాదులలో ఒకటైన ప్రవక్తలపై విశ్వసించడం అనేది వారి మార్గాన్ని అనుసరించడాన్ని సూచిస్తుంది, ఇది సంకల్పం మరియు పనులలో భద్రతను కలిగి ఉంటుంది.
ఐదవది: విషయాలలో దృఢనిశ్చయం మరియు గంభీరత కలిగి ఉండటం. అంటే, సద్వర్తనకు అవకాశం వచ్చినప్పుడల్లా దానిని పుణ్యప్రదంగా ఉపయోగించుకోవడం, ప్రతిఫలం ఆశిస్తూ; మరియు పాపం జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాన్ని చూసినప్పుడల్లా దాని నుండి దూరంగా ఉండడం, శిక్షకు భయపడి. ఎందుకంటే దాని పునాది పునరుత్థానం మరియు క్రియలపై ప్రతిఫలంపై విశ్వాసం.
మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَلِكُلّٖ دَرَجَٰتٞ مِّمَّا عَمِلُواْۚ وَمَا رَبُّكَ بِغَٰفِلٍ عَمَّا يَعۡمَلُونَ 132﴾
మరియు ప్రతి ఒక్కరికీ వారి కర్మల ప్రకారం స్థానాలు ఉంటాయి. మరియు నీ ప్రభువు వారి కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు. [అల్-అన్'ఆమ్ 6:132] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లక్ష్యాన్ని ప్రోత్సహిస్తూ ఇలా ప్రవచించారు:
«الْمُؤْمِنُ الْقَوِيُّ خَيْرٌ وَأَحَبُّ إِلَى اللَّهِ مِنَ الْمُؤْمِنِ الضَّعِيفِ، وَفِي كُلٍّ خَيْرٌ، احْرِصْ عَلَى مَا يَنْفَعُكَ، وَاسْتَعِنْ بِاللَّهِ، وَلَا تَعْجِزْ، وَإِنْ أَصَابَكَ شَيْءٌ فَلَا تَقُلْ: لَوْ أَنِّي فَعَلْتُ كَذَا كَانَ كَذَا وَكَذَا، وَلَكِنْ قُلْ: قَدَّرَ اللَّهُ وَمَا شَاءَ فَعَلَ؛ فَإِنَّ (لَوْ) تَفْتَحُ عَمَلَ الشَّيْطَانِ».
“బలహీనుడైన విశ్వాసి కంటే బలవంతుడైన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో ప్రియుడు. మరియు వారిద్దరిలోనూ మేలు ఉంది. నీకు మేలు చేసే దానిని పట్టుకుని ఉండు. సహాయం కోసం అల్లాహ్’ను అడుగు. మరియు నిన్ను నీవు నిస్సహాయునిగా భావించుకోకు. ఒకవేళ నీకు ఏదైనా నష్టం జరిగితే, "నేను ‘ఒకవేళ’ ఇలా ఇలా చేసి ఉంటే బాగుండేది" అని అనకు. అలాకాక "ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ ; అల్లాహ్ తాను కోరినది చేస్తాడు" అని పలుకు. నిశ్చయంగా ‘ఒకవేళ’ అనే మాట షైతాను పనికి మార్గాన్ని తెరుస్తుంది.” దీనిని ముస్లిం నమోదు చేసినారు హదీథు సంఖ్య23.
ఆరవది: తన ధర్మాన్ని స్థాపించడానికి మరియు దాని మూలస్థంభాలను పటిష్టం చేయడానికి ప్రతిదీ త్యాగం చేసే బలమైన సమాజాన్ని నిర్మించడం, ఆ మార్గంలో ఎదురయ్యే కష్టాలను పట్టించుకోకుండా. దీని గురించి అల్లాహ్ వాక్కు:
﴿إِنَّمَا ٱلۡمُؤۡمِنُونَ ٱلَّذِينَ ءَامَنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ ثُمَّ لَمۡ يَرۡتَابُواْ وَجَٰهَدُواْ بِأَمۡوَٰلِهِمۡ وَأَنفُسِهِمۡ فِي سَبِيلِ ٱللَّهِۚ أُوْلَٰٓئِكَ هُمُ ٱلصَّٰدِقُونَ 15﴾
వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి, ఆ తరువాత ఏ అనుమానానికి లోను కాకుండా, అల్లాహ్ మార్గంలో, తమ సిరిసంపదలతో మరియు ప్రాణాలతో పోరాడుతారో! అలాంటి వారు, వారే! సత్యవంతులు. [అల్-హుజ్'రాత్ 49:15]
ఏడవది: వ్యక్తులు మరియు సమాజాలను సంస్కరించడం ద్వారా మరియు ప్రతిఫలాలను మరియు గౌరవాలను పొందడం ద్వారా ఇహలోక మరియు పరలోకంలో ఆనందాన్ని చేరుకోవడం. దీని గురించి అల్లాహ్ వాక్కు:
﴿مَنۡ عَمِلَ صَٰلِحٗا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَلَنُحۡيِيَنَّهُۥ حَيَوٰةٗ طَيِّبَةٗۖ وَلَنَجۡزِيَنَّهُمۡ أَجۡرَهُم بِأَحۡسَنِ مَا كَانُواْ يَعۡمَلُونَ 97﴾
ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము. [అన్-నహ్ల్ 16:97]
ఇవి ఇస్లామీయ సిద్ధాంతం యొక్క కొన్ని లక్ష్యాలు. అల్లాహ్ వాటిని మాకు మరియు ముస్లింలందరికీ నెరవేర్చుగాక అని కోరుకుంటున్నాము. నిశ్చయంగా, ఆయన ఉదారవంతుడు, దయామయుడు. మరియు సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు శోభిస్తాయి.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక.
దీని రచన పరిపూర్ణమయ్యింది
ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉథైమీన్ కలముతో
***
విషయసూచిక
ముందుమాట 2
ఇస్లామీయ ధర్మము 4
ఇస్లాం మూలస్థంభాలు 11
ఇస్లామీయ అఖీద (ఈమాన్) మూలస్థంభాలు: 16
మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం: 18
దైవదూతలపై విశ్వాసం. 43
దైవగ్రంధాలపై విశ్వాసము 51
దైవసందేశహరులపై విశ్వాసము. 54
అంతిమదినంపై విశ్వాసము 66
విధివ్రాత పై విశ్వాసము: 94
ఇస్లామీయ అఖీద లక్ష్యాలు 110
***
దీనిని బుఖారీ కితాబుల్ ఈమాన్ లో నమోదు చేసినారు, హదీథు సంఖ్య (8), ముస్లిం కితాబుల్ ఈమాన్ లో నమోదు చేసినారు, బాబు ఖౌలున్ నబియ్యి ﷺ "బునియల్ ఇస్లాము అలా ఖమ్స్", హదీథు సంఖ్య (16).
దీనిని ముస్లిం కితాబుల్ ఈమాన్ లో నమోదు చేసినారు, హదీథు సంఖ్య (8). అబూ దావూద్ కూడా కితాబుస్సున్నహ్ లో నమోదు చేసినారు, బాబు ఫిల్ ఖదర్, హదీథు సంఖ్య (4695).
దీనిని బుఖారీ కితాబుల్ జనాయిజ్ లో నమోదు చేసినారు. బాబు ఇజా అస్లమ స్సబీయు ఫమాత, హల్ యుసల్లా అలైహి, వ హల్ యుఅ్రదు అలస్-సబీయి అల్ ఇస్లామ్, హదీథు సంఖ్య (1292), మరియు ముస్లిం కితాబుల్ ఖదర్ లో నమోదు చేసినారు. బాబు మఅ్నా కుల్ల మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రతి, వ హుక్ము మౌతి అత్వాలిల్ కుఫ్ఫార్ వ అత్వాలిల్ ముస్లిమీన్, హదీథు సంఖ్య (2658).
దీనిని బుఖారీ నమోదు చేసినారు, సూరహ్ అత్తూర్, హదీథు సంఖ్య (4854).
దీనిని బుఖారీ కితాబుల్ జుముఅహ్ లో నమోదు చేసినారు, బాబు అల్ ఇస్తిస్కా ఫిల్ ఖుత్బతి యౌముల్ జుముఅహ్, హదీథు సంఖ్య (891).
దీనిని బుఖారీ కితాబుల్ జుముఅహ్ లో నమోదు చేసినారు, బాబు అల్ఇస్తిస్ఖా ఫిల్ ఖుత్బతి యౌమిల్ జుముఅహ్ హదీథు సంఖ్య (891), మరియు ముస్లిం కితాబుస్సలాతుల్ ఇస్తిస్ఖా, బాబు అద్దుఆ ఫిల్ ఇస్తిస్ఖా హదీథు సంఖ్య (897) లో నమోదు చేసినారు.
దీనిని ముస్లిం కితాబుల్ ఈమాన్ లో నమోదు చేసినారు, బాబు బయానుల్ ఈమాని వల్ ఇస్లామి వల్ ఇహ్సాని వ వుజూబిల్ ఈమాని బిథ్‌బాతి ఖదరిల్లాహి సుభానహు వ తఆలా, హదీథు సంఖ్య (8).
దీనిని బుఖారీ: పుస్తకం సృష్టి ఆరంభం, అధ్యాయం దేవదూతల ప్రస్తావన (హదీథు సంఖ్య: 3037), మరియు ముస్లిం: పుస్తకం సదాచారం, బంధుత్వం మరియు శిష్టాచారాలు, అధ్యాయం అల్లాహ్ ఒక దాసుడిని ప్రేమిస్తే, అతనిని తన దాసుల వద్ద ప్రియంగా చేస్తాడు (హదీథు సంఖ్య: 2637) నమోదు చేసినారు.
దీనిని బుఖారీ కితాబుల్-జుముఆలో, బాబ్: "ఖుత్బాను శ్రద్ధతో వినడం," హదీథు సంఖ్య (887)లో నమోదు చేసినారు. మరియు ముస్లిం కితాబుల్-జుముఆలో, బాబ్: "ఫజ్లుత్తహ్జీర్ యౌమిల్-జుముఆ," హదీథు సంఖ్య (850)లో నమోదు చేసినారు.
దీనిని బుఖారీ కితాబు త్తౌహీద్ లో నమోదు చేసినారు, బాబు ఖౌలుల్లాహి తఆలా: "لِمَا خَلَقۡتُ بِيَدَيَّۖ", హదీథు సంఖ్య (7410), ముస్లిం కితాబుల్ ఈమాన్ లో నమోదు చేసినారు, బాబు అద్నా అహ్లిల్ జన్నతి మన్జిలతన్ ఫీహా, హదీథు సంఖ్య (193).
దీనిని బుఖారీ అబ్వాబ్ అల్ ఖిబ్లహ్ లో నమోదు చేసినారు, బాబు తవజ్జుహ్ నహ్వల్ ఖిబ్లహ్ హైసు కాన, హదీథు సంఖ్య (392), మరియు ముస్లిం కితాబుల్ మసాజిద్ వ మవాదిఉస్ సలాత్ లో నమోదు చేసినారు, బాబు సహు ఫీ సలాత్ వ సుజూద్ లహు, హదీథు సంఖ్య (572).
దీనిని ముస్లిం నమోదు చేసినారు, పుస్తకం -అల్'జన్నతు వ సిఫతు నయీముహా వ అహ్లుహా, లోక వినాశం మరియు కియామత్ దినం హష్ర్ వివరణ గురించి అధ్యాయం, హదీథు సంఖ్య (2859).
దీనిని బుఖారీ కితాబుల్ మజాలిమ్ లో నమోదు చేసినారు. బాబు ఖౌలుల్లాహి తఅాలా: «అలా లఅనతుల్లాహి అలా అజ్-జాలిమీన్», హదీథు సంఖ్య (2309), మరియు ముస్లిం కితాబ్ అత్తౌబా లో నమోదు చేసినారు. బాబు కుబూల్ తౌబతిల్ ఖాతిల్, వ ఇన్ కథుర ఖత్లుహు, హదీథు సంఖ్య (2768).
దీనిని ముస్లిం కితాబుల్ ఈమాన్ లో నమోదు చేయబడినది, బాబు ఇథా హమ్మ అల్ అబ్డు బి హసనతిన్ కుతిబత్ వ ఇథా హమ్మ బి సయ్యిఅతిన్ లం తుక్తబ్, హదీథు సంఖ్య (131).
దీనిని బుఖారీ, హదీథు సంఖ్య. 4501, 'కితాబ్ అల్ తఫ్సీర్', అధ్యాయం: అల్లాహ్ వాక్కు: 'ఏ ప్రాణీ వారికి దాచి ఉంచబడిన నేత్రానందాన్ని ఎరుగదు' మరియు ముస్లిం, హదీథు సంఖ్య. 2824, 'కితాబ్ అల్-జన్నాహ్ వ-సిఫతి నఈమిహా వా-అహ్లిహా'లో ఉదహరించారు.
దీనిని ముస్లిం కితాబుల్ జన్నతి వ సిఫతు నయీమిహా వ అహ్లుహాలో నమోదు చేసినారు, బాబు అరాజి మఖ్అదిల్ మయ్యితి మినల్ జన్నతి అవ్ న్నారి అలైహి వ ఇథ్బాతి అజాబిల్ ఖబరి వత్తఅవ్వుజి మిన్హు, హదీథు సంఖ్య (2867).
దీనిని అబూదావూద్ నమోదు చేసినారు: కితాబ్ అస్సున్నహ్, బాబు అల్ మసఅలహ్ ఫిల్ కబ్ర్ వ అజాబుల్ కబ్ర్, హదీథు సంఖ్య (4753), మరియు అహ్మద్: ముస్నద్ అల్ కూఫియ్యీన్, బరా ఇబ్ను ఆజిబ్ రదియల్లాహు అన్హుమా, హదీథు సంఖ్య (18534).
దీనిని బుఖారీ ఉదూ గ్రంథములో, మూత్రాన్ని కడుక్కోవడం గురించి వచ్చినది అనే అధ్యాయంలో, హదీథు సంఖ్య (215) గా నమోదు చేసినారు.
దీనిని ముస్లిం నమోదు చేసినారు, ఖద్ర్ గ్రంథము, ఆదమ్ మరియు మూసా అలైహిమస్ సలాం మధ్య వాదన గురించిన అధ్యాయం, హదీథు సంఖ్య (2653).
అల్-బుఖారీ: కితాబుల్-ఖదర్, బాబ్: వకాన అమ్రుల్లాహి ఖదరన్ మక్దూరన్, హదీథు సంఖ్య (6605); మరియు ముస్లిం: కితాబుల్-ఖదర్, బాబ్: మనిషి తన తల్లి గర్భంలో ఎలా సృష్టించబడతాడో, అతనిసంపద. మరణం (రిజ్కు, అజల్) (ఆయుష్షు), అమలు, దురదృష్టం మరియు సౌభాగ్యం వ్రాయబడుట గురించి, హదీథు సంఖ్య (2647).
దీనిని ముస్లిం నమోదు చేసినారు: కితాబు అజ్-జుహ్ద్ వర్-రకాయిఖ్, ముమిన్ యొక్క వ్యవహారం మొత్తం మంచిదే అనే అధ్యాయం, హదీథు సంఖ్య (2999).
దీనిని ముస్లిం నమోదు చేసినారు: కితాబుల్-ఖదర్, అధ్యాయం: శక్తి వంతుడై ఉండాలని, అసమర్థతను వదిలిపెట్టాలని, అల్లాహ్ సహాయం కోరాలని, మరియు విధిని అల్లాహ్‌కు అప్పగించాలని ఆదేశించిన అధ్యాయం, హదీథు సంఖ్య (2664).
దీనిని ముస్లిం నమోదు చేసినారు, కితాబుల్ ఈమాన్, బాబు వుజూబిల్ ఈమాన్ బిరిసాలతి నబీయినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జమీయిన్నాసి వనసఖిల్ మిలలి బి మిల్లతిహి, హదీథు సంఖ్య (153).