مَا لَا يَسَعُ المُسْلِمَ جَهْلُهُ
ముస్లిం తప్పక తెలుసుకోవలసిన జ్ఞానము
اللَّجْنَةُ العِلْمِيَّةُ
بِرِئَاسَةِ الشُّؤُونِ الدِّينِيَّةِ بِالمَسْجِدِ الحَرَامِ وَالمَسْجِدِ النَّبَوِيِّ
మస్జిద్ అల్ హరామ్ మరియు మస్జిద్ అన్నబవీల పర్యవేక్షణలోని ధార్మిక వ్యవహారాల శాస్త్రీయ కమిటీ
بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ
ముందుమాట
సకల స్తోత్రాలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు సర్వలోకాల కొరకు కారుణ్యంగా పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై, అంతిమదినం వరకు ఆయన సున్నతులను మరియు ఆయన చూపిన సన్మార్గాన్ని అనుసరించే వారిపై శుభాలు మరియు శాంతి కురియుగాక! అమ్మాబాద్:
అందువలన ఇది ఒక సంక్షిప్తమైన సందేశం, ఇందులో ముస్లింకి తన విశ్వాసం, ఆరాధనలు మరియు లావాదేవీలలో అవసరమైన ముఖ్య విషయాలు పొందుపరచబడ్డాయి. పవిత్ర హరమైన్ కు వచ్చే పురుష యాత్రికులు మరియు మహిళా యాత్రికుల కోసం మేము దీనిని సేకరించాము, తద్వారా వారు తమ ధర్మ సంబంధ విషయాలలో జ్ఞానం మరియు స్పష్టమైన అవగాహన కలిగి ఉండగలరు. దయామయుడైన, అనుగ్రహ మయుడైన, మహోన్నతుడైన అల్లాహ్ దీని ద్వారా ప్రయోజనం కలిగించి, దీన్ని సన్మార్గమైనదిగా చేసి, ప్రత్యేకంగా తన మన్నత కొరకు చేయాలని మేము ఆశిస్తున్నాము. నిజముగా ఆయనే ఉత్తమంగా వేడుకొనబడువాడు, అత్యంత గౌరవింపబడిన ఆశాకేతువాడు.
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో
మొదటి అధ్యాయం: అఖీదా (విశ్వాసాల) సంబంధిత విషయాలు
మొదటి భాగము: ఇస్లాం యొక్క అర్థము మరియు దాని మూలస్థంభాలు:
ఇస్లాం యొక్క అర్థము: అల్లాహ్ కొరకు ఏకత్వాన్ని స్వీకరించడం, విధేయత ద్వారా ఆయనను లొంగిపోవడం, షిర్క్ మరియు ముష్రికుల నుంచి దూరంగా ఉండటం.
మరియు దాని మూలస్థంభాలు ఐదు:
మొదటిది: అల్లాహ్ తప్ప వేరొక నిజఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం.
రెండవది: సలాహ్ (నమాజు) నెలకొల్పడం.
మూడవది: జకాత్ చెల్లించడం.
నాలుగవది: రమదాను మాసపు ఉపవాసములు ఉండటం.
ఐదవది: స్థోమత గలవారు దైవమార్గంలో అల్లాహ్ పవిత్ర గృహం యొక్క హజ్ చేయటం.
ఏకేశ్వరోపాసన యొక్క ప్రాముఖ్యత:
తెలుసుకో! మహోన్నతుడైన అల్లాహ్ సృష్టిని తన ఆరాధన కోసం మాత్రమే సృష్టించాడు మరియు వారు ఆయనతో దేనిని భాగస్వామ్యం చేయకూడదు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَمَا خَلَقۡتُ ٱلۡجِنَّ وَٱلۡإِنسَ إِلَّا لِيَعۡبُدُونِ 56﴾
{మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!} [అద్-దారియాత్ 51:56] మరియు ఈ ఆరాధనను జ్ఞానంతో తప్ప మరే విధంగానూ తెలుసుకోవటం సాధ్యం కాదు అల్లాహ్ ప్రకటన:
﴿فَٱعۡلَمۡ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا ٱللَّهُ وَٱسۡتَغۡفِرۡ لِذَنۢبِكَ وَلِلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِۗ وَٱللَّهُ يَعۡلَمُ مُتَقَلَّبَكُمۡ وَمَثۡوَىٰكُمۡ 19﴾
{కావున (ఓ ముహమ్మద్!) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్య దేవుడు లేడు. కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీల కొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాపణ వేడుకో! మరియు అల్లాహ్ కు మీ కార్యకలాపాలు మరియు మీ (అంతిమ) నివాసం కూడా తెలుసు.} [ముహమ్మద్ 47:19] కనుక (అల్లాహ్) మాట, ఆచరణ కంటే ముందు జ్ఞానంతో ఆరంభించాడు. ముస్లింలు నేర్చుకోవలసిన అత్యంత ముఖ్యమైనది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఏకశ్వరోపాసన; ఎందుకంటే అది ధర్మం యొక్క మూలం మరియు పునాది, తౌహీద్ (ఏకశ్వరోపాసన) లేకుండా ధర్మం నిలబడదు, మరియు ఇది ముస్లిం పై మొదటి కర్తవ్యం, మరియు చివరి కర్తవ్యం. ఇస్లాం మూలస్థంభాలలో మొదటి మూలస్థంభం ఏకేశ్వరోపాసనే, ఇది ప్రతి ముస్లిం తెలుసుకో వలసినది మరియు ఆచరించవలసినది. ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలు - అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనలో వచ్చినట్లు: అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుగా నేను విన్నాను:
«بُنِيَ الإسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أنْ لَا إلَهَ إلَّا اللَّهُ وأنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإقَامِ الصَّلَاةِ، وَإيتَاءِ الزَّكَاةِ، وَحَجِّ البَيْتِ، وصَوْمِ رَمَضَانَ».
ఇస్లాం ఐదింటిపై నిర్మితమై ఉన్నది: అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్తని సాక్ష్యమివ్వటం, నమాజు నెలకొల్పటం, జకాత్ ఇవ్వటం, కాబాగృహం హజ్ చేయటం, రమదాన్ ఉపవాసాలు పాటించడం1.
అందువలన ప్రతి ముస్లిం కొరకు తౌహీద్ అర్థాన్ని నేర్చు కోవడం తప్పనిసరి; అది అల్లాహ్‌ను మాత్రమే ఆరాధనలో ఏకైకుడిగా చేయడం. అందువల్ల ఆయన ఆరాధనలో ఆయనతో పాటు మరెవరినీ సాటి కల్పించ కూడదు; దగ్గరి దైవదూత అయినా, పంపించబడిన ప్రవక్త అయినా సరే.
"అల్లాహ్ తప్ప వేరొక నిజఆరాధ్యుడు లేడు" అని సాక్ష్యమివ్వటం యొక్క అర్థం:
అది ఏమిటంటే – ఖచ్చితమైన నమ్మకంతో మహోన్నతుడైన అల్లాహ్ ఒక్కడే నిజఆరాధ్యుడు అని దాసుడు అంగీకరించటం. అల్లాహ్ ఒక్కడినే ఆరాధించి, పరిశుద్ధుడైన ఆయనకే ప్రార్థన, భయం, ఆశ, ఆధారపడటం మరియు ఇతర వాటితో సహా అన్ని రకాల ఆరాధనలను ప్రత్యేకించాలి.
సాక్ష్యం రెండు మూలస్థంభాలతో తప్ప సాధించబడదు:
మొదటిది: అల్లాహ్ తప్ప ఇతర ప్రతిమల నుండి, తప్పుడు దేవతల నుండి, తాగూతుల నుండి దైవత్వం మరియు ఆరాధనను నిరాకరించడం.
రెండవది: అల్లాహ్ కే దైవత్వం మరియు నిజమైన ఆరాధనను నిరూపించడం, ఆయనకు తప్ప మరెవరికి కాదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَ...﴾
{మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి.} [అన్-నహల్ 16:36]
లా ఇలాహ ఇల్లల్లాహ్ షరతులు:
మొదటిది: అజ్ఞానమునకు విరుద్ధమైన జ్ఞానము.
రెండవది: సందేహానికి వ్యతిరేకమైన ఖచ్చితమైన నమ్మకం.
మూడవది: షిర్కు కు వ్యతిరేకమైన చిత్తశుద్ధి.
నాల్గవది: అబద్ధానికి వ్యతిరేకమైన సత్యం.
ఐదవది: ద్వేషానికి వ్యతిరేకమైన ప్రేమ (అల్ ముహబ్బతు).
ఆరవది: విడిచిపెట్టుటకు వ్యతిరేకమైన విధేయత.
ఏడవది: తిరస్కారానికి విరుద్ధమైన ఆమోదం
ఎనిమిదోవది: పరమపవిత్రుడైన అల్లాహ్ తప్ప పూజించబడే ఇతర మిథ్యా దైవాల ఆరాధనను ఖండించాలి.
మరియు ఈ షరతులను తప్పకుండా పాటించాలి, మరియు అవి ఈ రెండు కవిత్వములలో సమీకరించబడినవి:
పరిపూర్ణ జ్ఞానం, ఖచ్చితమైన నమ్మకం, చిత్తశుద్ధి మరియు సత్యతతో పాటు **** ప్రేమ, సంపూర్ణ విధేయత మరియు వాటిని స్వీకరించటం.
మరియు ఎనిమిదవది: అల్లాహ్ ను తప్ప మిగతా అన్నిఅసత్య దైవాలను తిరస్కరించాలి.
కలిమా షహాదను నిజంగా అమలు చేయడం అనేది అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం ద్వారా జరుగుతుంది — ఆయనకు ఏ భాగస్వామీ లేడు — మరియు ఆరాధనను కేవలం అల్లాహ్‌కు మాత్రమే అంకితం చేయడం ద్వారానే అవుతుంది. అల్లాహ్ తప్ప ఎవరినీ అర్ధించ కూడదు, అల్లాహ్ పై తప్ప ఎవరిపైనా నమ్మకం కలిగి ఉండ కూడదు మరియు అల్లాహ్ తో మాత్రమే ఆశించాలి మరియు అల్లాహ్ కొరకు మాత్రమే నమాజు చేయాలి మరియు పరమ పవిత్రుడైన అల్లాహ్ కొరకు మాత్రమే వధించాలి
కాబట్టి కొందరు చేసే పని అనగా సమాధుల చుట్టూ తవాఫ్ చేయడం (ప్రదక్షిణ చేయటం), సమాధిలో ఉన్న వారిని ఆశ్రయించడం, అల్లాహ్‌ను విడిచి వారిని ప్రార్థించడం — ఇది ఆరాధనలో షిర్క్ అవుతుంది. అంతే కాకుండా, ఇలాంటి వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి మరియు దాని నుండి ఇతరులను కూడా హెచ్చరించాలి. ఎందుకంటే ఇవి ముష్రికులు అల్లాహ్ ను విడిచి పెట్టి విగ్రహాలను, రాళ్లను, చెట్లను ఆరాధించే విధానంతో సమానమైనవి. ఇది ఆ షిర్క్, దీని నుండి హెచ్చరించడానికి మరియు దాని నుండి నిరోధించటానికి గ్రంథములు అవతరింప జేయబడినాయి మరియు ప్రవక్తలు పంపబడినారు.
ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం పలకటం యొక్క అర్థం:
ఆయన ఆదేశించిన వాటిలో ఆయనకు విధేయత చూపడం, ఆయన తెలియపరచిన వాటిలో ఆయనను సత్యవంతుడు అని నమ్మడం, ఆయన నిషేధించిన మరియు మందలించిన వాటి నుండి దూరంగా ఉండడం మరియు ఆయన ధర్మశాసనం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించడం. ఒక ముస్లిం ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖురైషీ అల్ హాషిమీను జిన్నులు మరియు మానవులలో నుండి సమస్త సృష్టి కొరకు అల్లాహ్ యొక్క ప్రవక్తగా అంగీకరిస్తాడు. అల్లాహ్ ప్రకటన:
﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُمۡ جَمِيعًا...﴾
(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను... [అల్ అఅ్ రాఫ్ 7:158]
అల్లాహ్ తన ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు సృష్టికి సన్మార్గం చూపటానికి ఆయనను పంపినాడు. అల్లాహ్ ప్రకటన:
﴿وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا كَآفَّةٗ لِّلنَّاسِ بَشِيرٗا وَنَذِيرٗا وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ28﴾
మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు. [సబా 34:28] అల్లాహ్ ప్రకటన:
﴿وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا رَحۡمَةٗ لِّلۡعَٰلَمِينَ 107﴾
మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము. [అల్ అంబియా 21:107]
ఈ సాక్ష్యం యొక్క లక్ష్యం ఏమిటంటే: అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు రుబూబియ్యా మరియు విశ్వంలో నియంత్రణలో హక్కు లేదా ఆరాధనలో హక్కు ఉందని నమ్మ కూడదు. కాని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దాసుడు — ఆరాధింపబడడు, ఒక ప్రవక్త — తిరస్కరింప బడడు. ఆయన ﷺ తనకు గాని ఇతరులకు గాని ఏ ప్రయోజనం గాని, హాని గాని స్వయంగా కలిగించలేరు, అయితే అల్లాహ్ అనుకున్నదే జరుగు తుంది. అల్లాహ్ ప్రకటన:
﴿قُل لَّآ أَقُولُ لَكُمۡ عِندِي خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعۡلَمُ ٱلۡغَيۡبَ وَلَآ أَقُولُ لَكُمۡ إِنِّي مَلَكٌۖ إِنۡ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَيَّ...﴾
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గానీ లేదా నాకు అగోచర జ్ఞానము ఉన్నదని గానీ, నేను మీతో అనడం లేదు లేదా నేను దైవదూతనని కూడా అనడం లేదు. కాని, నేను కేవలం నాపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే అనుసరిస్తున్నాను... [అల్ అన్ ఆమ్ 6:50]
రెండవ భాగము: ఈమాన్ యొక్క అర్థం మరియు దాని మూల స్థంభములు:
ఈమాన్ (విశ్వాసం) అనేది: హృదయంతో అంగీకరించడం, నాలుకతో పలకడం, హృదయం మరియు శరీర భాగాలతో ఆచరించడం. ఇది విధేయ కార్యాల వలన పెరుగుతుంది, మరియు అవిధేయ కార్యాల వలన తగ్గుతుంది.
కాబట్టి, ఈమాన్ (విశ్వాసం) అనేది ఆరాధనలు సరిగావటం కొరకు మరియు అంగీకరింపబడేందుకు ఒక షరతు. అలాగే, షిర్క్ (భాగస్వామ్యం) మరియు కుఫ్ర్ అన్ని విధేయ కార్యాలను నాశనం చేస్తాయి. ఏ విధంగా అల్లాహ్ ఉదూ లేకుండా నమాజును ఆమోదించడో, అలాగే ఈమాన్ లేకుండా ఆరాధనలను కూడా ఆమోదించడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَن يَعۡمَلۡ مِنَ ٱلصَّٰلِحَٰتِ مِن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَأُوْلَٰٓئِكَ يَدۡخُلُونَ ٱلۡجَنَّةَ وَلَا يُظۡلَمُونَ نَقِيرٗا 124﴾
మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు. [అన్నిసా 4:124]
మరియు షిర్కు ఆచరణలను నాశనం చేస్తుందని స్పష్ట పరచినాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَقَدۡ أُوحِيَ إِلَيۡكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبۡلِكَ لَئِنۡ أَشۡرَكۡتَ لَيَحۡبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ ٱلۡخَٰسِرِينَ 65﴾
మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుప బడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసి నట్లయితే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు." [అజ్ జుమర్ 39:65]
మరియు విశ్వాసము యొక్క మూలస్థంభములు ఆరు: అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంథములపై, ఆయన ప్రవక్తలపై, పరలోకంపై, విధివ్రాతపై విశ్వాసం కలిగి ఉండటం.
1) మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసము:
మరియు ఇది మూడు విషయాలను కలిగి ఉంటుంది:
1- ఆయన రుబూబియత్ పై విశ్వాసం:
అది మహోన్నతుడైన అల్లాహ్ యొక్క క్రియలలో ఆయనను ఏకైకుడిగా భావించడం: ఉదాహరణ – సృష్టించడం, ఆహారోపాధి ప్రసాదించడం, జీవింప జేయడం మరియు మరణింప జేయడం లాంటి పనులలో. కావున అల్లాహ్ తప్ప ఇంకెవరు సృష్టికర్త లేరు, అల్లాహ్ తప్ప ఇంకెవరు ఉపాధికర్త లేరు, అల్లాహ్ తప్ప ఇంకెవరు జీవం ప్రసాదించేవారు లేరు, అల్లాహ్ తప్ప ఇంకెవరు మరణం ప్రసాదించేవారు లేరు, మరియు ఈ విశ్వంలో ఆయన సుబహానహు వతఆలా తప్ప ఇంకెవరు వ్యవహారం చేయరు.
సృష్టిలో పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క రుబూబీయతు ను నిరాకరించినవాడు ఏ ఒక్కడూ లేడు ఒకవేళ ఎవరైనా అలా నిరాకరించినట్లయితే అతను నిజంగా నమ్మని వ్యక్తి కాకుండా, స్వార్థపూరితంగా మొండితనంతో నిరాకరించే వాడిగా ఉంటాడు ఫిర్ఔన్ తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు జరిగినట్లే:
﴿...أَنَا رَبُّكُمُ الْأَعْلَى﴾
నేనే మీ యొక్క మహాన్నత ప్రభువును! [అన్నాజిఆత్ 79:24] కాని ఇది విశ్వాసముతో కాదు. ఏ విధంగానైతే అల్లాహ్ మూసా అలైహిస్సలాంతో పలికినాడో:
﴿قَالَ لَقَدۡ عَلِمۡتَ مَآ أَنزَلَ هَٰٓؤُلَآءِ إِلَّا رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ بَصَآئِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَٰفِرۡعَوۡنُ مَثۡبُورٗا 102﴾
(మూసా) అన్నాడు: "నీకు బాగా తెలుసు, జ్ఞానవృద్ధి కలుగ జేసే వాటిని (సూచనలను) భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వరూ అవతరింపజేయలేరని! ఓ ఫిర్ఔన్, నీవు నిశ్చయంగా నశింపనున్నావని నేను భావిస్తున్నాను! [అల్ ఇస్రా 17:102] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنْفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا... ﴾
మరియు వారి హృదయాలు వాటిని అంగీకరించినా వారు అన్యాయంగా, అహంకారంతో తిరస్కరించారు.[అన్నమ్ల్ 16:14]
కావున ఈ సృష్టిరాసులకు ఖచ్చితంగా ఒక సృష్టికర్త ఉండాలి ఎందుకంటే అవి తమంతట తాము ఉనికిలోకి రావటం అసాధ్యం; ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తానే సృష్టించుకోదు, మరియు అది యాదృచ్చికంగా ఉనికిలోకి రావటం కూడా సాధ్యం కాదు; ఎందుకంటే ప్రతి ఉనికిలోకి వచ్చేవాడి కొరకు తప్పనిసరిగా దానిని ఉనికిలోకి తెచ్చేవాడు ఉండాలి, ఎందుకంటే ఈ సృష్టి అద్భుతమైన వ్యవస్థతో, సమన్వయంతో ఏర్పడిన విధానాన్ని చూసినప్పుడు, అది యాదృచ్ఛికంగా (ఆకస్మాత్తు గా) ఉనికిలోకి వచ్చిందని చెప్పడం అసాధ్యమే. కావున వాటిని ఉనికిలో తీసుకుని వచ్చేవాడు ఉండాలి, ఆయనే సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్. అల్లాహ్ ప్రకటన:
﴿أَمۡ خُلِقُواْ مِنۡ غَيۡرِ شَيۡءٍ أَمۡ هُمُ ٱلۡخَٰلِقُونَ 35 أَمۡ خَلَقُواْ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۚ بَل لَّا يُوقِنُونَ 36﴾
వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా? లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు. [అత్తూర్ 52:35-36]
మరోవైపు, ముష్రికులు అల్లాహ్ యొక్క ఉలూహియతులో ఆయనతోపాటు సాటి కల్పిస్తూ అల్లాహ్ యొక్క రుబూబియ్యతు ను అంగీకరిస్తుండేవారు, కానీ ఈ విషయం వారిని ఇస్లాంలోకి ప్రవేశింపజేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో యుద్ధం చేసి, వారి రక్తాన్ని మరియు సంపదలను హలాల్ చేసారు; ఎందుకంటే వారు ఆరాధనలో షిర్కు చేసారు, అల్లాహ్ తో పాటు వారు ఇతరులను ఆరాధించారు; ఉదాహరణ, విగ్రహాలు, రాతి శిలాలు, దైవదూతలు మొదలగువారు.
2- ఆయన ఉలూహియత్ పై విశ్వాసం:
ఆయన ఉలూహియతును విశ్వసించటం అంటే ఆయన ఒక్కడే నిజఆరాధ్య దైవమని, ఆయనతో పాటు ఎవరు సాటి లేరని విశ్వసించటం. (అల్-ఇలాహ్) అంటే (మాలూహ్), అంటే ప్రేమతో, ఘనతతో మరియు వినమ్రతతో ఆరాధింపబడ వలసిన ఏకైక ఆరాధ్యుడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَإِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞۖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلرَّحۡمَٰنُ ٱلرَّحِيمُ 163﴾
మరియు మీ ఆరాధ్యదైవం కేవలం ఆ అద్వితీయుడు (అల్లాహ్) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యదేవుడు లేడు, ఆయన అనంత కరుణా మయుడు, అపార కరుణా ప్రధాత. [అల్ బఖరహ్ 2:163]
అల్లాహ్ తో పాటు ఆరాధ్యదైవంగా చేసుకుని ఆయనను వదిలి పూజింబడే ప్రతీ దాని ఉలూహియత్ అవాస్తవము, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّ مَا يَدۡعُونَ مِن دُونِهِۦ هُوَ ٱلۡبَٰطِلُ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ 62﴾
ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం! మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు). [హజ్ 22:62]
ఇందుకే నూహ్ అలైహిస్సలాం నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వరకు ప్రవక్తలు అలైహిముస్సలాం తమ జాతి ప్రజలను ఏకేశ్వరోపాసన వైపునకు పిలిచి, అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని మరియు ఆయన కాకుండా వేరే వారి ఆరాధనను విడనాడమని పిలుపునిచ్చారు, మహోన్నతుడైన అల్లాహ్, ముష్రికులు అల్లాహ్ తో పాటు ఇతరులను దైవాలుగా చేసుకోవటాన్ని, వారిని ఆరాధించ టాన్ని, వారితో సహాయాన్ని అర్థించటాన్ని మరియు మొరపెట్టు కోవటాన్ని రెండు బుద్ధి పరమైన ప్రమాణాలతో అసత్యపరచాడు:
మొదటి కారణం: వారు తయారు చేసుకున్న ఈ ఆరాధ్య దైవాలలో ఉలూహియ్యత్ లక్షణాలలో నుంచి ఏదీ లేదు. వారు సృష్టించబడిన వారే తప్ప తమకు తాముగా ఏదీ సృష్టించలేరు. తమ దాస్యం చేసే వారికి ఎలాంటి లాభము చేకూర్చలేరు మరియు వారి నుండి ఎటువంటి నష్టమును దూరం చేయలేరు. వారికి మరణం, జీవితం మరియు పునరుత్థాన దినం మీద ఎటువంటి అధికారం లేదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ ءَالِهَةٗ لَّا يَخۡلُقُونَ شَيۡـٔٗا وَهُمۡ يُخۡلَقُونَ وَلَا يَمۡلِكُونَ لِأَنفُسِهِمۡ ضَرّٗا وَلَا نَفۡعٗا وَلَا يَمۡلِكُونَ مَوۡتٗا وَلَا حَيَوٰةٗ وَلَا نُشُورٗا 3﴾
అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు స్వయంగా తామే సృష్టింపబడిన వారిని దైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు. [ఫుర్ఖాన్ 25:3]
రెండవది: ఈ ముష్రికులు అల్లాహ్ తానే ఏకైక సృష్టికర్త మరియు ప్రణాళిక నిర్వహణ కర్త అని అంగీకరించేవారు, ఇది ఆయన ఒక్కడి కొరకు రుబూబియతును తప్పనిసరి చేసినట్లు గా ఆయన ఒక్కడి కొరకు ఉలూహియతును తప్పనిసరి చేస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿قُل لِّمَنِ ٱلۡأَرۡضُ وَمَن فِيهَآ إِن كُنتُمۡ تَعۡلَمُونَ 84 سَيَقُولُونَ لِلَّهِۚ قُلۡ أَفَلَا تَذَكَّرُونَ85 قُلۡ مَن رَّبُّ ٱلسَّمَٰوَٰتِ ٱلسَّبۡعِ وَرَبُّ ٱلۡعَرۡشِ ٱلۡعَظِيمِ 86 سَيَقُولُونَ لِلَّهِۚ قُلۡ أَفَلَا تَتَّقُونَ 87 قُلْ مَنْ بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ 88 سَيَقُولُونَ لِلَّهِ قُلْ فَأَنَّى تُسْحَرُونَ 89﴾
వారిని ఇలా అడుగు: "ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి. వారంటారు: "అల్లాహ్ కే!" వారితో అను: "అయినా మీరు హితోపదేశం స్వీకరించరా?" వారిని అడుగు: "సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు ఎవరు?" వారంటారు: "అల్లాహ్ మాత్రమే!" అని. వారితో అను: "అయితే మీరెందుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండరు?" వారిని ఇలా అడుగు: "మీకు తెలిస్తే చెప్పండి! ప్రతిదానిపై పాలనాధికారం ఎవరి చేతిలో ఉంది? మరియు ప్రతిదానికి శరణమిచ్చేవాడు ఆయనే మరియు ఆయనకు వ్యతిరేకంగా శరణమివ్వ గల వాడెవ్వడూ లేనివాడు, ఎవరు? వారంటారు: "అల్లాహ్ మాత్రమే!" వారితో అను: "అయితే మీరెందుకు మాయాజాలానికి గురవుతున్నారు (మోసగింప బడు తున్నారు)?" [అల్ మూమినూన్ 23:84-89] కాబట్టి వారు తౌహీదు రుబూబియ్యతును అంగీకరించినప్పుడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించటం వారిపై తప్పనిసరి మరియు ఆయన ఆరాధనలో ఎవ్వరినీ భాగస్వామ్యం చేయకూడదు.
3- దివ్యనామాలు మరియు గుణాల పై విశ్వాసం:
అంటే: అల్లాహ్ తన గ్రంథంలో తన కోసం నిరూపించినదాన్ని నిరూపించడం లేదా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సున్నతులో నిరూపించినదాన్నిఆయనకు నిరూపించటం - అల్లాహ్ కు శోభాయమానంగా సముచితంగా ఆయన నామాలు మరియు గుణగణాలు, ఎలాంటి వక్రీకరణ, తొలగింపు లేకుండా, ఏ రూప నిర్ధారణ, పోలిక లేకుండా. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلِلَّهِ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰ فَٱدۡعُوهُ بِهَاۖ وَذَرُواْ ٱلَّذِينَ يُلۡحِدُونَ فِيٓ أَسۡمَٰٓئِهِۦۚ سَيُجۡزَوۡنَ مَا كَانُواْ يَعۡمَلُونَ 180﴾
మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు. [అల్ అఅ్ రాఫ్ 7:180] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ﴾
ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. [అష్షూరా 42:11]
షిర్కు మూడు రకాలు:
1- పెద్ద షిర్క్.
2- షిర్కె అస్గర్ (చిన్న తరహా షిర్క్).
3- గోప్యమైన షిర్క్.
1- షిర్కె అక్బర్:
దాని నియమం: అల్లాహ్‌కు ప్రత్యేకమైన వాటిలో, అల్లాహ్‌తో సమానంగా ఇతరులను చూడటం, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿إِذۡ نُسَوِّيكُم بِرَبِّ ٱلۡعَٰلَمِينَ 98﴾
ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో! [అష్షూరా 42:98]
ఇందులో ఇవి వస్తాయి: ఆరాధనను అల్లాహ్ కు కాకుండా ఇతరులకు చేయటం, లేదా వాటిలో కొంత భాగాన్ని అల్లాహ్ కొరకు కాకుండా ఇతరుల కొరకు చేయటం; ఉదాహరణకి ప్రార్థన, సహాయం కోరటం, మొక్కుబడి, జుబాహ్ (బలి) మరియు ఇతర ఆరాధన రకాలలో.
లేదా ఇందులో ఇవి కూడా వస్తాయి: అల్లాహ్ అజ్జ వజల్ నిషేధించిన దానిని హలాల్ గా భావించడం లేదా ఆయన హలాల్ చేసిన దానిని నిషేధించడం, లేదా అల్లాహ్ అజ్జ వజల్ విధిగావించిన దాన్ని విధి నుండి తొలగించడం, ధర్మం ద్వారా నిషేధంగా తెలిసిన వాటిని అనుమతించుట; ఉదాహరణకు వ్యభిచారం, మద్యం, తల్లిదండ్రుల పట్ల అవిధేయత, వడ్డీ లేదా ఇలాంటి ఇతర విషయాలను అనుమతించుట.
లేదా మహోన్నతుడైన అల్లాహ్ అనుమతించిన శుభ్రమైన వాటిని నిషేధించడం లేక అల్లాహ్ విధిగావించిన దానిని విధి నుండి తొలగించటం; ఉదాహరణకు నమాజు లేదా ఉపవాసం లేదా జకాతు వాజిబ్ కాదని విశ్వసించుట.
పెద్ద షిర్కు ఆచరణ వృధా అవటాన్ని మరియు దానిపై మరణించే వాడిని నరకంలో శాశ్వతంగా ఉండటాన్ని అనివార్యం చేస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...وَلَوۡ أَشۡرَكُواْ لَحَبِطَ عَنۡهُم مَّا كَانُواْ يَعۡمَلُونَ﴾
ఒకవేళ వారు అల్లాహ్ కు సాటి కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాలు వృధా అయి పోతాయి [అల్ అన్ఆమ్ 6:88]
మరియు దానిపైనే మరణించినవాడి పాపాలు అల్లాహ్ మన్నించడు మరియు స్వర్గం అతనిపై నిషేధం, అల్లాహ్ ప్రకటన
﴿إِنَّ ٱللَّهَ لَا يَغۡفِرُ أَن يُشۡرَكَ بِهِۦ وَيَغۡفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ...﴾
నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు... [అన్నిసా 4:48] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿إِنَّهُۥ مَن يُشۡرِكۡ بِٱللَّهِ فَقَدۡ حَرَّمَ ٱللَّهُ عَلَيۡهِ ٱلۡجَنَّةَ وَمَأۡوَىٰهُ ٱلنَّارُ...﴾
వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే... [అల్ మాయిదా 5:72]
2- చిన్న షిర్క్:
ఇది షిర్క్ అనే పేరుతో నిరూపించబడినదే కానీ షిర్కె అక్బర్ స్థాయికి చేరలేదు, కాబట్టి దీనిని షిర్కె అస్గర్ (చిన్న షిర్కు) అని అంటారు; ఉదాహరణ అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేయటం ఉదాహరణకు - కాబా గృహం, ప్రవక్తలు, అమానతు, మరియు ఫలానా వ్యక్తి జీవితం పై ప్రమాణం చేయటం, మరియు ఇలాంటి ఇతర విషయాలు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«مَنْ حَلَفَ بِغَيرِ اللهِ فَقَدْ كَفَرَ أَو أَشرَكَ».
ఎవరైతే అల్లాహ్ పేరున గాక ఇతరుల పేరుతో ప్రమాణం చేస్తారో, నిశ్చయంగా వారు అవిశ్వాసానికి పాల్బడినట్లే లేదా అల్లాహ్ కు సాటి కల్పించినట్లే".2
అది వ్యక్తి హృదయంలో ఉండే ఉద్దేశాల ప్రకారం పెద్ద షిర్క్ కావచ్చు. ప్రవక్త పేరున లేదా ఫలానా షేఖ్ పేరున ప్రమాణం చేస్తున్న వ్యక్తి హృదయంలో అతను అల్లాహ్ వంటివాడని లేదా అల్లాహ్ ను వదిలి అతనిని ప్రార్థించవచ్చని లేదా అతను సృష్టిలో వ్యవహరించగలడని భావిస్తే, అది పెద్ద షిర్క్ అవుతుంది. అయితే, అల్లాహ్ పేరున గాక ఇంకెవరి పేరునైనా ప్రమాణం చేయునపుడు, ఆ ఉద్దేశ్యంతో లేకపోతే, అలవాటుగా నోటి నుండి జారిపోతే, అది చిన్న షిర్క్ గా పరిగణించబడుతుంది. ఇది కొన్ని ప్రాంతాలలో తరచుగా జరుగుతుంది, కాబట్టి దానికి జాగ్రత్తగా ఉండటం మరియు దాని నుండి హెచ్చరించడం తౌహీదు పరిరక్షణ మరియు సంరక్షణ కోసం అవసరం.
3- గోప్యమైన షిర్క్:
ఇది హృదయాలలో ఉండే ప్రదర్శనాబుద్ధి; ఉదాహరణకు ప్రజలు తనను చూడాలని ఉద్దేశ్యంతో నమాజు చేయుట లేదా తనను పొగడాలని ఉద్దేశ్యంతో తస్బీహ్ చేయుట లేదా తనను ప్రశంసించాలనే ఉద్దేశ్యంతో సదకా చేయుట, ఇది ప్రదర్శన కోసం చేసిన ఆచరణను వృధా చేస్తుంది, కానీ, అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో చేసిన ఇతర కార్యాలకు ఇది వర్తించదు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«الشِّرْكُ فِي هَذِهِ الْأُمَّةِ أَخْفَى مِنْ دَبِيبِ النَّمْلَةِ السَّودَاءِ عَلَى الصَّفَاةِ السَّودَاءِ فِي ظُلْمَةِ اللَّيْلِ، وَكَفَّارَتُهُ أَنْ يَقُولَ: "اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أُشْرِكَ بِكَ شَيْئًا وَأَنَا أَعْلَمُ، وَأَسْتَغْفِرُكَ مِنَ الذَّنْبِ الَّذِي لَا أَعْلَمُ».
ఈ ఉమ్మత్ లో షిర్కు రాత్రి చిమ్మచీకటిలో నల్లటి బండ రాయిపై పాకే నల్ల చీమల కంటే గోప్యమైనది మరియు దానికి కఫ్ఫారాగా చెప్పవలసినది: అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక అన్ ఉష్'రిక బిక షయ్'అన్ వ అనా అఅ్'లము, వ అస్'తగ్'ఫిరుక మినజ్జంబిల్లజీ లా అఅ్'లము»3.
అవిశ్వాసము (కుఫ్ర్) యొక్క రకాలు:
మొదటి రకం: పెద్ద కుఫ్ర్:
ఇది నరకాగ్నిలో శాశ్వత నివాసానికి కారణమగును, ఇది ఐదు రకాలు:
1- తిరస్కారము (కుఫ్రె తక్జీబ్).
ఇది ప్రవక్తలను అసత్యులని నమ్మటం, ఇది అవిశ్వాసులలో తక్కువ; ఎందుకంటే అల్లాహ్ -అజ్జ వ జల్- తన ప్రవక్తలను స్పష్టమైన రుజువులతో మద్దతిచ్చాడు. ఈ అసత్యారోపణ చేసే వారి స్థితి అల్లాహ్ వర్ణించినట్లే ఉంది:
﴿وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنْفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا...﴾
మరియు వారి హృదయాలు వాటిని అంగీకరించినా వారు అన్యాయంగా, అహంకారంతో తిరస్కరించారు. [అన్నహ్ల్ 16:14]
2- నిరాకరణ మరియు అహంకారం యొక్క అవిశ్వాసం:
ఇది ఇబ్లీసు అవిశ్వాసానికి ఉదాహరణ. అతను అల్లాహ్ ఆదేశాన్ని తిరస్కరించలేదు లేదా నిరాకరించలేదు, కానీ దానిని నిరాకరించి అహంకారంతో ఎదుర్కొన్నాడు. అల్లాహ్ ప్రకటన:
﴿وَإِذۡ قُلۡنَا لِلۡمَلَٰٓئِكَةِ ٱسۡجُدُواْ لِأٓدَمَ فَسَجَدُوٓاْ إِلَّآ إِبۡلِيسَ أَبَىٰ وَٱسۡتَكۡبَرَ وَكَانَ مِنَ ٱلۡكَٰفِرِينَ 34﴾
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: "మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు; అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్యతిరస్కారులలోని వాడయ్యాడు. [అల్ బఖరహ్ 2:34]
3- విముఖతతో చూపే అవిశ్వాసం (కుఫ్రె ఈరాజ్)
అది ఎలాగంటే అతను సత్యాన్ని అనుసరించటం నుండి తన చెవులను మరియు హృదయాలను మళ్లించుకున్నాడు, దానిపై శ్రద్ధ చూపలేదు లేదా దానిని అస్సలు పట్టించుకోలేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّن ذُكِّرَ بِـَٔايَٰتِ رَبِّهِۦ ثُمَّ أَعۡرَضَ عَنۡهَآۚ إِنَّا مِنَ ٱلۡمُجۡرِمِينَ مُنتَقِمُونَ22﴾
మరియు తన ప్రభువు సూచనల (ఆయతుల) ద్వారా హిత బోధ చేయబడిన తరువాత కూడా, వాటి నుండి విముఖుడయ్యే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, మేము అలాంటి అపరాధులకు ప్రతీకారం చేసి తీరుతాము. [అస్ సజ్దహ్ 32:22]
అయితే పాక్షిక విస్మరణ – అది కుఫ్ర్ (అవిశ్వాసం) కాదు, ఫిస్క్ (చెడు) మాత్రమే; ఉదాహరణకి: ఉపవాసం లేదా హజ్జ్ వంటి కొన్ని ధర్మబాధ్యతల జ్ఞానం నేర్చుకోవడం నుండి దూరంగా ఉండే వ్యక్తి.
4 - కుఫ్రె షక్క్ (సందేహం)
అది అతను సందేహంలో ఉంటాడు మరియు సత్యం విషయంలో ఖచ్చితత్వం లేకుండా ఉంటాడు, అల్లాహ్ ప్రకటన:
﴿وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَنْ تَبِيدَ هَذِهِ أَبَدًا 35 وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِنْ رُدِدْتُ إِلَى رَبِّي لَأَجِدَنَّ خَيْرًا مِنْهَا مُنْقَلَبًا 36﴾
మరియు ఈ విధంగా అతడు తనకు తాను అన్యాయం చేసుకునేవాడవుతూ, తన తోటలో ప్రవేశించి ఇలా అన్నాడు: "ఇది ఎన్నటికైనా నాశనమవుతుందని నేను భావించను! మరియు అంతిమ ఘడియ కూడా వస్తుందని నేను భావించను, ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా, అచ్చట నేను దీని కంటే మేలైన స్థానాన్నే పొందగలను. [అల్ కహఫ్ 18:35-36]
5- కపటము (కుఫ్రె నిఫాఖ్):
తన నాలుకతో విశ్వాసాన్ని ప్రకటించి, తన హృదయంలో తిరస్కారాన్ని దాచిపెట్టడం. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ وَبِٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَمَا هُم بِمُؤۡمِنِينَ 8﴾
మరియు ప్రజలలో కొందరు: "మేము అల్లాహ్ నూ మరియు అంతిమ దినాన్నీ విశ్వసించాము" అని, అనే వారున్నారు. కానీ (వాస్తవానికి) వారు విశ్వసించేవారు కారు. [అల్ బఖరహ్ 2:8]
ఇవి ధర్మం నుండి బహిష్కరించే పెద్ద అవిశ్వాసం రకాలు.
రెండవ రకము: చిన్న కుఫ్ర్:
మరియు ఈ రకము నరకములో శాశ్వతంగా ఉండుటను అనివార్యం చేయదు. ఇది ఖుర్ఆన్ లో మరియు సున్నతులో అవిశ్వాసంగా పేర్కొనబడింది, ఇది అలిఫ్ లామ్ ద్వారా (మారిఫా) నిర్దిష్ట వ్యాసం గా నిర్వచించబడలేదు, కానీ నిరవధిక రూపంలో (నకేర రూపంలో) ప్రస్తావించబడింది. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి, వాటిలో కొన్ని: అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«اثْنَتَانِ فِي النَّاسِ هُمَا بِهِمْ كُفْرٌ: الطَّعْنُ فِي النَّسَبِ، وَالنِّيَاحَةُ عَلَى المَيِّتِ».
ప్రజల్లో వ్యవహరించే రెండు విషయాలు కుఫ్ర్’కు సంబంధించినవి, అందులో ఒకటి: వంశావళిని ఎగతాళి చేయడం, మృతుడిపై అరుస్తూ దుఖించడం.4
2) దైవదూతల పై విశ్వాసము:
వారు అగోచర లోకం అల్లాహ్ తఆల వారిని జ్యోతితో సృష్టించాడు, వారు అల్లాహ్ కొరకు ఆరాధిస్తున్నారు, వారికి రుబూబియ్యత్ మరియు ఉలూహియ్యత్ లక్షణాలలో ఏదీ లేదు. అల్లాహ్ వారికి ఆజ్ఞాపించిన దానికి వారు అవిధేయత చూపరు, మరియు తమకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తారు. వారు చాలా మంది ఉన్నారు. వారిని అల్లాహ్ తప్ప ఎవరూ లెక్కించ లేరు.
దైవదూతలపై విశ్వాసం అన్నది నాలుగు విషయములను కలిగి ఉంది:
1: వారి ఉనికిపై విశ్వాసం ఉంచడం.
2: ఏ దైవదూతల పేర్లు మనకు తెలుపబడెనో, వారి పట్ల విశ్వాసమును కలిగి ఉండటం. ఉదాహరణకు జిబ్రయీల్, మీకాయీల్, ఇస్రాఫీల్ మరియు మొదలగు వారు. ఎవరి పేర్లు మనకు తెలుపబడలేదో వారిని సంక్షిప్తంగా విశ్వసించాలి.
3: దైవదూతల గుణాల గురించి మనకు ఏమి తెలుసో దాన్ని విశ్వసించటం, అవి ఖుర్ఆన్ మరియు సున్నతులో వచ్చాయి; ఉదాహరణకు జిబ్రయీల్ అలైహిస్సలాం గుణము గురించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను అల్లాహ్ సృష్టించిన రూపంలో చూశారని తెలిపినారు, ఆయనకు ఆరు వందల రెక్కలు కలవు, అవి ఆకాశమండలాన్ని కప్పి వేసి ఉన్నాయి.
4: మనకు తెలిసిన వారి ఆచరణలపై విశ్వాసము కలిగి ఉండటం; ఉదాహరణకు వారు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడటం, రాత్రింబవళ్ళు ఎటువంటి అలసత్వం, విరక్తి లేకుండా ఆయన ఆరాధన చేయటం.
ఇంకో ఉదాహరణ: జిబ్రయీల్: వహీ తీసుకుని రావటంలో అమీన్ (విశ్వసనీయత, నిజాయితీ గలవారు).
ఇస్రాఫీల్ అలైహిస్సలాం: బాకా (సూర్) ఊదే బాధ్యత ఇవ్వబడి ఉన్నారు.
మలకుల్ మౌత్: మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆత్మలను సేకరించే బాధ్యత ఇవ్వబడి ఉన్నారు.
మాలిక్ : నరకం యొక్క రక్షక భటుడు. మరియు రిద్వాన్: స్వర్గమునకు సంరక్షకుడు మొదలగు వారు.
3) దైవగ్రంథాల పై విశ్వాసము:
ఇక్కడ దైవగ్రంథాలు అంటే అల్లాహ్ తన ప్రవక్తలపై అవతరింప జేసిన దివ్యగ్రంథాలు. అవి సర్వ మానవాళికి మార్గదర్శకత్వము మరియు కారుణ్యం. తద్వారా వారు ఇహపర సుఖాలను పొందగలరు.
దైవగ్రంథములపై విశ్వాసం అన్నది నాలుగు విషయాలను కలిగి ఉన్నది:
1 - అవి వాస్తవానికి అల్లాహ్ నుండి అవతరించబడినవి అనే విశ్వాసం కలిగి ఉండటం.
2 - వాటిలో నుంచి వేటి పేరు మనకు తెలుపబడెనో వాటిని విశ్వసించటం. ఉదాహరణకు ముహమ్మద్ ﷺ పై అవతరింప బడిన ఖుర్ఆన్, మూసా అలైహిస్సలాం పై అవతరింప బడిన తౌరాత్, ఈసా అలైహిస్సలాం పై అవతరింప బడిన ఇంజీలు, మరియు దావూద్ అలైహిస్సలాంకు ఇవ్వబడి జబూర్.
ఇక వేటి పేర్లు మనకు తెలుపబడలేదో వాటిపై సంక్షిప్తంగా విశ్వాసం కనబరచాలి.
3 - వాటి సమాచారములను నమ్మటం; ఉదాహరణకు ఖుర్ఆన్ సమాచారములు మరియు పూర్వ గ్రంథములలోని మార్పు చేర్పులు జరగని సమాచారములు.
4 - వాటిలో నుంచి రద్దుపరచబడని వాటి ఆదేశములను ఆచరించుట, వాటి పట్ల సంతృప్తి చెందుట, వాటిని అంగీకరించుట - దాని విజ్ఞత మనకు అర్థమైనా లేదా అర్థం కాకపోయిన సరే. మరియు పూర్వ గ్రంథములన్నీ దివ్యఖుర్ఆన్ ద్వారా రద్దు చేయబడినాయి. కావున పూర్వగ్రంథాల ఆదేశాలలో నుంచి ఖుర్ఆన్ లేదా సున్నతు దృవీకరించిన, సరియైనవని తెలిపిన వాటిని తప్ప వేటినీ ఆచరించటం ధర్మసమ్మతం కాదు.
4) దైవప్రవక్తల పై విశ్వాసము:
అర్రుసుల్: రసూల్ యొక్క బహువచనం; మానవులలో వహీ ద్వారా ధర్మశాసనాలు ఇవ్వబడినవాడు మరియు వాటిని తన ప్రజలకు చేరవేయమని ఆదేశించబడినవారు. వారిలో మొట్టమొదటివారు నూహ్ అలైహిస్సలాం మరియు వారిలో చిట్ట చివరివారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారు కూడా సృష్టించబడిన మనుషులు, వారు రుబూబియ్యత్ మరియు ఉలూహియ్యత్ ప్రత్యేకతలలో నుండి ఏదీ కలిగి లేరు.
మరియు దైవ ప్రవక్తలపై విశ్వాసం వీటిని కలిగి ఉంది:
1- వారి దైవదౌత్యం అల్లాహ్ వద్ద నుండి వచ్చిన సత్యమని విశ్వసించాలి, వారిలో నుండి ఏ ఒక్కరి దైవదౌత్యాన్ని నిరాకరించినా అతడు వారందరినీ నిరాకరించినవాడవుతాడు.
2- ఆ ప్రవక్తలలోంచి మనకు ఎవరి నామములు తెలుప బడినాయో వారిని విశ్వసించటం. ఉదాహరణకు ముహమ్మద్, ఇబ్రాహీం, మూసా, ఈసా మరియు నూహ్ అలైహిముస్సలాం. వారు ఉలుల్ అజ్మ్ ప్రవక్తలు. ఇక ఏ ప్రవక్తల పేర్లు మనకు తెలపబడలేదో వారిపై మనం సంక్షిప్తంగా విశ్వాసం కనబరచాలి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا رُسُلٗا مِّن قَبۡلِكَ مِنۡهُم مَّن قَصَصۡنَا عَلَيۡكَ وَمِنۡهُم مَّن لَّمۡ نَقۡصُصۡ عَلَيۡكَ...﴾
మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము నీకు పూర్వం అనేక ప్రవక్తలను పంపాము; వారిలో కొందరి వృత్తాంతం మేము నీకు తెలిపాము; మరికొందరిని గురించి నీకు తెలుపలేదు... [గాఫిర్ 40:78]
3- వారి (అలైహిముస్సలాం) నుండి ప్రామాణికంగా వచ్చిన వార్తలను ధృవీకరించడం.
4- వారిలో నుండి మన వైపు పంపబడిన ప్రవక్త షరీఅతును ఆచరించడం. వారిలో పరిసమాప్తి అయిన చిట్టచివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
5) అంతిమ దినము పై విశ్వాసము:
అది ప్రళయదినం, లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం పొందుట కొరకు ప్రజలు మరలా లేపబడే దినం, దానికి ఆ పేరుతో పిలవటానికి కారణం దాని తరువాత వేరే ఏ దినం లేదు. ఎందుకంటే ఆ రోజే స్వర్గవాసులు తమ నివాసములలో మరియు నరకవాసులు తమ నివాసములలో స్థిర పడతారు.
అంతిమదినంపై విశ్వాసం మూడు విషయాలను కలిగి ఉంది:
ఎ- మరణాంతరం లేపబడటం పై విశ్వాసం:
ఇది రెండవ సారి బాకా ఊదబడినప్పుడు మృతులు జీవింప బడటం, అప్పుడు ప్రజలు సర్వలోక ప్రభువు ముందు చెప్పులు లేకుండా ఒట్టి కాళ్ళతో, దుస్తులు లేకుండా నగ్నంగా, ఖత్నా చేయబడని స్థితిలో నిలబడతారు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ وَعْدًا عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِينَ 104﴾
మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము. [అల్ అంబియా 21:104]
బి- లెక్కతీసుకోబడటంపై, ప్రతిఫలం ప్రసాదించబడటం పై విశ్వాసం:
దాసుడు తన కర్మల లెక్క తీసుకోబడుతాడు మరియు దానికి ప్రతిఫలాలు పొందుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿إِنَّ إِلَيۡنَآ إِيَابَهُمۡ 25 ثُمَّ إِنَّ عَلَيۡنَا حِسَابَهُم 26﴾
నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది. ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే! {అల్ గాషియా 88:25-26}
సి- స్వర్గము మరియు నరకముల పై విశ్వాసం:
మరియు అవి రెండు సృష్టికి శాశ్వత గమ్యస్థానమని; కావున స్వర్గము అనుగ్రహాల నిలయము. దాన్ని మహోన్నతుడైన అల్లాహ్ దైవభీతి గల విశ్వాసుల కొరకు మరియు అల్లాహ్ కు ఆయన ప్రవక్త ﷺ కు విధేయత చూపిన వారి కొరకు సిద్ధం చేసి ఉంచాడు, అందులో ఏ కన్నూ చూడని, ఏ చెవీ వినని మరియు ఏ మానవ హృదయములో తట్టని అద్భుతాలు ఉన్నాయి.
ఇక నరకాగ్ని; అది శిక్షా గృహము, దానిని మహోన్నతుడైన అల్లాహ్, తన పట్ల అవిశ్వాసము చూపి, తన ప్రవక్తల పట్ల అవిధేయత చూపిన సత్యతిరస్కారుల కొరకు సిద్ధం చేసి ఉంచాడు. దానిలో ఊహకు అందని రకరకాల కఠిన శిక్షలు మరియు నీతిదాయకమైన శిక్షలు ఉన్నాయి.
6) విధివ్రాత పై విశ్వాసము:
విధివ్రాత అనగా: అల్లాహ్ - అజ్జ వ జల్ - తన ముందస్తు జ్ఞానంతో మరియు తన విజ్ఞతతో ఏమి జరుగుతుందో దానిని పూర్వనిర్దేశము చేయటం.
విధివ్రాతపై విశ్వాసం అన్నది నాలుగు విషయాలు కలిగి ఉంది:
1- జ్ఞానము: అది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క జ్ఞానం పై విశ్వాసం మరియు ఆయనకు జరిగింది, జరగబోయేది మరియు అవి ఎలా జరుగుతాయో సంక్షిప్తంగా, సవివరంగా, శాశ్వతంగా తెలుసు అని విశ్వసించడం. పరిశుద్ధుడైన ఆయన జరగనిది జరిగితే ఎలా జరుగుతుందో పూర్తిగా తెలిసినవాడు, పరిశుద్ధుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు:
﴿وَلَوۡ رُدُّواْ لَعَادُواْ لِمَا نُهُواْ عَنۡهُ ...﴾
(మరియు ఒకవేళ వారిని (గత జీవితంలోకి) తిరిగి పంపినా, వారికి నిషేధించబడిన వాటినే వారు తిరిగి చేస్తారు ...) [అల్ అన్ ఆమ్ 6:28]
2- కితాబత్ (వ్రాయటం): మహోన్నతుడైన అల్లాహ్ ప్రళయదినం వరకు ఉనికిలో రాబోయే ప్రతిదాని యొక్క విధివ్రాతను ముందుగానే వ్రాశాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ذَٰلِكَ فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ 70﴾
ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది. [అల్ హజ్జ్ 22:70]
3- చిత్తం: ఈ విశ్వంలో అల్లాహ్ తలచినదే జరుగుతుందని విశ్వసించడం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُ ...﴾
మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు ... [అల్ ఖసస్ 28:68] మరియు మనిషికి కూడా ఇచ్ఛ ఉంది, కానీ అది అల్లాహ్ యొక్క ఇచ్ఛ నుండి బయటకు రాదు, మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటన:
﴿وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ 29﴾
మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు. [అత్తక్వీర్ 81:29]
4- సృష్టి: అల్లాహ్ అజ్జ వ జల్ సృష్టిని మరియు వాటి కర్మలను, మంచి మరియు చెడు కార్యాలను సృష్టించాడని విశ్వసించడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٞ 62﴾
అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి కార్యకర్త. [అజ్జుమర్ 39:62]
మరియు ఈ స్థాయిలు ఈ కవిత్వంలో సమీకరించబడినవి:
మా ప్రభువు యొక్క జ్ఞానము వ్రాత, ఆయన ఇచ్ఛ మరియు సృష్టి, అది సృష్టించుట మరియు నిర్మాణము.
మూడవ భాగము: ఇహ్సాన్
ఇహ్సాన్: ఇది ఒకే ఒక మూలము కలిగి ఉంది; అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూడలేకపోతే, ఆయన నిన్ను కచ్చితంగా చూస్తున్నాడని భావిస్తూ ఆయనను ఆరాధించడం. అంటే; మనిషి అల్లాహ్ తనను ఆరాధించమని ఆదేశించిన వాటిని, ఆయన ఎదుట నిలబడి ఉన్నట్లుగా చేయాలి, మరియు అది పరిపూర్ణ భయభక్తిని మరియు పవిత్రుడైన ఆయన (అల్లాహ్) వైపు పూర్తిగా మరలడం తప్పనిసరి చేస్తుంది. మరియు దైవప్రవక్త ﷺ సున్నతుకు అనుగుణంగా ఆరాధన చేయడం కూడా తప్పనిసరి చేస్తుంది.
ఇహ్సాన్ రెండు స్థాయిలలో ఉంది మరియు ఇహ్సాన్లో ఉండే ముహ్సినీన్ లు రెండు విభిన్న స్థానాలలో ఉంటారు:
మొదటి స్థాయి: ఇది అత్యున్నతమైనది, అది ముషాహదా (చూస్తున్నట్లు భావించే) స్థాయి. ఒక దాసుడు తన హృదయం తో అల్లాహ్‌ను గమనిస్తున్నట్లుగా వ్యవహరించాలి. దీనిలో హృదయం విశ్వాస కాంతి ద్వారా ఎంతగా ప్రకాశిస్తుందంటే, కనిపించనిది కంటికి కనిపించేంతగా అయిపోతుంది.
రెండవ స్థాయి: చిత్తశుద్ధి మరియు పర్యవేక్షణ స్థాయి, దాసుడు అల్లాహ్ తనను చూస్తున్నాడని, తనపై దృష్టి పెట్టినట్లు భావిస్తూ ఆచరించాలి, ఈ భావన కలిగినప్పుడు అతను అల్లాహ్ కు నిష్కపటంగా ఉంటాడు.
నాల్గవ భాగము: అహ్లు సున్నత్ వల్ జమాఅత్ యొక్క మూల సూత్రాల సంక్షిప్త పరిచయం:
మొదటిది: ఖుర్ఆన్ మరియు సున్నతులోని ఆదేశాలను అంతర్గతంగా మరియు బాహ్యంగా అనుసరించుట, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాట కంటే ఏ మానవుడి మాటకు ప్రాధాన్యత ఇవ్వకూడదు.
రెండవది: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల పట్ల వారి హృదయములు మరి మాటలు నిర్మలంగా ఉంచాలి, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఖలీఫా అబూ బకర్, ఆ తర్వాత ఉమర్, ఆ తర్వాత ఉస్మాన్, ఆ తర్వాత అలీ రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ అని వారు భావిస్తారు.
మూడవది: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారిని ప్రేమించడం మరియు వారితో స్నేహం ఉంచడం, మరియు ఆయన ఇంటి వారిలోని సత్పురుషులతో ప్రత్యేకంగా.
నాలుగవది: ఇమాముల పట్ల మరియు పాలకుల పట్ల తిరుగుబాటు చేయరాదు, ఒకవేళ వారు అన్యాయం చేసినా సరే. వారి మంచి మరియు శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. వారి మీద దైవశాపం కోరకూడదు. ఇంకా వారు పాపం చేయమని ఆదేశించ నంత వరకు, వారి విధేయత తప్పనిసరి మరియు అది అల్లాహ్ విధేయతలో చేర్చబడింది. చెడుపనులు చేయమని ఆజ్ఞాపిస్తే, ఆ విషయంలో వారికి విధేయత చూపరాదు, అయితే అలా ఉన్నప్పటికీ, వారి విధేయత ఇతర విషయాలలో ఉంటుంది.
ఐదవది: ఔలియాల మహిమలను నమ్మడం అల్లాహ్ వారి చేతుల ద్వారా అసాధారణమైన వాటిని జరిపిస్తాడు.
ఆరవది: చిన్న పాపాలు మరియు పెద్ద పాపాల కారణంగా అహ్లె ఖిబ్లాలోని వారిని అవిశ్వాసులుగా ప్రకటించరాదు. ఉదాహరణకు ఖవారిజ్ లు చేసే విధంగా, అయితే విశ్వాస బాంధవ్యము పాపాలున్నప్పటికీ స్థిరంగానే ఉంటుంది. పాపి గురించి వారు అంటారు: అతడు తన ఈమాన్ వలన ముమిన్, తన పెద్ద పాపం వలన ఫాసిక్.
రెండవ అధ్యాయం: ఆరాధనలకు సంబంధించిన విషయాలు
మొదటి భాగము: (తహారత్) పరిశుద్ధత:
తహారత్ అంటే అరబీ భాషలో: భౌతిక మరియు ఆధ్యాత్మిక అపరిశుద్ధతల నుండి స్వచ్ఛత మరియు పరిశుద్ధత.
తహారత్ అంటే షరీఅత్ ప్రకారం: హదథ్ తొలగించబడటం మరియు అపవిత్రత తొలగించబడటం. పరిశుద్ధత నమాజు యొక్క తాళము చెవి. కాబట్టి, ఇవి ప్రతీ ముస్లిం తప్పనిసరిగా నేర్చుకోవలసిన మరియు జాగ్రత్తగా చూసుకోవలసిన ధర్మ సంబంధిత ముఖ్యమైన విషయాలలో ఒకటి.
మొదటిది: నీటి రకాలు:
1- తహూర్; ఈ నీటితో పరిశుభ్రము కావడం సరిఅగును, అది తన సహజ రూపంలో ఉన్నా సరే; ఉదాహరణ వర్షపు నీరు లేదా కాలువల నీరు లేదా సముద్రాల నీరు లేదా పరిశుద్ధమైన పదార్థం నీటితో కలిసినా, అది నీటి స్వభావాన్ని మార్చని మరియు దాని పేరును తొలగించని నీరు.
2- అశుద్ధపు నీరు; దానిని ఉపయోగించడం అనుమతించ బడలేదు. ఎందుకంటే అది అశుద్ధతను తొలగించదు మరియు మాలిన్యమును దూరం చేయదు. అది తన రంగు, వాసన లేదా రుచి మొదలైన వాటి అశుద్ధత కారణంగా తన సహజత్వాన్ని కోల్పోయింది.
రెండవది: మాలిన్యము
మాలిన్యము: ఇది ఒక ప్రత్యేకమైన మురికి, దాని స్వరూపం నమాజును నిరోధిస్తుంది - మూత్రం, మలం, రక్తం మొదలైనవి. అది శరీరంపై, ప్రదేశంపై మరియు దుస్తులపై ఉంటుంది.
వస్తువుల విషయంలో మూలసిద్ధాంతం: ధర్మసమ్మతం మరియు పరిశుద్ధత. కాబట్టి ఏదైనా వస్తువు మలినమైనదని దావా చేసినవాడు దానికి తగిన ఆధారం చూపవలెను. మలినం కానివి: కఫం, మానవుని చెమట, గాడిద చెమట, అవి మురికి అయినప్పటికీ పరిశుద్ధమైనవే. ప్రతి మాలిన్యం మురికిగా ఉంటుంది, కానీ ప్రతి మురికి మాలిన్యం కాదు.
మాలిన్యం మూడు రకాలుగా (స్థాయిలుగా) విభజించ బడింది:
మొదటిది: నజాసతుల్ ముగల్లదా (తీవ్ర అశుద్ధి)
ఉదాహరణకు: కుక్క నోరు పెట్టిన దాని మాలిన్యం, దానిని శుద్ధి చేసే విధానం: దానిని ఏడు సార్లు కడగవలెను, వాటిలో మొదటి సారి మట్టితో శుభ్రం చేయవలెను.
రెండవది: నజాసతుల్ ముఖఫ్ఫఫా (తక్కువ తీవ్రత కలిగిన అశుద్ధి):
ఉదాహరణకు: పాలు త్రాగే చిన్న బాబు మూత్రం దుస్తులపై లేదా అటువంటి వాటిపై పడిన మాలిన్యము. దానిని శుభ్రపరచే విధానం: దానిపై నీటిని చల్లాలి. చివరికి దానిని పూర్తిగా ముంచాలి, రుద్దడం లేదా పిండడం అవసరం లేదు.
మూడవది: నజాసతుల్ ముతవస్సితా (మధ్యస్థ అశుద్ధత)
ఉదాహరణకు: మనిషి మూత్రం మరియు మలం, మరియు ఇతర మలినాలు. ఇవి భూమిపై, బట్టపై లేదా ఇలాంటి వస్తువు లపై పడినప్పుడు దానిని శుద్ధి చేసే విధానం: నజాసహ్ (పదార్థ సంబంధమైన అపరిశుద్ధత) యొక్క భౌతిక భాగాన్ని తొలగించడం, మరియు అది పడిన ప్రదేశాన్ని నీటితో లేదా ఇతర శుభ్రపరిచే వాటితో శుభ్రపరచడం. దీని అపవిత్రతకు స్పష్టమైన ఆధారము ఉన్నది:
1 - మానవ మూత్రం మరియు మలము.
2- మదీ మరియు వదీ5.
3- తినరాని హరామ్ జంతువుల విసర్జన.
4- రుతుస్రావ రక్తం మరియు పురిటి రక్తం.
5 - కుక్క నోటి లాలాజలం
6- మృతదేహం, దాని నుండి ఇవి మినహాయించ బడినాయి:
ఎ - మనిషి మరణించినప్పుడు.
బి- మృతచేపలు మరియు మిడతలు.
సి- ప్రవహించే రక్తం లేని వాటి మృతదేహాలు; ఉదాహరణకు ఈగలు, చీమలు మరియు తేనెటీగలు వంటివి మొదలుగునవి.
డి- మృత జంతువు యొక్క ఎముకలు, కొమ్ములు, గోర్లు, వెంట్రుకలు మరియు రెక్కలు.
నజాసహ్ (పదార్థ అశుద్ధత) శుద్ధి చేసే విధానం ఎలా ఉంటుందంటే:
1- నీటితో: ఇది మలినాలను శుద్ధి చేయటంలో మూలం, కాబట్టి దానిని వదిలి ఇతర దానిని అనుసరించరాదు.
2- మాలిన్యాన్ని కలిగిన లేదా మాలిన్యముతో కలుషితమైన వస్తువులను శుద్ధి చేయుటలో షరియత్ ఇచ్చిన విధానం:
ఎ - మృత జంతువు చర్మం దిబాగత్ ద్వారా శుభ్రం చేయ బడుతుంది.
బి- కుక్క నాకిన పాత్రను పరిశుద్ధం చేయడానికి దానిని ఏడు సార్లు కడగవలెను; వాటిలో మొదటి సారి మట్టితో.
సి- దుస్తులకు రుతుస్రావానికి చెందిన రక్తం అంటినపుడు దానిని శుభ్రపరచడం: దానిని గీకి రుద్దడం, ఆపై నీటితో నలిపి, ఆపై చల్లడం ద్వారా శుభ్రపరచాలి. ఆ తర్వాత కూడా మచ్చ మిగిలితే, అది హానికరం కాదు.
డి- స్త్రీ వస్త్రంలోని కింది భాగాన్ని మాలిన్యం అంటిన తరువాత వచ్చే స్వచ్ఛమైన నేలపై రుద్దడం ద్వారా శుద్ధి చేయబడును.
ఇ- పాలు త్రాగే పసిబిడ్డ మూత్రం పడితే వస్త్రాన్ని నీరు చల్లడం ద్వారా శుభ్రపరచాలి, ఆడపిల్ల మూత్రమైతే కడగటం ద్వారా శుభ్రపరచాలి.
యఫ్- వస్త్రాన్ని మజీ నుండి శుభ్రపరచటం; మజీ పడిన ప్రదేశంపై నీటిని చల్లడముతో శుభ్రత చేకూరుతుంది.
జి- పరిశుద్ధమైన నేలపై రుద్దడం ద్వారా చెప్పు అడుగు భాగం శుద్ధి చేయబడుతుంది.
హెచ్- నజాసహ్ (పదార్థ అశుద్ధి) నుండి భూమిని పరిశుభ్రం చేయడం; ఆ స్థలంపై బిందె నీటిని పోయడం ద్వారా, లేదా అది సూర్యకాంతి లేదా గాలి ద్వారా ఎండిపోయే వరకు వదిలేయడం ద్వారా, అప్పుడు మలినం యొక్క ప్రభావం తొలిగిపోయి నప్పుడు అది పరిశుభ్రమవుతుంది.
మూడవది: ముహదిథ్ (పవిత్రత లేని వ్యక్తి) చేయకూడని పనులు:
చిన్న లేదా పెద్ద అశుద్దత కలిగిన వ్యక్తిపై నిషేధిత విషయాలు:
1- నమాజు ఫర్జ్ అయినా లేదా నఫిల్ అయినా; అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«لَا يَقْبَلُ اللَّهُ صَلَاةً بِغَيْرِ طُهُورٍ».
«పరిశుద్ధత లేని నమాజును అల్లాహ్ స్వీకరించడు.»6.
2- ఖుర్ఆన్ ను ముట్టుకోవటం; మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లమ్ అమ్ర్ బిన్ హజ్మ్ ను ప్రభోదిస్తూ ఉత్తరం పంపించారు అందులో: ఆయన చెప్పిన మాట:
«لَا يَمَسُّ الْقُرْآنَ إِلَّا طَاهِرٌ».
«పవిత్ర ఖుర్ఆన్ గ్రంధాన్ని కేవలం పరిశుద్ద స్థితిలో మాత్రమే తాకాలి»7.
3 - బైతుల్ అతీక్ (పవిత్ర కాబాగృహ) ప్రదక్షిణలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి:
«الطَّوَافُ بِالْبَيْتِ صَلَاةٌ، إِلَّا أَنَّ اللَّهَ أَبَاحَ فِيهِ الْكَلَامَ».
«కాబా గృహం చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) చేయడం నమాజు వంటిది, అయితే అల్లాహ్ అందులో మాట్లాడటానికి అనుమతి ఇచ్చాడు.»8. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ కొరకు ఉదూ చేసినారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహిష్టులో ఉన్న స్త్రీ ఆమె శుద్ధి పొందినంత వరకు బైతుల్లాహ్ యొక్క తవాఫ్ చేయకూడదని నిరోధించారు,
ముఖ్యంగా పెద్ద హదథ్ (అశుద్ధి కలిగిన వ్యక్తిపై నిషేధించ బడిన విషయాలు ఇవి:
1- ఖుర్ఆన్ పఠించటం; అలీ రదియల్లాహు అన్హు హదీథు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్, ఖుర్ఆన్ చదవడంలో జనాబతు తప్ప ఏదీ అడ్డంకి కాదు అని బోధించినారు.9
2- ఉదూ లేకుండా మస్జిదులో ఉండటం; మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَقۡرَبُواْ ٱلصَّلَوٰةَ وَأَنتُمۡ سُكَٰرَىٰ حَتَّىٰ تَعۡلَمُواْ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغۡتَسِلُواْ...﴾
ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే, మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబున్) అయి ఉంటే – గుసుల్ స్నానం చేయనంత వరకు - నమాజ్ సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్) నుండి దాట వలసి వస్తే తప్ప. [అన్నిసా 4:43]
పెద్ద హదథ్ స్థితిలో ఉన్న వ్యక్తి ఉదూ చేసుకుంటే, అతను మస్జిదులో ఉండటం అనుమతించబడింది. అలాగే, పెద్ద హదథ్ స్థితిలో ఉన్న వ్యక్తి కేవలం దాటడానికి మాత్రమే మస్జిదులో ప్రవేశించవచ్చు కానీ అందులో కూర్చోవడానికి అనుమతి లేదు.
నాలుగవది: కాలకృత్య పద్దతులు:
కాలకృత్యాల సమయంలో అభిలాషణీయమైన కార్యాలు:
1- ఆ సమయంలో ప్రజల చూపులకు దూరంగా ఉండాలి.
2- మరుగుదొడ్డిలో ప్రవేశించే సమయంలో చేసే దుఆ:
«اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبْثِ وَالْخَبَائِثِ».
ఓ అల్లాహ్! నేను అపరిశుద్ధమైన స్త్రీ పురుష జిన్నుల నుండీ నీ శరణు వేడుకుంటున్నాను.10
మరియు కాలకృత్యాల సమయంలో ప్రతి ఒక్కరిపై క్రింది విషయాలు విధి గావించబడి ఉన్నాయి:
1- మూత్రం నుంచి పరిశుభ్రతను పాటించడం.
2- మర్మావయవాలను కప్పుకోవడం.
మల విసర్జన సమయంలో నిషిద్ధమైనవి:
1- ఖిబ్లాకి అభిముఖంగా లేదా వెనుకకు తిరిగి కూర్చోడం.
2- మలమూత్ర విసర్జన ప్రజల మార్గాలు మరియు వారి సామూహిక ప్రదేశాలలో చేయకూడదు.
3- నిలిచిపోయిన నీటిలో మలమూత్ర విసర్జన.
మలమూత్ర విసర్జన సమయంలో అసహ్యకరమైనవి:
1- మలమూత్ర విసర్జన సమయంలో మర్మాయవాలను కుడిచేతితో ముట్టుకోవటం.
2- కుడి చేతితో మలమూత్ర విసర్జన తర్వాత (నీరు లేక రాయితో) మర్మాంగాన్ని పరిశుభ్రపరుచుకోవటం.
3- మలమూత్ర విసర్జన సమయంలో, ముఖ్యంగా అల్లాహ్ స్మరణ (దికర్) చేయడం అసహ్యకరమైనది.
ఐదవది: ఇస్తింజా మరియు ఇస్తిజ్మార్ యొక్క ఆదేశాలు:
ఇస్తింజా: మలమూత్ర ద్వారముల నుండి వెలువడే వాటి ప్రభావాన్ని నీటితో తొలగించడం.
ఇస్తిజ్మార్: నీళ్ళు గాక మరింక దేనితోనైనా, ఉదాహరణకు గులకరాళ్లు మరియు రుమాలు వంటి వాటితో మలమూత్ర ద్వారాల నుండి వెలువడిన వాటి అవశేషాలను తొలగించడం.
ఇస్తిజ్మార్ చేయడానికి ఉపయోగించే వాటి గురించి షరతులు:
1 - అనుమతించబడినదై ఉండాలి
2 - పరిశుభ్రమైనదై ఉండాలి.
3 - శుభ్రం చేసే గుణము కలిగినదై ఉండాలి.
4 - అది ఎముక లేదా పేడ కాకూడదు.
5 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పేరు ఉన్న పత్రాల వంటి గౌరవనీయమైన వాటితో ఉండకూడదు.
రెండు షరతులపై ఇస్తిజ్మార్ తో సరిపెట్టుకోవటం సమ్మతం:
1- మల విసర్జన సాధారణ స్థలాన్ని మించకూడదు.
2- శుభ్రపరచుకోవడం కనిష్టంగా మూడు శుద్ధమైన రాళ్లతో ప్రారంభించాలి.
ఆరవది: ఉదూ యొక్క నియమాలు:
మూడు ఆరాధనల కొరకు ఉదూ తప్పనిసరి:
1- నమాజు; అది ఫర్జ్ అయినా లేదా నఫిల్ అయినా సరే.
2- ఖుర్ఆన్ ను ముట్టుకోవటం
3- పవిత్ర కాబాగృహం యొక్క తవాఫ్
ఉదూ షరతులు:
1- ఇస్లాం
2- బుద్ది వివేకం
3- వివేచన
4- సంకల్పము: దాని స్థానం హృదయం, దానిని పలకటం బిదఅత్ ఎవడైతే ఉదూ చేయాలని కోరుకుంటాడో అతను మనస్సులో నియ్యత్ చేసుకుంటాడు. అవయవాలను చల్ల బరచడం లేదా శుభ్రపరచడం ఉద్దేశ్యంతో కడగడం ఉదూ కాదు.
5- తహారతుకు వెళ్ళే వరకు దానిని వాయిదా వేయాలని ఉద్దేశించకూడదు.
6- ఉదూ అవసరాన్ని వాయిదా వేయడం, ఇందులో మినహాయింపు ఉంది: నిరంతరం మూత్రం ఆపు కోలేని వ్యక్తి మరియు ఇస్తిహాజాను అనుభవిస్తున్న స్త్రీ.
7- మూత్రం లేదా మలం బయటికి వచ్చిన వారికి, ముందుగా మలమూత్ర విసర్జన తర్వాత (నీరు లేక రాయితో) పరిశుభ్రపరుచుకోవటం.
8- నీటి పవిత్రత, దాని అనుమతి.
9- నీరు చర్మానికి చేరడాన్ని అడ్డుకునే దానిని తొలగించుట
10- నిరంతరం అపవిత్ర స్థితిలో ఉండే వ్యక్తికి ప్రార్థన సమయం ప్రారంభమమవటం షరతు.
ఉదూలో తప్పనిసరి విషయాలు:
1- ముఖం కడుక్కోవడం, నోరు పుక్కిలించడం మరియు ముక్కులో నీరు పోయడం కూడా ఇందులో ఉన్నాయి.
2- రెండు చేతులను మోచేతులతో సహా కడగటం.
3- మొత్తం తలను తుడవడం, ఇందులో రెండు చెవులను (చెవుల లోపల & బయట) కూడా తుడవడం ఉంటుంది.
4- రెండు పాదాలను చీలమండలాలతో సహా శుభ్రంగా కడుక్కోవడం.
5- ఉదూ భాగముల మధ్య వరుస క్రమమును పాటించడం.
6- అవయవాల మధ్య పొడవైన విరామం లేకుండా వరుస క్రమంలో కడగడం.
ఉదూ విధానం:
1- తస్మియహ్ (మనస్సులో బిస్మిల్లాహ్ పలకటం)
2- రెండు అరచేతులను మూడు సార్లు కడగడం.
3- ముఖం మూడుసార్లు కడగాలి. ముఖం కడగడంలో పుక్కలించటం మరియు ముక్కులో నీళ్లు పట్టి, ముక్కు లోపల భాగాన్ని శుభ్రం చేసుకోవటం కూడా ఉంటాయి.
4- మోచేతుల వరకు రెండు చేతులూ మూడుసార్లు కడగడం ముందు కుడిచేయితో ఆరంభించి తర్వాత ఎడమచేయి కడగాలి.
5- తడి అరచేతులతో తన తలను చెవులతో సహా మసహ్ చేయుట.
6- రెండు పాదాలు చీలమండలాల వరకు మూడుసార్లు కడగడం, మొదట కుడి పాదంతో ప్రారంభించి ఆ తరువాత ఎడమ పాదాన్ని కడగాలి.
ఉదూను భంగపరిచే విషయాలు:
1- మలమూత్ర ఉభయ మార్గముల నుండి వెలువడేవి, ఉదాహరణకు: మూత్రం, గాలి, మలం.
2- శరీరం నుండి ఎక్కువగా వెలువడే నీతిబాహ్య మలినం.
3- నిద్ర వలన లేదా ఇతర కారణాల వలన స్పృహలో లేక పోవడం.
4- మర్మాంగాలను ముందు భాగంలో లేదా వెనుక భాగంలో ఎలాంటి ఆచ్ఛాదనం లేకుండా స్పర్శించడం
5- ఒంటె మాంసం తినటం
6- ఇస్లాం ధర్మాన్ని విడిచి పెట్టి మతభ్రష్టుడు కావడం, అల్లాహ్ మమ్మల్ని మరియు ముస్లింలందరినీ దాని నుండి రక్షించు గాక.
ఏడవది: మేజోళ్ళపై మరియు పాదకూసములపై మసహ్ చేసే నియమాలు:
1- అల్ ఖుఫ్: అంటే చర్మం మరియు అలాంటి వాటితో తయారు చేసి పాదాలపై తొడిగే మేజోళ్ళు.
2- అల్ జవ్రబ్: అంటే పాదాలపై తొడిగే వస్త్రం, ఇది ఉన్ని లేదా పత్తి మరియు అటువంటి వాటితో తయారు చేయబడినది.
వాటి పై మసహ్ చేసే షరతులు:
1- సంపూర్ణ తహారతు (శుద్ధి) తరువాత వాటిని ధరించడం.
2- రెండు పాదాలు చీలమండలతో సహా కప్పుకోవడం.
3- అవి రెండు పరిశుభ్రంగా ఉండాలి.
4- మసహ్ పరిమిత కాలములో అయి ఉండాలి.
5- ఉదూలో తుడవడం (మసహ్ చేయటం) ఉండాలి కానీ గుసుల్ కాదు.
6- సాక్సులు మరియు దానికి సమానమైనవి అనుమతించ బడినవిగా ఉండాలి. దొంగిలించబడినవి ఉంటే వాటిపై మసహ్ చేయడం అనుమతించబడదు, పురుషుల విషయంలో అవి పట్టు వస్త్రంతో అయితే వాటిపై మసహ్ చేయడం అనుమతించ బడదు, ఎందుకంటే నిషిద్ధమైన వాటిపై మినహాయింపు అనుమతించబడదు.
మసహ్ యొక్క కాలం:
స్థానికుడికి ఒక రాత్రి, ఒక పగలు మరియు ప్రయాణికుడికి మూడు రాత్రింబవళ్ళు.
మసహ్ చేసే విధానం:
చేయి నీటితో తడిపి, ఒకసారి పాదకూసాల లేదా ఖుఫ్ఫైన్ పైభాగంపై, కాలి వేళ్ళ నుండి పిక్కల వరకు మసహ్ చేయాలి.
మసహ్ ను భంగపరిచేవి:
1- మసహ్ కాలం ముగియటం లేదా నీరు లభ్యం కావడం
2- మోజాలు రెండిటిని లేదా వాటిలో ఒకదానిని విడవడం.
3- పెద్ద అశుద్ధత కలగడం.
మేజోళ్ళపై మసహ్ చేయుట యొక్క ఆదేశం:
ఇది ఒక మినహాయింపు. అల్లాహ్ ఇచ్చిన మినహాయింపు ను అనుసరించి, ప్రవక్త ﷺ ను అనుసరించి, మరియు బిద్అత్ కర్తల నుండి భిన్నంగా ఉండటం కోసం, మేజోళ్లను తొలగించ కుండా మరియు కడగకుండా చేయడం ఉత్తమం.
3- ప్లాస్టర్లు, బాండేజీలు, గాయాలపై వేసే స్టిక్కర్లు మొదలైన వాటిపై మసహ్ చేయడం:
అల్ జబాయిర్: అంటే అవి ఎముకలు విరిగినప్పుడు వాటిని గట్టిగా బంధించడానికై వాడే పట్టీలు; ఇవి జిప్సం, కలప లేదా వాటి వంటి ఇతర వస్తువులు కావొచ్చు.
అల్ అసాయిబ్: అంటే గాయం, మోకం లేదా కాలిన చోట బలంగా కట్టే వస్తువులు; ఇవి దుప్పటి, గాజు లేదా అలాంటి ఇతర పదార్థాలు కావచ్చు.
లుసూక్: గాయాలు లేదా మసకలపై చికిత్స కోసం అంటించేది గాయాలు లేదా పుట్టుమచ్చలపై అంటించి చికిత్స కోసం వాడే పలుస్తాయిలు (ప్లాస్టర్లు, టేపులు వంటివి).
వాటి పై మసహ్ యొక్క ఆదేశం:
అవసరము ఉన్నపుడు వీటిని ఉంచుకోవడం అనుమతించ బడింది, కానీ ఒక షరతుతో — అవి అవసరమైన ప్రాంతాన్ని మాత్రమే కప్పాలి, దానిని మించి కాకూడదు.
అవసరము ముగిసిన తరువాత, లేదా వాటిని తొలగించడం వల్ల ఎటువంటి కష్టం లేదా హానీ కలగదనుకుంటే, అప్పుడు వాటిని ఉంచుకోవడం అనుమతించబడదు.
వాటి పై మసహ్ చేసే విధానం:
దాని చుట్టూ ఉన్న భాగాలను కడిగి, అన్ని వైపుల నుండి దానిపై మసహ్ చేయాలి, ఉదూకి సంబంధించిన ప్రాంతాన్ని మించిపోయిన భాగంపై మసహ్ చేయరాదు.
ఎనిమిదవది: తయమ్ముమ్ ఆదేశాలు:
తయమ్ముమ్: పరిశుద్ధతను పొందే ఉద్దేశ్యంతో, ప్రత్యేకమైన విధానంలో ముఖం మరియు చేతులకు శుభ్రమైన మట్టితో మసహ్ చేయడం.
దాని ఆదేశం:
నీరు లభించనప్పుడు లేదా దాన్ని వాడటం సాధ్యం కానప్పుడు ఉదూ మరియు గుస్ల్ కి బదులుగా తయమ్ముమ్ చేయడం అనివార్యము.
దాని ధర్మబద్ధత యొక్క విజ్ఞత:
తయమ్ముమ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం యొక్క ప్రత్యేకతలలో ఒకటి, మునుపటి సమాజాలలో తయమ్ముమ్ లేదు, ఇది అల్లాహ్ ఈ సమాజంపై చేసిన విస్తరణ మరియు ఆయన ఈ సమాజంపై చేసిన కరుణ.
తయమ్ముమ్ చేయడం అనుమతించబడే పరిస్థితులు:
1- నీరు అందుబాటులో లేకపోతే, అది నివాసంలోనైనా లేదా ప్రయాణంలోనైనా, దానిని వెదికినా దొరకనప్పుడు.
2- అతనితో నీరు ఉన్నా అది తాగుటకు లేదా వండుటకు అవసరమైనంత మాత్రమే ఉంటే, ఆ నీటితో పవిత్రత పొందితే తన అవసరానికి హాని కలిగే స్థితి ఉంటే, తనకు దాహం కలుగు తుందనే భయం లేదా గౌరవించదగిన మనిషి లేదా జంతువుకి దాహం కలుగుతుందనే భయం ఉన్నప్పుడు.
3- నీరు ఉపయోగించడం వల్ల శరీరానికి హాని లేదా రోగం కారణంగా ఆరోగ్యం ఆలస్యం అవ్వడం అని భయపడితే, తయమ్ముం చేయడం అనుమతించబడుతుంది.
4- నీటిని వినియోగించటం కుదరని అనారోగ్యం వలన కదల లేని స్థితిలో ఉన్నప్పుడు, ఉదూ చేయించేవారు లేనప్పుడు మరియు సమయం ముగియబోతుందనే భయం ఉన్నప్పుడు.
5- నీటిని ఉపయోగించడం వల్ల తీవ్రమైన చలి అనిపిస్తే మరియు దానిని వేడి చేయడానికి ఏమీ లభించకపోతే, తయమ్ముమ్ చేసుకొని నమాజు చేయాలి.
తయమ్ముమ్ విధానం:
తమ రెండు చేతులను వేళ్లను విడదీసి మట్టిపై కొట్టి, తర్వాత తమ వేళ్ల లోపలి భాగముతో ముఖంపై మసహ్ చేయాలి, మరియు తమ అరచేతులతో చేతులపై మసహ్ చేయాలి, ముఖము మరియు చేతులను పూర్తిగా మసహ్ చేయాలి.
తయమ్ముమ్ను భంగం చేసే విషయాలు:
1- ఒకవేళ తయమ్ముమ్ నీటి లేని కారణంగా చేయబడినదై ఉండి, నీరు అందుబాటులో ఉండటం. లేదా దానిని (నీటిని) వాడే సామర్థ్యం కలగడం, తయమ్ముమ్ నీటిని వాడలేని అసమర్థత వలన చేసినట్లయితే.
2- తయమ్ముమ్, ఉదూ భంగపరచే వాటిలో ఏదో ఒకటి ద్వారా లేదా గుస్ల్ తప్పనిసరిగా చేసే కారణాలలో నుంచి జనాబత్, రజోస్రావం లేదా ప్రసూతి రక్తస్రావం వల్ల రద్దవుతుంది.
నీరు మరియు తయమ్ముమ్ వినియోగించలేని స్థితిలో ఉన్న వ్యక్తి గురించి ఆదేశం:
నీరు మరియు మట్టిని పొందలేనప్పుడు, లేదా నీరు లేదా మట్టితో చర్మాన్ని తాకలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు; అతను తన పరిస్థితి ప్రకారం, ఉదూ లేకుండా, తయమ్ముమ్ లేకుండా నమాజు చేయాలి; ఎందుకంటే అల్లాహ్ ఎవరి పైనా వారి సామర్థ్యానికి మించి బాధ్యతను మోపడు. తర్వాత నీరు మరియు మట్టి లభించినా లేదా వాటిని వాడగలిగినా, అతడు చేసిన నమాజును పునరావృతం చేయనవసరం లేదు; ఎందుకంటే అతడు ఆదేశించబడిన విధంగా ఆచరించాడు, మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿...فَٱتَّقُواْ ٱللَّهَ مَا ٱسۡتَطَعۡتُمۡ...﴾
కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండాలి [అత్తగాబున్ 64:16] దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«إِذَا أَمَرْتُكُمْ بِأَمْرٍ فَأْتُوا مِنْهُ مَا اسْتَطَعْتُمْ».
«నేను మీకు ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు, మీరు శక్తి మేరకు ఆచరించండి.»11.
లాభం: జనాబతు అశుద్దతకు తయమ్ముమ్ చేసిన తరువాత నీరు లభించగానే, అతడు నీటితో గుస్ల్ చేయాలి.
తొమ్మిదవది: ఋతుస్రావము మరియు పురిటి రక్తము యొక్క ఆదేశాలు:
మొదటిది: ఋతుస్రావం:
అది స్వభావపూరితమైన మరియు సహజమైన రక్తం, అది గర్భాశయపు లోతు నుంచి నిర్దారీత సమయాల్లో బయటకు వస్తుంది. సాధారణంగా ప్రతి నెల ఆరు లేదా ఏడు రోజులు రక్తస్రావం ఉంటుంది, అది కొంచెం ఎక్కువ లేదా తక్కువ కావచ్చు, స్త్రీకి నెలసరి ఎక్కువ దినాలు లేదా తక్కువ దినాలు ఉంటుంది; అల్లాహ్ ఆమె స్వభావాన్ని ఎలా నిర్మించాడో దానికి అనుగుణంగా.
బహిష్టు ఆదేశాలు:
1- ఋతుస్రావ స్త్రీ తన ఋతుస్రావ సమయంలో నమాజు చేయదు మరియు ఉపవాసం ఉండదు, అవి ఆమెకు చెల్లవు.
2- ఋతుస్రావం ముగిసి, శుద్ధత పొందిన తర్వాత స్త్రీ ఉపవాసాన్ని మాత్రం తిరిగి పూర్తి చేస్తుంది, నమాజును కాదు.
3 - ఆమెకు కాబాగృహ ప్రదక్షిణలు అనుమతించబడదు, ఖుర్ఆన్ చదవకూడదు, మస్జిద్ లో కూర్చోకూడదు.
4- భర్త తన భార్యతో సంభోగం చేయడం నిషేధించబడింది, ఋతుస్రావం ఆగిపోయి ఆమె గుసుల్ చేయనంత వరకు.
5- బహిష్టు స్త్రీతో సంభోగం మినహా ముద్దు పెట్టుకోవటం, ముట్టుకోవటం వంటి ఇతర ప్రక్రియలలో పాల్గొనవచ్చు.
6- ఋతుస్రావంతో ఉన్న భార్యకి భర్త విడాకులు ఇవ్వడం నిషేధం.
అత్తుహ్’రు అనగా రక్తస్రావం ఆగిపోవడం. రక్తస్రావం ఆగిపోయినప్పుడు, ఆమె శుద్ధత పొందింది మరియు ఆమె ఋతుస్రావం కాలం ముగిసింది, కాబట్టి ఆమె గుస్ల్ చేయాలి, బహిష్టు కారణంగా ఆమెను నిలిపి వేసిన విషయాలను తిరిగి ప్రారంభిస్తుంది. పవిత్రత పొందిన తర్వాత ఆమె బూడిద లేదా పసుపు రంగు గుర్తులు చూసినట్లయితే, వాటిని పట్టించుకో కూడదు.
రెండవది: నిఫాస్ (పురుటి రక్త స్రావం):
ఇది ప్రసవానికి మరియు ప్రసవానంతరం గర్భాశయం విడుదల చేసే రక్తం మరియు ఇది గర్భధారణ సమయంలో నిలిచిపోయిన మిగిలిపోయిన రక్తం.
నిఫాస్’కు కూడా ఋతుక్రమానికి సంభంధించిన ఆదేశాలే వర్తిస్తాయి; యథా స్త్రీతో సంభోగం కాకుండా ఇతర ఆనందాలు పొందడం.
మరియు నిషిద్ధమైన వాటిలో; స్త్రీతో సంభోగం, ఉపవాసాలు, నమాజు, తలాఖ్, తవాఫ్, ఖుర్ఆన్ పఠనం మరియు మస్జిద్ లో ఉండడం. బహిష్టు స్త్రీల మాదిరిగా రక్తస్రావం ఆగిన వెంటనే గుసుల్ స్నానం విధిగా ఆచరించాలి.
ఆమెపై ఉపవాసం ఖజా చేయడం విధిగా ఉంటుంది, కానీ నమాజు ఖజా చేయవలసిన అవసరం లేదు, బహిష్టులో ఉన్న స్త్రీల మాదిరిగా.
అయితే దాని గరిష్ట వ్యవధి నలభై రోజులు, ప్రసవానంతర రక్తస్రావం నలభై రోజుల ముందు ఆగితే, ఆమె యొక్క నిఫాస్ ముగిసి పోతుంది. ఆమె గుస్ల్ చేస్తుంది, నమాజు చేస్తుంది, మరియు నిఫాస్ కారణంగా నిలిపి వేసిన వాటిని తిరిగి ఆచరిస్తుంది.
రెండవ భాగము: సలాహ్ (నమాజు):
మొదటిది: అదాన్ మరియు ఇఖామత్ ఆదేశాలు:
అదాన్ దైవప్రవక్త హిజ్రత్ యొక్క మొదటి సంవత్సరంలో ప్రారంభించబడింది, దీనిని షరీఅత్ పరంగా నిర్ధారించడానికి కారణం: వారికి సమయాలను తెలుసుకోవడం కష్టం కావడంతో, వారు దానికి సంకేతం ఏర్పాటు చేయాలనుకుని చర్చించారు. అబ్దుల్లాహ్ బిన్ జైద్ రదియల్లాహు అన్హుకు ఈ అదాన్ కలలో చూపబడింది మరియు వహీ దానిని సమర్థించింది.
అదాన్: నమాజు సమయం ప్రారంభమైనట్లు తెలియ జేయటం.
ఇఖామత్: ఇది నమాజు ప్రారంభం గురించి తెలియ జేయటం.
అదాన్ మరియు ఇఖామత్‌లు, ఫర్జ్ నమాజుల కోసం పురుషుల జమాత్ పై ఫర్ద్ కిఫాయహ్ గా ఉన్నాయి. మరియు ఇవి ఇస్లాం యొక్క స్పష్టమైన చిహ్నాలు, కాబట్టి వాటిని వదలి వేయడం ధర్మసమ్మతం కాదు.
అదాన్ షరతులు:
1- ముఅజ్జిన్ పురుషుడు కావాలి.
2- అదాన్ క్రమబద్ధంగా ఉండాలి.
3- అదాన్ నిరంతరంగా ఉండాలి.
4- నమాజు సమయంలో ప్రవేశించిన తర్వాత అదాన్ ఇవ్వాలి, దీని నుండి మినహాయింపు: ఫజర్ మరియు జుమా రోజున మొదటి అదాన్.
అదాన్ లోని సున్నతులు:
1- అదాన్ ఇచ్చేటప్పుడు తమ వ్రేళ్ళను చెవులలో పెట్టు కోవాలి.
2- అదాన్ మొదటి సమయంలో ఇవ్వాలి.
3- హయ్యాలతైన్ (హయ్యాలస్సలా, హయ్యాలల్ ఫలా) పలికేటప్పుడు ముందుగా ముఖాన్ని కుడివైపుకు త్రిప్పాలి, ఆ తరువాత ఎడమవైపునకు.
4- మంచి స్వరంతో అదాన్ ఇవ్వాలి.
5- అదాన్ పదాలను విస్తరించకుండా మరియు అతిగా పొడగించకుండా నిదానంగా పలకాలి.
6- ప్రతి వాక్యం వద్ద ఆగాలి.
7- అదాన్ ఇచ్చే సమయంలో ఖిబ్లాకు అభిముఖమవ్వాలి.
అదాన్ పదిహేను వాక్యాలు - బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఎల్లప్పుడూ అదాన్ ఇచ్చిన విధంగానే ఉండాలి.
అదాన్ వాక్యాలు:
అల్లాహు అక్బర్ అని నాలుగు సార్లు పలకాలి.
అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహ్: రెండుసార్లు పలకాలి.
అష్’హదు అన్న ముహమ్మదుర్రసులుల్లాహ్: రెండుసార్లు పలకాలి.
హయ్యాలస్సలాహ్: రెండు సార్లు పలకాలి.
హయ్యాలల్ ఫలాహ్: రెండు సార్లు పలకాలి.
ఆ తరువాత అల్లాహు అక్బర్: రెండు సార్లు పలకాలి.
తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఒకసారి పలికి ముగించాలి
ఫజర్ నమాజులో ‘హయ్యా అలల్ ఫలాహ్’ తరువాత “అస్సలాతు ఖైరుమ్మినన్‌నౌమ్” రెండు సార్లు పలకాలి. ఎందుకంటే అది సాధారణంగా ప్రజలు నిద్రించే సమయం.
ఇక ‘ఇఖామత్’ పదకొండు వాక్యాలు. వాటిని వేగంగా పలకాలి, ఎందుకంటే ఇది అక్కడే ఉన్నవారికి నమాజు ప్రారంభమవుతోందని తెలియజేయటానికే, కాబట్టి దీన్ని దీర్ఘంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఇఖామత్ విధానం ఈ విధంగా ఉంటుంది:
అల్లాహు అక్బర్: రెండు సార్లు పలకాలి.
అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహ్: ఒకసారి పలకాలి.
అష్’హదు అన్న ముహమ్మదుర్రసులుల్లాహ్: ఒకసారి పలకాలి.
హయ్యాలస్సలాహ్: ఒకసారి పలకాలి.
హయ్యాలల్ ఫలాహ్: ఒకసారి పలకాలి.
ఖద్ ఖామతిస్సలాహ్: రెండు సార్లు పలకాలి
అల్లాహు అక్బర్: రెండు సార్లు పలకాలి.
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’: ఒకసారి పలకాలి.
అదాన్ వినేవారు ముఅజ్జిన్ పలికినట్లుగానే తిరిగి పలకుట అభిలాషణీయం, అయితే “హయ్య అలస్సలాహ్” మరియు “హయ్య లల్ ఫలాహ్” అనే పదాలకు మాత్రం మినహాయింపు ఉంది – ఆ పదాలు పలికినపుడు “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకవలెను. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించాలి. దాని తరువాత ఇలా దుఆ చేయవలెను:
«اللهمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ القَائِمَةِ، آتِ مُحَمَّدًا الوَسِيلَةَ وَالفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ، إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ».
ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడు నమాజు నకు ప్రభువైన ఓ అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వసీలా మరియు 'ఫజీలా' అనుగ్రహాన్ని మరియు ఆయనకు వాగ్దానం చేసిన ఔనత్యం గల ముఖామే మహ్మూద్ ప్రసాదించుము (నిస్సందేహంగా నీవు నీ వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరించవు).12
ఇంకా ఇలా దుఆ చేయవలెను:
«رَضِيتُ بِاللَّهِ رَبًّا، وَبِالْإِسْلَامِ دِينًا، وَبِمُحَمَّدٍ ﷺ نَبِيًّا».
రదీతు బిల్లాహి రబ్బన్, వబిల్ ఇస్లామి దీనన్, వ బి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం నబీయ్యన్13.
అదాన్ తర్వాత మస్జిద్ నుండి ఎటువంటి సముచిత కారణం లేకుండా లేదా తిరిగి రావాలనే ఉద్దేశ్యం లేకుండా బయటకు వెళ్లడం నిషేధము.
రెండు నమాజులను కలిపి చేసినప్పుడు ఒక అదాన్ మరియు ప్రతి నమాజు కొరకు ఒక ఇఖామత్ సరి పోతుంది.
రెండవది: నమాజు స్థానం మరియు దాని ప్రాముఖ్యత:
షహాదతైన్ తరువాత ఇస్లాం యొక్క అత్యంత ముఖ్యమైన మూలస్థంభము నమాజు, దానికి ప్రత్యేకమైన స్థానం కలదు, అల్లాహ్ తన ప్రవక్త ﷺ పై మిరాజ్ రాత్రి ఆకాశంలో నమాజును విధిగా నియమించాడు. ఇది అల్లాహ్ అజ్జ వ జల్ల వద్ద నమాజుల గొప్పతనమును, ఫర్జ్ యొక్క ఖచ్చితనమును మరియు దాని స్థానమును సూచిస్తుంది.
దాని గొప్పతనానికి మరియు ప్రతి ఒక్కరిపై అనివార్యమైన బాధ్యతకు (ఫర్జ్ ఆయిన్) సంబంధించిన చాలా హదీథులు వచ్చి ఉన్నాయి. ఇది ఇస్లాం ధర్మంలో తప్పనిసరి అని స్పష్టంగా తెలిసిన విషయమే.
అది తప్పనిసరి మరియు నిర్ధారితమైనదని సూచించే ఆధారాలు: ఖుర్ఆన్ మరియు సున్నత్ నుండి అనేక వచనాలు ఉన్నాయి, అందులో:
1- మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتۡ عَلَى ٱلۡمُؤۡمِنِينَ كِتَٰبٗا مَّوۡقُوتٗا﴾
నిశ్చయంగా నమాజ్ విశ్వాసులకు నియమిత సమయా లలో పాటించడానికి విధిగా నియమించబడింది. [అన్నిసా 4:103] అంటే: ప్రవక్త ముహమ్మద్ ﷺ పేర్కొన్న సమయాలలో విధిగా ఉన్నాయి.
2- మరియు మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ...﴾
మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని... [అల్ బయ్యినహ్ 98:5]
3- మరియు మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿فَإِنْ تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ...﴾
కావున వారు పశ్చాత్తాపపడి, నమాజ్ స్థాపించి, జకాత్ ఇస్తే! వారు మీ ధార్మిక సోదరులు... [తౌబా 9:11]
4- జాబిర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
«إِنَّ بَيْنَ الرَّجُلِ وَبَيْنَ الشِّرْكِ وَالْكُفْرِ تَرْكُ الصَّلَاةِ».
“(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – నమాజు ను వదిలివేయుట.14”
5- బురైదహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَن تَرَكَهَا فَقَدْ كَفَرَ».
మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము సలాహ్ (నమాజు). దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు.15
జ్ఞానుల [విద్యవేత్తల] ఏకాభిప్రాయం ప్రకారం, దాని (ఫర్జియత్) అవసరాన్ని తిరస్కరించినవారు కాఫిర్. ఎవరైతే దానిని అలసత్వంతో, నిర్లక్ష్యంతో వదిలి వేస్తాడో అతను కూడా కాఫిర్ అవుతాడనే అభిప్రాయం సరిగానే ఉంది, ఎందుకంటే ముందుగా చెప్పిన సహీహ్ హదీథు మరియు ప్రవక్త సహచరుల ఏకాభిప్రాయం కూడా అదే.
మూడవది: నమాజు షరతులు
1- దానికై నిర్దేశించిన సమయంలో ప్రవేశించాలి.
మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿...إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتۡ عَلَى ٱلۡمُؤۡمِنِينَ كِتَٰبٗا مَّوۡقُوتٗا﴾
నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది. [అన్నిసా 4:103] అంటే: నిర్దిష్ట సమయాలలో విధిగావించబడినది.
ఫర్ద్ నమాజుల సమయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ఎ- ఫజర్: ఫజరె సాదిఖ్ నుండి సూర్యోదయం వరకు.
బి- జుహర్: సూర్యుడు వాలినప్పుడు నుండి ప్రతి వస్తువు నీడ దాని అంతట అయ్యేంత వరకు.
సి- అస్ర్: జుహ్ర్ సమయం ముగిసినప్పటి నుండి సూర్యుడు పసుపు రంగులోకి మారే వరకు మరియు అత్యవసర సమయం సూర్యాస్తమయం వరకు ఉంటుంది.
డి- మగ్రిబు: సూర్యాస్తమయం నుండి షఫఖ్ అహ్మర్ (సంధ్యారుణిమ) మాయమై పోయేంత వరకు.
ఇ- ఇషా: మగ్రిబ్ సమయం ముగిసిన తర్వాత నుండి అర్ధరాత్రి వరకు ఉంటుంది.
2- మర్మావయవాలను కప్పటం:
అది కప్పివేయవలసినది, బయటపడడం చెడ్డది, దాని వల్ల సిగ్గుపడవలసినది. పురుషుని మర్మావయవము నాభి నుండి మోకాలి వరకు ఉంటుంది, స్త్రీ నమాజులో ముఖము తప్ప పూర్తి శరీరము మర్మ భాగము. పరాయి వ్యక్తులు ఉన్న సమయంలో తన ముఖాన్నికూడా కప్పుకోవాలి, ఎందుకంటే: వారు ఆమె మహ్రం కాదు.
3- మాలిన్యము నుండి దూరంగా ఉండటం:
మాలిన్యము: ఇది ప్రత్యేకమైన మలినము, దీని స్వభావం నమాజును నిరోధిస్తుంది; మూత్రం, మలం, రక్తము మొదలైనవి, ఇవి శరీరంలో, ప్రదేశంలో మరియు దుస్తులలో ఉంటాయి.
4- ఖిబ్లాకి అభిముఖమై నిలబడడం.
ఖిబ్లా అంటే పవిత్రమై కఅబా గృహము, ప్రజలు దానివైపు మొగ్గుచూపుట వలన దానికి ఖిబ్లా అని పేరు పెట్టబడింది.
ఖిబ్లా వైపుకు అభిముఖం అవకుండా నమాజు చెల్లదు, మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు వలన:
﴿...وَحَيۡثُ مَا كُنتُمۡ فَوَلُّواْ وُجُوهَكُمۡ شَطۡرَهُ...﴾
మరియు మీరెక్కడున్నా సరే, మీ ముఖాలను దాని వైపుకే త్రిప్పుకోండి. [అల్ బఖరహ్ 4:144]
5- అన్నియ్యహ్: సంకల్పం
భాషాపరంగా దీని అర్థము: ఉద్దేశ్యం మరియు షరియత్ పరంగా దీని అర్థము: మహోన్నతుడైన అల్లాహ్ సాన్నిధ్యము పొందటానికి ఆరాధన చేయాలనే దృఢ సంకల్పం చేయటం. దాని స్థానం హృదయం, దానిని పలకవలసిన అవసరం లేదు. అలా చేయటం బిదఅత్.
నాలుగవది: నమాజు యొక్క విధులు:
అవి పద్నాలుగు అనివార్య విధులు (రుక్నులు):
మొదటిది: సామర్ధ్యం ఉంటే నిలబడటం:
మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿...وَقُومُواْ لِلَّهِ قَٰنِتِينَ﴾
అల్లాహ్ సన్నిధానంలో వినయవిధేయతలతో నిలబడండి. [అల్ బఖరహ్ 2:238] ఇమ్రాన్ రదియల్లాహు అన్హు యొక్క మర్ఫూఅ్ ఉల్లేఖనం:
«صَلِّ قَائِمًا، فَإِن لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا، فَإِن لَمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ».
«నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు»16.
ఒకవేళ వ్యాధి కారణంగా నిలబడి ఆచరించే శక్తి లేకుంటే, అతను తన పరిస్థితి ప్రకారం కూర్చుని లేదా ఒకవైపునకు తిరిగి పడుకుని నమాజు ఆచరించవచ్చు, రోగి వలె భయపడినవాడు, బట్టలు లేనివాడు, నిలబడకుండా కూర్చోవడం లేదా పడు కోవడం అవసరమైన చికిత్స కోసం అవసరమైనవారు కూడా. అలాగే నిలబడలేని ఇమామ్ వెనుక నమాజు ఆచరించే వారు నిలబడకుండా కూర్చోవడానికి అనుమతించబడతారు, ఇమామ్ కూర్చొని నమాజు చేస్తే అతని వెనుక ఉన్నవారు కూడా ఇమాం ను అనుసరించి కూర్చొని నమాజు ఆచరించాలి. నఫిల్ నమాజు కూర్చుని చేయవచ్చు, నిలబడగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, కానీ పుణ్యం నిలబడి చేసే పుణ్యంతో సమానంగా ఉండదు.
రెండవది: నమాజు ఆరంభంలో తక్బీరె తహ్రిమా పలకటం
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి ప్రకారం:
«ثُمَّ اسْتَقْبِلِ الْقِبْلَةَ، وَكَبِّرْ».
«తరువాత ఖిబ్లాకి అభిముఖమై నిలబడి, తక్బీర్ పలుకు»17
దాని రూపం ఇలా ఉంటుంది: (అల్లాహు అక్బర్), మరియు దీని బదులు మరేదీ సరిపోదు.
మూడవ విధి: సూరతుల్ ఫాతిహా పఠించడం:
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి ప్రకారం:
«لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ».
“సూరతుల్ ఫాతిహా పఠించని వ్యక్తి నమాజు చెల్లదు” (అనగా స్వీకారయోగ్యము కాదు)18.
నాలుగవది: ప్రతి రకాతులో రుకూ చేయాలి:
మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు ప్రకారం:
﴿يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا ارْكَعُوا وَاسْجُدُوا...﴾
ఓ విశ్వాసులారా! (మీ ప్రభువు సన్నిధిలో) రుకూ చేయండి, సాష్టాంగం (సజ్దా) చేయండి... [అల్ హజ్జ్ 22:77]
ఐదవది మరియు ఆరవది:
రుకూ నుండి లేచి నిలబడటం, మరియు రుకూకు ముందు ఉన్న విధంగా నేరుగా నిలబడటం - ఎందుకంటే దైవప్రవక్త ﷺ దీనిని ఎల్లప్పుడూ ఆచరించేవారు. తన నమాజులో తప్పు చేసినవాడితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
«ثُمَّ ارْفَعْ حَتَّى تَعْتَدِلَ قَائِمًا».
«ఆపై పైకి లేచి పూర్తిగా నిలువుగా నిలచుము»19.
ఏడొవ విధి: ఏడు అవయవములపై సజ్దా చేయుట
ఇది నుదురు మరియు ముక్కుతో పాటు, రెండు చేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాల బొటన వ్రేళ్ళు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి ప్రకారం:
«أُمِرْنَا أَنْ نَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ: الجَبْهَةِ، وَأَشَارَ بِيدِهِ عَلَى أَنْفِهِ، وَالكَفَّيْنِ، وَالرُّكْبَتَيْنِ، وَأَطْرَافِ القَدَمَيْنِ».
«మాకు ఏడు ఎముకలపై సజ్దా చేయమని ఆదేశించబడింది: నుదురు (అలా అని ఆయన చేతితో తన ముక్కు వైపునకు సంజ్ఞ చేసినారు), రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, మరియు రెండు కాళ్ళ చివరలు (అంటే రెండు కాలివేళ్ళు)»20.
ఎనిమిదవది: సజ్దా నుండి పైకి లేవడం మరియు రెండు సజ్దాల మధ్య కూర్చోవటం:
ఆయిషా రదియల్లాహు అన్హా హదీథు ప్రకారం:
«كَانَ النَّبِيُّ ﷺ إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ السَّجْدَةِ، لَمْ يَسْجُدْ حَتَّى يَسْتَوِيَ جَالِسًا».
మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా నుండి తల ఎత్తినప్పుడు, పూర్తిగా కూర్చుని తరువాతే సజ్దా చేసేవారు.21
తొమ్మిదవది: అన్ని అర్కాన్ లలో ప్రశాంతంగా ఉండటం:
ప్రశాంతంగా ఉండటం, అది ఎంత తక్కువైనా సరే, ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థనలో పొరపాటు చేసిన వ్యక్తికి ఇలా చెప్పారు:
«حَتَّى تَطْمَئِنَّ».
«నీవు ప్రశాంతంగా (నిశ్చలంగా) ఉండే వరకు»22.
పదవది మరియు పదకొండవది:
చివరి తషహ్హుద్ మరియు దానిలో కూర్చోవడం: అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖన ప్రకారం:
«إِذَا صَلَّى أَحَدُكُمْ فَلْيَقُلْ: التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».
మీలో ఎవరైన నమాజు చేస్తే తషహ్హుద్ లో ఇలా పలకండి: ((అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు. అస్సలాము అలైక అయ్యుహ న్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్-సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు)). సకల ప్రశంసలకు, ప్రార్థనలకు మరియు పవిత్రమైన వాటన్నింటికీ అల్లాహ్ కు మాత్రమే అర్హత ఉంది. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కృప మరియు ఆశీర్వాదాలు కలుగు గాక. మాపై మరియు అల్లాహ్ యొక్క సజ్జన దాసులపై కూడా శాంతి కలుగు గాక. నేను సాక్ష్యమిస్తున్నాను – అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని.23
పన్నెండవది: చివరి తషహ్హుద్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించడం:
ఇలా పలకాలి:
«اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ».
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్24, దానికంటే ఎక్కువగా చేస్తే సున్నత్ (సాంప్రదాయం).
పదమూడవది: అర్కానుల మధ్య క్రమ పద్దతి:
ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని ఇదే క్రమపద్ధతిలో చేసేవారు, మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«صَلُّوا كَمَا رَأَيْتُمُونِي أُصَلِّي».
మీరు నన్ను ఏవిధంగా నమాజ్ పాటిస్తుండగ చూశారో ఆవిధంగా నమాజ్ పాటించండి25. తన నమాజులో తప్పుగా చేసే వాడికి వాటిని «సుమ్మ» అనే పదంతో క్రమపద్ధతి బోధించారు.
పద్నాల్గవది: సలాంతో ముగించటం:
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి:
««وَخِتَامُهَا التَّسْلِيمُ».
«మరియు దాని ముగింపు ‘సలాం పలకడం’» మరియు అల్లాహ్ సెలవిచ్చాడు:
«وَتَحْلِيلُهَا التَّسْلِيمُ».
నమాజును ముగించేది తస్లీమ్ (సలాం పలకడం)26.
ఐదవది : నమాజులోని అనివార్య కార్యాలు (సున్నతులు)
అవి ఎనిమిది:
1- తక్బీరతుల్ ఇహ్రామ్ కాకుండా మిగతా తక్బీర్లు అన్ని.
2- రుకూలో "సుబహాన రబ్బియల్ అజీమ్" అని ఒకసారి పలకడం. మరియు దీనిని మూడుసార్లు వరకు పెంచడం సున్నతు, ఇది పరిపూర్ణతకు కనీస స్థాయి, మరియు పది సార్లు వరకు పలకటం, ఇది దాని ఉన్నత స్థాయి.
3- రుకూ నుండి తలపైకి ఎత్తుతూ ఇమాం మరియు ఒంటరిగా నమాజు చేస్తున్న వారు "సమిఅ అల్లాహు లిమన్ హమిదహ్" అని పలకడం.
4- రుకూ నుండి సరిగా నిలబడినప్పుడు "రబ్బనా వలకల్ హమ్ద్" అని పలకడం.
5- సజ్దాలో "సుబహాన రబ్బియల్ అఅ్'లా" అని ఒకసారి పలకడం. మూడు సార్ల వరకు అధికంగా చేయడం సున్నతుగా పరిగణించబడుతుంది.
6- రెండు సజ్దాల మధ్య (జల్సా భంగిమలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు), రబ్బిగ్ఫిర్లీ అని ఒకసారి పలకడం. మూడు సార్ల వరకు అధికంగా పలకడం సున్నతు.
7- మొదటి తషహ్హుద్; అందులో ఇలా పలకటం:
«التَّحِيَّاتُ لِلَّهِ، وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».
((అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు. అస్సలాము అలైక అయ్యుహ న్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్-సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు)). సకల ప్రశంసలకు, ప్రార్థనలకు మరియు పవిత్రమైన వాటన్నింటికీ అల్లాహ్ కు మాత్రమే అర్హత ఉంది. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కృప మరియు ఆశీర్వాదాలు కలుగు గాక. మాపై మరియు అల్లాహ్ యొక్క సజ్జన దాసులపై కూడా శాంతి కలుగు గాక. నేను సాక్ష్యమిస్తున్నాను – అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు లేడు, మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని.27
8- మొదటి తషహ్హుద్ కొరకు కూర్చోవటం.
ఆరవది: నమాజు యొక్క సున్నతులు
నమాజులోని సున్నతులను వదిలి వేయడం నమాజును భంగం చేయదు. మరియు అవి రెండు రకాలు: ప్రవచనాత్మక సున్నతులు మరియు ఆచరణాత్మక సున్నతులు.
మొదటిది: ప్రవచనాత్మక సున్నతులు:
1- దుఆఉల్ ఇస్తిఫ్తాహ్ (నమాజు ప్రారంభమున పఠించు దుఆ), దానికి అనేక రూపాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
«سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ، وَتَبَارَكَ اسْمُكَ، وَتَعَالى جَدُّكَ، وَلا إِلٰهَ غَيْرُكَ».
సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక. (ఓ అల్లాహ్! నీవు పరిశుద్ధుడవు. సకల స్తోత్రములు నీకే చెల్లును నీ పేరు ఎంతో శుభప్రదమైనది. నీ గొప్పతనం ఎంతో ఉన్నతమైనది నీవు తప్ప మరే నిజ ఆరాధ్యుడు లేడు.)28
2- సూరతుల్ ఫాతిహా పఠించే ముందు ఇలా అఊదు బిల్లాహ్ చదవటం: అఊదు బిల్లాహి మినష్'షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను).
3- పఠనం ప్రారంభించేముందు బస్మలహ్ అంటే బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అని పలకడం. అది ఇలా పలకడం: (బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం) అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్ పేరుతో.
4- రుకూ మరియు సజ్దాలలో ఒకసారి కంటే ఎక్కువగా తస్బీహ్ చదవటం.
5- ఒకసారి కంటే మించి ఇలా చదవటం:
«رَبِّ اغْفِرْ لِي».
రబ్బిగ్ఫిర్లీ (ఓ నా ప్రభువా నన్ను క్షమించు) రెండు సజ్దాల మధ్య.
6- ఇలా పలకటం:
«مَلْءَ السَّمَاوَاتِ، وَمَلْءَ الْأَرْضِ، وَمَلْءَ مَا بَيْنَهُمَا، وَمَلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ».
మిల్అస్సమావాతి, వ మిల్అల్ అర్ద్, వ మిల్అ మాబైన హుమా, వ మిల్అ మా షి'త మిన్ షైఇన్ బఆద్ (( ఈ స్తుతులు ఆకాశాల నిండా, భూమి నిండా మరియు వాటి మద్య నిండా మరియు ఆతరువాత నీవు కోరిన ప్రతి వస్తువు నిండా విస్తరించి ఉన్నాయి.) పలికిన తరువాత:
«رَبَّنَا ولَكَ الحَمْدُ».
ఓ మా ప్రభువా, స్థుతులన్ని నీ కొరకే29.
7- సూరతుల్ ఫాతిహా తరువాత ఖిరాఅత్
8- ఇలా పలకటం:
«اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ جَهَنَّمَ، وَمِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ».
((అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబి జహన్నమ్, వ మిన్ అదాబిల్ ఖబ్ర్, వ మిన్ ఫిత్నతిల్-మహ్యా వల్-మమాత్, వ మిన్ షర్రి ఫిత్నతిల్-మసీహిద్-దజ్జాల్)). ఓ అల్లాహ్! నేను నరకం యొక్క శిక్ష నుండి, ఖబ్ర్ (సమాధి) శిక్ష నుండి, జీవితం మరియు మరణం యొక్క పరీక్షల నుండి, మరియు మసీహ్ దజ్జాల్ యొక్క దుష్ట పరీక్ష నుండి నీ శరణు వేడుకుంటున్నాను.30 దీనికి అదనంగా చివరి తషహ్హుద్ లో దుఆలు చదవటం.
రెండు: ఆచరణాత్మక సున్నతులు:
1- నాలుగు ప్రదేశాలలో భుజాలకు లేదా చెవులకు సమాంతరంగా చేతులను పైకి లేపడం (రఫుఉల్ యదైన్):
ఎ- తక్బీరె తహ్రీమా సమయంలో.
బి- రుకూలోకి వెళ్ళే ముందు
సి- రుకూ నుండి పైకి లేచే సమయంలో.
డి- మూడవ రకాతు కొరకు నిలబడే సమయంలో.
2- రుకూ ముందు మరియు రుకూ తర్వాత నిలబడి నప్పుడు కుడిచెయ్యిని ఎడమచెయ్యిపై పెట్టి ఛాతీపై కట్టుకోవటం
3- సజ్దా చేసే స్థానంపై కంటిచూపును ఉంచడం
4- సజ్దా సమయంలో రెండు రెక్కలను రెండు ప్రక్కల నుండి ఎడంగా ఉంచటం.
5- రెండు సజ్దాలలో పొట్టను రెండు తొడల నుండి ఎడంగా ఉంచటం.
6- నమాజులోని అన్ని కూర్చోబడే స్థానాల్లో ఇఫ్తిరాష్ చేయాలి, కానీ మూడు రకాతుల మరియు నాలుగు రకాతుల నమాజులో చివరి తషహ్హుద్‌లో మాత్రం కాదు.
7 - మూడు రకాతుల లేదా నాలుగు రకాతుల నమాజులో చివరి తషహ్హుద్ లో తవర్రుక్ చేయటం.
ఏడవది: నమాజు విధానం
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ నమాజు కోసం నిలబడి నప్పుడు ఖిబ్లా వైపుకు ముఖం తిప్పి, తమ రెండు చేతులను ఎత్తి, వాటి వేళ్లను ఖిబ్లా వైపుకు తిప్పి, ఇలా పలికేవారు:
«اللهُ أَكْبَرُ».
"అల్లాహు అక్బర్" అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
2- కుడి చేతితో ఎడమచేతిని పట్టుకుని, వాటిని తమ ఛాతీపై ఉంచవలెను.
3- అప్పుడు వారు ప్రారంభ ప్రార్థనలను పఠిస్తారు, అవి ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిరూపితమై ఉన్న అన్ని ఇస్తిఫ్తాహ్ దుఆ లను ఇస్తిఫ్తాహ్ గా పఠించవచ్చు, వాటిలో కొన్ని:
«سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ، وَتَبَارَكَ اسْمُكَ، وَتَعَالى جَدُّكَ، وَلا إِلٰهَ غَيْرُكَ».
సుబ్'హానకల్లాహుమ్మ వ బిహమ్'దిక, వ తబారకస్ముక, వ తఆలా జద్దుక, వ లా ఇలాహ గైరుక. (ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు మరియు సకల స్తుతులు, కృతజ్ఞతలు నీకే శోభిస్తాయి. నీ నామము అన్నింటి కంటే శ్రేష్ఠమైనది, నీ మహిమ అత్యున్నతమైనది. నీవు తప్ప, మరో నిజ ఆరాధ్యుడు లేడు.)
4- ఆ తరువాత ఇలా పలకాలి:
«أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ، بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ».
అఊదు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో)
5- ఆ తరువాత సూరతుల్ ఫాతిహా పఠించి, దానిని ముగించిన తరువాత: ఆమీన్ అని పలక వలెను.
6- తరువాత ఖుర్ఆన్ లో నుండి మీకు వీలయిన భాగాన్ని పఠించ వలెను. ఫజ్ర్ నమాజు మరియు మగ్రిబ్, ఇషా నమాజుల మొదటి రెండు రకాతులలో ఖిరాఅత్ ను బహిరంగంగా చేయాలి. ఇతర వాటిలో ఖిరాత్ లోలోపల చేయాలి. ప్రతి నమాజులో మొదటి రకాతు రెండవ రకాతు కంటే ఎక్కువసేపు పొడిగించాలి.
7- ఆ తరువాత తన చేతులను ప్రారంభంలో ఎత్తినట్లుగా పైకి ఎత్తాలి, (రఫుఉల్ యదైన్ చేయాలి) ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలక వలెను. వంగి రుకూ చేయాలి, తన చేతులను మోకాళ్ళపై వేళ్ళను విస్తరించి ఉంచి, వాటిని గట్టిగా పట్టుకుని, తన వీపును తిన్నగా ఉంచి, తల మరియు వీపు సమంగా ఉంచాలి; తలని పైకి ఎత్తకూడదు లేదా క్రిందికి వంచకూడదు, ఇంకా ఇలా దుఆ చేయాలి:
«سُبْحَانَ رَبِّيَ الْعَظِيمِ» مرةً.
సుబహానల్లాహి రబ్బియల్ అజీమ్ అని ఒకసారి పలకాలి, మరియు పరిపూర్ణత యొక్క కనీస స్థాయి ఏమిటంటే, ఇంతకు ముందు చెప్పినట్లుగా మూడుసార్లు పలకాలి.
8- ఆ తరువాత ఇలా పలుకుతూ తల పైకెత్తాలి:
«سَمِعَ اللَّهُ لِمَنْ حَمِدَهُ».
సమిఅల్లాహు లిమన్ హమిదహ్ (స్తుతించిన వాడిని అల్లాహ్ విన్నాడు) రుకూ చేయుటకు చేతులను ఎత్తినట్లుగా తన చేతులను పైకి ఎత్తాలి (రఫుఉల్ యదైన్ చేయాలి).
9- నిటారుగా నిలబడిన తరువాత ఇలా పలకాలి:
«اللَّهُمَّ رَبَّنَا وَلَكَ الْحَمْدُ، حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ، مَلْءَ السَّمَاءِ، وَمَلْءَ الْأَرْضِ، وَمَلْءَ مَا بَيْنَهُمَا، وَمَلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ، أَهْلَ الثَّنَاءِ وَالْمَجْدِ، أَحَقُّ مَا قَالَ الْعَبْدُ، وَكُلُّنَا لَكَ عَبْدٌ، لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ» .
ఓ అల్లాహ్ మా ప్రభూ నీ కోసమే ఎనలేని స్తోత్రాలు, పవిత్రమైనవి, శుభాలు కలిగి ఉన్నవి, ఆకాశాల నిండుగా, భూమి నిండుగా, మరియు వాటి మధ్య ఉన్న వాటి నిండుగా, మరియు నీవు తలచిన వాటన్నింటి నిండుగా. సమస్త పొగడ్తలు మరియు ఘనత గలవాడవు. దాసుడు సెలవిచ్చిన మాట అత్యంత సత్యమైనది. మేమంతా నీకు దాస్యం చేయువారము. నీవు ఇవ్వదలిస్తే అడ్డగించే వాడెవ్వడూ లేడు, నీవు ఇవ్వ దలచకపోతే దాన్ని ప్రసాదించేవాడెవ్వడూ లేడు. ఏ గొప్పవాని గొప్పతనం నీ వద్ద చెల్లదు. అతనికి అది ఎలాంటి లాభాన్నీ చేకూర్చదు."31. ఈ నిటారుగా నిలబడటం ఎక్కువ సేపు కొనసాగించాలి.
10- ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ సజ్దాలోకి వెళ్ళవలెను, తన చేతులను పైకి ఎత్తకూడదు. తన నుదురు, ముక్కు, రెండు చేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు పాదాల బొటన వ్రేళ్ళను నేలపై ఆన్చి సజ్దా చేయవలెను, తన చేతుల మరియు కాళ్ల వేళ్లను ఖిబ్లా వైపు త్రిప్పి పాదాలను నిలబెట్టాలి, తన సజ్దాలో సమతుల్యతను పాటించాలి. తన నుదురు మరియు ముక్కును నేలపై స్థిరంగా ఆనించి, తన అరచేతులను నేలకు ఆనించి, మోచేతులను పైకి లేపాలి. తన రెండు భుజాలను తన రెండు పక్కల నుండి దూరంగా ఉంచాలి, తన పొట్టను తన తొడల నుండి పైకి లేపాలి, తన తొడలను కాళ్ళ నుండి వేరు చేయాలి; తన సజ్దాలో ఇలా పలకాలి:
«سُبْحَانَ رَبِّيَ الأَعْلَى».
సుబహాన రబ్బియల్ అఅ్'ల ఒక్కసారి మరియు పరిపూర్ణత యొక్క కనీస స్థాయి ఏమిటంటే, గతంలో చెప్పినట్లుగా, దానిని మూడుసార్లు పలకాలి. మరియు దీనితో పాటు, ఖుర్ఆన్, హదీథులో ఉన్న ఇతర ప్రార్థనలను కూడా పఠించవచ్చు.
11- ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ తల పైకెత్త వలెను. ఆ తరువాత తన ఎడమ పాదాన్ని పరచి, దానిపై కూర్చుని, కుడి పాదాన్ని నిలువుగా ఉంచాలి తరువాత రెండు చేతులను తొడలపై ఉంచి ఇలా పలకాలి
«اللَّهُمَّ اغْفِرْ لِي، وَارْحَمْنِي، وَاجْبُرْنِي، وَاهْدِنِي، وَارْزُقْنِي».
ఓ అల్లాహ్ నన్ను మన్నించు, నా పై దయ చూపు, నా నష్టాన్ని పూడ్చు, నాకు సన్మార్గం చూపు, నాకు ఆహారోపాధిని ప్రసాదించు32.
12- ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ సజ్దా చేయవలెను, మొదటి రకాతులో చేసినట్లుగానే రెండవ రకాతులో కూడా చేయవలెను.
13- ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, తల పైకెత్తి, మోకాళ్ళు మరియు తొడలపై ఆధారపడి, పాదాల ముందు భాగం ద్వారా నిలబడ వలెను.
14- నిటారుగా నిలబడి, ఆ తర్వాత పారాయణం ప్రారంభించాలి, మొదటి రకాతు మాదిరిగానే రెండవ రకాతు పూర్తి చేయాలి.
15- ఆ తరువాత, సజ్దాల మధ్య కూర్చున్నట్లుగా, మొదటి తషహ్హుద్ కొరకు కూర్చోవలెను. తన కుడి చేతిని కుడి తొడపై, ఎడమ చేతిని ఎడమ తొడపై ఉంచుకోవాలి. కుడి చేతి బొటన వేలుని మధ్య వేలుపై ఉంచి గుండ్రంగా చేయాలి. తన చూపుడు వేలుతో సైగ చేసి దాని వైపు చూస్తూ ఉండాలి. ఇంకా ఇలా దుఆ చేయ వలెను:
«التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».
((అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు. అస్సలాము అలైక అయ్యుహ న్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్-సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు)). సకల ప్రశంసలకు, ప్రార్థనలకు మరియు పవిత్రమైన వాటన్నింటికీ అల్లాహ్ కు మాత్రమే అర్హత ఉంది. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కృప మరియు ఆశీర్వాదాలు కలుగు గాక. మాపై మరియు అల్లాహ్ యొక్క సజ్జన దాసులపై కూడా శాంతి కలుగు గాక. నేను సాక్ష్యమిస్తున్నాను – అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు, మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని. ఈ కూర్చునే విధానాన్ని తేలికగా చేయాలి.
16- తరువాత తక్బీర్ పలికి మూడవ మరియు నాలుగవ రకాతులను చేయవలెను. మొదటి రెండు రకాతులతో పోలిస్తే వీటిని తేలికగా చేయవలెను. మరియు వాటిలో (మూడు, నాలుగు రకాతులలో) సూరె ఫాతిహా చదవవలెను.
17- తరువాత చివరి తషహ్హుద్ లో తవర్రుక్ గా కూర్చోవాలి, ఎడమ పాదాన్ని పరచి దానిని కుడి వైపు నుంచి బయటకు తీయడం, కుడి పాదాన్ని నిలబెట్టి, పిరుదులను నేలపై ఉంచడం అనేది తవర్రుక్ అవుతుంది.
18- తరువాత, మొదటి తషహ్హుద్ లాగానే, చివరి తషహ్హుద్ దుఆను పఠించాలి. మరియు దానికి అదనంగా ఇది చదవాలి:
«اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ عَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، وَبَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ عَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ».
‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదు మ్మజీద్. (ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీం ను ఇబ్రాహీం కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్'ను మరియు ఆయన కుటుంబాన్ని కరుణించు 'స్తోత్రానికి అర్హుడవు, ఘనత గల వాడవు నీవే. 'ఓ అల్లాహ్! ఇబ్రాహీంపై ఇబ్రాహీం కుటుంబం వారిపై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్' మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించు. నిశ్చయంగా నీవు స్థుతింప దగినవాడవు, గొప్ప మహత్తుగలవాడవు.)
19- అల్లాహ్ తో నరక యాతన నుండి, సమాధి శిక్ష నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి, మసీహుద్దజ్జాల్ ఉపద్రవం నుండి శరణు కోరుకోవాలి. ఖుర్ఆన్ మరియు సున్నత్ లోని దుఆలను పఠించాలి.
20- ఆ తర్వాత కుడివైపు సలాం తిరుగుతూ ఇలా పలకాలి:
«السَّلاَمُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ».
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యములు కురియుగాక.) అలాగే ఎడమ వైపున కూడా తిరగాలి; సలాం ప్రారంభించేటప్పుడు కిబ్లా వైపు ముఖం చేసి, పక్కకు తిరుగుతూ ముగించాలి.
ఎనిమిదవది: నమాజులో నిషిద్ధమైన విషయాలు:
1- అనవసరంగా ఇటూ అటూ తిరగటం.
2- దృష్టిని ఆకాశం వైపునకు ఎత్తడం.
3- అవసరం లేకుండా కళ్ళు మూసుకోవడం.
4- సజ్దాలో చేతులను నేలపై పరచడం.
5- అవసరం లేకుండా నోరు మరియు ముక్కు కప్పు కోవడం
6- మలమూత్రాలను బలవంతంగా ఆపుకుంటున్న స్థితిలో లేదా ఇష్టమైన ఆహారం ముందు ఉంచినప్పుడు నమాజు చేయ కూడదు.
7- సజ్దా చేసేటప్పుడు నుదురు లేదా ముక్కుకు అంటుకున్న దాని నుండి తుడుచుకోవడం; అయితే, నమాజు ముగిసిన తర్వాత అలా చేయడంలో తప్పు లేదు.
8- నిలబడినప్పుడు అవసరం లేకుండా గోడకు లేదా అలాంటి వాటికి ఆనుకుని ఉండటం.
తొమ్మిదవది: నమాజును భంగపరిచే విషయాలు:
1- తినటం మరియు త్రాగటం.
2- నమాజుకు సంబంధంలేని బయట మాటలు మాట్లాడటం.
3- నవ్వడం లేదా బిగ్గరగా నవ్వడం.
4- నమాజు యొక్క ఏదైనా రుక్న్ ను లేదా కర్తవ్యాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలివేయడం.
5- ఉద్దేశపూర్వకంగా ఒక రుక్న్ లేదా ఒక రకాత్ ఎక్కువగా చేయడం
6- ఇమామ్ కంటే ముందుగా సలాం తిరగటం.
7- నమాజుతో సంబంధం లేని అవసరం లేకుండా పదే పదే ఎక్కువగా కదలికలు చేయడం.
8– నమాజు యొక్క షరతులలో ఏదైనా షరతుకు విరుద్ధం గా ఏదైనా చేయడం; ఉదాహరణకు ఉదూ భంగమవడం, ఉద్దేశపూర్వకంగా మర్మావయవాన్ని బయటపెట్టడం, అవసరం లేకుండా శరీరాన్ని ఖిబ్లా నుండి ఎక్కువగా తిప్పడం, మరియు సంకల్పమును మధ్యలోనే వదిలేయడం.
పదోవది: సహూ సజ్దాలు:
సహ్వ్ అంటే మర్చిపోవడం. ప్రవక్త ﷺ కూడా నమాజులో మర్చి పోయారు, ఎందుకంటే మర్చిపోవడం మానవ స్వభావానికి సహజమైన విషయం. ఆయన మర్చిపోవడం, అల్లాహ్ ఆయన ఉమ్మత్‌పై చేసిన అనుగ్రహం యొక్క సంపూర్ణత లో భాగం, మరియు వారి ధర్మాన్ని పూర్తిచేసే దానిలో ఒక భాగం. సహ్వ్ జరిగినప్పుడు వారికి ఆయన షరీఅత్గా ఏది నిర్ధేశించారో దానిలో ఆయనను అనుకరించటానికి ఇది మార్గదర్శకమైంది.
సహూ సజ్దా ఆచరించడానికి కారణాలు:
మొదటి పరిస్థితి:
నమాజులో అధికంగా చేయడం అనగా – అది చర్యల రూపంలో అయి ఉండవచ్చు లేదా మాటల రూపంలో అయి ఉండవచ్చు:
ఎ- ఆచరణలు అదనంగా చేయటం: నమాజులో భాగమైన విధులలో అదనమైతే: ఉదాహరణకు కూర్చోవాల్సిన చోట నిలబడటం, నిలబడాల్సిన చోట కూర్చోవడం, లేదా అదనంగా రుకూ లేదా సజ్దా చేయడం, ఇది మరచిపోయి చేస్తే; అతను సహూ సజ్దా చేయాలి.
బి- అదనపు పారాయణం: ఉదాహరణకు, రుకూ మరియు సజ్దాలలో ఖుర్ఆన్ పఠనము చేయడం.
అలా చేసినప్పుడు; సహూ సజ్దా చేయడం మంచిది.
రెండవ పరిస్థితి:
నమాజులో మరచిపోయి లోపం చేయడం, ఇది రెండు విషయాలలో ఒక దాని ద్వారా జరుగుతుంది:
ఎ- ఒక విధిని వదిలివేయడం: ఆ విధి తక్బీరే తహ్రీమా అయితే, అతని నమాజు చెల్లదు, మరియు సహూ సజ్దా కూడా దానిని సరిచేయదు. ఒకవేళ అది తక్బీరే తహ్రీమా కాకుండా రుకూ లేదా సజ్దా వంటి ఒక విధి అయితే మరియు మరొక రకాత్ చేయడం ప్రారంభించకముందు గుర్తిస్తే; అతను తప్పని సరిగా తిరిగి ఆ విధిని మరియు దాని తరువాత విధిని చేయాలి.
మరియు అతను మరచిన విధిని తరువాతి రకాతులో పఠనం ప్రారంభించిన తరువాత గుర్తు చేసుకుంటే, అతను వదిలిన రకాతు చెల్లదు, మరియు తరువాత రకాతు దాని స్థానంలో నిలుస్తుంది.
బి- వాజిబ్ను వదిలిపెట్టడం: ఉదాహరణకు: మొదటి తషహ్హుద్‌ను మర్చిపోవడం, లేదా రుకూలో తస్బీహ్ చేయడం. ఈ సందర్భంలో: సహూ సజ్దా చేయాలి.
మూడవ పరిస్థితి: సందేహం:
ఉదాహరణ: జుహర్ నమాజులో చదివినది మూడు రకాతులా లేక నాలుగు రకాతులా అని సందేహం కలిగితే, ఈ సందర్భంలో:
ఎ- అతనికి ఏదైనా విషయం స్పష్టమైతే, దానిని ఆచరించి, సహూ సజ్దా చేయాలి.
బి- అతనికి ఏదీ స్పష్టంగా గుర్తుకురాలేదంటే, నిశ్చయమైన దానిపై ఆధారపడి నమాజును కొనసాగించాలి మరియు సహు సజ్దా చేయాలి.
నమాజు పూర్తయిన తర్వాత సందేహం కలిగితే లేదా అతనికి తరచూ సందేహాలు కలుగుతున్నట్లయితే, ఆ సందేహాన్ని పట్టించు కోరాదు.
లాభం: నమాజులో లోపం వల్ల లేదా సందేహం కలిగినప్పుడు ఏది స్పష్టంగా గుర్తుకురాకపోతే — అలాంటి పరిస్థితుల్లో సలాం తిరగక ముందు సహూ సజ్దా చేయాలి. ఒకవేళ నమాజులో ఏదైనా అదనంగా జరిగిందో లేదా గట్టిగా అనిపించిన (ఊహించిన) దానిపై ఆచరణ చేసినట్లయితే, అప్పుడు సహూ సజ్దా సలాం తరువాత చేయాలి ఇందులో విషయం విస్తృతంగా (సౌకర్యంగా) ఉంది, అల్లాహ్ తలచుకుంటే.
పదకొండవది: నమాజు నిషిద్ధ వేళలు:
అసలు నిబంధన ప్రకారం, అన్ని సమయాల్లోనూ నమాజు చేయడం అనుమతించబడింది. అయితే, కొన్ని సమయాలలో నమాజు చేయడాన్ని షరీఅత్ నిషేధించింది, అవి:
1- ఫజర్ నమాజు తరువాత నుండి సూర్యోదయం వరకు, మరియు సూర్యుడు భూమి నుండి కళ్ళతో చూడటానికి ఒక బల్లెం ఎత్తు వరకు పైకి వచ్చినప్పుడు.
2- సూర్యుడు నడినెత్తి ఆకాశంలో ఉన్నప్పుడు నుండి అది వాలే వరకు, ఇది నిషేధిత సమయాల్లో అత్యల్పమైనది.
3- అస్ర్ నమాజు నుండి సూర్యుడు అస్తమించెంతవరకు, ఇది నిషేధిత సమయాలలో పొడవైనది.
నిషేధిత సమయాల్లోనూ అనుమతించబడిన నమాజులు:
1- తప్పిపోయిన ఫర్జ్ నమాజుల ఖజా.
2- ప్రత్యేక కారణాల వల్ల జరిగే నమాజులు, ఉదాహరణకు: మస్జిద్ లో ప్రవేశించినప్పుడు చేసే నమాజు (తహియ్యతుల్ మస్జిద్), తవాఫ్ చేసిన తర్వాత చేసే రెండు రకాతులు, గ్రహణ నమాజు (కుసూఫ్ నమాజు), జనాజా నమాజు.
3- ఫర్ద్ సలాహ్ తర్వాత ఫజ్ర్ సున్నత్ సలాహ్ ఖజా చేయుట
పన్నెండవది: సామూహిక నమాజు:
మస్జిదులలో సామూహికంగా సలాహ్ చేయడం ఇస్లాం యొక్క గొప్ప ఆచారాలలో ఒకటి. మస్జిద్‌లలో ఐదు పూటల నమాజులను ఆచరించడం అత్యంత ముఖ్యమైన విధేయతలలో ఒకటి మరియు అతి గొప్ప సమీపతలలో ఒకటి అని ముస్లింలు ఏకాభిప్రాయానికి వచ్చారు, నిజానికి ఇది ఇస్లాం యొక్క అతి గొప్ప చిహ్నాలలో ఒకటి.
1- జమాత్ తో నమాజు యొక్క ఆదేశం:
మస్జిదులో ఐదు పూటల నమాజు సామూహికంగా చేయడం సామర్థ్యం ఉన్న పురుషులపై తప్పనిసరి, స్థానికులైనా లేదా ప్రయాణికులైనా - భద్రత పరిస్థితిలో ఉన్నప్పుడు. మరియు భయానక పరిస్థితులు ఉన్నప్పుడు అది వ్యక్తిగత బాధ్యత.
జమాఅత్ నమాజు తప్పనిసరి అని ఖుర్ఆన్, సున్నత్ మరియు ముస్లింల ఆచరణ తరతరాలుగా నిరూపించాయి.
ఖుర్ఆన్ గ్రంథము నుండి: అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَإِذَا كُنتَ فِيهِمۡ فَأَقَمۡتَ لَهُمُ ٱلصَّلَوٰةَ فَلۡتَقُمۡ طَآئِفَةٞ مِّنۡهُم مَّعَكَ...﴾
మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మద్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి... [అన్నిసా 4:102] ఈ ఆయత్ జమాఅతుతో నమాజు తప్పని సరి కావడాన్ని బలంగా సూచిస్తున్నది. భయంకర పరిస్థితుల్లో కూడా ముస్లింలు దానిని విడిచిపెట్టడానికి అనుమతించబడ లేదు. మరి, అది తప్పనిసరి కాకపోయి ఉంటే, దానిని విడిచి పెట్టడానికి ప్రధాన కారణం భయానికి సంబంధించిన కారణమే అయ్యేది. జమాతుతో నమాజును వదిలి వేయడం మరియు దానిని నిర్లక్ష్యం చేయడం కపటుల ప్రసిద్ధ లక్షణాలలో ఒకటి.
సున్నత్ నుండి ఆధారం: అనేక హదీథులు ఉన్నాయి, వాటిలో:
సహీహ్ ముస్లింలో వచ్చినవి.
أَنَّ رَجُلًا أَعْمَى قَالَ: يَا رَسُولَ اللَّهِ، لَيْسَ لِي قَائِدٌ يَقُودُنِي إِلَى الْمَسْجِدِ، فَسَأَلَهُ أَنْ يُرَخِّصَ لَهُ أَنْ يُصَلِّيَ فِي بَيْتِهِ، فَرَخَّصَ لَهُ، فَلَمَّا وَلَّى دَعَاهُ فَقَالَ: «هَلْ تَسْمَعُ النِّدَاءَ؟» قَالَ: نَعَمْ، قَالَ: «فَأَجِبْ».
ఒక అంధుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ఓ ప్రవక్తా! నన్ను మస్జిదుకు తీసుకువెళ్లడానికి ఎవరూ లేరని" విన్నవించుకుంటూ ఇంట్లోనే నమాజ్ చేసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వమని కోరాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి అనుమతిచ్చారు. ఆ వ్యక్తి వెనుతిరిగి వెళ్ళేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని పిలిచి, 'నీకు అదాన్ వినబడుతుందా?' అని అడిగారు. అతను 'అవును' అని చెప్పాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 'అయితే దానికి జవాబు చెప్పు (మస్జిదులో జమాఅతు తో నమాజు చేయి)' అని అన్నారు.33
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి మస్జిదుకు వచ్చి జమాతుతో నమాజు ఆచరించుటకు మరియు అదాన్ పిలుపుకు సమాధానం ఇవ్వమని ఆదేశించారు, అతను అంధుడైనప్పటికీ మరియు ఎదుర్కొనే కష్టాలున్నప్పటికీ, ఇది సామూహిక నమాజు విధి అని సూచిస్తుంది.
2- జమాత్ పొందడానికి కనీసం అవసరమైనది:
ఇమామ్ తోపాటు నమాజు యొక్క ఒక్క రకాతు పొందితే జమాతు పొందినట్లే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి:
«مَنْ أَدْرَكَ رَكْعَةً مِنَ الصَّلَاةِ فَقَدْ أَدْرَكَ الصَّلَاةَ».
‘ఎవరైతే నమాజు యొక్క ఒక్క రకాతు పొందినా అతను పూర్తి నమాజు పొందుతాడు’34.
3- రకాత్ పొందడానికి కనీసం అవసరం అయినది:
రుకూ పొందితే రకాతు పొందినట్టే, కాబట్టి, తర్వాత వచ్చిన వాడు (మస్బూక్) తన ఇమామ్ రుకూ చేస్తున్నప్పుడు చేరితే: అతను నిలబడి తక్బీరె తహ్రిమా పలకాలి, ఆ తర్వాత రుకూ కొరకు మరోసారి తక్బీర్ పలుకుతూ ఇమాంతో రుకూ చేయాలి, ఖియామ్ లో తక్బీరె తహ్రీమా మాత్రమే పలికితే అది రుకూ తక్బీర్ కు సరిపోతుంది.
4- మనిషి జమాతుతో నమాజు విడిచిపెట్టడానికి అనుమతించే కారణాలు:
1- రోగం: దాని వలన ఒక వ్యక్తి జుముఆ మరియు జమాతుకు హాజరు కావడం చాలా కష్టంగా మారినప్పుడు.
2- మూత్రం లేదా మలము విసర్జనను ఆపుకోవడం: ఎందుకంటే వాటిని అణచుకోవడం వలన నమాజులో వినయం పోతుంది మరియు ఇది శరీరానికి హానికరంగా ఉంటుంది.
3- ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారం సమీపంలో ఉండటం, లేదా అతని మనసు ఆహారం వైపు ఆకర్షితమవుతుండటం: అటువంటి పరిస్థితిలో జమాఅత్ నమాజుకు హాజరు కాలేని వెసులుబాటు ఉంటుంది. అయితే దీన్ని అలవాటుగా చేసు కోకూడదు లేదా జమాఅత్ నమాజు నుండి తప్పించుకోవడానికి ఒక యుక్తిగా ఉపయోగించకూడదు.
4- ప్రాణం, ధనం లేదా ఇతర విషయాల గురించి ఖచ్చితమైన భయం ఉన్నపుడు.
పదమూడవది: భయాందోళనల స్థితిలో నమాజు:
భయస్థితి నమాజు, ప్రతి అనుమతించబడిన యుద్ధంలో షరీఅతుగా ప్రవర్తించబడుతుంది, ఉదాహరణకు: కాఫిరులతో, తిరుగుబాటుదారులతో, దోపిడీదారులతో యుద్ధం అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...إِنۡ خِفۡتُمۡ أَن يَفۡتِنَكُمُ ٱلَّذِينَ كَفَرُوٓاْ...﴾
... సత్యతిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగినపుడు కూడా!... [అన్నిసా 4:101] మరియు ఈ విషయంలో ఇతరులను కూడా అదే ప్రమాణంతో సమానంగా పరిగణించ వచ్చు – అంటే వారితో యుద్ధం చేయుట అనుమతించ బడినవారందరినీ.
భయాందోళన కలిగినప్పుడు చేసే నమాజు రెండు షరతులతో ప్రారంభించబడుతుంది:
1) ఆ యుద్ధం చేయుట అనుమతించబడినదై ఉండాలి.
2) నమాజు సమయంలో ఆ శత్రువులు ముస్లిములపై దాడి చేయవచ్చనే భయం ఉండాలి.
యుద్ధభూమిలో ఫర్ద్ నమాజు విధానము:
దానికి (సలాతుల్ ఖౌఫ్) అనేక విధానాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనది – సహల్ రదియల్లాహు అన్హు నుండి నివేదించబడిన హదీథులో వచ్చినట్లు:
أَنَّ طَائِفَةً صَفَّتْ مَعَ النَّبِي ﷺ، وَطَائِفَةً وِجَاهَ العَدُوِّ، فَصَلَّى بِالَّتِي مَعَهُ رَكْعَةً، ثُمَّ ثَبَتَ قَائِمًا، وَأَتَمُّوا لِأَنْفُسِهِمْ، ثُمَّ انْصَرَفُوا، وَصَفُّوا وِجَاهَ العَدُوِّ، وَجَاءَتِ الطَّائِفَةُ الأُخْرَى، فَصَلَّى بِهِمُ الرَّكْعَةَ الَّتِي بَقِيَتْ مِنْ صَلَاتِهِ، ثُمَّ ثَبَتَ جَالِسًا، وَأَتَمُّوا لِأَنْفُسِهِمْ، ثُمَّ سَلَّمَ بِهِمْ.
ఒక సమూహం దైవప్రవక్త ﷺతో కలిసి నిలబడింది, మరొక సమూహం శత్రువుల ఎదుట నిల్చుంది. దైవప్రవక్త ﷺ తనతో నిలబడిన వారితో ఒక రకాత్ నమాజ్ చేశారు, తరువాత అలాగే నిలబడి ఉండగా, ఆ సమూహం తమ నమాజు పూర్తి చేసుకుని వెళ్ళి శత్రువుల ఎదుట నిలబడ్డారు. తరువాత, రెండో సమూహం వచ్చి చేరింది, దైవప్రవక్త ﷺ మిగిలిన రకాత్ వారితో కలిసి నమాజ్ చేసి, కూర్చున్నారు, ఆ సమూహం తమ నమాజులోని మిగిలిన రకాతును పూర్తి చేసుకున్న తరువాత, వారితో కలిసి సలాం తిరిగారు.35
భయాందోళన కలిగినప్పుడు చదివే నమాజు నుండి మనం పొందే లాభాలు:
1- ఇస్లాంలో నమాజుకు గల ప్రాముఖ్యత, మరియు సామూహిక నమాజుకు గల ప్రాముఖ్యత, ఎందుకంటే అది ఈ క్లిష్ట పరిస్థితులలో కూడా రద్దు చేయబడలేదు.
2- ఈ సమాజం నుండి కష్టాలను తొలగించడం, షరియత్ యొక్క సౌలభ్యం మరియు అన్ని కాలాలకు మరియు ప్రదేశాలకు అనుకూలత.
3- ఇస్లామీయ షరీఅతు పరిపూర్ణత మరియు అది ప్రతి పరిస్థితికి అనుగుణమైన విధానాన్ని షరీఅతుగా నిర్ణయించింది.
పద్నాలుగవది: జుమా నమాజు:
1- దాని ఆదేశం:
జుమా నమాజు ప్రతి ముస్లిం పురుషుడు, యుక్తవయస్సుకు చేరిన, తెలివిగలవారు, నివాసితులు మరియు అతనికి ఏ మాత్రం కారణం లేకపోతే, అతనిపై ఖచ్చితమైన విధి.
మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نُودِيَ لِلصَّلَوٰةِ مِن يَوۡمِ ٱلۡجُمُعَةِ فَٱسۡعَوۡاْ إِلَىٰ ذِكۡرِ ٱللَّهِ وَذَرُواْ ٱلۡبَيۡعَۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ 9﴾
ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకో గలిగితే అది మీకు ఎంతో ఉత్తమమైనది. [అల్ జుమఅ 62:9]
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ، أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ، ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ».
ప్రజలు జుమా నమాజుకు ఎగనామం పెట్టడాన్ని మాను కోవాలి. లేకపోతే అల్లాహ్ వారి హృదయాలకు సీలు వేసేస్తాడు. ఫలితంగా వారు తప్పకుండా నిర్లక్ష్యం వహించే వారిలో చేరి పోతారు.36
రెండవది: శుక్రవారం జుమా నమాజు చెల్లుబాటు కావడానికి షరతులు:
1) సమయం: దాని సమయం జుహర్ నమాజు సమయం వలె ఉంటుంది, సమయం ఆసన్నం కాకముందు లేదా సమయం గడిచిన తర్వాత అది చెల్లదు.
2) జమాత్ హాజరై ఉండాలి, సరైన అభిప్రాయం ప్రకారం కనీసం ముగ్గురు ఉండాలి, ఒక్కరితో లేదా ఇద్దరితో జుమా నమాజు చెల్లుబాటు కాదు.
3) నమాజు చేసే వారు తాము ఉంటున్న నివాసాలు సాధారణంగా ప్రజలు నిర్మించుకునే రీతిలో నిర్మించిన ఇళ్లలో నివసించేవారై ఉండాలి. ఇది సిమెంట్‌తో చేసినా, రాళ్ళతో చేసినా, మట్టితో చేసినా, లేదా ఇతర పదార్థాలతో చేసినా. అందువల్ల, పల్లె ప్రాంతాలలో నివసించే గుడిసెలు మరియు గుడారాలు, మూటముడి ఇండ్లవారైన బన్జారా వర్గాల వారికి ఇది చెల్లదు. ఎందుకంటే వారు స్థిరమైన నివాస ప్రాంతాలలో నివసించరు, అంతే కాకుండా తమ పశువులకు గడ్డి కోసం ఒక్క చోట నుండి మరోచోటకు తరలిపోతూ ఉంటారు.
4) దానికి ముందు రెండు ఖుత్బాలు ఉండాలి, ఎందుకంటే ప్రవక్త ﷺ వాటిని ఎల్లప్పుడూ ఆచరించేవారు.
మూడవది: జుమాఅ ఖుత్బాలలో అవసరమైన మూలాంశాలు (అర్కాన్):
1– అల్లాహ్‌ను స్తుతించటం మరియు రెండు సాక్ష్యాలు పలకడం.
2- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించడం.
3- సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కి భయపడాలని తాకీదు చేయటం.
4- ఖుర్ఆన్ నుండి ఏవైనా ఆయతులు చదవటం.
5- హితబోధ చేయటం.
నాల్గవది: జుమా రెండు ఖుత్బాలలో అభిలాషణీయమైన విషయాలు:
1- మింబర్ పై ఖుత్బా ఇవ్వటం.
2- కొంత సేపు కూర్చుని రెండు ఖుత్బాల మధ్య వేరు చేయటం.
3- వాటిలో ముస్లింల కొరకు మరియు వారి నాయకుల కొరకు దుఆ చేయడం.
4- వాటిని కుదించటం.
5- ఖతీబ్ మెంబరు పై ఎక్కినప్పుడు ప్రజలకు సలాం చేయటం.
ఐదవది: జుమా రోజు సున్నతులు:
1- అల్ సివాక్ (పంటిపుల్లతో పళ్ళు శుభ్రం చేసుకోవడం)
2- అందుబాటులో ఉంటే సువాసనను వెదజల్లే సుగంద ద్రవాలను పూసుకోవటం.
3- శుక్రవారం నమాజుకు త్వరగా బయలుదేరడం.
4– మస్జిద్కు కాలినడకగా వెళ్లడం, ఎలాంటి వాహనం వాడక పోవడం.
5- ఇమామ్ కు దగ్గరగా కూర్చోవడం.
6- దుఆ చేయటం.
7- సూరతుల్ కహఫ్ పారాయణం
8- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించడం.
ఆరవది: జుమాఅకు హాజరైనవారు ఏం చేయకూడదు:
1) ఇమామ్ జుమా ఖుత్బా ఇస్తున్నప్పుడు మాట్లాడటం నిషేధించబడింది, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పలుకులు ఇందుకు ఆధారం:
«إِذَا قُلْتَ لِصَاحِبِكَ يَوْمَ الْجُمُعَةِ: أَنصِتْ، وَالْإِمَامُ يَخْطُبُ، فَقَدْ لَغُوتَ».
శుక్రవారంనాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు వ్యర్ధమైనపని చేసినవాడవు అవుతావు"37. అంటే: నీవు లగ్వు మాట్లాడావు. లగ్వు: పాపము.
2) ప్రజల మెడలు వంచి, ముందుకు వెళ్ళటం అసహ్య కరమైన చర్య, ఒక వ్యక్తి ఇమామ్ అయితే తప్ప లేదా దాటకుండా చేరకపోయే స్థానం కోసం దాటడం తప్పు.
జుమా నమాజు పొందటం:
ఎవరైతే జుమా నమాజు యొక్క రెండవ రకాతులో ఇమామ్ తో కలిసి రుకూ పొందుతారో, వారు జుమా నమాజు పొందినట్లే, మరియు దానిని రెండు రకాతులుగా పూర్తి చేస్తారు. మరియు రెండవ రకాతులో రుకూ పొందకపోతే; అతనికి జుమా నమాజు తప్పిపోయింది, మరియు అతను దానిని జుహ్ర్ నమాజుగా నాలుగు రకాతులు పూర్తి చేయాలి, నిద్ర లేదా ఇతర కారణాల వలన జుమా నమాజు తప్పిపోయినవారు దాన్ని జొహర్ నమాజుగా చేయాలి.
పదిహేనవది: తగిన కారణాలు కలిగిన వారి నమాజు:
1- వ్యాధిగ్రస్తుడి నమాజు:
మొదట: వ్యాధిగ్రస్తుడు తన శక్తి మేరకు నమాజు ఆచరించాలి, మతి స్థిమితము కలిగి ఉన్నంత వరకు దాని నిర్ధారిత సమయం గడిచి పోయేంత వరకు దానిని ఆలస్యం చేయుటకు అనుమతి లేదు.
రెండవది: వ్యాధిగ్రస్తుడు ఎలా నమాజు చేయ వలెను?
1- రోగి ఎటువంటి కష్టం లేదా హానీ లేకుండా నిలబడగలిగితే, తప్పనిసరిగా నిలబడే స్థితిలోనే నమాజు చదవాలి, అలాగే రుకూ చేయాలి మరియు సజ్దా చేయాలి.
2- ఒకవేళ అతనికి నిలబడి రుకూ లేదా సజ్దా చేయడం వల్ల నష్టం కలిగితే; రుకూ కొరకు నిలబడి సైగ చేస్తాడు, సజ్దా కొరకు కూర్చుని సైగ చేస్తాడు.
3- ఒకవేళ నిలబడి నమాజు చేయగలిగే శక్తి లేకుంటే కూర్చుని నమాజు చేయవచ్చు. సున్నతు ప్రకారం నిల్చునే స్థలంలో కూర్చోవడం, రుకూకు సైగ చేయడం, నేలపై సజ్దా చేయడం సాధ్యమైతే, లేకపోతే సజ్దాకు సైగ చేయడం, మరియు రుకూ కంటే తక్కువగా ఉండటం.
4- ఒకవేళ కూర్చుని నమాజు చేయగలిగే శక్తి లేకుంటే; అతను ఒకవైపునకు తిరిగి పడుకుని, అతని ముఖం ఖిబ్లా వైపుకు ఉండేలా నమాజు చేయవచ్చు, కుడి వైపు సులభంగా ఉంటే మంచిది, రుకూ మరియు సజ్దా కోసం సైగచేయటం.
5- ఒకవేళ అతను ఒకవైపునకు తిరిగి పడుకుని నమాజు చేయలేకపోతే; అతను వెనుకకు తిరిగి పడుకుని, అతని కాళ్లు ఖిబ్లా వైపుకు ఉండాలి, మరియు రుకూ మరియు సజ్దా కొరకు సైగలు చేయాలి.
6- ఒకవేళ అతనికి శరీరంతో రుకూ మరియు సజ్దా చేయడం సాధ్యం కాకపోతే; తలతో సైగలు చేయాలి, ఒకవేళ అది కూడా క్లిష్టంగా ఉంటే; సైగలు చేయడం అతనికి తప్పుతుంది, మరియు అతను తన మనసులోనే నమాజు యొక్క కార్యాలను, రుకూ, సజ్దా మరియు కూర్చోవడం వంటి వాటిని ఉద్దేశించి, వాటి జ్ఞాపకాలను ఉంచుకోవాలి.
7- రోగి నమాజు షరతులలో తన శక్తిమేరకు చేయగలిగిన వాటిని చేయాలి, ఉదాహరణకు: ఖిబ్లా వైపు తిరగడం, నీటితో ఉదూ చేయడం లేదా అసాధ్యమైనప్పుడు తయమ్ముం చేయడం మరియు మలినాల నుండి పవిత్రత పొందటం, మరియు వీటిలో ఏదైనా చేయలేని స్థితిలో ఉంటే, అది అతనిపై నుండి తొలగించబడుతుంది. అతను తన స్థితిని బట్టి నమాజు చేస్తాడు. కానీ నమాజును దాని సమయానికి ఆలస్యం చేయకూడదు.
8- రోగి నిలబడే మరియు రుకూ చేసే సమయంలో దానికి బదులుగా మోకాళ్ళపై కూర్చోవడం మరియు ఇతర సందర్భా లలో పాదాలను విస్తరించి కూర్చోవడం సున్నతుగా ఉంది.
రెండవది: ప్రయాణికుడి నమాజు
1- తగిన కారణాలు గలవారిలో ఒకరు: ప్రయాణికుడు. అతనికి నాలుగు రకా'తుల నమాజును రెండు రకా'తులుగా కుదించడం షరీఅత్లో అనుమతించబడింది. మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَإِذَا ضَرَبۡتُمۡ فِي ٱلۡأَرۡضِ فَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ أَن تَقۡصُرُواْ مِنَ ٱلصَّلَوٰةِ...﴾
మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖస్ర్) చేస్తే, మీ పై అభ్యంతరం ఏమి లేదు [అన్నిసా 4:101]
అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
«خَرَجْنَا مَعَ النَّبِيِّ ﷺ مِنَ الْمَدِينَةِ إِلَى مَكَّةَ، فَكَانَ يُصَلِّي رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ، حَتَّى رَجَعْنَا إِلَى الْمَدِينَةِ».
మేము మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మదీనా నుండి మక్కా వరకు ప్రయాణం చేసాము, ఆయన రెండు రకాతులు, రెండు రకాతులు నమాజు చేస్తూ వచ్చారు, మేము మదీనాకు తిరిగి వచ్చేవరకు.38
ప్రయాణికుడు తన పట్టణ పరిమితులను దాటి బయటకు వెళ్ళినప్పుడే ఖస్ర్ ప్రారంభమవుతుంది; ఎందుకంటే అల్లాహ్ భూమిలో ప్రయాణం చేసే వారికి ఖస్ర్ నమాజును(నాలుగు రకాతులను రెండు రకాతులుగా కుదించి చేయడాన్ని) అనుమతించాడు. తన పట్టణం నుండి బయటకు వెళ్ళక మునుపు, అతడు భూమిలో ప్రయాణించువాడిగా ఉండడు, మరియు ప్రయాణికుడూ కాడు. ఎందుకంటే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ప్రయాణం ప్రారంభించినప్పుడు మాత్రమే నమాజు ఖస్ర్ చేసేవారు.
2- ప్రయాణికుడు ప్రయాణించదలచిన దూరము ఇంచు మించు ఎనభై కిలోమీటర్లు అయితే, అతనికి నమాజును ఖస్ర్ చేయుటకు అనుమతి ఉంది.
3- ప్రయాణికుడు తిరిగి వస్తున్నప్పుడు, తాను బయలు దేరిన తన పట్టణంలో ప్రవేశించే వరకూ ఖస్ర్ చేయవచ్చు.
4- ప్రయాణికుడు ఒక పట్టణానికి చేరుకుని అక్కడ నివాసం ఉండాలనుకుంటే, అతనికి మూడు రకాల స్థితులు ఉంటాయి:
ఎ) నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండాలని ఉద్దేశిస్తే, అతడు అక్కడ స్థిరపడిన మొదటి రోజు నుండే నమాజును పూర్తిగా చేయ వలసి ఉంటుంది, ప్రయాణికుడికి అనుమతించిన సౌలభ్యాలను (ఖస్ర్ మొదలైనవి) అనుసరించకూడదు.
బి) నాలుగు రోజుల లేదా అంతకంటే తక్కువ కాలం నివాసం ఉండాలని ఉద్దేశిస్తే, అతడికి ఖస్ర్ చేయడం మరియు ఒక ప్రయాణికుడికి అనుమతించిన సౌలభ్యాలను అనుసరించడం అనుమతించబడును.
సి) నిర్దిష్టమైన నివాసం ఉద్దేశించకూడదు, కానీ స్థలం అనుకూలంగా ఉంటే ఒక రోజు లేదా పది రోజులు ఉండవచ్చు, లేదా చికిత్స లేదా సమీక్ష కోసం ఉద్దేశం ఉంటే, ఆ ఉద్దేశం ముగిసినప్పుడు తన పట్టణానికి తిరిగి వెళ్ళాలి; అందువల్ల అతనికి తిరిగివచ్చేవరకు నమాజు ఖస్ర్ చేయడం మరియు ప్రయాణ అనుమతులపై తను లబ్ధి పొందవచ్చును, అయినా అతని ఉండే కాలం నాలుగు రోజులకంటే ఎక్కువైనా సరే.
5- ప్రయాణికుడు నివాసి ఇమామ్ వెనుక నమాజు చేస్తే, అతనితో చివరి తషహ్హుద్ లో మాత్రమే కలిసినా, పూర్తి నమాజు చేయడం అతనిపై తప్పనిసరి అవుతుంది.
6- ఒక నివాసి వ్యక్తి ఖస్ర్ చేసే ప్రయాణికుడు ఇమామ్ వెనుక నమాజు చేస్తే, ఇమామ్ నమాజు ముగించిన తరువాత తన నమాజును పూర్తి చేయడం ఆ స్థిర నివాసి పై విధి.
పదహారవది: పండుగల నమాజు:
ముస్లింల పండుగలు దైవీయమైనవి, అల్లాహ్ తఆల వాటిని ముస్లింల కొరకు షరీఅతుగా ఖరారు చేశాడు, వారు వాటిని స్వయంగా తమ నుండి సృష్టించుకోలేదు, ముస్లింలకు కేవలం రెండు పండుగలు మాత్రమే ఉన్నాయి, అవి: ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్'హా. దీనికి భిన్నంగా కాఫిరుల పండుగలు లేదా బిద్అత్ (నవసృష్ట) పండుగలు. వీటిని అల్లాహ్ తఆలా షరీఅత్గా పెట్టలేదు, మరియు ఆయన వాటిని ఆజ్ఞాపించలేదు — వీటిని వారు తమ ఇష్టానుసారంగా ప్రవేశపెట్టుకున్నారు.
పండుగల నమాజు యొక్క ఆదేశము:
ఫర్ద్ కిఫాయా, దీనిపై ప్రవక్త ﷺ మరియు ఖులఫాయె రాషిదీన్, రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్, నిరంతరం ఆచరించారు. ఇవి ధర్మం యొక్క చిహ్నాలు మరియు దాని స్పష్టమైన సంకేతాలు.
పండుగల నమాజు సమయం: పండుగల నమాజు సమయం సూర్యుడు ఉదయించి ఒక ఈటె ఎత్తుకు లేసిన తరువాత, అంటే సూర్యోదయం నుండి సుమారు పావుగంట తరువాత ప్రారంభం అవుతుంది మరియు సూర్యుడు మిట్టమధ్యాహ్నం వాలి నప్పుడు ముగుస్తుంది.
పండుగల నమాజు యొక్క విధానం:
1- మొదటి రకాతులో తక్బీరె తహ్రిమా పలికి, ఆ తరువాత నమాజు ప్రారంభమున పఠించు దుఆ చదివి, ఆ తరువాత ఆరు తక్బీర్ లను పలకాలి, ప్రతి తక్బీర్ తో చేతులను పైకి ఎత్తాలి, అల్లాహ్ ను స్తుతించి ప్రశంసించాలి, మరియు తక్బీర్ ల మధ్య ప్రవక్త ముహమ్మద్ ﷺ పై దురూద్ చదవాలి, ఆ తరువాత అఊజుబిల్లాహ్, బిస్మిల్లాహ్ చదివి, ఖుర్ఆన్ పఠనము ప్రారంభించాలి.
2- రెండవ రకాతులో రెండవ రకాతు కొరకు పలికే తక్బీర్ తరువాత ఐదు తక్బీర్ లను పలకాలి, ఆ తరువాత అఊజుబిల్లాహ్, బిస్మిల్లాహ్ చదివి, పఠనం ప్రారంభించాలి. మొదటి రకాతులో సూరె ఫాతిహా తరువాత సూరె ఆలా, రెండవ రకాతులో సూరె గాషియా పఠించడం సున్నత్.
3- ఇమామ్ సలాం చేసిన తరువాత, మెంబరుపై ఎక్కి రెండు ఖుత్బాలు ఇవ్వాలి, వాటి మధ్య జుమఅహ్ ఖుత్బాలో కూర్చున్నట్లు కొంత సేపు కూర్చోవాలి, .
పండుగ యొక్క సున్నతులు:
ఎ- గుసుల్.
బి- శుచీశుభ్రతలను పాటించటం మరియు సుగంద ద్రవాలు పూసుకోవడం.
సి- ఈదుల్ ఫితర్ పండుగకు బయలుదేరే ముందు తినటం, మరియు ఈదుల్ అద్'హా పండుగ తరువాత తన ఖుర్బానీ ఇచ్చిన దాని నుండి తినటం.
డి- కాలినడకన బయలుదేరటం
ఇ- ఒక దారి గుండా వెళ్లి మరొక దారి గుండా తిరిగి రావడం.
వ- ముసల్లాకు ఇమాం కంటే ముందే ముఖ్తదీలు వెళ్ళడం.
తక్బీర్:
రెండు ఈద్‌ల రాత్రులు, జుల్-హిజ్జా పదో తేదీ మరియు తష్రీక్ రోజులలో తక్బీర్ చదవటం సున్నత్, ఇది రెండు రకాలు:
మొదటి విధం: తక్బీరె ముత్లక్ — ఇది ఏ నిర్దిష్ట సమయానికి పరిమితం చేయబడని తక్బీర్.
1- ఈదుల్ ఫితర్ లో: ఈద్ రాత్రి సూర్యాస్తమయం నుండి ఈద్ నమాజు ప్రారంభం వరకు.
2- అద్’హా పండుగలో: జిల్ హిజ్జా మొదటి రోజు రాత్రి సూర్యాస్తమయం నుండి తష్రీఖ్ చివరి రోజున సూర్యాస్తమయం వరకు.
రెండవ రకం: పరిమిత తక్బీర్ - అంటే, ఇది నిర్దిష్టంగా విధిగా చేయవలసిన నమాజుల తర్వాత పరిమితమైనది.
1- హజ్ కాలంలో ఇహ్రామ్ లో లేనివాడు: అరఫా దినం ఫజ్ర్ సమయం నుండి తష్రీక్ చివరి దినం (13 జిల్ హిజ్జ్ అస్ర్ వరకు)
2- ఇహ్రామ్‌లో ఉన్నవాడు: ఈద్ దినం జుహ్ర్ నమాజు నుంచి తష్రీక్ చివరి దినం (13 జిల్ హిజ్జ్) అస్ర్ వరకు.
పదిహేడవది: గ్రహణం నమాజు:
చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం యొక్క అర్థం:
చంద్రగ్రహణం: రాత్రి సమయంలో చంద్రుని కాంతి మొత్తం లేదా కొంత అదృశ్యం అవటం.
సూర్య గ్రహణం: ఇది పగటిపూట సూర్యుని కాంతి మొత్తం లేదా కొంత అదృశ్యం అవటం.
గ్రహణం నమాజు ఆదేశం:
ఇది సున్నతె మఅక్కద, దానికి ప్రవక్త ﷺ యొక్క ఆచరణే ఆధారం ఎందుకంటే ఆయన ﷺ కాలంలో సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఈ నమాజు చదివారు. దాని గురించి ఆయన ఆదేశం దానిని సూచించినట్లుగా మరియు జ్ఞానులు దాని చట్టబద్ధతపై ఏకాభిప్రాయం చూపారు.
దాని సమయం:
సూర్యగ్రహణం లేదా చంద్ర గ్రహణం ఆరంభం నుండి అది తొలిగి పోయే వరకు, అంటే సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణం తొలగిపోవడం.
దాని విధానం:
దాని రకాతుల సంఖ్య రెండు, వాటిలో పఠనం బహింగంగా చేయబడుతుంది, దాని విధానం ఈ విధంగా ఉంది:
ఎ- తక్బీరె తహ్రిమా పలికి నమాజ్ ఆరంభపు దుఆలు చదివి అఊజుబిల్లాహ్, బిస్మిల్లాహ్ చదవాలి, ఆ తరువాత సూరె ఫాతిహా చదివి ఇంకొక పొడవాటి పఠనం చేయాలి.
బి- తరువాత, సుదీర్ఘమైన రుకూ చేయాలి.
సి- ఆ తరువాత రుకూ నుండి పైకి లేచి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అని పలకాలి. ఆ తరువాత సూరె ఫాతిహ చదివి మొదటి సూరా కంటే కొంచెం చిన్న సూరా చదవాలి.
డి- ఆ తరువాత మొదటి రుకూ కంటే కొంచెం తక్కువగా పొడవైన రుకూ చేయవలెను.
ఇ- తరువాత రుకూ నుండి పైకెత్తుతూ, సమియల్లాహు లిమన్ హమిదహ్ అని పలకవలెను.
యఫ్- తరువాత రెండు దీర్ఘ సజ్దాలు చేయాలి.
జి- ఆ తరువాత రెండవ రకాతు కొరకు పైకి లేవాలి, అది మొదటి రకాతు వలెనే ఉండాలి, కానీ అది అంత పొడవుగా ఉండకూడదు.
దాని సున్నతులు:
ఎ) దీనికై ప్రకటన ఇలా ఉంటుంది: "అస్సలాతు జామిఅహ్
బి) జమాత్ తో నమాజు ఆచరించాలి.
సి) నమాజులో సుదీర్ఘంగా నిల్చోవడం, రుకూ చేయడం మరియు సజ్దా చేయడం
డి) రెండవ రకాత్ మొదటి రకాత్ కన్నా చిన్నదిగా ఉండాలి.
ఇ) తర్వాత ఉపదేశము చేయడం, సత్కార్యాలు చేయడంలో ప్రోత్సహించడం మరియు దుష్కార్యాలను విడిచిపెట్టడంలో ప్రేరేపించడం.
వ) దుఆ చేయటం, వినయంతో వేడుకోవటం, మన్నింపు కోరటం, దానధర్మాలు చేయటం వంటి సత్కర్మలను అధికంగా చేయటం
పద్దెనిమదోవది: ఇస్తిస్ఖా నమాజు:
1) ఇస్తిస్ఖా: ఇది మహోన్నతుడైన అల్లాహ్ తో కరువు సమయంలో వర్షం కురిపించమని కోరటం.
ఇస్తిస్కా నమాజు షరీఅత్ ప్రకారం సరిగ్గా చేసే సమయం:
భూమి ఎండిపోయి బంజరుగా మారిపోయినప్పుడు, వర్షం నిలిచిపోయినప్పుడు, మరియు వర్షం లేకపోవడం వల్ల నష్టం కలిగినప్పుడు, వారికి తమ ప్రభువైన అల్లాహ్‌ను ప్రార్థించడమే మార్గం, ఆయనను వర్షం కోసం ప్రార్థించడమే మార్గం, మరియు వివిధ రకాల ప్రార్థనలతో ఆయనను వేడుకోవడమే మార్గం.
ఎ- కొన్నిసార్లు జమాతుతో నమాజు, లేదా ఒంటరిగా.
బి- జుమా ఖుత్బాలో దుఆ చేయడం, ఖతీబ్ దుఆ చేస్తాడు, ముస్లిములు ఆ దుఆకు ఆమీన్‌లు పలుకుతారు.
జి- ఎటువంటి నమాజు లేదా ఖుత్బా లేకుండా, ఏ సమయంలోనైనా దుఆ చేయవచ్చు.
ఇస్తిస్ఖా నమాజు యొక్క ఆదేశం:
సబబు ఉన్నపుడు ఇది సున్నతు ముఅక్కదా, ఎందుకంటే ప్రవక్త ﷺ దీన్ని చేసినారు. అబ్దుల్లాహ్ బిన్ జైద్ రదియల్లాహు అన్హు యొక్క హదీసులో వచ్చినట్లుగా ఆయన ఇలా పలికారు:
«خَرَجَ النَّبِيُّ ﷺ إِلَى الْمُصَلَّى، فَاسْتَسْقَى، وَاسْتَقْبَلَ الْقِبْلَةَ، وَقَلَبَ رِدَاءَهُ، وَصَلَّى رَكْعَتَيْنِ».
మహానీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈద్గాహ్ వైపుకు బయల్దేరారు, ఇస్తిస్కా కోసం దుఆ చేశారు, ఖిబ్లా వైపుకు ముఖం పెట్టి తన దుప్పటిని తిప్పారు, ఆ పై రెండు రకాతుల నమాజు ను చదివించారు39.
ఇస్తిస్ఖా నమాజు విధానం:
ఇస్తిస్ఖా నమాజు యొక్క విధానం దాని స్థానంలో ఈద్ నమాజు లాంటిది. ముసల్లాలో ఈద్ నమాజు లాగా దానిని చేయడం అభిలాషణీయం. దాని ఆదేశాలు ఈద్ నమాజు ఆదేశాలు లాంటివే; రకాత్‌ల సంఖ్యలో, ఖిరాత్ బిగ్గరగా చదవడంలో, ఖుత్బా ముందు నమాజు చేయడంలో, మొదటి మరియు రెండవ రకాత్లలో ఖిరాత్ ముందు అదనపు తక్‌బీర్లలో. ఇది రెండు ఈదుల నమాజుల విషయంలో గతంలో పేర్కొన్నట్లే. మరియు ఒక ఖుత్బా ఇవ్వవాలి.
పంతొమ్మిదోవది: జనాజా ఆదేశాలు:
మొదట: మరణం ఆసన్నమైన వ్యక్తి వద్ద ఉన్నవారికి:
1- మరణఘడియలు దగ్గర ఉన్నవారు అతనికి లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి ఉపదేశించాలి.
2- ఖిబ్లా వైపు అభిముఖమవటం సున్నత్.
3- అతని రెండు కళ్లను మూయడం అభిలాషణీయం.
4- మృతి చెందిన వెంటనే మృతదేహాన్ని ఒక వస్త్రంతో కప్పడం సున్నత్.
5- మృతదేహాన్ని సిద్ధం చేయడంలో త్వరపడాలి.
6- అతని అప్పులను తీర్చడంలో త్వరపడటం తప్పనిసరి.
7- మృతునికి గుసుల్ చేయటం, అతనికి కఫన్ వస్త్రమును తొడిగించటం, ఇవి ఫర్జె కిఫాయ.
రెండవది: మృతుని జనాజా నమాజు ఆదేశాలు:
దాని ఆదేశం: ఫర్దె కిఫాయా.
దాని షరతులు:
1) ఖిబ్లాకి అభిముఖంగా నిలబడడం.
2) ఔరహ్ ను (తప్పనిసరిగా కప్పవలసిన శరీర భాగాలను) కప్పడం.
3) నజాసత్ (అపవిత్రత) నుండి దూరంగా ఉండటం.
4) నమాజు చేసే వ్యక్తి మరియు నమాజు చేసే ప్రదేశం యొక్క పరిశుభ్రత.
5) నమాజ్ చేసే వ్యక్తి మరియు మృతుడు ఇద్దరు ముస్లిం అయ్యి ఉండాలి.
6) నగరంలో ఉంటే జనజాలో హాజరు కావాలి.
7) అతను షరీఅత్ పరంగా బాధ్యతగలవాడిగా (ముకల్లఫ్గా) ఉండాలి.
దాని విధులు:
1) జనాజా నమాజులో నిలబడటం.
2) నాలుగు తక్బీర్లు పలకటం
3) సూరతుల్ ఫాతిహా పఠించడం.
4) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించడం.
5) మృతుని కొరకు దుఆ చేయడం
6) క్రమ పద్దతి పాటించడం
7) సలాం తిరగటం.
దాని సున్నతులు:
1) ప్రతి తక్బీర్ తో రెండు చేతులను పైకి ఎత్తాలి.
2) అఊదుబిల్లాహ్ చదవటం.
3) తన కొరకు మరియు ముస్లింల కొరకు దుఆ చేయటం.
4) లోలోపల ఖిరాఅత్ చేయటం.
5) నాలుగో తక్బీర్ తరువాత మరియు సలాం పలకడానికి ముందు కొద్దిసేపు నిలబడటం.
6) ఛాతీపై ఎడమచేయి ఉంచి, దానిపై కుడి చేతిని ఉంచవలెను.
7) సలాం చేస్తుతున్నప్పుడు ముఖాన్ని కుడివైపు త్రిప్పడం.
దాని విధానం:
ఇమామ్ మరియు ఒంటరిగా నమాజ్ చేసే వ్యక్తి పురుషుని ఛాతి వద్ద మరియు స్త్రీ మధ్యలో నిలబడాలి, ఇహ్రామ్ తక్బీర్ పలకాలి, అఊదుబిల్లాహ్ చదవాలి, ప్రారంభపు దుఆ పఠించ కూడదు, బిస్మిల్లాహ్ చదవాలి మరియు సూరె ఫాతిహా చదవాలి
ఆ తరువాత తక్బీర్ పలికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించాలి, ఆ తరువాత తక్బీర్ పలికి మృతుని కొరకు ప్రామాణికమైన దుఆ చేయాలి; ఉదాహరణకు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వాక్కు:
«اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا، وَصَغِيرِنَا وَكَبِيرِنَا، وَذَكَرِنَا وَأُنثَانَا، وَشَاهِدِنَا وَغَائِبِنَا، اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الإِيمَانِ، وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الإِسْلَامِ، اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ، وَلَا تُضِلَّنَا بَعْدَهُ».
అల్లాహుమ్మగ్ఫిర్ లి హయ్యినా వ మయ్యితినా, వ సగీరినా వ కబీరినా, వ జకరినా వ ఉన్సానా, వ షాహిదినా వ గాయిబినా అల్లాహుమ్మ మన్ అహ్యైయ్తహు మిన్నా ఫ అహ్యిహీ అలల్ ఈమాన్, వమన్ తవఫ్ఫైతహు మిన్నా ఫ తవఫ్ఫహు అలల్ ఇస్లాం, అల్లాహుమ్మ లా తహ్రీంనా అజ్రహు, వలా తుదిల్లనా బాదహు. ((ఓ అల్లాహ్! మాలో బ్రతికున్న వారిని, మరణించిన వారిని, ఇక్కడున్న వారిని, లేని వారిని, చిన్నవారిని, పెద్దవారిని, మా పురుషులను, మా స్త్రీలను మన్నింపుము. ఓ అల్లాహ్! మాలో ఎవరినయితే సజీవంగా ఉంచినావో వారిని నీ ఇస్లాం పై సజీవంగా ఉంచు. మాలో ఎవరికయితే మరణాన్ని ప్రసాదిస్తావో వారికి ఈమాన్ పై మరణాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మమ్మల్ని అతని ప్రతిఫలం నుండి దూరం చేయకు, అతని తరువాత మమ్మల్ని మార్గభ్రష్టుల్ని చేయకు.40))
మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వాక్కు:
«اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ، وَعَافِهِ وَاعْفُ عَنْهُ، وَأَكْرِمْ نُزُلَهُ، وَوَسِّعْ مَدْخَلَهُ، وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثلْجِ وَالْبَرَدِ، وَنَقِّهِ مِنَ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوْبَ الْأَبْيَضَ مِنَ الدَّنَسِ، وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ، وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ، وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ، وَأَدْخِلْهُ الْجَنَّةَ، وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ عَذَابِ النَّارِ».
ఓ అల్లాహ్! అతన్ని క్షమించు, అతన్ని కరుణించు, అతనికి సుఖాన్ని ప్రసాదించు, అతన్ని మన్నించు, అతన్ని అతిథిగా ఆదరించు, అతడు చేరుకునే స్థలాన్ని వెడల్పు చేయి, నీటితోను, మంచుతోను, మరియు వడగళ్ళతోనూ అతని పాపాలను కడిగివేయి, మురికి లేని తెల్లని వస్త్రం నుండి మురికిని శుభ్రం చేసినట్లుగా అతని పాపాలను కడిగివేయి. అతని ఇంటికి బదులుగా మరింత మంచి ఇల్లు, అతని కుటుంబం కంటే మంచి కుటుంబము, అతని జీవిత భాగస్వామి కంటే మంచి జీవితభాగస్వామిని అతనికి ప్రసాదించు. అతనికి స్వర్గంలో ప్రవేశం కల్పించు, సమాధి శిక్ష నుండి మరియు నరకశిక్ష నుండి కాపాడు.41 ఆ తరువాత తక్బీర్ పలికి కొద్దిసేపు నిలబడి, కుడివైపుకు ఒక సలాం తిరగాలి.
మూడవ భాగము: జకాత్:
1- జకాత్ నిర్వచనం మరియు దాని స్థానము:
జకాతు అంటే అరబీ భాషలో: అబివృద్ధి మరియు పెరుగుదల
జకాతు షరియతు పరంగా: షరియతులో నిర్ధారించబడిన కొన్ని ఆస్తులపై ఒక ప్రత్యేక వర్గానికి విధిగా చెల్లించవలసిన హక్కు.
ఇది ఇస్లాం మూలస్తంభముల్లోంచి మూడవది, ఖుర్ఆన్లో 82 సార్లు నమాజుతో పాటు ప్రస్తావించబడటం ద్వారా దీని గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ...﴾
మరియు నమాజ్ ను స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి... [అల్ బఖరహ్ 2:43]
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
«بُنِيَ الإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إِلٰهَ إِلَّا اللَّـهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّـهِ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَحَجِّ الْبَيْتِ، وَصَوْمِ رَمَضَانَ».
ఇస్లాం ఐదు విషయములపై నిర్మితమై ఉన్నది : అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం, నమాజు నెలకొల్పటం, జకాత్ ఇవ్వటం, దైవ గృహము హజ్ చేయటం, రమజాన్ ఉపవాసములుండటం42.
దీనిని విధిగా పాటించటంపై ముస్లింలందరి ఏకాభిప్రాయం ఉన్నది. దీని ఆవశ్యకతను తిరస్కరించినవారి అవిశ్వాసంపై, దానిని చెల్లించుట నిరాకరించిన వారితో యుద్ధం చేయటం.
2- జకాత్ విధి అవటం గురించి షరతులు:
ఎ) స్వేచ్ఛ: బానిసపై జకాత్ లేదు; ఎందుకంటే అతనికి స్వంత ఆస్తి లేదు, అతని చేతిలో ఉన్నది యజమాని సొత్తు, కాబట్టి దాని జకాత్ యజమానిపై ఉంటుంది.
బి) ఇస్లాం: అవిశ్వాసి పై అది విధి కాదు; ఎందుకంటే అది సమీపత మరియు విధేయతకు ప్రతీక, మరియు అవిశ్వాసి సమీపత మరియు విధేయతకు అర్హుడు కాడు.
సి) నిసాబ్ (జకాత్ చెల్లించాల్సిన కనీస పరిమాణం) కలిగి ఉండటం: నిసాబ్ కంటే తక్కువ ఉన్నపక్షంలో, అది అనివార్యం కాదు, ఇది ఒక నిర్దిష్ట ఆస్తి పరిమాణం.
డి) సంపూర్ణ యాజమాన్యం: ఆస్తి పూర్తిగా మరియు సంపూర్ణంగా వ్యక్తికి చెందినదై ఉండాలి, ఎందుకంటే స్థిరమైన యాజమాన్యం లేని ఆస్తిపై జకాత్ లేదు, ఉదాహరణకు, వ్రాతపూర్వక రుణం.
ఇ) ఒక పూర్తి చంద్ర సంవత్సరం గడిచిపోవడం: ఆయిషా రదియల్లాహు అన్హా మర్ఫూ హదీథు:
«لَا زَكَاةَ فِي مَالٍ حَتَّى يَحُولَ عَلَيْهِ الْحَوْلُ».
ఒక సంవత్సరం గడిచే వరకు సొమ్ములో జకాతు లేదు43.
3- జకాత్ విధి అయ్యే సంపదలు:
మొదటిది: పశువులు - ఒంటెలు, ఆవులు, గొర్రెలు. వాటిపై జకాత్ రెండు షరతులతో విధిగావించబడింది:
1- అవి పని కోసం కాకుండా, పాలు లేదా సంతానోత్పత్తి కోసం వినియోగించబడేవి అయి ఉండాలి.
2- అవి సాయిమ (అంటే: ఉచితంగా లభ్యమయ్యే పచ్చిక బయళ్ళపై మేసేవి) అయి ఉండాలి.
3- అయితే యజమాని కొనుగోలు చేసిన మేత లేదా ఇతర మేతతో పెంచిన పశువులపై జకాతు విధిగావించబడలేదు. సంవత్సరంలో కొంతకాలం మాత్రమే మేతపుచ్చే వాటిపై జకాతు విధి కాదు.
4- పశువుల కనీస నిర్ణీత పరిమాణాలు:
1) ఒంటెలపై జకాత్:
షరతులు నెరవేరినప్పుడు; ప్రతి ఐదు ఒంటెలకు ఒక మేక జకాతు విధిగా ఉంటుంది, పది ఒంటెలకు రెండు మేకలు, పదిహేను ఒంటెలకు మూడు మేకలు, ఇరవై ఒంటెలకు నాలుగు మేకలు, దాని గురించి సున్నత్ మరియు ఏకాభిప్రాయం ప్రకారం. కాబట్టి, అవి 25కు చేరితే, అందులో బింతు మఖాజ్ ఉంటుంది, అంటే అది ఒక సంవత్సరం పూర్తి చేసుకుని, రెండవ సంవత్సరంలో ప్రవేశించిన ఒంటె పిల్ల. లేకపోతే ఇబ్నె లబూన్ (మూడు సంవత్సరముల) కూడా సరిపోతుంది.
ఒంటెలు ముప్పై ఆరుకు చేరినప్పుడు; అందులో 'బింతె లబూన్' అంటే: రెండవ సంవత్సరాలు పూర్తి చేసింది తప్పనిసరి.
ఒంటెల సంఖ్య నలభై ఆరు అయితే, మూడు సంవత్సరాల వయస్సు గల హిక్కా చెల్లించాలి.
ఒంటెలు అరవై ఒకటికి చేరినప్పుడు, వాటిలో ఒక జదః (నాలుగు సంవత్సరాలు నిండినది) జకాతుగా ఇవ్వాలి.
కాబట్టి, ఒంటెలు మొత్తం డెబ్బై ఆరుకు (76) చేరినప్పుడు; అందులో రెండు 'బింతె లబూన్' (మూడవ సంవత్సరాల ఆడఒంటెలు) తప్పనిసరిగా ఇవ్వాలి.
ఒంటెలు తొంభై ఒకటికి చేరినప్పుడు; అందులో రెండు హిఖ్ఖాలు చెల్లించాల్సి ఉంటుంది.
ఒంటెలు మొత్తం సంఖ్య నూట ఇరవై ఒకటి దాటినప్పుడు, అందులో మూడు 'బింత్ లబూన్' (మూడవ సంవత్సరాల ఆడఒంటెలు) ఇవ్వబడును. తరువాత ప్రతి నలభైకి ఒక 'బింత్ లబూన్' మరియు ప్రతి యాభైకి ఒక 'హిక్కా' (నాల్గు సంవత్సరాల ఆడఒంటె) ఇవ్వబడును.
2) ఆవులపై జకాత్:
షరతులు నెరవేరిన తర్వాత, ఆవులు ముప్పై సంఖ్యకు చేరుకున్నప్పుడు, వాటిలో ఒక తబి' లేదా తబిఅ' తప్పనిసరి అవుతుంది. ఆవు లేదా దూడ అంటే ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఆవు లేదా దూడ.
ముప్పైకి తక్కువ ఉన్న వాటిలో ఏదీ లేదు.
వాటి సంఖ్య నలభైకి చేరుకున్నప్పుడు, వాటిలో ఒక దంతాల ఆవు, రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న దంతాల ఆవు తప్పనిసరి.
మరియు వారి సంఖ్య నలభై దాటినప్పుడు, ప్రతి ముప్పైకి ఒక తబీ' లేదా తబి'అహ్ తప్పనిసరి అవుతుంది మరియు ప్రతి నలభైకి ఒక ముసిన్నహ్ తప్పనిసరి అవుతుంది.
3) గొర్రెలు మరియు మేకలపై జకాత్:
గొర్రెలు లేదా మేకల సంఖ్య నలభైకి చేరుకున్నప్పుడు, ఒక మేక లేదా ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న ఒక గొర్రె పిల్ల తప్పనిసరి.
గొర్రెలు నలభైకి తక్కువగా ఉంటే జకాత్ ఉండదు. గొర్రెలు లేదా మేకల సంఖ్య నూట ఇరవై ఒకటికి చేరుకున్నప్పుడు, రెండు మేకలు తప్పనిసరి అవుతాయి. మరియు ఆ సంఖ్య రెండు వందల ఒకటికి చేరుకున్నప్పుడు, వాటిలో మూడు మేకలు తప్పనిసరి అవుతాయి.
మరియు ఆ తరువాత, ప్రతి వందకు ఒక మేక తప్పనిసరి అవుతుంది, అంటే ప్రతి నాలుగు వందలకు నాలుగు మేకలు.
రెండవది: భూమి నుండి వచ్చే వాటి జకాత్:
భూమి నుండి ఉత్పత్తి అయ్యేవి రెండు రకాలు ఉన్నాయి:
1) ధాన్యాలు మరియు పండ్లు.
2) ఖనిజాలు.
మొదటి రకం: ధాన్యాలు మరియు పండ్లు:
ధాన్యాలలో జకాత్ తప్పనిసరి అవుతుంది; ఉదాహరణకు: గోధుమ, బార్లీ, బియ్యం. పండ్లలో; ఉదాహరణకు: ఖర్జూరం మరియు ఎండుద్రాక్ష, మరియు ఇతర మొక్కలపై తప్పనిసరి కాదు; ఉదాహరణకు కూరగాయలు మరియు ఆకుకూరలు.
ధాన్యాలు మరియు పండ్లపై జకాత్ విధికి సంబంధించిన షరతులు:
1) అవి నిలువచేయబడేవి అయ్యి ఉండాలి: పండ్లు మరియు కూరగాయలు లాగా నిలువచేయబడని వాటిపై జకాత్ ఉండదు.
2) అవి కొలిచే విధంగా ఉండాలి: సంఖ్య లేదా బరువుతో అమ్మబడే వాటిలో జకాత్ లేదు; ఉదాహరణకు, బత్తాయి, ఉల్లిపాయ, దానిమ్మ, మరియు ఇతరాలు.
3) అది నిసాబ్ (నిర్ణీత పరిమాణమునకు) కు చేరి ఉండాలి: అది ఐదు వసక్ లు, దానికంటే తక్కువలో జకాత్ లేదు.
4) జకాత్ చెల్లించాల్సిన సమయంలో నిసాబ్ పూర్తిగా అతని ఆధీనంలో ఉండాలి.
జకాతు విధి అయ్యే సమయం తర్వాత దానిని పొందినవారికి జకాతు విధి కాదు, ఉదాహరణకు పంట కోత తర్వాత కొనుగోలు చేసినా లేదా బహుమతిగా పొందినా.
జకాత్ తప్పనిసరి అయ్యే సమయం:
ధాన్యాలు మరియు పండ్లపై అవి కోతకు తయారై నప్పుడు జకాత్ తప్పనిసరి అవుతుంది. భదూ సలాహ్ (పక్వము) లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
ఎ- ధాన్యంలో, పప్పులో: అది గట్టిపడి, కఠినమై, దృఢంగా అయినప్పుడు.
బి- ఖర్జూరాల పండ్లలో: అవి ఎర్రగా లేదా పసుపుగా మారినప్పుడు.
సి- ద్రాక్షలో: అది మృదువుగా మరియు తియ్యగా ఉండాలి.
దాని నిర్ణీతపరిమాణం:
ధాన్యాలు మరియు పండ్ల నిర్ణీత పరిమాణం (నిసాబ్): ఐదు వసఖ్, వసఖ్ లో అరవై సా లు ఉంటాయి, అప్పుడు నిర్ణీత పరిమాణం (నిసాబ్) మూడు వందల నబవీ సా లు, మరియు కిలోగ్రాములలో చూసినట్లయితే నిసాబ్ దాదాపు 900 కిలోగ్రాములకు సమానం.
అందులో విధి అయ్యే జకాత్ పరిమాణం:
ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా సాగు నీరు పెట్టిన వాటిలో దశమభాగం ఉండాలి; ఉదాహరణకు వర్షపు నీరు మరియు సెలయేరుల ద్వారా సాగు నీరు ఏర్పాటు.
మరియు ఖర్చుతో సాగునీరు అందించబడిన వాటిలో సగం ఉష్ర్ విధి గావించబడింది; ఉదాహరణకు జంతువులు లేదా ఆధునిక యంత్రాల ద్వారా బావులు మరియు నదుల నుండి నీటితో సాగు చేయడం.
రెండవ రకం: ఖనిజాలు:
భూమి నుండి ఉత్పత్తి అయ్యే రకాలలో: ఖనిజాలు, ఇవి భూమి నుండి తవ్వబడినవి, కానీ భూమి యొక్క స్వభావానికి చెందినవి కావు; బంగారం, వెండి, ఇనుము మరియు రత్నాలు వంటివి.
వాటిలో జకాత్ విధి అయ్యే సమయం:
దానిని పొందిన వెంటనే మరియు దాని యజమానిగా మారిన వెంటనే, దాని జకాత్‌ను తక్షణమే తీయాలి, ఎందుకంటే దానికి సంవత్సర కాలం గడవడం అవసరం లేదు, దాని నిసాబ్ బంగారం మరియు వెండి యొక్క నిసాబ్, మరియు దాని విలువ నుండి పావు పది వంతు తీసుకోవాలి.
మూడవది: ధనాల జకాత్:
ధనాలు: బంగారం, వెండి మరియు కరెన్సీ నోట్ల రూపంలో ఉంటాయి మరియు వాటి జకాత్ విధిగా ఉంటుంది మరియు ఆధారం: అల్లాహ్ యొక్క వాక్కు:
﴿وَالَّذِينَ يَكْنِزُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنْفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَشِّرْهُمْ بِعَذَابٍ أَلِيمٍ﴾
మరియు ఎవరైతే వెండి, బంగారాన్ని కూడ బెట్టి, దానిని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టరో వారికి బాధారకమైన శిక్ష గలదనే వార్తను వినిపించు. [తౌబా 9:34]
మరియు హదీథులో ఇలా ఉంది:
«مَا مِنْ صَاحِبِ ذَهَبٍ وَلَا فِضَّةٍ لَا يُؤَدِّي فِيهَا حَقَّهَا؛ إِلَّا إِذَا كَانَ يَوْمَ الْقِيَامَةِ صُفِّحَتْ لَهُ صَفَائِحُ مِنْ نَارٍ».
బంగారం మరియు వెండి యజమానులు ఎవరైతే దాని హక్కు ‘జకాత్’ చెల్లించరో, తీర్పుదినాన అవి అగ్ని పలకలుగా మార్చబడి వారు వాటి పై పడుకో పెట్టబడుతారు పరీక్ష కోసం.44
ధార్మిక పండితులందరూ బంగారం మరియు వెండిపై జకాతు విధిగా ఉండాలని ఏకగ్రీవంగా అంగీకరించారు మరియు కరెన్సీ బంగారం మరియు వెండికి సమానంగా పరిగణించబడుతుంది; ఎందుకంటే ఇది నగదు లావాదేవీలలో వాటి స్థానాన్ని తీసుకుంది
ధనములలో జకాత్ నిర్ణీత పరిమాణం, మరియు అందులో అనివార్య పరిమాణం:
ఇది బంగారం లేదా వెండి యొక్క నిసాబ్; ఎందుకంటే అవి ధరలలో వాటి స్థానాన్ని పొందాయి. వాటిలో ఏదైనా నిసాబ్‌కు చేరినప్పుడు, వాటిపై జకాత్ విధిగా చెల్లించ వలెను. నేటి కరెన్సీ నోట్ల నిసాబ్ను సాధారణంగా వెండి ద్వారా అంచనా వేస్తారు; ఎందుకంటే అది బంగారంతో పోలిస్తే చౌకగా ఉంటుంది, కాబట్టి అది ముందుగా నిసాబ్‌కు చేరుతుంది. ముస్లిం వ్యక్తి 595 గ్రాముల వెండి విలువను కలిగి ఉన్నప్పుడు మరియు వాటిపై వాని ఆధీనం ఒక సంవత్సరం గడిచినప్పుడు, జకాత్ విధిగా చెల్లించ వలెను. గ్రాము వెండి విలువ కాలానుగుణంగా మారుతూ ఉంటుంది, కాబట్టి ఎవరికైనా కొద్దిగా ధనం ఉంటే అది నిసాబ్ చేరిందో లేదో తెలియకపోతే, అతను వెండి వ్యాపారులను వెండి గ్రాము విలువ గురించి అడగాలి, తరువాత దానిని (595) తో గుణించాలి మరియు ఫలితం నిసాబ్ అవుతుంది.
లాభం: తన సంపదపై జకాతు చెల్లించదలచినపుడు; నిసాబ్ ను నలభైతో భాగించాలి, అప్పుడు వచ్చినది తప్పనిసరిగా జకాతు తీయవలసిన పరిమాణము అవుతుంది.
నాల్గవది: వ్యాపార లావాదేవీలపై జకాత్:
అవి లాభం కోసం కొనుగోలు మరియు అమ్మకం కోసం సిద్ధం చేసినవి, వ్యాపార లావాదేవీలలో నగదు కాకుండా అన్ని రకాల ఆస్తులు ఉంటాయి; కార్లు, బట్టలు, వస్త్రాలు, ఇనుము, కలప మరియు వ్యాపారం కోసం సిద్ధం చేసిన ఇతర వస్తువులు.
వాణిజ్య వస్తువులపై జకాత్ విధికి షరతులు:
1- తన చర్య ద్వారా వాటికి యజమాని అవటం; ఉదాహరణకు విక్రయం, అద్దె మరియు ఇతర సంపాదన మార్గాల ద్వారా.
2- వాటిని వ్యాపారం చేయాలనే సంకల్పంతో కలిగి ఉండాలి; వాటి ద్వారా లాభం పొందాలని ఉద్దేశించి ఉండాలి, ఎందుకంటే కార్యాలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి మరియు వ్యాపారం కూడా ఒక కార్యమే, కాబట్టి ఇతర కార్యాల మాదిరిగానే దానికి కూడా సంకల్పం అనుసరించాలి.
3- దాని విలువ రెండు నాణేలలో ఒకటి నిర్ణీత పరిమాణామానికి చేరుకోవాలి.
4- దానిపై పూర్తి సంవత్సరం గడవాలి,
వ్యాపార లావాదేవీలపై జకాత్ చెల్లించే విధానం:
పూర్తి సంవత్సరం గడిచేసరికి, వాణిజ్య వస్తువులను బంగారం లేదా వెండిలో అంచనా వేయాలి. అంచనా వేసిన తర్వాత, అది రెండింటిలో ఒకదాని నిసాబ్‌కు చేరుకుంటే, దాని విలువలో 2.5% చెల్లించాలి.
ఐదవది: జకాతుల్ ఫిత్ర్:
ఇది రమదాను మాసం చివరిలో ఇవ్వబడే విధి దానం, ఇది హిజ్రత్ తరువాత రెండవ సంవత్సరంలో విధిగావించబడినది.
దాని ఆదేశం:
జకాతుల్ ఫిత్ర్ ప్రతి ముస్లింపై పండుగ రోజు మరియు దాని రాత్రి తన జీవనోపాధి మరియు తన కుటుంబ జీవనోపాధి కంటే ఎక్కువ ఆహారం కలిగి ఉన్నవారిపై తప్పనిసరి. ప్రతి ముస్లిం, మగ లేదా ఆడ, చిన్నవారు లేదా పెద్దవారు, స్వతంత్రులు లేదా బానిసలపై ఇది తప్పనిసరి. హదీథు:
«فَرَضَ رَسُولُ اللَّهِ ﷺ زَكَاةَ الْفِطْرِ عَلَى الْعَبْدِ وَالْحُرِّ، وَالذَّكَرِ وَالْأُنثَى، وَالصَّغِيرِ وَالْكَبِيرِ، مِنَ الْمُسْلِمِينَ».
‘మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారు ఫిత్రా జకాతును ముస్లింలలో నుంచి బానిసలపై, స్వతంత్రులపై, పురుషులపై, మహిళలపై, చిన్నవారిపై, పెద్దవారిపై విధి పర్చారు’45. ఫురిజ అర్ధం: అల్జమ్ (బాధ్యతగా చేయబడినది) మరియు అల్ వాజిబ్ (తప్పనిసరి, విధి).
దాని ధర్మబద్ధత యొక్క విజ్ఞత:
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా సెలవిచ్చారు:
«فَرَضَ رَسُولُ اللَّهِ ﷺ زَكَاةَ الْفِطْرِ؛ طُهْرَةً لِلصَّائِمِ مِنَ اللَّغْوِ وَالرَّفَثِ، وَطُعْمَةً لِلْمَسَاكِينِ».
«దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాతుల్ ఫిత్ర్ ను ఉపవాసి పనికిమాలిన మాటల నుండి, కోరికల నుండి శుద్ధి చేయుటకు, మరియు నిరుపేదలకు ఆహారంగా ఉపయోగ పడుటకు తప్పనిసరి చేశారు»46.
జకాతుల్ ఫిత్ర్ ఇవ్వడం యొక్క విధి మరియు దానిని చెల్లించడానికి సమయం:
జకాతుల్ ఫిత్ర్, ఈద్ రాత్రి సూర్యాస్తమయంతో విధిగా అవుతుంది. పండుగ రోజున, పండుగ నమాజుకు వెళ్ళడానికి ముందు దానిని ఇవ్వడం అభిలాషణీయం. పండుగ నమాజు తర్వాత దానిని ఆలస్యం చేయుటకు అనుమతి లేదు, ఒక వేళ పండుగ నమాజు తరువాత జకాతుల్ ఫిత్ర్ చెల్లిస్తే దానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది మరియు దానిని ఆలస్యం చేసినందుకు పాపం చేసిన వ్యక్తి అవుతాడు.
పండుగకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఇవ్వడం అనుమతించబడుతుంది.
దాని పరిమాణం మరియు దాని నుండి ఏమి తీయబడుతుంది:
దేశ ప్రజలకు అలవాటు అయిన ఆహారం నుండి ఒక సాఅ్; ఉదాహరణకు బియ్యం, ఖర్జూరం, గోధుమలు లేదా వేరేవి.
సా పరిమాణం: దాదాపు మూడు కి.గ్రా. విలువను అంచనా వేసి నగదు రూపంలో చెల్లించడం అనుమతించబడదు ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞకు విరుద్ధం.
జకాత్ తీయటం మరియు దాని వినియోగ స్ధానాలు:
దానిని తీసే సమయం:
జకాత్ చెల్లించే సమయం వచ్చినప్పుడు వెంటనే చెల్లించటం అనివార్యం మరియు అవసరం ఉంటే తప్ప దానిని ఆలస్యం చేయడం అనుమతించబడదు, ఉదా ధనం అతని నుండి దూర ప్రాంతంలో ఉండి, దానిని చేరవేసేవాడు లేని సందర్భం.
దానిని తీసే స్థలం:
జకాత్ సంపద ఉన్న ఊరిలో జకాత్ తీయటం ఉత్తమం, జకాత్ సంపద ఉన్న ఊరిలో నుండి మరొక ఊరికి తరలించడం అనుమతించబడుతుంది కొన్ని సందర్భాలలో:
ఎ- ఊరిలో జకాత్ అవసరమైనవారు లేనప్పుడు.
బి- వేరే ఊరిలో జకాత్ అవసరమైన బంధువు ఉంటే.
సి- జకాత్‌ను బదిలీ చేయడంలో షరియా ఆమోదించిన ప్రయోజనం ఉంటే, ఉదాహరణకు ముస్లింలు కరువు మరియు వరదలతో బాధపడుతున్న బాధిత ప్రాంతాలకు బదిలీ చేయడం.
బాలుడి మరియు పిచ్చివాడి సంపదపై జకాతు సార్వత్రిక ఆధారాల ప్రకారం తప్పనిసరి మరియు వారి సంపదపై జకాతు వారి సంరక్షకుడు చెల్లించాలి. సంకల్పం లేకుండా జకాత్ చెల్లించడం నిషిద్ధం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథు:
«إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ».
నిశ్చయంగా కార్యాలు, కర్మలు వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి47.
జకాతు హక్కుదారులు:
జకాత్ ఇవ్వబడే వ్యక్తులు ఎనిమిది రకాలు:
మొదటి రకం: నిరుపేదలు:
వారు నివాసం, ఆహారం మరియు దుస్తులు కోసం తమ ప్రాథమిక అవసరాలు లేని వారు. వారికి మరియు వారిపై ఆధారపడిన వారికి ఒక సంవత్సరం పాటు సరిపోయేంత జకాత్ మొత్తాన్ని వారికి ఇవ్వాలి.
రెండవ రకం: అగత్యపరులు (మసాకీన్):
వారు తమ ప్రాథమిక అవసరాలను చాలా వరకు తీర్చుకో గలరు కానీ అన్నీ కాదు, జీతం ఉన్న వ్యక్తికి అది ఒక సంవత్సరం పాటు సరిపోదు.
వారికి జకాత్ నుండి ఇవ్వవలసిన మొత్తం వారి మరియు వారిపై ఆధారపడిన వారి ఒక సంవత్సరం మొత్తం కొరతను పూర్తి చేసేందుకు.
మూడవ రకం: దానిని సేకరించటానికి పనిచేసేవారు:
వారు జకాత్ సేకరణకు నియమించబడినవారు, లేదా దానిని భద్రపరచడం లేదా అవసరమైన వారికి అందించడం బాధ్యతగా తీసుకుంటారు.
వారికి జకాత్ నుండి ఇవ్వవలసిన మొత్తం, అటువంటి పని చేసినందుకు వారు పొందాల్సిన జీతానికి సమానం, అంటే వారికి ప్రభుత్వం ద్వారా జీతం లభించకపోతే.
నాల్గవ రకం: ఎవరి హృదయాలనైతే ఆకర్షించవలసి ఉందో వారు
వారు ఆ వ్యక్తులే, వారికి ఇవ్వడం వలన: వారి ముస్లింగా మారడం, లేదా వారి విశ్వాసం బలపడడం, లేదా ముస్లింలను వారి చెడు నుండి రక్షించాలని ఆశించబడుతుంది.
జకాత్ చెల్లించు పరిమాణం: వారి మనసులను ఆకర్షించ గలిగినంత.
ఐదవ రకం: బానిసలు:
దీని ఉద్దేశం: బానిసలను మరియు ముకాతబూన్ను విముక్తి చేయడం.
ముకాతబ్: తన యజమాని నుండి తనను తాను కొనుగోలు చేసిన ఒక బానిస. యుద్ధాలలో బందీలుగా ఉన్న ముస్లింలను విమోచన క్రయధనం ద్వారా తిరిగి చెల్లించడం కూడా ఇందులో ఉంది.
ఆరవ రకం: రుణగ్రహీతలు, వారు రెండు రకాలు:
మొదటిది: తన అవసరాల కొరకు అప్పు చేసి తన అప్పును తీర్చడానికి సరిపడా లేనివాడు మరియు అతని అప్పు తీర్చడానికి తగినంత ఇవ్వబడుతుంది.
రెండవది: ప్రజలను సంస్కరించే ఉద్దేశ్యంతో అప్పు తీసుకున్న వ్యక్తి. తన ఋణమును తీర్చుటకు సరిపడినంతను అతనికి ప్రసాదించబడును, అతను ధనవంతుడైనా సరే.
ఏడవ రకం: అల్లాహ్ మార్గంలో:
వారు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసే వారు.
జకాతు నుండి ఇచ్చే మొత్తం: అల్లాహ్ మార్గంలో జిహాదు (ధర్మయుద్ధం) కొరకు వారికి సరిపడినంత, అంటే వాహనం, ఆయుధం, ఆహారం మరియు ఇతర అవసరాల కొరకు.
ఎనిమిదవ రకం: బాటసారి:
తన ప్రయాణ సామగ్రి ఐపోయిన లేదా దొంగిలించబడిన ప్రయాణికుడు, తన ఊరికి చేరుకునేంత డబ్బు తన వద్ద లేకుండా ఉన్నాడు.
వారికి ఇవ్వబడే జకాత్ పరిమాణం: అతను ధనవంతుడు అయినప్పటికీ, అతని నగరానికి చేరుకోవడానికి తగినంత ఇవ్వబడుతుంది.
నాల్గవ భాగము: ఉపవాసము:
ఉపవాసములు అంటే:
అల్లాహ్ తఆలా యొక్క ఆరాధనలో భాగంగా, (ఫజ్ర్ సమయం) తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం భంగ పరిచే విషయాలకు దూరంగా ఉండటం.
ఇది ఇస్లాం యొక్క మూలస్థంభాలలో ఒకటి, మహోన్నతుడైన అల్లాహ్ విధించిన విధులలో ఒకటి, మరియు ఇది ఇస్లాం ధర్మం యొక్క సహజంగా తెలిసిన ఆచారాలలో ఒకటి. దాని అనివార్యం అవటంపై ఖుర్ఆన్, హదీథులు మరియు ముస్లింల ఏకాభిప్రాయం సూచిస్తున్నాయి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿شَهۡرُ رَمَضَانَ ٱلَّذِيٓ أُنزِلَ فِيهِ ٱلۡقُرۡءَانُ هُدٗى لِّلنَّاسِ وَبَيِّنَٰتٖ مِّنَ ٱلۡهُدَىٰ وَٱلۡفُرۡقَانِۚ فَمَن شَهِدَ مِنكُمُ ٱلشَّهۡرَ فَلۡيَصُمۡهُ...﴾
రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకంగా అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి... [అల్ బఖరహ్ 2:185]
రమదాన్ ఉపవాసాల అనివార్యమవుటకు షరతులు:
1- ఇస్లాం (ముస్లిం అయి ఉండాలి), కాఫిర్ నుండి అది చెల్లదు.
2- ప్రాజ్ఞ వయస్సుకు చేరడం, పిన్న వయస్సు వారిపై అది విధి కాదు. చిన్న వయస్కుడైన వివేకవంతుడి ఉపవాసం చెల్లుతుంది మరియు అతనికి ఇది నాఫిలా (స్వచ్ఛందం) గా లెక్కించ బడుతుంది.
3- మేధస్సు: పిచ్చివారిపై ఉపవాసం విధి కాదు మరియు వారి ఉపవాసం సరిగా కాదు; ఎందుకంటే వారికి సంకల్పం ఉండదు.
4- ఉపవాసం ఉండే సామర్థ్యం కలిగి ఉండటం, కావున ఉపవాసం చేయలేని రోగిపై అది విధి కాదు. ప్రయాణికుడికి కూడా కాదు, అనారోగ్యం మరియు ప్రయాణం అనే కారణాలు తొలగిన తర్వాత వారు దానిని పూర్తి చేయాలి ఒక స్త్రీ ఋతుస్రావం లేదా ప్రసవానంతర రక్తస్రావం నుండి పవిత్రతను పొందిందనే షరతుపై ఆమె ఉపవాసం చెల్లుతుంది.
రమదాన్ నెల ప్రారంభం రెండు విషయాలలో ఒకదానితో గుర్తించబడుతుంది అవి:
ఎ- రమదాను మాసపు నెలవంకను చూడటం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి:
«صُومُوا لِرُؤْيَتِهِ، وَأفْطِرُوا لِرُؤْيَتِهِ».
«రమదాన్ నెలవంకను చూసి ఉపవాస దీక్ష ప్రారంభించండి. తిరిగి (షవ్వాల్) నెలవంక చూసిన తర్వాత ఉపవాసాన్ని విరమించండి»48.
బి- షాబాన్ నెల ముప్పై రోజులు పూర్తిచేసుకోవటం, అది రమదాన్ నెలవంక కనిపించకపోతే లేదా మేఘాలు, ధూళి లేదా అలాంటి వాటి కారణంగా కనిపించకపోతే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సూక్తి:
«فَإِنْ غُمَّ عَلَيْكُمْ؛ فَأَكْمِلُوا عِدَّةَ شَعْبَانَ ثَلاثِينَ يَوْمًا».
«ఒకవేళ మీపై ఆకాశం మేఘావృతమై ఉండి (నెల వంక కనిపించకపోతే) షాబాన్ మాసపు ముప్పై దినాలు పూర్తి చేసుకోండి»49.
ఉపవాసములో సంకల్పము యొక్క ప్రాధాన్యత:
ఉపవాసం ఇతర ఆరాధనల వలెనే, సంకల్పం లేకుండా చెల్లదు, విధి ఉపవాసాలలో సంకల్పం చేయవలసిన సమయం, విధి కాని ఉపవాసాలలో సంకల్పం చేయవలసిన సమయం వేర్వేరు గా ఉంటుంది. దీని వివరణ ఇలా ఉంది:
మొదటిది: విధి ఉపవాసములు; ఉదాహరణకు రమదాన్ ఉపవాసాలు లేదా ఖజా లేదా మొక్కుబడి ఉపవాసాలు వంటివి, వీటి కోసం ఉపవాసం చేయాలనే సంకల్పం రాత్రి నుండే ఫజర్ ఉదయించముందే చేయాలి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి:
«مَن لَمْ يُبَيِّتْ الصِّيَامَ مِنَ اللَّيْلِ فَلَا صِيَامَ لَهُ».
రాత్రి నుండి ఉపవాసం ఉండాలనే సంకల్పం చేయని వ్యక్తి ఉపవాసం చెల్లదు50.
రెండవది: నఫిల్ ఉపవాసాలు మరియు వ్యక్తి దానిని పగలు నుండే సంకల్పించటం సరి అగును. ఫజ్ర్ ఉదయం తర్వాత ఉపవాస భంగం చేసే ఏదైనా తీసుకోకపోవడం దానికి షరతుగా ఉంటుంది.
ఉపవాసమును భంగపరిచే విషయాలు:
మొదటిది: లైంగిక సంపర్కం (సంభోగం): ఉపవాసం ఉన్న వ్యక్తి లైంగిక సంపర్కం(సంభోగం) లో పాల్గొంటే, అతని ఉపవాసం చెల్లదు మరియు సంభోగం చేసిన దినమునకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది, అతని పై ఖజాతో పాటు పరిహారం కూడా విధిగా ఉంది, అది: బానిసను విముక్తి చేయటం, అయితే, బానిస అందుబాటులో లేకపోతే, రెండు నెలలు నిరంతర ఉపవాసాలు పాటించాలి; మరియు షరియా ప్రకారం అతనికి సరైన కారణం చెప్పలేకపోతే, అరవై మంది నిరుపేదలకు భోజనం పెట్టాలి. ప్రతీ నిరుపేదకు సగం సాఅ్ ఆహారం, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల నుంచి ఇవ్వాలి.
రెండవది: ముద్దు పెట్టుకోవడం, తాకడం, హస్తప్రయోగం లేదా చూపులు చూడటం వల్ల వీర్యస్ఖలనం జరిగితే. కేవలం కఫారా లేకుండా కేవలం ఖజా చేయాలి; ఎందుకంటే కఫారా కేవలం సంభోగానికి మాత్రమే ప్రత్యేకం. నిద్రిస్తున్న వ్యక్తి స్వప్నదోషం కలిగి, వీర్యస్ఖలనం జరిగితే, అతని పై ఎలాంటి తప్పు లేదు; ఎందుకంటే అతనికి దానిపై నియంత్రణ ఉండదు. కాబట్టి అతను అశుద్ధావస్థ నుండి గుసులు స్నానం చేయాలి.
మూడవది: ఉద్దేశపూర్వకంగా తినడం మరియు త్రాగడం: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
﴿وَكُلُواْ وَٱشۡرَبُواْ حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ ٱلۡخَيۡطُ ٱلۡأَبۡيَضُ مِنَ ٱلۡخَيۡطِ ٱلۡأَسۡوَدِ مِنَ ٱلۡفَجۡرِۖ ثُمَّ أَتِمُّواْ ٱلصِّيَامَ إِلَى ٱلَّيۡلِ...﴾
మరియు ఉదయకాలపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తర్వాత చీకటి పడే వరకూ మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి... [అల్ బఖరహ్ 2:187] ఎవరైతే మరచిపోయి తిని లేదా త్రాగితే అతనిపై ఎటువంటి పరిహారం లేదు; హదీథు:
«مَن نَسِيَ وَهُوَ صَائِمٌ، فَأَكَلَ أَوْ شَرِبَ، فَلْيُتِمَّ صَوْمَهُ، فَإِنَّمَا أَطْعَمَهُ اللَّهُ وَسَقَاهُ».
ఎవరైతే ఉపవాసమున్న సంగతి మరిచి తిని లేదా త్రాగినట్లైతే అతను తన ఉపవాసాన్ని పూర్తిచేయాలి. ఎందుకంటే నిస్సందేహంగా అల్లాహ్ నే అతనికి తినిపించాడు మరియు త్రాపించాడు.51
నాల్గవది: కావాలని వాంతి చేసుకోవడం, కానీ తన ప్రమేయం లేకుండా వాంతి అయితే, అది ఉపవాసాన్ని ప్రభావితం చేయదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి:
«مَنْ ذَرَعَهُ الْقَيءُ فَلَيْسَ عَلَيْهِ قَضَاءٌ، وَمَن اسْتَقَاءَ عَمْدًا فَلْيَقْضِ».
«ఎవరైతే అనుకోకుండా వాంతి చేసుకుంటాడో అతనిపై ఖజా లేదు, కానీ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా వాంతి చేసుకుంటాడో అతను ఖజా చేయాలి»52.
ఐదవది: శరీరంలో నుండి రక్తాన్ని వెలికితీయడం; హిజామా ద్వారా గాని, రక్తనాళాన్ని కోసి రక్తం తీసుకోవడం ద్వారా గాని, లేదా రోగిని రక్షించుటకై రక్తదానం కోసం రక్తాన్ని తీసుకోవడం ద్వారా గాని — వీటన్నిటితో ఉపవాసం భంగమవుతుంది. అయితే రక్త పరీక్ష కోసం తీసే తక్కువ రక్తం ఉపవాసంపై ప్రభావం చూపదు, అలాగే తన ప్రమేయం లేకుండా రక్తం బయటకు రావటం; ముక్కు నుండి రక్తం కారడం, గాయాలు లేదా దంతము తీయటం వలన రక్తం బయటకు రావటం; ఇది ఉపవాసంపై ప్రభావం చూపదు.
రమదాన్ మాసంలో ఉపవాసం నుండి మినహాయింపు పొందినవారు:
మొదటి రకం: ఉపవాసాన్ని వదిలివేయుటకు అనుమతించ బడినవారు, మరియు ఖజా అనివార్యమైనవారు, వారు:
మొదటిది: ఆ రోగి ఎవరికైతే వ్యాది నయం అవుతుందని నమ్మకం ఉంటుందో, ఉపవాసం ఉంటే అతనికి నష్టం వాటిల్లు తుంది లేదా ఉపవాసము ఉండటం అతనికి కష్టంగా ఉంటుంది.
రెండవది: ప్రయాణికుడు; ప్రయాణంలో కష్టం ఎదురైనా లేదా కష్టం ఎదురుకాకపోయినా.
మరియు వారిద్దరికి అల్లాహ్ యొక్క వాక్కు ఆధారం:
﴿...وَمَن كَانَ مَرِيضًا أَوۡ عَلَىٰ سَفَرٖ فَعِدَّةٞ مِّنۡ أَيَّامٍ أُخَرَ...﴾
కాని వ్యాధిగ్రస్తుడైన వాడు లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినాలలో పూర్తి చేయాలి. [అల్ బఖరహ్ 2:185]
మూడవది: గర్భిణీ లేదా పాలుపట్టే స్త్రీ, ఉపవాసం ఉండటం వారికి కష్టంగా ఉంటే, వారికి లేదా వారి సంతానానికి హాని ఉంటే, వారు రోగులుగా పరిగణించబడతారు, వీరికి ఉపవాసం వదిలి వేయడం అనుమతించబడును, కానీ వారు ఆ ఉపవాసాలను మరొక సమయములో ఖజా చేయవలసి ఉంటుంది.
నాల్గవది: రుతుస్రావ స్త్రీ మరియు ప్రసవ స్త్రీ, ఉపవాస విరమణ వారిపై అనివార్యం. వారి ఉపవాసం సరి కాదు మరియు వారు వదిలివేసిన ఉపవాసాలను ఇతర దినములలో పూర్తి చేసుకోవాలి.
రెండవ రకం: వీరికి ఉపవాసం వదిలివేయుట సమ్మతించ బడును మరియు వారికి పరిహారం తప్పక చేయవలెను, కానీ ఉపవాసం పునరావృతం చేయవలసిన అవసరం లేదు, వారు:
మొదట: రోగి వ్యాధి నుండి త్వరగా కోలుకోలేని స్థితిలో ఉన్నప్పుడు.
రెండవది: ఉపవాసం ఉండలేని ముసలి వ్యక్తి.
కాబట్టి వీరు ఉపవాసం వదిలి, రమదాన్ నెలలో ప్రతి రోజుకు బదులు ఒక పేదవాడికి భోజనం పెట్టాలి, మరియు పెద్ద వయస్సు మతిమరుపు స్థాయికి చేరినప్పుడు అతనిపై బాధ్యత తొలగించబడుతుంది; కాబట్టి అతను ఉపవాసం విడిచిపెట్ట వచ్చు మరియు అతనిపై ఏమీ ఉండదు.
ఉపవాసం ఖజా చేసే సమయం మరియు దాని ఆలస్యం పై విధించబడే ఆంక్ష:
రమదాను ఉపవాసాలు ఖజా చేయటం రమదాను మరియు తదుపరి రమదాను మధ్యలో చేయవలసినది. తప్పిపోయిన ఉపవాసాన్ని ఖజా చేసుకోవడానికి తొందరపడటం మంచిది, ఖజాను తదుపరి రమదాను తర్వాత వరకు వాయిదా వేయడం అనుమతించబడదు. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం:
«كَانَ يَكُونُ عَلَيَّ الصَّوْمُ مِنْ رَمَضَانَ، فَمَا أَسْتَطِيعُ أَنْ أَقْضِيَ إِلَّا فِي شَعْبَانَ لِمَكَانِ رَسُولِ اللهِ ﷺ».
«నా పై రమదాను మాసపు ఉపవాసాలు మిగిలి ఉండేవి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో షాబానులో మాత్రమే నేను వాటిని పూర్తి చేయగలిగే దానిని.»53
తదుపరి రమదాన్ తరువాత ఖజాను ఆలస్యం చేసిన వ్యక్తికి రెండు పరిస్థితులు ఉన్నాయి:
1- షరీఅతు కారణం వలన ఆలస్యం చేయడం ఉదాహరణకు: అతనికి వ్యాధి తదుపరి రమదాన్ వరకు కొనసాగితే, అతనిపై కేవలం ఖజా చేయటం మాత్రమే అనివార్యము.
2- షరియత్ కారణం లేకుండా దానిని వాయిదా వేస్తే, ఆలస్యం వలన అతనికి పాపం కలుగుతుంది. అతను తౌబా చేయాలి, ఖజా చేయాలి మరియు ప్రతీ రోజుకు ఒక నిరుపేదకు భోజనం తినిపించాలి.
ఖజా చేయవలసి ఉన్నవారికి స్వచ్ఛంద ఉపవాసం:
రమదాన్ లోని ఉపవాసాలు పూర్తి చేయవలసిన వారు, నఫిల్ ఉపవాసాలు ప్రారంభించకముందే వాటిని పూర్తి చేయడం ఉత్తమం. కానీ, నఫిల్ ఉపవాసం యొక్క సమయం గడిచిపోతే - ఉదాహరణకు ఆరఫా మరియు ఆషురా ఉపవాసాలు - వాటి ఖజా ముందు పాటించాలి; ఎందుకంటే ఖజా చేయటానికి సమయం విస్తృతంగా ఉంటుంది, కానీ ఆషురా మరియు ఆరఫా ఉపవాసాలు తప్పిపోతాయి. కానీ ఖజా పూర్తి చేసిన తరువాత మాత్రమే షవ్వాల్ మాసపు ఆరు రోజులు ఉపవాసం ఉండాలి.
ఉపవాసం చేయడం నిషేధమయ్యే రోజులు:
1- ఈదుల్ ఫిత్ర్ దినము మరియు ఈదుల్ అద్’హా దినము నాడు ఉపవాసము; నిషేధించబడినది.
2- జిల్ హిజ్జ్ మాసపు తష్రీఖ్ దినాలలో ఉపవాసం ఉండటం, కాని తమత్తు మరియు ఖిరాన్ చేసే వ్యక్తులు హజ్ లో హదీ పశువును పొందలేకపోతే తష్రీఖ్ దినములలో ఉపవాసాలు ఉండవచ్చు, తష్రీఖ్ దినములు అంటే జిల్ హిజ్జ్ మాసపు పదకొండవ, పన్నెండవ మరియు పదమూడవ తేదీలు.
3- సందేహ దినం, అంటే షాబాన్ నెల 30వ తేదీ, ఒకవేళ దానికి ముందు రాత్రి మేఘావృతమై లేదా ధూళితో నిండి ఉండి, చంద్రవంక కనిపించకుండా పోతే.
ఉపవాసం చేయడం మక్రూహ్ (అనుచితం) అయ్యే రోజులు:
ఎ- రజబ్ మాసమును ప్రత్యేకించి ఉపవాసం చేయడం.
బి- ప్రత్యేకంగా శుక్రవారం ఒక్క రోజు ఉపవాసంగా ఉండటం, ఎందుకంటే దానికి నిషేధం ఉంది. దాని ఒకరోజు ముందు లేదా తరువాత ఉపవాసముండటం ద్వారా అయిష్టత తొలగిపోతుంది.
సున్నతుగా పాటించవలసిన ఉపవాసాలు:
ఎ- షవ్వాల్ మాసపు ఆరు రోజులు.
బి- జిల్ హిజ్జ్ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండటం, అందులో ముఖ్యమైనది యౌము అరఫా, కానీ హజ్జ్ చేసే వారికి ఇది సున్నత్ కాదు; మరియు ఈ ఉపవాసం రెండు సంవత్సరాల పాపాలకు పరిహారమవుతుంది.
సి- ప్రతి నెలలో మూడు రోజులు ఉపవాసం ఉండటం, ప్రాధాన్యంగా అయ్యాముల్ బీద్ అంటే ప్రతి చంద్ర నెలలో 13వ, 14వ మరియు 15వ తేదీలలో ఉపవాసం ఉండటం.
డి- ప్రతి సోమవారం మరియు గురువారం ఉపవాసం ఉండటం ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం ఉండేవారు మరియు ఈ రెండు రోజుల్లో దాసుల కర్మలు అల్లాహ్ కు సమర్పించబడతాయని ఆయన తెలిపారు.
నఫిల్ ఉపవాసం
ఎ- దావూద్ అలైహిస్సలమ్ వారి ఉపవాసం, ఆయన ఒక రోజు ఉపవాసం ఉండేవారు మరియు ఒక రోజు భుజించేవారు.
బి- అల్లాహ్ మాసం ముహర్రం ఉపవాసం, ఇది అత్యుత్తమ మాసం ఉపవాసం ఉండటానికి, మరియు ముఖ్యంగా: ఆషూరా రోజు ఉపవాసం, ఇది ముహర్రం మాసం యొక్క పదవ తేదీ, మరియు దాని తోడుగా తొమ్మిదవ తేదీ కూడా ఉపవాసం ఉండటం; ఎందుకంటే ప్రవక్త ﷺ ఇలా అన్నారు:
«لَئِنْ بَقِيتُ إِلَى قَابِلٍ لَأَصُومَنَّ التَّاسِعَ».
ఒకవేళ నేను వచ్చే సంవత్సరము ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా తొమ్మిదవ తేదీన కూడా ఉపవాసాన్ని పాటిస్తాను54. దానికి ముందు ఉన్న సంవత్సరపు పాపాలను పరిహరిస్తుంది.
ఐదవ భాగము: హజ్ మరియు ఉమ్రహ్
భాషాపరంగా "హజ్" అంటే: ఉద్దేశించడం. మరియు షరియా పరంగా: ఇది సంవత్సరంలో ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ఆచారాలను నిర్వహించడానికి అల్లాహ్ యొక్క పవిత్ర గృహం మరియు పవిత్ర స్థలాల వైపు వెళ్ళడం.
'ఉమ్రహ్'" అంటే భాషాపరంగా: సందర్శించడం,
మరియు షరియా పరంగా: ఇది నిర్దిష్ట ఆచారాలను నిర్వహించడానికి ఎప్పుడైనా పవిత్ర గృహాన్ని సందర్శించడం.
హజ్జ్ ఇది ఇస్లాం మూలస్థంభాలలో మరియు దాని గొప్ప నిర్మాణాలలో ఒకటి, ఇది హిజ్రీ తొమ్మిదవ సంవత్సరంలో విధిగా చేయబడింది, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హజ్ చేశారు; అది హజ్జతుల్ విదాఅ్.
హజ్ జీవితంలో ఒక్కసారైనా చేయటం స్థోమత కలిగిన వారికి తప్పనిసరి మరియు దానిని మించినది స్వచ్ఛంద చర్యగా పరిగణించబడుతుంది. ఉమ్రహ్ విషయానికొస్తే, చాలా మంది పండితుల అభిప్రాయం ప్రకారం, ఇది తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారిని "స్త్రీలపై జిహాద్ విధిగా ఉందా?" అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు దీనిని రుజువు చేస్తున్నాయి:
«نَعَمْ، عَلَيْهِنَّ جِهَادٌ لَا قِتَالَ فِيهِ: الْحَجُّ وَالْعُمْرَةُ».
అవును, వారిపై జిహాద్ ఉంది, అయితే అందులో పోరాటం ఉండదు; అది హజ్ మరియు ఉమ్రాహ్55.
హజ్ మరియు ఉమ్రా తప్పనిసరి అవటానికి షరతులు:
1- ఇస్లాం
2- బుద్ది
3- ప్రాజ్ఞ వయస్సుకు చేరడం
4- స్వేచ్ఛ
5- స్థోమత
మహిళల కొరకు ఆరవ షరతు కూడా ఉంటుంది; అది ఆమెతో పాటు ప్రయాణించే మహ్రమ్ యొక్క ఉనికి, అతనితో కలిసి ఆచరించడానికి. ఎందుకంటే మహ్రం లేకుండా ఆమెకు హజ్జ్ లేదా ఇతర ప్రయాణం అనుమతించబడదు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథు:
«لَا تُسَافِرُ الْمَرْأَةُ إِلَّا مَعَ ذِي مَحْرَمٍ، وَلَا يَدْخُلُ عَلَيْهَا رَجُلٌ إِلَّا وَمَعَهَا مَحْرَمٌ».
«స్త్రీ మహ్రమ్ తో తప్ప ప్రయాణించరాదు, మరియు ఆమె వద్దకు మహ్రమ్ లేకుండా పురుషుడు ప్రవేశించరాదు.»56.
ఒక స్త్రీ యొక్క మహ్రమ్: ఆమె భర్త లేదా ఆమెను వివాహం చేసుకోవడం శాశ్వతంగా నిషేధించబడిన పురుషుడు; రక్తసంబంధం వలన; ఆమె సోదరుడు తండ్రి, పెద్దనాన్న, సోదరుని కుమారుడు, మేనమామ లేక అనుమతించబడిన కారణం వలన; ఉదాహరణకు పాల సోదరుడు లేదా వివాహ సంబంధ వలన; ఉదాహరణకు ఆమె తల్లి భర్త మరియు ఆమె భర్త కుమారుడు.
స్థోమత: అంటే ఆర్థిక మరియు శారీరక శక్తి సామర్థ్యం అంటే వాహనాన్ని ఉపయోగించగలగడం, ప్రయాణాన్ని భరించ గలగడం మరియు తనకు సరిపడినంత డబ్బు వెళ్ళడానికి మరియు తిరిగి రావడానికి ఉండటం, అంతేగాక తాను తిరిగి వచ్చే వరకు తన పిల్లలు మరియు తన భరణపోషణ బాధ్యత వహించ వలసిన వారికి సరిపడే స్థాయిలో తినుబండారాన్ని (ఖర్చును) వదిలి పెట్టాలి.
అతని జీవితం మరియు సంపద పరంగా హజ్ యాత్రకు వెళ్ళే మార్గం అతనికి సురక్షితంగా ఉండాలి.
ఎవరికైనా ఆర్థిక సామర్థ్యం ఉండి, శారీరకంగా శక్తి లేక పోవడం, చాలా వృద్ధులు కావడం లేదా నయం కాని అనారోగ్యంతో బాధపడుతుంటే, అతను తన తరపున హజ్ మరియు ఉమ్రహ్ చేయడానికి ఎవరినైనా అప్పగించాలి.
హజ్ మరియు ఉమ్రహ్ యాత్రకు వెళ్లే ప్రతినిధిలో తప్పనిసరిగా రెండు షరతులు ఉండాలి, అవి:
1- హజ్ విధిని నిర్వహించగలిగినవారిలో ఒకరై ఉండాలి, అంటే యుక్తవయస్సుకు చేరిన, బుద్ధి కలిగిన ముస్లిం
2- అతడు తన కోసం ఇస్లాం హజ్ చేసినవాడై ఉండాలి.
ఇహ్రామ్ సరిహద్దులు, సమయాలు:
మవాఖీత్: మీఖాత్ యొక్క బహువచనం, భాషాపరంగా: హద్దు. మరియు ధార్మిక పరంగా: ఇది ఆరాధన స్థలం లేదా ఆరాధన సమయం.
హజ్ కు సమయ మరియు స్థానిక వ్యవధులు ఉన్నాయి:
ఎ- సమయ వ్యవధులు: మహోన్నతుడైన అల్లాహ్ తన వాక్కులో పేర్కొన్నాడు:
﴿ٱلۡحَجُّ أَشۡهُرٞ مَّعۡلُومَٰتٞۚ فَمَن فَرَضَ فِيهِنَّ ٱلۡحَجَّ...﴾
హజ్జ్ నియమిత నెలలోనే జరుగుతుంది. ఈ నిర్ణీత మాసాలలో హజ్జ్ చేయటానికి సంకల్పించిన వ్యక్తి... [అల్ బఖరహ్ 2:197]
మరియు ఈ నెలలు: షవ్వాల్, జిల్ ఖాయిదహ్ మరియు జిల్ హిజ్జ్ యొక్క పది రోజులు.
బి- స్థానిక మవాఖీత్: ఇవి హజ్ యాత్రికుడు ఇహ్రామ్ దీక్ష బూనకుండా మక్కాకు దాటి వెళ్ళరాని సరిహద్దులు , అవి ఇలా ఉన్నాయి:
1- జుల్-హులైఫా: మదీనా ప్రజల మీఖాత్.
2- అల్ జుహ్ఫా: ఈజిప్ట్, సిరియా మరియు మగ్రిబ్ ప్రజల మీఖాత్.
3- ఖర్నుల్’ మనాజిల్: దీనిని ఇప్పుడు సైల్ అల్ కబీర్ అని పిలుస్తారు; ఇది నజ్ద్ ప్రజల మీఖాత్.
4- దాతె ఇర్ఖ్: ఇరాఖ్ ప్రజల మీఖాత్.
5- యలమ్లమ్: యెమెన్ ప్రజల మీఖాత్.
మరియు ఎవరిదైనా ఇల్లు ఈ మీఖాతుల లోపల ఉంటే, అతను హజ్ మరియు ఉమ్రహ్ కొరకు తన ఇంటి వద్ద నుండే ఇహ్రామ్ దీక్ష బూనుకుంటాడు. మక్కా వాసులలో ఎవరు ఉన్నా, వారు మక్కా నుండే ఇహ్రామ్ ధరిస్తారు మరియు ఇహ్రామ్ కోసం మీఖాత్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉమ్రహ్ కోసం; వారు అతి సమీప హిల్ (హరమ్ బయట) వరకు వెళతారు మరియు ఇహ్రామ్ ధరిస్తారు. హజ్ లేదా ఉమ్రహ్ చేయదలచుకున్నవారు, ప్రవక్త ﷺ నిర్ణయించిన ప్రదేశాల నుండి ఇహ్రామ్ దీక్ష బూనడం తప్పనిసరి, ఇవి పూర్వం వివరించబడిన మీఖాత్ స్థలాలు. హజ్ లేదా ఉమ్రా చేయదలచుకున్నవారు ఇహ్రామ్ దీక్ష బూనకుండా వాటిని దాటి వెళ్ళటం సమ్మతం కాదు.
- అక్కడి వాసులు కాని వారు కూడా పైన పేర్కొనబడిన మీఖాతుల గుండా వెళ్తే అక్కడి నుండే ఇహ్రామ్ దీక్ష బూనుకుంటారు.
- ఎవరి మార్గం మక్కా వైపు ఉన్నా మరియు పైన పేర్కొనబడిన మీఖాతులలో ఏ ఒక్కదాని మీదుగా కూడా వెళ్ళ లేకపోతే భూమి, సముద్రం, ఆకాశమార్గం ద్వారా వెళ్తూ అతను తనకు దగ్గరగా ఉన్న మీఖాత్ కు సమానంగా ఉన్న ప్పుడు ఇహ్రామ్ ధరించాలి, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మీ మార్గంలో అది ఎక్కడ ఉందో గుర్తించండి."57.
హజ్ లేదా ఉమ్రహ్ కోసం విమానంలో ప్రయాణించే ఎవరైనా విమానం తన మార్గంలో మీఖాత్ వద్దకు రాగానే ఇహ్రామ్ ధరించాలి. అతడు ఇహ్రామ్ ధరించుటను విమానాశ్రయంలో దిగిన తరువాతకు వాయిదా వేయుటకు అనుమతి లేదు.
ఇహ్రాం:
అది ఆచరణలో ప్రవేశించడానికి చేసే సంకల్పం;
హజ్లో ఇది: హజ్ లో ప్రవేశించాలనే సంకల్పం చేయుట. ఉమ్రాలో ఇది: ఉమ్రాలో ప్రవేశించడానికి సంకల్పించుకోవడం. ఒక వ్యక్తి హాజ్ లేదా ఉమ్రా యాత్రలో ప్రవేశించాలని సంకల్పం చేసుకున్న, తర్వాతనే అతను ముహ్రిమ్ అనబడతాడు. సంకల్పం లేకుండా ఇహ్రామ్ బట్టలు ధరించడం ఇహ్రామ్ కాదు.
ఇహ్రామ్ యొక్క అభిలాషణీయ కార్యాలు:
1- ఇహ్రామ్ లో ప్రవేశించే ముందు గుసుల్ చేయటం, శరీరమంతా శుభ్రపరచుకోవటం.
2- పురుషుడు తన శరీరానికి సుగంధద్రవ్యాలను పూసు కోవటం, కానీ తన ఇహ్రామ్ దుస్తులపై కాదు.
3- ఇజార్ మరియు దుప్పటి రూపంలో తెల్లని రెండు వస్త్రాలు మరియు చెప్పులు ధరించి ఇహ్రామ్ లోకి ప్రవేశించాలి.
4- ఇహ్రామ్‌లో ప్రవేశించేటప్పుడు సవారీపై ఉండటం మరియు ఖిబ్లా దిశను ముఖంగా కలిగి ఉండటం.
హజ్ ఆరాధనల రకాలు:
ఈ మూడింటిలో ఏదైనా ఒక రకాన్ని ఇష్టపడి ఎంపిక చేసుకునే అనుమతి ముహ్రిమ్ కి ఉంది.
1- తమత్తు: హజ్ మాసములలో ఉమ్రా కొరకు ఇహ్రామ్ దీక్ష బూనుకుని దానిని పూర్తి చేస్తాడు, ఆ తరువాత అదే సంవత్సరంలో హజ్ కొరకు ఇహ్రామ్ దీక్ష బూనుకుంటాడు.
2- ఇఫ్రాద్: మీఖాత్ నుండి కేవలం హజ్ కొరకు మాత్రమే ఇహ్రామ్ దీక్ష బూనుకుంటాడు, మరియు హజ్ కార్యక్రమాలు పూర్తి చేసే వరకు ఇహ్రామ్‌లోనే ఉంటాడు.
3- ఖిరాన్: ఇది హజ్ మరియు ఉమ్రా రెండిటి కొరకు ఒకేసారి ఇహ్రామ్ దీక్ష బూనుకోవడం లేదా ఉమ్రా కొరకు ఇహ్రామ్ దీక్ష బూనుకుని, ఆ తరువాత తవాఫ్ ప్రారంభించకముందు హజ్‌ను ఉమ్రాపై చేర్చడం, మీకాత్ వద్ద లేదా ఉమ్రా తవాఫ్ ప్రారంభించకముందు ఉమ్రా మరియు హజ్ ఉద్దేశ్యంతో ఇహ్రామ్ ధీక్ష బూనుకోవడం, మరియు వాటి కొరకు తవాఫ్ మరియు సయీ చేయడం.
తమత్తు మరియు ఖిరాన్ చేసే వ్యక్తులకు - వారు మస్జిద్ హరామ్ సమీపంలో నివసించేవారు కాకపోతే, ఫిద్యా తప్పనిసరి. ఈ మూడు ఆచారాలలో ఉత్తమమైనది తమత్తు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు దాని గురించి ఆదేశించారు58. ఆ తరువాత ఖిరాన్; ఎందుకంటే అది హజ్ మరియు ఉమ్రా, ఆ తరువాత ఇఫ్రాద్.
డి) ఈ ఆచారాలలో ఒకదాని కోసం ఇహ్రామ్‌లోకి ప్రవేశించి నప్పుడు; ఇహ్రామ్ అనంతరం ఇలా లబ్బైక్ తల్బియా పలకటం:
«لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ، لَبَّيْكَ لَا شَرِيكَ لَكَ لَبَّيْكَ، إِنَّ الْحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالْمُلْكَ لَا شَرِيكَ لَكَ».
లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నీమత లక వల్ ముల్క్, లా షరీక లక59.
ఇది సున్నతుగా పరిగణించబడుతుంది, మరియు వీలైనంత ఎక్కువగా దానిని చదవాలని ముస్తహబుగా సూచించబడింది. పురుషులు దానిని బిగ్గరగా చదవాలి మరియు మహిళలు దానిని నెమ్మది స్వరంతో చదవాలి.
దాని సమయం: ఇది ఇహ్రామ్ తరువాత ప్రారంభమై, చివరి సమయం ఈ విధంగా ఉంటుంది:
మొదటిది: తవాఫ్ ప్రారంభించక ముందు వరకు ఉమ్రహ్ యాత్రికుడు దానిని పఠించాలి.
రెండవది: హజ్లో, యాత్రికుడు ఈద్ రోజున జమ్రతుల్-అఖబపై రాళ్ళు రువ్వడం ప్రారంభించేటప్పుడు తల్బియా ఆపాలి
ఇహ్రామ్ స్థితిలో నిషిద్ధమైన విషయాలు:
మొదటి నిషేధం: గుండు చేయించుకోవటం లేదా వెంట్రుకలు కత్తిరించటం లేదా ఊడదీయటం శరీరంలోని ఏ భాగం నుండైనా.
నిషిద్ధమైన రెండవ పని: చేతుల, పాదాల గోళ్లను తగిన కారణం లేకుండా కత్తిరించడం లేదా తరిగించడం అయితే గోరు విరిగి పోయి దాన్ని తొలగిస్తే, అతనిపై ఎలాంటి ఫిద్యా (ప్రాయశ్చిత్తం) లేదు.
నిషిద్ధమైన మూడవ పని: పురుషుడు తలపై అంటుకునే వస్త్రంతో (ఉదాహరణకు: టోపీ, గుత్రా వంటి వస్త్రాలతో) తలను కప్పుకోవడం.
నిషిద్ధమైన నాలుగవ పని: పురుషుడు తన శరీరమంతా లేదా శరీర కొంత భాగాన్ని కప్పే విధంగా కుట్టిన దుస్తులను ధరించడం — ఉదాహరణకు: షర్టు (ఖమీసు), తల కప్పే తుర్బాన్ (అమామా), లేదా ప్యాంటు (సరావీల్). అల్-మకీత్ (కుట్టిన దుస్తులు) అంటే: అవి శరీరంలోని ఏదైనా అవయవానికి ప్రత్యేకంగా కొలతలతో తయారుచేసిన వస్త్రాలు, ఉదాహరణకు చర్మపు మేజోళ్ళు, చేతి తొడుగులు మరియు సాక్సులు, స్త్రీ విషయానికి వస్తే: ఇహ్రామ్ సమయంలో ఆమెకు ఆవశ్యకమైన పరదా కోసం కావలసిన దుస్తులు ఏవైనా ధరించ వచ్చు. అయితే ఆమె ముఖాన్ని కప్పుకోకుండా వుండాలి. ఎవరైనా పరాయివారు ఎదురుగా వస్తే ఖిమార్ (తల కప్పే దుపట్టా) లేదా జిల్బాబ్ వంటి వాటితో ముఖాన్ని కప్పుకోవాలి. తన చేతులపై గ్లౌజులు ధరించకూడదు.
నిషిద్ధమైన ఐదవ పని: ఇత్ర్ (సుగంధ ద్రవ్యం) వాడటం. ఎందుకంటే ఎహ్రామ్ స్థితిలో ఉన్నవాడు భోగవిలాసాలు, ప్రపంచ జగడాల నుండి దూరంగా ఉండాలి మరియు పరలోకపు కార్యాల వైపు దృష్టి పెట్టాలి.
నిషిద్ధమైన ఆరవ పని: భూమిలో నివసించే వన్యమృగాలను చంపడం లేదా వేటాడడం. ఎహ్రామ్ స్థితిలో ఉన్నవాడు వన్య జీవిని వేటాడకూడదు, దాని వేటకు సహాయం చేయకూడదు, మరియు దాన్ని వధించకూడదు.
ముహ్రిమ్ ఎహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు తాను వేటాడిన వన్య మృగాన్ని తినడం,లేదా తన కోసం వేటాడినదాన్ని తినడం, లేదా తన సహాయంతో వేటాడినదాన్ని తినడం నిషిద్ధం. ఎందుకంటే అతనికి అది మృత జంతువుల వలే నిషిద్ధం.
అయితే సముద్ర జీవుల వేట విషయంలో: ఎహ్రామ్ స్థితిలో ఉన్న వారికి సముద్రపు వేట నిషిద్ధం కాదు. అలాగే, మానవ ఆవాసాల్లో పెరుగుతున్న జంతువులను — ఉదాహరణకు కోడి లేదా పశువుల తరగతికి చెందిన జంతువులను — వధించటం కూడా అతనికి నిషిద్ధం కాదు, ఎందుకంటే అవి వన్యమృగాల వేటలో రావు.
నిషిద్ధమైన ఏడవ పని: ఎహ్రామ్ స్థితిలో ఉన్నవాడు వివాహ నిబంధన (నికాహ్) చేయకూడదు — తానుగానీ, ఇతరుల తరఫున గానీ లేదా ఆ వివాహానికి సాక్షిగా ఉండకూడదు.
ఎనిమిదవ నిషేధం: సంభోగం; మొదటి తహల్లుల్ ముందు సంభోగం చేసినవారు, వారి నుసుక్ భంగమవుతుంది మరియు వారికి తమ (నుసుక్) మనాసిక్’లను కొనసాగించి పూర్తి చేయడం తప్పనిసరి మరియు రెండవ సంవత్సరంలో దానిని పునరావృతం చేయాలి మరియు ఒక బదనాను జిబాహ్ చేయాలి. మొదటి తహల్లుల్ తర్వాత జరిగితే అతని హజ్ భంగం కాదు, కానీ అతనిపై దమ్ (ఖుర్బానీ) అనివార్యము అగును.
ఆ విషయంలో స్త్రీ, పురుషుని వలె తప్పిదం చేస్తే అంటే ఇష్ట పూర్వకంగా లైంగిక సంబంధంలో పాల్గొంటే ఆమెపై కూడా ఇది వర్తిస్తుంది.
తొమ్మిదవ నిషేధం: మర్మాయవం కాకుండా కలువడం. ఇహ్రామ్ ధరించిన వ్యక్తి స్త్రీతో కలువడం నిషేధించబడింది, ఎందుకంటే అది నిషేధిత సంభోగానికి దారితీస్తుంది. ఇక్కడ కలువడం అంటే స్త్రీని కామంతో ముట్టుకోవడం.
ఉమ్రహ్:
ఎ. ఉమ్రహ్ విధులు:
1 - ఇహ్రాం
2 - తవాఫ్
3 - సయీ చేయటం
బి- ఉమ్రాలోని విధి కార్యాలు:
1- అసలు మీఖాత్ నుండి ఇహ్రామ్‌లోకి ప్రవేశించడం.
2- శిరోముండన లేదా వెంట్రుకలు కత్తిరించటం.
సి: ఉమ్రహ్ విధానం:
ఉమ్రా చేసే వ్యక్తి మొదటగా ఏడు సార్లు తవాఫ్ చేయాలి, హజ్రె అస్వద్ నుండి ప్రారంభించి దానితో ముగించాలి. తన తవాఫ్ ఆచరణలో పరిశుద్ధతతో ఉండాలి, నాభి నుండి మోకాళ్ళ వరకు తన మర్మావయవాలను కప్పి ఉంచాలి, అతనికి మొత్తం తవాఫ్ లో ఇజ్తిబా సున్నతుగా ఉంది; అంటే అతను తన కుడి భుజాన్ని బయటపెట్టి, దుప్పటిని దాని కింద ఉంచి, దుప్పటి చివరలను తన ఎడమ భుజంపై ఉంచాలి, ఏడవ ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత; ఇజ్తిబా ను విడిచిపెట్టి, తన భుజాలను తన వస్త్రంతో కప్పు కొట్టాడు.
హజ్రె అస్వద్ కి అభిముఖంగా నిలబడాలి, దానిని చుంబించ గలిగితే చుంబించాలి, లేకపోతే కుడిచేతితో తాకి, ఆ చేయిని చుంబించాలి. హజ్రె అస్వద్ ను ముట్టుకోవడం సాధ్యం కాకపోతే, కుడిచేతిని పైకి ఎత్తి, "అల్లాహు అక్బర్" అని ఒకసారి పలుకుతూ, హజ్రె అస్వద్ వైపు సూచించాలి, కానీ చేతిని ముద్దు పెట్టుకోకూడదు, ఆగకూడదు, ఆ తర్వాత తన తవాఫ్ కొనసాగిస్తూ, కాబాను తన ఎడమవైపు ఉంచి, మొదటి మూడు ప్రదక్షిణలలో రమల్ చేయడం సున్నతు, రమల్ అంటే: వడి వడిగా, చిన్న చిన్న అడుగులతో నడవడం.
కాబాగృహం యొక్క నాల్గవ మూలం అయిన రుక్నె యమానీ పక్కన గనక వెళ్ళినప్పుడు, అది సులభంగా సాధ్యమైతే, ఎటువంటి తక్బీర్ లేకుండా లేదా ముద్దు పెట్టకుండా దానిని కుడి చేతితో తాకాలి, అది సాధ్యం కాకపోతే దానిని తాకకుండా, దానికి సైగ చేయకుండా మరియు తక్బీర్ పలక కుండా ముందుకు సాగాలి, రుక్నె యమానీ మరియు హజ్రె అస్వద్ మధ్య ఇలా దుఆ చేయవలెను:
﴿...رَبَّنَآ ءَاتِنَا فِي ٱلدُّنۡيَا حَسَنَةٗ وَفِي ٱلۡأٓخِرَةِ حَسَنَةٗ وَقِنَا عَذَابَ ٱلنَّارِ﴾
రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్ వ ఫిల్ఆఖిరతి హసనతన్ వ ఖినా అదాబన్నార్. ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు! [అల్ బఖరహ్ 2:201]
తవాఫ్ ముగిసిన తర్వాత మఖామె ఇబ్రహీం వెనుక రెండు రకాతుల నమాజు చేయాలి - అది సాధ్యం అయితేనే. లేకపోతే మస్జిదె హరామ్ లో ఏ ప్రదేశంలో అయినా నమాజు చదవాలి. మొదటి రకాతులో సూరె ఫాతిహా తరువాత సూరతుల్ కాఫిరూన్ పఠించడం సున్నత్. రెండవ రకాతులో సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ ఇఖ్లాస్ పఠించాలి, ఆ తర్వాత సయీ ప్రదేశానికి వెళ్లి, సఫా మరియు మర్వా మధ్య ఏడు సార్లు సయీ చేయాలి; సఫా నుండి మర్వాకు వెళ్లడం ఒక ప్రదక్షిణ మరియు మర్వా నుండి సఫాకు తిరిగి రావడం మరొక ప్రదక్షిణ.
సయీ సఫా వద్ద ప్రారంభమవుతుంది, దానిపై ఎక్కాలి లేదా దాని దగ్గర నిలబడాలి. సాధ్యమైతే సఫా పైకి ఎక్కడం ఎంతో ఉత్తమం, ఆ సందర్భంలో అల్లాహ్ యొక్క ఈ వాక్కు చదవాలి:
﴿إِنَّ ٱلصَّفَا وَٱلۡمَرۡوَةَ مِن شَعَآئِرِ ٱللَّهِ...﴾
ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షాఆ ఐరిల్లాహ్… నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు... [అల్ బఖర 2:158]
ఖిబ్లా వైపు అభిముఖమై నిలబడటం మంచిది, అల్లాహ్‌ను స్తుతిస్తూ, ఆయనను మహిమిస్తూ, ఇలా పలకాలి:
«لَا إِلٰهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ، لَا إِلٰهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، يُحْيِي وَيُمِيتُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، لَا إِلٰهَ إِلَّا اللَّهُ وَحْدَهُ، أَنْجَزَ وَعْدَهُ، وَنَصَرَ عَبْدَهُ، وَهَزَمَ الْأَحْزَابَ وَحْدَهُ».
లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు, లహుల్ ముల్'కు, వ లహుల్ హమ్'దు, యుహ్యి వ యుమీతు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు, అంజజ వ'అదహు, వ నసర అబ్దహు, వ హజమల్ అహ్జాబ వహదహు60. తరువాత తన రెండు చేతులను పైకి ఎత్తి, సులభంగా ఉండే దుఆ చేసుకోవలెను మరియు ఈ స్మరణ మరియు దుఆను మూడు సార్లు పునరావృతం చేయాలి. తర్వాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. మొదటి ఆకుపచ్చ సంకేత స్థంభం నుండి రెండవ ఆకుపచ్చ సంకేత స్థంభం వరకు, పురుషులు వడి వడిగా (రమల్) వేగంగా నడవాలి. స్త్రీల విషయానికొస్తే, వారు రెండు సంకేతాల మధ్య వేగంగా నడవడానికి అనుమతి లేదు ఎందుకంటే వారు 'ఔరాత్' (పరదా) లో ఉంటారు. బదులుగా, వారు సయీ అంతటా నడవాలని మాత్రమే ఆదేశించబడింది. తరువాత నడుస్తూ, మర్వా పైకి ఎక్కి నిలబడాలి లేదా దాని వద్ద నిలబడాలి, పైకి ఎక్కడం సాధ్యమైతే అది ఉత్తమం, మర్వా వద్ద సఫా వద్ద చెప్పిన మరియు చేసిన విధంగా చెప్పాలి మరియు చేయాలి, అయితే ఆయతు చదవడం మినహా, అది అల్లాహ్ తాలా యొక్క వాక్కు:
﴿إِنَّ ٱلصَّفَا وَٱلۡمَرۡوَةَ مِن شَعَآئِرِ ٱللَّهِ...﴾
నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు... ఇది (ఆయత్ చదవడం) సఫా కొండపై మొదటి ప్రదక్షిణ ప్రారంభ సమయంలో మాత్రమే చేయాలి. తర్వాత, సఫా కొండ నుండి దిగి వచ్చి, నడవాల్సిన చోట నడవాలి, వడి వడిగా నడవ వలసిన చోట వడి వడిగా నడవాలి, తద్వారా మరల సఫా కొండపై చేరాలి. ఈ ప్రక్రియను మొత్తం ఏడు సార్లు చేయాలి. ఒకసారి సఫా కొండ నుండి మర్వా కొండకు చేరిన నడక "ఒక ప్రదక్షిణగా" లెక్కించ బడుతుంది, మర్వా కొండ నుండి తిరిగి సఫా కొండకు చేరటం మరో ప్రదక్షిణగా లెక్కించ బడుతుంది. సయీలో వీలైనంత ఎక్కువగా అల్లాహ్ యొక్క జిక్ర్ మరియు దుఆలను స్మరించడం ముస్తహబ్'గా పరిగణించబడింది, ఇది చేసేటప్పుడు పెద్ద శుద్ధి (హదథ్ అక్బర్) లేదా చిన్న శుద్ధి (హదథ్ అల్ అస్గర్) లేకుండా పరిశుభ్రంగా ఉండటం మంచిది (తహారుతులో మరియు ఉదూలో చేయడం మంచిది). అయితే, అశుద్ధ స్థితిలో సయీ చేసినా అది చెల్లుబాటు అవుతుంది. అలాగే, ఒక మహిళ తవాఫ్ అనంతరం హైద్ (రుతుస్రావం) లేదా నిఫాసు (ప్రసవ రక్తస్రావం) లకు గురైనా, ఆమె సయీ చేయవచ్చు మరియు అది ఆమెకు సరిపోతుంది. ఎందుకంటే సయీ చేయడానికి తహారత్ (పరిశుద్ధత) అనేది షరతు (తప్పనిసరి నిబంధన) కాదు, అది కేవలం ముస్తహబ్ (అభిలషణీయం) మాత్రమే.
సయీ పూర్తి చేసిన తరువాత; తల గుండు చేయించుకోవాలి లేదా వెంట్రుకలు కత్తిరించుకోవాలి, మరియు పురుషునికి శిరోముండనం చేయడం ఉత్తమం.
ఇలా ఉమ్రా విధులు పూర్తవుతాయి.
హజ్జ్:
ఎ. హజ్ మూలాలు (రుకున్ లు):
1- ఇహ్రాం
2- అరఫాతు మైదానంలో నిలబడటం
3- తవాఫుల్ ఇఫాదహ్
4- సయీ చేయటం
బి- హజ్ లోని అనివార్య కార్యాలు:
1- మీఖాత్ నుండి ఇహ్రామ్ దీక్షబూనటం.
2- దుల్ హిజ్జ్ తొమ్మిదవ రోజున అరఫాత్‌లో నిలబడటం, దినంలో అక్కడ సూర్యాస్తమయం వరకు నిలబడాలి.
3- దిల్-హిజ్జ్ పదవ రాత్రి ముజ్దలిఫాలో అర్ధరాత్రి దాటే వరకు గడపాలి.
4- తష్రీఖ్ రోజుల రాత్రులలో మీనాలో రాత్రి గడపడం.
5- జమరాత్ ను కంకర రాళ్లతో కొట్టడం
6- శిరో ముండనం చేయటం లేదా వెంట్రుకలు కత్తిరించటం.
7- తవాఫె విదా (వీడ్కోలు ప్రదక్షిణ)
సి- హజ్ విధానం:
ముస్లిం మీఖాత్ చేరుకున్నప్పుడు ఇఫ్రాద్ హజ్ కోసం తల్బియా చదవాలి, సమయం తక్కువగా ఉంటే. మక్కాకు చేరిన తరువాత తవాఫ్ మరియు సయీ చేయాలి. ఇహ్రామ్ లోనే కొనసాగాలి. తొమ్మిదో రోజు అరఫా దినమున అరఫాత్ వైపు మరలాలి. సూర్యాస్తమయం వరకు అక్కడ ఉండాలి.
తర్వాత, ముజ్దలిఫా వైపు ప్రయాణించి, అక్కడే ఉండి ఫజ్ర్ నమాజు చేస్తారు. ఆ తరువాత, ఉదయం వెలుగు పూర్తిగా వ్యాపించే వరకు అల్లాహ్ స్మరణ, లబ్బైక మరియు దుఆలలో నిమగ్నమై ఉంటారు.
బాగా తెల్లవారిన తర్వాత సూర్యోదయం కాక ముందే మీనాకు బయలుదేరాలి మరియు జమ్రతుల్-అఖబాపై ఏడు రాళ్ళతో కొట్టాలి, ఆ తర్వాత శిరోముండనం చేయాలి లేదా కత్తిరించుకోవాలి, అయితే శిరోముండనం చేయడం మంచిది.
తరువాత తవాఫె ఇఫాదా చేస్తాడు, మొదటి సయీ అతనికి సరిపోతుంది, దాని ద్వారా అతని హజ్ పూర్తవుతుంది, మరియు అతనికి సంపూర్ణ విముక్తి లభిస్తుంది.
ముందుగా బయలుదేరాలనుకుంటే, పదకొండవ మరియు పన్నెండవ రోజుల్లో జమరాతులకు రాళ్ళు కొట్టాలి. మూడు జమరాతులకు ఏడు కంకర రాళ్ళతో కొట్టాలి. ప్రతీ కంకర రాయి కొట్టేటప్పుడు తక్బీర్ పలకాలి. మొదట మస్జిద్ ఖైఫ్ కు సమీపంలో ఉన్న చిన్న జమరా, తరువాత మధ్య జమరా, చివరగా జమరతుల్ అఖ్బా. ప్రతీ జమరను ఏడు కంకర రాళ్ళ తో కొట్టాలి. అతను పన్నెండవ తేదీ తర్వాత ఆగాలి అనుకుంటే, అతను పదమూడవ తేదీన కూడా పన్నెండవ మరియు పదకొండవ తేదీలలో రాళ్ళు కొట్టిన విధంగా రాళ్ళు కొట్టాలి.
రమీ చేసే సమయం: మూడు రోజులలో జవాల్ తరువాత.
పన్నెండవ రోజు సూర్యాస్తమయానికి ముందు బయలుదేరితే ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మూడవ రోజు మధ్యాహ్నం (జవాల్) తర్వాత రాళ్ళు విసరడానికి ఆగితే ఇది ఉత్తమం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
﴿...فَمَن تَعَجَّلَ فِي يَوۡمَيۡنِ فَلَآ إِثۡمَ عَلَيۡهِ وَمَن تَأَخَّرَ فَلَآ إِثۡمَ عَلَيۡهِۖ لِمَنِ ٱتَّقَىٰ...﴾
ఎవడైనా త్వరగా రెండు రోజులలోనే వెళ్ళిపోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు. మరెవడైనా నిదానించి నిలిచి పోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు, వాడికి, ఎవడైతే దైవభీతి కలిగి ఉంటాడో! [అల్ బఖరహ్ 2:203]
మక్కా నుండి బయలుదేరే ముందు, సయీ చేయకుండా ఏడు ప్రదక్షిణలు చేసే వీడ్కోలు తవాఫ్ చేయాలి.
హదీ (బలి జంతువు) తీసుకురాని పరిస్థితిలో ఉత్తమ మైనది: ముతమత్తిఅ్ ఉమ్రా కోసం ఇహ్రామ్ కట్టుకుని, ఎనిమిదో రోజు హజ్ కొరకు తల్బియా పలుకుతారు మరియు హజ్ యొక్క పూర్వోక్త కార్యాలు చేస్తారు. ఒకవేళ హజ్ మరియు ఉమ్రా రెండింటి కొరకు ఇహ్రామ్ కట్టినా ఎటువంటి అభ్యంతరం లేదు, దీనిని ఖిరాన్ అంటారు, ఇది ఉమ్రా మరియు హజ్ రెండింటి కొరకు ఒకే తవాఫ్ మరియు ఒకే సయీ చేయడం.
మూడవ అధ్యాయం: వ్యవహారాలకు సంబంధించిన విషయాలు.
పండితులు - అల్లాహ్ వారిపై దయ చూపుగాక - ఈ అధ్యాయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వివరించారు, ఇది స్పష్టంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ ముస్లిం తప్పనిసరిగా నేర్చుకోవలసిన విధిగా ఉన్న పరిమాణం గురించి వారు చర్చించారు వ్యాపారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అమ్మకాల నియమాలను ప్రస్తావించారు, తెలియకుండానే చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా లేదా వడ్డీ తినకుండా ఉండటానికి. కొంతమంది సహాబాల రదియల్లాహు అన్హుమ్ నుండి దీనికి మద్దతు ఇచ్చిన విషయాలు ఉన్నాయి.
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు: ధర్మంలో అవగాహన ఉన్న వ్యక్తి తప్ప మరెవరూ మన మార్కెట్లలో అమ్మకాలు చేయకూడదు.61
అలీ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హు ఇలా పలికారు: “ఎవరైతే తగినంత ఫిఖ్ (ఇస్లామీయ ధర్మశాస్త్రం) నేర్చుకోక ముందే వ్యాపారం చేస్తాడో, అతను రిబా (వడ్డీ)లో పడతాడు, మరలా పడతాడు, మరలా పడతాడు. అంటే: అతను రిబాలో పడతాడు.”62
ఇబ్నె ఆబిదీన్ అలామీ నుండి ఉల్లేఖిస్తూ ఇలా తెలిపారు: మతపరమైన విధులను నిర్వర్తించగల ప్రతి ముస్లిం పురుషుడు మరియు స్త్రీ, ధర్మం మరియు మార్గదర్శకత్వం గురించి తెలుసు కున్న తర్వాత, ఉదూ, గుస్ల్ (ఆచార స్నానం), ప్రార్థన, ఉపవాసం, నిసాబ్ ఉంటే జకాత్ (తప్పనిసరి దానధర్మాలు), మరియు దానిని నిర్వహించాల్సి వస్తే హజ్ (తీర్థయాత్ర) గురించి నేర్చుకోవడం తప్పనిసరి. అంతేకాకుండా, అన్ని లావాదేవీలలో సందేహాస్పదమైన మరియు అయిష్టకరమైన సమస్యలను నివారించడానికి వ్యాపారులు అమ్మకాల గురించి నేర్చుకోవాలి మరియు ఇతర వృత్తులకు కూడా ఇది వర్తిస్తుంది. మరో మాట లో చెప్పాలంటే, చట్టవిరుద్ధమైన వాటిని చేయకుండా ఉండ టానికి ప్రతి ఒక్కరూ తన వృత్తికి సంబంధించిన జ్ఞానం మరియు నియమాలను వెతకాలి63.
ఇమాం అన్’నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: అమ్మకం, వివాహం మరియు ఇలాంటివి సూత్రప్రాయంగా తప్పనిసరి కానప్పటికీ, దాని షరతులు తెలియకుండా దానితో ముందుకు సాగడం చట్టవిరుద్ధం."64
ఇస్లామీయ షరియా సూచించిన ఆర్థిక లావాదేవీల సంబంధిత కొన్ని నియమాలు క్రింద ఇవ్వబడ్డాయి:
1- ఏది పూర్తిగా లేదా ప్రధానంగా ప్రయోజనకరమై ఉంటే అది అనుమతించబడింది; అనుమతించబడిన వస్తువులను కొనడం మరియు అమ్మడం, అద్దె మరియు ప్రాధాన్యత హక్కు వంటివి65.
2- ప్రజా హక్కులను రక్షించడానికి మరియు వాటిని పరిరక్షించడానికి ధర్మబద్ధమైన అన్ని చర్యలు; ఉదాహరణకు, తాకట్టు మరియు సాక్షులను ఏర్పాటు చేయటం.
3- రెండు పార్టీలకు ఆసక్తి ఉన్న ప్రతిదీ అనుమతించబడింది; అమ్మకాన్ని రద్దు చేయడం, అమ్మకాన్ని రద్దు చేసే హక్కు మరియు అమ్మకం మరియు కొనుగోలులో ఉపయోగించే నిబంధనలు వంటివి.
4- ప్రజలను అణచివేసి వారి ఆస్తిని అన్యాయంగా తీసుకునే ప్రతి విషయం నిషేధించబడింది; వడ్డీ వ్యాపారం, దోపిడీ మరియు అక్రమ నిల్వలు వంటివి.
5- మంచితనానికి దోహదపడే ప్రతి విషయం అనుమతించ బడుతుంది; అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం మరియు సత్తు (తాకట్టు) పెట్టడం వంటివి.
6- కష్టపడకుండా, ప్రయోజనం లేకుండా మరియు ఎలాంటి శ్రమ లేకుండా సంపాదించే సంపాదన నిషేధించబడింది; ఉదాహరణకు జూదం మరియు వడ్డీ వంటివి.
7- అజ్ఞానం మరియు మోసం ప్రబలంగా ఉన్న ప్రతి విషయం నిషేధించబడింది; ఉదాహరణకు స్వంతం కాని లేదా తెలియని దాని అమ్మకం వంటివి.
8- చట్టవిరుద్ధమైన దానికి వెనుక తలుపులు తీసుకొని వెళ్ళే దేనినైనా నిషేధించడం, అంటే ‘ఈనాహ్ అమ్మకం’ (బయ్ ఉల ఈనహ్ – ఒక వ్యక్తికి ఒక వస్తువు ను క్రెడిట్ మీద విక్రయించి, తరువాత అదే వస్తువును తక్కువ ధరకు నగదుకు తిరిగి కొనుగోలు చేయడం, ఇది వాస్తవానికి వడ్డీ (రిబా) రూపమే).66
9- అల్లాహ్ ఆరాధన నుండి దృష్టి మరల్చే ఏదైనా విషయం నిషేధించబడింది, ఉదాహరణకు శుక్రవారం రెండవ అదాన్ తర్వాత అమ్మకాలు మరియు కొనుగోలు చేయడం.
10- ముస్లింల మధ్య హాని కలిగించే లేదా శత్రుత్వాన్ని సృష్టించే ఏదైనా నిషిద్ధం, అంటే నిషేధించబడిన వస్తువులను కొనడం మరియు అమ్మడం మరియు కొనుగోలు వెనుక కొనుగోలు మరియు అమ్మకం వంటివి.
ముస్లింకు ఏదైనా సమస్య యొక్క హుకుం (ఆదేశం) సందేహంగా ఉన్నప్పుడు, అతను ఆ సమస్య గురించి పండితులను అడగాలి మరియు ఆ సమస్యలో షరియత్ ప్రకారం హుకుం తెలుసుకున్న తర్వాత మాత్రమే దానిపై ముందుకు వెళ్లాలి. అల్లాహ్ ప్రకటన:
﴿...فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِنْ كُنْتُمْ لَا تَعْلَمُونَ﴾
కావున మీకిది తెలియకుంటే హితబోధ గలవారిని (గ్రంథప్రజలను) అడగండి. [అన్ నహ్ల్ 16:43]
ఇంత వరకే సేకరించడం సులభమైనది. అల్లాహ్ మాకు ప్రయోజనకరమైన జ్ఞానాన్ని మరియు సత్కార్యాలను ప్రసాదించ మని వేడుకుంటున్నాము. నిశ్చయంగా ఆయన అమితంగా దాతృత్వం గలవాడు మరియు ఔదార్యుడు. అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై మరియు శుభాలను, శాంతిని, అనేక శుభాలను కలిగించుగాక.
***
విషయసూచిక
మొదటి అధ్యాయం: అఖీదా (విశ్వాసాల) సంబంధిత విషయాలు 3
మొదటి భాగము: ఇస్లాం యొక్క అర్థము మరియు దాని మూలస్థంభాలు: 3
ఏకేశ్వరోపాసన యొక్క ప్రాముఖ్యత: 3
"అల్లాహ్ తప్ప వేరొక నిజఆరాధ్యుడు లేడు" అని సాక్ష్యమివ్వటం యొక్క అర్థం: 5
లా ఇలాహ ఇల్లల్లాహ్ షరతులు: 6
ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం పలకటం యొక్క అర్థం: 8
రెండవ భాగము: ఈమాన్ యొక్క అర్థం మరియు దాని మూల స్థంభములు: 10
1) మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసము: 11
1- ఆయన రుబూబియత్ పై విశ్వాసం: 12
2- ఆయన ఉలూహియత్ పై విశ్వాసం: 14
3- దివ్యనామాలు మరియు గుణాల పై విశ్వాసం: 17
2) దైవదూతల పై విశ్వాసము: 26
3) దైవగ్రంథాల పై విశ్వాసము: 28
4) దైవప్రవక్తల పై విశ్వాసము: 29
5) అంతిమ దినము పై విశ్వాసము: 30
ఎ- మరణాంతరం లేపబడటం పై విశ్వాసం: 31
బి- లెక్కతీసుకోబడటంపై, ప్రతిఫలం ప్రసాదించబడటం పై విశ్వాసం: 31
సి- స్వర్గము మరియు నరకముల పై విశ్వాసం: 32
6) విధివ్రాత పై విశ్వాసము: 32
మూడవ భాగము: ఇహ్సాన్ 34
నాల్గవ భాగము: అహ్లు సున్నత్ వల్ జమాఅత్ యొక్క మూల సూత్రాల సంక్షిప్త పరిచయం: 35
రెండవ అధ్యాయం: ఆరాధనలకు సంబంధించిన విషయాలు 37
మొదటి భాగము: (తహారత్) పరిశుద్ధత: 37
మొదటిది: నీటి రకాలు: 37
రెండవది: మాలిన్యము 38
మూడవది: ముహదిథ్ (పవిత్రత లేని వ్యక్తి) చేయకూడని పనులు: 41
నాలుగవది: కాలకృత్య పద్దతులు: 44
ఐదవది: ఇస్తింజా మరియు ఇస్తిజ్మార్ యొక్క ఆదేశాలు: 45
ఆరవది: ఉదూ యొక్క నియమాలు: 46
ఏడవది: మేజోళ్ళపై మరియు పాదకూసములపై మసహ్ చేసే నియమాలు: 49
ఎనిమిదవది: తయమ్ముమ్ ఆదేశాలు: 52
తొమ్మిదవది: ఋతుస్రావము మరియు పురిటి రక్తము యొక్క ఆదేశాలు: 55
రెండవ భాగము: సలాహ్ (నమాజు): 57
మొదటిది: అదాన్ మరియు ఇఖామత్ ఆదేశాలు: 57
రెండవది: నమాజు స్థానం మరియు దాని ప్రాముఖ్యత: 62
మూడవది: నమాజు షరతులు 64
నాలుగవది: నమాజు యొక్క విధులు: 66
ఐదవది : నమాజులోని అనివార్య కార్యాలు (సున్నతులు) 72
ఆరవది: నమాజు యొక్క సున్నతులు 74
ఏడవది: నమాజు విధానం 77
ఎనిమిదవది: నమాజులో నిషిద్ధమైన విషయాలు: 85
తొమ్మిదవది: నమాజును భంగపరిచే విషయాలు: 85
పదోవది: సహూ సజ్దాలు: 86
పదకొండవది: నమాజు నిషిద్ధ వేళలు: 89
పన్నెండవది: సామూహిక నమాజు: 90
పదమూడవది: భయాందోళనల స్థితిలో నమాజు: 93
యుద్ధభూమిలో ఫర్ద్ నమాజు విధానము: 94
పద్నాలుగవది: జుమా నమాజు: 95
ఐదవది: జుమా రోజు సున్నతులు: 98
జుమా నమాజు పొందటం: 99
పదిహేనవది: తగిన కారణాలు కలిగిన వారి నమాజు: 100
పదహారవది: పండుగల నమాజు: 104
పదిహేడవది: గ్రహణం నమాజు: 107
పద్దెనిమదోవది: ఇస్తిస్ఖా నమాజు: 110
పంతొమ్మిదోవది: జనాజా ఆదేశాలు: 111
మూడవ భాగము: జకాత్: 116
1- జకాత్ నిర్వచనం మరియు దాని స్థానము: 116
2- జకాత్ విధి అవటం గురించి షరతులు: 117
3- జకాత్ విధి అయ్యే సంపదలు: 118
నాల్గవ భాగము: ఉపవాసము: 132
రమదాన్ ఉపవాసాల అనివార్యమవుటకు షరతులు: 133
ఐదవ భాగము: హజ్ మరియు ఉమ్రహ్ 143
హజ్ మరియు ఉమ్రా తప్పనిసరి అవటానికి షరతులు: 144
ఇహ్రామ్ సరిహద్దులు, సమయాలు: 146
ఇహ్రాం: 149
ఉమ్రహ్: 154
హజ్జ్: 159
మూడవ అధ్యాయం: వ్యవహారాలకు సంబంధించిన విషయాలు. 162
***
అహ్మద్ (6072), తిర్మిదీ (1535). తిర్మిదీ ప్రామాణికమైన హదీథు అన్నారు
దీనిని బుఖారీ అదబుల్ ముఫ్రద్ హదీథు 716లో, అహ్మద్ ముస్నద్ హదీథు 19606లో మరియు దియాఅల్ మక్దసీ అహదీసుల్ ముఖ్తార 1/150లో ఉల్లేఖించారు మరియు షేఖ్ అల్బానీ సహీహుల్ జామి ఉస్సగీర్ హదీథు సంఖ్య 3731లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
ముస్లిం హదీథు సంఖ్య (121), అహ్మద్ ముస్నద్ హదీథు సంఖ్య (10434).
(మదీ): ఇది రంగులేని పలుచని నీరు, ఇది ముద్దుపెట్టుకోవడం లేదా సంభోగం గురించి ఆలోచించడం లేదా దాని కోరిక లేదా చూడడం లేదా ఇతర సందర్భాలలో వెలువడుతుంది మరియు ఇది చుక్కల రూపంలో వెలువడుతుంది మరియు దాని వెలువడిన విషయం తెలియకపోవచ్చు. (వదీ): ఇది మలమూత్రం తర్వాత లేదా భారమైన వస్తువును మోసినప్పుడు వెలువడే చిక్కగా తెల్లటి నీరు.
దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య 224.
దీన్ని మాలిక్ మువత్తాలో హదీథు సంఖ్య (680 మరియు 219) మరియు దారమీ హదీథు సంఖ్య (312) మరియు అబ్దుర్ రజ్జాక్ తన ముసన్నఫ్ లో హదీథు సంఖ్య (1328) ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు ఇర్వాఉల్ గలీల్ లో హదీథు సంఖ్య (122) ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
దీనిని నసాయీ హదీథు సంఖ్య (12808), అహ్మద్ హదీథు సంఖ్య (15423) ఉల్లేఖించారు. మరియు షేఖ్ అల్బానీ దీనిని ఇర్వాఉల్ గలీల్ లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు (121).
దీన్ని ఇబ్నె మాజా హదీథు సంఖ్య (594), ఇబ్నె హిబ్బాన్ హదీథు సంఖ్య (799) ఉల్లేఖించారు. మరియు షేఖ్ అల్బానీ దీన్ని దయీఫ్ సునన్ తిర్మిజీ లో (146) బలహీనమైనదిగా తెలియపరచారు.
బుఖారీ హదీథు సంఖ్య:142 మరియు ముస్లిం హదీథు సంఖ్య:122.
బుఖారీ హదీథు సంఖ్య: 7288 మరియు ముస్లిం హదీథు సంఖ్య: 6066.
ఫదీలతుల్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ తన మజ్మూ ఫతావా (29/141) లో ఇలా అన్నారు: (బైహఖీ మంచి సనదు ద్వారా జాబిర్ నుండి తన వాక్యం తర్వాత «అల్లాహ్ వాగ్దానాన్ని నెరవేర్చుతాడు»: «నిశ్చయంగా నీవు వాగ్దానాన్ని విఫలపరచవు» అదనం చేశారు) .
దీనిని తిర్మిథీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (2635).
దీనిని ముస్లిం (82) ఉల్లేఖించారు.
దీనిని తిర్మిదీ హదీథు సంఖ్య (265) లో ఉల్లేఖించారు, మరియు హసన్ సహీహ్ గరీబ్ అని అన్నారు. షేఖ్ అల్బానీ సహీహ్ తర్గీబ్ లో దీనిని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.
దీనిని బుఖారీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (1117)
బుఖారీ (హదీథు సంఖ్య: 6251 మరియు ముస్లిం హదీథు సంఖ్య:884.
బుఖారీ హదీథు సంఖ్య:756 మరియు ముస్లిం హదీథు సంఖ్య:872.
బుఖారీ హదీథు సంఖ్య:793 మరియు ముస్లిం హదీథు సంఖ్య:398.
బుఖారీ హదీథు సంఖ్య: 812 మరియు ముస్లిం హదీథు సంఖ్య: 490.
దీనిని ముస్లిం (498) ఉల్లేఖించారు.
బుఖారీ హదీథు సంఖ్య: 724 మరియు ముస్లిం హదీథు సంఖ్య: 398.
దీన్ని బుఖారీ (797), ముస్లిం (402) ఉల్లేఖించారు.
దీనిని తిర్మిథీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (839).
దీనిని బుఖారీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (608).
దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 1110) నమోదు చేసినారు.
దీనిని బుఖారీ నమోదు చేసినారు, సంఖ్య (835)
బుఖారీ హదీథు సంఖ్య: 743 మరియు ముస్లిం హదీథు సంఖ్య: 399.
దీనిని తిర్మిథీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (266).
దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (588).
దీనిని అబూదావుద్ నమోదు చేసినారు, హదీథు సంఖ్య 5168.
దీనిని తిర్మిదీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (284).
దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య (1484).
బుఖారీ హదీథు సంఖ్య: 609 మరియు ముస్లిం హదీథు సంఖ్య: 602.
బుఖారీ హదీథు సంఖ్య:4130 మరియు ముస్లిం హదీథు సంఖ్య:842.
దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య (865).
బుఖారీ హదీథు సంఖ్య: 934 మరియు ముస్లిం హదీథు సంఖ్య: 851.
బుఖారీ హదీథు సంఖ్య: 1081 మరియు ముస్లిం హదీథు సంఖ్య: 693.
దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 1012) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 894) నమోదు చేసినారు.
దీనిని అబూదావూద్ హదీథు సంఖ్య (3201), తిర్మిదీ హదీథు సంఖ్య (1024) లో ఉల్లేఖించారు. మరియు తిర్మిదీ ప్రామాణికమైన, దృఢమైన హదీథు అన్నారు.
దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య (962).
అల్ బుఖారీ (హదీథు సంఖ్య:8) మరియు ముస్లిం (హదీథు సంఖ్య:111).
దీనిని ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (1792), మరియు తిర్మిదీ హదీథు సంఖ్య (63) మరియు (631) లో ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 1402) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 2287) నమోదు చేసినారు.
బుఖారీ హదీథు సంఖ్య: 1432 మరియు ముస్లిం హదీథు సంఖ్య: 984.
దీనిని అబూదావూద్ హదీథు సంఖ్య (1609), ఇబ్నె మాజహ్ హదీథు సంఖ్య (1827) ఉల్లేఖించారు మరియు అల్బానీ దీనిని సహీహ్ అబూ దావూద్ హదీథు సంఖ్య (1609) లో ప్రామాణికమైనదిగా తెలియ పరచారు.
బుఖారీ హదీథు సంఖ్య: 1 మరియు ముస్లిం హదీథు సంఖ్య: 1907.
బుఖారీ హదీథు సంఖ్య: 1810 మరియు ముస్లిం హదీథు సంఖ్య: 1086
దీనిని బుఖారీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (1909)
దీనిని అహ్మద్ హదీథు సంఖ్య (2457), అబూదావూద్ హదీథు సంఖ్య (2454), నసాయీ హదీథు సంఖ్య (2331) ఉల్లేఖించారు. పదాలు దానివి.
దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 6669) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 2709) నమోదు చేసినారు.
దీనిని అబూదావూద్ (2380), తిర్మిదీ (719), ఇబ్నె మాజహ్ (676) ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ (హదీథు సంఖ్య: 1849) మరియు ముస్లిం (హదీథు సంఖ్య: 1846) నమోదు చేసినారు.
దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య (1134).
అహ్మద్ (25198), నసాయీ (2627), ఇబ్న్ మాజహ్ (2901).
అల్ బుఖారీ (హదీథు: 1862) మరియు ముస్లిం (హదీథు: 1341).
దీనిని బుఖారీ నమోదు చేసినారు, హదీథు సంఖ్య (1531)
దీనిని ముస్లిం నమోదు చేసినారు, హదీథు సంఖ్య (1211).
దీనిని బుఖారీ, హదీథు సంఖ్య (1549) నమోదు చేసినారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీథు సంఖ్య (1218).
దీనిని తిర్మిదీ హదీథు సంఖ్య (487) లో ఉల్లేఖించారు, మరియు హసన్ గరీబ్ అని అన్నారు. షేఖ్ అల్బానీ దీనిని హసన్ అని తెలియపరచారు.
చూడండి: ముగ్నీయుల్-ముహ్తాజ్ (2/22).
హాషియ ఇబ్ను ఆబిదీన్ (1/42).
చూడండి: అల్ మజ్మూఅ్ (1/50).
షుఫా: ఇది భాగస్వామి తన భాగస్వామి వాటాను ఆర్థిక ప్రతిఫలంతో ఇతరులకు బదిలీ చేయడం ద్వారా పొందే హక్కు.
ఈనాహ్ అమ్మకం: ఒక వ్యక్తి తన వద్ద ఉన్న వస్తువును మరొకరికి క్రెడిట్ మీద విక్రయించి, ఆ వస్తువును అప్పగించి, తరువాత అదే వస్తువును ఆ క్రెడిట్ ధర కంటే తక్కువ ధరకు నగదుకు తిరిగి కొనుగోలు చేయడం.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు సంఖ్య (8)