رسول الإسلام محمد ﷺ (تلغو)

كتاب "رسول الإسلام محمد ﷺ" يستعرض حياة النبي محمد صلى الله عليه وسلم من نسبه ونشأته إلى زواجه المبارك وبداية الوحي وبدء رسالته الخاتمة، ويبيّن آيات نبوته وعلامات صدقه، ويشرح الشريعة التي جاء بها ودورها في حفظ حقوق الإنسان وكرامته، كما يبرز مواقف خصومه وشهاداتهم له، مع تسليط الضوء على أخلاقه الفاضلة التي جعلته قدوةً للناس وداعيةً لتوحيد الخالق.

  • earth భాష
    (تلغو)
  • earth రచన:

ఇతర అనువాదాలు 57

ur أردو- اردو ms ملايو- Melayu pt برتغالي- português tr تركي- Türkçe uz أوزبكي- Ўзбек sw سواحيلي- Kiswahili ar عربي- العربية fa فارسي- فارسي ka جورجي- ქართული tl فلبيني تجالوج- Tagalog gu غوجاراتية- ગુજરાતી zh صيني- 中文 kn كنادي- ಕನ್ನಡ ru روسي- Русский hi هندي- हिन्दी ha هوسا- Hausa en إنجليزي- English id إندونيسي- Indonesia bn بنغالي- বাংলা fr فرنسي- Français es إسباني- español th تايلندي- ไทย te تلغو- తెలుగు ce شيشاني- нохчийн мотт om أورومو- afaan oromoo dv ديفهي- ދިވެހި ml مليالم- മലയാളം ta تاميلي- தமிழ் am أمهري- አማርኛ bg بلغاري- български sl سلوفيني- slovenščina as آسامي- অসমীয়া az أذري- azərbaycanca snk سوننكي- Soninke kk كازاخي- қазақ тілі no نرويجي- Norwegian dyo جوالا- Jóola sv سويدي- svenska de ألماني- Deutsch ne نيبالي- नेपाली vi فيتنامي- Tiếng Việt mfe كريولي- créole ko كوري- 한국어 bs بوسني- bosanski da دنماركي- dansk pl بولندي- polski af أفريقاني- Afrikaans zu زولو- isiZulu tg طاجيكي- тоҷикӣ hy أرميني- Հայերէն cs تشيكي- čeština ki كيكويو- Gĩkũyũ lt ليتواني- lietuvių lv لاتفي- latviešu ro روماني- română hr كرواتي- hrvatski sn الشونا- Shona
PHPWord

 

 

 

رَسُولُ الإِسْلَامِ مُحَمَّدٌ ﷺ

 

ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం

 

 

 

 

 

 

 

اللَّجْنَةُ العِلْمِيَّةُ

بِرِئَاسَةِ الشُّؤُونِ الدِّينِيَّةِ بِالمَسْجِدِ الحَرَامِ وَالمَسْجِدِ النَّبَوِيِّ

 

మస్జిద్ అల్ హరామ్ మరియు మస్జిద్ అన్నబవలలోని ధార్మిక వ్యవహారాల విభాగానికి చెందిన శాస్త్రీయ కమిటీ

بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ

అనంత కరుణాప్రదా, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, ఇస్లాం యొక్క ప్రవక్త  ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఒక సంక్షిప్త వివరణ. ఇందులో నేను ఆయన పేరు, వంశం, స్వదేశం, వివాహం, ఆయన దైవదౌత్యం, ఆయన పిలుపు ిచ్చిన విషయం, ఆయన ప్రవక్తత్వ సూచనలు, ఆయన షరీ, ఆయన ప్రతిబంధకులు ఆయనను ఎలా చూశారో వివరించనున్నాను.

ఆయన

 

పేరు

,

 

వంశం

 

మరియు

 

జన్మస్థలం

.

ఇస్లాం యొక్క సందేశహరులుముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. వీరు ప్రవక్త ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం వంశానికి చెందినవారు.

ఎందుకంటే అల్లాహ్ యొక్క ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం షామ్ పట్టణం నుంచి మక్కాకు వచ్చారు. అప్పుడు ఆయనతో ఆయన భార్య హాజిరా మరియు కుమారుడు ఇస్మాయీల్ () కూడా ఉన్నారు. ఇస్మాయీలు () తన తల్లి ఒడిలో ఉన్నారు. ప్రవక్త ఇబ్రాహీం () దైవాజ్ఞతో వారిద్దరిని అక్కడే జీవనం సాగించడానికి వదిలి వెళ్లిపోయారు. పిదప కుమారుడు పెద్ద వాడయ్యా ప్రవక్త ఇబ్రాహీం () తిరిగి మక్కాకు వచ్చారు. తదుపరి తండ్రి కుమారులు ఇరువురు కలిసి పవిత్ర దైవగృహం అల్ కాబాను నిర్మించారు. ప్రజలు గృహానికి తండోప తండాలుగా రావడం జరిగింది. అది రబ్బిల్ ఆలమీన్ ను ఆరాధించే ఆరాధకులకు, హజ్జ్ యాత్రికులకు కేంద్రంగా మారింది మరియు శతాబ్దాలుగా ఇబ్రాహీం () యొక్క ధర్మానుసారంగా అల్లాహ్ ఏకేశ్వరోపాసనను, ఆరాధనను ప్రజలు కొనసాగించారు.

తరువాత మార్పు సంభవించింది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా అరేబియా ద్వీపకల్పం స్థితిగతులు కూడా మారి పోయాయి. అక్కడ బహుదైవారాధక వ్యవహారాలు బాహాటంగా జరగసాగాయి: విగ్రహాలను ఆరాధించడం, ఆడ పిల్లలను సమాధిచేయడం, ఆడవాళ్లపై అత్యాచారాలు, అబద్దపు ప్రమాణాలు, మద్యపానం, నగ్నత్వం, అనైతిక కార్యకలాపాలు, అనాధాల సొమ్మును ఆక్రమించడం, వడ్డీ కార్యకలాపాలు నిర్వర్తించడం మొదలైనవి సర్వసాధారణమయ్యాయి.

ఇలాంటి తరుణంలో క్రీ.. 571లో ఇస్లాం సందేశహరులు, ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం వంశస్థులైన ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ సల్లల్లాహు అలైహివ సల్లం ప్రాంతంలో జన్మించారు. ప్రవక్త పుట్టుకకు ముందే ఆయన తండ్రి మరణించారు, ఆరు సంవత్సరాల వయసులో తల్లి మరణించింది. అప్పుడు బాబాయి అబూ తాలిబ్ ఆయనను చేర దీసి, ఆయన ఆలనా పాలనా చూసుకున్నారు, ఆయన అనాధగా, పేదవాడిగా జీవితం సాగించారు, ఆయన స్వయంగా శ్రమించి చేతులారా కష్టపడి సంపాదించి తినేవారు.

 

సౌశీల్యవంతురాలు

,

 

గుణవంతురాలితో

 

శుభవివాహం

.

ఆయన ఇరవై ఐదు సంవత్సరాల వయసుకు చేరినప్పుడు మక్కాకు చెందిన గౌరవ ప్రద మహిళలలో ఒకరైన ఖువైలిద్ కూతురైన ఖదీజా రదియల్లాహు అన్హా ను వివాహమాడారు. ఆమె ద్వారా నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారుల సంతానం కలిగింది. కానీ శైశవ దశలోనే కుమారులు ఇద్దరూ మరణించారు. ఆయన తన భార్యతో, కుటుంబీకులతో సౌమ్యంగా మెలుగుతూ అశేషమైన ప్రేమాభిమానాలు కనబర్చేవారు. అందుకని సతీమణి ఖదీజా (ర) కూడా ఆయనను చాలా ప్రేమించేవారు బదులుగా ఆయన కూడా ఆమెపై అదే విధంగా ప్రేమను చూపించేవారు. ఆమె చనిపోయి సంవత్సరాలు గడిచిన ప్పటికి ఆమెను ఎన్నడూ మరిచిపోలేదు. ఆయన గొర్రె ిబాహ్ చేసినపుడు దానిని ఖదీజా () స్నేహితురాళ్లకు గౌరవార్ధం ఆమె మంచిని, ప్రేమను, ఆప్యాయతను కాపాడుతూ పంచేవారు

వహీ

 

(

దైవద్యోతకం

)

ఆరంభం

.

మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నతనం నుంచి అద్భుతమైన నైతికతను కలిగి ఉన్నారు. జాతి ప్రజలు ఆయననుసాదిఖుల్ అమీను అనే మారు పేరుతో పిలిచేవారు. గొప్ప గొప్ప కార్యక్రమాలలో ప్రజలతో పాల్గొనేవారు. కానీ వారు చేసే బహుదైవారాధక మిథ్యా వ్యవహారాలను అసహ్యించుకునేవారు, అందులో వారితో పాల్గొనేవారు కాదు.

మక్కా నగరంలో జీవిస్తూ నలభై సంవత్సరాల వయసుకు చేరాక అల్లాహ్ ఆయనను సందేశహరుడిగా ఎంచుకున్నాడు, అప్పుడు దైవదూత జిబ్రాయీల్ అలైహిస్సలాం ఖుర్ఆను యొక్క మొట్టమొదట అవతరించబడిన సూరా యొక్క మొదటి భాగమును ఆయన హృదయంపై అవతరింపచేశారు. అల్లాహ్ తఆలా పంపిన సందేశం:

﴿اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ 1 خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ 2 اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ3 الَّذِي عَلَّمَ بِالْقَلَمِ 4 عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ 5

పఠించు! నీ ప్రభువు పేరుతో, ఆయనే సృష్టించాడు!

ఆయన మానవుడిని రక్తపుముద్దతో సృష్టించాడు

చదువు మరియు నీ ప్రభువు పరమదాత.

ఆయనే కలము తో జ్ఞానభోదన చేశాడు.

ఆయన మానవుడికి తెలియని విషయాలను భోదించాడు

[సూరతుల్ అలఖ్: 1-5]

ఆయన వెంటనే తన సతీమణి ఖదీజా రదియల్లాహు అన్హా వద్దక వణుకుతున్నహృదయంతో వచ్చారు. ఆమెకు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పారు. ఆమె మీకు ఏమీకాదు అని భరోసాను కలిగించింది. వెంటనే ఆయనను తీసుకుని తన బాబాయి కుమారుడైన వరఖా బిన్ నౌఫెల్ వద్దకు వెళ్ళింది. అతను తౌరాతు, ఇంజీలు జ్ఞానం తెలిసినవారు. అతనితో ఖదీజా ఇలా అడిగింది: సహోదరా! నువ్వు కాస్త నీ సహోదరుడి కుమారుడు చెప్పే విషయాలను విను! అతను ప్రవక్తతో నా సోదర కుమార! నువ్వు ఏమి చూసావు? చెప్పు అని అడిగారు. ప్రవక్త అతనికి తనతో జరిగిన సంగతంతా వివరించారు. అప్పుడు వరఖా ఆయనతో ఇలా చెప్పారు:

అల్లాహ్ మూసా అలైహిస్సలాంపై అవతరింప చేసిన దూత యే ఇతను, బహుశా విషయమే మళ్ళీ ఒకసారి జరిగింది. నీ జాతి ప్రజలు నిన్ను బహిష్కరించినప్పుడు నేను ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను,అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:((వారు నన్ను బహిష్కరిస్తారా)) అతను అవును! నువ్వు తెచ్చిన సందేశాన్ని తెచ్చిన ప్రతీ ఒక్కరితో శతృత్వం చూపబడింది. ఒకవేళ నేను రోజు నీతో ఉన్నట్లైతే నీకు నేను పూర్తిగా సహాయం చేస్తాను అని చెప్పారు.

మక్కాలో ఆయనపై క్రమంగా ఖుర్ఆను అవతరించింది, జిబ్రీల్ అలైహిస్సలాం సర్వలోకాల ప్రభువు తరుపు నుంచి దానిని దైవద్యోతకానికి చెందిన వివరాలను తెచ్చినట్లు తీసుకుని ఆయన పై అవతరించేవారు.

ఆయన తన జాతి ప్రజలను నిర్విరామంగా ఇస్లాం వైపుకు ఆహ్వానించేవారు. కానీ, అతని జాతి ప్రజలు ఆయనను తిరస్కరించారు మరియు గొడవపడ్డారు. దైవదౌత్యకాన్ని, ప్రవక్త బాధ్యతను వదులు కోవడానికి బదులుగా ధనాన్ని, రాజ్యాన్ని ఆయనకు ఇవ్వజూపారు. కానీ ఆయన ప్రతీదీ తిరస్కరించారు. మునుపటి ప్రజలు, నాయకులు, సర్దారులు తమ ప్రవక్తలతో చెప్పినట్లుగానే వీరు కూడా ఆయన గురించి ఇలా అన్నారు: మాంత్రికుడు, అబద్దాలకోరు, కల్పిత ప్రచారకుడు మరియు వారంతా ఆయనను కష్టపెట్టారు. గౌరవప్రదమైన ఆయన శరీరాన్ని గాయపర్చారు మరియు ఆయన అనుయాయులను అనుచరులను హింసించారు.

అయితే మక్కాలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిర్విరామంగా ప్రజలను అల్లాహ్ ఏకత్వం వైపుకు ఆహ్వానించ సాగారు. హజ్జ్ సమయంలో మరియు అరబ్బుల్లో సమయాను కూలంగా జరిగే పెద్ద పెద్ద బజారుల్లో ప్రజలను కలిసి వారికి ఇస్లాం సందేశాన్ని ఇచ్చేవారు. క్రమంలో ఆయన ప్రపంచాన్ని ధనాన్ని ఆశించలేదు. అధికారాన్ని కోరు కోలేదు. ఖడ్గంతో బెదిరించనూ లేదు. ఆయనకు రాజ్యం లేదు. రాజు కూడా కాదు. తన తొలి ఆహ్వానంలోనే ఆయన తెచ్చిన మహోన్నత పవిత్ర ఖుర్ఆన గ్రంథాన్ని పోలినది తీసుకుని రావాలని ప్రజలతో సవాలు ప్రకటించాడు. ఆయన తన ప్రత్యర్ధులకు క్రమంగా సవాలును ప్రకటిస్తూ ఉండేవారు. పై గౌరవనీయ సహాబాలు అందరూ (రదియల్లాహు అన్హుమ్) ఆయనను విశ్వసించారు.

మరియు మక్కా నగరంలోనే అల్లాహ్ తఆలా ఆయనకు ఒక గొప్ప అద్భుతమైన కానుకతో సత్కరించాడు అదియే అల్ ఇస్రా‘. వల్ మేరాజ్ (మక్కా నుంచి బైతుల్ మఖ్దిస్ వరకు పిదప అక్కడి నుండి ఆకాశంలోకి) గగన యాత్ర చేశారు. అయితే అల్లాహ్, ఇల్యాస్ మరియు ఈసా అలైహిస్సలాంను ఇంతకు ముందు ఆకాశంలోకి ఎత్తుకున్నాడనే విషయం తెలుసు. ఇది ముస్లి మరియు క్రైస్తవుల వద్ద ప్రస్తావించబడి ఉంది.

అల్లాహ్ తఆలా నుండి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆకాశంలో నమాజు ఆదేశమును పొందారు. నమాజుయే నేడు ముస్లిలు ఐదు వేళల ఆచరిస్తున్నారు. అంతేకాదు మక్కాలోనే ఆయనకు మరొక గొప్ప అద్భుతం కూడా ప్రసాదించబడింది. అద ఇన్షిఖాకుల్ ఖమర్ (చంద్రుడిని రెండు ముక్కలుగా చేయడం) దీనిని బహుదైవారాధకులు కూడా ప్రత్యేక్షంగా వీక్షించారు.

ఖురైష్ యొక్క అవిశ్వాసులు సందేశ ప్రచారం నుండి ప్రవక్తను ఆపడానికి ప్రతీ మార్గాన్ని ఉపయోగించారు. ఆయనకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నారు. ఆయనను అసహ్యించు కునేలా చేశారు. దైవసూచనలు అడుగుతూ, మొండి వైఖరిని అవలంభించారు. ప్రజలను సందేశం నుండి ఆపడానికి, ఆయన తో వాదించడానికి ఆధారాలకోసం యూదుల సహాయం కోరారు.

ఇక ముస్లిములపై ఖురైష్ అవిశ్వాసుల హింసలు మితిమీరి హద్దుమీరినప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారిని అబీసీనియా(హబ్షా) వైపుకు హిజ్రతు (వలస) చేయడానికి అనుమతి ఇచ్చారు. అప్పుడు ప్రవక్త వారితో ఇలా అన్నారు: నిశ్చయంగా అక్కడ ఒక న్యాయశీలుడై రాజు పాలిస్తున్నాడు ఆయన వద్ద ఎవరు అన్యాయానికి గురి కారు. అతను ఒక క్రైస్తవ రాజు. పిమ్మట విశ్వాసుల్లో రెండు సముదాయాలు అబీసీనియా వైపుకు వలస వెళ్లాయి. ముహాజిర్లు వలస వెళ్ళి అక్కడికి చేరిన తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన దైవధర్మాన్ని హబ్షా రాజు నజాషీకు తెలియజేశారు. అతను ఇస్లాం స్వీకరించాడు మరియు ఇలా చెప్పాడు: అల్లాహ్ సాక్షిగా ఇది మరియు మూసా అలైహిస్సలాం తెచ్చిన సందేశ ఒకే దీపం నుండి వెలువడింది మరియు అతని జాతీయులు అతనికి మరియు అతని సహచరులకు హాని తలపెట్టారు.

మదీనా నుంచి ప్రత్యేక హజ్ నెలల్లో వచ్చినవారు ప్రవక్తను విశ్వసించారు మరియు ఇస్లాం పట్ల ప్రమాణం మరియు మదీనా (యస్రిబ్) కు వలస వచ్చినప్పుడు సహాయం అందిస్తామని వాగ్ధానం చేశారు. పై ప్రవక్త మక్కాలో మిగిలిన విశ్వాసులకు మదీనా నగరానికి హిజ్రత (వలస) వెళ్లడానికి అనుమతించారు. ప్రజలు మదీనా పట్టణానికి హిజ్రత చేసరు మరియు అక్కడ ఇస్లాం వ్యాపించింది. చివరికి పట్టణంలో ఒక్క ఇల్లు కూడా మిగలకుండా పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించారు.

విధంగా మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పదమూడు సంవత్సరాలు అల్లాహ్ ఆరాధన వైపు మక్కా ప్రజలను నిర్విరామంగా ఆహ్వానిస్తూ ధర్మప్రచారం చేసిన తరవాత మదీనా పట్టణానికి వలస వెళ్వలసిదిగా అల్లాహ్ తఆలా ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. పిదప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత చేశారు. అక్కడ అల్లాహ్ వైపుకు ఆహ్వానిస్తూ ఉండేవారు. తరవాత క్రమంగా ఒక్కొక్కటిగా ఇస్లామీయ చట్టాలు అవతరించసాగాయి మరియు దైవప్రవక్త దైవసందేశాన్ని తెగల నాయకులకు, రాజులకు దూతల ద్వారా పంపించి వారిని ఇస్లాం వైపు ఆహ్వానించసాగారు. ఆయన సందేశం పంపిన వారిలో ముఖ్యులు: రోమ్ రాజు, పర్షియ రాజు, ఈజిఫ్టు రాజు ... మొ.

ఒక సారి మదీనా పట్టణంలో సూర్యగ్రహణం ఏర్పడింది అది చూసి ప్రజలు ఆందోళన చెందారు. యాదృచ్ఛికంగా అదే రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమారుడైన ఇబ్రాహీం చని పోయారు. అప్పుడు ప్రజలు పరస్పరం ఇలా చెప్పుకున్నారు: సూర్యుడికి ఇబ్రాహీం మరణం వల్ల గ్రహణం పట్టింది. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఉపదేశించారు:

(إِنَّ الشَّمْسَ وَالْقَمَرَ لَا يَكْسِفَانِ لِمَوْتِ أَحَدٍ، وَلَا لِحَيَاتِهِ، وَلَكِنَّهُمَا مِنْ آيَاتِ اللهِ يُخَوِّفُ اللهُ بِهِمَا عِبَادَهُ).

(నిశ్చయంగా సూర్యచంద్రులు ఒకరి మరణం వల్లగాని లేక ఒకరి పుట్టుక వల్ల కానీ గ్రహణానికి గురికావు. అవి రెండు అల్లాహ్ సూచనలు. వాటి ద్వారా అల్లాహ్ తన దాసులను హెచ్చరిస్తాడు)1

ఒకవేళ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసత్యుడు అయి ఉంటే అబద్దం చెప్పి ప్రజలను భయపెట్టడంలో తొందర పడే వారు మరియు ఇలా చెప్పేవారు: నిశ్చయంగా సూర్యుడు నా కొడుకు మరణం వల్ల గ్రహణానికి గురయ్యాడు అలాంటప్పుడు నన్ను తిరస్కరించేవాడి పరిస్థితి ఏమిటి?

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రభువు సంపూర్ణ నైతికతతో, అందంగా మలిచాడు. అల్లాహ్ తన ప్రవక్త గురించి ఇలా వర్ణించాడు:

﴿وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ 4

(మరియు నిశ్చయంగా నువ్వు అత్యున్నతమైన నైతికతను కలిగియున్నావు) [సూరతుల్ ఖలం: 4]

అంతేకాదు ఆయన ప్రతీ ఉత్తమ నడవడికను తనలో ఇముడ్చుకుని ఉన్నారు: సత్యం, చిత్తశుద్ది, ధైర్యం, న్యాయం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అది శత్రువుల తోనైనా సరే, ఔదార్యం మరియు పేదలకు, అగత్యపరులకు, వితంతువులకు, క్కరగలవారికి దానం చేయడానికి ఇష్టపడేవారు. ప్రజల మార్గదర్శకత్వం పట్ల ఆసక్తి కనబర్చేవారు. దయజాలి, ణుకువ ప్రదర్శించేవారు, ఒక అపరిచితుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వెతుకుతూ వచ్చాడు. ఆయన సహచరులతో (రదియల్లాహు అన్హుమ్) ప్రవక్త గురించి అడుగుతూ అక్కడే ఉన్న ప్రవక్తను గుర్తించలేకమీలో ముహమ్మద్ అంటే ఎవరు? అని అడిగాడు.

మరియు ప్రవక్త యొక్క జీవితచరిత్ర ప్రతీ ఒక్కరితోఅది మిత్రుడు - శత్రువు, దగ్గర - దూరం, పెద్ద - చిన్న, ఆడ - మగ, పశు పక్షాదులతో సైతం వ్యవహారాలలో పరిపూర్ణతకు మరియు నిజాయితీకి మారుపేరుగా ఉండింది.

అల్లాహ్ తఆలా ధర్మాన్ని సంపూర్ణ పరిచాడు. ప్రవక్త సందేశాన్ని పూర్తిగా ప్రచారం చేశారు. 63 సంవత్సరాల వయసు లో మరణించారు. అందులో దైవదౌత్యానికి 40 సంవత్సరాలు ముందు జీవితం మరియు 23 సంవత్సరాలు దైవప్రవక్త మరియు సందేశహరులుగా జీవించారు.

ప్రవక్త పట్టణమైన మదీనాలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ను సమాధి చేయడం జరిగింది. ఆయన ఎలాంటి ఆస్తి పాస్తులు సంపదను వారసత్వంగా వదలలేదు. ఆయన స్వారీ చేసే ఒక తెల్లని గాడిద మరియు భూమి ఉంటే దానిని ప్రయాణికుల కోసం దానం చేశారు2.

ఆయన ద్వారా ఇస్లాం స్వీకరించినవారు, విధేయత చూపిన వారు, అనుసరించిన వారు అనేక సంఖ్యలో ఉన్నారు మరియు హజ్జతుల్ విదా సందర్భంలో ఆయనతో పాటు లక్షకు పైగా సహచరులు హజ్జ్ కార్యాన్ని ఆచరించారు. ఇది ప్రవక్త మరణానికి సుమారుగా మూడు నెలల ముందు జరిగింది. బహుశా ధర్మ పరిరక్షణ కోసం మరియు దాని ప్రచార వ్యాప్తికై ఇందులో మర్మం దాగి ఉంది మరియు ఇస్లామీయ విలువలు, సూత్రాలతో పెరిగిన తన అనుచరులు న్యాయంగా, దైవభక్తి, భయంతో, విధేయతతో, వారు విశ్వసించిన గొప్ప ధర్మాన్ని ఆచరిస్తూ అత్యుత్తమ సహాబాలుగా అంకితభావాన్ని చూపారు.

మరియు దైవప్రవక్త యొక్క సహచరులంతా విశ్వాసం, జ్ఞానం, ఆచరణ, చిత్తశుద్ధి, స్వీకరణ, దానం, ధైర్యం, ఔదార్యం పరంగా మహాగొప్పవారు: అందులో అబూబకర్ సిద్దీఖ్, ఉమర్ బిన్ ఖత్తాబ్, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, అలీ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హుమ్ ముఖ్యులు. వీరు ప్రథమంగా ఇస్లాంను విశ్వసించి ప్రవక్తను సత్యమని నమ్మారు. తరువాత వీరు ఇస్లాం ధర్మ జెండాను పట్టుకుని నడిపించే ఖలీఫాలుగా నియమితులు అయ్యారు. వీరికి ప్రవక్తతలో గానీ, దైవదౌత్యంలో గానీ ఎలాంటి భాగం లేదు మరియు ఇతర సహచరులను (రదియల్లాహు అన్హుమ్) మినహాయించి ప్రత్యేకపరిచే ఎలాంటి ప్రాముఖ్యత వీరికి నొసగలేదు.

అల్లాహ్ తఆలా తన ప్రవక్తకు ఇచ్చిన పవిత్ర గ్రంథాన్ని, సాంప్రదాయాన్ని, ఆయన జీవిత చరిత్రను, వచనాలను, ఆచరణలను ఆయన మాట్లాడిన భాషలోనే సంరక్షించాడు. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను సంరక్షించినట్లుగా చరిత్రలో మరే జీవిత చరిత్ర కూడా సంరక్షించబడి భద్రపర్చబడలేదు. అంతేకాదు దైవప్రవక్త ఎలా నిద్రించేవారు, ఎలా తినేవారు, ఎలా త్రాగేవారు, ఎలా నవ్వేవారు అనే చిన్న చిన్న విషయాలు కూడా సంరక్షించబడ్డాయి.

దైవప్రవక్త తన కుటుంబికులతో ఇంట్లో ఎలా వ్యవహరిస్తారు? అనే విషయాలు కూడా సంరక్షించబడ్డాయి.

ఆయన యొక్క పరిపూర్ణ స్థితిగతులు తన జీవిత చరిత్రలో భద్రంగా పొందు పర్చ బడ్డాయి. ఆయన ఒక మానవుడు, సందేశహరుడు మాత్రమే. దైవత్వానికి చెందిన ఎటువంటి లక్షణాలు ఆయనలో లేవు. ఆయన తన స్వయానికి లాభాన్ని గానీ నష్టాన్ని గానీ చేకూర్చుకునే శక్తి కూడా లేనివారు.

ఆయన

 

దైవదౌత్యం

భూమండలం నలువైపుల బహుదైవారాధన, అవిశ్వాసం, అజ్ఞానం, వ్యాపించిన తరవాత అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రభవింపచేశాడు. అప్పుడు భూ ప్రపంచంలో కొంతమంది గ్రంథావహుల తప్ప ఇతరులను సాటి కల్పించ కుండా అల్లాహ్ ఆరాధించేవారు ఉండేవారు కాదు. అప్పుడు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లంను ప్రవక్తల్లో, సందేశహరుల్లో చిట్టచివరి ప్రవక్తగా చేసి పంపించాడు. అల్లాహ్ సమస్త లోకాల కోసం మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని పంపించాడు తద్వారా దీనిని మతాలన్నింటిపై స్పష్టపర్చడానికి మరియు ప్రజలను విగ్రహారాధన, బహు దైవారాధన, అవిశ్వాసం, అంధకారాల నుంచి తొలగించి తౌహీదు, ఈమాను యొక్క కాంతి వైపుకు మార్గదర్శనం చేయడానికి మరియు ఆయన యొక్క ప్రవక్తత మునుపటి దైవప్రవక్తల (అలైహిస్సలాం) దైవదౌత్యాన్ని సంపూర్ణం చేస్తుంది.

మరియు గత ప్రవక్తలు, సందేశహరులు ఇచ్చిన ప్రతీ సందేశం వైపుకు ఆయన ఆహ్వానించారు: నూహ్, ఇబ్రాహీం, మూసా, సులైమాన్, దావూద్, ఈసా అలైహిస్సలాం తదితరులు. ఈమానుకు చెందిన ఒక విషయం అల్లాహ్యే ప్రభువు, ఆయనే సృష్టికర్త, ఆహార ప్రదా, జీవం పోసేవాడు, జీవం తీసేవాడు, విశ్వసామ్రాజ్యాధినేత, ఆయనే వ్యవహారాలను ప్రణాళికరించువాడు, ఆయన దయామయుడు కృపాశీలుడు, నిశ్చయంగా విశ్వంలో మనం చూస్తున్నది చూడనిది ప్రతీది అల్లాహ్ యే సృష్టిస్తున్నాడు మరియు అల్లాహ్ తప్ప మిగలిన దంతా ఆయన యొక్క సృష్టియే!

కేవలం ఏకైకుడైన అల్లాహ్ ఆరాధన చేయాలని మరియు ఆయన తప్ప మిగతా మిథ్యాల ఆరాధనను వదలమని పిలుపు నిచ్చారు. యదార్థంగా తన ఆరాధనలో లేక సామ్రాజ్యంలో లేక సృష్టిలో లేక వ్యవహార ప్రణాళికల్లో అల్లాహ్ ఏకైకుడు ఆయనకు ఇతరులెవ్వరు సాటి లేరని వివరించారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరిని కనలేదు మరియు ఆయన ఎవరికి పుట్టలేదు మరియు ఆయనకు సరి సమానమైనది, పోలినది ఏదీ లేదు. ఆయన తన సృష్టిలోని జీవిలో లీనమవ్వడు మరియు వారి రూపంలో ఎన్నటికీ మూర్తీభవించడు.

మునుపటి దైవగ్రంథాల పట్ల కూడా అంటే ఇబ్రాహీం మరియు మూసా అలైహిస్సలాం యొక్క పత్రాలు, తౌరాతు, జబూరు, ఇంజీలు పట్ల ఎలాగైతే దైవప్రవక్తలందరిని విశ్వసించాలని పిలుపు నిచ్చారో అలాగే వీటిని విశ్వసించాలని ప్రజలను ఆహ్వానించారు. ఇందులో ఒక్క ప్రవక్తను ధిక్కరించినా అతను సమస్త ప్రవక్తలను ధిక్కరించినట్లుగా భావించబడతాడు.

ప్రవక్త ప్రజలకు అల్లాహ్ యొక్క దయ, కరుణ శుభవార్తను అందించారు. నిశ్చయంగా అల్లాహ్ యే వారికి ప్రపంచంలో సరిపోతాడు, ఆయనే ప్రభువు దయామయుడు, ఆయన ఒక్కడే పరలోక దినాన ప్రజలందరిని సమాధుల నుండి తిరిగి లేపిన తర్వాత లెక్క తీసుకుంటాడు, ఆయనే విశ్వసించిన మూమిన్లకు వారి సత్కార్యాలకు ప్రతిఫలంగా పది వంతుల పుణ్యాన్ని మరియు పాపానికి బదులుగా ఒక పాపాన్ని మాత్రమే లెక్కి స్తాడు, వారి కోసం పరలోకంలో శాశ్వత అనుగ్రహాలు సిద్దంగా ఉన్నాయి. ఎవరైతే అల్లాహ్ను ధిక్కరించి పాపకార్యాలు ఒడిగడతాడో ఇహపరలోకాల్లో తగ్గ ప్రతిఫలాన్ని పొందుతాడు.

మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం తన దైవదౌత్యంలో తన తెగకు గానీ, పట్టణానికి గానీ, తన స్వయానికి గానీ ఎటువంటి ప్రత్యేక గౌరవాన్ని ఒసగలేదు, బదులుగా పవిత్ర ఖుర్ఆను గ్రంథంలో దైవప్రవక్తల పేర్లు - నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా అలైహిస్సలాం యొక్క పేర్లు తన పేరు కన్నా ఎక్కువ సార్లు ప్రస్తావించబడ్డాయి. ఆయన తల్లి పేరు గానీ, భార్యల పేర్లు గానీ ఖుర్ఆనులో ప్రస్తావించబడలేదు. బదులుగా ఖుర్ఆనులో మూసా అలైహిస్సలాం తల్లి ప్రస్తావన చాలా సార్లు వచ్చింది మరియు మర్యం అలైహిస్సలాం పేరు ముప్పై ఐదు సార్లు ప్రస్తావించబడింది.

మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం షరీఅతు చట్టం, బుద్ది, ఫిత్రతుకు విరుద్దమైన లేక నైతికతకు విరుద్దమైన ప్రతీ విషయం నుండి (మాసూమ్) దూరంగా, స్వచ్ఛంగా ఉండేవారు. ఎందుకంటే దైవప్రవక్తలు అల్లాహ్ ఆదేశాలను సందేశాలను ప్రచారం చేయడంలో స్వచ్ఛంగా ఉంటారు. కాబట్టి అల్లాహ్ వారికి ధర్మ ప్రచార బాధ్యతను విధిగా అప్పగించాడు. తన ఆరాధన చేయమని వారికి ఆజ్ఞాపించాడు. దైవప్రవక్తలకు మరియు సందేశహరులకు (రుబూబియ్యతు) పోషకత్వంలో కానీ (ఉలూహియ్యతు) దైవత్వం యొక్క లక్షణాలలో కానీ ఎటువంటి లక్షణం లేదు. వారు మిగతా మనుషుల వలె కేవలం మానవులు మాత్రమే కానీ అల్లాహ్ వారికి దైవవాణి ద్వారా తన సందేశాలను పంపిస్తాడు.

మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యానికి గల సాక్ష్యాలలో అతి గొప్పది అల్లాహ్ తరపున వచ్చిన దైవవాణి (వహీ). ఇది దైవప్రవక్త జీవితంలో విధంగా ఉండేదో రోజు వరకు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. దీనిని ఒక బిలియనుకు పైగా ముస్లిములు అనుసరిస్తున్నారు. షరీఅతుకు చెందిన నమాజు, జకాతు, ఉపవాసం, హజ్జ్ లాంటి తదితర వాజిబు విధులను ఎలాంటి మార్పు లేకుండా వక్రీకరించకుండా అమలుచేస్తున్నారు.

దైవదౌత్య

 

సూచనలు

,

 

సంకేతాలు

 

&

 

సాక్ష్యాధారాలు

అల్లాహ్ తఆలా ప్రవక్తలకు దైవదౌత్య నిరూపణకై మరియు వాటిని దైవదౌత్యానికి ఆధారాలుగా, సాక్ష్యాలుగా, ప్రమాణాలుగా నిలబెట్టడానికి తన అద్భుత సూచనల ద్వారా మద్దతు తెలిపాడు. అల్లాహ్ ప్రతీ ప్రవక్తకు వారికి సరిపోయే విధంగా అద్భుతాలను ఒసిగాడు, దైవప్రవక్తలకు ఇవ్వబడిన అద్భుతాలలో మహా గొప్పది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం కు ఇవ్వబడింది నిశ్చయంగా అల్లాహ్ పవిత్ర ఖుర్ఆను గ్రంథాన్ని అనుగ్రహించాడు. ప్రవక్తలకు ఇవ్వబడిన అద్భుతాలలో ప్రళయం వరకు మిగిలి ఉండే అద్భుతం. అల్లాహ్ ప్రవక్తకు ఇతర గొప్ప అద్భుతాల ద్వారా కూడా సహాయాన్ని మద్దతును తెలిపాడు. మహనీయ ప్రవక్తకు అనేక అద్భుతాలు ఇవ్వబడ్డాయి అందులో కొన్ని ఇవి:

మేరాజ్ గగన యాత్ర(అల్ ఇస్రా వల్ మేరాజ్), చంద్రుడిని రెండు ముక్కలు చేయడం, కరువు సమయాల్లో ప్రజల నీటి అవసరం తీర్చడానికి వర్షం కోసం వివిధ సంధర్భాల్లో దుఆ చేసినప్పుడు వర్షం ురవడం.

ఆహారం మరియు తక్కువ నీరు చాలా ఎక్కువగా పెరగటం, అప్పుడు అనేక మంది దాని ద్వారా భోజనం చేయడం లేదా త్రాగడం సంభవించింది.

మరియు ఎవరిక వివరాలు తెలియని గతకాలపు అగోచర విషయాల గురించి చెప్పడం అంటే అల్లాహ్ తఆల గడిచిన దైవప్రవక్తల జీవిత కోణాలను మరియు వారి జాతీయుల వృత్తాంతాలను గురించి మరియు (అస్హాబుల్ కహఫ్’) గుహవాసులకు చెందిన అగోచరగాధను తెలియజేశాడు.

మరియు అలాగే ప్రవక్తకు భవిష్యత్తులో జరగబోయే కొన్ని అగోచర విషయాలను కూడా అల్లాహ్ తెలియజేశాడు. అవి -హిజాజ్ నుండి అగ్ని లేస్తుంది. దానిని షామ్ పట్టణంలో ఉన్నవారు చూస్తారు. మరియు ప్రజలు ఎత్తైన భవనాలు కట్టడంలో పోటీపడతారు.

ప్రజల కీడు నుండి ఆయనకు అల్లాహ్ సహాయం మరియు రక్షణ ఉండేది.

మరియు ఆయన తన సహచరులకు చేసిన వాగ్ధానాలు నిజమయ్యాయి.

(لَتُفْتَحَنَّ عَلَيْكُمْ فَارِسُ وَالرُّومُ، وَلَتُنْفَقَنَّ كُنُوزَهُمَا فِي سَبِيلِ اللَّهِ)

అతి త్వరలో ఫారస్ మరియు రూమ్ పై మీకు విజయం చేకూర్చబడుతుంది. మరియు వాటి ఖజానాలు దైవమార్గంలో మీరు ఖర్చు చేస్తారు.

అల్లాహ్ ఆయనకు దైవదూతల ద్వారా మద్దతు తెలిపాడు.

మరియు దైవప్రవక్తలు (అలైహిస్సలాం) తమ జాతి ప్రజలకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్య శుభవార్తను అందించారు. ఆయన గురించి శుభవార్త నందించిన వారిలో ఇస్రాయీలీ వంశీయులైన మూసా, దావూదు, సులైమాన్, ఈసా అలైహిస్సలాం మొదలగు ప్రవక్తలు ఉన్నారు.

సరైన బుద్ది అంగీకరించే హేతుబద్ధమైన సాక్ష్యాలు మరియు ఉదాహరణలు3:

మరియు ఇలాంటి అద్భుతాలు సూచనలు, రుజువులు, తార్కిక ఉదాహరణలు, పవిత్ర ఖుర్ఆను మరియు ప్రవక్త సున్నతులో వ్యాపించి ఉన్నాయి. మరియు మీరు లెక్కపెట్టలేని అపరిమితమైన సూచనలు ఉన్నాయి. వాటి గురించి తెలుసు కోవాలనుకునేవారు పవిత్ర ఖుర్ఆను గ్రంథాన్ని మరియు సున్నతు పుస్తకాలను, దైవప్రవక్త జీవిత చరిత్ర (సీరతు) పుస్తకాలను ధ్యయనం చేయాలి. ఇందులో విషయాలకు సంబంధించిన నమ్మకమైన, ఖచ్చితమైన సమాచారం ఉంది.

గొప్ప సూచనలు అద్భుతాలు ఒకవేళ జరగకపోయి ఉంటే అరబ్బు దేశంలో ఆయనకు శత్రువులైన ఖురైష్ అవిశ్వాసులు, యూదులు, క్రైస్తవులు ఆయనను ధిక్కరించే వారు మరియు ప్రజలను ఆయన నుండి చెదరగొట్టి హెచ్చరించేవారు.

అల్లాహ్ తఆలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం వైపుకు వహీ ద్వారా ఖుర్ఆను కరీమ్ ను పంపించాడు. ఇది సమస్త లోకాలకు ప్రభువు వాక్కు. అల్లాహ్ మనుషులకు జిన్నాతులకు ఇలాంటి గ్రంథాన్ని లేదా ఇందులోని ఒక సూరాను, రచించమని సవాలు (ఛాలెంజ్) చేశాడు. సవాలు రోజు వరకు అలాగే ఉంది. ఖుర్ఆను కరీమ్ ఎన్నో అతిముఖ్యమైన ప్రశ్నలకు జవాబు ఇస్తుంది. మిలియన్ల మందిని ఇది అబ్బురపరుస్తుంది. అరబీ భాషలో ఖుర్ఆను కరీమ్ అవతరించినదో, అది అలాగే రోజు వరకు అదే భాషలో ఒక్క అక్షరం పొల్లుపోకుండా భద్రంగా ఉంది. మరియు ఇది ప్రచురితమై వ్యాపించింది. ఇది ఒక గొప్ప అద్భుతమైన పవిత్ర గ్రంథం. ఇది ప్రజలకు లభించిన మహా గొప్ప దివ్యగ్రంథం. ఇది పారాయణం చేయబడుతుంది లేదా అనువాద భావార్థం చదువబడుతుంది. ఎవరైతే దీనిని చదివే భాగ్యాన్ని మరియు విశ్వసించే భాగ్యాన్ని నోచుకోలేకపోతాడో నిశ్చయంగా అతను పరిపూర్ణ మేలును, మంచిని కోల్పోయాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం మరియు ఆయన సీరతు (జీవిత చరిత్ర) భద్ర పర్చబడినది, విశ్వసనీయ ఉల్లేఖకు శ్రేణి ద్వారా లిఖించ బడింది మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం మాట్లాడిన అరబీభాషలో ఇది ప్రచురించబడింది, బహుశా ఆయన మన మధ్య జీవిస్తున్నట్లుగా ఉంది మరియు అనేక భాషల్లో అనువాదం జరిగింది. పవిత్ర ఖుర్ఆన గ్రంథం మరియు ప్రవక్త సున్నతులు ఇవి రెండు ఇస్లామీయ షరీఅతుకు (చట్టాలకు) మరియు ఆదేశాల కొరకు గల ముఖ్య మూలాలు.

మహనీయ

 

దైవప్రవక్త

 

ముహమ్మద్

 

సల్లల్లాహు

 

అలైహి

 

వసల్లం

 

తెచ్చిన

 

షరీఅతు

 

చట్టం

.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన షరీఅతు చట్టమేఇస్లామీయ షరీఅతు శాసనాలు. ఇది దైవిక శాసనాలను మరియు దైవదౌత్యాలను ముగించింది. ఇది పూర్వ ప్రవక్తల చట్టాలకు, శాసనాలకు భిన్నంగా ఉన్నప్పటికీ, మూలవిషయాల్లో మాత్రం ఇది సమానంగా ఉంటుంది.

ఇది పరిపూర్ణమైన చట్టం. అంతే కాదు ప్రతీ కాలానికి, ప్రతీ సమయానికి తగ్గట్టుగా ఉంటుంది, ఇందులో ప్రజల ధార్మిక, ప్రాపంచిక విషయాల కొరకు సంస్కరణలు, శుభాలు ఉన్నాయి. అల్లాహ్ దాసులు తప్పనిసరిగా ఆచరించవలసిన ఆరాధనలు నమాజు, జకాతు తదితర విషయాలు ఇందులో నిక్షిప్త పర్చ బడ్డాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సైనిక మరియు పర్యావరణానికి చెందిన హలాలు - హరాము వ్యవహారాలు, లావాదేవీలు మరియు ప్రజల జీవితానికి మరియు వారి భవిష్యత్తుకు అవసరమైన ఇతర విషయాలను తెలియపరిచింది.

షరీఅతు ప్రజల ధర్మాలను, ప్రాణాలను, గౌరవాన్ని, సంపదను, బుద్దిని మరియు సంతానాన్ని వంశాన్ని రక్షిస్తుంది. మరియు ఇది అత్యుత్తమ నైతికతను, మంచి లక్షణాలను ప్రస్తావించింది మరియు చెడు లక్షణాల, అనైతికత విషయాల నుండి హెచ్చరించింది. ఇది మానవ గౌరవం, మితవాదం, న్యాయం, చిత్తశుద్ధి, పరిశుభ్రత, సామర్ద్య పరిపూర్ణత, ప్రేమ, ప్రజల మంచి కోసం తాపత్రయపడటం, రక్తపాత నిషేధం, దేశాల భద్రత వైపుకు పిలుపునిచ్చింది మరియు ప్రజలను బెదిరించడం వారిని అన్యాయంగా భయపెట్టడం వంటివి నిషేధించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం దౌర్జన్యానికి, అన్యాయానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారు మరియు మూడ నమ్మకాలను, బ్రహ్మచర్యాన్ని, సన్యాసత్వాన్ని ఖండించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేశారు - నిశ్చయంగా అల్లాహ్ మానవుడికి స్త్రీ పురుషులకు గౌరవం ప్రసాదించాడు, మరియు వారి హక్కులను పరిరక్షించే బాధ్యత.

మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన షరీఅతు మనిషి బుద్దిని పరిరక్షించడానికి, దానికి హాని కలిగించే ప్రతీ హానికారకాన్ని నిషేదించడానికి వచ్చింది అంటే మద్యపానం వంటివి. మరియు ధర్మం అంటే మనసు, బుద్దిని ప్రకాశింపజేసే కాంతిగా ఇస్లాం భావించింది. తద్వారా మానవుడు తన ప్రభువును అంతర్దృష్టి మరియు జ్ఞానంతో ఆరాధిస్తాడు. ఇస్లామీయ షరీఅతు మెదడుకు, బుద్దికి గొప్పస్థానాన్ని కల్పించింది. దానిని జవాబుదారీతనానికి, బాధ్యతకు ముఖ్యకారణంగా నిర్దేశించింది మరియు మూఢ నమ్మకాల, మిథ్యాదైవాల సంకెళ్ళ నుండి విముక్తి చేసింది.

ఇస్లామీయ షరీఅతు ప్రామాణిక విజ్ఞాన శాస్త్రాన్ని కీర్తిస్తుంది మరియు మనోవాంఛలకు అతీతంగా ఉన్న శాస్త్రీయ పరిశోధన లను ప్రోత్సహిస్తుంది. మనిషిలో మరియు విశ్వంలో దీర్ఘాలోచన చేయాలని పరిశోధనలు జరపమని పిలుపు నిస్తుంది. విజ్ఞానశాస్త్రం యొక్క సరైన ఫలితాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన షరీఅతుకు విరుద్ధంగా ఉండదు.

మరియు ఒక లింగానికి వ్యక్తుల యొక్క నిర్దిష్ట లింగానికి ఇస్లామీయ షరీఅతులో ఎటువంటి వివక్ష లేదు మరియు ఒక జాతికి మరొక జాతిపై ప్రాధాన్యత లేదు. బదులుగా షరీఅతు ఆదేశాల, తీర్పుల ముందు అందరూ సమానంగా ఉంటారు. ఎందుకంటే వాస్తవానికి ప్రజలందరి మూలం సమానం. దైవభీతి ఆధారంగా తప్ప ఒకరిపై మరొకరికి గానీ లేదా ఒక జాతికి మరొక జాతిపై గానీ ఎలాంటి ప్రాధాన్యత లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తెలిపారు: ప్రతీ శిశువు తన సహజ స్వభావం పై జన్మిస్తాడు. మానవుల్లో వ్యక్తి పాపిగా కానీ లేదా ఇతరుల పాపాలకు వారసత్వ పాపం పొంది జన్మించడు.

ఇస్లామీయ షరీఅతులో అల్లాహ్ తఆలా తౌబాను ధర్మబద్ధంగా చేశాడు అంటే మనిషి తన ప్రభువు వైపుకు మరలడం మరియు తప్పులను పాపాలను వదలడం. ఇస్లాం మునుపటి పాపాలను పూర్తిగా ప్రక్షాలిస్తుంది. అలాగే తౌబా కూడా మునుపటి పాపాలను పూర్తిగా తొలగిస్తుంది. ఒక వ్యక్తి ఎదుట మనిషి తప్పులను ఒప్పుకోవలిసిన అవసరం లేదు మరియు ఇస్లాంలో మనిషికి మరియు అల్లాహ్ కు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది మీకు మరియు అల్లాహ్కు మధ్యలో మధ్యవర్తి అవసరం లేదు. ఇస్లాం ఒక మనిషిని దైవంగా చేసుకోవడాన్ని లేదా అల్లాహ్ పోషకత్వంలో, దైవత్వంలో ఇతరులకు సాటి కల్పించడాన్ని పూర్తిగా ఖండిస్తుంది.

మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం తెచ్చిన షరీఅతు శాసనం మునుపటి శాసనాలను, షరీఅతును చట్టాలను రద్దుపరుస్తుంది. ఎందుకంటే మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన ఇస్లాం షరీఅతు అల్లాహ్ వద్ద నుండి వచ్చింది. ఇది ప్రళయం వరకు ఉండే అంతిమ షరీఅతు శాసనం. ఇది సమస్త లోకాల కోసం వచ్చింది. అంచేత మునుపటి శాసనాలను, రీఅతును రద్దు చేసింది. ఇలా పూర్వం మునుపటి శాసనాలు కూడా పరస్పరం రద్దుపర్చుకున్నాయి. అల్లాహ్ ఇస్లాం షరీఅతును తప్ప మరే ఇతర షరీఅతును ఆమోదించడు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన ఇస్లాం ధర్మాన్ని తప్ప మరొక ధర్మాన్ని ఆమోదించడు. ఇస్లాం ధర్మం మినహా ఇతర ధర్మాన్ని ఆచరించినవాడి ధర్మం స్వీకరించ బడదు మరియు ఇస్లాం కాకుండా వేరే మతాన్ని ఎవరు స్వీకరిస్తారో, అది అతని నుండి అంగీకరించబడదు. ఎవరైతే షరీఅతుకు సంబంధించిన ఆదేశాల వివరాలను తెలుసు కోవాలని అనుకుంటున్నారో, అతను ఇస్లాంను పరిచయం చేసే పుస్తకాలలో నుండి ప్రామాణికమైన పుస్తకాలను చదవాలి.

మునుపటి దైవిక దైవదౌత్యాలకు గల లక్ష్యం మాదిరిగా ఇస్లామీయ షరీఅతు లక్ష్యం కూడా స్వచ్చమైన, న్యాయమైన ధర్మాన్ని మనిషికి అందజేయడం. తద్వారా అతను సమస్త లోకాల ప్రభువైన అల్లాహ్కు చిత్తశుద్ది గల దాసుడిగా మార గలడు మరియు మనిషుల, వస్తువుల లేదా మూఢనమ్మకాల బానిసత్వం నుండి అతన్ని విముక్తి చేయడం.

నిశ్చయంగా ఇస్లాం షరీఅతు ప్రతీ కాలానికి ప్రతీ సమయానికి అనుగుణంగా వర్తిస్తుంది. ఇందులో మనిషికి అవసరమయ్యే వాస్తవ ప్రయోజనాలకు విరుద్దమైన భంగకాలు లేవు. ఎందుకంటే ఇది మనిషి అక్కరలు అవసరాలు తెలిసిన ప్రభువు అయిన అల్లాహ్ తరపు నుండి అవతరించినది. స్వయంగా ప్రజలకు కూడా పరస్పరం విభిన్నంగా విరుద్ధంగా లేనిది. మానవాళి ప్రయోజనాలను అమలుపరిచేది. మానవుడు నష్టపర్చలేని అణచివేయలేని నిజమైన షరీఅతు చట్టం అవసరం ఉంది. అంతేకాదు అల్లాహ్ వైపు నుండి లభించినది ప్రజలను మంచి వైపు ఋజుమార్గం వైపుకు మార్గదర్శకం చేసి నడిపించేది అయి ఉండాలి. మరియు దానిని తీర్పుకోసం ఆశ్రయించినప్పుడు వారి వ్యవహారాలను సక్రమంగా న్యాయంగా తీర్పుచేయాలి. ఒకరికి అన్యాయం చేయకుండా దౌర్జన్యం చేయకుండా వారిని సంరక్షించాలి.

ప్రవక్త

 

గురించి

 

ఆయ

 

ప్రత్య

ర్థు

 

అభిప్రాయం

 

మరియు

 

ఆయన

 

కోసం

 

వారి

 

సాక్ష్యం

.

నిస్సందేహంగా ప్రతి ప్రవక్తకు తనను వ్యతిరేకించే ప్రత్యర్థులు, దైవప్రచారంలో, దైవమార్గంలో అడ్డుగోడలుగా నిలబడేవారు మరియు ప్రజలు తనను నమ్మకుండా నిరోధించే శత్రువులు, ద్వేషించేవారు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. లాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తన జీవిత కాలంలో మరియు మరణాంతరం అనేకమంది శత్రువులు, అసూయపరులు, వ్యతిరేకులు ఉన్నారు, కానీ అల్లాహ్ వారందరి నుండి దైవప్రవక్తను కాపాడి సహాయం అందించాడు. ఇంకా వారిలో చాలామంది గతంలోనూ, నేడునూ ఆయన దైవ ప్రవక్తయేని ఇచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. మరియు మునుపటి దైవప్రవక్తలు (అలైహిస్సలాం) తెచ్చిన సందేశాన్ని ఆయన కూడా ప్రవక్తగా తీసుకొచ్చారు మరియు వారికి ఆయనసత్యవంతుడు అనే నిజం తెలుసు. అయినప్పటికీ వారిలో చాలా మంది అధికార కాంక్షతో లేక తమ జాతీయుల భయానికి లేదా పదవి వల్ల సంపాదించిన సంపద ఆవిరైపోతుందనే భయంతో ప్రజలు ఆయనను విశ్వసించకుండా ఆపారు.

మరియు సర్వస్తోత్రాలు ప్రశంసలు అల్లాహ్ కు మాత్రమే అంకితం ఆయనే సమస్త లోకాలకు ప్రభువు!

 

***

విషయసూచిక

 

2- సౌశీల్యవంతురాలు, గుణవంతురాలితో శుభవివాహం. 4

3- వహీ (దైవద్యోతకం) ఆరంభం. 4

4- ఆయన దైవదౌత్యం 14

5- దైవదౌత్య సూచనలు, సంకేతాలు & సాక్ష్యాధారాలు 17

6- మహనీయ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన షరీఅతు చట్టం. 21

7- ప్రవక్త గురించి ఆయ ప్రత్యర్థు అభిప్రాయం మరియు ఆయన కోసం వారి సాక్ష్యం. 26

***


సహీహ్ బుఖారీ (4461) 6/15.

అల్లాహ్ ప్రకటన: { మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది. దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు మరియు ఒకవేళ ఈగ వారి నుండి దైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని ( ఈగ) నుండి విడిపించుకోనూ లేరు. ఎంత బలహీనులు, అర్థించేవారు మరియు అర్థించబడేవారు.} [సూరతుల్ హజ్జ్ 22:73]

సహీహ్ ముస్లిం (901).